న్యూఢిల్లీ: ప్రధాని మోదీ ఇటీవల కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు నిర్వహిస్తుండటంతో కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గురువారం నుంచి ప్రారంభమైన సమావేశాల్లో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా పాల్గొంటున్నారు. కేంద్ర మంత్రుల పనితీరును విశ్లే షించేందుకే వీరి సమావేశాలు జరుగుతున్నాయని పలువురు నేతలు భావిస్తున్నారు. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్రం ఏదైనా కీలక పథకం కూడా ప్రకటించే అవకాశం ఉందని వార్తలొ స్తున్నాయి. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనా«థ్ రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో పలువురు అగ్రనేతలను కలిశారు. దీంతో ఆ రాష్ట్రం నుంచి మంత్రులను ఎంపిక చేసే అవకాశం ఉందని వార్తలొస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో మిత్రపక్షమైన అప్నా దళ్ నేత అనుప్రియ పటేల్ బీజేపీ నేతలను కలిశారు.
భేటీలు.. సమీక్షలు..
గురువారం ప్రధాని మోదీ తన ఇంట్లో ఏకంగా 5 గంటల పాటు సమావేశం నిర్వహించారు. ఇందులో ఏడుగురు కేంద్ర మంత్రులు సైతం పాల్గొన్నారు. కోవిడ్ పంజా విప్పిన ఏప్రిల్, మే నెలల్లో మంత్రుల పనితీరును ఆయన సమీక్షిస్తున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, ప్రకాశ్ జవడేకర్‡, హర్దీప్‌లు ఉన్నారు. అయితే, ప్రభుత్వం ఏటా నిర్వహించే వార్షిక సమీక్ష సమావేశాలే ఇవి అంటూ మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. కరోనా కారణంగా సమీక్షలు ఆలస్యమై ప్రస్తుతం కొనసాగుతున్నాయని అంటున్నారు. అయితే, ఆరుగురు మంత్రులు రెండేసి శాఖలను నిర్వహిస్తున్న నేపథ్యంలో కేబినెట్ విస్తరణపై వార్తలు ఊపందుకున్నాయి. మొత్తంగా 79 మంది మంత్రులను ప్రధాని ఏర్పాటు చేసుకోవచ్చు.
దీంతో ఇంకో 20కి పైగా స్థానాలను పూరించేందుకు ప్రభుత్వానికి అవకాశం ఉంది. జూన్ 21 నుంచి 18 ఏళ్లు నిండిన వారందరికీ వ్యాక్సినేషన్ వేస్తామని ప్రధాని ప్రకటించిన నేపథ్యంలో ఈ సమావేశాలు జరుగుతుండటం గ మనార్హం. ప్రస్తుతం పెట్రోలియం మంత్రిత్వ శాఖ, స్టీల్, జలశక్తి, నైపుణ్యాభివృద్ధి–ఎంటర్‌ప్రెన్యూర్ షిప్, విమానయానం, భారీ పరిశ్రమలు, పర్యావరణం, అడవులు–వాతావరణ మార్పు వంటి మంత్రిత్వ శాఖల సమీక్షలు జరుగుతున్నాయి. ఆయా శాఖల కార్యదర్శులు ఇప్పటికే నివేదికలను ప్రభుత్వం ఎదుట ఉంచినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment