స్టార్ క్యాంపెయినర్ల జాబితాను ఈసీకి పంపిన కమలదళం
జమ్మూ: జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనే స్టార్ క్యాంపెయినర్ల జాబితాను బీజేపీ సోమవారం విడుదల చేసింది. ప్రధాని మోదీ సారథ్యంలో చేపట్టే మొదటి విడత ఎన్నికల ప్రచారంలో హోం మంత్రి అమిత్ షా, రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, యూపీ సీఎం యోగి తదితర 40 మంది కీలక నేతలు పాల్గొననున్నారు.
ఈ జాబితాను ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ప్రధాన కార్యాలయం ఇన్‌చార్జి అరుణ్ సింగ్ ఎన్నికల కమిషన్‌కు అందజేశారు. నిర్ణీత గడువులోగా సవరించిన మరో జాబితా అందజేస్తే తప్ప, మూడు దశలకు కూడా స్టార్ క్యాంపెయినర్ల జాబితా ఇదే ఉంటుందని ఆయన ఈసీకి వివరించారు. జమ్మూకశ్మీర్‌లో సెప్టెంబర్ 18, 25వ తేదీలతోపాటు నవంబర్ ఒకటో తేదీన మూడు విడతలుగా ఎన్నికలు జరుగనుండటం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment