star campaigners
-
మోదీ సారథ్యంలో కశ్మీర్లో బీజేపీ ప్రచారం
జమ్మూ: జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనే స్టార్ క్యాంపెయినర్ల జాబితాను బీజేపీ సోమవారం విడుదల చేసింది. ప్రధాని మోదీ సారథ్యంలో చేపట్టే మొదటి విడత ఎన్నికల ప్రచారంలో హోం మంత్రి అమిత్ షా, రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, యూపీ సీఎం యోగి తదితర 40 మంది కీలక నేతలు పాల్గొననున్నారు. ఈ జాబితాను ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ప్రధాన కార్యాలయం ఇన్చార్జి అరుణ్ సింగ్ ఎన్నికల కమిషన్‌కు అందజేశారు. నిర్ణీత గడువులోగా సవరించిన మరో జాబితా అందజేస్తే తప్ప, మూడు దశలకు కూడా స్టార్ క్యాంపెయినర్ల జాబితా ఇదే ఉంటుందని ఆయన ఈసీకి వివరించారు. జమ్మూకశ్మీర్‌లో సెప్టెంబర్ 18, 25వ తేదీలతోపాటు నవంబర్ ఒకటో తేదీన మూడు విడతలుగా ఎన్నికలు జరుగనుండటం తెలిసిందే. -
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల స్టార్ క్యాంపెయినర్ల జాబితాను ఆమ్ఆద్మీపార్టీ శనివారం(మే4)విడుదల చేసింది. ఈ లిస్టులో 40 మంది స్టార్ క్యాంపెయినర్ల పేర్లను చేర్చింది.ప్రస్తుతం జైలులో ఉన్న ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహా జైలులో ఉన్న మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, మాజీ మంత్రి సత్యేందర్‌జైన్ పేర్లను లిస్టులో చేర్చడం గమనార్హం. వీరితో పాటు కేజ్రీవాల్ భార్య సునీత కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్‌మాన్ సింగ్ ఎంపీలు రాఘవ్చద్దా, సందీప్‌పాఠక్ ఢిల్లీ మంత్రులు, అతిశీ, సౌరభ్ భరద్వాజ్, గోపాల్‌రాయ్ తదితరులను స్టార్ క్యాంపెయినర్లుగా ఆప్ ప్రకటించింది. -
సామాన్యులే స్టార్ క్యాంపెయినర్లు
సాక్షి, అమరావతి: స్టార్ క్యాంపెయినర్లు.. ప్రతి పార్టీలోనూ ప్రముఖ నాయకులు వీళ్లు.. సభలకు వస్తారు.. చేతులూపుతారు.. ఏదేదో చెప్పేస్తారు.. వారి పార్టీ వారికి ఓటేయమని కోరుతూ ఓ దండం పెట్టేసి హెలికాప్టరో, విమానమో ఎక్కేసి వెళ్లిపోతారు. కానీ, జగన్ నేతృత్వంలోని ప్రజల పార్టీ అయిన వైఎస్సార్సీపీకి స్టార్లు, స్టార్ క్యాంపెయినర్లు కూడా సామాన్య ప్రజలే. జగన్ ప్రభుత్వం అందించిన చేయూతతో అభివృద్ధి సాధించి, కుటుంబ జీవన ప్రమాణాలను పెంచుకున్న సాధారణ ప్రజలే. చరిత్రలో ఏ పార్టీ చేయని విధంగా ఈ సామాన్యులే స్టార్ క్యాంపెయినర్లుగా వైఎస్సార్సీపీ ఎన్నికల సమారానికి సిద్ధమైంది.ఐదేళ్ల పాలనలో ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన వారే తన స్టార్ క్యాంపెయినర్లంటూ సీఎం జగన్ ఇప్పటికే స్పష్టంగా చెప్పారు. దీనినే కార్యరూపంలోకి తెస్తూ దేశంలో ఏ పార్టీ కనీసం ఆలోచన కూడా చేయలేని సాహసోపేత నిర్ణయం తీసుకుని, వైఎస్సార్సీపీ 12 మంది సామాన్యులతో తన రాష్ట్రస్థాయి స్టార్ క్యాంపెయినర్ల జాబితాను ఎన్నికల కమిషన్‌కు అందజేసింది. వీరంతా జిల్లా, నియోజకవర్గం, మండల, గ్రామ స్థాయిలో ఎన్నికల ప్రచారంలో నిమగ్నమవుతారు. సోమవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయాన్ని వీరు సందర్శించారు. సీఎం వైఎస్ జగన్‌కు స్టార్ క్యాంపెనర్లుగా ఏ విధంగా మారారో వారిలో కొందరు వివరించారు. 50 ఇళ్లకు నేనే ఎమ్మెల్యేగా పనిచేశా ఈ ప్రభుత్వంలో వలంటీర్‌గా పనిచేశా. నా 50 ఇళ్లకు నేనే ఎమ్మెల్యే అన్నట్లు పనిచేశా. ప్రతి ఇంటికి వారికి ఏ పథకాలు అందాలో వాటన్నింటినీ పక్కాగా అందించాం. అదే ఊరికి చెందిన నాకు ఆ కటుంబాలు గతంలో ఎలా ఉండేవి, నవరత్నాలతో ఆర్థిక భరోసా అందిన తరువాత ఎలా మారాయో నాకు స్పష్టంగా కనిపించింది. ఈ ఐదేళ్లలో నిజమైన అభివృద్ధిని చూశా. ఆర్థిక కారణాలతో పిల్లలను చదువించుకోలేని ప్రతి కుటుంబానికీ సీఎం వైఎస్ జగన్ అండగా నిలిచారు. భర్త సంపాదన మీద మాత్రమే బతికే ప్రతి అక్కకు, చెల్లెమ్మకు సీఎం జగనన్న అండగా నిలిచి ఆర్థిక భరోసా కల్పించారు. ఏదో ఒక చిరు వ్యాపారం చేసుకునేలా తీర్చిదిద్దారు. ఈ ప్రభుత్వం మహిళలను నిజమైన ఇంటి యజమానిని చేసింది. నా క్లస్టర్‌లోని సగం కుటుంబాలు స్థానికంగా, పక్కనే ఉన్న పట్టణాల్లో సొంత వ్యాపారాలు ప్రారంభించాయి. తద్వారా ప్రతిరోజూ రూ. 1,000 వరకు సంపాదించుకుంటున్నాయి. వారి జీవితాల్లో చాలా మార్పు వచి్చంది. ఒక తల్లిగా ఆలోచిస్తే మా పిల్లలకు అవసరమైన చదువులు, అవసరాలు అన్నీ పాఠశాలల్లో లభిస్తున్నాయి. సీఎం వైఎస్ జగన్ రాష్ట్ర భవిష్యత్తును మారుస్తున్న నాయకుడని నేను నమ్ముతున్నాను. – ఈశ్వరి, కొండపల్లి, ఎన్టీఆర్ జిల్లాసీఎం జగన్ చలవతో నా కుమారుడు అమెరికాలో చదువుతున్నాడు నాకు ఇద్దరు కుమారులు. పెద్దబ్బాయి కిషోర్ డిగ్రీ పూర్తి చేసి డిల్లీలోని మారుతి సుజుకీలో ఉద్యోగం చేసేవాడు. అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీలో మాస్టర్స్ ఇన్ పొలిటికల్ అఫైర్స్‌లో సీటు సంపాదించాడు. కోర్సు ఫీజు రూ.1.36 కోట్లు అవుతుందన్నారు. ఈ మాట నాకు చెప్పగానే కనీసం రూ. లక్ష అయినా మనం కట్టలేం.. మంచి ఉద్యోగం చూసుకో అని చెప్పా. ఆ తరువాత వైఎస్ జగన్ ప్రభుత్వంలో విదేశీ విద్య పథకం గురించి తెలుసుకుని దరఖాస్తు చేశాం.నా కొడుకు చదువుకు కావాల్సిన డబ్బు విదేశీ విద్య కింద మంజూరైంది. ఇప్పటికే రెండు సెమిస్టర్లు పూర్తి చేసిన నా కుమారుడికి రెండు దఫాలుగా రూ. 50 లక్షలు అందింది. ఇది చూసిన నాకు లక్ష రూపాయలు కట్టలేని నా కుమారుడు ఇంత పెద్ద మొత్తం ఫీజుతో విదేశీ విశ్వవిద్యాలయంలో చదవగలుగుతున్నాడని గర్వంగా అనిపించింది. ఒక్క నా కుమారుడే కాదు.. ఇలా చాలా మంది పేదల పిల్లలు విదేశాల్లోని ప్రఖ్యాత యూనివర్సిటీల్లో ఉన్నత విద్య చదువుతున్నారు. ఇదంతా సీఎం వైఎస్ జగన్ చలవే. అందుకే సీఎం జగన్ కోసం స్టార్ క్యాంపెయినర్ అయ్యాను. – పండలనేని శివప్రసాద్, మోపిదేవి మండలం, కృష్ణా జిల్లాసీఎం జగన్ ఆలోచనలకు సంపూర్ణ మద్దతు జగనన్న చేదోడు అందుకున్న మా ఇంటి పక్కనే నివాసం ఉండే శారద బట్టల షాపు ఏర్పాటు చేసుకుని కుటుంబానికి అండగా నిలుస్తోంది. దాసరి మహాలక్ష్మి అనే మహిళకు భర్త మరణిస్తే రూ. 2 లక్షల బీమా అందింది. దీంతోపాటు పెన్షన్, ఆసరా, అమ్మఒడి పథకాలూ అందుతున్నాయి. మాది కూడా నిరుపేద కుటుంబం. జగననన్న ప్రభుత్వంలో అందిన నవరత్నాలతో రోజు గడవడమే కష్టంగా ఉండే దుస్థితి నుంచి నిలకడ ఆదాయం అందుకునే స్థితికి వచి్చంది. మా కుటుంబాలను ఆర్థికంగా నిలబడేలా ఆదుకున్న ప్రభుత్వానికి మేమెందుకు అండగా నిలవకూడదు? పేదలను పేదరికం నుంచి తప్పించి మెరుగైన జీవితం కల్పించాలనే సీఎం జగన్ ఆలోచనకు మేము సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం. అందుకే సీఎం జగన్ కోసం స్టార్ క్యాంపెయినర్‌గా పనిచేసేందుకు ముందుకు వచ్చా. – ఎ. అనంతలక్ష్మి, రాజమండ్రి సిటీ నియోజకవర్గం, తూర్పు గోదావరి జిల్లాప్రభుత్వ పాఠశాలల్ని చూస్తే తేడా తెలుస్తుంది సీఎం జగన్ పరిపాలన ఏమిటో చెప్పేందుకు రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలే ఉదాహరణ. నేను డిగ్రీ పూర్తి చేసి ఐదేళ్లే అయ్యింది. మేం చదువుకునే సమయంలో ప్రభుత్వ పాఠశాలలి్న, ఇప్పడు నాడు – నేడు కింద పూర్తిగా మారిన ప్రభుత్వ పాఠశాలలను చూస్తే తేడా అర్ధమవుతుంది. అప్పటి ప్రభుత్వ పాఠశాలలు తలుపులు లేక గేట్లు లేక అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా ఉండేవి. కనీసం బాలికలకు టాయిలెట్లు కూడా లేని దుస్థితి. ఇలాంటి స్కూళ్లలో బాలికల విద్య ఎలా ఉంటుందో మనం ఒక్కసారి ఆలోచిస్తే అర్ధమవుతుంది. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలంటే అంతర్జాతీయ స్థాయి. సకల సౌకర్యాలు, డిజిటల్ క్లాస్ రూంలు, ట్యాబ్‌లతో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం విద్యను బోధిస్తున్నారు. మరో పదేళ్లలో ఈ ప్రభుత్వ పాఠశాలల నుంచి బయటికి వచ్చే వారితో రాష్ట్రం మరో ఎత్తుకు ఎదుగుతుంది. ఇంగ్లిష్ చదువులతో కొన్ని లక్షల కుటుంబాల తలరాత మారిపోతుంది. సీఎం జగన్ ప్రభుత్వాన్ని ప్రతి గ్రామానికి తీసుకొచ్చారు. వీటన్నింటినీ ప్రజలకు వివరిస్తాను. – అన్వర్, నెల్లూరు జిల్లాఒక అడుగు ముందుకు వేశాం ద్విచక్ర వాహనాలకు సీట్ కవర్లు కుట్టే ఒక చిన్న షాపు నాది. రోడ్డు పక్కన పెట్టుకున్నాను. నాకు ముగ్గురు పిల్లలు. నా రోజువారీ సంపాదన కుటుంబ పోషణకే సరిపోతుంది. పిల్లలను బాగా చదివించాలని ఆశ ఉన్నా చదివించే ఆర్థిక స్థోమత లేదు. 2019లో సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక ఇంజనీరింగ్‌లో చేరిన నా కొడుకుకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన పథకాలతో ఆదుకున్నారు. నా కుమారుడు బాగా చదువుకున్నాడు. రెండో కొడుకు కూడా ఫీజు రియింబర్స్‌మెంట్ డబ్బుతో డిగ్రీ చదువుతున్నాడు. మూడో కొడుకుకి అమ్మఒడి అందుతోంది. నా సంపాదన అరకొరే అయినా, నా పిల్లల చదువు ఏ ఆటంకం లేకుండా సాగుతోంది. పెద్ద కొడుకు ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉద్యోగం సాధించాడు. సీఎం జగన్ ఇచ్చిన ఒక్క పథకం కింద చదువుకున్న నా కొడుకు నా కుటుంబానికి ఆర్థిక భరోసా ఇచ్చాడు. మేము సమాజంలో ఒక అడుగు ముందుకు వేసినట్లైంది. ఇలాంటి వేలాది పేదింటి పిల్లలకు సీఎం జగన్ చదువులు చెప్పిస్తున్నారు. – కటారి జగదీష్ , మల్లవీధి, అనకాపల్లి -
స్టార్ క్యాంపెయినర్స్ ఎవరు? వాళ్ల ఖర్చెవరు భరిస్తారు?
2024 లోక్‌సభ ఎన్నికల మొదటి దశకు మూడు వారాల కంటే తక్కువ సమయం ఉండడంతో ఎన్నికల ఫీవర్ ముదిరిపోతోంది. ఎవరికివారు పెద్ద ఎత్తున ప్రచారాలు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే రాజకీయ పార్టీలు సాధారణ అభ్యర్థుల జాబితాను మాత్రమే కాకుండా.. స్టార్ క్యాంపెయినర్ల పేర్లను విడుదల చేయడం ప్రారంభించాయి. ఇంతకీ పార్టీకి స్టార్ క్యాంపెయినర్స్ ఎందుకు? వారికయ్యే ఖర్చు ఎవరు భరిస్తారు అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.స్టార్ క్యాంపెయినర్స్ ఎవరు?'స్టార్ క్యాంపెయినర్' ఎన్నికల సమయంలో పోటీ చేయడానికి లేదా ప్రచారం చేయడానికి రాజకీయ పార్టీ ఎంపిక చేసే వ్యక్తి. స్టార్ క్యాంపెయినర్‌కు ప్రజల్లో ఎక్కువ ఫాలోయింగ్ ఉంటుంది. కేవలం సినీ నటులు మాత్రమే క్యాంపెయినర్లుగా పనిచేయాల్సిన అవసరం లేదు. రాజకీయ ప్రముఖులు, క్రీడాకారులు కూడా ప్రచారకర్తలుగా ఉంటారు. స్టార్ క్యాంపెయినర్లను వారి పాపులారిటీ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ జాబితాను భారత ఎన్నికల సంఘానికి పంపించాల్సి ఉంటుంది.బీజేపీలో ప్రధాని నరేంద్ర మోదీ తరువాత ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న నేతలు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యంత్, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ, తమిళనాడు బిజెపి అధ్యక్షుడు కె అన్నామలై.అధికార బీజేపీని ఓడించడానికి కంకణం కట్టుకున్న ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలో స్టార్ క్యాంపెయినర్స్ అంటే సోనియా గాంధీ , రాహుల్ గాంధీ, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీలు ఉన్నారు. వీరితో పాటు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్లుగా ప్రసిద్ధి.ఖర్చు ఎవరు భరిస్తారు?గుర్తింపు పొందిన జాతీయ లేదా రాష్ట్ర పార్టీ గరిష్టంగా 40 మంది స్టార్ క్యాంపెయినర్లను నామినేట్ చేయవచ్చు. కానీ గుర్తింపు లేని రాజకీయ పార్టీ గరిష్టంగా 20 మంది స్టార్ క్యాంపెయినర్లను మాత్రమే నామినేట్ చేయగలదు. ప్రచారకర్తలు పార్టీ గురించి మాట్లాడుతూ.. పార్టీకి మద్దతుగా ప్రచారం చేస్తారు. స్టార్ క్యాంపెయినర్ల ఖర్చులన్నింటినీ రాజకీయ పార్టీలు భరిస్తాయి.ప్రధానమంత్రి లేదా మాజీ ప్రధాని స్టార్ క్యాంపెయినర్‌గా ఉన్నప్పుడు, బుల్లెట్ ప్రూఫ్ వాహనాలతో సహా భద్రతకు అయ్యే ఖర్చు ప్రభుత్వమే భరిస్తుంది. అయితే ప్రధాని వెంట మరో స్టార్ క్యాంపెయినర్ ఉంటే, భద్రతా ఏర్పాట్లలో అభ్యర్థి 50 శాతం ఖర్చు పెట్టాలి. -
‘బీజేపీ స్టార్ కాంపైనర్ రాహుల్ గాంధీ’
జైపూర్: కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రాహుల్ గాంధీపై రాజస్థాన్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీచంద్ కృప్లానీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాహుల్ నాయకత్వంలో కాంగ్రెస్ కనుమరుగవుతుందని వ్యాఖ్యానించారు. రాహుల్‌ను బీజేపీ స్టార్ కాంపైనర్‌గా వర్ణించారు. ప్రతాప్‌గఢ్‌లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు. ‘రాహుల్ గాంధీకి మేము కచ్చితంగా అభినందనలు తెలపాలి. బీజేపీకి ఆయన ప్రధాన ప్రచారకుడు. మా పార్టీ తరపున స్టార్ కాంపైనర్ ఎవరైనా ఉన్నారంటే అది రాహుల్ గాంధీయే. జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన ఆయనకు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా అభినందనలు తెలిపారు. స్వాతంత్ర్యానికి ముందు కాంగ్రెస్ రాజకీయ పార్టీ కాదు. స్వాతంత్ర్య సమరయోధుల సంఘం మాత్రమే. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి, వివిధ రాజకీయ పార్టీలు ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేసిన తర్వాత కాంగ్రెస్‌ను రద్దు చేయాలని జవహర్లాల్ నెహ్రుతో మహాత్మాగాంధీ చెప్పారు. కానీ మన దురదృష్టం. గాంధీ మాటలను నెహ్రు పెడచెవిన పెట్టారు. ఇప్పుడు మహాత్మా గాంధీ కలను సాకారం చేయడానికి రాహుల్ వచ్చారు. కచ్చితంగా ఆయన కాంగ్రెస్ పార్టీ లేకుండా చేస్తార’ని శ్రీచంద్ వ్యంగ్యంగా అన్నారు. మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో బీజేపీ గెలుస్తుందని ఆయన జోస్యం చెప్పారు. -
యూపీ ప్రచారానికి కాంగ్రెస్ హేమాహేమీలు
లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ అతిరథ మహారథులు పాల్గొంటున్నారు. ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ కుటుంబంతో పాటు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ ముఖ్యమంత్రులు, కేంద్ర మాజీ మంత్రులు, సీనియర్ నేతలు, సినిమా తారలు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. మొదటి విడత ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ తరపున 40 మంది స్టార్ కాంపెయినర్లు రంగంలోకి దిగనున్నారు. మంగళవారం ఏఐసీసీ కార్యాలయం ఈ జాబితాను విడుదల చేసింది. ప్రియాంక గాంధీతో పాటు సినీ నటి నగ్మా కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తారు. యూపీ ఎన్నికల్లో అధికార సమాజ్‌వాదీ పార్టీతో కాంగ్రెస్ పొత్తుపెట్టుకున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ 105 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ స్టార్ కాంపెయినర్ల జాబితాలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మన్మోహన్ సింగ్, గులాం నబీ అజాద్, షీలా దీక్షిత్, రాజ్ బబ్చర్, మీరా కుమార్, సుశీల్ కుమార్ షిండే, ప్రియాంక గాంధీ, జనార్దన్ ద్వివేది, అహ్మద్ పటేల్, కమల్ నాథ్, ముకుల్ వాస్నిక్, సంజయ్ సింగ్, అశోక్ గెహ్లాట్, భూపిందర్ సింగ్ హుడా, సల్మాన్ ఖుర్షిద్, కుమారి శెల్జా, జ్యోతిరాధిత్య సింధియా, మనీష్ తివారి, రాజీవ్ శుక్లా, సచిన్ పైలట్, నగ్మా తదితర ప్రముఖులు ఉన్నారు. -
కాంగ్రెస్‌లో.. లకలకలక..
సాక్షి, సిటీబ్యూరో: ఎన్నికల ముంగిట బయటపడుతున్న లుకలుకలు కాంగ్రెస్ పార్టీలో గుబులు రేపుతున్నాయి. పార్టీలోని గ్రూపులు చేతులు కలపట్లేదు. ఒకరినొకరు దెబ్బతీసుకునేందుకు వైరి వర్గాలు అమీతుమీకి సిద్ధపడుతున్నాయి. తమ స్థానాలతో పాటు మిగతా నియోజకవర్గాల్లోనూ అభ్యర్థుల గెలుపునకు పాటుపడతామన్న ఇద్దరు మాజీ మంత్రులు.. ప్రస్తుతం సొంత సెగ్మెంట్లలో నెగ్గుకు వచ్చేందుకే చెమటలు కక్కుతున్నారు. ఈ పరిణామాలు కాంగ్రెస్ అభ్యర్థుల్ని హడలెత్తిస్తున్నాయి. డివిజన్ స్థాయి నాయకులు- ఎమ్మెల్యే అభ్యర్థులు, ఎమ్మెల్యే అభ్యర్థులు- ఎంపీ అభ్యర్థుల మధ్య సమన్వయం కొరవడుతోంది. ప్రచార కార్యక్రమాలు రసాభాసగా మారుతున్నాయి. బుధవారం సికింద్రాబాద్ శాసనసభ నియోకజవర్గ పరిధిలో కేంద్ర మంత్రి జైరాం రమేష్ పాల్గొన్న సభ అనంతరం కాంగ్రెస్ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి అంజన్‌కుమార్ వ్యవహరించిన తీరు తీవ్ర వివాదాస్పదమైంది. ఆయన వైఖరిపై నగర మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి, పీసీసీ కార్యదర్శి చంద్రారెడ్డి దుమ్మెత్తిపోశారు. ఒక దశలో నువ్వెంతంటే నువ్వెంత అనుకునే వరకు పరిస్థితి వెళ్లింది. పార్టీ కోసం శ్రమించి, టికెట్లు దక్కక కినుక వహించిన ముఖ్య నేతల ఇళ్లకు జైరాం రమేష్‌తో పాటు కొప్పుల రాజు స్వయంగా వెళ్లి సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే బుధవారం ఉదయం సీతాఫల్మండిలో కాంగ్రెస్ సభ ముగియగానే జైరాం రమేష్ బండ కార్తీకరెడ్డి ఇంటికి వెళ్లేందుకు సన్నద్ధమయ్యారు. ‘ఇప్పుడు టైం లేదు.. వద్దం’టూ అంజన్‌కుమార్ ఆపే ప్రయత్నం చేశారు. దీంతో బండ కార్తీక, ఆమె వర్గీయులు నిరసనకు దిగడంతో కలకలం రేగింది. కొత్త ముఖాల బిక్కమొహం ముషీరాబాద్‌లో బుధవారం జరిగిన సభలోనూ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు అంజన్‌కుమార్, వినయ్‌కుమార్ మధ్య సమన్వయ లోపం కొట్టొచ్చినట్లు కనిపించింది. ఈ సభలో అంజన్ మాట్లాడుతూ తనను వెన్నుపోటు పొడిచేందుకు కొందరు సిద్ధమవుతున్నారంటూ చేసిన వ్యాఖ్యలు పార్టీ వర్గాలను అయోమయంలో పడేశాయిఎన్నికల బరిలోకి కొత్తగా దిగిన ముద్దం నర్సింహయాదవ్ (కూకట్పల్లి), నందికంటి శ్రీధర్ (మల్కాజిగిరి), గజ్జెల కాంతం (కంటోన్మెంట్) పరిస్థితి మరీ దారుణం.. ఇప్పటికీ కింది, డివిజన్ స్థాయి నేతలతో వీరికి సఖ్యతలేదు రెండోసారి పోటీలో ఉన్న జయసుధ (సికింద్రాబాద్), జ్ఞానేశ్వర్ (రాజేంద్రనగర్)కు నియోకజవర్గంలోని ముఖ్య నాయకులంతా ముఖం చాటేస్తున్నారు. వీరిని ఎలా బుజ్జగించాలో, ప్రచారం ఎలా సాగించాలో తెలియక వీరు గందరగోళానికి గురవుతున్నారు. ఇద్దరు మంత్రుల ఎదురీత నగరంలో ప్రతి కార్యక్రమంలో హడావుడి చేసే తాజా మాజీ మంత్రులు దానం నాగేందర్, మూల ముఖేష్‌గౌడ్.. సొంత నియోజకవర్గాల్లో ప్రతికూల పరిస్థితులకు ఎదురీదుతున్నారు. ప్రజా వ్యతిరేకత, మెజారిటీ సెక్షన్లు పార్టీకి దూరమైన తీరుతో ఖిన్నులైన వీరు.. నయానో భయానో దారికి తెచ్చుకునే పనిలో పడ్డారు. ఖైరతాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్‌ను వైఎస్సార్సీపీ అభ్యర్థి, దివంగత నేత పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి గట్టి ప్రజాబలంతో ఢీకొడుతున్నారు. రోజుకో బస్తీ విజయారెడ్డి వెంట నడుస్తుండటంతో చాలా కాలంగా బస్తీలకు వెళ్లని దానం, బస్తీ వాసులందరిని తెల్లవారక ముందే తమ ఇంటి ముందు క్యూ కట్టించుకుంటూ తాయిలాలు సమర్పిస్తున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. గోషామహల్లో మూల ముఖేష్‌గౌడ్ బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ లోధా చేతిలో ముప్పుతిప్పలు పడుతూ నియోకజవర్గం దాటలేని పరిస్థితి నెలకొంది. జైరాం, కొప్పుల రాజులే ప్రచార సారథులు నగరంలో నిర్వహిస్తున్న కాంగ్రెస్ అభ్యర్థుల ప్రచార సభలకు కేంద్ర మంత్రి జైరాం రమేష్, ఏఐసీసీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొప్పుల రాజు ముఖ్య అతిథులుగా వెళుతున్నారు. ‘స్టార్ క్యాంపెయినర్లు’గా పాల్గొంటున్న వీరిని పార్టీ అభ్యర్థులే ప్రజలకు పరిచయం చేయాల్సి వస్తుం డటం విచిత్రం. వీరివల్ల ఓట్లు రాలవని అభ్యర్థులే సొంత ప్రచార కార్యక్రమాలు రూపొందించుకుంటున్నారు