యూపీ ప్రచారానికి కాంగ్రెస్ హేమాహేమీలు | Congress releases list of campaigners for Uttar Pradesh assembly elections | Sakshi
Sakshi News home page

యూపీ ప్రచారానికి కాంగ్రెస్ హేమాహేమీలు

Published Tue, Jan 24 2017 3:43 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

యూపీ ప్రచారానికి కాంగ్రెస్ హేమాహేమీలు - Sakshi

యూపీ ప్రచారానికి కాంగ్రెస్ హేమాహేమీలు

లక్నో: ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ అతిరథ మహారథులు పాల్గొంటున్నారు. ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ కుటుంబంతో పాటు మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, మాజీ ముఖ్యమంత్రులు, కేంద్ర మాజీ మంత్రులు, సీనియర్ నేతలు, సినిమా తారలు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. మొదటి విడత ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ తరపున 40 మంది స్టార్‌ కాంపెయినర్లు రంగంలోకి దిగనున్నారు. మంగళవారం ఏఐసీసీ కార్యాలయం ఈ జాబితాను విడుదల చేసింది. ప్రియాంక గాంధీతో పాటు సినీ నటి నగ్మా కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తారు. యూపీ ఎన్నికల్లో అధికార సమాజ్వాదీ పార్టీతో కాంగ్రెస్ పొత్తుపెట్టుకున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ 105 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తోంది.

కాంగ్రెస్ పార్టీ స్టార్ కాంపెయినర్ల జాబితాలో సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, మన్మోహన్ సింగ్‌, గులాం నబీ అజాద్‌, షీలా దీక్షిత్‌, రాజ్ బబ్చర్, మీరా కుమార్, సుశీల్‌ కుమార్ షిండే, ప్రియాంక గాంధీ, జనార్దన్ ద్వివేది, అహ్మద్‌ పటేల్‌, కమల్ నాథ్, ముకుల్ వాస్నిక్, సంజయ్ సింగ్, అశోక్ గెహ్లాట్, భూపిందర్ సింగ్ హుడా, సల్మాన్ ఖుర్షిద్, కుమారి శెల్జా, జ్యోతిరాధిత్య సింధియా, మనీష్ తివారి, రాజీవ్ శుక్లా, సచిన్ పైలట్, నగ్మా తదితర ప్రముఖులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement