Uttar Pradesh elections
-
ఊపు తగ్గిన యూపీ ఎన్నికలు
2024 సార్వత్రిక ఎన్నికల్లో చివరిదైన ఏడవ దశ పోలింగ్ జూన్ 1న జరగనుంది. దేశంలో అత్యధిక ఎంపీ స్థానాలున్న ఉత్తరప్రదేశ్‌లో ఏడు దశల్లోనూ ఎన్నికలు జరుగుతున్నాయి. జరిగిన ఆరు దశల్లో నమోదైన అత్యల్ప ఓటింగ్ శాతం ఓటర్లలోని నిరుత్సాహాన్ని తెలియజేస్తోంది. ఎన్నికల సరళిని బట్టి బీజేపీ ఉద్దేశపూర్వకంగా తన ప్రాధాన్యాలను మార్చుకోవడం కూడా మిశ్రమ సందేశాన్ని అందిస్తోంది. అయోధ్య రామాలయ విగ్రహ ప్రతిష్ఠ సమయంలో ‘మోదీ హవా’ కనిపించింది. కానీ అసలైన ఎన్నికల సమయం వచ్చేసరికి దాన్ని ఉదాసీనత భర్తీ చేసింది. ‘ఈసారి 400 సీట్లు దాటుదాం’ అన్న నినాదం ఎత్తుకోవడంతో కూడా కాషాయపార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. అయితే రాష్ట్రంలో దాదాపు అన్ని చోట్లా ప్రతిపక్షాలను, ప్రధానంగా సమాజ్‌వాదీ పార్టీని అదుపులో ఉంచడంలో మాత్రం బీజేపీ విజయం సాధించింది.చాలామంది రాజకీయ పండితులతోపాటు, మేము మాట్లాడిన అత్యధిక సాధారణ ఓటర్ల ప్రకారం... 2014, 2019 నాటి ఎన్నికలతో పోలిస్తే, ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలు ఏమంత ఉత్సాహంగా లేవు. బీజేపీ సంపూర్ణ ఆధిపత్యం, ఎటువంటి బలమైన ప్రత్యామ్నాయం లేకపోవడం దీనికి కారణాలు. బీజేపీ ప్రధాన మద్దతుదారుల్లో ఉన్న అసంతృప్తి కూడా ఎన్నికల ఉత్సాహాన్ని తగ్గించింది. ఎన్నికల సరళిని బట్టి బీజేపీ ఉద్దేశపూర్వకంగా తన ప్రాధాన్యాలను మార్చుకోవడం కూడా మిశ్రమ సందేశాన్ని అందిస్తోంది. ఎన్నికల తొలి దశల్లో ఓటింగ్ శాతం తగ్గుముఖం పట్టింది. అన్ని వైపులా పేలవమైన ప్రచారం, విజేత ముందుగానే తెలిసిపోవడం లాంటివి వీటికి కారణాలు. వీటన్నింటికీ మించి, ఉత్తరప్రదేశ్‌లో 2024 లోక్‌సభ ఎన్నికలలో మరో రెండు అంశాలు గమనించదగినవి: ఒకటి, బీజేపీ తన తిరుగులేని స్థితిని సాధించిన విధానం. దీనిని మనం గుజరాత్ నమూనా ఎన్నికల ఆధిపత్యం అని పిలవొచ్చు. రెండు, ‘శాంతి భద్రతల’ ప్రాముఖ్యత. అందువల్లే, యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌పై ప్రశంసలు గుప్పిస్తున్నారు. ఎప్పటిలాగే, బీజేపీ ఎన్నికల ప్రచార ఒరవడిని జాగ్రత్తగా ప్లాన్ చేశారు. జనవరి 22న అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠ స్పష్టంగా ఈ ప్రణాళికలో భాగమే. ఇది నిజంగానే ఉత్కంఠకు దారితీసింది. జనవరి, ఫిబ్రవరి, మార్చి మూడు నెలలు... బీజేపీ నాయకుడొకరు చెప్పినట్లుగా, ‘ఇది గర్భధారణకు సంబంధించిన చివరి త్రైమాసికం. బూత్ స్థాయి కార్యకర్తలను ప్రసవానికి సిద్ధం చేయడంలో ఇది చాలా కీలకం’. ఈ మూడు నెలల్లో స్పష్టంగా ‘మోదీ హవా’ కనిపించింది. కానీ ఉత్సాహం ఒక్కసారి శిఖర స్థాయికి వెళ్లాక, అసలైన ఎన్నికల సమయం వచ్చేసరికి దాన్ని ఉదాసీనత భర్తీ చేసింది.ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని నియోజకవర్గాల్లో ముస్లింల జనాభా గణనీయంగా 40–50 శాతం వరకు కూడా ఉంది. అందుకే పశ్చిమ యూపీలోని కీలకమైన యుద్ధభూమిలో ఓటింగ్ మొదటి కొన్ని దశల్లో బీజేపీ కీలక కర్తవ్యం, దాని ప్రధాన ఓటు పునాదిని ఏకీకృతం చేయడంగానే ఉండింది. 2013 అల్లర్ల నుండి స్థానికంగా ఉన్న హిందూ, ముస్లిం తగాదాల కారణంగా ఇది బీజేపీకి సులభమైన పనిగా కనిపించింది. అలాగే ముఖ్యమంత్రి కూడా బలమైన సానుకూల అంశంగా కొనసాగుతున్నారు. జాతీయ సమస్యల విషయంలో మోదీ రికార్డుపై ఓటర్లు ఆధారపడుతున్నప్పటికీ, రాష్ట్రంలో మాత్రం శాంతిభద్రతల నిర్వహణ విషయంలో యోగీ అందించిన తోడ్పాటునే ఎక్కువ పరిగణనలోకి తీసుకుంటున్నారు.ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఓటర్ల ఉత్సాహం ఉధృతంగా ఉంది. అయినప్పటికీ స్పష్టమైన ప్రభంజనం మాత్రం లేదని కొందరు అభిప్రాయపడ్డారు. అయితే అప్పటికి సిట్టింగ్ ఎంపీలపై ఆగ్రహం రూపంలో అనేక వ్యతిరేకతలు గూడుకట్టుకుని ఉన్నాయి. ద్రవ్యోల్బణం, సంచరించే పశువుల బెడద, తప్పుడు అభ్యర్థుల ఎంపిక కారణంగా బీజేపీ మీద విసుగు చెందిన అనేక మందిని మేము చూశాము. అయినప్పటికీ ఓటు విషయానికి వస్తే, ఎక్కువ మంది తాము బీజేపీకే ఓటు వేస్తామని అంగీకరించారు. ఓటింగ్ శాతం తక్కువగా నమోదవుతుందన్న ఊహాగానాలు ఎలా ఉన్నప్పటికీ, యూపీలో బీజేపీ గుజరాతీకరణకు ప్రయత్నిస్తోంది. అంటే కుల ఇంజినీరింగ్ ద్వారా తమ ఓటు పునాదిని నిర్మించడం, ప్రతిపక్షాలకు అవకాశం లేకుండా చేయడం. బూత్, జిల్లా స్థాయుల్లో ఎంతోమంది విపక్ష నేతలు పార్టీలు మారి బీజేపీలో చేరారనేది ఆశ్చర్యం కలిగించే అంశం. రాష్ట్రంలో దాదాపు అన్ని చోట్లా ప్రతిపక్షాలను, ప్రధానంగా సమాజ్‌వాదీ పార్టీని తగ్గించడంలో బీజేపీ విజయం సాధించింది. ఇటావా, మైన్‌పురీ, కన్నౌజ్‌లలో తప్ప ఎక్కడా సమాజ్ వాదీ పార్టీ సంస్థాగతంగా బలంగా ఉన్నట్లు కనిపించదు. ఇది తాజాగా 2022 అసెంబ్లీ ఎన్నికల నాటి పరిస్థితి నుండి కూడా స్పష్టమైన మార్పును సూచిస్తోంది.గత కొన్ని నెలల్లో ఒక్క గోరఖ్‌పూర్ ప్రాంతంలోనే ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన దాదాపు 11,000 మంది కార్యకర్తలు బీజేపీలో చేరారని ఒక హిందీ వార్తాపత్రిక పేర్కొంది. చెప్పాలంటే, రెండు నెలల్లో యూపీలోని 10 మంది బీఎస్పీ ఎంపీల్లో ఐదుగురు బీజేపీలో చేరారు. బీజేపీ ముఖ్యంగా ప్రతిపక్షాలకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలను– టికెట్ రానివారు లేదా ఏ కారణం చేతనైనా ఆయా పార్టీలలో పక్కన పెట్టిన వారిని లక్ష్యంగా చేసుకుంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కుశీనగర్లో బీజేపీకి గట్టి పోటీ ఇచ్చిన ఎస్పీ మాజీ ఎమ్మెల్యే నాథుని ప్రసాద్ కుశ్వాహా ఇటీవలే బీజేపీలో చేరారు. అదేవిధంగా, 2019 గోరఖ్‌పూర్ కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ రోజునే బీజేపీలో చేరారు.ఒక పార్టీగా, కొత్తగా ప్రతిపక్ష నాయకులను చేర్చుకోవడం, అదే సమయంలో సొంత కార్యకర్తలను సంతోషంగా ఉంచడం వంటి భారీ సవాళ్లను బీజేపీ ఎదుర్కొంటోంది. దీనివల్ల అనివార్యంగా బీజేపీ శ్రేణుల్లో కొంత అసంతృప్తి నెలకొంది. అలాంటి ఆగ్రహానికి గురైన ఒక కార్యకర్త ‘భారతదేశంలో కాంగ్రెస్‌ను లేకుండా చేసే ప్రయత్నంలో, బీజేపీయే కాంగ్రెస్ అవుతోంది’ అని వ్యాఖ్యానించారు. బలహీనమైన ప్రారంభం ఉన్నప్పటికీ, ఈ సంస్థాగతమైన తికమక బీజేపీ కంటే సమాజ్ వాదీ పార్టీనే ఎక్కువగా దెబ్బతీస్తోంది. ఎస్పీ బలహీనతను పసిగట్టిన బీజేపీ, మధ్యప్రదేశ్‌కు చెందిన యాదవ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్‌ను వ్యూహాత్మకంగా రంగంలోకి దింపింది. ఎస్పీ, ఆర్జేడీల యాదవుల ఓట్లను లాక్కోవాలని ప్రయత్నిస్తున్న బీజేపీకి యూపీ, బిహార్లలో మోహన్ యాదవ్ పోస్టర్ బాయ్‌గా మారారు.యూపీలోని ప్రత్యర్థి పార్టీల ఓటర్లు, మద్దతుదారుల విషయానికి వస్తే, తమ అభ్యర్థుల గెలుపు సాధ్యం కాదని గ్రహించడంతో వారిలో ఉదాసీనత మొదలైంది. మేం సర్వే చేసిన ఒక వ్యక్తి ఇలా చెప్పారు: యోగీజీ వల్ల ముస్లింలు, యాదవుల పరిస్థితి 1990లలో బిహార్, యూపీల్లోని బ్రాహ్మణులు, క్షత్రియుల మాదిరిగా తయారైంది. బయటకు వెళ్లి ఓటు వేయడానికి వారికి ఎటువంటి ప్రేరేపకమూ లేదు. ఎందుకంటే ఇది వారికి ఎటువంటి లాభమూ చేకూర్చదు. వాస్తవానికి యూపీలో బీజేపీని రెండు సవాళ్లు ఇబ్బంది పెడుతున్నాయి. మొదటిది, యూపీలో మొదటి రెండు దశల్లో ఓటింగ్ శాతం దాదాపు 5 శాతం తగ్గింది. డజను కంటే కొంచెం ఎక్కువ నియోజకవర్గాల్లో దాదాపు 8.9 లక్షల ఓట్లు మాత్రమే వచ్చాయి. ప్రతి బూత్‌లోని ఒక్కో ఓటునూ విలువైనదిగా భావించి పనిచేసే పార్టీకి ఇది ఆందోళనకరం. రెండవది, ‘అబ్ కీ బార్, 400 పార్’ (ఈసారి 400 సీట్లు దాటుదాం) అంటూ మోదీ ఇచ్చిన పిలుపునకు ఎదురుదెబ్బ తగిలింది. పార్టీని కొంతైనా అది వెనక్కి నెట్టింది. రిజర్వేషన్లను తగ్గించడానికి లేదా పూర్తిగా తొలగించడానికే బీజేపీ ఇంత భారీ మెజారిటీని కోరుతోందనే అత్యంత తీవ్రమైన అభియోగాన్ని ఆ పార్టీ ఎదుర్కొంటోంది (ఈ ప్రచారం 2015 బిహార్ రాష్ట్ర ఎన్నికలలో వారికి వ్యతిరేకంగా అత్యంత ప్రభావం చూపింది). ఆ సంక్షోభ తీవ్రతను తగ్గించడానికి చాలాకాలంగా ఉన్న హిందూ–ముస్లిం రగడతో సహా అందుబాటులో ఉన్న అన్ని ఆయుధాలనూ బీజేపీ సమీకరించింది. వ్యాసకర్తలు శశాంక్ చతుర్వేది ‘ నిర్మా విశ్వవిద్యాలయం, అహ్మదాబాద్; డేవిడ్ ఎన్ గెలినర్ ‘ ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం, ఇంగ్లండ్; సంజయ్ కుమార్ పాండే ‘ జేఎన్‌యూ, ఢిల్లీ (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
ఓటమికి కారణం ఇదే: మాయావతి
-
ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో మూడు కీలక అంశాలు
-
Sakshi Ground Report: యూపీలో నాలుగో దశ ఎన్నికల పోలింగ్
-
బీజేపీకి థ్యాంక్స్ చెప్పిన అఖిలేష్ యాదవ్
లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సంగ్రామం రోజురోజుకూ రసవత్తరంగా మారుతోంది. పలువురు నేతలు ఇప్పటికే పార్టీలు మారడంతో అధికార ప్రతిక్షాల మధ్య పోరు హోరాహారీగా జరగనుందని రాజకీయవర్గాలు విశ్లేషణ చేస్తున్నాయి. సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ సోదరుడి భార్య అపర్ణ యాదవ్ బుధవారం బీజేపీలో చేరారు. బీజేపీలో చేరిన అపర్ణ యాదవ్ అపర్ణ యాదవ్ బీజేపీలో చేరడంపై అఖిలేష్ యాదవ్ స్పందిస్తూ.. అపర్ణ యాదవ్ సమాజ్‌వాదీ పార్టీ భావాజాలన్ని బీజేపీలో వ్యాప్తి చేయనుందని తెలిపారు. తమ పార్టీ టికెట్లు ఇవ్వలేనివారికి బీజేపీ ఇవ్వడం సంతోషమని ఎద్దేవా చేశారు. సమాజ్‌వాదీ పార్టీ భావాజాలన్ని అపర్ణ యాదవ్ ఇతరపార్టీలో కూడా వ్యాప్తి చేయాలనుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు. తప్పకుండా సమాజ్‌వాదీ పార్టీ భావాజాలం బీజేపీకి చేరుతుందని తెలిపారు. ఆమె పార్టీ మారకుండా ఉండాలని ప్రయత్నించామని, కానీ సాధ్యం కాలేదని పేర్కొన్నారు. కాగా, అపర్ణ యాదవ్ 2017లో ఎస్పీ తరపున పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో అపర్ణ యాదవ్.. బీజేపీ నేత రీటా బహుగుణ చేతిలో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఇక మరోవైపు అపర్ణయాదవ్ చేరిక బీజేపీ ఏమేరకు కలిసివస్తుందో చూడాలి. -
ఎన్నికల వేళ యూపీలో టిక్కెట్ల లొల్లి
-
ఐదు రాష్ట్రాల్లో వేడెక్కిన రాజకీయం
-
పీఎం నరేంద్ర మోదీ: సీఎం యోగి ఆధ్వర్యంలో ఉత్తర్ ప్రదేశ్ అభివృద్ధి
-
జడుపు ఒద్దు, జాగ్రత్త ముఖ్యం
దాదాపు రెండేళ్లుగా కరోనా వైరస్ ప్రపంచమంతటికీ చెబుతున్న పాఠం! తాజా వైవిధ్యం ‘ఒమిక్రాన్’ విషయంలో పొల్లుపోని అక్షర సత్యం. వైరస్ బారినపడి భంగపోకుండా విరుగుడు కార్యాచరణకు తిరుగులేని బ్రహ్మాస్త్రం! తూర్పు దేశాల్లో వాతావరణం చూశాక, ఇక్కడ అనుసరించాల్సిన విధానం, పాటించాల్సిన జాగ్రత్తలపై అందరూ చేస్తున్న హెచ్చరిక ఇదే! ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల్ని వాయిదా వేయాలన్న అలహాబాద్ హైకోర్టు సూచనని కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలిస్తోంది. ర్యాలీల్ని, సభల్ని రద్దు చేయించాలని న్యాయస్థానం ఎన్నికల సంఘాన్ని, కేంద్ర ప్రభుత్వాన్నీ కోరింది. వచ్చేవారం క్షేత్ర పర్యటన చేసి నిర్ణయిస్తామని ఎన్నికల ప్రధానాధికారి చెప్పారు. ఎన్నికలు వాయిదా పడ్డా ఆశ్చర్యం లేదు. రాత్రి పూట కర్ఫ్యూని యూపీ ప్రభుత్వం అప్పుడే ప్రకటించేసింది. క్రిస్టమస్, కొత్త సంవత్సరం, సంక్రాంతి వంటి పండుగల దృష్ట్యా ఎంతో జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ హైకోర్టు, కేంద్ర ప్రభుత్వం నిర్దిష్ట మార్గదర్శకాలిచ్చాయి. దేశంలో శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులతో పాటు పాలకులు, న్యాయస్థానాలు పౌరసమాజాన్ని ఒమిక్రాన్ విషయంలో అప్రమత్తం చేస్తున్నాయి. గడచిన 24 గంటల్లో, ఈ దిశలో పలు పరిణామాలు చోటుచేసుకున్నాయి. తూర్పులోని అమెరికా, ఐరోపా దేశాలలో కేసుల ఉధృతి పెరిగిన క్రమంలోనే మన దేశంలోనూ కేసుల సంఖ్య పెరగడం గడచిన రెండేళ్లుగా రివాజయింది. ఆఫ్రికాలో మొదలై అత్యంత వేగంగా నూరు దేశాలకు విస్తరించిన ఒమిక్రాన్ వ్యాప్తి అమెరికా, ఐరోపాను వణికిస్తోంది. రోజువారీ కోవిడ్ కొత్త కేసులు అమెరికాలో 2.65 లక్షలకు చేరాయి. కిందటి వారం రోజుల సగటు 1.88 లక్షల కేసులుగా నమోదయింది. ఇక బ్రిటన్ (యునైటెడ్ కింగ్డమ్)లో రోజువారీ కొత్త కేసులు 1.22 లక్షలు కాగా, కిందటి వారం సగటు 96 వేల కేసులు. ఇప్పటివరకు వచ్చిన కరోనా అన్ని వైవిధ్యాల కన్నా ఒమిక్రాన్ వ్యాప్తి వేగంగా ఉండి, కొత్త కేసుల్లో వాటి శాతం రమారమి పెరుగుతోంది. మన దేశంలో కోవిడ్ రెండో అల ఉధృతి తీవ్రంగా ఉన్నపుడు జరిగిన భారీ నష్టం మనందరికీ గుర్తుంది. ఏ మాత్రం అజాగ్రత్త వహించినా కేసులు సంఖ్య ఇబ్బడి–ముబ్బడిగా పెంచి, ఇపుడు మూడో అలను మనమే రేపిన వాళ్లమౌతాం! ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి అసాధారణమని, అత్యంత వేగవంతమని అన్ని అధ్య యనాలూ తేల్చాయి. ఆఫ్రికా, అమెరికా, బ్రిటన్లతో పాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఇదే ధృవీకరించింది. దాన్ని నిజం చేస్తూ, దేశంలో కేసులు సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఢిల్లీ, మహారాష్ట్ర తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. ప్రపంచమంతటా, ముఖ్యంగా భారత్‌లో తీవ్ర ప్రభావం చూపిన డెల్టా వైవిధ్యంతో పోలిస్తే ఒమిక్రాన్ ‘అంత ప్రమాదకారి కాదు’ అనే నివేదికలు వస్తున్నాయి. వైరస్ సోకినా, ఆస్పత్రికి వెళ్లి ఐసీయూలో ఉండాల్సిన అవసరం వచ్చేది తక్కువ కేసుల్లోనే! అలా అని నిర్లక్ష్యం వహించడం మంచిది కాదు. ఈ ఏడాది ఆరంభంలో కోవిడ్–19 తొలి అల తీవ్రత మందగిస్తున్నపుడు ప్రజానీకం చూపిన అలసత్వానికి దేశం భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చింది. కోవిడ్ నిబంధనల్ని పాటించ కుండా, ‘ఇంకెక్కడి కోవిడ్...?’ అని పౌరులు చూపిన విచ్చలవిడితనం, నిర్లక్ష్యం నికర ఫలితం... రెండో అల ఉధృతి! దేశం అల్లాడిపోయింది. నెల వ్యవధిలో లక్షమందిని కోల్పోయిన పాడు కాలం, కళ్ల జూశాం! ఇపుడైనా... నిర్లక్ష్యం వహిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. శరీరంలోకి జొరబడ్డ వైరస్ పరిమాణం–ఉధృతి పెరిగితే ఎవరికైనా ప్రమాదమే! అప్పటికే ఇతరేతర జబ్బులున్న వాళ్లకు ఇది అత్యంత ప్రమాదకరం. ఏ టీకా తీసుకోని వారూ జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటి వరకు 140 కోట్ల టీకా డోసులు ఇచ్చారు. దేశ జనాభాలో అర్హులైన (18 ఏళ్లు పైబడ్డ) వారిలో 60 శాతం మందికి రెండు డోసుల టీకాలు పడగా, మొత్తమ్మీద 89 శాతం మంది అర్హులకు కనీసం ఒక డోసైనా టీకా ఇచ్చినట్టయింది. ఈ కార్యక్రమాన్ని వేగిరపరచాలని, త్వరలో ఎన్నికలు జరుగనున్న రాష్ట్రాల్లో టీకా ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని ప్రధాని మోదీ అధికార యంత్రాంగానికి నిర్దేశించారు. ‘జనం బతికుంటే, ఎన్నికల ర్యాలీలు, సభలు, సమావేశాలు తర్వాతైనా పెట్టుకోవచ్చు’అంటూ అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శేఖర్ కుమార్ యాదవ్ తన తీర్పులో వ్యక్తం చేసిన అభిప్రాయం నూరుపాళ్లు సత్యం! అధికరణం 21 ద్వారా రాజ్యాంగం భరోసా ఇచ్చిన మనిషి జీవించే హక్కును ఉటంకిస్తూ ఆయనీ వ్యాఖ్య చేశారు. విమానాశ్రయాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నట్టే రాష్ట్రాల సరిహద్దుల్లో, బస్స్టేషన్లలో, రైల్వేస్టేషన్లలోనూ నిర్వహించాలని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ నేతృత్వంలోని ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ స్ఫూర్తిని కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు పౌరసమాజం కూడా చిత్తశుద్దితో స్వీకరించాలి. కోవిడ్ సముచిత ప్రవర్తన (సీఏబీ) కనబరచాలి. న్యాయస్థానాలు నిర్దేశించినట్టు, ప్రభుత్వాలు ఆదేశిస్తు న్నట్టు, మనమంతా గ్రహిస్తున్నట్టు... చేతుల్ని ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోవడం, మూతి ముసు గులు ధరించడం, భౌతిక దూరం పాటించడం విధిగా చేయాలి. పండుగలు, పబ్బాల గురించి మతాలకతీతంగా ఆలోచించాలి. ఏ పండుగలైనా ప్రజల ప్రాణాలకన్నా మిక్కిలి కాదు. సభలు, సమావేశాల్లో కోవిడ్ నిబంధనల్ని పాటించడం కష్టమౌతుంది కనుక వాటిని నిలువరించాలి. ఈ విషయం నిర్లక్ష్యం చేస్తే, న్యాయస్థానమే చెప్పినట్టు... పరిస్థితులు రెండో అల విపరిణామాల్ని మించే ప్రమాదం పొంచి ఉంది. తస్మాత్ జాగ్రత్త! -
ఎన్నికలు పెట్టాలా వద్దా... డైలమా
-
సమాజ్‌వాదీ అత్తర్‌పై మీమ్స్.. ‘వాహ్ భాయ్ వాహ్’ అంటున్న నెటిజన్లు
లక్నో: సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ వినూత్న ఆలోచన చేశారు. త్వరలో జరగనున్న ఉత్తర ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు సమాజ్ వాదీ పార్టీ అత్తర్ బ్రాండ్ పేరుతో పెర్ఫ్యూమ్ను ప్రారంభించారు. ఈ అత్తర్ సీసాపై సైకిల్ గుర్తును కూడా ముద్రించారు. అంతేగాక కవర్‌పై అ ఖిలేష్ యాదవ్ బొమ్మ కూడా ఉండేలా రూపొందించారు. రెడ్, గ్రీన్ కలర్లో తయారు చేసిన ఈ 22 సహజసిద్ధ సుగంధాలతో రూపొందించారు. చదవండి: యూపీ అసెంబ్లీ ఎన్నికలు, అఖిలేష్ యాదవ్ సంచలన ప్రకటన చదవండి: Navjot Singh Sidhu: పంజాబ్‌లో పంతం నెగ్గించుకున్న సిద్ధూ అయితే ఎన్నికల్లో ఓట్ల కోసం అఖిలేష్ యాదవ్ తీసుకున్న ఆసక్తికర నిర్ణయంపై సోషల్ మీడియాలో నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొంతమంది మంచి ఆలోచన అంటూ మద్దతిస్తుంటే మరికొంతమంది ఎస్పీ పార్టీని తీవ్ర ట్రోల్స్‌తో ముంచెత్తుతున్నారు. ‘సమాజ్‌వాద్ అత్తర్ చాలా ఫన్నీగా ఉంది. బీజేపీలో మోదీ, యోగి సబ్కా సాత్, సబ్కా వికాస్ అంటుంటే అఖిలేష్ యాదవ్ ‘సమాజ్ వాదీ అత్తర్’ అంటున్నాడు. ఈసారి యూపీ ఎన్నికల్లో నేను తటస్థంగా ఉండాలని ఆలోచిస్తున్నాను. కానీ సమాజ్ వాదీ పార్టీ నన్ను బీజేపీకి ఓటు వేసేలా చేస్తుంది. సమాజ్‌వాదీ అత్తర్ ‘వాహ్ భాయ్ వాహ్’...’ అంటూ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. చూడాలి మరి సమాజ్‌వాదీ అత్తరు..ఈ ఎన్నికల్లో ఎన్ని ఓట్లు రాబడుతుందో. చదవండి: బైక్‌ల మీదకు దూసుకెళ్లిన లగ్జరీ కారు.. భయంకర దృశ్యాలు వైరల్ Cc: @rohini_sgh @sakshijoshii I was thinking to be neutral this time for UP election..however SP is making sure that I must vote for BJP at all cost.. I mean political party launching perfume..I mean..कौन हैं ये लोग..कहां से आते हैं..next is fashion show in Saifai or what? — Anurag Guru 🚯🚱 (@anurag_guru) November 9, 2021 కాగా ఎస్పీ పార్టీ అత్తర్‌ను ప్రారంభించడం ఇదే మొదటిసారి కాదు. 2016లో అఖిలేష్ యాదవ్ యూపీలో తన పార్టీ ప్రభుత్వం నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా 'సమాజ్‌వాదీ సుగంధ్' పేరుతో పలు రకాల పెర్ఫ్యూమ్లను ప్రారంభించారు. ఈ పెర్ఫ్యూమ్ నాలుగు సువాసనలతో, ప్రతి సీసా నాలుగు వేర్వేరు నగరాల(ఆగ్రా, లక్నో, వారణాసి, కన్నౌజ్) సువాసనను అందిస్తుంది. Modi Yogi : Sabka sath, sabka vikas, Zero Tolerance for Mafia Meanwhile Akhilesh Yadav : Samajwadi Attar 😂😂😂😂😂 #SamajwadiAttar — Rosy (@rose_k01) November 9, 2021 pic.twitter.com/p1nQffTTdy — UdtaBadal (@Trishoo91277137) November 9, 2021 News 1: UP Govt Building beautiful Toilets News 2: Samajwadi party has launched Samjawadi perfumes Connect the dots. — Foreveridly (@foreveridly) November 9, 2021 -
‘ఆ ఎన్నికలు అయిపోగానే ఇంధన ధరలు పెంచుతారు’
లక్నో: దీపావళి పండుగ వేళ కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం తగ్గించి.. ప్రజలకు శుభవార్త చెప్పిన సంగతి తెలిసిందే. అయితే కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై విపక్షాలు మండిపడుతున్నాయి. ఉప ఎన్నికలో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న బీజేపీ.. రానున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిందని ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలో ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ పెట్రోల్, డీజిల్ ఎక్సైజ్ సుంకం తగ్గింపుపై స్పందించారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే తిరిగి ఇంధన ధరలు పెంచుతారని తెలిపారు. ఈ సందర్భంగా లాలూ ప్రసాద్ మాట్లాడుతూ.. ‘‘దేశ వ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ దారుణంగా ఓడిపోయింది. పరిస్థితి ఇలానే ఉంటే వచ్చే ఏడాది జరగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇదే ఫలితం పునరావృతం అవుతుంది. దాన్ని నివారించడం కోసమే ఎన్డీఏ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది’’ అని తెలిపారు. (చదవండి: పెట్రో పరుగుకు బ్రేకులు...! వాహనదారులకు కేంద్రం శుభవార్త..!) ‘‘తగ్గించిన పెట్రోల్, డీజిల్ ధరలు ఎంతో కాలం ఉండవు. 2022లో యూపీ ఎన్నికలు అయిపోగానే.. మళ్లీ ఇంధన ధరలకు రెక్కలు వస్తాయి. పెట్రోల్, డీజిల్ ధరలను లీటరు 50 రూపాయలకు తగ్గిస్తే.. అప్పుడు ప్రజలకు నిజమైన ఉపశమనం లభిస్తుంది’’ అన్నారు. ఇక శివసేన నేత సంజయ్ రౌత్ కూడా పెట్రోల్, డీజిల్ లీటర్ ధర 50 రూపాయలకు తగ్గించాలని డిమాండ్ చేశారు. చదవండి: వాహనదారులకు షాకింగ్ న్యూస్...! -
ఐఏఎస్ ఆఫీసర్ దౌర్జన్యం.. రిపోర్టర్ వెంటపడి మరీ దాడి
UP Block Panchayat Chief Elections స్థానిక సంస్థల ఎన్నికలు దాడుల పర్వంగా మారిపోయాయి. ఉద్రిక్తతలకు దారి తీస్తున్నాయి. ఉత్తర ప్రదేశ్‌లో వరుస దాడుల ఘటనలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. ఎలక్షన్ విధుల్లో ఉన్న ఓ పోలీస్ అధికారి తనను బీజేపీ కార్యకర్తలు కొట్టాడనే ఫిర్యాదు చేయగా.. మరో ఘటనలో ఐఏఎస్ అధికారి ఓ టీవీ రిపోర్ట్‌ను వెంటపడి మరీ బాదాడు. ఆ ఘటనా వీడియో సర్క్యూలేట్ అవుతోంది. లక్నో: మియాగంజ్‌లో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఉన్నావ్ ఛీఫ్ డెవలప్మెంట్ ఆఫీసర్(సీడీవో) అయిన దివ్యాన్షు పటేల్.. ఓ టీవీ రిప్టోరన్‌ను వెంటపడి మరీ కొట్టాడు. సెల్‌ఫోన్‌తో షూట్ చేస్తుండగా తన అధికార జులుం ప్రదర్శించాడు. దివ్యాన్షు వెంట ఉన్న బీజేపీ కార్యకర్తలు కూడా అతనిపై తలా ఓ చెయ్యి వేశారు. ఇది గమనించిన పోలీసులు ఆ నేతలను అడ్డగించే ప్రయత్నం చేశారు. ఓటింగ్‌లో పాల్గొనకుండా లోకల్ కౌన్సిల్ సభ్యులను కొందరిని కిడ్నాప్ చేశారని, ఆ వ్యవహారంలో దివ్యాన్షు ప్రమేయం ఉందని, ఆ ఘటనను వీడియో తీసినందుకే తనపై దివ్యాన్షు దాడి చేశాడని బాధితుడు కృష్ణ తివారీ ఆరోపిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఘటనపై స్పందించేందుకు దివ్యాన్షు నిరాకరించగా.. ఈ వ్యవహారంపై ఉన్నావ్ కలెక్టర్ స్పందించారు. జర్నలిస్ట్‌తో మాట్లాడానని, అతని నుంచి ఫిర్యాదును స్వీకరించానని, పారదర్శకంగా దర్యాప్తు జరిపిస్తానని ఉన్నావ్ జిల్లా మెజిస్రే్టట్ రవీంద్ర కుమార్ హామీ ఇచ్చారు. కాగా, యూపీ వ్యాప్తంగా ఇలాంటి ఘటనలు చాలానే జరిగినట్లు ప్రతిపక్షాల నుంచి ఫిర్యాదులు అందుతుండగా, మిత్రపక్షాలతో కలిసి 635 పంచాయితీ చీఫ్ స్థానాలు గెల్చుకున్న బీజేపీ ఈ విజయాన్ని ‘చరిత్రాత్మక విజయం’గా అభివర్ణించుకుంటోంది. भाजपा के MLA और ज़िलाध्यक्ष बम लेकर पुलिस वालों पर हमला कर रहे हैं ! ये है भाजपा के गुंडो का असली चेहरा ! #यूपी_में_गुंडाराज #नहीं_चाहिए_भाजपा pic.twitter.com/l4yg5Gcc0Z — Anshuman Singh. (@AnshumanSP) July 10, 2021 -
అంచనాలకు మించి బీజేపీ భారీ విజయం
-
అపర చాణక్యుడు
ముందుండి నడిపించిన కమల దళపతి అమిత్‌షా మోదీ హవా పనిచేసింది. కేంద్రం చేసిన అభివృద్ధి, చేపట్టిన పథకాలు యూపీలో బీజేపీకి విజయాన్ని సాధించిపెట్టాయి. ఏ బీజేపీ నేతను పలకరించినా చెప్పే మాటలివే. మోదీ కరిష్మా పనిచేసి ఉండొచ్చు.. కానీ అంతకంటే ఎక్కువగా బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఏడాదిన్నరగా తెరవెనుక చేసిన కృషి ఫలితమే కమలదళానికి యూపీలో భారీ విజయాన్ని సాధించి పెట్టింది. సామాజిక సమీకరణాల కూర్పు, ఎలాంటి హడావుడి లేకుండా నిశ్శబ్దంగా పనిచేసుకుపోయే నమ్మకస్తులకు బాధ్యతలు అప్పగించడం నుంచి ఆర్ఎస్ఎస్, బీజేపీ అనుబంధ విభాగాలన్నింటినీ పూర్తిస్థాయిలో ప్రచారంలో పరుగులు పెట్టించడం దాకా... ప్రతీది పక్కా ప్రణాళికతో జరిగింది. అమిత్ షా గత ఏడాదికాలంలో ఎక్కువగా లక్నోలోనే గడిపారు. పార్టీ శ్రేణులను సమరోత్సాహంతో ఎన్నికల రణరంగంలో ముందుండి నడిపించారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో యూపీ ఇంచార్జిగా వ్యవహరించి ఏకంగా 71 స్థానాల్లో గెలిపించిన అమిత్ షా బృందం వద్ద బూత్‌స్థాయి నుంచి ఓటర్లు, సామాజిక వర్గాల లెక్కలు పక్కాగా ఉన్నాయి. కార్యక్షేత్రంలోకి దిగే ముందు రెండు సర్వేలు చేయించుకున్న కమలదళపతి వాటి ఆధారంగా ఏయే అంశాలపై దృష్టి పెట్టాలి, ఎక్కడ బలోపేతం కావాలనేది నిర్ణయించుకొని ముందుకువెళ్లారు. తొలుత రాష్ట్ర బీజేపీలో సంస్థాగత మార్పులతో మొదలుపెట్టారు. పార్టీ అధ్యక్షుడిగా ఓబీసీ అయిన కేశవ్ ప్రసాద్ మౌర్యను నియమించి కార్యవర్గంలో ఇదివరకు నిరాదరణకు గురైన వర్గాలకు ప్రాధాన్యత కల్పించారు. జనాభాలో ఎంతశాతం ఉన్నారనే దానితో సంబంధం లేకుండా కులాల వారీగా ప్రతి ఒక్క వర్గంతో భేటీ అయ్యారు. ఇంతకాలం నిరాదరణకు గురయ్యామనే భావన ఉన్నవారికి భరోసా ఇచ్చి వారి మద్దతును కూడగట్టారు. బూత్ స్థాయి నుంచి... 1.5 లక్షల పోలింగ్ బూతుల్లో ప్రతి బూత్ పరిధిలో 20–25 చురుకైన కార్యకర్తలను గుర్తించి శిక్షణ ఇచ్చారు. బూత్‌స్థాయి నుబంచి బ్లాక్ స్థాయి దాకా 100 సమావేశాలను నిర్వహించారు. ఎన్నికలకు ముందు ఏడాది కాలంలో కోటి 80 లక్షల మందికి అమిత్ షా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా యువ టౌన్ హాల్ సమావేశాన్ని నిర్వహించి 156 చోట్ల నుంచి 74 వేల మంది యువతను పలకరించారు. వాట్సాప్, ట్విటర్.. ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా 40 లక్షల మంది ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించి ‘లోక్ సంకల్ప్ పత్ర్’ను విడుదల చేశారు. జన ఆకాంక్ష అనే మరో కార్యక్రమం ద్వారా సేకరించిన అభిప్రాయాల ఆధారంగానే రైతు రుణమాఫీ, మహిళల భద్రత అంశాలను బీజేపీ మెనిఫెస్టోలో చేర్చింది. లెక్కకు మిక్కిలి సమ్మేళనాలు ఎన్నికలకు ఆరు నెలల ముందు నుంచి బీజేపీ 88 యువ సమ్మేళనాలు, 77 మహిళా సమ్మేళనాలు, 200 ఓబీసీ సమావేశాలు నిర్వహించింది. రాష్ట్రంలోని నాలుగు మూలల నుంచి ప్రారంభమై లక్నోలో ముగిసిన పరివర్తన్ యాత్ర 8,000 కి.మీ. దూరం సాగింది. 50 లక్షల మంది ఓటర్లను ఈ యాత్ర ద్వారా కార్యకర్తలు కలుసుకున్నారు. పశ్చిమ యూపీలో తొలి రెండు దశల్లో ఓటింగ్ ముగిశాక.. పరిస్థితిని అంచనా వేసిన షా సోషల్ మీడియా విభాగాన్ని అప్రమత్తం చేశారు. ఫేస్బుక్, ట్విటర్లో విస్తృతంగా ప్రచారం చేపట్టారు. ఇంకా ఎటూ నిర్ణయించుకోకుండా తటస్థంగా ఉన్న ఓటర్లను ఆకర్షించేలా ఈ ప్రచారానికి రూపకల్పన చేశారు. ప్రశాంత్ కిశోర్ బృందానికి గాలం లోక్‌సభ ఎన్నికల్లో మోదీతో పనిచేసి... తర్వాత దూరమైన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌కు అమిత్ షా ఆరునెలల కిందటే షాకిచ్చారు. గత ఏడాది కిశోర్ బృందాన్ని చీల్చి ఓ 50 మందిని బీజేపీ వైపు లాగారు. ఎన్నికల వ్యూహాలు, కుల, మత సమీకరణాలు, ఓట్ల లెక్కలు, ప్రచార రూపకల్పనలో వీరందరూ కిశోర్ శిక్షణ పొందిన వారే. (సాక్షి నాలెడ్జ్ సెంటర్) -
అఖిలేశ్ భవితవ్యం..!?
ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఘోరంగా ఓడిన సమాజ్‌వాదీ పార్టీ మళ్లీ కోలుకుంటుందా? తండ్రిని కాదని అన్ని తానై నడిపించిన అఖిలేశ్ పరిస్థితి ఏంటి? మళ్లీ ములాయం పార్టీ పగ్గాలు చేపడతారా? అన్నది చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల అనంతరం కాంగ్రెస్‌తో తాత్కాలిక స్నేహమేగాని ఏనాడూ అధికారం పంచుకోని ములాయం మార్గాన్ని వదిలి అఖిలేశ్ సాధించింది శూన్యమే. 1967లో ఎన్నికల బరిలో దిగి.. తొలి ప్రయత్నంలోనే ములాయం విజయం సాధించా రు. సోషలిస్ట్ నేత రాంమనోహర్ లోహియా, మాజీ ప్రధాని చరణ్‌సింగ్ బాటలో పయనించి యూపీలో పెను మార్పులకు పునాదులు వేశారు. మొదటినుంచి బ్రాహ్మణేతర, కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయాల్ని ములాయం వంటపట్టించుకున్నారు. అయితే యాదవ పరివారంలో తండ్రి నేతృత్వం లోని వర్గాన్ని పక్కకు నెట్టి నాయకత్వాన్ని అఖిలేశ్ కైవసం చేసుకున్నా.. తండ్రి బాటలో మాత్రం పయనించలేదు. 2007లో 97 స్థానాలతో, 2012లో 80 స్థానాలతో బీఎస్పీ ప్రతిపక్ష హోదా సాధించగా.. ఈ సారి ప్రతిపక్ష హోదా పొందిన ఎస్పీ 47 సీట్లకే పరిమితమైంది. అయితే అఖిలేశ్ ఎమ్మెల్సీ కావడంతో అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హోదా కూడా దక్కని పరిస్థితి. కాంగ్రెస్‌ను పొత్తుకు ఒప్పించి అఖిలేశ్ విజయం సాధించినా... 40 సీట్లకు మించి పోటీచేసే సామర్థ్యం లేని ఆ పార్టీకి 60కిపైగా సీట్లిచ్చి ఆయన పెద్ద తప్పిదం చేశారు. 2019లో బీఎస్పీతో పొత్తు? 1995లో ఎస్పీ–బీఎస్పీ సంకీర్ణ సర్కారు నుంచి బీఎస్పీ వైదొలిగింది. అప్పటి నుంచి ఇరుపార్టీల మధ్య వైరం కొనసాగుతోంది. దానికి ముగింపు పలికే అవకాశాన్ని అఖిలేశ్ ఉపయోగించుకుంటే లౌకిక, సామాజిక శక్తులు ఏకం కావచ్చు. నరేంద్ర మోదీ దెబ్బతో 2015 అసెంబ్లీ ఎన్నికల్లో చేతులు కలిపి విజయం సాధించిన నితీశ్, లాలూను ఆదర్శంగా తీసుకుని ముందడుగు వేయడమే మాయ, అఖిలేశ్‌ల ముందున్న మార్గమని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. శివ్‌పాల్ గెలుపు.. అపర్ణ ఓటమి లక్నోలో బలంగా ఉందనుకున్న ఎస్పీకి రాజధానిలోనూ చుక్కెదురైంది. కంటోన్మెంట్ ప్రాంతంలో ములాయం రెండో కోడలు అపర్ణా యాదవ్ ఓటమిపాలయ్యారు. కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన సిట్టింగ్ ఎమ్మెల్యే, సీనియర్ పొలిటీషియన్ డాక్టర్ రీటా బహుగుణ జోషి 33,796 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. బీజేపీ జాతీయ కార్యదర్శి సిద్ధార్థ్నాథ్ సింగ్ అలహాబాద్ (పశ్చిమ) స్థానం బరిలో దిగి 25వేల పైచిలుకు ఓట్లతో ఎస్పీ అభ్యర్థి రీచా సింగ్‌పై గెలిచారు. రాజ్‌నాథ్ కుమారుడు పంకజ్ సింగ్ నోయిడా నుంచి లక్షా నాలుగు వేల ఓట్ల తేడాతో ఎస్పీ అభ్యర్థిని ఓడించారు. అయితే, మాజీ మంత్రి, ఎస్పీ సీనియర్ నేత శివ్‌పాల్ యాదవ్ తన సిట్టింగ్ నియోజక వర్గం జస్వంత్‌పూర్ నుంచి 52 వేల ఓట్లతో గెలిచారు. ‘‘ఈ ఓటమి ఎస్పీదో, కార్యకర్తలదో కాదు. కేవలం అహంకారం కారణంగానే ఓడిపోయాం’’ అని ఫలితాలు వెల్లడయ్యాక శివ్‌పాల్ తెలిపారు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
యూపీలో కమల సునామీ
► 325 స్థానాల్లో బీజేపీ కూటమి ఘనవిజయం ► అవధ్, బుందేల్‌ఖండ్‌లలో బీజేపీ ఏకపక్ష విజయం లక్నో : యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. మొత్తం 403 అసెంబ్లీ స్థానాల్లో 325 సీట్లను గెలుచుకుని విజయ దుందుభి మోగించింది. ఎగ్జిట్‌పోల్స్ అంచనాలకు మించిన సీట్లను సాధించింది. నోట్లరద్దు నిర్ణయం తర్వాత ఎదుర్కొన్న అతిపెద్ద పరీక్షలో మోదీ సర్కారు విజయం సాధించింది. సామాజిక వర్గాలు బలంగా పనిచేసే యూపీలో ఆర్నెల్లుగా సోషల్ ఇంజనీరింగ్ (ప్రాంతాలకు అనుగుణంగా సామాజిక వర్గాలను కలుపుకుని పోవటం)పై ప్రత్యేకంగా దృష్టిపెట్టడంతోపాటు ‘సబ్కా సాథ్ సబ్కా వికాస్’ నినాదంతో ముందుకెళ్లింది. ముఖ్యంగా నోట్లరద్దుతో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్న ప్రధాని యూపీలో ప్రచారాన్ని అంతా తానై నడిపించారు. మొత్తం 40 శాతం ఓట్లతో బీజేపీ.. ఎస్పీ–కాంగ్రెస్ కూటమి (28%), బీఎస్పీ(22%)లను తోసిరాజని భారీ తేడాతో ముందు స్థానంలో నిలిచింది. ఎవరికెన్ని సీట్లు? యూపీలో 14 ఏళ్ల తర్వాత బీజేపీ అధికారం చేపట్టనుంది. మూడొంతుల మెజారిటీ సాధించిన బీజేపీ జోరుకు ప్రత్యర్థులైన ఎస్పీ–కాంగ్రెస్ కూటమి, బీఎస్పీలు తుడిచిపెట్టుకుపోయాయి. బీజేపీ 312 స్థానాల్లో గెలవగా.. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైన అప్నాదళ్ (ఎస్)9 స్థానాల్లో, ఎస్బీఎస్పీ 4 చోట్ల గెలిచాయి. మరోవైపు, ఎస్పీ 47 సీట్లు గెలవగా.. కాంగ్రెస్ మరీ దారుణంగా 7 సీట్లకే పరిమితమైంది. మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ 19 స్థానాల్లో మాత్రమే విజయం సాధించి మూడో స్థానానికి పరిమితమైంది. అప్నాదళ్ కన్నా కాంగ్రెస్ తక్కువ సీట్లు సాధించటం గమనార్హం. ప్రధాని నరేంద్ర మోదీ నియోజకవర్గమైన వారణాసి జిల్లాల్లోని ఎనిమిది స్థానాలూ బీజేపీ వశమయ్యాయి. బీజేపీ హవా! ఎస్పీ–కాంగ్రెస్ కూటమికి అండగా ఉంటారనుకున్న యాదవులు, ముస్లింలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనూ బీజేపీ గాలి బలంగా వీచింది. యాదవ స్థానాల్లో చాలాచోట్ల బీజేపీ సత్తాచాటింది. దళితుల మద్దతు తమకే ఉంటుందన్న బీఎస్పీకి ఆ పార్టీ బలంగా ఉన్న సీట్లలో చుక్కెదురైంది. అఖిలేశ్ యాదవ్ కామ్ బోల్తాహై నినాదంతో ప్రచారంలో పాల్గొన్నప్పటికీ.. అభివృద్ధి అంతా పట్టణ ప్రాంతాలకే పరిమితమైందని.. ఎస్పీ గ్రామాలను విస్మరించిందని బీజేపీ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది. దీనికి తోడు శాంతిభద్రతల సమస్యలు ఎస్పీకి తలనొప్పిగా మారాయి. అటు తప్పనిసరిగా గెలవాల్సిన యూపీలో బీజేపీ సర్వశక్తులూ ఒడ్డి ప్రచారం చేసింది. రైతులకు రుణాలు మాఫీ చేస్తాననే హామీ, అభివృద్ధి మంత్రం బీజేపీకి కలిసొచ్చాయి. యూపీ ఎన్నికల్లో ఎస్పీ–కాంగ్రెస్ ఘోర పరాజయంతో సీఎం అఖిలేశ్ కుమార్ యాదవ్ రాజీనామా చేశారు. శనివారం సాయంత్రం రాజీనామా లేఖను గవర్నర్ రాంనాయక్‌కు అందజేశారు. దీన్ని ఆమోదించిన గవర్నర్.. తదుపరి ప్రభుత్వం ఏర్పడేవరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉండాలని అఖిలేశ్‌ను కోరారు. ‘కొత్త ప్రభుత్వం ఎస్పీ సర్కారుకన్నా బాగా పనిచేస్తుందని ఆశిస్తున్నాం’అని అఖిలేశ్ తెలిపారు. ఏ ప్రాంతంలో ఎవరెవరు? యూపీలోని అవధ్, పూర్వాంచల్ ప్రాంతాలు చారిత్రాత్మకంగా, రాజకీయంగా చాలా కీలకం. ఈ రెండు ప్రాంతాల్లో కలుపుకుని 243 సీట్లున్నాయి. ప్రభుత్వ మెజారిటీని నిర్ణయించే ఈ సీట్లలో బీజేపీ ఆధిపత్యం ప్రదర్శించింది. అవధ్‌లో బీజేపీ మెజారిటీ స్థానాలు గెలుచుకోగా.. పూర్వాంచల్‌లో బీఎస్పీ, ఎస్పీ తమ అస్తి త్వాన్ని చాటుకున్నాయి. వారణాసి చుట్టుపక్కలనున్న జిల్లాల్లో బీజే పీతో పోటీగా ఈ రెండు పార్టీలు సత్తాచాటాయి. అలీగఢ్, ఆగ్రా, మీరట్ వంటి కీలక నగరాలున్న పశ్చిమయూపీలో అక్కడక్కడ ఎస్పీ, బీఎస్పీ సీట్లు గెలుచుకున్నా బీజేపీ మెజారిటీ సాధించింది. మతపరంగా అతిసున్నిత ప్రాంతాలున్న పశ్చిమాంచల్లోని ముస్లిం మెజారిటీ స్థానాల్లోనూ కమలం పాగా వేసింది. బీఎస్పీకి బలమైన కోటగా పేరున్న బుందేల్‌ఖండ్ ప్రాంతం చాలాకాలంగా కరువుతో తాండవమాడుతోంది. ఒకటి రెండుచోట్ల స్వతంత్ర అభ్యర్థులు గెలిచినా బుందేల్‌ఖండ్ పూర్తిగా కమలం వైపే మొగ్గింది. -
ప్రియాంక.. చాలానే చేశారు!
ఐదు రాష్ట్రాలలో ఎన్నికల పర్వం ముగిసింది. ఇక రెండు రోజుల్లో జాతకాలు కూడా బయటపడతాయి. ఇప్పటివరకు ప్రచారంతో పాటు ఎన్నికల మంత్రాంగంలో తలమునకలుగా ఉన్న నాయకులంతా ఒక్కసారిగా రిలాక్స్ అయ్యారు. ఇప్పుడు తమ మనసులో మాటలు ఒక్కొక్కటిగా బయటపెడుతున్నారు. మిగిలిన నాలుగు రాష్ట్రాల కంటే ఈసారి ఉత్తరప్రదేశ్ మీదే ఎక్కువ మంది దృష్టి సారించారు. ఏడు దశల్లో జరిగిన యూపీ ఎన్నికల్లో అధికార పక్షమైన సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు కూటమిగా పోటీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో ప్రియాంకా గాంధీ కేవలం అమేథీ, రాయ్బరేలీలకే పరిమితం కాకుండా యావత్ యూపీలో ప్రచారం చేయాలని ముందునుంచి డిమాండ్లు వచ్చాయి. కానీ ఆమె చాలా తక్కువగా మాత్రమే కనిపించారు. రెండు పార్టీల మధ్య పొత్తు కుదరడంలో కీలక పాత్ర పోషించిన ప్రియాంక.. ప్రచారంలో మాత్రం అంతగా కనిపించలేదు. అయితే.. ఆమె కేవలం భౌతికంగా వచ్చి ప్రచారం చేయడం మాత్రమే కాదని.. ఇంకా చాలా చేశారని పార్టీ సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్ అంటున్నారు. ఆమె ఎన్నికల మేనేజ్మెంట్, పర్యవేక్షణ లాంటి ప్రధానమైన కార్యక్రమాలు చూసుకున్నారని తెలిపారు. దాంతో పాటు నాయకులను సమన్వయం చేసుకోవడం, రాష్ట్రవ్యాప్తంగా వాళ్లతో పనిచేయించడం లాంటివన్నీ ఆమే చూశారట. ఇవన్నీ ఢిల్లీ నాయకత్వం పర్యవేక్షణలోనే జరిగాయని.. ప్రియాంక యూపీ ఎన్నికల్లో విస్తృతంగా పాల్గొన్నారని గులాం నబీ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఇతర బీజేపీ నాయకులు కులమతాల ఆధారంగా ఓటర్లను చీల్చేందుకు శాయశక్తులా ప్రయత్నించినా అది వారికి సాధ్యం కాలేదని విమర్శించారు. తాను యూపీలో పలువురు హిందువులతో మాట్లాడానని, వాళ్లంతా కూడా మోదీ వ్యాఖ్యలను ఖండించారని చెప్పారు. ఒకప్పుడు బద్ధశత్రువులైన సమాజ్‌వాదీ, కాంగ్రెస్ ఇప్పుడు ఎలా కలిసి పనిచేశాయని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ పొత్తుల కన్నా చాలా మెరుగ్గా ఉందని ఆజాద్ సమాధానమిచ్చారు. తమ కూటమి విజయం సాధించడం ఖాయమని.. 2014 నాటి సంగతి వేరు, ఇప్పటి సంగతి వేరని చెప్పారు. -
ప్రతి ముగ్గురిలో ఒకరిపై కేసు!
యూపీ ఎన్నికల బరిలో అభ్యర్థుల జాతకమిది ► 30% మంది కోటీశ్వరులు ► 41% అభ్యర్థులు పన్నెండో తరగతి లోపువారే! న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో పోటీపడే అభ్యర్థుల జాతకాలు విస్తు గొలుపుతున్నాయి. బరిలో నిలిచిన ప్రతి ముగ్గురిలో ఒకరిపై క్రిమినల్ కేసులున్నాయి. వాటిల్లో హత్య, అత్యాచారం, కిడ్నాప్ వంటి తీవ్రమైన కేసులు ఎదుర్కొంటున్నవారూ అధికంగానే ఉన్నారు. మొత్తం అభ్యర్థుల్లో 30 శాతం మంది కోటీశ్వరులున్నారు. ఇక డిగ్రీ కూడా పూర్తి కాని వారి శాతం 41. నిరక్షరాస్యులు 54 శాతం. ఈ ఎన్నికల్లో అభ్యర్థులు దాఖలు చేసిన అఫిడవిట్ల ఆధారంగా ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ వాచ్ అండ్ అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫారమ్స్ (ఏడీఆర్) ఈ వివరాలను వెల్లడించింది. ఏడు దశల ఎన్నికల్లో చివరి దశ పోలింగ్ ఈ నెల 8న జరగనుంది. బరిలో ఉన్న మొత్తం 4,823 (మహిళలు 445) అభ్యర్థుల్లో 859 మంది తమపై క్రిమినల్ కేసులున్నట్టు అఫిడవిట్లో పేర్కొన్నారు. మరో 704 మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులున్నాయి. 31 మంది అభ్యర్థుల అఫిడవిట్లు స్పష్టంగా లేకపోవడంతో వారి వివరాలు ఇక్కడ ఇవ్వలేదని ఏడీఆర్ తెలిపింది. 38 మంది లైంగిక వేధింపుల కేసులు ఎదుర్కొంటున్నారు. 1457 మంది అభ్యర్థులు కోటీశ్వరులు. వీరి సగటు ఆస్తుల విలువ రూ.1.91 కోట్లు. రూ.5 కోట్ల పైనున్నవారు 453 మంది. 13 మంది జీరో ఆస్తులు ప్రకటించడం గమనార్హం. 411 మంది రూ.లక్ష కంటే తక్కువని పేర్కొన్నారు. 1210 మంది పాన్ కార్డు, 2,790 మంది ఆదాయ పన్ను వివరాలు సమర్పించలేదు. -
యూపీ ఐదో దశలో 57 శాతం పోలింగ్
లక్నో: ప్రతిష్టాత్మక ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఐదో దశ పోలింగ్‌లో 57.36% ఓటింగ్ నమోదైనట్టు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధి కారి టి.వెంకటేశ్ చెప్పారు. సోమవారం 11 జిల్లాల్లోని 51 స్థానాలకు జరిగిన ఈ దశ పోలింగ్‌లో మొత్తం 607 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. కీలకమైన అమేథీ, ఫైజాబాద్ ప్రాంతాలు ఈ దశలోనే ఉన్నా యి. తొలి నాలుగు దశల (వరుసగా 64, 65, 61.16, 61 శాతం) కంటే ఈసారి కాస్త తక్కువ ఓటింగ్ నమోదవడం గమనార్హం. ఎస్పీ అభ్యర్థి చంద్రశేఖర్ కనౌజియా మృతి వల్ల అలాపూర్ స్థానంలో పోలింగ్‌ను మార్చి 9కి ఈసీ వాయిదా వేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పార్లమెంట్ నియో జక వర్గమైన అమేథీలోనూ, కీలకమైన అయోధ్య అసెంబ్లీ స్థానానికి కూడా ఈ దశలోనే పోలింగ్ జరిగింది. బీజేపీ 50, బీఎస్పీ 51, ఎస్పీ 43, దాని మిత్రపక్షం కాంగ్రెస్ మిగిలిన స్థానాల్లో పోటీపడుతున్నాయి. -
ఒంటరిగానే అధికారంలోకి వస్తాం
-
ఒంటరిగానే అధికారంలోకి వస్తాం
ఉత్తరప్రదేశ్‌లో తాము ఒంటరిగానే అధికారంలోకి వస్తామని, ఎవరి సాయం అక్కర్లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. ఆరోదశ ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో ప్రచారం కోసం వచ్చిన ఆయన మావులో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. తమతో జత కలిసిన చిన్న పార్టీలకు కేబినెట్లో చోటు ఇస్తామని హామీ ఇచ్చారు. ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ, బీఎస్పీ రెండు పార్టీల పని అయిపోయిందని.. ప్రజల భవిష్యత్తుతో ఆ పార్టీలు చెలగాటం ఆడాయని మండిపడ్డారు. నెహ్రూ దేశానికి ప్రధమ ప్రధానిగా ఉన్నప్పుడు ఘాజీపూర్ ఎంపీ ఇక్కడ పేదరికం గురించి ఆయనకు చెప్పారని, దానిపై నివేదిక ఇచ్చారు గానీ ఎలాంటి చర్య తీసుకోలేదని గుర్తుచేశారు. భారతదేశం అభివృద్ధిలో కొత్త ఎత్తులు చూస్తోందని, ఇది 125 కోట్ల మంది భారతీయుల వల్లే సాధ్యమైందని అన్నారు. యూపీ కూడా అభివృద్ధి చెందాలంటే అందుకు సుస్థిరమైన బీజేపీ ప్రభుత్వం అవసరమని తెలిపారు. అమెరికా, రష్యా, ఇంగ్లండ్.. ఇలా ప్రతిచోటా భారతదేశాన్ని పొగుడుతున్నారని అన్నారు. -
మేరే అంగనే మే.. పాట పాడిన డింపుల్!
ఎన్నికల ప్రచార సభలలో పాటలు పెట్టడం సర్వసాధారణం. కానీ పెద్ద నాయకులు ఇలాంటి పాటలు పాడటం మాత్రం ఇంతవరకు మనం ఎక్కడా చూడలేదు. వాడి వేడిగా జరుగుతున్న ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచార సభలో తొలిసారి ఈ చిత్రం కనిపించింది. సాక్షాత్తు ముఖ్యమంత్రి భార్య, స్వయానా ఎంపీ అయిన డింపుల్ యాదవ్ (39) 'మేరే అంగనే మే.. తుమ్హారా క్యా కామ్ హై' అంటూ ఓ పాట పాడారు. అలాగని ఆమె పూర్తిగా పాడారనుకోవద్దు. ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఉద్దేశించి, తమ ఇంట్లో (అంటే యూపీలో) మీకు ఏం పని అంటూ ప్రశ్నించారు. 1980లలో అమితాబ్ హీరోగా వచ్చిన బ్లాక్‌బస్టర్ సినిమా 'లావారిస్'లోని పాట మొదటి లైనును ఇందుకోసం ఆమె ఎంచుకున్నారు. మెరూన్ రంగు చీర కట్టుకుని.. నుదుట బొట్టు పెట్టుకున్న డింపుల్ యాదవ్.. అలహాబాద్‌లో పోటీ చేస్తున్న విద్యార్థి నాయకురాలు రిచా సింగ్‌కు మద్దతుగా ప్రచారం చేస్తూ ఈ మాట అన్నారు. ఈ మాట అనగానే ఒక్కసారిగా అక్కడున్న వందలాది మంది మహిళలు 'డింపుల్ భాభీ' అంటూ నినదించారు. డింపుల్ యాదవ్ లోక్‌సభలో పెద్దగా మాట్లాడరు, ప్రశ్నలు కూడా పెద్దగా అడిగిన సందర్భాలు లేవు. ఆమె ఇప్పటివరకు రెండు సార్లు మాత్రమే చర్చలలో పాల్గొన్నారు. లోక్‌సభకు ఆమె హాజరు కూడా కేవలం 37 శాతం మాత్రమే. 2014 సంవత్సరంలో మహిళల మీద జరుగుతున్న నేరాలపై మాట్లాడుతుండగా పదే పదే ఇతర సభ్యులు అంతరాయాలు కలిగించడంతో.. కనీసం తాను మాట్లాడుతున్నందుకు తన మామగారు ములాయం సింగ్ యాదవ్ సంతోషిస్తారని చెప్పారు. అలాంటి డింపుల్.. ఇప్పుడు మాత్రం ఎన్నికల ప్రచార సభలో మంచి దూకుడుగా వెళ్తున్నారు. తన భర్త అఖిలేష్ యాదవ్‌తో కలిసి, విడిగా కూడా ప్రచారాలు చేస్తున్నారు. నేరుగా ప్రధానమంత్రి మీదే విమర్శలు చేసే స్థాయికి డింపుల్ వచ్చారు. ప్రధానమంత్రి మన్‌కీ బాత్ అంటూ రేడియోలో ప్రసంగాలు చేస్తున్నారు కానీ.. 'కామ్ కీ బాత్' (పనికొచ్చే మాటలు) లేవని అన్నారు. -
కసబ్ బారినుంచి తప్పించుకోండి: అమిత్ షా
ఉత్తరప్రదేశ్ వాసులు 'కసబ్' బారి నుంచి తప్పించుకోవాలని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా అన్నారు. ఈ 'కసబ్'లో.. క అంటే కాంగ్రెస్, స అంటే సమాజ్‌వాదీ, బ అంటే బహుజన్ సమాజ్ పార్టీ అని ఆయన అభివర్ణించారు. గోరఖ్‌పూర్‌లో జరిగిన ఎన్నికల సభలో పాల్గొని ఆయన మాట్లాడారు. కసబ్‌ను పూర్తిగా పడుకోబెడితే తప్ప రాష్ట్రంలో అభివృద్ధి అన్నదే కనిపించదని చెప్పారు. ఇంతకుముందు ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా స్కాం అంటే సమాజ్‌వాదీ, కాంగ్రెస్, అఖిలేష్, మాయావతి అని అభివర్ణించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ముంబై ఉగ్రదాడి ఘటనలో సజీవంగా పట్టుబడిన ఏకైక ఉగ్రవాది కసబ్ పేరును అమిత్ షా వాడుకున్నారు. అయితే, ప్రధానమంత్రి ఉపయోగించిన స్కాం పదాన్ని అఖిలేష్ యాదవ్ మరోలా వాడుకున్నారు. స్కాం అంటే సేవ్ కంట్రీ ఫ్రమ్ అమిత్ షా అండ్ మోదీ అని ఆయన చెప్పారు. -
మా పొత్తుతో మోదీ నవ్వు మాయం
రాహుల్ గాంధీ వ్యాఖ్య బందా(యూపీ): ఉత్తరప్రదేశ్ ఎన్నికల కోసం సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ), కాంగ్రెస్ చేతులు కలపడంతో ప్రధాని మోదీ ముఖంలో నవ్వు మాయమైందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. మోదీ యూపీకి సొంత కొడుకు కాడని, దత్తపుత్రుడు మాత్రమేనని విమర్శించారు. ‘గంగామాత తన కొడుకు వారణాసికి పిలిపించుకుందని 2014లో మోదీ చెప్పారు.. మోదీజీ.. సంబంధాలనేవీ చెప్పుకుంటే కాదు పెంపొదించుకుంటే ఏర్పడతాయి’ అని అన్నారు. గత యూపీఏ ప్రభుత్వం రూ.7వేల కోట్ల రైతు రుణాలను మాఫీ చేసిందని, మోదీకి మాత్రం ఆ ఉద్దేశం లేదని ఆరోపించారు. మోదీపై ఈసీ చర్యలు తీసుకోవాలి: న్యూఢిల్లీ: యూపీలో ప్రజల మధ్య చిచ్చుపెడుతూ, ఎన్నికల వాతావరణాన్ని మోదీ కలుషితం చేస్తున్నారని, ఆయనపై ఎన్నికల సంఘం తగిన చర్య తీసుకోవాలని కాంగ్రెస్ కోరింది. ‘మోదీ ఎన్నికల సభల్లో అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారు.. ఖబరిస్తాన్ ఉన్నప్పుడు శ్మశానం కూడా ఉండాలని ఆదివారం ఆయన అన్న మాటలు సమాజాన్ని విడగొట్టేవే. ఆయన మత ఉద్రిక్తతలు సృష్టించేందుకు యత్నించారు. రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు’ అని పార్టీ ప్రతినిధి ఆనంద్ శర్మ ఆరోపించారు. -
కీలక ‘మూడో దఫా’ ముగిసింది..పోలింగ్ ఎంతంటే?
లక్నో: దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతున్న ఉత్తరప్రదేశ్ మూడో దఫా ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 69 స్థానాలకు ఆదివారం పోలింగ్ జరిగింది. 61.16శాతం ఓటింగ్ నమోదైంది. మూడో దఫా పోలింగ్‌లోనే హోంమంత్రి రాజ్‌నాథ్ లోక్‌సభ స్థానమైన లక్నో, ఎస్పీకి పట్టున్న కన్నౌజ్, మైన్ పురి, ఇటావా ప్రాంతాలున్నాయి. ఫరూకాబాద్, హర్దోయ్, అవురైయా, కాన్పూర్ దేహత్, కాన్పూర్, ఉన్నావో, బరాబంకి, సీతాపూర్ తదితర 12 జిల్లాల్లో పోలింగ్ జరిగింది. ఈ ప్రాంతంలో మొత్తం 2.41 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. 826 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇటావా.. ఎస్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయంసింగ్ యాదవ్ సొంత జిల్లా. ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ సతీమణి డింపుల్‌యాదవ్ కన్నౌజ్ ఎంపీ. ఎస్పీ మరో కీలక ఎంపీ తేజ్‌ప్రతాప్ యాదవ్‌ది మైన్ పురి జిల్లా. దీంతో మూడో దఫా అన్ని పార్టీలకూ ప్రతిష్టాత్మకంగా మారింది. 2012 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ 69 స్థానాల్లో ఎస్పీ 55 గెలుచుకుంది. -
'300 స్థానాల్లో మాదే విజయం'
లక్నో: దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతున్న ఉత్తరప్రదేశ్ ఎన్నికల మూడో దశ ఓటింగ్ కొనసాగుతోంది. ఈ క్రమంలో మాజీ సీఎం, బీఎస్పీ అధినేత్రి మాయావతి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. లక్నోలోని పోలింగ్ బూత్ నెం.251కి వచ్చిన ఆమె ఓటేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. మొదటి రెండు దశల ఓటింగ్ తరహాలోనే ఈ మూడో దశ పోలింగ్ లోనూ బీఎస్పీదే హవా కొనసాగుతుందన్నారు. పూర్తి మెజార్టీతో తాము అధికారం చేపట్టడం ఖాయమని మాయావతి ధీమా వ్యక్తం చేశారు. తమ పార్టీ తక్కువలో తక్కువ అంటే కనీసం 300 పైగా స్థానాల్లో నెగ్గి అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయాన్ని సొంతం చేసుకుంటుందని చెప్పారు. నేడు (ఆదివారం) 69 స్థానాలకు మూడో దశ పోలింగ్ ఉదయం ఏడు గంటలకే ప్రారంభమైంది. ఈ దశ పోలింగ్‌లో హోంమంత్రి రాజ్‌నాథ్ లోక్‌సభ స్థానం లక్నో, ఎస్పీకి పట్టున్న కన్నౌజ్, మైన్ పురి, ఇటావా ప్రాంతాల నియోజకవర్గాలు ఉండటంతో అందరిదృష్టి ఈ పోలింగ్ పై ఉంది. ములాయంసింగ్ యాదవ్ సొంత జిల్లా ఇటావా, ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ సతీమణి డింపుల్‌యాదవ్ కన్నౌజ్ ఎంపీ.. ఎస్పీ మరో కీలక ఎంపీ తేజ్‌ప్రతాప్æ యాదవ్‌ది మైన్ పురి జిల్లా కావడంతో ఈ దశ అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఫరూకాబాద్, హర్దోయ్, అవురైయా, కాన్పూర్ దేహత్, కాన్పూర్, ఉన్నావో, బరాబంకి, సీతాపూర్ తదితర 12 జిల్లాల్లో నేడు పోలింగ్ జరుతున్న విషయం తెలిసిందే. -
యూపీ ‘మూడో దశ’ నేడు
లక్నో: దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతున్న ఉత్తరప్రదేశ్ ఎన్నికల మూడో దశకు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. 69 స్థానాలకు ఆదివారం జరగనున్న ఈ దశ పోలింగ్‌లో హోంమంత్రి రాజ్‌నాథ్ లోక్‌సభ స్థానం లక్నో, ఎస్పీకి పట్టున్న కన్నౌజ్, మైన్ పురి, ఇటావా ప్రాంతాలున్నాయి. ఫరూకాబాద్, హర్దోయ్, అవురైయా, కాన్పూర్ దేహత్, కాన్పూర్, ఉన్నావో, బరాబంకి, సీతాపూర్ తదితర 12 జిల్లాల్లో జరుగుతున్న ఈ దశ పోలింగ్‌లో 2.41 కోట్ల మంది ఓటర్లు 826 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చనున్నారు. మొత్తం 25,603 పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేశారు. ఇటావా... ఎస్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయంసింగ్ యాదవ్ సొంత జిల్లా. ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ సతీమణి డింపుల్‌యాదవ్ కన్నౌజ్ ఎంపీ. ఎస్పీ మరో కీలక ఎంపీ తేజ్‌ప్రతాప్æ యాదవ్‌ది మైన్ పురి జిల్లా. దీంతో ఈ దశ అన్ని పార్టీలకూ ప్రతిష్టాత్మకంగా మారింది. 2012 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ 69 స్థానాల్లో ఎస్పీ 55 గెలుచుకుంది. -
'బావ, నేతాజీది ఒకే తీరు.. శైలి'
లక్నో: సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత ములాయం సింగ్ యాదవ్ చిన్న కోడలు అపర్ణ యాదవ్ తొలిసారి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉన్నా.. ప్రచారంలో మాత్రం తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. మూడో దఫా ఎన్నికల్లో భాగంగా ఆదివారం పోలింగ్ జరగనున్న తన నియోజకవర్గం లక్నో కంటోన్మెంట్ లో యూపీ కాంగ్రెస్ చీఫ్ రాజ్ బబ్బర్ తో కలిసి మంగళవారం ఓ బహిరంగసభలో అపర్ణ పాల్గొన్నారు. నేతాజీ ములాయం, వరుసకు బావ అయిన యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్ ఒకేతీరుగా వ్యవహరిస్తారని.. ఆ ఇద్దరిరి ఒకే స్వభావమని.. అభివృద్ధే వారి లక్ష్యమని కొనియాడారు. తమ పార్టీ ఇక్కడ రూ.40 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభించిందని, మరోసారి ఎస్పీని గెలిపిస్తే అద్భుతాలు చేసి చూపిస్తామని అపర్ణ తెలిపారు. నియోజకవర్గంలో ఆమె ఎక్కడ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారో ఆ సభలలో 'ఫ్యూచర్ మినిస్టర్' అంటూ కార్యకర్తలు నినాదాలు చేయడం ఆమెలో మరింత ఉత్సాహాన్ని నింపుతోంది. 'నేను తొలుత ఇక్కడి ఆడపడుచును.. ఆ తర్వాతే కోడలుగా వచ్చాను' అంటూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. వరుసకు సోదరి అయిన ఎస్పీ ఎంపీ డింపుల్ యాదవ్ తాను చాలా సన్నిహితంగా ఉంటామని, ఇద్దరి వ్యక్తిత్వాలు వేరని చెప్పుకొచ్చారు. ఇప్పటికీ మేమిద్దరం మా వ్యక్తిగత విషయాలను సంతోషంగా షేర్ చేసుకునేంతగా తమ మధ్య చనువు ఉందని ఓ విలేకరి ప్రశ్నకు ఇలా జవాబిచ్చారు. ఎస్పీలో తలెత్తిన అంతర్గత కుటుంబపోరుతో అపర్ణ యాదవ్ ప్రముఖంగా వెలుగులోకి వచ్చారు. శివ్‌పాల్ యాదవ్ వర్గం వ్యక్తిగా పేరొందిన అపర్ణ ఎస్పీని తన చేతుల్లోకి తీసుకోవాలని భావించినట్లు కథనాలు వచ్చాయి. ఓ దశలో సీఎం అఖిలేశ్ ఆమెకు సీటు ఇస్తారా లేదా అనే సందేహం వచ్చినా.. చివరికి అపర్ణ, బాబాయి శివపాల్ యాదవ్ లకు పార్టీ టికెట్ ఇచ్చి బరిలో నిలిపారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరిన రీటా బహుగుణ జోషీపై కాంగ్రెస్ శ్రేణులు అసంతృప్తిగా ఉండటం అపర్ణకు కలిసొచ్చే అంశంగా కనిపిస్తోంది. అపర్ణకు బలమైన అభ్యర్థి రీటా బహుగుణ జోషీ (బీజేపీ)ని లక్నో కంటోన్మెంట్ స్థానంలో ఎదుర్కొంటుండటంతో అందరి చూపు ఈ స్థానంపై ఉంది. -
చిన్న పార్టీలతో ఫలితం తారుమారు!
యూపీ ఎన్నికల బరిలో అనేక చిన్నా చితకా పార్టీలు ► అభ్యర్థుల విజయావకాశాలపై ప్రభావం ► కుల ప్రాతిపదికన ఓట్లు అభ్యర్థిస్తున్న పార్టీలు లక్నో: ఈసారి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పలు చిన్నా చితకా పార్టీలు అదృ ష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. ఎన్నికల్లో కీలక పాత్ర పోషించడమే కాక, అభ్యర్థుల విజయావకాశాల్ని కూడా అవి ప్రభావితం చేస్తున్నాయి. మొదటి రెండు దశల్లో ఎన్నికలు జరిగే పశ్చిమ యూపీలో కొన్ని పార్టీలు ఎన్నికల బరిలో ఉండగా మరికొన్ని ప్రధాన పార్టీలకు మద్దతు ప్రకటించాయి. వివిధ కులాలు, వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నాయి. పీస్ పార్టీ, నిషాద్ పార్టీ, మహాన్ దళ్‌కు కొన్ని కులాల్లో మంచి పట్టుంది. రాష్ట్ర ఓటర్లలో 4.5 శాతం ఓట్లున్న మలాహ్ కులం (మత్స్యకారులు, పడవ నడిపేవారు) ఓట్లపై నిషాద్ పార్టీ ఎక్కువగా ఆధారపడింది. యూపీలోని నదీ తీర ప్రాంతాల్లో ఉన్న 125 నియోజకవర్గాల్లో ఈ కులం ఓట్లు కీలకం కానున్నాయి. సంజయ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోని సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీకి రాజ్‌భర్ కులంలో మంచి పట్టుంది. అలాగే బదౌనీ, ఇటావా, బరేలీ, షాజహాన్ పూర్, ఫర్రుఖాబాద్ ప్రాంతాలపై మహాన్ దళ్ ఆశలు పెట్టుకోగా... శాక్య, మౌర్య, కుశ్వాహ, సైనీ వర్గాల్లో ఆ పార్టీకి ఆదరణ ఉంది. అందుకే ఇటీవల బీఎస్పీ నేత స్వామి ప్రసాద్ మౌర్యను పార్టీలో చేర్చుకున్న బీజేపీ.. మరో నేత కేశవ్ ప్రసాద్మౌర్యను రాష్ట్ర విభాగం అధ్యక్షుడ్ని చేసింది. ముస్లింల్లో పీస్ పార్టీకి పట్టు ఇక ముస్లింల్లో మంచి పట్టున్న పీస్ పార్టీ 2012 అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు స్థానాలు గెలుచుకుంది. ఈ సారి ముస్లిం ఓట్లు తమకే పడతాయని పీస్ పార్టీ ధీమాగా చెబుతోంది. ఇంతవరకూ ప్రధాన పార్టీలు లేవనెత్తని అంశాల్ని తెరపైకి తీసుకొస్తూ... పశ్చిమ ఉత్తరప్రదేశ్ వికాస్ పార్టీ విస్తృత ప్రచారం చేస్తోంది. మరోవైపు కేంద్ర మంత్రి అనుప్రియ పటేల్ నేతృత్వంలోని యూపీఏ మిత్రపక్షం అప్నాదళ్ పశ్చిమ యూపీలోని 10 స్థానాలకు అభ్యర్థుల్ని నిలబెట్టింది. మహిళలు, రైతుల సంక్షేమం కోసం మరికొన్ని: మహిళల భద్రత పశ్చిమ యూపీ ఎన్నికల ప్రచారంలో ఎజెండా కావడంతో.. మహిళా శక్తికరణ్ పార్టీ ఆ అవకాశాన్ని ఓట్లుగా మలచుకునేందుకు ప్రయత్ని స్తోంది. బ్రిజ్ క్రాంతిదళ్ నేతలు బ్రిజ్ ప్రాంత చరిత్రను ప్రచారం చేస్తూ ఎన్నికల్లో లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు. మధుర, జలేసర్, భరత్పూర్ తదితర ప్రాంతాలపై ఆ పార్టీ ఆశలు పెట్టుకుంది. కాగా భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) వంటి పార్టీలు ఎన్నికల బరిలో లేకపోయినా పెద్ద పార్టీలకు ఓట్ల సాయం చేస్తున్నాయి. సమాజంలో వెనకబడ్డ వర్గాల సమస్యల్ని ప్రస్తావిస్తూ భారతీయ వంచిత్ సమాజ్ పార్టీ, భారతీయ కర్యస్థ సేన, కిసాన్ మజ్దూర్ సురక్ష పార్టీ, భారతీయ భాయ్చరలు ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. కొన్ని పార్టీలు ముజఫర్‌నగర్ అల్లర్ల తర్వాత తెరపైకి వచ్చినవే. మత సామరస్యత కోసం తమకు ఓటేయమని అభ్యర్థిస్తున్నాయి. కానరాని ప్రముఖులు ఈ సారి యూపీ ఎన్నికల ప్రచారంలో రాజకీయ ప్రముఖుల సందడి తగ్గింది. మొదటి రెండు దశల ఎన్నికల ప్రచారానికి ఎస్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీలు దూరంగా ఉన్నారు. కావాలనే ములాయం ప్రచారానికి దూరం కాగా... అనారోగ్య కారణాలతో సోనియా గాంధీ ప్రచారంలో పాల్గొనలేదు. తన కుమారుడికి రాంనగర్ సీటు ఇవ్వకపోవడంతో మరో సీనియర్ నేత బేణీ ప్రసాద్ వర్మ కూడా ప్రచారాన్ని విరమించుకున్నారు. బీజేపీ నుంచి ఎల్కే అద్వానీ, బాలీవుడ్ నటుడు శత్రుఘ్నసిన్హా ఈసారి ప్రచారానికి దూరమయ్యారు. -
ఇప్పుడైనా వారికి బుద్ధి చెప్పండి: మోదీ
లక్నో: తన మనుగడ కోసమే ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నారని భారత ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. యూపీ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఆయన చెప్పారు. త్వరలో ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల నేపథ్యంలో భాగంగా ఆదివారం అలీగఢ్‌లో ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాజ్‌వాదిపార్టీ, కాంగ్రెస్ పార్టీని దుయ్యబట్టారు. ఇప్పటి వరకు దోచుకునే ప్రభుత్వాన్ని, శాంతిభద్రతలు గాలికొదిలేసిన ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని, ఇప్పుడు మాత్రం ప్రజల సంక్షేమం కోసం పాటుపడే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని కోరారు. వివిధ కుంభకోణాల్లో ఇరుక్కుపోయిన ఎస్పీ, కాంగ్రెస్ పార్టీకి యూపీ ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని సూచించారు. యూపీ ప్రజలకు న్యాయం ఇప్పించేందుకు తాను వచ్చినట్లు మోదీ తెలిపారు. సొంతమేలు, తనకులపోల్లే అనే సొంత అభిమానం గురించి తప్ప ఏనాడు తమ ప్రభుత్వ హయాంలో ఎంత అవినీతి జరుగుతుందనే విషయాన్ని పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. అభివృద్ధిని గాలికొదిలేశారని మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వానికి పట్టంగడితే ఉత్తరప్రదేశ్‌లో వికాసాన్ని తీసుకొస్తామన్నారు. అందరికీ విద్యుత్, శాంతిభద్రతలు పునర్నిర్మాణం, రోడ్ల ఏర్పాట్లువంటివి చేస్తామని తెలిపారు. ఉద్యోగాలకోసం వెళ్లే యువతను రాజకీయ నేతలైన ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఇంటర్వ్యూలు చేస్తున్నారని, వారిని లంచాలు తీసుకురావాలని కోరుతున్నారని ఇలాంటివాటికి బీజేపీని ఎన్నుకోవడం ద్వారా అడ్డుకట్ట వేయాలని చెప్పారు. -
యూపీ ప్రచారానికి కాంగ్రెస్ హేమాహేమీలు
లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ అతిరథ మహారథులు పాల్గొంటున్నారు. ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ కుటుంబంతో పాటు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ ముఖ్యమంత్రులు, కేంద్ర మాజీ మంత్రులు, సీనియర్ నేతలు, సినిమా తారలు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. మొదటి విడత ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ తరపున 40 మంది స్టార్ కాంపెయినర్లు రంగంలోకి దిగనున్నారు. మంగళవారం ఏఐసీసీ కార్యాలయం ఈ జాబితాను విడుదల చేసింది. ప్రియాంక గాంధీతో పాటు సినీ నటి నగ్మా కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తారు. యూపీ ఎన్నికల్లో అధికార సమాజ్‌వాదీ పార్టీతో కాంగ్రెస్ పొత్తుపెట్టుకున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ 105 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ స్టార్ కాంపెయినర్ల జాబితాలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మన్మోహన్ సింగ్, గులాం నబీ అజాద్, షీలా దీక్షిత్, రాజ్ బబ్చర్, మీరా కుమార్, సుశీల్ కుమార్ షిండే, ప్రియాంక గాంధీ, జనార్దన్ ద్వివేది, అహ్మద్ పటేల్, కమల్ నాథ్, ముకుల్ వాస్నిక్, సంజయ్ సింగ్, అశోక్ గెహ్లాట్, భూపిందర్ సింగ్ హుడా, సల్మాన్ ఖుర్షిద్, కుమారి శెల్జా, జ్యోతిరాధిత్య సింధియా, మనీష్ తివారి, రాజీవ్ శుక్లా, సచిన్ పైలట్, నగ్మా తదితర ప్రముఖులు ఉన్నారు. -
కాంగ్రెస్‌లో కొత్తనీరు.. ఆ క్రెడిట్ ఆమెదే..!
అఖిలేశ్, డింపుల్‌తో చర్చలు తుదివరకు ఉత్కంఠరేపుతూ తీవ్ర మంతనాల నడుమ ఉత్తరప్రదేశ్‌లో అధికార ఎస్పీ, కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తు ఖరారైంది. యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్ మ్యానిఫెస్టో ప్రకటన నేపథ్యంలో ఆదివారం తెల్లవారుజామున 4.30 గంటలవరకు జరిగిన మంతనాలు, చర్చల అనంతరం ఈ పొత్తు కొలిక్కి వచ్చిందని కాంగ్రెస్ పార్టీ విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. మొదట కాంగ్రెస్‌కు 99 సీట్లు ఇవ్వడానికి ఎస్పీ అంగీకరించగా.. హస్తం నేతల మొండిపట్టుతో 105 సీట్లు ఇవ్వడానికి ఒప్పుకొంది. దీంతో హస్తంతో పొత్తు ఖాయమని సీఎం అఖిలేశ్ కూడా విలేకరులకు వెల్లడించారు. అత్యంత నాటకీయంగా సాగిన ఈ పొత్తు వ్యవహారంలో పూర్తి క్రెడిట్ ప్రియాంకగాంధీకి ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ ఉత్సాహం చూపడం గమనార్హం. పార్టీ సీనియర్ నేత, సోనియాగాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ ట్వీట్ చేస్తూ ప్రియాంకకు క్రెడిట్ ఇచ్చారు. ’(పొత్తు చర్చల కోసం) కాంగ్రెస్ పార్టీ చిన్నస్థాయి నేతలు మాత్రమే రంగంలోకి దిగారనడం తప్పు. అత్యున్నత స్థాయిలో యూపీ సీఎం, ప్రియాంకాగాంధీ, ఇతర సీనియర్ నేతలతో మధ్య చర్చలు జరిగాయి’ అని ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. పొత్తు చర్చల్లో ప్రియాంకగాంధీ అత్యంత చురుగ్గా పాల్గొన్నట్టు తెలుస్తోంది. అఖిలేశ్, ఆయన సతీమణి డింపుల్‌తో కూడా ఆమె చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. అయితే, సీట్ల పంపకాల్లో రాజీ కుదరకపోవడంతో శనివారం పొత్తు చర్చల్లో ప్రతిష్టంభన నెలకొంది. దీంతో సోనియాగాంధీ రంగంలోకి దిగి జోక్యంతోనే పొత్తు ఖరారైందని ఎస్పీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే, కాంగ్రెస్ పార్టీ మాత్రం గాంధీ-నెహ్రూ కుటుంబ వారసురాలు ప్రియాంకకు క్రెడిట్ ఇవ్వడానికి ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటివరకు ఎన్నికల్లో అంటీముట్టనట్టు ఉన్న ప్రియాంక రానున్న యూపీ ఎన్నికల్లో మరింత చురుగ్గా పాల్గొంటారేమోనన్న రీతిలో సంకేతాలు ఇస్తున్నారు. -
అధికార పార్టీతో కాంగ్రెస్ డీల్!
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త పొత్తులకు తెరలేవబోతున్నది. అధికార సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) పొత్తు పెట్టుకునేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతున్నది. ఈ మేరకు రెండు పార్టీలు సీట్ల పంపకాలపై డీల్ కుదుర్చుకునే దిశగా కదులుతున్నాయి. కనీస ఉమ్మడి కార్యక్రమం ఆధారంగా ఎన్నికల్లో ముందుకుసాగాలని, ఇరుపార్టీలకు గట్టి పట్టున్న సీట్లపై పట్టువిడుపుల ధోరణి కొనసాగించాలని ఇప్పటివరకు తెరవెనుక జరిగిన పొత్తు చర్చల్లో రెండు పార్టీలు నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. కూటమి భాగస్వాములుగా యూపీ ఎన్నికలను ఎదుర్కోబోతున్న రెండు పార్టీల అగ్రనేతలు - కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్- ఇంకా భేటీ కానప్పటికీ పొత్తు కుదుర్చుకోవడానికి కావాల్సిన సన్నాహాలన్నీ పూర్తయ్యయాయని, ఈ పొత్తు చర్చలు చాలావరకు మధ్యవర్తుల ద్వారా, టెలిఫోన్ చర్చల ద్వారా జరిగాయని, సీట్ల పంపకం, కనీస ఉమ్మడి కార్యక్రమంపై ఇప్పటికే ఇరుపార్టీల మధ్య విస్తృత ఏకాభిప్రాయం వచ్చిందని ఆ పార్టీ అగ్రస్థాయి వర్గాలు తెలిపాయి. ప్రస్తుతానికి కాంగ్రెస్, ఎస్పీల మధ్యే పొత్తు చర్చ నడుస్తోందని, తమ కూటమిలో రాష్ట్రీయ లోక్ దళ్ (ఆరెల్డీ)ను చేర్చుకునే విషయమై ఇంకా చర్చించలేదని, కానీ మున్ముందు మరిన్ని చిన్న పార్టీలను కూటమిలో కలుపుకొనే విషయమై చర్చిస్తామని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. -
ఎస్పీ సంక్షోభం.. చిచ్చురేపింది చిన్నకోడలేనా?
-
ఎస్పీ సంక్షోభం.. చిచ్చురేపింది చిన్న కోడలేనా?
లక్నో: తండ్రి ములాయంసింగ్ యాదవ్‌కు పోటీగా అఖిలేశ్ యాదవ్ 235 మంది రెబల్ అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే, అఖిలేశ్ ప్రకటించిన ఈ జాబితాలో లక్నో కంటోన్మెంట్ స్థానానికి మాత్రం ఆయన అభ్యర్థిని ప్రకటించకుండా వదిలేశారు. అందుకు కారణం అక్కడి నుంచి ములాయం రెండో కోడలు అపర్ణ పోటీ చేస్తుండటమే. ఆమెకు ఈ స్థానాన్ని ములాయం దాదాపు ఏడాది కిందటే ఖరారు చేశారు. 26 ఏళ్ల అపర్ణ శివ్‌పాల్ వర్గం వ్యక్తి. యూపీ సీఎం అఖిలేశ్, ఆయన బాబాయ్, ములాయం సోదరుడు శివ్‌పాల్ యాదవ్ మధ్య ఆధిపత్య గొడవ పరాకాష్టకు చేరి సమాజ్‌వాదీ పార్టీ నిట్టనిలువునా చీలిన సంగతి తెలిసిందే. ఈ వర్గపోరులో పార్టీ అధినేత ములాయం కొడుకును కాదని తమ్ముడు శివ్‌పాల్‌కు మద్దతు పలికారు. ఇలా ములాయం తమ్ముడిని వేనకేసుకురావడానికి ఆయన రెండో భార్య సాధనాగుప్తే కారణమని అఖిలేశ్ వర్గం ఆరోపిస్తోంది. సవతి తల్లి సాధనాగుప్తా అఖిలేశ్‌కు వ్యతిరేకంగా ములాయంను ఎగుదోస్తున్నారని ఆ వర్గం పేర్కొంటున్నది. ఈ ఆధిపత్య తగదా మరింత ముదరడానికి కారణం అపర్ణ యాదవ్ రాజకీయ ఆకాంక్షలే కారణమని వినిపిస్తోంది. ములాయం, సాధనాగుప్తా తనయుడైన ప్రతీక్ సతీమణి అపర్ణ. ఎస్పీకి యువ వారసురాలిగా తానే తెరపైకి రావాలని ఆమె కలలు కంటున్నారు. అంతేకాకుండా పార్టీ తరఫున భవిష్యత్తులో ముఖ్యమంత్రి కావాలన్న కోరిక కూడా ఆమెలో ఉందని అంటున్నారు. కొన్ని నెలల కిందట అఖిలేశ్, శివ్‌పాల్ గొడవ హోరాహోరీగా సాగుతుండగా పార్టీ ప్రజాప్రతినిధి అయిన ఉదయ్‌వీర్ సింగ్ లేఖ రాస్తూ.. ములాయం రెండో భార్య కుటుంబమే సీఎం అఖిలేశ్‌ను టార్గెట్ చేస్తున్నదని తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. డింపుల్.. అపర్ణ! అపర్ణ యాదవ్ పోటీచేయబోతున్న లక్నో కంటోన్మెంట్ స్థానం నుంచి ప్రస్తుతం రీటా బహుగుణ జోషీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ స్థానంలో ఎస్పీ ఎప్పుడూ గెలువను లేదు. ఏదైనా సులువుగా గెలిచే స్థానంలో తనకు సీటు అపర్ణ ఇవ్వాలని కోరినా.. అది కుదరలేదు. దీంతో ఈ స్థానంలో గెలిచేందుకు అపర్ణ ఇప్పటినుంచే ప్రచారంలో చెమటోడుస్తున్నారు. మరోవైపు అఖిలేశ్ భార్య డింపుల్ సులువుగా ఎంపీగా గెలుపొందిన సంగతి తెలిసిందే. అఖిలేశ్ సవతి సోదరుడు 28 ఏళ్ల ప్రతీక్ మాత్రం ఫిటినెస్ బిజినెస్‌లో కొనసాగుతూ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయితే, ప్రస్తుత సంక్షోభంలో ఆయన పాత్ర కూడా ఉందని అఖిలేశ్ వర్గం ఆరోపిస్తోంది. మొత్తానికి అఖిలేశ్‌ను పార్టీ నుంచి గెంటేయడానికి పరిస్థితులు దారితీశాయంటే అది ములాయం రెండో భార్య సాధన, ఆయన రెండో కోడలు అపర్ణ వల్లేనని ఆయన వర్గం అంటోంది. కోసమెరుపు ఏమిటంటే.. ఎస్పీ నాయకురాలిగా ఎదగాలనుకుంటున్న అపర్ణ ప్రధాని నరేంద్రమోదీ అభిమాని. 2015లో ములాయం మనవడి పెళ్లి సందర్భంగా అపర్ణ, ప్రతీక్ కలిసి మోదీతో దిగిన సెల్ఫీ అప్పట్లో హల్చల్ చేసింది. -
4 గంటలు.. 300 శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
ఉత్తరప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రకటన ఏ నిమిషమైనా రావచ్చు. ప్రకటించిన తక్షణం ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుంది. ఇక అప్పటినుంచి ఎలాంటి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడానికి వీలుండదు. అందుకే యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ జాగ్రత్త పడ్డారు. కేవలం నాలుగంటే నాలుగే గంటల్లో.. ఒక ఐటీ సిటీ, కేన్సర్ ఆస్పత్రి, ఒలింపిక్స్ సైజు స్విమ్మింగ్ పూల్.. వీటన్నింటినీ ఆవిష్కరించారు. ఇంతకుముందు ఎక్కడా, ఎప్పుడూ లేనట్లుగా ఒకేసారి ఏకంగా 50 వేల కోట్ల విలువైన 300 ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఎడాపెడా చేసిపారేశారు. 100 ఎకరాల్లో ఐటీ సిటీ, 983 కోట్లతో కేన్సర్ ఆస్పత్రి, 850 కోట్లతో అంతర్జాతీయ కేంద్రం.. వీటన్నింటి ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. గత నెలలోనే లక్నో నుంచి ఆగ్రా వరకు 302 కిలోమీటర్ల పొడవైన ఎక్స్‌ప్రెస్ వేను ఆయన ప్రారంభించారు. అయితే 10 వేల కోట్ల విలువైన ఆ ప్రాజెక్టు ఇంతవరకు ప్రజలకు అందుబాటులోకి మాత్రం రాలేదు. లక్నో మెట్రో మొదటి దశ ట్రయల్ రన్‌ను ఆయన ప్రారంభించారు గానీ, అది జనానికి అందుబాటులోకి రావడానికి మరికొన్ని నెలలు పడుతుంది. ఈ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీపై ఆయన మండిపడ్డారు. పెద్దనోట్ల రద్దు వల్ల మనం బాగా వెనకబడిపోయామని, యూపీలో అభివృద్ధి శరవేగంగా సాగుతూ.. ఒక్కసారిగా అంతా ఆగిపోయిందని అన్నారు. ప్రజలకు డబ్బులు అందట్లేదని, దాంతో ప్రాణాలు కోల్పోతున్నారని వ్యాఖ్యానించారు. -
రథాలతో నిండిపోతున్న రోడ్లు
ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో రాజకీయ వేడి రాజుకుంటోంది. రోడ్లన్నీ రథాలతో నిండిపోతున్నాయి. ఒకవైపు ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తన భారీ హైటెక్ బస్సుతో ప్రచారం ప్రారంభిస్తే, బీజేపీ కూడా ఇప్పటికే పరివర్తన్ యాత్ర పేరుతో ప్రచారపర్వంలో ఉంది. దీనికి తోడు రాష్ట్రవ్యాప్తంగా కూడా చిన్న చిన్న రథాలతో ప్రచారాన్ని వేడెక్కించాలని బీజేపీ భావిస్తోంది. ఇందుకోసం 400 మినీ రథాలను సిద్ధం చేసింది. ఇంతకుముందు ఎన్నికల రథాలంటే బస్సులనే ఉపయోగించేవాళ్లు. కానీ ఇప్పుడు చిన్న చిన్న నగరాలు, పట్టణాల్లోను, కాలనీల్లో కూడా ప్రచారం చేయడానికి వీలుగా చిన్న కార్లనే కొద్దిగా మార్పుచేర్పులు చేసి, వాటిలో డిజిటల్ ప్రచార పరికరాలను ఏర్పాటుచేసి ప్రచార రంగంలోకి దించారు. బీఎస్పీ, సమాజ్‌వాదీ, కాంగ్రెస్ పార్టీల ప్రత్యర్థులను తలదన్నేలా ఓటర్లను ఆకట్టుకోడానికి భారీ సంఖ్యలో ఉన్న ఈ మినీ రథాలు ఉపయోగపడతాయని బీజేపీ వ్యూహకర్తలు భావిస్తున్నారు. అయితే.. పెద్ద రథాల్లో ఉన్నట్లుగా వీటిలో నాయకులు ఉండరు. కేవలం డిజిటల్ ప్రచార పరికరాలు మాత్రమే ఉంటాయి. ఇవి రాష్ట్రంలోని ప్రధాన పట్టణాలు, గ్రామాలలోని కాలనీల్లో తిరుగుతూ పార్టీ విధానాలను ప్రచారం చేస్తుంటాయి. తొలి దశ ప్రచారంలో ఒక్కోటి 7-8 నిమిషాల చొప్పున ఉండే రెండు పాటలను ప్లే చేస్తారు. వీటిలో ప్రధానంగా మహిళల మీద పెరుగుతున్న నేరాలు, నిరుద్యోగం కారణంగా యువత వలసలు, అధికార పార్టీవాళ్ల భూ ఆక్రమణలు.. తదితర అంశాలుంటాయని బీజేపీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ తెలిపారు. ఆయన ఇక్కడి ఎన్నికలో కేంద్ర, రాష్ట్ర నాయకత్వాల మధ్య సమన్వయం చేస్తున్నారు. ప్రముఖ నేపథ్య గాయకుడు ఉదిత్ నారాయణ్‌తో ఈ పాటలు పాడించారు. 'న గూండారాజ్.. న భ్రష్టాచార్.. అబ్కీ బార్ బీజేపీ సర్కార్' అనే నినాదాన్ని ప్రచారం చేస్తున్నారు. దాంతోపాటు 'పూర్ణ బహుమత్, సంపూర్ణ వికాస్, భాజపా పర్ హై విశ్వాస్' అనే మరో నినాదం కూడా ప్రచారంలో ఉంది. -
ప్రస్తుత ముఖ్యమంత్రికే మరో చాన్స్
వచ్చే సంవత్సరం జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరు ఉంటారన్నది గందరగోళంగా మారింది. స్వయానా పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ లాంటి వాళ్లు ఎవరూ ఆటోమేటిగ్గా సీఎం అభ్యర్థులు కాబోరని చెప్పి అందరినీ అయోమయంలో పారేశారు. అయితే.. ఆయన సన్నిహిత అనుచరుడు ఒకరు మాత్రం 2017 ఎన్నికల్లో సీఎం అభ్యర్థి అఖిలేష్ యాదవేనని కుండ బద్దలుకొట్టారు. ములాయం సింగ్ యాదవ్‌కు అత్యంత సన్నిహిత అనుచరుడైన కిరణ్మయ్ నందా ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు అఖిలేష్ యాదవ్‌ను ఇంతకుముందు గట్టిగా వ్యతిరేకించిన పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు శివపాల్ యాదవ్ కూడా రాబోయే ఎన్నికల్లో అఖిలేష్‌నే ముఖ్యమంత్రి అభ్యర్థిగా తాను సమర్థిస్తానని చెప్పారు. ఇదిలా ఉండగా పార్టీ సీనియర్ నాయకుడు రాంగోపాల్ యాదవ్ తాజాగా అన్నయ్య ములాయంకు ఒక లేఖ రాశారు. అందులో.. రాష్ట్రంలో ఉన్న మొత్తం 403 సీట్లకు గాను వంద కంటే తక్కువ స్థానాల్లో గెలిస్తే.. దానికి ములాయమే ఏకైక బాధ్యుడు అవుతారని అందులో పేర్కొన్నారు. -
యూపీ ఎన్నికల్లో బీజేపీదే హవా?
వచ్చే సంవత్సరం ఉత్తరప్రదేశ్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 170-183 స్థానాలను గెలుచుకుంటుదని తాజా సర్వేలో తేలింది. దీంతో రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరిస్తుందని అంటున్నారు. అయితే, ఇండియా టుడే - యాక్సిస్ నిర్వహించిన మరో సర్వేలో మాత్రం.. హంగ్ అసెంబ్లీ వస్తుందని అన్నారు. ఆ సర్వే ప్రకారం బీఎస్పీ 115-124 సీట్లతో రెండోస్థానంలో నిలుస్తుందని అంటున్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న సమాజ్‌వాదీ పార్టీకి 94-103 స్థానాలు మాత్రమే వస్తాయని, కాంగ్రెస్ పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినా, 8-12 సీట్లకు మించి గెలుచుకునే పరిస్థితి లేదని అంటున్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థులలో మాత్రం మాయావతికే పెద్దపీట వేస్తున్నారు. ఆమె సీఎం కావాలని 31 శాతం మంది చెబితే, అఖిలేష్ మళ్లీ సీఎం కావానేవాళ్లు 27 శాతమే ఉన్నారు. ములాయం సింగ్ యాదవ్, షీలాదీక్షిత్‌లకు కేవలం ఒక్కోశాతం మద్దతు మాత్రమే వచ్చింది. అదే ప్రియాంకను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తామంటే మాత్రం ఆమెకు 2 శాతం మంది మద్దతు చెబుతున్నారు. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు 18 శాతం మంది, యోగి ఆదిత్యనాథ్‌కు 14 శాతం మంది అండగా ఉన్నారు. ఈసారి ఎన్నికల్లో ప్రధానాంశాలుగా రామ మందిరం, గో సరంక్షణ కనిపిస్తున్నాయి. 2012 ఎన్నికల తర్వాత యూపీలో దళితులపై దాడులు పెరిగాయని 54 శాతం మంది ముక్తకంఠంతో చెప్పారు. -
అబ్బాయికి చుక్కలు చూపిస్తున్న బాబాయి!
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం సమాజ్ వాదీ పార్టీ తాజాగా తొమ్మిది మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. గతంలో టికెట్ ఖరారైన 17మందికి షాకిచ్చి.. వారి స్థానంలో కొత్తవారి పేర్లను వెల్లడించింది. ఈ నిర్ణయాలతో సమాజ్‌వాదీ పార్టీలో రాష్ట్ర అధ్యక్షుడు శివ్‌పాల్ యాదవ్ ఆధిపత్యానికి తెరలేసినట్టు అయింది. రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ వ్యూహాల్లో తనదైన ముద్ర ఉండేలా.. అన్నింటా తన పట్టు నిలుపుకొనేలా శివ్‌పాల్ యాదవ్ పావులు కదుపుతున్నారు. ప్రస్తుతానికి బాబాయి శివ్‌పాల్-అబ్బాయి అఖిలేశ్ మధ్య విభేదాలు సద్దుమణిగి.. అంతా సర్దుకున్నట్టు పైకి కనిపిస్తున్నా.. ఈ ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు మున్ముందు మరింత తీవ్రతరం అయ్యే అవకాశముందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అభ్యర్థుల జాబితాలో మార్పులు చూసి విస్తుపోయిన అఖిలేశ్.. పైకి మాత్రం మార్పుల గురించి తనకు తెలియదని చెప్పారు. టిక్లెట్ల పంపిణీలో మీ పాత్ర ఏమిటి అని అడిగితే.. 'అన్ని హక్కులు వదిలేసుకున్నా... కొందరు వ్యక్తులకు వాటిని అప్పగించా' అంటూ కొంత నిర్వేదంగా బదులిచ్చారు. పార్టీ వ్యవహారాలపై నేరుగా సమాధానం ఇవ్వకుండా.. 'కొందరు వ్యక్తుల చేతుల్లో అధికారం' ఉందంటూ అఖిలేశ్ చేసిన వ్యాఖ్యలు.. ఆయన అసంతృప్తిని చాటుతున్నాయి. ఎస్పీ అధినేత ములాయం తనయుడు అఖిలేశ్, తమ్ముడు శివ్‌పాల్ యాదవ్ మధ్య ఇటీవల తలెత్తిన అంతర్గత పోరు సద్దుమణిగిన సంగతి తెలిసిందే. ఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న అఖిలేశ్‌ను తొలగించి.. ఆ స్థానంలో శివ్‌పాల్‌ను ములాయం నియమించిన సంగతి తెలిసిందే. దీంతో రగిలిపోయిన అఖిలేశ్ తన కేబినెట్లో మంత్రి అయిన శివ్‌పాల్ యాదవ్ శాఖలకు కోత పెట్టారు. దీంతో శివ్‌పాల్ యాదవ్ రాజీనామా చేయడం.. ములాయం జోక్యం చేసుకొని ఆయన శాఖలు తిరిగి ఆయనకు కేటాయించడం, రాష్ట్ర అధ్యక్షుడిగా సోదరుడికి అండగా నిలువడంతో ఈ వివాదం సద్దుమణిగింది. ఈ నేపథ్యంలో అఖిలేశ్ సన్నిహితులను అభ్యర్థుల జాబితా నుంచి తొలగించి శివ్‌పాల్ యాదవ్ ఝలక్ ఇచ్చారు. మాజీ మంత్రి అమర్మణి త్రిపాఠీ కొడుకు, నేరచరిత్ర ఉన్న అమన్మణికి మహారాజ్ గంజ్ జిల్లా నౌతన్వా స్థానం టికెట్ ఇవ్వడం, అఖిలేశ్‌కు సన్నిహితుడైన యువ నాయకుడు అతుల్ ప్రధాన్‌కు ఇచ్చిన టికెట్ వేరొకరికి ప్రకటించడం సీఎంకు ఎదురుదెబ్బలని భావిస్తున్నారు. అఖిలేశ్ ప్రభుత్వమే భార్య మృతికేసులో అమన్మణిపై సీబీఐ దర్యాప్తుకు సిఫారసు చేసింది. అయితే, తనకు సన్నిహితుడైన అమర్మణి కొడుకు అమన్మణికి టికెట్ ఇచ్చితీరాలని శివ్‌పాల్ యాదవ్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. పార్టీ టికెట్ల కేటాయింపు అంశంతో ఎస్పీపై అఖిలేశ్ పట్టు జారిపోతుండగా.. అదే సమయంలో శివ్‌పాల్ తన ఆధిపత్యాన్ని చాటుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మరో 229 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉండటంతో ఈ విషయంలో అబ్బాయి-బాబాయి ఎలాంటి విభేదాలు భగ్గుమంటాయోనని పార్టీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. -
రాజకీయ తీర్థం పుచ్చుకున్న క్రికెటర్
-
రాజకీయ తీర్థం పుచ్చుకున్న క్రికెటర్
లక్నో: భారత పేస్ బౌలర్ ప్రవీణ్‌కుమార్ రాజకీయాల్లో అడుగుపెట్టారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో అధికార సమాజ్‌వాదీ పార్టీ తీర్థాన్ని ఆయన పుచ్చుకున్నారు. యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్ ఆదివారం లక్నోలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రవీణ్‌కుమార్‌కు కండువా కప్పి ఎస్పీలోకి ఆహ్వానించారు. మీరట్‌కు చెందిన ప్రవీణ్‌కుమార్ టీమిండియా తరఫున అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. ఆరు టెస్టులు ఆడిన ప్రవీణ్ 27 వికెట్లు పడగొట్టాడు. 68 వన్డే మ్యాచ్‌లు ఆడి 77వికెట్లు తీసుకున్నాడు. పది టీ-20 మ్యాచ్‌ల్లో ఎనిమిది వికెట్లు సాధించాడు. చివరగా 2012 ఆగస్టులో టీమిండియా సభ్యుడిగా దక్షిణాఫ్రికాతో టీ-20 మ్యాచ్ ఆడాడు. ప్రస్తుతం ఐపీఎల్లో గుజరాత్ లయన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. -
ఎన్నికల్లో డాన్సుల కోసం.. అమ్మాయిల అక్రమ రవాణా
వచ్చే సంవత్సరం ఉత్తరప్రదేశ్ ఎన్నికలు ఉండటంతో.. డాన్సులు వేసే అమ్మాయిలకు డిమాండ్ పెరిగిపోతోంది. దీంతో వేరే రాష్ట్రాల నుంచి అమ్మాయిలను బలవంతంగా ఇక్కడకు తీసుకొస్తున్నారన్న ఆరోపణలు పెరుగుతున్నాయి. ఛత్తీస్‌గఢ్ నుంచి ఇలాంటి అవసరం కోసమే తీసుకొచ్చిన 32 మంది అమ్మాయిలను అలహాబాద్‌లో పోలీసులు రక్షించారు. దీన్ని బట్టి చూస్తే.. ఇక్కడ డాన్సు చేయిస్తున్న అమ్మాయిలంతా ముంబైలోని లైసెన్సుడు బార్ల నుంచి వచ్చిన డాన్స్ గర్ల్స్ మాత్రమే కాదని తెలుస్తోందని పోలీసులు అంటున్నారు. అమ్మాయిల అక్రమ రవాణాను నిరోధించేందుకు కృషిచేస్తున్న శక్తివాహిని అనే స్వచ్ఛంద సంస్థకు చెందిన రిషికాంత్ యూపీలో ఈ వ్యవహారంపై గట్టిగా పోరాడుతున్నారు. తాను త్వరలోనే దీనిపై ఎన్నికల కమిషన్‌కు లేఖ రాస్తానని, ఎన్నికల ప్రచారంలో అమ్మాయిల డాన్సులు ఏర్పాటుచేయకుండా చూడాలని కోరతానని తెలిపారు. యూపీలో ఎలాంటి అనుమతులు లేకుండా నడుస్తున్న డాన్స్ ట్రూపులు చాలా ఉన్నాయన్నారు. చాలావరకు డాన్సులు రాత్రిపూటే జరుగుతాయని, అందువల్ల ఆ తర్వాత వారితో ఎలాంటి పనులు చేయిస్తున్నారనేది కూడా చెప్పలేమని.. ఈ అమ్మాయిలను ఎక్కడి నుంచి తెస్తున్నారో తెలియదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వాళ్లకు కనీసం తిండి సరిగ్గా పెడుతున్నారా, జీతాలు ఇస్తున్నారా లేదా అని పర్యవేక్షించేందుకు ఎలాంటి వ్యవస్థలు లేవని తెలిపారు. ఉత్తరప్రదేశ్, బిహార్ రాష్ట్రాల్లో ఎలాంటి ఫంక్షన్లు జరిగినా వాటిలో అమ్మాయిల డాన్సులు సర్వసాధారణం. పిల్లలు పుట్టినప్పుడు, పెళ్లిళ్లలో కూడా వీటిని ఏర్పాటుచేస్తారు. అయితే ఎన్నికల సమయంలో తమ ర్యాలీలకు జనాన్ని ఆకట్టుకోడానికి రాజకీయ నాయకులు చాలా పెద్ద స్థాయిలో ఈ డాన్సులు ఏర్పాటు చేస్తారు. అలహాబాద్‌లో శక్తివాహిని సంస్థ సాయంతో పోలీసులు రక్షించిన 32 మంది అమ్మాయిల్లో 14 ఏళ్ల బాలిక కూడా ఉంది. తమతో అర్ధరాత్రి వరకు డాన్సులు చేయిస్తున్నారని, డ్రగ్స్ ఇచ్చి ఆ తర్వాత విటుల వద్దకు పంపుతున్నారని కొందరు అమ్మాయిలు తెలిపారు. ఛత్తీస్‌గఢ్ నుంచి చాలా మంది అమ్మాయిలు ఇళ్లలో పనిమనుషులుగాను, పొలాల్లో కూలీలుగాను చేయడానికి వేర్వేరు ప్రాంతాలకు వెళ్తుంటారు. ఎక్కువగా హరియాణా, పంజాబ్ రాష్ట్రాల్లో పనులకోసం వీళ్లు వెళ్తారు. కానీ, ఈసారి ఎన్నికల్లో డబ్బులు ఎక్కువ వస్తాయన్న ఉద్దేశంతో యూపీ వెళ్తున్నారని బలోద్ జిల్లా ఎస్పీ ఆరిఫ్ షేక్ చెప్పారు. చిన్న వయసు అమ్మాయిలు బాగా పుష్టిగా కనిపించడానికి వాళ్లకు స్టెరాయిడ్లు కూడా ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇంత దారుణాలకు పాల్పడుతుండటంతో దీనికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం తక్షణం కనిపిస్తోంది. -
మాయావతి మంత్రం పారుతుందా?
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది మొదట్లో జరుగనున్న ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు సాధించేందుకు బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత మాయావతి వ్యూహాత్మకంగా ముందుకు కదులుతున్నారు. ఆగ్రా సభలో ఆదివారం నాడు ఆమె మాట్లాడిన తీరు ఇందుకు అద్దం పడుతోంది. రాష్ట్రంలో 40 శాతం ఉన్న దళితులు-ముస్లింల కాంబినేషను క్యాష్ చేసుకోవడమే సరైన వ్యూహంగా ఆమె ముందుకు కదులుతున్నారు. బ్రాహ్మణుల పక్షాన నిలిచే భారతీయ జనతా పార్టీయే ప్రధాన లక్ష్యంగా విమర్శల వర్షం కురిపించినా ఆమె కాంగ్రెస్ పార్టీని ఒక్క పల్లెత్తు మాట అనలేదు. కాంగ్రెస్ పార్టీ పట్ల సానుకూలంగా ఉన్న ముస్లిం వర్గాలను దరిచేర్చుకోవాలనుకోవడమే అందుకు కారణం. యూపీలో 22 శాతం మంది దళితులు ఉండగా, 18 శాతం మంది ముస్లింలు ఉన్నారు. వీరిలో మెజారిటీ ప్రజలు బీఎస్పీ పక్షాన నిలబడితే ఆమె రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడం అంతకష్టమేమి కాకపోవచ్చు. 2007లో మాయావతి అధికారంలోకి వచ్చినప్పుడు ఆమె దళితులు, ముస్లింలులతోపాటు బ్రాహ్మణులను కూడా ఆకర్షించడం కోసం బహుజన పార్టీని ‘సర్వ జన్’ పార్టీగా అభివర్ణించారు. అప్పుడు బ్రాహ్మణులు కూడా ఆమెకు ఎక్కువగానే ఓట్లు వేశారు. ఆ ఎన్నికల్లో ఆమె పార్టీ 30.43 శాతం ఓట్లతో రాష్ట్రంలోని 403 స్థానాలకుగాను 206 స్థానాలను గెలుచుకున్నారు. ఆ ఎన్నికల్లో ఆమె బ్రాహ్మణ సామాజిక వర్గానికి కూడా 50 సీట్లను కేటాయించారు. అయితే ఆ తర్వాత ఆమె అధికారంలోకి వచ్చాక బ్రాహ్మణులకు కూడా సముచిత స్థానం కల్పించేందుకు ప్రయత్నించగా దళితులు ఆమెకు దూరమయ్యారు. వారు ఆ తర్వాత ఎన్నికల్లో ఎస్పీకి దగ్గరవడంతో మాయావతి ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. అలాంటి పొరపాటు ఈసారి చేయకూడదని ఆమె భావిస్తున్నట్లు ఉన్నారు. దళితులు, ఇతర వెనకబడిన వర్గాలు, ముస్లింల సమీకరణే లక్ష్యంగా ముందుకు కదలాలని భావిస్తున్నారు. గో సంరక్షణ పేరిట దళితులపై గుజరాత్ తదితర ప్రాంతాల్లో జరుగుతున్న దాడులను, వ్యతిరేకంగా దళితుల ఆందోళన చేస్తున్న అంశాలను ఉపయోగించుకుంటున్నారు. ప్రత్యక్షంగా ఆమె బ్రాహ్మణుల లక్ష్యంగా ఆరోపణలు చేయకపోయినప్పటికీ గో రక్షకుల దాడులను బీజేపీ వక్రీకరిస్తోందని విమర్శించారు. ఆగ్రా సభ ఇచ్చిన స్ఫూర్తితో ఆమె ఆజంగఢ్, సహరాన్పూర్, అలహాబాద్ నిర్వహించే పార్టీ సభల్లో ప్రసంగించేందుకు సమాయత్తమవుతున్నారు. -
ముందుకు నడిపించేందుకు మేం సిద్ధం
యూపీని ముందుకు నడిపించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, అయితే అందుకు రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో పాటు గంగా నది కృప కూడా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌లో ఆయన యూపీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. జాతీయ కార్యవర్గ సమావేశం తర్వాత బీజేపీ నిర్వహించిన అత్యంత భారీ సభ ఇది. ఈ సభతో ప్రచార పర్వానికి మోదీ శ్రీకారం చుట్టారు. ఈ ర్యాలీలో పార్టీ అగ్రనేతలు ఎల్కే అద్వానీ, రాజ్‌నాథ్ సింగ్, మనోహర్ పరికర్, ఉమాభారతి తదితరులు పాల్గొన్నారు. గత రెండేళ్లలో బీజేపీ ఎన్నో విజయాలు సాధించిందని, తాను ఏ దేశం వెళ్లినా ఏదో ఒక ప్రయోజనం చేకూరుతోందని మోదీ చెప్పారు. అయితే ఆ ఘనత మోదీది కాదని.. భారతదేశానిదని ఆయన అన్నారు. ఇక గంగానది ఒక నది కాదని.. అది ఒక ఆలోచనా స్రవంతి అని చెప్పారు. ప్రపంచం మన దేశం గురించి మాట్లాడుతోందంటే అందుకు ఉత్తరప్రదేశే కారణమని తెలిపారు. అభివృద్ధి కావాలంటే వంశ పారంపర్య పాలనకు స్వస్తి పలకాలని చెప్పారు. యూపీలో ఇంతకుముందు కళ్యాణ్ సింగ్, రాజ్‌నాథ్‌సింగ్‌ల హయాంలో అద్భుతమైన అభివృద్ధి సాధ్యమైందని, అదంతా ఇప్పుడు ఏమైపోయిందని ప్రశ్నించారు. -
లిస్టు ఇస్తేనే అసెంబ్లీ టికెట్లు!
వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిబద్ధత కలిగిన కార్యకర్తల జాబితా ఇవ్వని నేతలకు అసెంబ్లీ టికెట్లు ఇచ్చేది లేదని కాంగ్రెస్ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత కిషోర్ హెచ్చరించారు. 2017 సంవత్సరంలో జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటినుంచే వ్యూహాలు సిద్ధం చేస్తున్న ఆయన.. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల నేతలకు లేఖలు రాశారు. ఈ లేఖలను యూపీసీసీ ఒకటి రెండు రోజుల్లో నేతలకు పంపనుంది. దాని ప్రకారం ప్రతి నియోజకవర్గంలో పార్టీ పట్ల నిబద్ధత కలిగిన 20 మంది కార్యకర్తల జాబితాను ఇవ్వాల్సి ఉంటుంది. అలా జాబితా ఇవ్వనివాళ్లకు ఎట్టిపరిస్థితుల్లో టికెట్లు ఇచ్చేది లేదని ప్రశాంత కిషోర్ స్పష్టం చేశారు. ప్రతి బూత్ వారీగా కార్యకర్తల జాబితాలు కావాల్సిందేనని వారణాసిలో ఇటీవల జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో కూడా చెప్పారు. ఎన్నికలకు తగిన వాతావరణాన్ని సిద్ధం చేస్తానని, అయితే అందుకు యూపీ కాంగ్రెస్ నేతల నుంచి సహకారం కావాలని ఆయన అన్నారు. లిస్టు ఇవ్వకుండా టికెట్ కావాలంటే కుదరదని, రాహుల్ వద్దకు వెళ్లినా ఆయన కూడా కార్యకర్తల బలం లేకుండా నెగ్గలేమన్న విషయాన్ని అంగీకరిస్తారని తెలిపారు. పార్టీ బలంగా ఉన్నచోటల్లా నేతలు ర్యాలీలు చేయాలని.. అయితే ఏ నియోజకవర్గం కూడా బలమైనది, బలహీనమైనదని చెప్పలేమని అన్నారు. గుజరాత్లో గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీ కంటే కాంగ్రెస్‌కు నాలుగు సీట్లు ఎక్కువ వచ్చినా, పట్టణ ప్రాంతాలపై దృష్టి పెట్టకపోవడంతో ఓటమి చవిచూడాల్సి వచ్చిందన్నారు. యూపీ మహిళా కాంగ్రెస్ నేతలు కూడా నియోజకవర్గాల వారీగా కార్యకర్తల జాబితా ఇవ్వడం లేదని ప్రశాంత కిషోర్ మండిపడ్డారు. దళితుల ఓటుబ్యాంకు బీఎస్పీకి ఉందని భయపడాల్సిన అవసరం లేదని, అదే ఉంటే గత లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు రెండు సీట్లు వచ్చి, బీఎస్పీకి ఒక్కటీ ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ప్రతి పార్టీలోనూ విభేదాలు ఉంటాయని.. అలాగే కాంగ్రెస్‌లో కూడా ఉన్నాయని, దానిగురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. -
యూపీ సీఎం అభ్యర్థిగా ప్రియాంక గాంధీ!
రానున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా సోనియా గాంధీ కూతురు ప్రియాంక గాంధీని రంగంలోకి దించాలనే వాదన పార్టీలో బలంగా వినిపిస్తోంది. ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఇలాంటి వాదన రావడం సహజమే అయినా, గత పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని మూటకట్టుకున్న నేపథ్యంలో ప్రియాంక గాంధీ ఎన్నికల బరిలోకి దిగడం కలసి వస్తుందన్న ప్రచారం బాగా జరగుతోంది. గత పార్లమెంట్ ఎన్నికల్లోనే ఆమెను ఎన్నికల సమరంలోకి తీసుకొచ్చి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదని కూడా పార్టీ వర్గాలు అంటున్నాయి. యూపీ ఎన్నికల ప్రచారానికి ప్రధాన వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్‌ను తీసుకొస్తున్న నేపథ్యంలో ప్రియాంక గాంధీని కూడా రంగంలోకి దింపితే విజయావకాశాలు బాగా మెరుగుపడతాయని ఆమె నాయకత్వాన్ని కోరుకుంటున్న పార్టీ వర్గాలు వాదిస్తున్నాయి. ఈ విషయంలో అధికారికంగా పార్టీ నుంచి ఎలాంటి ఫీలర్లు వెలువడలేదు. -
యూపీ ఎన్నికల్లో మహాకూటమి?
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి 2017లో జరిగే ఎన్నికల్లో వివిధ పార్టీలతో పొత్తులు పెట్టుకుని, మహాకూటమిగా పోరాడే అవకాశం ఉందని యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ చెప్పారు. అయితే ఏయే పార్టీలతో పొత్తులు ఉండొచ్చనే విషయాన్ని మాత్రం ఆయన వివరించలేదు. అయితే, సమాజ్‌వాదీ - బీఎస్పీల మధ్య పొత్తు ఉండొచ్చని ఆ రాష్ట్రానికి చెందిన మంత్రి ఫరీద్ మహఫూజ్ కిద్వాయ్ అంతకుముందు వ్యాఖ్యానించారు. ఈ రెండు పార్టీల మధ్య ఇప్పటివరకు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. అయితే, బిహార్‌లో అంతకుముందు కూడా జేడీయూ - ఆర్జేడీల మధ్య అలాంటి పరిస్థితే ఉన్నా.. ఆ రెండు పార్టీలు కూటమిగా పోటీ చేస్తే సత్ఫలితాలు వచ్చిన విషయాన్ని ఆ మంత్రి గుర్తుచేశారు. బిహార్ తరహాలోనే.. గత సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో కూడా బీజేపీ అత్యధిక స్థానాలు గెలుచుకుంది. దాదాపు 15 ఏళ్ల తర్వాత ఆ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని ఆ పార్టీ భావిస్తోంది. బిహార్ ప్రజలు అభివృద్ధికే ఓటు వేశారని సీఎం అఖిలేష్ యాదవ్ అన్నారు. యూపీ పంచాయతీ ఎన్నికల్లో కూడా తమ పార్టీ అభివృద్ధి ఎజెండాకు మద్దతు ఇచ్చారని తెలిపారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తాము ఈ ఎజెండాతోనే పోటీకి దిగుతామని చెప్పారు.