యూపీ ఐదో దశలో 57 శాతం పోలింగ్
లక్నో: ప్రతిష్టాత్మక ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఐదో దశ పోలింగ్‌లో 57.36% ఓటింగ్ నమోదైనట్టు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధి కారి టి.వెంకటేశ్ చెప్పారు. సోమవారం 11 జిల్లాల్లోని 51 స్థానాలకు జరిగిన ఈ దశ పోలింగ్‌లో మొత్తం 607 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. కీలకమైన అమేథీ, ఫైజాబాద్ ప్రాంతాలు ఈ దశలోనే ఉన్నా యి.
తొలి నాలుగు దశల (వరుసగా 64, 65, 61.16, 61 శాతం) కంటే ఈసారి కాస్త తక్కువ ఓటింగ్ నమోదవడం గమనార్హం. ఎస్పీ అభ్యర్థి చంద్రశేఖర్ కనౌజియా మృతి వల్ల అలాపూర్ స్థానంలో పోలింగ్‌ను మార్చి 9కి ఈసీ వాయిదా వేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పార్లమెంట్ నియో జక వర్గమైన అమేథీలోనూ, కీలకమైన అయోధ్య అసెంబ్లీ స్థానానికి కూడా ఈ దశలోనే పోలింగ్ జరిగింది. బీజేపీ 50, బీఎస్పీ 51, ఎస్పీ 43, దాని మిత్రపక్షం కాంగ్రెస్ మిగిలిన స్థానాల్లో పోటీపడుతున్నాయి.