t.venkatesh
-
యూపీ ఐదో దశలో 57 శాతం పోలింగ్
లక్నో: ప్రతిష్టాత్మక ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఐదో దశ పోలింగ్‌లో 57.36% ఓటింగ్ నమోదైనట్టు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధి కారి టి.వెంకటేశ్ చెప్పారు. సోమవారం 11 జిల్లాల్లోని 51 స్థానాలకు జరిగిన ఈ దశ పోలింగ్‌లో మొత్తం 607 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. కీలకమైన అమేథీ, ఫైజాబాద్ ప్రాంతాలు ఈ దశలోనే ఉన్నా యి. తొలి నాలుగు దశల (వరుసగా 64, 65, 61.16, 61 శాతం) కంటే ఈసారి కాస్త తక్కువ ఓటింగ్ నమోదవడం గమనార్హం. ఎస్పీ అభ్యర్థి చంద్రశేఖర్ కనౌజియా మృతి వల్ల అలాపూర్ స్థానంలో పోలింగ్‌ను మార్చి 9కి ఈసీ వాయిదా వేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పార్లమెంట్ నియో జక వర్గమైన అమేథీలోనూ, కీలకమైన అయోధ్య అసెంబ్లీ స్థానానికి కూడా ఈ దశలోనే పోలింగ్ జరిగింది. బీజేపీ 50, బీఎస్పీ 51, ఎస్పీ 43, దాని మిత్రపక్షం కాంగ్రెస్ మిగిలిన స్థానాల్లో పోటీపడుతున్నాయి. -
విధి ‘లిఖితం.. ‘వెలుగు’పుష్పం
అందమైన లోకాన్ని చూసేందుకు కళ్లు ఇచ్చిన దేవుడు.. కదల్లేని దేహంతో బయటి ప్రపంచానికి దూరం చేశాడు. నవరత్నాలు రాల్చే నవ్వునిచ్చినా.. జీవితంలో సంతోషం లేకుండా చేశాడు. కడుపులో పెట్టుకుని చూసుకునే తల్లిదండ్రలను ఇచ్చినా.. వారికి మనశ్శాంతి లేకుండా చేశాడు. ఆకలేస్తే అడగలేదు.. ఎవరైనా నవ్వితే ఆ సంతోషాన్ని పంచుకోవడం.. ఏడిస్తే తనూ కన్నీళ్లు రాల్చడమే తెలుసు. అమ్మా.. నాన్నా.. ఇరువురు తమ్ముళ్లే ఆ బాలిక లోకం. నవ మాసాలు మోసి కన్న తల్లి ప్రేమను.. తొమ్మిదేళ్లయినా పొందకనే ఆమె ఈ లోకం వీడింది. వెళ్తూ.. ఇరువురి జీవితాల్లో వెలుగు నింపింది. ఎమ్మిగనూరు టౌన్, న్యూస్‌లైన్: పట్టణంలోని రాఘవేంద్ర కాలనీకి చెందిన డ్రైవర్ టి.వెంకటేష్, లక్ష్మీ దంపతులకు ముగ్గురు సంతానం. వీరిది మేనరికం వివాహం. పెద్ద కుమార్తె లిఖిత(9) పుట్టుకతోనే మానసిక, శారీరక వికలాంగురాలు. మరో ఇరువురు కుమారులు గురుసాయి, శీను ఆరోగ్యంగానే ఉన్నారు. లిఖితను చిన్నప్పటి నుంచే అనారోగ్యం చుట్టుముట్టింది. మొదటి సంతానం కావడం.. అందునా ఆడపిల్ల కావడంతో ఇంటికి లక్ష్మీదేవి వచ్చినట్లుగానే భావించారు ఆ దంపతులు. కదల్లేకపోయినా.. కంటికి రెప్పలా చూసుకున్నారు. ఇంట్లో అందరినీ చూసుకోవడం ఒక ఎత్తయితే.. ఈమె బాగోగులు మరో ఎత్తు. కదల్లేని బొమ్మే అయినా.. వారు భారమనుకోలేదు. ఆమె నవ్వుతో కష్టమంతా మర్చిపోయేవారు. తమ ఇంటి దీపం కళ్ల ముందుంటే చాలనుకుని అహర్నిశలు ఒళ్లంతా కళ్లు చేసుకుని చూసుకోసాగారు. విధి ఆ సంతోషాన్ని కూడా దూరం చేసింది.. బుధవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో లిఖిత అనారోగ్యంతో లోకం విడిచింది. తమ పాప చూడలేకపోయిన ఈ లోకాన్ని.. ఆమె కళ్లతో మరో ఇరువురు వీక్షించేలా ఆ తల్లిదండ్రులు నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయంలో స్థానిక శ్రీవివేకానంద ఎడ్యుకేషనల్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ వ్యవస్థాపకుడు తిరుమల ఉపదేశం చేశారు. కూతురు భౌతికంగా దూరమైనా.. నేత్రదానంతో ఆమె రెండు దేహాల్లో జీవించే ఉంటుందని భావించారు. పొంగుకొస్తున్న దుఃఖాన్ని దిగమింగుతూ.. కన్నీటి ధారను కట్టడి చేస్తూ లిఖిత జీవితానికి ఆ దంపతులు సార్థకత చేకూర్చారు. తమ నిర్ణయాన్ని కర్నూలు ప్రభుత్వ ప్రాంతీయ కంటి వైద్యశాల ఇన్చార్జి, జిల్లా అంధత్వ నివారణ శాఖ అధికారి డాక్టర్ ఆంజనేయులుకు ఫోన్ ద్వారా తెలియజేశారు. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో కంటి వైద్యశాల టెక్నిషియన్ శంకర్ ఎమ్మిగనూరుకు చేరుకుని లిఖిత కళ్లను సేకరించారు. మానసిక, శారీరక ఎదుగుదల లేని కూతురిని అన్నీ తామై చూసుకున్న ఆ దంపతులు.. మరణానంతరం కూడా ఆ పాప మరో ఇద్దరి జీవితాలు వెలుగు నింపేలా తీసుకున్న నిర్ణయం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.