కీలక ‘మూడో దఫా’ ముగిసింది..పోలింగ్‌ ఎంతంటే? | Uttar Pradesh elections 3 phase | Sakshi
Sakshi News home page

‘మూడో దఫా’ ముగిసింది.. పోలింగ్‌ ఎంతంటే?

Feb 19 2017 7:37 PM | Updated on Aug 14 2018 5:02 PM

కీలక ‘మూడో దఫా’ ముగిసింది..పోలింగ్‌ ఎంతంటే? - Sakshi

కీలక ‘మూడో దఫా’ ముగిసింది..పోలింగ్‌ ఎంతంటే?

దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతున్న ఉత్తరప్రదేశ్‌ మూడో దఫా ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.

లక్నో: దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతున్న ఉత్తరప్రదేశ్‌ మూడో దఫా ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 69 స్థానాలకు ఆదివారం పోలింగ్‌ జరిగింది. 61.16శాతం ఓటింగ్‌ నమోదైంది. మూడో దఫా పోలింగ్‌లోనే హోంమంత్రి రాజ్‌నాథ్‌ లోక్‌సభ స్థానమైన లక్నో, ఎస్పీకి పట్టున్న కన్నౌజ్, మైన్ పురి, ఇటావా ప్రాంతాలున్నాయి. ఫరూకాబాద్, హర్దోయ్, అవురైయా, కాన్పూర్‌ దేహత్, కాన్పూర్, ఉన్నావో, బరాబంకి, సీతాపూర్‌ తదితర 12 జిల్లాల్లో  పోలింగ్‌ జరిగింది. ఈ ప్రాంతంలో మొత్తం 2.41 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. 826 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

ఇటావా.. ఎస్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయంసింగ్‌ యాదవ్‌ సొంత జిల్లా. ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌ సతీమణి డింపుల్‌యాదవ్‌ కన్నౌజ్‌ ఎంపీ. ఎస్పీ మరో కీలక ఎంపీ తేజ్‌ప్రతాప్ యాదవ్‌ది మైన్ పురి జిల్లా. దీంతో మూడో దఫా అన్ని పార్టీలకూ ప్రతిష్టాత్మకంగా మారింది. 2012 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ 69 స్థానాల్లో ఎస్పీ 55 గెలుచుకుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement