third phase
-
మూడో దశలో 63.53% పోలింగ్
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల మూడో దశలో 93 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో మంగళవారం రాత్రి 10 గంటల వరకు 63.53 శాతం పోలింగ్ నమోదైంది. పశ్చిమబెంగాల్లో జరిగిన స్వల్ప ఘర్షణలు, చెదురుముదురు ఘటనలు మినహా అన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. నిరీ్ణత పోలింగ్ సమయం సాయంత్రం ఆరులోపు క్యూ లైన్లలో నిల్చున్న వారినీ ఓటేసేందుకు అనుమతించారు.దాంతో పోలింగ్ శాతం పెరిగే అవకాశముందని కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం ప్రకటించింది. అస్సాంలో అత్యధికంగా 79.79 శాతం, ఉత్తరప్రదేశ్‌లో అత్యల్పంగా 57.34 శాతం పోలింగ్ నమోదైంది. ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో కాస్తంత మెరుగ్గా 57.62 శాతం పోలింగ్ నమోదవడం గమనార్హం. పశ్చిమబెంగాల్లో పోలింగ్‌బూత్ వద్ద ఘర్షణలు, ఓటర్లను మభ్యపెట్టడం, బూత్ ఏజెంట్లపై దాడులపై టీఎంసీ, బీజేపీ, కాంగ్రెస్–సీపీఐ(ఎం)లు విడివిడిగా ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకున్నాయి.ముర్షీదాబాద్, జాంగీపూర్ స్థానాల నుంచి ఈసీకి ఉదయం 9లోపే 180కిపైగా ఫిర్యాదులందాయి. కొన్ని చోట్ల టీఎంసీ, సీపీఎం కార్యకర్తలు ఘర్షణకు దిగారు. గుజరాత్‌లోని బనస్కాంతా నియోజకవర్గంలో బీజేపీ కార్యకర్తలు సీఆర్పీఎఫ్ జవాన్లలా వచ్చి పోలింగ్‌బూత్ వద్ద ఓటర్లను మభ్యపెట్టారన్న ఉదంతంలో కలెక్టర్ దర్యాప్తునకు ఆదేశించారు. గుజరాత్లో ఓటేసిన ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో ప్రధాని మోదీ ఓటేశారు. గాం«దీనగర్ నియోజకవర్గంలోని అహ్మదాబాద్ నగరంలో ఉన్న నిషాన్ పబ్లిక్ స్కూల్లో ప్రధాని మోదీ ఓటేశారు. గాం«దీనగర్ బీజేపీ అభ్యరి్థ, కేంద్ర మంత్రి అమిత్ షా పోలింగ్ బూత్ వద్ద మోదీకి స్వాగతం పలికారు. ఇదే పోలింగ్‌బూత్‌లో ఓటు ఉండటంతో మోదీ అన్నయ్య సోమాభాయ్ మోదీ సైతం అక్కడికొచ్చారు. దీంతో ఆయన ఆశీర్వాదం తీసుకునే మోదీ ఓటేశారు. ఉదయాన్నే ఓటేసేందుకు వచ్చిన ప్రధానిని కలిసేందుకు ఓటర్లు ఎగబడ్డారు. అమిత్ షా సైతం ఇదే అహ్మదాబాద్‌లో మరో చోట ఓటేశారు. ‘ అన్ని నియోజకవర్గాల్లో వయోబేధంలేకుండా ఓటర్లంతా ఎన్డీఏ, అభివృద్ధి అజెండాపై నమ్మకం ఉంచారు. ఇండియా కూటమి వేగంగా నీరుగారిపోతోంది. ఓటుబ్యాంక్ రాజకీయాలకు స్వస్తిపలికి ఆర్థికాభివృద్ధికి జై కొట్టిన ఓటర్లకు కృతజ్ఞతలు’ అని ఓటేశాక మోదీ ‘ఎక్స్’లో వ్యాఖ్యానించారు. 282 స్థానాల్లో పోలింగ్ పూర్తి అమిత్ షా( గాంధీనగర్), జ్యోతిరాదిత్య సింధియా(గుణ), మన్సుఖ్మాండవీయ(పోర్బందర్), పురుషోత్తం రూపాలా(రాజ్‌కోట్), ప్రహ్లాద్ జోషి(ధార్వాడ్), ఎస్పీసింగ్ బఘేల్(ఆగ్రా) పోటీచేస్తున్న స్థానాల్లోనూ మంగళవారం పోలింగ్ పూర్తయింది. గుజరాత్‌లోని సూరత్‌ను బీజేపీ ఏకగ్రీవంగా గెల్చుకోవడంతో మిగతా 25 స్థానాలకు ఒకేసారి పోలింగ్ జరిగింది. కర్ణాటకలో 14, మహారాష్ట్రలో 11, ఉత్తరప్రదేశ్‌లో 10, ఛత్తీస్‌గఢ్‌లో 7, బిహార్‌లో 5, అస్సాం, పశ్చిమబెంగాల్లో చెరో 4, గోవాలో 2, దాద్రానగర్ హవేలీ, డయ్యూ డామన్‌లో రెండు స్థానాలకు పోలింగ్ జరిగింది. మంగళవారం పోలింగ్ జరిగిన గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్‌లోని మెజారిటీ స్థానాలను 2019లో బీజేపీ కైవసం చేసుకుంది. మూడో దశ పోలింగ్ ముగియడంతో మొత్తం 543 స్థానాలకుగాను ఇప్పటిదాకా 282 స్థానాలకు పోలింగ్ పూర్తయింది. తొలి దశలో 66.14 శాతం, రెండో దశలో 66.71 శాతం పోలింగ్ నమోదైంది.రాష్ట్రం పోలింగ్ శాతం గుజరాత్ 57.62 కర్ణాటక 70.03మహారాష్ట్ర 61.44 ఉత్తరప్రదేశ్ 57.34 మధ్యప్రదేశ్ 66.05ఛత్తీస్‌గఢ్ 70.05 బిహార్ 58.16 అస్సాం 79.79 బెంగాల్ 73.96 గోవా 75.13 దాద్రానగర్, హవేలీ, డయ్యూడామన్ 68.89 -
Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్ (ఫొటోలు)
-
తెలుగు రాష్ట్రాల్లో బంగారం కొంటున్నారా? ఈ జిల్లాల్లో అమలులోకి కొత్త రూల్స్
బంగారు నగల హాల్‌మార్కింగ్‌కు సంబంధించిన మూడో దశను కేంద్ర ప్రభుత్వం తాజగా ప్రకటించింది. రెండేళ్ల క్రితం గోల్డ్ హాల్‌మార్కింగ్ (Gold Hallmarking) నిబంధనల్ని ప్రకటించిన కేంద్రప్రభుత్వం దేశవ్యాప్తంగా జిల్లాలవారీగా దశలవారీగా అమలు చేస్తూ వస్తోంది. ఇప్పటికి రెండు దశలను అమలు చేసిన ప్రభుత్వం తాజాగా మూడో దశలో 16 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 55 కొత్త జిల్లాల్లో హాల్‌మార్కింగ్ తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గోల్డ్ హాల్‌మార్కింగ్ అనేది బంగారం, బంగారు ఆభరణాల స్వచ్ఛత ధ్రువీకరణ ప్రమాణం. 2021 జూన్ 16 వరకు ఇది స్వచ్చందంగా ఉండేది. ఆ తర్వాత ప్రభుత్వం దశలవారీగా గోల్డ్ హాల్‌మార్కింగ్‌ని తప్పనిసరి చేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన నోడల్ ఏజెన్సీగా బ్యూరో ఆఫ్ ఇండియా స్టాండర్డ్స్ (BIS) వ్యవహరిస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మొత్తం 343 జిల్లాల్లో గోల్డ్ హాల్‌మార్కింగ్ తప్పనిసరి. 2021 జూన్ 23న ప్రారంభించిన మొదటి దశలో 256 జిల్లాలు, 2022 ఏప్రిల్ 4 నుంచి రెండవ దశలో మరో 32 జిల్లాల్లో హాల్ మార్కింగ్ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఇక మూడో దశలో సెప్టెంబర్ 8వ తేదీ నుంచి కొత్తగా మరో 55 జిల్లాల్లో హాల్‌మార్కింగ్‌ను తప్పనిసరి చేస్తూ కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ న నోటిఫికేషన్ జారీ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో జిల్లాలు ఇవే.. కేంద్రప్రభుత్వం మూడో దశలో ప్రకటించిన హాల్‌మార్కింగ్ తప్పనిసరి జిల్లాల జాబితాలో తెలుగు రాష్ట్రాల్లో 9 జిల్లాలు ఉన్నాయి. వీటిలో ఆంధ్రప్రదేశ్‌లో అన్నమయ్య, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, నంద్యాల జిల్లాలు ఉండగా తెలంగాణలో మేడ్చల్ మల్కాజ్గిరి, నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్ జిల్లాలు ఉన్నాయి. ఈ జిల్లాల్లో బంగారు నగలపై హాల్‌మార్కింగ్ తప్పనిసరి. హాల్‌మార్క్ అంటే ఏమిటి? బంగారు నగల స్వచ్ఛతను తెలియజేసే ముద్రనే హాల్‌మార్క్ అంటారు. ఈ హాల్‌మార్కింగ్‌లో మొదట బిస్ లోగో, బంగారం స్వచ్ఛత, వ్యాపారి లోగో, అస్సేయింగ్, హాల్‌మార్కింగ్ సెంటర్ వివరాలు ఉండేవి. కానీ 2023 ఏప్రిల్ 1 నుంచి కొత్త HUID హాల్‌మార్కింగ్ వచ్చింది. ఇందులో మూడు అంశాలు ఉంటాయి. అవి BIS లోగో, ఆభరణం స్వచ్ఛత, ఆరు అంకెల ఆల్ఫాన్యూమరిక్ HUID. ఒక్కో ఆభరణానికి ఒక్కో రకమైన విశిష్ట సంఖ్య ఉంటుంది. -
గ్రాము ఎస్జీబీ ధర రూ.5,409
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మూడో విడత సావరీన్ గోల్డ్ బాండ్ (ఎస్జీబీ) ఇష్యూ 19న ప్రారంభం కానుంది. ఈ నెల 23న ఇష్యూ ముగుస్తుంది. ఇందులో భాగంగా ఒక గ్రాము ఎస్జీబీ ధర రూ.5,409 అని ఆర్బీఐ ప్రకటించింది. అన్ని షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు, పోస్టాఫీసులు, స్టాక్ ఎక్సేంజ్‌ల ద్వారా ఎస్జీబీలను కొనుగోలు చేసుకోవచ్చు. వీటి కాల వ్యవధి ఎనిమిదేళ్లు. పెట్టుబడి నాటికి ప్రకటించిన గ్రాము బంగారం విలువ ఆధారంగా వార్షికంగా 2.5 శాతం వడ్డీ చెల్లింపులు లభిస్తాయి. గడువు తీరిన తర్వాత వచ్చే రాబడి, పెట్టుబడి మొత్తంపై పన్ను ఉండదు. ఒక ఇన్వెస్టర్ కనీసం ఒక గ్రాము నుంచి, గరిష్టంగా 4 కిలోల వరకు కొనుగోలు చేసుకోవచ్చు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని, ఆన్లైన్ పేమెంట్ చేసిన వారికి ఒక గ్రాముపై రూ.50 తగ్గింపు లభిస్తుంది. -
కోవావాక్స్ ‘మూడో దశ’కు నిపుణుల కమిటీ సిఫారసు
న్యూఢిల్లీ: కోవిడ్–19 వ్యాక్సిన్ కోవావాక్స్‌ను బూస్టర్ డోసుగా వినియోగించుకోవడం కోసం మూడో దశ ట్రయల్స్‌కు అనుమతినివ్వాలని ఇండియా సెంట్రల్ డ్రగ్ అథారిటీకి చెందిన నిపుణుల కమిటీ ఆదివారం సిఫారసు చేసింది. వయోజనుల్లో ఈ టీకాను బూస్టర్ డోసుగా వేసుకోవచ్చునని తెలిపింది. ది డ్రగ్స్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అత్యవసర పరిస్థితుల్లో ఈ టీకాను వినియోగించడానికి అనుమతినిచ్చింది. ఇప్పటికే స్పుత్నిక్ వీని కూడా బూస్టర్ డోసుగా వాడడానికి అనుమతులున్నాయి. ఇప్పుడు కొవొవాక్స్ ప్రయోగాలు పూర్తయితే మరో కరోనా టీకా అందుబాటులోకి వస్తుందని అధికార వర్గాలు వెల్లడించాయి. (చదవండి: మెట్రోలో టికెట్ కొని ప్రయాణించిన ప్రధాని మోదీ.. ఎక్కడంటే!) -
AP: రైతన్నల ఖాతాల్లోకి రూ.1036 కోట్ల నగదు జమ
సాక్షి, అమరావతి: వైఎస్సార్ రైతుభరోసా–పీఎం కిసాన్ కింద మూడోవిడత పెట్టుబడి సాయం జమ చేసింది. మొత్తం 50,58,489 మందికి రూ.1,036 కోట్లు జమ చేసింది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి ఈ మొత్తాన్ని రైతుల ఖాతాల్లోకి జమ చేశారు. ఈ మొత్తంతో కలిపి 2021–22 సీజన్లో రూ.6,899.67 కోట్లు జమ కాగా గడిచిన మూడేళ్లలో ఈ పథకం కింద రూ.19,812.79 కోట్లు పెట్టుబడి సాయం అందించినట్లయ్యింది. వైఎస్సార్ రైతుభరోసా–పీఎం కిసాన్ కింద ఏటా మూడు విడతల్లో రూ.13,500 చొప్పున అర్హులైన రైతులకు పెట్టుబడి సాయం అందిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఇప్పటికి రూ.5,863 కోట్లు జమ 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇప్పటికే రెండు విడతల్లో 50.37 లక్షల రైతు కుటుంబాలకు రూ.5,863.67 కోట్లు జమచేశారు. ఈ మొత్తంలో వైఎస్సార్ రైతుభరోసా కింద రూ.3,848.33 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం జమచేయ గా, పీఎం కిసాన్ కింద రూ.2,015.34 కోట్లు కేంద్రం కేటాయించింది. లబ్ధిపొందిన వారిలో 48,86,361 మంది భూ యజమానులు కాగా, 82,251 మంది ఆర్ఓఎఫ్ఆర్–దేవదాయ భూము లు సాగుచేస్తున్న రైతులతోపాటు 68,737 మంది కౌలుదారులున్నారు. భూ యజమానులకు రూ.7,500 చొప్పున రైతుభరోసా కింద రాష్ట్ర ప్రభుత్వం జమచేయగా, పీఎం కిసాన్ కింద కేంద్రం అందించిన రూ.4వేలు సర్దుబాటు చేసింది. ఇక తొలిరెండు విడతల్లో అర్హత పొందిన 1,50,988 మంది కౌలుదారులు, ఆర్ఓఎఫ్ఆర్ రైతులకు మాత్రం రెండు విడతల్లో రూ.11,500 చొప్పున రైతుభరోసా కింద రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా జమచేసింది. ఇప్పుడు మూడో విడతలో ఇలా.. ఇక మూడో విడతలో 48,86,361 మంది భూ యజమానులకు పీఎం కిసాన్ కింద రూ.2వేల చొప్పున రూ.977.27 కోట్లు జమచేయనుండగా, గతంలో అర్హత పొందిన 1,50,988 మంది ఆర్ఓఎఫ్ఆర్, కౌలుదారులకు రూ.2వేల చొప్పున వైఎస్సార్ రైతుభరోసా కింద రూ.30.20 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం జమచేస్తోంది. కొత్తగా సాగుహక్కు పత్రాలు æ(సీసీఆర్సీ) పొందిన 21,140 మంది కౌలుదారులకు వైఎస్సార్ రైతుభరోసా కింద ఒకేవిడతగా రూ.13,500 చొప్పున రూ.28.53 కోట్లు నేడు రాష్ట్ర ప్రభుత్వం జమచేస్తోంది. మూడు విడతలు కలిపి 2021–22లో 50,58,489 మందికి రూ.6,899.67 కోట్లు పెట్టుబడి సాయం అందించినట్లు అవుతుంది. ఈ మొత్తంలో వైఎస్సార్ రైతుభరోసా కింద రూ.3,907.06 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం జమచేస్తుండగా, పీఎం కిసాన్ కింద రూ.2,992.61 కోట్లు కేంద్రం అందిస్తోంది. లబ్ధిపొందిన వారిలో 48,86,361 మంది భూ యజమానులు, 82,251 మంది ఆర్ఓఎఫ్ ఆర్–దేవదాయ భూముల సాగుదారులు, 89,877 మంది భూమిలేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సాగుదారులున్నారు. ఇక సామాజిక తనిఖీలో భాగంగా రైతు భరోసా లబ్ధిదారుల జాబితాలను ఆర్బీకేల్లో ప్రదర్శించనున్నారు. -
కొనసాగుతున్న జేఈఈ మెయిన్ పరీక్ష మొదటి సెషన్
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్ మూడో విడత పరీక్షలు ఆదివారం మొదలయ్యాయి. జూలై 25 ఉదయం 9 గంటలకు ప్రారంభమైన మొదటి సెషన్ 12 వరకు ఉంటుంది. రెండో సెషన్ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతుంది. ఇక మొదటి, రెండో సెషన్ అభ్యర్థులు గంటలోపు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు తెలిపారు. అడ్మిట్ కార్డుతోపాటు ఫొటో ఐడెంటీటీ కార్డును తప్పనిరిగా తమతో పాటు తెచ్చుకోవాలని పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణలో ప్రతి ఒక్కరూ కరోనా ప్రొటోకాల్ నిబంధనలను పాటించేలా చర్యలు చేపట్టారు. సిబ్బందితో పాటు అభ్యర్థులు విధిగా మాస్కులు ధరించాల్సి ఉంటుంది. సిబ్బందికి గ్లౌజ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. పరీక్ష కేంద్రాలను శానిటైజ్ చేయిస్తున్నారు. కాగా, పరీక్షలకు హాజరయ్యే వారు తమతోపాటు పారదర్శక బాటిల్లో శానిటైజర్ తెచ్చుకోవడానికి అనుమతిస్తున్నారు. సెల్ఫోన్లు, డిజిటల్ వాచీలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించరు. కాగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ (ఐఐఎస్ఈఆర్) తదితర విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ (జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్) మెయిన్ మూడో విడత (జూలై సెషన్) పరీక్షలు ఈ నెల(జూలై) 27 వరకు కొనసాగనున్నాయి. -
కరోనా మూడో దశకు సిద్ధంగా ఉండాలె: కేంద్రమంత్రి వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ: మహమ్మారి కరోనా వైరస్ రెండో దశలో తీవ్రస్థాయిలో విజృంభించడంతో దేశంలో పరిస్థితులు దయనీయంగా మారాయి. కరోనా దెబ్బకు సామాన్యుడితో పాటు ధనిక వర్గాలు కూడా తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంకా రెండో దశ చల్లారక ముందే మూడో దశకు సిద్ధంగా ఉండాలని కేంద్రమంత్రి ప్రజలకు సూచించారు. మూడో దశపై బుధవారం కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రెండో దశ కాకుండా మూడు, నాలుగో దశలు కూడా ఉన్నాయని, వాటికి ప్రజలు సిద్ధంగా ఉండాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హెచ్చరించారు. న్యూఢిల్లీలో బుధవారం జాతీయ మీడియాతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా పై వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాలు మౌలిక సదుపాయలు పెంచుకోవాలని ఈ సందర్భంగా మంత్రి సూచించారు. వైరస్‌పై ప్రజలు ఆందోళన చెందకుండా ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఆక్సిజన్ సరఫరాకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని మంత్రి గడ్కరీ చెప్పారు. మహారాష్ట్రతో పాటు దేశవ్యాప్తంగా ఆక్సిజన్ సరఫరాను వేగవంతం చేస్తామని తెలిపారు. కరోనాను ఎదుర్కొనేలా వైద్య సేవలు పెరగాలని పేర్కొన్నారు. రెమిడెసివర్ కొరత నేపథ్యంలో రోజుకు 30 వేల డోసుల ఉత్పత్తి చేస్తున్నట్లు వివరించారు. చదవండి: కరోనాతో ఒకేరోజు ముగ్గురు ప్రముఖులు కన్నుమూత చదవండి: అమానవీయం: సైకిల్‌పై భార్య మృతదేహం తరలింపు -
ఏపీలో మూడో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఫోటోలు
-
మార్చిలో ‘స్పుత్నిక్ వి’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కోవిడ్–19కి సంబంధించి స్పుత్నిక్ వి టీకాను దేశీయంగా మార్చిలో అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉందని డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ (డీఆర్ఎల్) వెల్లడించింది. ప్రస్తుతం మూడో దశ ట్రయల్స్ కొనసాగుతున్నాయని, ఇవి ముగిశాక అత్యవసర వినియోగం కింద అనుమతుల కోసం (ఈయూఏ) డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ)కి దరఖాస్తు చేసుకోనున్నామని సంస్థ సీఈవో (ఏపీఐ, ఫార్మా సేవల విభాగం) దీపక్ సప్రా తెలిపారు. తొలుత 12.5 కోట్ల మందికి సరిపడా డోసేజీలను అందుబాటులోకి తేనున్నట్లు శుక్రవారం మూడో ్రౖలె మాసిక ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా ఆయన వివరించారు. ధర విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. రష్యాకి చెందిన గమలేయా నేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడీమియాలజీ అండ్ మైక్రోబయాలజీ ఈ çస్పుత్నిక్ వి టీకాను అభివృద్ధి చేసింది. దీన్ని భారత్‌లో పంపిణీ చేసేందుకు, క్లినికల్ ట్రయల్స్ నిర్వహణకు రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (ఆర్డీఐఎఫ్)తో డీఆర్ఎల్ ఒప్పందం కుదుర్చుకుంది. పరిమిత లాభం: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో డీఆర్ఎల్ నికర లాభం రూ. 28 కోట్లకు పరిమితమైంది. కొన్ని ఉత్పత్తులకు సంబంధించి ఊహించని విధంగా పోటీ పెరిగిపోవడం, అనూహ్యంగా ధరలు పతనమవడం వంటి ప్రతికూల పరిణామాల కారణంగా దాదాపు రూ. 600 కోట్లు కేటాయించాల్సి రావడం ఇందుకు కారణమని డీఆర్ఎల్ సీఎఫ్‌వో పరాగ్ అగర్వాల్ తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో కంపెనీ రూ. 538 కోట్ల నష్టం ప్రకటించింది. మరోవైపు, తాజా సమీక్షా కాలంలో ఆదాయం 12 శాతం పెరిగి రూ. 4,397 కోట్ల నుంచి రూ. 4,942 కోట్లకు పెరిగింది. మార్జిన్లను కాపాడుకుంటూ వృద్ధి కొనసాగించగలిగామని సంస్థ సహ చైర్మన్, ఎండీ జీవీ ప్రసాద్ తెలిపారు. కొత్త ఉత్పత్తుల ఊతంతో మెరుగైన అమ్మకాలు నమోదు చేయగలిగామని డీఆర్ఎల్ సీఈవో ఎరెజ్ ఇజ్రేలీ తెలిపారు. జనరిక్స్ ఆదాయం 13 శాతం అప్.. విభాగాల వారీగా చూస్తే గ్లోబల్ జనరిక్స్ ఆదాయం వార్షికంగా 13 శాతం వృద్ధితో రూ. 4,075 కోట్లుగా నమోదైంది. ఇక ఫార్మా సర్వీసులు, యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ (పీఎస్‌ఏఐ) విభాగం ఆదాయం ఒక్క శాతం వృద్ధితో రూ. 701 కోట్లకు చేరింది. ఉత్తర అమెరికా మార్కెట్ 9 శాతం (1,739 కోట్లు), భారత మార్కెట్ 26 శాతం వృద్ధి (సుమారు రూ. 959 కోట్లు) నమోదు చేశాయి. శుక్రవారం బీఎస్ఈలో డీఆర్ఎల్ షేరు సుమారు ఆరు శాతం క్షీణించి రూ. 4,599 వద్ద క్లోజయ్యింది. -
ఢిల్లీలో కరోనా విజృంభణ
దేశమంతటా కరోనా మహమ్మారి వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతుండగా, రాజధాని ఢిల్లీలో మాత్రం ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా పోయింది. కరోనా బెంబేలెత్తిస్తోంది. నిత్యం వేల సంఖ్యలో కొత్త పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దాదాపు 100 మంది దాకా మృత్యువాత పడుతున్నారు. ఢిల్లీలో ఇప్పటిదాకా 8,041 మందిని కరోనా వైరస్ బలి తీసుకుంది. న్యూఢిల్లీ: భారత్‌లో సెప్టెంబర్‌లో కరోనా వ్యాప్తి గరిష్ట స్థాయికి చేరింది. అప్పటి నుంచి తీవ్రత తగ్గుతోంది. ఢిల్లీలో జూన్, సెప్టెంబర్‌లో గరిష్ట స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నవంబర్ 11న ఒక్క రోజులో రికార్డు స్థాయిలో 8,593 కొత్త కేసులు నమోదయ్యాయి. నవంబర్ 18న ఒక్కరోజులోనే 131 మంది కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారు. నవంబర్ 19న 7,546 కొత్త కేసులు బయటపడ్డాయి, 98 మంది మరణించారు. గత వారం రోజుల్లో దేశవ్యాప్తంగా కరోనా కారణంగా సంభవించిన మొత్తం మరణాల్లో 21 శాతం మరణాలు ఢిల్లీలోనే చోటుచేసుకోవడం గమనార్హం. రాజధానిలో థర్డ్ వేవ్ ఢిల్లీలో కరోనా థర్డ్ వేవ్ కొనసాగుతోందని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. కరోనా కట్టడికి కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మాస్కు ధరించని వారికి జరిమానాను రూ.500 నుంచి ఏకంగా రూ.2,000కు పెంచేశారు. వివాహానికి 200 మంది అతిథులు హాజరుకావొచ్చంటూ గతంలో ఇచ్చిన అనుమతిని వెనక్కి తీసుకున్నారు. జన సంచారం అధికంగా ఉండే మార్కెట్లను మూసివేయాలంటూ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ఢిల్లీలో పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో కేంద్ర హోం శాఖ సైతం రంగంలోకి దిగింది. నవంబర్ ఆఖరి వరకు ప్రతిరోజూ 60,000 ఆర్టీ–పీసీఆర్ టెస్టులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఆసుపత్రుల్లో పడకల సంఖ్య, వసతులు భారీగా పెంచాలని కోరింది. పేదలే సమిధలు రాజధానిలో ప్రధానంగా కనిపించేది అధిక జనాభా. కరోనా విస్తరణకు ఇదొక ముఖ్య కారణమన్నది నిపుణుల మాట. కరోనా వి జృంభిస్తున్నా పేదలు ఇళ్లలోనే ఉండిపోయే పరిస్థితి లేదు. జీవనం కోసం బయటకు అడుగు పెట్టాల్సి వస్తోంది. ఢిల్లీలో ఇటీవల పేదలే ఎక్కువగా కరోనా బారినపడుతున్నారు. ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాప్తి చెందుతోంది. పనుల కోసం ఇళ్ల నుంచి బయటకు వస్తున్న పేదలకు కరోనా సోకుతోందని ప్రఖ్యాత ఎపిడెమాలజిస్టు డాక్టర్ జయప్రకాశ్ ములియిల్ చెప్పారు. పేద వర్గాలు నివసించే ప్రాంతాల్లో జన సాంద్రత అధికంగా ఉండడం కరోనా వ్యాప్తికి అనుకూల పరిణామమే. ఢిల్లీలోనే ఎందుకు? దేశంలో అక్టోబర్, నవంబర్ నెలల్లో పండుగలు అధికంగా జరుగుతాయి. పండుగ సీజన్లో కరోనా వ్యాప్తి పెరిగే అవకాశం ఉందని నిపుణులు ముందునుంచే హెచ్చరిస్తున్నారు. ఢిల్లీ మినహా దేశవ్యాప్తంగా పండుగల సమయంలో కరోనా వ్యాప్తి పెద్దగా లేదని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కేవలం ఢిల్లీలోనే మహమ్మారి ఎందుకు పడగ విప్పుతోందన్న ప్రశ్నలకు నిపుణులు రకరకాల సమాధానాలు చెబుతున్నారు. నగరం ఒక గ్యాస్ చాంబర్ ఢిల్లీలో చలికాలం ప్రారంభం కాగానే కాలుష్యం స్థాయి పెరిగిపోయింది. పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను దహనం చేస్తున్నారు. ఆ పొగంతా ఢిల్లీని కమ్మేస్తోంది. గాలి వేగం తగ్గిపోయింది. ఢిల్లీ నగరం ఒక గ్యాస్ చాంబర్‌లా మారిందని చెప్పొచ్చు. నగరంలో కరోనా కేసుల పెరుగుదలకు వాయు కాలుష్యం కూడా ఒక ముఖ్యమైన కారణం. దీనికి తోడు కరోనా నియంత్రణకు ప్రజలకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం లేదు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కరోనా నియంత్రణకు ఇప్పుడున్న అతిపెద్ద ఔషధం అప్రమత్తతే. వాతావరణం.. కాలుష్యం ఢిల్లీలో చలికాలం అక్టోబర్ చివరి వారంలోనే ప్రవేశించింది. ఈ వాతావరణంలో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉంటుందన్న విషయం తెలిసిందే. ఇళ్లల్లో ఉండే కరోనా బాధితుల నుంచి వైరస్ ఇతరులకు సులభంగా వ్యాపిస్తోందని నిపుణులు అంటున్నారు. అలాగే కాలుష్యం కారణంగా గొంతు, ముక్కు, ఊపిరితిత్తులకు ముప్పు పొంచి ఉందని చెబుతున్నారు. ఫలితంగా కరోనాతోపాటు ఇతర వైరస్లు సులభంగా ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. -
ఏడాదికి 50 కోట్ల డోసులు
న్యూఢిల్లీ: కరోనా వైరస్ నియంత్రణకు భారత బయోటెక్ తయారు చేస్తున్న టీకా కోవాగ్జిన్ మూడో దశ మానవ ప్రయోగాలు త్వరలో ప్రారంభం కానున్నాయి. దేశవ్యాప్తంగా మొత్తం 25–26 వేల మందిపై టీకాను ప్రయోగించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలు, సమర్థత తదితర అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని మూడో దశ మానవ ప్రయోగాలను నిర్వహిస్తున్నామ ని భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి ప్రసాద్ ఓ ఇంగ్లిష్ పత్రికకు తెలిపారు. 25కుపైగా నగరాల్లో ప్రయోగాలు జరగవచ్చునని చెప్పారు. కోవాగ్జిన్ టీకా తయారీ బాధ్యత మొత్తం భారత్ బయోటెక్‌దేనని, టీకా కొనుగోలు కోసం కేంద్రం నుంచి ఎలాంటి హామీ రాలేదని సాయి ప్రసాద్ తెలిపారు. కానీ, ఇప్పటికే కొన్ని డోసులను తయారు చేసి ఉంచామని తెలిపారు. ఏడాదికి 15 కోట్ల టీకా డోసులను తయారు చేయగల సామర్థ్యం ఉండగా దీన్ని 50 కోట్ల డోసులకు పెంచేందుకు హైదరాబాద్, మరో చోట ఫ్యాక్టరీలను సిద్ధం చేస్తున్నామన్నారు. టీకాలను భద్రపరిచే శీతల వ్యవస్థలు హైదరాబాద్, బెంగళూరు, అంకాలేశ్వర్‌లలో ఉన్నాయన్నారు. తమ టీకా కొనుగోలుకు 20 దేశాలు ఆసక్తి కనబరిచాయని చెప్పారు. 50 వేల లోపే కేసులు దేశంలో గత 24 గంటల్లో 50 వేల కంటే తక్కువ కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ నెలలో 50 వేల కంటే తక్కువ కేసులు నమోదు కావడం ఇది రెండోసారి. సోమవారం 45,148 కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 79,09,959కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. అదే సమయంలో 480 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,19,014కు చేరుకుందని ఆరోగ్య శాఖ తెలిపింది. కాగా, దేశంలో మొత్తం రికవరీల సంఖ్య 71,37,228 కు చేరుకోగా, యాక్టివ్ కేసుల సంఖ్య 6,53,717గా ఉంది. మొత్తం కరోనా కేసుల్లో యాక్టివ్ కేసులు 8.26 శాతం ఉన్నాయి. కరోనా రోగుల రికవరీ రేటు 90.23 శాతానికి పెరిగినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. మరణాల శాతం 1.50గా ఉంది. -
ఆరునెలల్లో ఆక్స్ఫర్డ్ టీకా
లండన్: ఈ యేడాది చివరి నాటికి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేస్తున్న కరోనా వ్యాక్సిన్‌కి అనుమతులొచ్చే అవకాశం ఉందని, ఆరు నెలల్లోపు వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమయ్యే అవకాశం ఉందని బ్రిటన్ మీడియా తెలిపింది. ప్రముఖ ఔషధ కంపెనీ ఆస్ట్రాజెనెకాతో కలిసి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చేపట్టిన ప్రయోగాలు చివరి దశలో ఉన్నాయని, క్రిస్మస్‌నాటికి అనుమతులొచ్చే అవకాశం ఉందని మీడియా తెలిపింది. వ్యాక్సిన్‌కి అనుమతులొచ్చిన తరువాత, వృద్ధులకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఆరు నెలల లోపు అమలు చేయనున్నట్లు ఆ రిపోర్టు పేర్కొంది. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఆరు నెలల్లోపు, లేదా అంతకంటే ముందే ప్రారంభించడానికి ప్రయత్నించేలా చూస్తున్నామని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మొదటిగా 65 సంవత్సరాలు పైబడిన వారికి, తరువాత హైరిస్క్, ఇతర తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న యువతరానికి ఈ వ్యాక్సిన్‌ని ఇస్తామని, తర్వాత క్రమంలో 50 ఏళ్ళు పైబడిన వారికీ, అలాగే యువతకు వ్యాక్సిన్ ఇస్తామని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. బ్రిటిష్ ప్రభుత్వం పది కోట్ల ఆక్స్ఫర్డ్ వ్యాక్సి న్ డోస్‌ల కొనుగోలుకి ఆదేశాలిచ్చినట్లు వారు తెలిపారు. మూడోదశ ప్రయోగాలకు అనుమతివ్వండి: రెడ్డీస్ ల్యాబ్స్ రష్యాకు చెందిన స్పుత్నిక్–వీ మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌కు అనుమతి ఇవ్వాల్సిందిగా హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీ డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాను కోరింది. రష్యా తయారు చేసిన వ్యాక్సిన్ స్పుత్నిక్ను భారత్‌లో ప్రయోగించేందుకు, ఉత్పత్తి చేసేందుకు రెడ్డీస్ ల్యాబొరేటరీ రష్యాతో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. కోలుకున్న 90 రోజుల తర్వాతా కరోనా వ్యాప్తి కోవిడ్‌తో తీవ్రంగా ప్రభావితమైన వారి శరీరంలో కోవిడ్ నుంచి కోలుకున్న 90 రోజుల తర్వాత కూడా వైరస్ ఉంటుందని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రవెన్షన్ ఇన్ అట్లాంటా అనే సంస్థ అధ్యయనంలో వెల్లడైంది. అమెరికాలోని వివిధ ఆసుపత్రుల నుంచి రోగుల సమాచారాన్ని సేకరించి సంస్థ విశ్లేషించి చూడగా ఈ విషయం బయటపడింది. వారి ద్వారా ఈ వైరస్ అత్యంత వేగంగా ఇతరులకు వ్యాప్తి చెందే ప్రమాదం ఉన్నదని ఆ అధ్యయనం తెలిపింది. -
నేటి నుంచి లాక్డౌన్ 3.0
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ మూడో విడత నేటి నుంచి అమల్లోకి రానుంది. లాక్డౌన్ అమలుతో ఇప్పటి వరకు సాధించిన ఫలితాన్ని పదిలం చేసుకునేందుకే ఈసారి కొన్నిటిపై ఆంక్షలు..మరికొన్నిటికి మినహాయింపులు ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రతను బట్టి దేశాన్ని రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా విభజించిన కేంద్రం ఈ నెల 17వ తేదీ వరకు లాక్డౌన్ ఆంక్షలను పొడిగించిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా సుమారు 130 రెడ్ జోన్లు, ఆరెంజ్ 284, గ్రీన్ జోన్లు 319 ఉన్నాయి. అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో19, ఆ తర్వాత మహారాష్ట్రలో 14 రెడ్ జోన్లు ఉన్నాయి. జోన్లతో నిమిత్తం లేకుండా దేశవ్యాప్తంగా నిషేధం కొనసాగేవి.. విమాన, రైలు, మెట్రో ప్రయాణాలు. స్కూళ్లు, కాలేజీలు, ఇతర విద్యాసంస్థలు, శిక్షణ, కోచింగ్ సంస్థలు, హోటళ్లు, రెస్టారెంట్లు, సినిమా హాళ్లు, మాల్స్, క్రీడా స్థలాలు, ప్రార్థనా స్థలాలు. సామాజిక, సాంస్కృతిక, రాజకీయ కార్యక్రమాలు, సభలు, సమావేశాలు. ఆ మినహాయింపు వలస కార్మికులకే లాక్డౌన్ కారణంగా వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్న వలస కార్మికులు, పర్యాటకులు, తీర్థయాత్రికులు, విద్యార్థులకు మాత్రమే ప్రయాణ వెసులుబాటు వర్తిస్తుందని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ రాశారు. పని ప్రదేశాల నుంచి గానీ, సొంతూళ్ల నుంచి గానీ వచ్చి..లాక్డౌన్ కారణంగా తిరిగి వెళ్లలేని పరిస్థితుల్లో ఉన్న కార్మికులు, విద్యార్థులు, పర్యాటకుల కోసమే ప్రభుత్వం మినహాయింపు కల్పించిందని తెలిపారు. అంతేతప్ప, సొంతూళ్లకు మామూలుగా వెళ్లేవారికి, సొంతపనులపై వెళ్లేవారికి వర్తించదని స్పష్టత నిచ్చారు. (నేటి నుంచి.. లాక్డౌన్ సడలింపులు) -
జోష్ లేకపాయె!
ప్రాదేశిక ఎన్నికల సమయం సమీపిస్తున్నా.. ఉమ్మడి పాలమూరు జిల్లా బీజేపీ, కాంగ్రెస్‌లో జోష్ కన్పించడం లేదు. ఉమ్మడి జిల్లా పరిధిలో అన్ని జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల నుంచి పోటీకి దిగిన ఇరు పార్టీలు ప్రచారంలో వెనకబడ్డాయి. ఇప్పటికే అసెంబ్లీ, పంచాయతీ ఎన్నికల తర్వాత కోలుకోలేని దెబ్బతిన్న కాంగ్రెస్, బీజేపీ కనీసం ఈ ఎన్నికల్లోనైనా కారును ఢీ కొంటారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ప్రాదేశిక ఎన్నికల ప్రక్రియలో కీలకమైన నామినేషన్ల ప్రక్రియ ముగిసినా ఇంత వరకు జాతీయ పార్టీలకు చెందిన కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు కొందరు మాత్రమే ప్రచారం నిర్వహిస్తున్నారు. తొలి, రెండో విడతల్లో ఎన్నికలు జరిగే మండలాల్లో చాలా చోట్ల ప్రచారపర్వం అంతంత మాత్రంగానే కనబడుతోంది. దీంతో ఎన్నికల ఫలితాలపై ఆయా పార్టీల క్యాడర్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదిలా ఉంటే ఈసారి కూడా ఆశించిన మేరకు ఫలితాలు రాకపోతే రానున్న రోజుల్లో తమ రాజకీయ భవిష్యత్‌పై ఆయా పార్టీలకు చెందిన పలువురు ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలకు బెంగపట్టుకుంది. ఈ నెల 6న నాగర్‌కర్నూల్ జిల్లాలో బిజినేపల్లి, కోడేరు, కొల్లాపూర్, నాగర్‌కర్నూల్, పెద్దకొత్తపల్లి, పెంట్లవెల్లి, తిమ్మాజిపేట జెడ్పీటీసీ స్థానాల్లో ప్రాదేశిక ఎన్నికలు జరగనున్నాయి. అలాగే మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట, జడ్చర్ల, భూత్పూర్, గండేడ్, మిడ్జిల్, బాలానగర్, రాజాపూర్ జెడ్పీటీసీ స్థానాల్లో, వనపర్తి జిల్లా పరిధిలోని వనపర్తి, ఖిల్లాఘనపూర్, గోపాల్పేట, రేవెల్లి, జెడ్పీటీసీ స్థానాలకు, జోగుళాంబ గద్వాల జిల్లాలోని గద్వాల, ధరూర్, కేటీదొడ్డి, గట్టు జెడ్పీటీసీ స్ధానాలు, నారాయణపేట జిల్లా కోస్గి, మద్దూర్ జెడ్పీటీసీ స్ధానాల్లో తొలివిడత ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 10న.. మహబూబ్‌నగర్ జిల్లా మూసాపేట, అడ్డాకుల, దేవరకద్ర, చిన్నచింతకుంట, కోయిలకొండ, మహబూబ్‌నగర్, హన్వాడలో రెండో విడత ఎన్నికలు జరగనున్నాయి. నారాయణపేట జిల్లా మక్తల్, మాగనూరు, కృష్ణ, నర్వ, ఊట్కూర్ జెడ్పీటీసీ స్ధానాలు, గద్వాల జిల్లా అయిజ, మల్దకల్, వడ్డేపల్లి, రాజోలి జెడ్పీటీసీ స్థానాలు, నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ, ఊర్కొండ, కల్వకుర్తి, తాడూరు, తెలకపల్లి జెడ్పీటీసీ స్థానాలు, వనపర్తి జిల్లా పెద్దమందడి, కొత్తకోట, మదనాపురం, ఆత్మకూరు, అమరచింత జెడ్పీటీసీ స్ధానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఆయా స్థానాల్లో ప్రచారవేగాన్ని పెంచారు. తొలి విడత ఎన్నికలు జరిగే జెడ్పీటీసీ స్థానాలతో పాటు వాటి పరిధిలో ఉన్న ఎంపీటీసీ స్థానాల్లోనూ గులాబీ శ్రేణులు గెలుపే ధ్యేయంగా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా దాదాపు సర్పంచులందరూ అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే ఉండడం.. ఆ పార్టీ నుంచి బరిలో ఉన్న అభ్యర్థులకు మద్దతుగా ఎమ్మెల్యేలందరూ ప్రచారాలు నిర్వహిస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు పలు చోట్ల మాత్రమే ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆయా పార్టీల నుంచి బడానాయకులెవరూ వారికి మద్దతుగా పూర్తిస్థాయిలో ప్రచారంలో పాల్గొంటున్న దాఖలాలు కనబడడం లేదు. కాంగ్రెస్‌లో అయోమయం.. జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపికను కాంగ్రెస్ అధిష్టానం ఆయా జిల్లాల పార్టీ అధ్యక్షులకే అప్పగించింది. ఇప్పటికే మండలస్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసి అభ్యర్థుల కసరత్తు పూర్తి చేసిన డీసీసీ అధ్యక్షుడు అభ్యర్థులను ఎంపిక చేశారు. దాదాపు అందరికీ బీ–ఫారాలు అందజేశారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా క్షేత్రస్థాయిలో అధికార పార్టీని ఢీ కొట్టేంత నాయకత్వం ఆయా మండలాల్లో లేకపోవడంతో ఆ పార్టీ నుంచి బరిలో ఉన్న అభ్యర్థులు గెలుపుపై దిగులు పడుతున్నారు. అందుబాటులో ఉన్న మండలస్థాయి నాయకులతో కలిసి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇదీలా ఉంటే ప్రస్తుతం మహబూబ్‌నగర్ జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థిగా అనిరుధ్‌రెడ్డి సోదరుడు దుష్యంత్‌రెడ్డిని ప్రకటించిన కాంగ్రెస్ మిగతా నాలుగు చైర్మన్లను ఖరారు చేయలేదు. కమలం వికసించేనా ? ఉమ్మడి జిల్లాలో అంతంత మాత్రమే ప్రభావం ఉన్న బీజేపీ ప్రాదేశిక ఎన్నికల్లో ఎన్ని స్థానాలు కైవసం చేసుకుంటుంది? లోక్‌సభ ఎన్నికలకు ముందు కాషాయ కండువా కప్పుకున్న కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు డీకే అరుణ ఎంత మంది అభ్యర్థులను గెలిపించుకుంటారో అనే చర్చ మొదలైంది. ప్రస్తుతం డీకే అరుణ నాయకత్వంలో కేవలం గద్వాల, మహబూబ్‌నగర్ జిల్లాల్లో మాత్రమే బీజేపీ నాయకులు ప్రచారం కొంత మేరకు జరుగుతోంది. ఇదిలా ఉంటే జిల్లా పరిషత్ చైర్మన్ల అభ్యర్థుల ప్రకటనలో బీజేపీ ఆచితూచి వ్యవహరిస్తోంది. ఎన్నికల్లో ఎన్ని స్థానాలు వస్తాయో చూసి అందులో బలమైన నాయకుడిని జెడ్పీ చైర్మన్‌గా ప్రకటించాలని ఆ పార్టీ భావిస్తోంది. -
‘మూడు’ ముగిసింది!
సాక్షిప్రతినిధి, ఖమ్మం: మూడో దశ జెడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ గురువారం ముగిసింది. ఏడు జెడ్పీటీసీ, 92 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనుండగా.. భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ల దాఖలుకు గురువారం చివరిరోజు కావడంతో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలుగా పోటీ చేసే వివిధ పార్టీల అభ్యర్థులతో మండల పరిషత్ కార్యాలయాలు కోలాహలంగా మారాయి. 7 జెడ్పీటీసీ స్థానాలకు 79 నామినేషన్లు, 92 ఎంపీటీసీ స్థానాలకు 606 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో ప్రధానంగా టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నుంచి ఎక్కువగా నామినేషన్లు దాఖలు కాగా.. సీపీఎం, సీపీఐ, బీజేపీ, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ పార్టీలు ఆయా ప్రాంతాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ పదవులకు పోటాపోటీగా నామినేషన్లు వేశాయి. జెడ్పీటీసీ స్థానాలకు నామినేషన్లు ఇలా.. 7 జెడ్పీటీసీ స్థానాలకు 79 నామినేషన్లు దాఖలు కాగా.. వాటిలో బీజేపీ నుంచి 5, సీపీఐ 1, సీపీఎం 2, కాంగ్రెస్ 21, టీఆర్ఎస్ 35, టీడీపీ 5, గుర్తింపు పొందిన పార్టీల నుంచి 3, స్వతంత్రులు ఏడుగురు నామినేషన్లు వేశారు. అలాగే 92 ఎంపీటీసీ స్థానాలకు బీజేపీ నుంచి 22, సీపీఐ 32, సీపీఎం 45, కాంగ్రెస్ 157, టీఆర్ఎస్ 267, టీడీపీ 28, గుర్తింపు పొందిన పార్టీల నుంచి 5, స్వతంత్రులు 50 మంది నామినేషన్లు వేశారు. -
మూడో విడత హరితహారం ప్రారంభం..
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూడో విడత హరితహారం ప్రారంభమైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కరీంనగర్లో ప్రారంభించగా మంత్రుల జిల్లాకేంద్రాల్లోని కార్యక్రమంలో పాల్గొని మొక్కటు నాటారు. మొక్కలు నాటిన కడియం వరంగల్ అర్బన్ జిల్లాలో తెలంగాణ హరితహారం కార్యక్రమాన్ని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి లాంఛనంగా ప్రారంభించారు. ఖిలా వరంగల్ మండలం మామునూరులోని 4వ బెటాలియన్ క్యాంపు ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో కలెక్టర్ ఆమ్రపాలి, పోలీసు కమిషనర్ సుధీర్ బాబు, జిల్లాలోని ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. బొటానికల్ గార్డెన్లో మంత్రి కేటీఆర్ హైదరాబాద్ : మూడో విడత హరిత హారం కార్యక్రమంలో భాగంగాబొటానికల్ గార్డెన్లో హరిత హారం కార్యక్రమానికి మంత్రి కేటీఆర్, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఎమ్మెల్యే ఆరికెపూడి గాంధీ హాజరయ్యారు. గార్డెన్‌లోని ముప్పై ఎకరాల్లో ఏడు వేల మొక్కలను నాటే కార్యక్రమాన్ని మంత్రులు ప్రారంభించారు. మేయర్ బొంతు రామ్మోహన్ మూసారాంబాగ్‌లోని స్వామి వివేకానంద ఉన్నత పాఠశాలలో విద్యార్థులలు, కార్పొరేటర్ సునరితారెడ్డి, మలక్‌పేట్ టీఆర్ఎస్ ఇన్చార్జ్ ఆజం ఆలీలతో కలిసి మేయర్ మొక్కలు నాటారు. మొక్కల శాతం పెరగాలి: డీజీపీ అనురాగ్‌శర్మ యాచారం: మూడో విడత హరిత హారం కార్యక్రమంలో భాగంగా రంగారెడ్డిజిల్లా యాచారం పోలీసులు స్టేషన్లో డీజీపీ అనురాగ్‌శర్మ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో మొక్కల శాతం తక్కువగా ఉందని, 33 శాతం ఉండాల్సి ఉండగా 24 శాతం మాత్రమే ఉందని తెలిపారు. పోలీసు సిబ్బంది ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలని పిలుపునిచ్చారు. అలాగే మంచాల పోలీసు స్టేషన్లోనూ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో రాచకొండ కమిషనర్ మహేష్‌భగవత్, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నేటి నుంచి మూడో విడత విత్తన పంపిణీ
- 15న వేరుశనగ పంపిణీ ముగిసే అవకాశం - కొనసాగనున్న విత్తన కందులు, బహుధాన్యపు కిట్ల పంపిణీ అనంతపురం అగ్రికల్చర్ : జిల్లా వ్యాప్తంగా 63 మండలాల్లో సోమవారం నుంచి మూడో విడత విత్తన వేరుశనగ పంపిణీ కొనసాగుతుందని వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. జిల్లాకు 4.01 లక్షల క్వింటాళ్ల వేరుశనగ, 5 లక్షల కిట్లు బహుధాన్యపు విత్తనాలు, 6 వేల క్వింటాళ్లు మేర విత్తన కందులు కేటాయించిన విషయం తెలిసిందే. గతనెల 24 నుంచి విత్తన పంపిణీ ప్రారంభమైంది. పది రోజుల పాటు చేపట్టిన తొలి విడతలో 1,46,272 మంది రైతులకు 1,69,327 క్వింటాళ్లు పంపిణీ చేశారు. రెండో విడతగా ఈనెల 5 నుంచి 9వ తేదీ వరకు 72,174 మంది రైతులకు 84,166 క్వింటాళ్లు పంపిణీ జరిగింది. మొత్తం 2,18,446 మంది రైతులకు 2,53,493 క్వింటాళ్లు పంపిణీ చేశారు. కేటాయింపుల మేరకు ఇంకా 1.48 లక్షల క్వింటాళ్లు పంపిణీ చేయాల్సి ఉంది. ఇప్పటిదాకా 6,762 మంది రైతులకు 695 క్వింటాళ్లు కందులు పంపిణీ చేయగా, ఇంకా 53,000 క్వింటాళ్ల కందులు ఇవ్వాల్సి ఉంది. ఇప్పటి వరకు 27,852 బహుధాన్యపు కిట్లు పంపిణీ చేశారు. ఇంకా 4.72 లక్షల కిట్ల పంపిణీ ఎప్పుడో తెలియడం లేదు. రైతుల నుంచి స్పందన అంతంతమాత్రమే : ముందస్తు ప్రణాళిక ఉన్నా పంపిణీలో సర్వర్ సమస్యలు, యాప్‌లో సాంకేతిక సమస్యలు రావడం, సకాలంలో కిట్లు తయారు చేయకపోవడంతో కొంత అంతరాయం ఏర్పడింది. అనుకున్న విధంగా విత్తనాల పంపిణీ జరగలేదని తెలుస్తోంది. సోమవారం నుంచి మూడో విడత చేపట్టనున్నారు. అయితే పంపిణీకి రైతుల నుంచి స్పందన అంతంత మాత్రంగానే ఉండటం, రోజుకు 100, 200 క్వింటాళ్ల వేరుశనగ పంపిణీ కోసం పదుల సంఖ్యలో అధికారులు, సిబ్బంది కౌంటర్లలో ఉండటం కనిపిస్తుండటంతో విత్తన పంపిణీని సాధ్యమైనంత త్వరగా ముగించాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో ఈనెల 15న తుది గడువుగా ప్రకటించి సాధ్యమైనంత ఎక్కువ మంది రైతులకు విత్తనం ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మూడు విడతల్లో 3 నుంచి 3.20 లక్షల క్వింటాళ్లు పంపిణీ కావచ్చని అంచనా వేస్తున్నారు. కౌంటర్లు క్లోజ్ చేసిన తర్వాత మండల వ్యవసాయాధికారుల కార్యాలయాల్లోనే విత్తన కందులు, బహుధాన్యపు విత్తనాల కిట్లు పంపిణీ కొనసాగించే అవకాశం కనిపిస్తోంది. -
కీలక ‘మూడో దఫా’ ముగిసింది..పోలింగ్ ఎంతంటే?
లక్నో: దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతున్న ఉత్తరప్రదేశ్ మూడో దఫా ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 69 స్థానాలకు ఆదివారం పోలింగ్ జరిగింది. 61.16శాతం ఓటింగ్ నమోదైంది. మూడో దఫా పోలింగ్‌లోనే హోంమంత్రి రాజ్‌నాథ్ లోక్‌సభ స్థానమైన లక్నో, ఎస్పీకి పట్టున్న కన్నౌజ్, మైన్ పురి, ఇటావా ప్రాంతాలున్నాయి. ఫరూకాబాద్, హర్దోయ్, అవురైయా, కాన్పూర్ దేహత్, కాన్పూర్, ఉన్నావో, బరాబంకి, సీతాపూర్ తదితర 12 జిల్లాల్లో పోలింగ్ జరిగింది. ఈ ప్రాంతంలో మొత్తం 2.41 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. 826 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇటావా.. ఎస్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయంసింగ్ యాదవ్ సొంత జిల్లా. ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ సతీమణి డింపుల్‌యాదవ్ కన్నౌజ్ ఎంపీ. ఎస్పీ మరో కీలక ఎంపీ తేజ్‌ప్రతాప్ యాదవ్‌ది మైన్ పురి జిల్లా. దీంతో మూడో దఫా అన్ని పార్టీలకూ ప్రతిష్టాత్మకంగా మారింది. 2012 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ 69 స్థానాల్లో ఎస్పీ 55 గెలుచుకుంది. -
'300 స్థానాల్లో మాదే విజయం'
లక్నో: దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతున్న ఉత్తరప్రదేశ్ ఎన్నికల మూడో దశ ఓటింగ్ కొనసాగుతోంది. ఈ క్రమంలో మాజీ సీఎం, బీఎస్పీ అధినేత్రి మాయావతి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. లక్నోలోని పోలింగ్ బూత్ నెం.251కి వచ్చిన ఆమె ఓటేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. మొదటి రెండు దశల ఓటింగ్ తరహాలోనే ఈ మూడో దశ పోలింగ్ లోనూ బీఎస్పీదే హవా కొనసాగుతుందన్నారు. పూర్తి మెజార్టీతో తాము అధికారం చేపట్టడం ఖాయమని మాయావతి ధీమా వ్యక్తం చేశారు. తమ పార్టీ తక్కువలో తక్కువ అంటే కనీసం 300 పైగా స్థానాల్లో నెగ్గి అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయాన్ని సొంతం చేసుకుంటుందని చెప్పారు. నేడు (ఆదివారం) 69 స్థానాలకు మూడో దశ పోలింగ్ ఉదయం ఏడు గంటలకే ప్రారంభమైంది. ఈ దశ పోలింగ్‌లో హోంమంత్రి రాజ్‌నాథ్ లోక్‌సభ స్థానం లక్నో, ఎస్పీకి పట్టున్న కన్నౌజ్, మైన్ పురి, ఇటావా ప్రాంతాల నియోజకవర్గాలు ఉండటంతో అందరిదృష్టి ఈ పోలింగ్ పై ఉంది. ములాయంసింగ్ యాదవ్ సొంత జిల్లా ఇటావా, ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ సతీమణి డింపుల్‌యాదవ్ కన్నౌజ్ ఎంపీ.. ఎస్పీ మరో కీలక ఎంపీ తేజ్‌ప్రతాప్æ యాదవ్‌ది మైన్ పురి జిల్లా కావడంతో ఈ దశ అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఫరూకాబాద్, హర్దోయ్, అవురైయా, కాన్పూర్ దేహత్, కాన్పూర్, ఉన్నావో, బరాబంకి, సీతాపూర్ తదితర 12 జిల్లాల్లో నేడు పోలింగ్ జరుతున్న విషయం తెలిసిందే. -
యూపీ ‘మూడో దశ’ నేడు
లక్నో: దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతున్న ఉత్తరప్రదేశ్ ఎన్నికల మూడో దశకు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. 69 స్థానాలకు ఆదివారం జరగనున్న ఈ దశ పోలింగ్‌లో హోంమంత్రి రాజ్‌నాథ్ లోక్‌సభ స్థానం లక్నో, ఎస్పీకి పట్టున్న కన్నౌజ్, మైన్ పురి, ఇటావా ప్రాంతాలున్నాయి. ఫరూకాబాద్, హర్దోయ్, అవురైయా, కాన్పూర్ దేహత్, కాన్పూర్, ఉన్నావో, బరాబంకి, సీతాపూర్ తదితర 12 జిల్లాల్లో జరుగుతున్న ఈ దశ పోలింగ్‌లో 2.41 కోట్ల మంది ఓటర్లు 826 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చనున్నారు. మొత్తం 25,603 పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేశారు. ఇటావా... ఎస్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయంసింగ్ యాదవ్ సొంత జిల్లా. ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ సతీమణి డింపుల్‌యాదవ్ కన్నౌజ్ ఎంపీ. ఎస్పీ మరో కీలక ఎంపీ తేజ్‌ప్రతాప్æ యాదవ్‌ది మైన్ పురి జిల్లా. దీంతో ఈ దశ అన్ని పార్టీలకూ ప్రతిష్టాత్మకంగా మారింది. 2012 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ 69 స్థానాల్లో ఎస్పీ 55 గెలుచుకుంది. -
త్రిముఖ హోరాహోరీ
మూడో దశ పోరు ముగ్గురికీ ప్రతిష్టాత్మకం - 2012 ఫలితాల పునరావృతం కోసం ఎస్పీ తహతహ - 2014 ఫలితాలను మళ్లీ రాబట్టేందుకు బీజేపీ కృషి - ఆ రెండిటినీ మౌనంగా అధిగమించేంలా బీఎస్పీ వ్యూహం - మారుతున్న పరిస్థితుల్లో మూడు పక్షాల హోరాహోరీ (సాక్షి నాలెడ్జ్ సెంటర్) ఉత్తరప్రదేశ్‌లో ఆదివారం జరుగనున్న మూడో దశ ఎన్నికలు.. అధికార సమాజ్‌వాది పార్టీతో పాటు.. అటు బీజేపీకి, ఇటు బీఎస్పీకి కూడా ప్రతిష్టాత్మకమైన ఎన్నికలు. కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేస్తున్న సమాజ్‌వాది పార్టీకి ఇక్కడ తన ఆధిపత్యాన్ని నిలుపుకోవడం కీలకం. రాష్ట్రంలో అధికారంలోకి రెండో స్థానంలోనన్నా నిలవడం బీజేపీకి ముఖ్యం. ఆ రెండు పార్టీలనూ ఓడించి.. ప్రస్తుత సమీకరణాలను మార్చివేయడం బీఎస్పీకి అత్యవసరం. మూదో దశలో ఫరూకాబాద్, హర్దోయ్, కన్నౌజ్, మయిన్‌పురి, ఇటావా, అరాయియా, కాన్పూర్, కాన్పూర్ , ఉన్నావ్, లక్నో, బారాబంకి, సితాపూర్ – మొత్తం 12 జిల్లాల్లోని 69 శాసనసభ నియోజకవర్గాల్లో ఆదివారం పోలింగ్ జరుగనుంది. శుక్రవారం సాయంత్రం ఇక్కడ ప్రచారం ముగిసింది. 2012 శాసనసభ ఎన్నికల్లో ఈ 69 సీట్లలో ఎస్పీ 55 సీట్లు గెలుచుకోగా బీఎస్పీ ఆరు సీట్లు, బీజేపీ ఐదు సీట్లు, కాంగ్రెస్ రెండు సీట్లు, స్వతంత్ర అభ్యర్థి ఒక సీటు చొప్పున గెలుచుకున్నారు. అయితే.. 2014 లోక్‌సభ ఎన్నికల్లో సమాజ్‌వాది పార్టీ నాయకత్వానికి చెందిన యాదవ్ కుటుంబానికి సొంత కోటలైన కన్నౌజ్, మయిన్‌పురి జిల్లాలు మినహా మిగతా అన్ని చోట్లా బీజేపీ క్లీన్‌స్వీప్ చేసింది. ఈ నేపథ్యంలో.. 2012 ఫలితాలను పునరావృతం చేయాలని ఎస్పీ.. 2014 ఫలితాలను నిలుపుకోవాలని బీజేపీ.. ఆ రెండిటినీ అధిగమించాలని బీఎస్పీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. దీంతో క్షేత్రస్థాయిలో ప్రస్తుతం ఈ మూడు పార్టీల మధ్యా హోరాహోరీ పోరాటం నెలకొంది. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్‌సభ స్థానం లక్నో, ముఖ్యమంత్రి అఖిలేశ్‌యాదవ్ స్వస్థలమైన ఇటావా, ఆయన భార్య ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్‌సభ స్థానం కన్నౌజ్, ఎస్పీ ఎంపీ, ములాయం బంధువు తేజ్ ప్రతాప్ యాదవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న మయిన్‌పురి ఈ ఎన్నికల్లో ఆయా పార్టీలకు మరింత ప్రతిష్టాత్మకం అవుతున్నాయి. ఇది కోటీశ్వరుల ఖిల్లా! మూడో దశ ఎన్నికల్లో పోటీపడుతున్న 826 మంది అభ్యర్థుల్లో 250 మంది కోటీశ్వరులు, 110 మంది నేర చరితులు ఉన్నారని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్, ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ వాచ్‌లు వెల్లడించాయి. మొత్తం ఆరు జాతీయ పార్టీలు, ఏడు రాష్ట్ర పార్టీలు, 92 గుర్తింపులేని పార్టీల అభ్యర్థులతో పాటు.. 225 మంది స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నారు. ‘మూడో దశ’లో.. 67 మంది బీఎస్పీ అభ్యర్థుల్లో 56 మంది, 68 మంది బీజేపీ అభ్యర్థుల్లో 61 మంది, 59 మంది ఎస్పీ అభ్యర్థుల్లో 51 మంది, 14 మంది కాంగ్రెస్ అభ్యర్థుల్లో ఏడుగురు, 40 మంది ఆర్ఎల్డీ అభ్యర్థుల్లో 13 మంది, 225 మంది స్వతంత్ర అభ్యర్థుల్లో 24 మంది.. తమకు కోటి రూపాయల కన్నా ఎక్కువ ఆస్తులు ఉన్నట్లు ప్రకటించారు. బరిలో ఉన్న అభ్యర్థుల్లో ఎస్పీకి చెందిన అనూప్‌కుమార్ గుప్తా (రూ. 42 కోట్లు) అత్యధిక ధనవంతుడు. ఆ తర్వాతి స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థి అజయ్‌కపూర్ (రూ. 31 కోట్లు), ఎస్పీ అభ్యర్థి సీమా సచన్ (రూ. 29 కోట్లు) ఉన్నారు. 110 మంది నేరచరితులు: ఇక నేరారోపణలు గల 110 మంది అభ్యర్థుల్లో.. 82 మందిపై హత్య, హత్యాయత్నం, కిడ్నాప్, మహిళలపై నేరాలు వంటి తీవ్రమైన నేరారోపణలు ఉన్నాయి. బీజేపీ అభ్యర్థుల్లో 21 మంది, బీఎస్పీ అభ్యర్థుల్లో 21 మంది, ఎస్పీ అభ్యర్థుల్లో 13 మంది, కాంగ్రెస్ అభ్యర్థుల్లో ఐదుగురు, ఆర్ఎల్డీ అభ్యర్థుల్లో ఐదుగురు, స్వతంత్రుల్లో 13 మందిపై ఈ కేసులు ఉన్నాయి. ఐదేళ్లలో పరిస్థితులు మారాయి సమాజ్‌వాది పార్టీకి గత ఎన్నికల్లో భారీ ఆధిక్యాన్ని అందించిన ఈ 12 జిల్లాల్లో ఇప్పుడు పరిస్థితులు మారాయని.. ఆ పార్టీ ఓటు బ్యాంకును ఒకవైపు బీఎస్పీ, మరోవైపు బీజేపీలు కొల్లగొడుతున్న పరిస్థితి కనిపిస్తోందని పరిశీలకులు చెప్తున్నారు. 2012 ఎన్నికల్లో మయిన్‌పురి, ఇటావా, ఆరాయియా, బారాబంకి, కన్నౌజ్ జిల్లాల్లో ఎస్పీ స్వీప్ చేసింది. హర్దోయ్ జిల్లాలోని 8 సీట్లలో ఆరు సీట్లను, ఫరూఖాబాద్ జిల్లాలోని నాలుగు సీట్లలో మూడు సీట్లను, ఉన్నావ్ జిల్లాలోని ఆరు సీట్లలో ఐదు సీట్లను గెలుచుకుంది. గత ఎన్నికల్లో బీజేపీ, బీఎస్పీలకు ఇక్కడ విజయం నామమాత్రంగానే ఉండింది. కానీ.. ఇప్పుడు కాంగ్రెస్‌తో పొత్తుకట్టి పోటీ చేస్తున్న అధికార పార్టీకి.. అభ్యర్థుల ఎంపికల్లో గొడవలు, అసమ్మతి నేతల తిరుగుబాట్లు, కులాల పునఃసమీకరణలు వంటి అంశాలు చిక్కుల్లోకి నెడుతున్నాయని అంచనా. పట్టణాల్లో మారుతున్న గాలి అలాగే సంప్రదాయంగా గతంలో బీజేపీకి ఆలంబనగా ఉన్న పట్టణ ప్రాంతాలు లక్నో, కాన్పూర్లలో ఐదేళ్ల కిందట సైకిల్ హవా వీచినా.. ఇప్పుడు గణనీయమైన మార్పులు రావచ్చునంటున్నారు. ఈ రెండు జిల్లాల్లోనే 19 సీట్లు (కాన్పూర్ రూరల్ మినహాయించి) ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ ఇమేజీని గ్రామీణ పార్టీ నుంచి ఆధునిక పార్టీగా మార్చడానికి అఖిలేశ్ చేసిన కృషితో పాటు.. ఉచిత ల్యాప్‌టాప్‌లు, నిరుద్యోగ భృతి, పెన్షన్లు, ఉచిత వైద్యం వంటి హామీలు ఇక్కడ కలిసివచ్చాయి. మరోవైపు అంతర్గత పోరుతో పాటు సమర్థవంతమైన నాయకత్వం లేకపోవడం బీజేపీకి ప్రతికూలంగా మారింది. ఫలితంగా.. బీజేపీ ఆధిక్యం ఉన్న పట్టణ ప్రాంతాల్లో ఆ పార్టీని ఎస్పీ అధిగమించింది. లక్నోలోని 9 సీట్లలో ఏడు, కన్పూర్‌లోని 10 సీట్లలో ఐదింటిని గెలుచుకుంది. ఇక్కడ గతంలో ఎన్నడూ ఎస్పీకి ఈ విజయం అందలేదు. ఇక బీజేపీ లక్నోలో ఒక్క సీటు, కాన్పూర్‌లో నాలుగు సీట్లు గెలుచుకుంది. కన్పూర్లో మరొక సీటును కాంగ్రెస్ దక్కించుకుంది. అయితే.. ఇప్పుడు ఈ పట్టణ ప్రాంత ఓటర్లు మళ్లీ బీజేపీ వైపు మొగ్గుచూపుతున్నట్లు కనిపిస్తోంది. ఎస్పీ, కాంగ్రెస్ కూటమి అభ్యర్థుల ఎంపికలో లోపాలు, కొన్నిచోట్ల అసంతృప్త నేతల తిరుగుబాటుతో పాటు.. బీజేపీ బలమైన అభ్యర్థులను నిలపడం ఇందుకు ఒక కారణమైతే.. బీఎస్పీ అభ్యర్థుల వల్ల కూడా అధికార పార్టీకి నష్టం వాటిల్లేలా ఉందని చెప్తున్నారు. లక్నోలో లక్కు ఎవరిదో..? రాష్ట్ర రాజధాని లక్నో నగరంలోని 9 అసెంబ్లీ స్థానాలను గెలుచుకోవడం ఎస్పీకి చాలా కీలకమైన విషయం. వీటిలో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ ఏడు స్థానాలను గెలుచుకోగా.. బీజేపీ, బీఎస్పీలో చెరొకటి ఖాతాలో వేసుకున్నాయి. అయితే.. 2014 పార్లమెంటు ఎన్నికల్లో లక్నో లోక్‌సభ స్థానం బీజేపీ వశమైంది. ఇప్పుడు.. ములాయం చిన్న కోడలు అపర్ణాయాదవ్ లక్నో కంటోన్మెంట్ నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తుండగా.. మరో ముగ్గురు మంత్రులు కూడా నగరంలో బరిలో ఉన్నారు. పీసీసీ మాజీ అధ్యక్షురాలు రీటాబహుగుణజోషి ఇప్పుడు బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగగా.. ఆమె మీద అపర్ణాయాదవ్ పోటీ చేస్తున్నారు. బీఎస్పీ తరఫున యోగేష్దీక్షిత్ బరిలో ఉన్నారు. సరోజినీ నగర్లో అఖిలేశ్ బంధువైన అనురాగ్యాదవ్కు ఎస్పీ టికెట్ ఇవ్వడంతో.. పార్టీ సిటింగ్ ఎమ్మెల్యే ఆర్ఎల్డీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. బీఎస్పీ ఆకర్షణ మంత్రం.. ఇక ముస్లిం ఓటర్లను ఆకర్షించడానికి బీఎస్పీ రచించిన వ్యూహం.. ఈ మూడో దశ ఎన్నికల్లో ఆ పార్టీకి లాభించే అవకాశం ఉందనీ చెప్తున్నారు. బారాబంకి, రామ్‌నగర్ నియోజకవర్గాల్లో ముస్లిం ఓటర్లు ఏనుగు వైపు మొగ్గుచూపుతుండటం.. ఎస్పీ ఠాకూర్ అభ్యర్థులకు ప్రతికూలంగా మారవచ్చు. సీతాపూర్ జిల్లాలోని లహార్పూర్, సెవాటా సీట్లతో పాటు.. కన్నౌజ్ జిల్లాలోని చిబ్రమావు, ఉన్నావ్ జిల్లాలోని బంగేర్‌మావు, ఫరూకాబాద్ జిల్లాలోని ఫరూకాబాద్ సదర్, హర్దోయ్ జిల్లాలోని షాహాబాద్ సీట్లలో కూడా ముస్లిం ఓటర్లు ఎక్కువగా బీఎస్పీ వైపు చూస్తున్నట్లు పరిశీలకులు చెప్తున్నారు. అలాగే.. ఎతావా, భగ్వంత్నగర్ సీట్లలో బీఎస్పీ ముస్లిమేతర అభ్యర్థులకు.. బీజేపీ అభ్యర్థులను ఓడించగల సత్తా ఉండటంతో అక్కడి ముస్లిం ఓటర్లు కూడా ఏనుగు గుర్తుకే ఓటు వేస్తామని చెప్తున్నారు. దీనికి బీఎస్పీ మౌనంగా ఉపయోగిస్తున్న ‘బ్రాహ్మణ కార్డు’ కూడా తోడవుతోంది. ఈసారి 67 మంది బ్రాహ్మణ అభ్యర్థులను ఆ పార్టీ బరిలోకి దించింది. రాష్ట్రంలో మరే పార్టీ ఇంత మంది బ్రాహ్మణ అభ్యర్థులకు టికెట్లు ఇవ్వలేదు. పార్టీ ఈ విషయం గురించి పెద్దగా మాట్లాడకపోయినా కూడా.. అది దోహదం చేస్తోంది. హర్దోయ్ జిల్లాలోని సవాయిజ్పూర్, బిల్గ్రామ్-మల్లవాన్ సీట్లు, ఆరాయియా జిల్లాలోని దిబియాపూర్, ఎతావా జిల్లాలోని ఎతావా సదర్ సీట్లలో ఈ విషయం స్పష్టంగా కనిపిస్తోంది. ఆయా నియోజకవర్గాల్లోని బ్రాహ్మణ వర్గాలు సంప్రదాయంగా బీజేపీ మద్దతుదారులైనప్పటికీ.. ఈసారి వారిలో బీఎస్పీ అభ్యర్థులకు ఎక్కువ ఆదరణ కనిపిస్తోంది. బీఎస్పీకి శివ్‌పాల్ సాయం! ఇక ఎస్పీ నాయకత్వ కుటుంబంలో ఇటీవల రచ్చరచ్చ అయిన ఆధిపత్య పోరు.. యాదవ్‌ల కోటలైన ఇటావా, మయిన్‌పురి జిల్లాల్లో ప్రతిఫలిస్తోంది. ఇక్కడ అఖిలేశ్ బాబాయ్ శివ్‌పాల్ యాదవ్ శిబిరం.. బీఎస్పీ అభ్యర్థులకు సాయం చేస్తున్నట్లు చెప్తున్నారు. శివ్‌పాల్ సన్నిహితులైన కొందరు సిటింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు నిరాకరించడం.. ఆయన మద్దతుదారులను ఆగ్రహానికి గురిచేసింది. మయిన్‌పురి జిల్లాలోని కిష్నీ, కర్హాల్, భోగావ్ సీట్లలో బీజేపీ కన్నా.. బీఎస్పీ నుంచే అధికార పార్టీ బలమైన పోటీని ఎదుర్కొంటోంది. ఇక్ మయిన్‌పురి సదర్ నియోజకవర్గంలో శివ్‌పాల్ మద్దతుదారులు ఎస్పీ అభ్యర్థికి వ్యతిరేకంగా బాహాటంగానే పనిచేస్తున్నారు. ఇక సీతాపూర్ జిల్లాలో సెవాతా, బిస్వాన్ నియోజవర్గాల్లో పార్టీ టికెట్ లభించిన ఇద్దరు సిటింగ్ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసి.. ఎస్పీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. మారుతున్న కుల సమీకరణాలు ఇక ఎస్సీ వర్గాల వారిలో కూడా రాజకీయ సమీకరణాలు మారుతుండటం ఎస్పీకి ఇబ్బందులు కలిగించే అవకాశముంది. ఈ ప్రాంతంలో బలమైన ఎస్సీ వర్గమైన పాసీలు సంప్రదాయంగా ఎస్పీ, బీఎస్పీ మద్దతుదారులు. అయితే.. గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఈ వర్గం ఓట్లను గణనీయంగా సంపాదించుకోగలిగింది. ఇప్పుడు కూడా లక్నోలోని మోహన్‌లాల్‌గంజ్, హర్దోయ్ జిల్లాలోని బలామావు, సాండీ (మూడూ ఎస్సీ రిజర్వుడు స్థానాలు)ల్లో కమలదళం బలమైన పాసీ అభ్యర్థులను రంగంలోకి దించడంతో ఆ వర్గాల వారు బీజేపీ వైపు మొగ్గుతున్నట్లు చెప్తున్నారు. బారాబంకి-సీతాపూర్ ప్రాంతంలో కుర్మీల అసంతృప్తి కూడా ఎస్పీకి సమస్యగా మారిందని పరిశీలకులు చెప్తున్నారు. ఎస్పీ రాజ్యసభ్యుడు, కుర్మీ నాయకుడు అయిన బేణీప్రసాద్‌వర్మ కుమారుడికి టికెట్ నిరాకరించడంతో.. ఆ వర్గం వారు బీఎస్పీకి అనుకూలంగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. -
మాటలు - మంటలు
-
రుణమాఫీకి రూ.2,019 కోట్లు
⇒ మూడో విడతలో రెండో సగం నిధులు విడుదల చేసిన ప్రభుత్వం ⇒ వచ్చే ఏడాది ఒకేసారి ఆఖరి విడత చెల్లింపునకు యోచన సాక్షి, హైదరాబాద్: రైతుల రుణమాఫీకి సంబంధించి మూడో విడత నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. మూడో విడతకు సంబంధించిన రెండో సగం నిధులు రూ.2,019.19 కోట్లను విడుదల చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రైతులకు సంబంధించి మూడు వంతుల రుణాన్ని ప్రభుత్వం తిరిగి బ్యాంకులకు చెల్లించినట్లైంది. మొత్తం 36 లక్షల మంది రైతులకు సంబంధించి రూ.17 వేల కోట్ల రుణాల మాఫీ పథకాన్ని టీఆ ర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేసింది. 4 విడతల్లో మాఫీ నిధులను బ్యాంకులకు చెల్లించేందుకు ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. తొలి ఏడాది రూ.4,250 కోట్లు ఒకే సారి విడుదల చేసింది. గతేడాది జూన్, సెప్టెంబ ర్లో 2 దశల్లో రూ.4,086 కోట్లు చెల్లించింది. ఈ ఏడాది నిధుల విడుదల ఆలస్యమైంది. జూలై 1న మొదటి దఫాగా రూ.2,019 కోట్లు చెల్లిం చింది. 3 నెలల తర్వాత మిగతా రూ.2,019 కో ట్లు విడుదల చేసింది. వచ్చే ఏడాది నాలుగో విడ త చెల్లింపులతో ఈ పథకం ముగియనుంది. బ్యాంకులకు నిధులు చేరటం ఆలస్యమవటంతో కొన్ని జిల్లాల్లో బ్యాంకర్లు రైతుల నుంచి వడ్డీ వసూలు చేసినట్లు విమర్శలు చుట్టుముట్టారుు. అందుకే వచ్చే ఏడాది చివరి విడత నిధులను ఒకేసారి విడుదల చేయాలని ఇటీవలే కేబినెట్ భేటీలో సీఎం కేసీఆర్ ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. లెక్కతేలింది రూ.16,160 కోట్లు.. రైతు రుణమాఫీకి సంబంధించిన లెక్కతేలింది. మొత్తం రూ.17 వేల కోట్ల రుణాలను మాఫీ చేస్తున్నట్లు ప్రభుత్వం ఆరంభంలో ప్రకటించింది. 36 లక్షల మంది రైతులు లబ్ధి పొందుతారని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఈ పథకం అమల్లో భాగంగా రెండో ఏడాది బోగస్ రైతులు, రెండేసి ఖాతాలున్న రైతులు కొందరిని ప్రభుత్వం ఏరివేసింది. దీంతో మాఫీ మొత్తం రూ.16,160 కోట్లకు చేరినట్లు ఆర్థిక శాఖ తాజాగా అంచనాకు వచ్చింది. ఇప్పటివరకు రూ.12,375 కోట్లను ప్రభుత్వం చెల్లించింది. మొత్తం 35.30 లక్షల రైతుల రుణాలు మాఫీ అయ్యాయని, బ్యాంకుల బ్రాంచీల వారీగా లబ్ధిదారుల జాబితాలను వ్యవసాయ శాఖ సిద్ధం చేసింది. వచ్చే ఏడాది మిగతా రూ.3,785 కోట్లు విడుదల చేస్తే ఈ పథకం సంపూర్ణంగా విజయవంతమవుతుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించారుు. దశలవారీగా చెల్లింపులు 2014 సెప్టెంబర్: రూ.4,250 కోట్లు 2015 జూన్: రూ.2,043 కోట్లు 2015 జూలై: రూ.2,043 కోట్లు 2016 జూలై: రూ.2,019 కోట్లు 2016 నవంబర్: రూ.2,019 కోట్లు -
మూడో విడత రుణమాఫీ
నేరడిగొండ : మూడో విడత రుణమాఫీ డబ్బులు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమకావడంతో ఆయా గ్రామపంచాయతీల వారీగా వారికిచ్చేందుకు తేదీలు ఖరారు చేసినట్లు తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజర్ ఆశన్న తెలిపారు. బుగ్గారాం గ్రామపంచాయతీ రైతులు ఈ నెల 3వ తేదీ వరకు తీసుకోవచ్చన్నారు. ఒక్కో జీపీకి 3 రోజులపాటు అవకాశం ఇచ్చామన్నారు.4న బోరిగాం, 8న బొందిడి, 11న కొరిటికల్, 17న కుమారి, 20న నేరడిగొండ, 24న రాజురా, 30న రోల్మామడ, సెప్టెంబర్ 2న తేజాపూర్, 7న తర్నం, 13న వెంకటాపూర్, 16న వాగ్ధారి, 20న వాంకిడి, 26న వడూర్ గ్రామపంచాయతీల వారీగా తీసుకెళ్లాలన్నారు. రైతులు ఏటీఎం కార్డుతోపాటూ పాస్‌బుక్ తీసుకువస్తే ఏటీఎం సీక్రెట్ నంబర్లు తెలియజేస్తామన్నారు. ఈ విషయాన్ని గమనించి ఆయా తేదీల్లో రైతులు బ్యాంకుకు రావాలని సూచించారు. -
త్వరలో మూడో విడత ‘మాఫీ’ నిధులు
* విడుదల చేస్తామని బ్యాంకర్లకు సీఎస్ రాజీవ్‌శర్మ హామీ * రైతుల నుంచి వడ్డీలు వసూలు చేయవద్దని సూచన సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ రుణ మాఫీకి సంబంధించిన మూడో విడత నిధులను త్వరలోనే విడుదల చేస్తామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజీవ్ శర్మ బ్యాంకర్లకు తెలిపారు. రుణ మాఫీకి సంబంధించిన వడ్డీని రైతుల నుంచి వసూలు చేయరాదని స్పష్టం చేశారు. వడ్డీ, రుణ మాఫీ అంశం ప్రభుత్వానికి, బ్యాంకర్లకు సంబంధించిన అంశమని రైతులకు ఎటువంటి సంబంధం లేదన్నారు. పంట రుణ మాిఫీలో లబ్ధి పొందిన అనర్హుల వివరాలను బ్యాంకర్లకు పంపించామని, వారి నుండి రికవరీ చేసేందుకు బ్యాంకర్లు చర్యలు తీసుకోవాలన్నారు. పంట రుణ మాఫీకి సంబంధించి రైతుల భూ వివరాల కోసం రెవెన్యూ శాఖ వెబ్ పోర్టల్‌ను వినియోగించుకోవాలని బ్యాంకర్లను సూచించారు. గురువారం సచివాలయంలో 6 ప్రధాన బ్యాంకుల అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సత్వరం పంట రుణాలు మంజూరు చేయాలన్నారు. 2016-17లో రూ.29,101 కోట్ల పంట రుణాల పంపిణీ లక్ష్యం కాగా ఖరీఫ్‌లో రూ.17,460 కోట్ల మేర రుణాలు రైతులకు ఇవ్వాలన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హత మేరకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ స్కేల్ ప్రకారం రైతులకు రుణాలు చెల్లించాలని సూచించారు. రైతులకు పంట రుణాల రెన్యువల్స్‌ను వేగవంతం చేయాలన్నారు. అర్హులైన రైతులకు రుణాలు అందేలా చూడాలన్నారు. వ్యవసాయ శాఖ కార్యదర్శి సి.పార్థసారథి మాట్లాడుతూ కొన్ని జిల్లాల్లో బ్యాంకు సిబ్బంది వడ్డీని చెల్లించాలని రైతులను కోరుతున్న విషయాన్ని వివరాలతో సహా బ్యాంకర్లకు తెలిపారు. ఖరీఫ్ 2016 సంవత్సరానికి సంబంధించి వాతావరణ ఆధారిత పంటల బీమా, ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకాల ద్వారా వివిధ పంటలకు చెల్లించాల్సిన బీమా ప్రీమియం కటాఫ్ డేట్ వివరాలను బ్యాంకర్లకు అందించారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్, ఆర్థిక శాఖ సంయుక్త కార్యదర్శి సాయి ప్రసాద్, ఎస్బీఐ జీఎం గిరిధర్ కిని, డీజీఎం వి.సదా శివం, డీజీఎం సత్యనారాయణ రెడ్డి, రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ ఏజీఎం జేబీ సుబ్రమణ్యం, టీఎస్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ ఎండీ మురళీధర, ఏపీజీబీ జీఎం టీవీ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘పిటీ’షన్లు
జన్మభూమి మూడో విడత ప్రారంభం కానుంది. జనవరి 2 నుంచి 11వ తేదీ వరకు ఇందులో భాగంగా గ్రామసభలు నిర్వహించడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. గత రెండు విడతలుగా జన్మభూమి నిర్వహించినా ఏఒక్క సమస్యా పరిష్కారం కాలేదని జనం పెదవి విరుస్తున్నారు. దీంతో వీరంతా సమస్యలతో నిలదీతకు సమాయత్తమవుతున్నారు. జిల్లాలోని 1109 గ్రామపంచాయతీలతోపాటు శివారులోనూ గ్రామసభలు జరగనున్నాయి. రోజుకు నాలుగు గ్రామాల వంతున మండలాల వారీగా నిర్వహించే ఈ సభలను ఈసారి డివిజన్‌కు ఒక ఐఎఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు పర్యవేక్షించనున్నారు. శ్రీకాకుళం టౌన్ రెండు విడతల్లో జరిగిన జన్మభూమి కార్యక్రమాల్లో 51,698 వినతులు పరిష్కారానికి నోచుకోలేదని అధికార గణాంకాణాలే చెబుతున్నాయి. అంటే లక్షకు పైగా పిటిషన్లు బుట్టదాఖలయ్యాయి. గ్రామాల్లోనే కొన్ని అర్జీలను విడిచిపెట్టిన ఉదంతాలున్నాయి. ప్రధానంగా క్షేత్రస్థాయి సమస్యలపై ఫిర్యాదులు వస్తున్నాయి. అందులో వ్యక్తిగత పిటిషన్లే అధికంగా ఉన్నాయని అధికారులంటున్నారు. ప్రభుత్వం ఈపాస్ విధానంతో అనేక మందికి రేషన్ కార్డులను తొలగించారు. కొన్నింటికి వేలి ముద్రలు పడడం లేదని, మరికొన్ని ఐరిస్ జతకావడం లేదని కారణం చూపుతూ రేషన్ ఇవ్వని పరిస్థితి నెలకొంది. 20వేల కుటుంబాలకు డిసెంబరులో ఈ కారణాలతో రేషన్ ఇవ్వలేదు. దీనికి తోడు అంత్యోదయ కార్డులను తెల్లరేషన్ కార్డులుగా మార్చి ఏకార్డుపైనా రేషన్ సరఫరా నిలిపివేశారు. దీనివల్ల లక్ష కుటుంబాలకు రెండునెలలుగా రేషన్ సరకులు అందకుండా పోయాయి. 40వేలమందికి పెన్షన్లు తొలగించారు. అనర్హులుగా ప్రకటిస్తూ పెన్షను నిలిపేశారు. వయోవృద్ధులు, వికలాంగులు, వితంతుమహిళలు రెండు విడత జన్మభూమి కార్యక్రమాల్లో విన్నవించుకున్నా కొత్తగా 1688 పెన్షన్లు మాత్రమే మంజూరు చేశారు. మిగిలిన దరఖాస్తుల ఊసే లేదు. సమగ్ర భూసర్వే జరపకుండా ఈ-పాసుపుస్తకాలు సిద్ధమయ్యాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా భూ రికార్డులు తప్పుల తడకగా జారీ అవుతున్నాయి. నకిలీపట్టాదారు పాస్తకాలు తయారు చేసి రూ.కోట్లు రుణాలు పొందినప్పటికీ ఎవరిపైనా చర్యలు తీసుకోలేదు. దీనికి తోడు వారికి హుద్‌హుద్ పరిహారంతోపాటు పంట రుణాల మాఫీ రైతులకు అందకుండా పోయింది. లావేరు మండలం బుతవలస, అదపాక, ఎల్‌ఎన్‌పేట మండలాల్లో నకిలీ పట్టాదారు పాసుపుస్తకాలు బయటపడినా చర్యలు తీసుకోలేదు. దానిపై గ్రామసభల్లో అధికారులను రైతులు నిలదీసే అవకాశాలున్నాయి. పట్టణ ప్రాంతంలో ఇళ్లస్థలాలు మంజూరుపై నిషేదముంది. దీనివల్ల రెండేళ్లలో ఒక్క ఇంటి స్థలం కూడా మంజూరు కాలేదు.దీనికి తోడు ఇళ్ల మంజూరులో కూడా ఇంతవరకు ఒక్కటి మంజూరుకాలేదు. కేంద్రప్రభుత్వం చేపట్టిన ఇంటింటా మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించినా అవికూడా పూర్తిస్థాయిలో చేపట్టలేదు. ఖరీఫ్ సీజన్ పూర్తయింది. వ్యవసాయకూలీలు వలసలకు సిద్ధమవుతున్నారు. కరవు ప్రాంతాలుగా 17మండలాలు గుర్తించినా పనుల మంజూరులో జాప్యం కొనసాగుతోంది. 150రోజుల పనిదినాలు మంజూరు చేసినా ఇప్పటికీ ఇంకా పనులు మొదలు కాలేదు. ఇలాంటి సమస్యలు ఎన్నో పెండింగ్‌లో ఉన్నాయి. కొత్తసమస్యలు తెరపైకి .. మూడో విడత జన్మభూమిలో తెరపైకి కొత్తసమస్యలు కోకొల్లలుగా రానున్నాయి. హుద్‌హుద్‌తో 11మండలాలు దెబ్బతిన్నాయి. తుఫాన్ అనంతరం దోమపోటు వల్ల లక్షల ఎకరాల్లో పంటనష్టం ఏర్పడింది. పరిహారం కొందరికి అందలేదు. ఉద్యానపంటలకు పరిహారం చెల్లించకుండా మొండి చేయి చూపారు. దోమపోటు వల్ల దెబ్బతిన్న రైతులకు ప్రభుత్వం రూ.25కోట్లు విడుదల చేశారు. దీనికి సంబంధించి 11మండలాల్లో రైతు ఖాతాలకు జమచేసిన అధికారులు నందిగాం, పలాస మండలాల్లో రైతులకు పరిహారం చెల్లించలేదు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఒక్కగింజ కొనుగోలు చేయలేదు. మిల్లర్లు, అధికారుల మద్య తలెత్తిన వివాదం పరిష్కారంలో జాప్యం పండగపూట అప్పులు చేయాల్సివస్తోంది. పాతసమస్యలకు తోడు గ్రామాల్లో ఈ సమస్యలపై ప్రజలు అధికారులపై ధ్వజమెత్తనున్నారు. -
బిహార్ అసెంబ్లీ మూడో విడత పోలింగ్ ప్రారంభం
50 స్థానాల్లో పోలింగ్; బరిలో లాలూ ఇద్దరు కొడుకులు పట్నా: బిహార్ అసెంబ్లీ మూడో దశ ఎన్నికల్లో భాగంగా నేడు 50 నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రారంభమైంది. పట్నా, వైశాలి, సరన్, నలంద, బక్సర్, భోజ్‌పూర్ జిల్లాల్లో విస్తరించిన ఈ 50 స్థానాల్లో ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ ఇద్దరు కొడుకులు తేజ్‌ప్రతాప్ యాదవ్, తేజస్వీ యాదవ్ పోటీ చేస్తున్న మహువా, రాఘోపూర్ నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. లాలూకు గట్టి పట్టున్న సరన్‌లోని 10 స్థానాలు, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సొంత జిల్లా నలందలోని 7 స్థానాల్లోనూ బుధవారం ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ దశలో మొత్తం 1.45 కోట్ల మంది ఓటర్లు 808 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చనున్నారని అదనపు ముఖ్య ఎన్నికల అధికారి లక్ష్మణన్ వెల్లడించారు. అయితే, నితీష్ సొంత జిల్లా, లాలు ఇద్దరు కుమారులు పోటీ చేస్తున్న స్థానాల్లో పోలింగ్ జరుగుతుండటంతో ఈ విడత ఎన్నికలు మహాకూటమికి కీలకం కానున్నాయి. తొలి, రెండో విడతల పోలింగ్లలో 81 స్థానాలకు ఎన్నికలు నిర్వహించిన విషయం విదితమే. నవంబర్ 1, నవంబర్ 5 తేదీలలో నాల్గో, ఐదో విడతల పోలింగ్ నిర్వహిస్తారు. -
మళ్లీ ఓటెత్తిన కశ్మీర్, జార్ఖండ్
‘మూడో దశ’లో 59 శాతం, 61 శాతంగా పోలింగ్ నమోదు రెండు రాష్ట్రాల ప్రజలకు ప్రధాని మోదీ ప్రశంసలు శ్రీనగర్/రాంచీ: ఉగ్ర దాడులు, ఎన్నికల బహిష్కరణ పిలుపులు, ప్రతికూల వాతావరణ పరిస్థితులను లెక్కచేయకుండా జమ్మూకశ్మీర్ ప్రజలు మరోసారి ప్రజాస్వామ్యానికి పట్టం కట్టారు. రాష్ర్టంలో ప్రశాంతంగా సాగుతున్న ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించాలనుకున్న ఉగ్రవాదులు, వేర్పాటువాదులకు ఓటుతో బుద్ధి చెప్పారు. మంగళవారం జమ్మూకశ్మీర్‌లో 16 నియోజకవర్గాలకు జరిగిన మూడో దశ అసెంబ్లీ ఎన్నికల్లో 59 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచే వృద్ధులు సహా ఓటర్లంతా 1,781 పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. చాలా చోట్ల సున్నా డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనా లెక్కచేయకుండా భారీ క్యూలలో నిలబడ్డారు. తొలి రెండు దశల్లో నమోదైన 72 శాతం పోలింగ్‌తో పోలిస్తే మూడో దశలో పోలింగ్ తక్కువే అయినప్పటికీ 2008 అసెంబ్లీ ఎన్నికల్లో ఇవే 16 నియోజకవర్గాల్లో నమోదైన 49 శాతం పోలింగ్‌కన్నా ఇది 9 శాతం అధికం కావడం విశేషం. గుల్మార్గ్లోని ఓ పోలింగ్ కేంద్రం వద్ద కొందరు దుండగులు పెట్రోల్ బాంబు విసిరిన ఘటన మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మూడో దశ ఎన్నికల బరిలో నిలిచిన ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సహా 144 మంది అభ్యర్థుల భవితవ్యం ప్రస్తుతం ఈవీఎంలలో నిక్షిప్తమైంది. బద్గాం జిల్లాలోని చరార్ ఎ షరీఫ్ నియోజకవర్గంలో అత్యధికంగా 82.74 పోలింగ్ శాతం (2008లో 74.58) నమోదైనట్లు ప్రధాన ఎన్నికల అధికారి ఉమాంగ్ నరూలా తెలిపారు. మరోవైపు ఎన్నికల బహిష్కరణకు పిలుపునిచ్చిన వేర్పాటువాద నేత, హురియత్ కాన్ఫరెన్స్ చైర్మన్ సయ్యద్ అలీ షా గిలానీ సొంత పట్టణమైన సోపోర్ నియోజకవర్గంలో అత్యల్పంగా 30 శాతం పోలింగ్ (2008లో 19.95 శాతం) నమోదైందన్నారు. ముఖ్యంగా గత వారం ఉగ్రవాద దాడులు జరిగిన బారాముల్లా జిల్లాలోని యూరి నియోజకవర్గంలో 79 శాతం (2008లో 81.73 శాతం) పోలింగ్ నమోదైనట్లు నరూలా చెప్పారు. మరోవైపు ఒమర్ అబ్దుల్లా ప్రాతినిధ్యం వహించిన బీర్వా నియోజకవర్గంలో గతంతో పోలిస్తే పోలింగ్ 17 శాతం పెరిగిందన్నారు. 2008లో బీర్వాలో 57.17 శాతం పోలింగ్ నమోదవగా ఈసారి ఏకంగా 74.14 శాతం నమోదైందన్నారు. జార్ఖండ్‌లో తగ్గని జోరు... జార్ఖండ్‌లో 17 స్థానాలకు మంగళవారం జరిగిన మూడో దశ అసెంబ్లీ ఎన్నికల్లో 60.89 శాతం పోలింగ్ నమోదైంది. అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడంతో పోలింగ్ మొత్తంమీద ప్రశాంతంగా ముగిసింది. సిల్లీ నియోజకవర్గంలో అత్యధికంగా 74.77 శాతం పోలింగ్ నమోదవగా రాంచీ నియోజకవర్గంలో అత్యల్పంగా 44.44 శాతం పోలింగ్ రికార్డయింది. మావోయిస్టుల ప్రాబల్యం అధికంగా ఉండటంతో 14 నియోజకవర్గాల్లో పోలింగ్ మధ్యాహ్నం 3 గంటలకే ముగియగా మరో 3 నియోజకవర్గాల్లో సాయంత్రం 5 వరకూ పోలింగ్ కొనసాగింది. తొలి రెండు దశల్లో పోలింగ్ శాతం 61.92, 64.68గా నమోదవడం తెలిసిందే. ప్రజాస్వామ్యానికి నూతన శక్తి: మోదీ జమ్మూకశ్మీర్, జార్ఖండ్‌లలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు భారీగా పోలింగ్‌లో పాల్గొంటుండటంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇందుకుగానూ రెండు రాష్ట్రాల ప్రజలను ప్రశంసించారు. పోలింగ్ శాతాల్లో కొత్త రికార్డులు సృష్టిస్తున్నారని, ఇది ప్రజాస్వామ్యానికి నూతన శక్తిని అందిస్తుందని మంగళవారం జార్ఖండ్‌లోని ధన్బాద్లో జరిగిన సభలో మోదీ పేర్కొన్నారు. -
నేడు కశ్మీర్,జార్ఖండ్‌లలో మూడో దశ ఎన్నికలు
-
ఎన్నికల బరిలో కోటీశ్వరులు
సాక్షి, ముంబై: మూడో విడతలో జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్లు దాఖలుచేస్తున్న వివిధ పార్టీల అభ్యర్థుల్లో అత్యధిక శాతం మంది కోటీశ్వరులే ఉన్నారు. ఈ నెల 24వ తేదీన 19 లోక్‌సభ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటి కోసం నామినేషన్ల దాఖలు పర్వం మార్చి 29వ తేదీ నుంచి ప్రారంభమైంది. మంగళవారం సాయంత్రం ఉత్తర ముంబై నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ తరఫున సంజయ్ నిరూపమ్, బీజేపీకి చెందిన గోపాల్ శెట్టి, వాయవ్య ముంబై నుంచి కాంగ్రెస్ తరఫున గురుదాస్ కామత్ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. సంజయ్ నిరూపమ్ రూ.53.93 లక్షలు చరాస్తులు, రూ.47.86 లక్షలు స్థిరాస్తులు ఉన్నాయని నామినేషన్ పత్రంలో పేర్కొన్నారు. భార్య పేరుపై రూ.59.4 లక్షలు చరాస్తులు, కూతురు, తల్లి పేరుపై రూ.34 లక్షల ఆస్తులు ఉన్నాయి. వీటితోపాటు స్థలాలు ఇలా మొత్తం రూ. రెండు కోట్ల ఏడు లక్షల ఆస్తులున్నట్లు పేర్కొన్నారు. మహాకూటమి అభ్యర్థి గోపాల్ శెట్టి రూ. 93.84 లక్షలు చరాస్తులు, భార్య పేరుపై రూ.2.46 కోట్ల విలువచేసే ఆస్తులు ఉన్నాయని నామినేషన్లో పేర్కొన్నారు. తల్లి పేరుపై రూ.4.15 లక్షలు చరాస్తులు, రూ.11 లక్షలు విలువచేసే బంగారు నగలు, బదలాపూర్‌లో రూ.25 లక్షల విలువచేసే ఎకరన్నర భూమి ఉందని తెలిపారు. కాందివలిలో రూ.40 లక్షల విలువచేసే ఫ్లాటు, రూ.65 లక్షల విలువచేసే స్థిరాస్తులున్నాయని స్పష్టం చేశారు. గురుదాస్ కామత్ తన పేరుపై రూ.ఆరు కోట్ల విలువచేసే చరాస్తులు, భార్య పేరుపై రూ.5.82 లక్షలు విలువచేసే ఆస్తులు, రూ.10 కోట్లు విలువచేసే బాండ్లు ఉన్నాయని నామినేషన్ పత్రంలో పేర్కొన్నారు. రూ.27 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, రూ.20 లక్షలు విలువచేసే భూములు, వర్లిలో రూ.మూడు కోట్ల విలువచేసే ఫ్లాటు ఉందని తెలిపారు. ఢిల్లీలో రూ.26 కోట్ల విలువచేసే ఫ్లాటు ఉందని తెలిపారు. వాయవ్య ముంబై నుంచి రాష్ట్రీయ్ ఆమ్ పార్టీ నుంచి పోటీచేస్తున్న బాలీవుడ్ నటి రాఖీ సావంత్ కూడా తన మొత్తం ఆస్తులు రూ.15 కోట్లు ఉన్నట్లు ప్రకటించారు. -
ఈసారీ ‘బుట్టపాలే!’ రచ్చబండారం
సాక్షి, కాకినాడ :తెలుగువారి మధ్య విభజన చిచ్చు పెట్టిన కాంగ్రెస్ సర్కార్ ప్రజల్లో రగిలిన ఆగ్రహజ్వాల లను చల్లార్చే ఉపాయంగా మూడవ విడత రచ్చబండ ను నిర్వహించింది. మొదటి విడత రచ్చబండ 2011లో జనవరి 23 నుంచి 10 వరకు జరిగింది. రెండో విడత కూడా అదే ఏడాది నవంబర్ 2 నుంచి 30 వరకు జరిగింది. షెడ్యూ ల్ ప్రకారం ఈ నెల 11 నుంచి 26 వరకు నిర్వహించ తలపెట్టిన రచ్చబండ-3 సభలు హెలెన్, లెహర్ తుపాన్ల వల్ల 30వ తేదీ వరకు సాగాయి. జిల్లాలో ఇప్పటివరకు 63 సభలు నిర్వహించా రు. మొదటి రెండు రచ్చబండల్లో రేషన్‌కార్డులు, పింఛన్లు, గృహరుణాలు, ఇంటి స్థలాలు, వ్యక్తిగత రుణాలు తదితర సుమారు 20కి పైగా సంక్షేమ పథకాల కోసం దరఖాస్తులు వెల్లువెత్తినప్పటికీ ప్రభుత్వం కేవలం రేషన్ కార్డులు, పింఛన్లు, గృహరుణాలకు వచ్చిన దరఖాస్తులనే పరిగణనలోకి తీసుకుంది. గత రెండు రచ్చబండల్లో రేషన్‌కార్డులకు 1,26, 754 దరఖాస్తులు రాగా, 1,11,664 అర్హత పొందాయి. కానీ ఇందులో సుమా రు 85,906 మంది మాత్రమే కార్డులకు అర్హులుగా నిర్ధారించారు. వారిలోనూ తిరిగి సుమారు 26 వేల మందికి మొండి చేయి చూపారు. 85,906 మందిలోనూ ఇప్పటి వరకు 5 వేల మందికి పైగా మా త్రమే కార్డులిచ్చి మిగిలిన వారికి 66,474 కూపన్లు పంపిణీ చేశారు. 10,065 మం దికి ఇప్పటికే కార్డులున్నాయని పేర్లను తొలగించారు. మూడవ విడత రచ్చబండలో రేషన్‌కార్డుల కోసం ఇప్పటి వరకు 28,817 దరఖాస్తులు వచ్చాయి. పింఛన్లదీ అదే దారి.. మొదటి రెండు విడతల్లో పింఛన్ల కోసం లక్ష పైగా దరఖాస్తులు రాగా కేవలం 53, 843మంది మాత్రమే అర్హులని తేల్చారు. లక్షన్నర మందికి పైగా గృహ రుణాల కోసం దరఖాస్తు చేస్తే లక్ష 5 వేల మందికి మంజూరు ఉత్తర్వులిచ్చారు. పింఛన్లకు 53, 843 మందిని అర్హులుగా నిర్ధారించినప్పటికీ 42,027 మందికి మాత్రమే మంజూరు ఉత్తర్వులందజేశారు. అలాగే వికలాంగ పింఛన్లకు 5722 మందిని అర్హులుగా నిర్ధారించగా, 5021 మందికి మాత్రమే పంపిణీ చేశారు. కాగా మూడవ విడత పింఛన్లకు మరో 22,422 దరఖాస్తులు వచ్చాయి. శనివారం కాకినాడ రచ్చబండలో వచ్చిన దరఖాస్తులను కూడా పరిగణనలోకి తీసుకుంటే ఈ సంఖ్య 40 వేలు దాటొచ్చు. అంటే గత రెండు రచ్చబండల్లో అర్హులైన వారితో కలిపితే సుమారు 50 వేల మంది పింఛన్ల కోసం ఎదురుచూసే పరిస్థితి నెలకొంది. మూడోవంతు మందికి నిరీక్షణే గృహరుణాలకు సంబంధించి లక్షా 5 వేల మందికి మంజూరు చేస్తున్నట్టు ప్రకటించిన అధికారులు ఇప్పటి వరకు 51,933 మందికి మంజూరు ఉత్తర్వులందజేశారు. కాగా మూడవ విడత రచ్చబండలో ఇప్పటి వరకు గృహరుణాల కోసం 17,785 దరఖాస్తులొచ్చాయి. బంగారుతల్లి పథకానికి సంబంధించి 3406మందిని అర్హులుగా గుర్తించినా ఇప్పటి వరకు 2626 మందికి సర్టిఫికెట్లు అందజేసినట్టు చెప్పుకొచ్చారు. రేషన్కూపన్లు, పింఛన్లు, గృహరుణాల మంజూరు ఉత్తర్వుల పంపిణీకి తప్ప ఈ రచ్చబండలో వచ్చిన దరఖాస్తుల్లో ఏ ఒక్కదాన్నీ పరిష్కరించిన దాఖలాలు లేవు. గత రెండు రచ్చబండల్లో వచ్చిన దరఖాస్తుల్లో అర్హులైన వారిలో మూడవ వంతు మందికి ఎదురుచూపు తప్పడం లేదు. వారికి మూడవ విడత అర్జీదారులు తోడవుతున్నారు. లక్షలాదిగా పేరుకుపోయిన ఈ దరఖాస్తులను పరిష్కరించాలంటే కోట్లాది రూపాయలు అవసరమవుతాయి. మరో నాలుగైదు నెలల్లో ఎన్నికలు రానున్నాయి. ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చేలోగానే నిధులు సమకూర్చే పరిస్థితిలో రాష్ర్ట ప్రభుత్వం లేదని అధికారులే అంటున్నారు. అంటే ఈ రచ్చబండ దరఖాస్తులు కూడా గతంలో మాదిరిగానే బుట్టదాఖలయ్యే అవకాశాలే ఎక్కువన్న మాట. ప్రభుత్వం రచ్చబండకు సంబంధించి ప్రచారం పట్ల చూపుతున్న ఆరాటంలో వందో వంతు చిత్తశుద్ధి కూడా దాని అమలులో చూపడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.