
సాక్షి, న్యూఢిల్లీ: మహమ్మారి కరోనా వైరస్ రెండో దశలో తీవ్రస్థాయిలో విజృంభించడంతో దేశంలో పరిస్థితులు దయనీయంగా మారాయి. కరోనా దెబ్బకు సామాన్యుడితో పాటు ధనిక వర్గాలు కూడా తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంకా రెండో దశ చల్లారక ముందే మూడో దశకు సిద్ధంగా ఉండాలని కేంద్రమంత్రి ప్రజలకు సూచించారు. మూడో దశపై బుధవారం కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రెండో దశ కాకుండా మూడు, నాలుగో దశలు కూడా ఉన్నాయని, వాటికి ప్రజలు సిద్ధంగా ఉండాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హెచ్చరించారు.
న్యూఢిల్లీలో బుధవారం జాతీయ మీడియాతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా పై వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాలు మౌలిక సదుపాయలు పెంచుకోవాలని ఈ సందర్భంగా మంత్రి సూచించారు. వైరస్‌పై ప్రజలు ఆందోళన చెందకుండా ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఆక్సిజన్ సరఫరాకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని మంత్రి గడ్కరీ చెప్పారు. మహారాష్ట్రతో పాటు దేశవ్యాప్తంగా ఆక్సిజన్ సరఫరాను వేగవంతం చేస్తామని తెలిపారు. కరోనాను ఎదుర్కొనేలా వైద్య సేవలు పెరగాలని పేర్కొన్నారు. రెమిడెసివర్ కొరత నేపథ్యంలో రోజుకు 30 వేల డోసుల ఉత్పత్తి చేస్తున్నట్లు వివరించారు.
చదవండి: కరోనాతో ఒకేరోజు ముగ్గురు ప్రముఖులు కన్నుమూత
చదవండి: అమానవీయం: సైకిల్‌పై భార్య మృతదేహం తరలింపు
Comments
Please login to add a commentAdd a comment