న్యూఢిల్లీ: కోవిడ్–19 వ్యాక్సిన్ కోవావాక్స్‌ను బూస్టర్ డోసుగా వినియోగించుకోవడం కోసం మూడో దశ ట్రయల్స్‌కు అనుమతినివ్వాలని ఇండియా సెంట్రల్ డ్రగ్ అథారిటీకి చెందిన నిపుణుల కమిటీ ఆదివారం సిఫారసు చేసింది. వయోజనుల్లో ఈ టీకాను బూస్టర్ డోసుగా వేసుకోవచ్చునని తెలిపింది. ది డ్రగ్స్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అత్యవసర పరిస్థితుల్లో ఈ టీకాను వినియోగించడానికి అనుమతినిచ్చింది. ఇప్పటికే స్పుత్నిక్ వీని కూడా బూస్టర్ డోసుగా వాడడానికి అనుమతులున్నాయి. ఇప్పుడు కొవొవాక్స్ ప్రయోగాలు పూర్తయితే మరో కరోనా టీకా అందుబాటులోకి వస్తుందని అధికార వర్గాలు వెల్లడించాయి.
(చదవండి: మెట్రోలో టికెట్ కొని ప్రయాణించిన ప్రధాని మోదీ.. ఎక్కడంటే!)
Comments
Please login to add a commentAdd a comment