Trail
-
త్వరలో నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం
జేవార్: ఉత్తరప్రదేశ్‌లోని జేవార్‌లో నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం పూర్తయ్యింది. నవంబర్ 15న తొలిసారిగా ఈ విమానాశ్రయంలో విమానం ల్యాండ్ కానుంది. రెండవ దశ ట్రయల్ ఆపరేషన్‌లో భాగంగా విమానం నవంబర్ 15న ఇక్కడ ల్యాండ్ కానుంది. డిసెంబర్ 15 వరకు ట్రయల్ రన్ కొనసాగనుంది. ఈ విమానాశ్రయం వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి సాధారణ ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది.నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అరుణ్ వీర్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ ట్రయల్ రన్ రెండవ దశలో అకాసా, ఇండిగో, ఎయిర్ ఇండియా విమానాలు ప్రతిరోజూ ఇక్కడ రాకపోకలు సాగిస్తాయన్నారు. నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 వరకు జరిగే ఈ ట్రయల్‌లో ప్రతిరోజూ ఇక్కడి నుంచే విమానాల ల్యాండింగ్, టేకాఫ్ జరుగుతాయన్నారు.డిసెంబరు 20 నాటికి ట్రయల్ రన్ డేటాను డీజీఈసీఏ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు. దీని తర్వాత ఎయిర్డోమ్ లైసెన్స్ కోసం కూడా దరఖాస్తు చేయనున్నారు. మార్చి 20 నాటికి లైసెన్స్ వస్తుందని ఎయిర్పోర్ట్ అథారిటీ భావిస్తోంది. 2025 ఏప్రిల్ 17 నుంచి జేవార్ విమానాశ్రయంలో వాణిజ్య విమానాలు రాకపోకలు కొనసాగనున్నాయి. మొదటి రోజు నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయంలో 30 విమానాలు ల్యాండ్ అవుతాయి. ఇందులో జ్యూరిచ్, సింగపూర్, దుబాయ్ నుండి మూడు అంతర్జాతీయ విమానాలు సహా రెండు కార్గో విమానాలు కూడా ఉన్నాయి.ముందుగా 30 విమానాల నిర్వహణకు ప్రణాళిక సిద్ధం చేశామని, ఇందులో 25 దేశీయ, మూడు అంతర్జాతీయ, రెండు కార్గో విమానాలు ఉన్నాయని అరుణ్ వీర్ సింగ్ తెలిపారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) రన్‌వే, గాలి ప్రవాహం, మొదటి దశ ట్రయల్స్‌ను పరిశీలించిన తర్వాత దీనికి ఆమోదం తెలిపింది. నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం లక్నో, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, డెహ్రాడూన్‌తో సహా పలు పెద్ద నగరాలకు తొలుత కనెక్ట్ కానుంది.ఇది కూడా చదవండి: మహాప్రాణులకు మళ్లీ జీవం! -
జాడ లేని జనసేన.. పవర్ స్టార్ ప్రభావం ఏదీ?
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనకి బిగ్ షాక్ తగిలింది. తెలంగాణలో పోటీ చేసిన ఎనిమిది స్థానాల్లో జనసేన అభ్యర్థులకు ఎదురుదెబ్బ తగిలింది. జనసేన గుర్తు గ్లాస్ పగలిపోయేలా జనాలు పవన్‌కు పట్టించుకోలేదు. ఏపీలో మాదిరిగానే తెలంగాణలో కూడా జనసేనను ప్రజలు పట్టించుకోలేదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల హవా సాగుతోంది. అధికార బీఆర్ఎస్ ఆధిక్యం తగ్గుతూ వస్తోంది. బీజేపీ 8 చోట్ల ఆధిక్యం కనబరుస్తోంటే.. ఆ పార్టీతో పొత్తు పెట్టుకుని బరిలోకి దిగిన జనసేన జాడ అస్సలు కనిపించకుండా పోయింది. పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి బరిలోకి దిగింది. బీజేపీతో పొత్తుతో మొత్తం 8 స్థానాల్లో ఆ పార్టీ పోటీ చేసింది. కౌంటింగ్ ప్రారంభమై పలు రౌండ్లు ముగిసినా ఆ పార్టీ అభ్యర్థులు ఒక్క చోట కూడా ప్రభావం చూపించలేకపోతున్నారు. పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్వయంగా ప్రచారం చేసి తమ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అయినా ఓటర్లు పెద్దగా పట్టించుకున్నట్లు లేరు. ముఖ్యంగా కూకట్పల్లి నియోజకవర్గంలో తమ అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ్‌కుమార్ గెలుస్తారని జనసైనికులు నమ్మకం పెట్టుకున్నారు. కానీ ఆ నియోజకవర్గంలో 5 రౌండ్లు ముగిసే సరికి జనసేన అభ్యర్థి వెనుకబడి మూడో స్థానంలో కొనసాగుతున్నారు. -
'ట్రయల్స్ నెగ్గింది కూర్చోవడానికి కాదు.. సుప్రీంకు వెళతాం'
న్యూఢిల్లీ: స్టార్ రెజ్లర్లు బజరంగ్ పూనియా, వినేశ్ ఫొగాట్‌లకు సెలక్షన్స్నుంచి మినహాయింపునిస్తూ నేరుగా ఆసియా క్రీడలకు ఎంపిక చేయడంపై నమోదైన రిట్ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేస్తూ న్యాయమూర్తి జస్టిస్ సుబ్రహ్మణ్యం ప్రసాద్ తీర్పునిచ్చారు. ఢిల్లీ హైకోర్టు తీర్పు ఇచ్చిన కొన్ని గంటలకే సెలక్షన్ ట్రయల్స్‌లో అంతిమ్ పంఘాల్ గెలిచింది. శనివారం నిర్వహించిన 53 కేజీల సెలక్షన్ ట్రయల్స్‌లో ఆమె విజేతగా నిలిచింది. అయితే ఇదే కేటగిరీలో వినేశ్‌ను ఇప్పటికే ఎంపిక చేయడంతో అంతిమ్ స్టాండ్‌బైగా మాత్రమే ఉండే అవకాశం ఉంది. కానీ తాను స్టాండ్‌బైగా కూర్చునేందుకు సిద్ధంగా లేనని ఆమె ప్రకటించింది. హైకోర్టులో ప్రతికూలంగా వచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టులో పోరాడతానని 19 ఏళ్ల పంఘాల్ తెలిపింది. ‘కష్టపడి ట్రయల్స్ నెగ్గిన నేను ఎందుకు స్టాండ్‌బైగా ఉండాలి. దర్జాగా మినహాయింపు పొందినవారే కూర్చోవాలి’ అని వినేశ్‌ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించింది. బజరంగ్, వినేశ్‌లను రెజ్లింగ్ సమాఖ్య అడ్హాక్ కమిటీ ట్రయల్స్ లేకుండానే ఆసియా క్రీడలకు ఎంపిక చేసింది. దీనిని సవాల్ చేస్తూ యువ రెజ్లర్లు అంతిమ్ పంఘాల్, సుజీత్ కల్కాల్ ఈ నెల 19న కోర్టును ఆశ్రయించారు. EXCLUSIVE 🎥 "I will appeal to Supreme Court." said Antim Panghal After Vinesh Phogat, Bajrang Punia's Asian Games Trials Exemption Allowed By Delhi High Court. #AntimPanghal #wrestling #AsianGames2023 #AsianGames pic.twitter.com/v2XuiyVCAZ — nnis (@nnis_sports) July 22, 2023 చదవండి: #koreaOpen: సాత్విక్-చిరాగ్ జోడి సంచలనం.. కొరియా ఓపెన్ కైవసం -
కోవావాక్స్ ‘మూడో దశ’కు నిపుణుల కమిటీ సిఫారసు
న్యూఢిల్లీ: కోవిడ్–19 వ్యాక్సిన్ కోవావాక్స్‌ను బూస్టర్ డోసుగా వినియోగించుకోవడం కోసం మూడో దశ ట్రయల్స్‌కు అనుమతినివ్వాలని ఇండియా సెంట్రల్ డ్రగ్ అథారిటీకి చెందిన నిపుణుల కమిటీ ఆదివారం సిఫారసు చేసింది. వయోజనుల్లో ఈ టీకాను బూస్టర్ డోసుగా వేసుకోవచ్చునని తెలిపింది. ది డ్రగ్స్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అత్యవసర పరిస్థితుల్లో ఈ టీకాను వినియోగించడానికి అనుమతినిచ్చింది. ఇప్పటికే స్పుత్నిక్ వీని కూడా బూస్టర్ డోసుగా వాడడానికి అనుమతులున్నాయి. ఇప్పుడు కొవొవాక్స్ ప్రయోగాలు పూర్తయితే మరో కరోనా టీకా అందుబాటులోకి వస్తుందని అధికార వర్గాలు వెల్లడించాయి. (చదవండి: మెట్రోలో టికెట్ కొని ప్రయాణించిన ప్రధాని మోదీ.. ఎక్కడంటే!) -
ఐఏసీ విక్రాంత్ మూడోదఫా జలపరీక్షలు ఆరంభం
న్యూఢిల్లీ: దేశీయంగా నిర్మించిన యుద్ధవిమాన వాహక నౌక (ఐఏసీ) విక్రాంత్ మరో దఫా జల పరీక్షలు ఆదివారం ఆరంభమయ్యాయి. రూ.23వేల కోట్ల ఖర్చుతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ నౌకను వచ్చే ఆగస్టులో దీన్ని నేవీకి అందిస్తారు. అందుకే ఈ లోపు వివిధ దఫాలుగా వివిధ పరిస్థితుల్లో దీన్ని పరీక్షిస్తున్నారు. ఇందులో భాగంగా గత ఆగస్టులో, అక్టోబర్‌లో సముద్రంలో ట్రయిల్స్ నిర్వహించారు. చదవండి: మీసాలపై తగ్గేదేలే... తీయననంటే తీయను తాజాగా మరోమారు సీ ట్రయిల్స్ ఆరంభిస్తున్నామని, స్వేచ్ఛాజలాల్లో(హై సీస్) పలు రకాల నౌకా విన్యాసాలు నిర్వహిస్తామని నేవీ ప్రతినిధి వివేక్ మధ్వాల్ చెప్పారు. నౌకకున్న సెన్సార్ సూట్లను కూడా పరీక్షిస్తామన్నారు. డీఆర్డీఓకి చెందిన ఎన్ఎస్టీఎల్ సైంటిస్టులు తాజా పరీక్షలను పర్యవేక్షిస్తారు. ఈ నౌక నుంచి ఎంఐజీ జెట్లు, కమోవ్ హెలిక్యాప్టర్లును ప్రయోగించవచ్చు. దీని గరిష్ట వేగం 28 నాట్స్. #WATCH | Indigenous Aircraft Carrier INS Vikrant heads out for the next set of sea trials. pic.twitter.com/S1Yt8crcqu — ANI (@ANI) January 9, 2022 కొచ్చిన్ షిప్‌యార్డ్ దీన్ని నిర్మిస్తోంది. ప్రస్తుతం భారత్ వద్ద ఐఎన్ఎస్ విక్రమాదిత్య అనే యుద్ధ నౌక ఉంది. విక్రాంత్ నిర్మాణంతో సొంతంగా తయారు చేసుకున్న యుద్ధనౌకలున్న దేశాల జాబితాలోకి భారత్ చేరింది. కరోనా కారణంగా విక్రాంత్ పరీక్షల్లో జాప్యం జరిగింది. వీలైనంత త్వరగా ట్రయిల్స్ పూర్తిచేసి, సకాలంలో నౌకను నావికా దళంలో చేర్చేందుకు పలు సంస్థలకు చెందిన పలువురు నిపుణులు సంయుక్తంగా శ్రమిస్తున్నారని వివేక్ తెలిపారు. -
తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటే పరీక్షలకు అనుమతి: సుప్రీంకోర్టు
ఢిల్లీ: సీబీఎస్ఈ పరీక్షల రద్దు అంశంలో నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. పరీక్షల రద్దు అంశంపై ఏపీ ప్రభుత్వ వైఖరిని సుప్రీంకోర్టు అడిగింది. ఏపీ తరపు న్యాయవాది పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం అనుకూలంగా ఉందని పేర్కొన్నారు. కాగా విద్యార్థుల ఆరోగ్య భద్రతపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని సుప్రీంకోర్టు అడిగింది. పరీక్ష హాల్లో కేవలం 15 నుంచి 20 మందిని మాత్రమే అనుమతిస్తున్నామని ఏపీ ప్రభుత్వ న్యాయవాది వెల్లడించారు. విద్యార్థుల మధ్య కనీసం 5 అడుగుల భౌతిక దూరం ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. పదోతరగతి విద్యార్థులకు గ్రేడ్లు మాత్రమే ఇస్తున్నామని కోర్టుకు తెలిపారు. ప్రభుత్వం తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటే పరీక్షలకు అనుమతి ఇస్తామని సుప్రీంకోర్టు ఆ సందర్భంగా స్పష్టం చేసింది. కోర్టుకు తెలిపిన అంశాలను రేపు అఫిడవిట్ దాఖలు చేస్తామని ఏపీ ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. కేసు విచారణను సుప్రీంకోర్టు ఎల్లుండికి వాయిదా వేసింది. చదవండి: రాష్ట్రానికి రావాల్సిన నిధులు, బకాయిలపై చర్చ -
ఫైజర్ ప్రయోగాల్లో అపశ్రుతి
ఫార్మా కంపెనీ ఫైజర్ తయారు చేస్తున్న కోవిడ్ టీకా ప్రయోగాల్లో అపశ్రుతి దొర్లింది. టీకా తీసుకున్న కొంతమందిలో కొన్ని దుష్పరిణామాలు కనిపించాయన్న వార్తలు వస్తున్నాయి. జలుబు నివారణకు టీకా తీసుకున్నప్పుడు కనిపించే ప్రభావాల మాదిరిగానే ఇవీ ఉన్నాయని వారు చెబుతున్నారు. టీకా దుష్పరిణామం మద్యం తీసుకున్న తరువాత వచ్చే హ్యాంగోవర్ మాదిరిగా ఉందని ఒక కార్యకర్త చెప్పారు. ఫైజర్ కంపెనీ ఆరు దేశాల్లో సుమారు 43,500 మందిని ఎంపిక చేసి టీకా ఇస్తున్న విషయం తెలిసిందే. టెక్సస్‌లోని 45 ఏళ్ల కార్యకర్త కారీ టీకా రెండో డోసు తీసుకున్న తరువాత జ్వరం, ఒళ్లునొప్పులు, తలనొప్పి వంటివి కనిపించాయని తెలిపారు. కారీ తొలి డోసు సెప్టెంబర్‌లో నెలలో తీసుకున్నారు. ఇదిలా ఉండగా.. ప్రయోగాల్లో తమకు ఎలాంటి తీవ్రస్థాయి దుష్ప్రభావాలూ కనిపించ లేదని ఫైజర్, దాని భాగస్వామి సంస్థ∙బయోఎన్టెక్లు తెలిపాయి. భారత్‌లో రికవరీ రేటు 92.89% భారత్‌లో కరోనా కేసులు ఒక్క రోజులోనే మరో 47,905 బయటపడటంతో మొత్తం కేసుల సంఖ్య 86,83,916కు చేరుకుంది. ఈ మహమ్మారి బారిన పడి ఇప్పటి వరకు 80,66,501 మంది కోలుకోవడంతో రికవరీ రేటు 92.89% శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం పేర్కొంది. అదేవిధంగా, ఈ వ్యాధితో 24 గంటల్లో దేశవ్యాప్తంగా మరో 550 మంది చనిపోవడంతో మృతుల సంఖ్య 1,28,121గా నమోదైంది. కోవిడ్ టీకా పరిశోధనలకు రూ.900 కోట్లు కేటాయించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం ప్రకటించారు. కోవిడ్ సురక్ష మిషన్ కోసం ఈ నిధులను డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీకి అందిస్తున్నామని మంత్రి తెలిపారు. టీకా పరిశోధనలు, అభివృద్ధి కోసం ఈ నిధులను ఖర్చు చేస్తామని పంపణీ కోసం వేరుగా నిధులు అందిస్తామని చెప్పారు. -
త్వరలోనే ప్రత్యక్ష విచారణ చేపట్టనున్న కోర్టులు?
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా కారణంగా దేశవ్యాప్తంగా న్యాయస్థానాల్లో నిలిచిపోయిన ప్రత్యక్ష విచారణ పద్ధతి వచ్చే వారం నుంచి మళ్లీ మొదలయ్యే అవకాశమున్నట్లు కనిపిస్తోంది. సుప్రీంకోర్టుతో పాటు కొన్ని ఎంపిక చేసిన న్యాయస్థానాల్లో ప్రత్యక్ష విచారణను మొదలుపెట్టేందుకు ఏడుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో కూడిన కమిటీ సిఫారసు చేసింది. సుప్రీంకోర్టులోని మొత్తం 15 బెంచ్‌లలో కనీసం రెండు మూడు బెంచ్‌లలో ప్రత్యక్ష విచారణ చేపట్టాలని కమిటీ సూచించింది. దీంతో వచ్చే వారం నుంచి కొన్ని అదనపు రక్షణ ఏర్పాట్లతో విచారణ ప్రారంభమయ్యే అవకాశముంది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో మార్చి 25న దేశవ్యాప్త లాక్డౌన్ ప్రకటించింది మొదలు, సుప్రీంకోర్టు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మాత్రమే కేసుల విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని ఏడుగురు జడ్జిల ప్యానెల్ మంగళవారం సమావేశమైందని, రెండు మూడు సుప్రీంకోర్టు బెంచ్‌లలో ప్రత్యక్ష విచారణ చేపట్టడాన్ని పరిగణిస్తున్నట్లు తెలిపిం దని సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఆన్ రికార్డ్స్ అధ్యక్షుడు శివాజీ ఎం.జాధవ్ తెలిపారు. చదవండి: గహ్లోత్, పైలట్ షేక్‌హ్యాండ్! -
ఈసీ ఓటు చాలెంజ్..!
సాక్షి, హుస్నాబాద్ రూరల్: పోలింగ్ కేంద్రాలకు వచ్చిన ఓటర్లను గుర్తించేందుకు గుర్తింపు పత్రాలు అవసరం. ఎన్నికల కమిషన్ కూడా ఆదేశాలు జారీ చేసింది. ఓటు వేసేందుకు వచ్చిన ఓటర్లు ఫొటో గుర్తింపు కార్డులు చూపించాల్సి ఉంటుంది. ఓటరు జాబితాలో పేర్లు తప్పుగా ఉండటం వల్ల ఓటు వేసేందుకు వచ్చిన వ్యక్తిని ఓటు వేయకుండా ఆయా పార్టీల ఎలక్షన్ ఏజెంట్లు అభ్యంతరం చెప్తే ఓటు వేసేందుకు ఓటరు చాలెంజ్ చేసే అవకాశం ఉంది. ఎవరి గుర్తింపునైనా ఏజెంట్లు చాలెంజ్ చేయాలనుకుంటే ప్రిసైడింగ్ అధికారి వద్ద రెండు రూపాయలు జమ చేయాలి. వారు సవాల్ చేసిన ఓటరు గుర్తింపు విషయంలో విచారణ జరపాల్సి ఉంటుంది. విచారణ తర్వాత వ్యక్తి గుర్తింపు నిర్ధారణ అయినట్టు సంతృప్తి చెందితే అతడిని ఓటు వేయనీయవచ్చు. ఓటరు జాబితలో పేర్లు తప్పుగా ఉంటే ఓటు వేసేందుకు ఇతర రాజకీయ పార్టీల ఎలక్షన్ ఏజెంట్లు అభ్యంతరాలు చెప్తే, ఓటరు ‘చాలెంజ్ ఓటు’ హక్కును ఉపయోగించుకోవచ్చు. బోగస్ ఓటు అని తేలితే.. ఓటరు జాబితాలో పేరు ఉన్న ఓటరు ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చినప్పుడు అతని ఓటును ఇతరులు ఏవరైనా వేసినప్పుడు అక్కడ ఎలక్షన్ ఏజెంట్లు అభ్యంతరాలు చెప్పుతారు. అప్పుడు ఓటరు నేనే నిజమైన ఓటరును అని నిరూపించుకొనేందుకు చాలెంజ్ ఓటును ఎలక్షన్ కమిషన్ కల్పించింది. – కె.అనంత్‌రెడ్డి, ఆర్డీవో దీనికి ఛాలెంజ్ చేసిన వ్యక్తి ప్రిసైడింగ్ అధికారి వద్ద రెండు రూపాయల రుసుం చెల్లించి విచారణ అనంతరం ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. విచారణలో ఓటరు బోగస్ అని తేలితే చట్టరీత్య చర్యలు తీసుకుంటారు. ఓటరుపై విచారణ ఇలా.. బోగస్ ఓటరుపై సవాల్ చేసిన ఏజెంటు ఆ వ్యక్తిని అనుమానిస్తున్నందుకు రుజువులు చూపించాల్సి ఉంటుంది. తమ సవాల్‌ను సమర్థిస్తూ నిరూపణలు చూపలేని పక్షంలో సవాల్‌ను నిరాకరించవచ్చు. పోలింగ్ ఏజెంటు బోగస్ ఓటరుకు సాక్షాలను నిరూపిస్తే అతను ఓటరు కాదని నిర్ధారించిన తర్వాత ఓటరుకు నిరూపించుకొనే అవకాశం ఇవ్వాలి. దీనికి తాను ఓటరునని గుర్తింపును చూపిస్తే అతనిని ఓటు వేయనీయవచ్చు. అలా కాని పక్షంలో గ్రామ అధికారి ద్వారా లేదా ఇతర అధికారుల చేత గుర్తించవచ్చు. విచారణలో బోగసు ఓటరు అని తేలితే అక్కడే ఉండే పోలీసులకు అతనిని అప్పగించాల్సి ఉంటుంది. ఓటరు నిర్ధారణ జరిగితే ఓటు వేయనిస్తారు. -
ఫేక్ యూనివర్సిటీ కేసు: మిషిగన్ ఫెడరల్ కోర్టులో ట్రయిల్
-
‘అయోధ్య’ నుంచి వైదొలిగిన జస్టిస్ లలిత్
న్యూఢిల్లీ: అయోధ్య భూ వివాద కేసును విచారించాల్సిన రాజ్యాంగ ధర్మాసనం నుంచి జస్టిస్ యూయూ లలిత్ అనూహ్యంగా వైదొలిగారు. దీంతో కొత్త ధర్మాసనాన్ని ఏర్పాటుచేసి జనవరి 29న విచారణ ప్రారంభిస్తామని సుప్రీంకోర్టు గురువారం ప్రకటించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనంలో సభ్యుడైన లలిత్..ఇకపై జరిగే విచారణలో పాల్గొనేందుకు నిరాకరించి తనంతట తానే తప్పుకున్నారు. రామ మందిర నిర్మాణ కేసుకే సంబంధించి 1997లో అప్పటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కల్యాణ్‌సింగ్ తరఫున లాయర్‌గా జస్టిస్ లలిత్ ప్రాతినిధ్యం వహించిన సంగతిని సీనియర్ అడ్వొకేట్ రాజీవ్ ధావన్ ప్రస్తావించారు. ఈ కేసు విచారణలో జస్టిస్ లలిత్ కొనసాగేందుకు తనకేం అభ్యంతరం లేదని ధావన్ స్పష్టం చేసినా తుది నిర్ణయం మాత్రం జస్టిస్ లలిత్‌దేనని బెంచ్ తెలిపింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ఈ ధర్మాసనంలో జస్టిస్ లలిత్‌తో పాటు జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ డీవై చంద్రచూడ్ ఉన్నారు. ముగ్గురికి సూచిస్తే ఐదుగురికి ఎందుకిచ్చారు?: ధావన్ జస్టిస్ లలిత్ స్వచ్ఛందంగా వైదొలగడంతో అయోధ్య కేసు విచారణను వాయిదా వేసి కొత్త బెంచ్‌ను నియమించడం మినహా మరో మార్గం లేదని కోర్టు తెలిపింది. విచారణలో ముస్లిం పిటిషన్‌దారుడు సిద్దిఖి తరఫున రాజీవ్ ధావన్, హిందూ కక్షిదారుల తరఫున హరీశ్ సాల్వే వాదనలు వినిపించారు. అయోధ్య భూ వివాద కేసును ముగ్గురు సభ్యుల ధర్మాసనానికి బదిలీ చేయాలని త్రిసభ్య బెంచ్ గతేడాది సెప్టెంబర్ 27న కోర్టుకు సూచించినా ఐదుగురు సభ్యుల ధర్మాసనానికి ఎందుకు కేటాయించారని ధావన్ ప్రశ్నించారు. దీనికి సాల్వే స్పందిస్తూ..రాజ్యాంగ సంబంధ ప్రశ్నలు తలెత్తినప్పుడు, ఆ అంశాన్ని ఐదుగురు సభ్యుల కన్నా తక్కువ లేని బెంచ్‌కే కేటాయించాలని అన్నారు. ప్రధాన న్యాయమూర్తి తన పాలనాధికారాలు వినియోగించి ఈ కేసును ఐదుగురు సభ్యుల ధర్మాసనానికి కేటాయించారని కోర్టు వెల్లడించింది. ఐదుగురు సభ్యుల బెంచ్ నియామకం త్రిసభ్య ధర్మాసనం నిర్దేశించిన మార్గదర్శకాలకు విరుద్ధంగా ఏమీ లేదని స్పష్టం చేసింది. అవసరానికి తగినట్లుగా ఏ బెంచ్‌లో ఎందరు సభ్యులుండాలో నిర్ణయించే అధికారం సీజేఐకి దఖలుపడిందని తెలిపింది. కొత్త బెంచ్ వేలాది పేజీల సాక్ష్యాలు, దస్తావేజులు, సాక్షుల వాంగ్మూలాలను పరిశీలించాల్సి ఉంది. ఇప్పటి వరకూ 88 మంది చెప్పిన 13886 పేజీల సాక్ష్యాలు, 257 డాక్యుమెంట్లు, వీడియో టేపులను భద్రపరిచారు. వాళ్లంతా సీజేఐలవుతారు! జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ప్రస్తుత రాజ్యాంగ ధర్మాసనంలో సభ్యులైన జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌లు వరుసగా ఒకరి తరువాత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు అయ్యే అవకాశాలున్నాయి. జస్టిస్ రంజన్ గొగోయ్ నవంబర్‌లో పదవీ విరమణ చేశాక సంప్రదాయం ప్రకారం.. ఆయన తరువాత అత్యంత సీనియర్ న్యాయమూర్తి అయిన జస్టిస్ ఎస్ఏ బాబ్డే సీజేఐగా బాధ్యతలు చేపట్టొచ్చు. 2021లో జస్టిస్ బాబ్డే పదవీ కాలం ముగిసిన తరువాత తెలుగు వ్యక్తి ఎన్వీ రమణకు సుప్రీం తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా అవకాశం లభించొచ్చు. 2022లో జస్టిస్ రమణ పదవీ విరమణ తరువాత జస్టిస్ యూయూ లలిత్ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యే అవకాశం ఉంది. 2022 నవంబర్‌లో జస్టిస్ లలిత్ పదవీకాలం ముగిశాక జస్టిస్ చంద్రచూడ్ సీజేఐగా నియమితులై 60 ఏళ్లు వచ్చే వరకు అంటే 2024 వరకు పదవిలో కొనసాగొచ్చు. -
‘అయోధ్య’ కేసు విచారణలో కొత్త ట్విస్ట్!
న్యూఢిల్లీ: అయోధ్య భూ వివాదం కేసు కీలకమైన మలుపు తీసుకుంది. కేసును విచారిస్తున్న రాజ్యాంగ ధర్మాసనం నుంచి జస్టిస్ యు.యు లలిత్ తప్పుకున్నారు. గురువారం అలహాబాద్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో దాఖలైన 14 పిటిషన్లపై ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరిపింది. ఈ కేసు విచారణను జనవరి 29కి ధర్మాసనం వాయిదా వేసింది. అనంతరం ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం నుంచి జస్టిస్ లలిత్ వైదొలిగారు. జస్టిస్ లలిత్ గతంలో కల్యాణ్ సింగ్ తరుపున అయోధ్య కేసు వాదించారు. కాగా న్యాయవాది రాజీవ్ ధావన్ ధర్మాసనంలో జస్టిస్ లలిత్ ఉండటంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజీవ్ ధావన్ అభ్యంతరం మేరకు జస్టిస్ లలిత్ ధర్మాసనం నుంచి తప్పుకున్నారు. జస్టిస్ లలిత్ స్థానంలో మరొకరిని రాజ్యాంగ ధర్మాసనంలో చేర్చే వరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ ఆధ్వర్యంలోని నలుగురు సభ్యుల ధర్మాసనం కేసు విచారణను చేపట్టనుంది. -
ఈనెల 29న అయోధ్య కేసు విచారణ
-
కోడిపందాలపై హైకోర్టులో విచారణ
-
మాల్యా విచారణ: కోర్టులో హై డ్రామా
లండన్: భారీ రుణఎగవేతదారుడు, మద్యం వ్యాపారవేత్త విజయ్ మాల్యా(61)పై లండన్‌లోని వెస్ట్ మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు ఎట్టకేలకు విచారణ ప్రారంభం కానుంది. అయితే మరికొద్ది సేపట్లో విచారణ ప్రారంభం నుండగా ఆకస్మాత్తుగా ఫైర్ అలారం మోగడంతో హై డ్రామా నెలకొంది. దీంతో దాదాపు గంటన్నరపాటు విచారణ నిలిపి వేసినట్టు తెలుస్తోంది. విజయ్‌మాల్యా కోర్టు ప్రాంగంణంలోకి అడుగుపెట్టిన వెంటనే ఆ ఏరియాను ఖాళీ చేయాల్సిందిగా అలారం మోగింది. దీంతో ఆ కోర్టు ఆవరణను ఖాళీ చేస్తున్నారు. పరిస్థితి చక్కబడిన అనంతరం ట్రయిల్ ప్రారంభం కానుందని భావిస్తున్నారు. రూ.9వేలకోట్లకు పైగా రుణాలను ఎగవేసి బ్రిటన్‌కు చెక్కేసిన మాల్యాను స్వదేశానికి రప్పించేందుకు భారత ప్రభుత్వం చేస్తున్న కృషిలో భాగంగా ఈ విచారణ జరుగుతోంది. మరోవైపు ఇప్పటికే లండన్ చేరుకున్న సీబీఐ బృందం, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ టీం కూడా కోర్టులో విచారణ కోసం ఎదురు చూస్తోంది. దాదాపు పది రోజులపాటు ఈ విచారణ జరగనుంది. 2018 జనవరి చివరినాటికి గానీ, ఫిబ్రవరి మొదటి వారానికి గానీ తీర్పు వెలువడవచ్చని అంచనా. మరోవైపు ఈ ఆరోపణలన్నీ అవాస్తవాలంటూ మాల్యా ఎప్పటిలాగానే వాదించాడు. తనపై వచ్చిన మనీ లాండరింగ్ ఆరోపణలన్నీ తప్పు, కల్పితాలు, నిరాధారమైనవని వాదించాడు. కేసు విచారణలో ఉండగా తానేమీ వ్యాఖ్యానించలేనంటూ మీడియాపై అసహనాన్ని ప్రకటించాడు. గెలుపు ఓటములు తన చేతిలో లేవనీ.. కోర్టు నిర్ణయిస్తుందని మాల్యా వ్యాఖ్యానించాడు. -
నేడు ఆలస్యంగా గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్
హైదరాబాద్: సికింద్రాబాద్–గోరఖ్‌పూర్ (12590) ఎక్స్‌ప్రెస్ నేడు (శుక్రవారం) ఆలస్యంగా బయలుదేరనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీనియర్ పీఆర్వో షకీల్ అహ్మద్ ఒక ప్రకటనలో తెలిపారు. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ఉదయం 7.20కి బయలుదేరాల్సి ఉండగా, సాంకేతిక కారణాల వల్ల మూడు గంటలు ఆలస్యంగా ఉదయం 10.20కి బయలుదేరనున్నట్లు పేర్కొన్నారు. -
ఖైదీ మృతిపై 22న విచారణ
హన్మకొండ చౌరస్తా : వరంగల్ ఎంజీఎంలో చికిత్స పొందుతూ జూలై 23న మరణించిన స్టేషన్ ఘన్పూర్ మం డలం కొండాపూర్ గ్రామానికి చెందిన జీవిత ఖైదీ (నెంబర్ 2603) ఇట్టబోయిన వెంకటయ్య మృతిపై ఈ నెల 22న మెజి స్టీరియల్ విచారణ నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆర్డీఓ వెంకటమాధవరావు శుక్రవారం ఒక ప్రకటన చేశారు. హన్మకొండలోని ఆర్డీఓ కార్యాలయంలో 22న ఉదయం 11 గంటలకు జరిగే విచారణ లో సంబంధిత వ్యక్తులు తగిన సాక్ష్యాధారాలతో వాంగ్మూలం ఇవ్వవచ్చన్నారు. -
కిరణాభిషేకం
శ్రీశైలమహాక్షేత్రంలో రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లేజర్ షో భక్తులు, స్థానికులను ఎంతగానో ఆకట్టుకుంది. మొదటిరోజు ట్రయల్ రన్‌గా వేసిన ఈ లేజర్‌షోలో డీఐజీ రమణకుమార్,హోంగార్డు కమాండెంటెంట్ చంద్రమౌళి, ఓఎస్డి సత్య ఏసుబాబు, సీసీఎస్ డీఎస్పీలు హుసేన్‌పీరా, హరినాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ లేజర్‌షోలో భాగంగా ఓం నమః శివాయ పంచాక్షరి నామంతో పాటు వివిధ రకాలైన మృదంగ వాయిద్యాలతో శివునికి ఉన్న వివిధ రూపాలు, అష్టాదశ శక్తిపీఠాల గురించి సమాచారాన్ని వివరించారు. – శ్రీశైలం -
మహాత్మాగాంధీ ముని మనవరాలిపై విచారణ
జోహన్నెస్‌బర్గ్: ఇద్దరు వ్యాపారవేత్తలను మోసగించిన కేసులో మహాత్మాగాంధీ మునిమనవరాలు దక్షిణాఫ్రికాలో విచారణ ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో ఆశిష్ లతారాంగోబిన్ (45) సోమవారం డర్బన్ మేజిస్ట్రేట్ కోర్టుకు హాజరయ్యారు. తను ఎలాంటి తప్పు చేయలేదని, తనపై తప్పుడు అభియోగాలు మోపారని ఆమె న్యాయమూర్తికి విన్నవించారు. అనంతరం 3,776 డాలర్ల పూచీకత్తుపై బెయిలుపై విడుదలయ్యారని ఈ న్యూస్ చానెల్ పోలీసులను ఉటంకిస్తూ పేర్కొంది. డర్బన్‌కు చెందిన ఇద్దరు వ్యాపారవేత్తల నుంచి 8.30 లక్షల డాలర్లు తీసుకొని మోసగించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న రాంగోబిన్‌ను ఈ నెల 15న అరెస్టు చేశారు. తనకు ఓ కాంట్రాక్టు దక్కిందని చెబుతూ.. ఇందుకు కొంత డబ్బు అవసరమని, వారిని నమ్మించి డబ్బు తీసుకుందని పోలీసులు అభియోగాలు మోపారు. -
ఏప్రిల్ 9న సత్యం కేసు తుది తీర్పు
హైదరాబాద్ : సత్యం కంప్యూటర్స్ కుంభకోణం కేసులో తుది తీర్పు మరోసారి వాయిదా పడింది. తుది తీర్పును సోమవారం న్యాయస్థానం ఏప్రిల్ 9వ తేదీకి వాయిదా వేసింది. దాదాపు ఆరేళ్ల పాటు కొనసాగిన విచారణ కొద్ది నెలల క్రితమే పూర్తయినప్పటికీ తీర్పు మాత్రం వాయిదా పడుతూ వస్తోంది. వాస్తవానికి ప్రత్యేక న్యాయస్థానం గతేడాది డిసెంబర్ 23 నాటికే తుది తీర్పు వెలువరించాల్సి ఉన్నా.. కేసును క్షుణ్ణంగా పరిశీలించి తీర్పును వెలువరించాల్సి ఉందంటూ ప్రత్యేక జడ్జి తీర్పును మార్చి 9కి వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఈ కేసు తొలుత అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు విచారించినప్పటికీ అనంతరం 2010లో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేశారు. ఆరేళ్ల పాటు సాగిన కేసులో ఆరేళ్లు విచారణ చేపట్టిన సీబీఐ సుమారు 3,187 డాక్యుమెంట్లను కోర్టుకు సమర్పించింది. దాదాపు 226 మంది సాక్షులను విచారించింది. -
‘సత్యం’ తీర్పు నేడే!
-
‘సత్యం’ తీర్పు నేడే!
హైదరాబాద్: సత్యం కంప్యూటర్స్ కుంభకోణం కేసులో సోమవారం తీర్పు వెలువడే అవకాశముంది. దాదాపు ఆరేళ్ల పాటు కొనసాగిన విచారణ కొద్ది నెలల క్రితమే పూర్తయినప్పటికీ తీర్పు మాత్రం వాయిదా పడుతూ వస్తోంది. వాస్తవానికి ప్రత్యేక న్యాయస్థానం గతేడాది డిసెంబర్ 23 నాటికే తుది తీర్పు వెలువరించాల్సి ఉన్నా.. కేసును క్షుణ్ణంగా పరిశీలించి తీర్పును వెలువరించాల్సి ఉందంటూ ప్రత్యేక జడ్జి దీన్ని మార్చి 9కి వాయిదా వేశారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సత్యం కంప్యూటర్స్ కుంభకోణం కేసులో రామలింగరాజు, ఆయన సోదరుడు రామరాజు, సంస్థ మాజీ సీఎఫ్ఓ శ్రీనివాస్ వడ్లమాని, పీడబ్ల్యూసీ ఆడిటర్లు ఎస్.గోపాలకృష్ణన్, టి.శ్రీనివాస్ సహా రామలింగరాజు మరో సోదరుడు సూర్యనారాయణరాజు, సంస్థ మాజీ ఉద్యోగులు జి.రామకృష్ణ, డి.వెంకటపతి రాజు, సీహెచ్ శ్రీశైలం, వి.ఎస్.ప్రభాకర్ గుప్తా ప్రధాన నిందితులుగా ఉన్నారు. సత్యం కేసును తొలుత అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు విచారించినప్పటికీ దీని ప్రాధాన్యత ను దృష్టిలో పెట్టుకొని ఈ ఒక్క కేసు విచారణ కోసం 2010లో ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేశారు. సత్యం కేసులో ఆరేళ్లు విచారణ చేపట్టిన సీబీఐ సుమారు 3,187 డాక్యుమెంట్లను కోర్టుకు సమర్పించింది. దాదాపు 226 మంది సాక్షులను విచారించింది. -
జగన్ కేసు విచారణ 13కి వాయిదా
సాక్షి, హైదరాబాద్: వైఎస్ జగన్మోహన్రెడ్డి కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించి దాఖలైన మొదటి మూడు చార్జిషీట్ల విచారణను సీబీఐ ప్రత్యేక కోర్టు ఈనెల 13కు వాయిదా వేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డి, పారిశ్రామికవేత్తలు నిమ్మగడ్డ ప్రసాద్, పెన్నా ప్రతాపరెడ్డి, ఇందూ శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, నిత్యానందరెడ్డి, సీనియర్ ఐఏఎస్ అధికారులు మన్మోహన్, శ్యామ్యూల్, బీపీ ఆచార్య, ఆదిత్యానాథ్‌దాస్ తదితరులు కోర్టుకు హాజరయ్యారు. అయితే ఈ కేసులో నిందితులుగా ఉన్న జగన్మోహన్రెడ్డి, ఆడిటర్ విజయసాయిరెడ్డిలు హాజరుకు మినహాయింపు కోరగా కోర్టు అనుమతించింది. ఇదిలా ఉండగా ఇదే కేసుకు సంబంధించిన 8 చార్జిషీట్లపై విచారణను కోర్టు ఏప్రిల్ 10కి వాయిదా వేసింది. -
దుస్తులు వేసుకోకుండానే ట్రయల్..!
దుస్తులు వేసుకోకుండానే అవి తనకు ఎలా ఉంటాయో ఓ మహిళ ట్రయల్ చూసుకుంటున్న దశ్యమిది. బుధవారం తూర్పు లండన్‌లోని ఫ్లక్స్ ఇన్నోవేషన్ లాంజ్ వద్ద ఏర్పాటుచేసిన ఈ వర్చువల్ సై ్టల్ పాడ్(ఫ్యాషన్ 3డీ సిస్టమ్) ఉంటే.. బట్టలు వేసుకోకుండానే అవి వేసుకుంటే ఎలా ఉంటాయో చూసుకోవచ్చు. ఎదురుగా ఉన్నవారి శరీరానికి వివిధ దుస్తులు ఎలా ఉంటాయో సరిగ్గా చూపించే వినూత్న సాఫ్ట్‌వేర్‌తో ఈ వ్యవస్థ పనిచేస్తుంది. మనం అటూ ఇటూ కదిలినప్పుడు, నడుస్తున్నప్పుడు కూడా దుస్తులు ఎలా ఉంటాయో దీనితో చూసుకోవచ్చు.