న్యూఢిల్లీ: స్టార్ రెజ్లర్లు బజరంగ్ పూనియా, వినేశ్ ఫొగాట్‌లకు సెలక్షన్స్‌నుంచి మినహాయింపునిస్తూ నేరుగా ఆసియా క్రీడలకు ఎంపిక చేయడంపై నమోదైన రిట్ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేస్తూ న్యాయమూర్తి జస్టిస్ సుబ్రహ్మణ్యం ప్రసాద్ తీర్పునిచ్చారు.
ఢిల్లీ హైకోర్టు తీర్పు ఇచ్చిన కొన్ని గంటలకే సెలక్షన్ ట్రయల్స్‌లో అంతిమ్ పంఘాల్ గెలిచింది. శనివారం నిర్వహించిన 53 కేజీల సెలక్షన్ ట్రయల్స్‌లో ఆమె విజేతగా నిలిచింది. అయితే ఇదే కేటగిరీలో వినేశ్‌ను ఇప్పటికే ఎంపిక చేయడంతో అంతిమ్ స్టాండ్‌బైగా మాత్రమే ఉండే అవకాశం ఉంది.
కానీ తాను స్టాండ్‌బైగా కూర్చునేందుకు సిద్ధంగా లేనని ఆమె ప్రకటించింది. హైకోర్టులో ప్రతికూలంగా వచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టులో పోరాడతానని 19 ఏళ్ల పంఘాల్ తెలిపింది. ‘కష్టపడి ట్రయల్స్ నెగ్గిన నేను ఎందుకు స్టాండ్‌బైగా ఉండాలి. దర్జాగా మినహాయింపు పొందినవారే కూర్చోవాలి’ అని వినేశ్‌ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించింది.
బజరంగ్, వినేశ్‌లను రెజ్లింగ్ సమాఖ్య అడ్‌హాక్ కమిటీ ట్రయల్స్ లేకుండానే ఆసియా క్రీడలకు ఎంపిక చేసింది. దీనిని సవాల్ చేస్తూ యువ రెజ్లర్లు అంతిమ్ పంఘాల్, సుజీత్ కల్కాల్ ఈ నెల 19న కోర్టును ఆశ్రయించారు.
EXCLUSIVE 🎥
— nnis (@nnis_sports) July 22, 2023
"I will appeal to Supreme Court." said Antim Panghal
After Vinesh Phogat, Bajrang Punia's Asian Games Trials Exemption Allowed By Delhi High Court. #AntimPanghal #wrestling #AsianGames2023 #AsianGames pic.twitter.com/v2XuiyVCAZ
చదవండి: #koreaOpen: సాత్విక్-చిరాగ్ జోడి సంచలనం.. కొరియా ఓపెన్ కైవసం
Comments
Please login to add a commentAdd a comment