న్యూఢిల్లీ: ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మన్మోహన్ను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి కల్పిస్తూ కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ మేరకు న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ మంగళవారం ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ‘ప్రధాన న్యాయమూర్తితో సంప్రదించిన అనంతరం రాష్ట్రపతి ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మన్మోహన్‌ను భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించడం సంతోషంగా ఉంది’ అని ఆయన పేర్కొన్నారు.
కాగా నాలుగు రోజుల క్రితం ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మన్మోహన్ను సుప్రీంకోర్టు జడ్జిగా నియమించాలని కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు భారత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కొలీజియం సమావేశమై జస్టిస్ మన్‌మోహన్ పేరును సిఫారసు చేసింది.
ఇక సుప్రీంకోర్టులో మొత్తం జడ్జిల సంఖ్య 34 కాగా.. ప్రస్తుతం 32 మందే ఉన్నారు. మాజీ సీజేఐ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ హిమా కోహ్లీల పదవీ విరమణతో ఈ రెండు ఖాళీలు ఏర్పడ్డాయి. మన్మోహన్ సుప్రీం న్యాయమూర్తిగా ప్రమాణం స్వీకారం చేస్తే.. సర్వోన్నత న్యాయస్థానంలో సీజేఐతో జడ్జిల సంఖ్య 33కు చేరనుంది. జస్టిస్ మన్‌మోహన్ డిసెంబరు 17, 2009లో ఢిల్లీ హైకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. ఈ ఏడాది సెప్టెంబరు 29న ఢిల్లీ సీజేగా పదోన్నతి పొందారు.
Comments
Please login to add a commentAdd a comment