Manmohan
-
సుప్రీంకోర్టు జడ్జిగా మన్మోహన్.. ఆమోదించిన కేంద్రం
న్యూఢిల్లీ: ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మన్మోహన్‌ను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి కల్పిస్తూ కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ మేరకు న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ మంగళవారం ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ‘ప్రధాన న్యాయమూర్తితో సంప్రదించిన అనంతరం రాష్ట్రపతి ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మన్మోహన్‌ను భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించడం సంతోషంగా ఉంది’ అని ఆయన పేర్కొన్నారు.కాగా నాలుగు రోజుల క్రితం ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మన్మోహన్‌ను సుప్రీంకోర్టు జడ్జిగా నియమించాలని కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు భారత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కొలీజియం సమావేశమై జస్టిస్ మన్మోహన్ పేరును సిఫారసు చేసింది. ఇక సుప్రీంకోర్టులో మొత్తం జడ్జిల సంఖ్య 34 కాగా.. ప్రస్తుతం 32 మందే ఉన్నారు. మాజీ సీజేఐ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ హిమా కోహ్లీల పదవీ విరమణతో ఈ రెండు ఖాళీలు ఏర్పడ్డాయి. మన్మోహన్ సుప్రీం న్యాయమూర్తిగా ప్రమాణం స్వీకారం చేస్తే.. సర్వోన్నత న్యాయస్థానంలో సీజేఐతో జడ్జిల సంఖ్య 33కు చేరనుంది. జస్టిస్ మన్మోహన్ డిసెంబరు 17, 2009లో ఢిల్లీ హైకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. ఈ ఏడాది సెప్టెంబరు 29న ఢిల్లీ సీజేగా పదోన్నతి పొందారు. -
సుప్రీంకోర్టు జడ్జిగా మన్మోహన్
న్యూఢిల్లీ: ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మన్మోహన్‌ను సుప్రీంకోర్టు జడ్జిగా నియమించాలని కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కొలీజియం ఇటీవల సమావేశమై జస్టిస్ మన్మోహన్ పేరును సిఫారసు చేసిందని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హృషికేశ్ రాయ్, జస్టిస్ ఏ.ఎస్.ఓకా సుప్రీంకోర్టు కొలీజియంలోని ఇతర సభ్యులు. సుప్రీంకోర్టులో మొత్తం జడ్జిల సంఖ్య 34 కాగా.. ప్రస్తుతం 32 మందే ఉన్నారు. మాజీ సీజేఐ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ హిమా కోహ్లీల పదవీ విరమణతో ఈ రెండు ఖాళీలు ఏర్పడ్డాయి. జస్టిస్ మన్మోహన్ డిసెంబరు 17, 2009లో ఢిల్లీ హైకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. ఈ ఏడాది సెప్టెంబరు 29న ఢిల్లీ సీజేగా పదోన్నతి పొందారు. -
వ్యవసాయ రుణాల్లో 25 శాతం వృద్ధి లక్ష్యం..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రుణాల విభాగంలో 25 శాతం వృద్ధి సాధించాలని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) హైదరాబాద్ జోన్ లక్ష్యంగా నిర్దేశించుకుంది. గత ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి వీటి పరిమాణం రూ. 9,100 కోట్లుగా ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే రూ. 600 కోట్ల పైచిలుకు రుణాలు అందించడంతో.. ఇది సుమారు రూ. 9,700 కోట్లకు చేరింది. బీవోబీ నిర్వహిస్తున్న రైతు పక్షోత్సవ కార్యక్రమాల సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హైదరాబాద్ జోన్ జనరల్ మేనేజర్ (జీఎం) మన్మోహన్ గుప్తా ఈ విషయాలు వెల్లడించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో బీవోబీ కార్యకలాపాలు హైదరాబాద్ జోన్ పరిధిలోకి వస్తాయి. కరోనా వైరస్ విజృంభణ అనంతరం ఎకానమీ నెమ్మదిగా కుదుటపడుతున్న నేపథ్యంలో మొండిబాకీల రికవరీ క్రమంగా మెరుగుపడుతోందని గుప్తా తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో తమకు 397 బ్రాంచీలు ఉన్నాయని, తమ శాఖలు లేని చోట్ల కూడా బ్యాంక్ సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. వ్యవసాయానికి తోడ్పాటు అందించే లక్ష్యంతో దేశవ్యాప్తంగా 4వ విడత ‘‘బరోడా రైతు పక్షోత్సవాలు’’ నిర్వహిస్తున్నామని, అక్టోబర్ 16న ప్రారంభమైన ఈ కార్యక్రమాలు 31 దాకా కొనసాగుతాయని వివరించారు. ‘మన చర్యలే మన భవిష్యత్’ నినాదంతో చేపట్టిన ఈ పక్షోత్సవాల్లో భాగంగా రైతుల కోసం క్రెడిట్ క్యాంపులు, చౌపల్స్, పశువులకు ఆరోగ్య పరీక్షలు, ఆర్థిక సాక్షరత క్యాంపులు మొదలైనవి నిర్వహిస్తున్నామని గుప్తా చెప్పారు. అలాగే వ్యవసాయ రుణాల కోసం ప్రత్యేకంగా దేశవ్యాప్తంగా తమ 18 జోనల్ కార్యాలయల్లో సెంటర్ ఫర్ అగ్రికల్చర్ అండ్ ప్రాసెసింగ్ (సీఏఎంపీ) పేరిట ప్రాసెసింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, వీటిలో ఒకటి హైదరాబాద్ జోన్లో కూడా ఉందని పేర్కొన్నారు. -
తాను చెప్పలేక.. ఆమె తెలుసుకోలేక
గుమ్ హై కిసీ కే ప్యార్ మే దిల్ సుబహ్ శామ్.. పర్ తుమ్హే లిఖ్ నహీ పావూ మై ఉస్కా నామ్.. హాయ్ రామ్.. హాయ్ రామ్.. (ప్రేమలో పడ్డ నా మనసు పగలు, రేయి ఆ పలవరింతలోనే ఉంటోంది. కాని ఆమె ఎవరో నీకు చెప్పలేకపోతున్నా.. ఏం చేయను..) ఇది రామ్‌పూర్ కా లక్ష్మణ్ అనే సినిమాలోని పాట. దీని దర్శకుడు మన్మోహన్ దేశాయ్. ఆ పంక్తులను అతని మనసు గ్రహించే రాశాడేమో గీత రచయిత మజ్రూ సుల్తాన్‌పురి. ఎక్ ప్యార్ కా నగ్మా హై... మౌజోంకీ రవానీ హై... జిందగీ ఔర్ కుఛ్ భీ నహీ... తేరీ మేరీ కహానీ హై.. (ఇదో ప్రేమ గీతం.. భావోద్వేగాల ప్రవాహం.. జీవితం అంటే ఇంకేదో కాదు.. నీ, నా కథ అంతే) ‘షోర్’ సినిమాలోనిదీ పాట. నందా మీద చిత్రీకరించారు. ఇదీ అంతే ఆమె భవిష్యత్ ఊహించి రాసినట్టే ఉంటుంది. మన్మోహన్ దేశాయ్.. బాలీవుడ్ టాప్ డైరెక్టర్. అమర్ అక్బర్ ఆంథోని, నసీబ్, కూలీ లాంటి సినిమాలతో అమితాబ్‌కు స్టార్డమ్ ఇచ్చిన దర్శకులలో ముఖ్యుడు. నందా.. బాలనటిగా పరిచయమై అరవయ్యో దశకంలో అత్యధిక పారితోషికం అందుకున్న కథానాయికగా స్థిరపడింది. ఆ ఇద్దరి మధ్య ప్రేమ ఎంత ఆలస్యంగా మొదలైందో అంతే వేగంగా ముగిసింది. మన్మోహన్ మరణంతో! నందా.. మరాఠీ చిత్రపరిశ్రమలో ప్రముఖ నటుడు, దర్శకుడు వినాయక్ దామోదర్ కర్ణాటకీ కూతురు. ఇంకా చెప్పాలంటే బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు వి.శాంతారాం ఆమెకు పెద్దనాన్న. నందా ఎనిమిదేళ్ల వయసప్పుడు తండ్రి చనిపోవడంతో కుటుంబపోషణార్థం సినిమాల్లోకి వచ్చింది. తక్కువగా మాట్లాడ్డం నందా నైజం, కుటుంబమే ఆమె ప్రపంచం. ప్రముఖ నటి వహీదా రెహమాన్ ఆమెకు అత్యంత ఆప్తురాలు. కుటుంబ బాధ్యతల్లో నందా ఎంతగా కూరుకుపోయిందంటే యవ్వనం కరిగిపోతోందన్న నిజాన్నీ గ్రహించలేనంతగా. సినీరంగంలో, బయటా చాలామందే ఆమెతో ప్రేమలో పడ్డా ఆమె పట్టించుకోలేదు. తల్లి, సోదరులు పెళ్లి చేసుకొమ్మని చెప్పినా వినలేదు నందా. తోబుట్టువులందరూ స్థిరపడేవరకు పెళ్లి చేసుకోనని మొండికేసింది. అవ్యక్త ప్రేమ తన పనేదో తాను అన్నట్టుండే నందా... మన్మోహన్‌ను ఆకర్షించింది. ఆమె అమాయకమైన మొహం.. బాధ్యతగల నైజం నందాను అతను ప్రేమించేలా చేశాయి. కాని ఆమెతో తన ప్రేమను చెప్పడానికి ధైర్యం చేయలేకపోయిడు. కొన్నేళ్లపాటు నందాను అలా మౌనంగా ఆరాధిస్తూనే ఉన్నాడు తప్ప ఇష్టాన్ని ప్రకటించలేదు. మన్మోహన్ ఇష్క్ బాలీవుడ్ అంతా తెలిసినా నందా చెవినపడలేదు.. అనేకంటే ఆమె ఆ ఊసుకి చెవి ఒగ్గలేదు. ఒకవేళ ఆత్రం చూపించి ఉంటే ఆ ప్రేమకథ ఇంకో మలుపు తిరిగేది. ఆ ఇద్దరి జీవితాలూ ఇంకో రకంగా ఉండేవి. ఏమైంది? తాను చెప్పలేక.. ఆమె తెలుసుకోలేక ఆ ప్రేమ ముందుకు సాగేది లేదనుకున్న మన్మోహన్.. జీవన్‌ప్రభ గాంధీని పెళ్లి చేసుకున్నాడు.. నందాను మనసు మూలన ప్రతిష్టించుకొనే. ఆ భాగస్వామ్యమూ అర్ధంతరమే అయింది.. జీవన్‌ప్రభ ఆకస్మిక మరణంతో. ఎక్కడలేని ఒంటరితనం ఆవహించింది మన్మోహన్ని. నందా తలపులు అతణ్ణి మరింత బాధించసాగాయి. తట్టుకోలేక వహీదాతో చెప్పాడు. నందా ఒప్పుకుంటే పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాననీ స్పష్టం చేశాడు. అంతకన్నా శుభవార్త ఇంకోటి ఉండదు అనుకుంటూ పరుగుపరుగున నందా ఇంటికి చేరింది వహీదా. ఇక్కడ నందా గురించి ఒక్క మాట.. తోబుట్టువులంతా స్థిరపడేవరకు పెళ్లికి ససేమిరా అన్న నందా.. తోబుట్టువులు స్థిరపడ్డాక.. ‘ఈ వయసులో పెళ్లేంటి?’ అని దాటవేసి అవివాహితగానే ఉండిపోయింది. అందుకే మన్మోహన్ మదిలో ఇంకా నందా ఉండడం వహీదాను ఆనందపరిచింది. ఎలాగైనా తన స్నేహితురాలికి జతకూర్చాలి అన్న తన ఆరాటం ఫలించినట్టనిపించింది. మన్మోహన్ మనసులోని మాట నందాకు చెప్పింది. ఆ ప్రేమ ఏనాటిదో కూడా వివరించింది వహీదా. ఒప్పుకుంది నందా. అప్పటికి ఆమె వయసు 53.. అతని వయసు 55. ఇది 1992 నాటి ముచ్చట. మన్మోహన్, నందా ఇద్దరూ కలుసుకుని మాట్లాడుకున్నారు. తనంటే అతనికున్న ప్రేమకు ఆశ్చర్యపోయింది నంద. వెంటనే నిశ్చితార్థం అయిపోయింది ఆ జంటకు. రెండేళ్లు గడిచాయి. నందా చేయూత మన్మోహన్ మనోబలాన్ని పెంచింది. కొడుకు కేతన్‌తో గొడవలున్నా ఆమె నవ్వు చూసి అన్ని మరిచిపోయేవాడు. మన్మోహన్ సాంగత్యం నందాలో జీవనాసక్తిని కలిగించింది. పెళ్లి ముహూర్తాలూ నిర్ణయించుకోవాలనుకుంటున్న వేళ.. ఊహించని పరిణామం.. టెర్రస్ మీద నుంచి కిందపడి మన్మోహన్ చనిపోయాడు. ఆ వార్త బాలీవుడ్‌కి షాక్. నందా సంగతి చెప్పక్కర్లేదు. మిగిలిన జీవితం నీ తోడిదే అని బాస చేసి.. జంట జీవితపు ఆనందాన్ని ఊరించి.. ఊహగానే వదిలేసి వెళ్లిన ప్రేమికుడిని తలచుకుని ఏడ్వాలా? బతుకంత ప్రేమను ముణ్ణాళ్ల ముచ్చటగా చూపిన విధిని పట్టుకొని నిందించాలా? తెలియలేదు నందాకు. వహీదా గుండెలో తలదాచుకొని పొగిలి పొగిలి ఏడ్చింది. ఆ క్షణం నుంచి తన ఇంటినే లోకం చేసుకుంది. బయటకు వెళ్లడమే మానేసింది. మన్మోహన్ పంచిన జ్ఞాపకాలతోనే కాలం వెలిబుచ్చింది. 75వ యేట హార్ట్ఎటాక్తో ఈ లోకానికి అల్విదా చెప్పింది నందా. -ఎస్సార్ -
బీజేపీ ,వినోద్ రాయ్ క్షమాపణలు చెప్పాలి
-
'చెప్పుకుంటూ పోతే వారివన్నీ స్కాంలే'
వైజాగ్ : యూపీఏ హయాంలో నెలకొన్న స్కాంలను ఎత్తిచూపుతూ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌పై భారతీయ జనతాపార్టీ(బీజేపీ) మండిపడింది. మన్మోహన్ పాలనలో అన్ని స్కాంలే జరిగాయని ఆరోపించిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నుంచి తాము ఎలాంటి ఉపదేశాలు స్వీకరించాల్సినవసరం లేదని తేల్చిచెప్పింది. నరేంద్రమోదీ హయాంలోని ప్రభుత్వం దేశానికి స్కాం-ఫ్రీ పాలన అందిస్తుందని పేర్కొంది. ''నేడు కొంతమంది కాంగ్రెస్ నేతలు మాజీ ప్రధాని మన్మోహన సింగ్ ఇచ్చే సూచనలు తీసుకోవాలంటున్నారు. అయితే మన్మోహన్ సూచనలు తీసుకోవాలని ఆదేశించే ముందు ఆయన పాలనలో ఏం చేశారో ఓసారి గుర్తుతెచ్చుకోవాలి? ఆయన అధ్యక్షతన దేశచరిత్రలోనే కాంగ్రెస్ ప్రభుత్వం భారీ దోపిడికి పాల్పడింది. కోల్ స్కాం, 2జీ స్కాం, కామన్ వెల్త్ స్కాం, షుగర్ స్కాం, యూరియా స్కాం, డిఫెన్స్ స్కాం, అగస్టా హెలికాప్టర్ స్కాం... ఇలా చెప్పుకుంటే పోతే సాయంత్రం వరకు వారి స్కాంల గురించి చెప్పవచ్చు'' అని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. మన్మోహన్ సింగ్‌పై విరుచుకుపడిన వెంకయ్యనాయుడు, దేశాన్ని మోసం చేసి ఆయన భారీ దోపిడికి పాల్పడ్డారని ఆరోపించారు. మన్మోహన్ సింగ్ హయాంలోనే చాలా స్కాంలు జరిగినట్టు వెల్లడించారు. అలాంటి అవినీతి వ్యక్తులు, పార్టీ, ప్రభుత్వాల నుంచి తాము ఉపదేశాల తీసుకోవాల్సిన అవసరం ఉందా? అని ప్రశ్నించారు. ప్రధాని నరేంద్రమోదీ స్కాంల రహిత పాలనను దేశానికి అందిస్తున్నారని చెప్పారు. నో స్కాం, నో స్కాండల్, నో బ్లాక్ మార్కెట్... ఇది మోదీ ప్రభుత్వ గొప్పతనమని పేర్కొన్నారు. పెద్ద నోట్లను రద్దుచేయడం వ్యవస్థీకృత మోసమని విమర్శించిన మన్మోహన్ కామెంట్లను వెంకయ్యనాయుడు తిప్పికొట్టారు. -
చర్చ లేకుండానే మరోరోజుకు వాయిదా..
-
చర్చ లేకుండానే మరోరోజు
క్యూల మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల పరిహారానికి విపక్షాల డిమాండ్ న్యూఢిల్లీ: నోట్ల రద్దుపై మంగళవారం కూడా పార్లమెంటు ఉభయసభల్లో విపక్షాల ఆందోళన కొనసాగింది. అధికార, విపక్షాల మధ్య వాగ్యుద్ధం కారణంగా ఎలాంటి చర్చ జరగకుండానే వరుసగా నాలుగోరోజూ వారుుదాపడ్డాయి. క్యూల మృతుల పరిహారంపై రాజ్యసభలో ప్రతిపక్షాలు పట్టుబట్టగా.. లోక్‌సభలో విపక్షాల వారుుదాతీర్మానాల డిమాండ్‌కు అన్నాడీఎంకే జతచేరింది. నోట్లరద్దు నిర్ణయంలో ప్రతి అంశంపై చర్చించేందుకు సిద్ధమేనని మంత్రి అనంత్ కుమార్ చెప్పగా.. చర్చకు తాము సిద్ధమేనని అయితే ప్రధాని సమక్షంలోనే చర్చ జరగాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. రాజ్యసభలో..: ఎగువ సభ ప్రారంభమైనప్పటినుంచీ.. విపక్ష సభ్యులు వెల్‌లోనే నిలబడ్డారు. ప్రధాని సభకు వస్తేగానీ నోట్లరద్దుపై చర్చ ముందుకు సాగనివ్వమన్నారు. పాత కరెన్సీ నోట్లు మార్చుకునే ప్రయత్నంలో భాగంగా ఏటీఎంలు, బ్యాంకుల ముందు క్యూలైన్లలో నిలబడి మృతిచెందిన వారి కుటుంబాలకు రూ. 10 లక్షల పరిహారమివ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్, టీఎంసీల సభ్యులకు.. యూపీ బరిలో బద్ధశత్రువులైన సమాజ్‌వాదీ పార్టీ, బీఎస్పీలు కూడా జతచేరటంతో నినాదాలతో రాజ్యసభ హోరెత్తింది. దీంతో సభ పలుమార్లు వారుుదా పడింది. లోక్‌సభలో రచ్చ.. శీతాకాల సమావేశాల మొదటిరోజునుంచీ నోట్లరద్దుపై విపక్షాలు చేస్తున్న ఆందోళనకు మంగళవారం అన్నాడీఎంకే సభ్యులూ జతచేరారు. విపక్ష సభ్యులు వెల్‌చుట్టూ చేరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘అమ్మా మీరు మా మాట కూడా వినాలి’అని ఖర్గే వ్యాఖ్యానించగా.. ‘తల్లి తన పిల్లలందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది’అని స్పీకర్ సుమిత్రా మహాజన్ అన్నారు. ఆందోళన కొనసాగుతుండగానే స్పీకర్ ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని నిర్వహించి సభను వారుుదా వేశారు. కాగా, నోట్లరద్దుపై పార్లమెంటు లో అవసరాన్ని బట్టి ప్రధాని మాట్లాడతారని కేంద్ర మంత్రి వెంకయ్య మీడియాతో అన్నారు. నోట్ల రద్దుపై మూకుమ్మడిగా దాడిచేస్తున్న విపక్షాలు.. బుధవారం పార్లమెంటు ఆవరణలో ధర్నా చేయాలని నిర్ణరుుంచాయి. మన్మోహన్ పాఠాలు చెప్పుకోవచ్చు పంజాబ్ వర్సిటీలో ఆతిథ్య ఉపాధ్యాయుడిగా చేరటం వల్ల మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దుచేయలేమని, ఈ అంశంపై ఏర్పాటుచేసిన పార్లమెంటరీ కమిటీ స్పష్టం చేసింది. జూలైలో పంజాబ్ వర్సిటీ.. మాజీ ప్రధాని మన్మోహన్‌కు ‘జవహార్‌లాల్ నెహ్రూ చైర్ ప్రొఫెసర్షిప్’ అందుకోవాలని కోరింది. -
ఆంధ్రులను మోసం చేస్తున్న టీడీపీ, బీజేపీ
ఆనందపేట (గుంటూరు) : టీడీపీ, బీజేపీ ప్రభుత్వాలు ఆంధ్రులను మోసం చేస్తున్నాయని రాజ్యసభ సభ్యుడు జేడీ శీలం ఆరోపించారు. స్థానిక జిల్లా కాంగ్రెస్ కార్యాలయం నుంచి శనివారం ప్రారంభమైన చలో ఢిల్లీ కార్యక్రమాన్ని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మన్మోహన్ ప్రభుత్వం అమలు చేసిన హామీలు వెంటనే నేరవేర్చాలని డిమాండ్ చేశారు. అన్ని రాజకీయ పక్షాల నాయకులను కలిసి ప్రత్యేక హోదా కోసం కృషి చేయాలని జిల్లా నాయకులకు సూచించారు. పార్టీ జిల్లా నాయకులు మక్కెన మల్లికార్జునరావు, ఎం.ముత్యాలరావు, చదలవాడ జయరాంబాబు, వణుకూరి శ్రీనివాసరెడ్డి, షేక్ అబ్దుల్ వహిద్, కొరివి వినయ్ కుమార్, కూచిపూడి సాంబశివరావు, ఈరి రాజశేఖర్, షేక్ మౌలాలి, పవన్ తేజ, మదన మెహనరెడ్డి, చిలకా రమేష్ పాల్గొన్నారు. -
‘ఇష్రత్’ అఫిడవిట్ మార్చటంలో చిదంబరం, మన్మోహన్, సోనియాల పాత్ర..
న్యూఢిల్లీ: ఇష్రత్ జహాన్ ఎన్కౌంటర్ కేసులో అఫిడవిట్‌ను మార్చాలన్న నిర్ణయాన్ని రాజకీయ స్థాయిలో తీసుకున్నారని అందులో అప్పటి హోంమంత్రి చిదంబరం, నాటి ప్రధాని మన్మోహన్, సోనియాల పాత్ర ఉందని బీజేపీ ఆరోపించింది. ఈ విషయంలో తమ నిష్కళంకత్వాన్ని నిరూపించుకోవాలని కాంగ్రెస్ పార్టీకి సూచించింది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఎం.వెంకయ్యనాయుడు బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. అప్పటి యూపీఏ ప్రభుత్వం తన రాజకీయ ప్రత్యర్థిని వేధించేందుకు, అప్పటి గుజరాత్ సీఎం మోదీని అప్రతిష్టపాలు చేసేందుకు సీబీఐని దుర్వినియోగం చేసిందని ధ్వజమెత్తారు. రెండో అఫిడవిట్ మోసపూరితం: జైట్లీ ఇష్రాత్ ఎన్కౌంటర్ కేసులో యూపీఏ ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన రెండో అఫిడవిట్ మోసపూరితమైనదని మాజీ కేంద్రమంత్రి చిదంబరంపై జెట్లీ ధ్వజమెత్తారు. ఇష్రాత్, ఇతర ఆరోపిత లష్కరే ఉగ్రవాదుల ఎన్కౌంటర్ నిజమైనదేనని బుధవారం టైమ్స్ నౌ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. -
మోదీ నివాసానికి వెళ్లిన సోనియా, మన్మోహన్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ శుక్రవారం రాత్రి ప్రధాని నరేంద్రమోదీ నివాసానికి వెళ్లారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా కీలకమైన జీఎస్టీ బిల్లుపై చర్చించేందుకు ప్రధాని నరేంద్రమోదీ వారిని ఆహ్వానించారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, అరుణ్ జైట్లీ పాల్గొన్నారు. జీఎస్టీ బిల్లుతో పాటు పలు కీలక అంశాలపై ప్రధాని చర్చించారు. ప్రధానిగా నరేంద్రమోదీ బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన అధికార నివాసానికి సోనియా వెళ్లడం ఇదే తొలిసారి. -
'మంత్రుల రాజీనామా దేశప్రజలడుగుతునారు'
-
మన్మోహన్ సంజాయిషీ
కొన్ని కుంభకోణాలు ఓ పట్టాన ముగిసిపోవు. పదే పదే చర్చలోకి వస్తుంటాయి. వచ్చినప్పుడల్లా కొత్త సంగతులను మోసుకొస్తాయి. వాటిల్లో నిజాలెన్నో, కానివెన్నో అంత వెంటనే తేలే వ్యవహారం కాదు. ఇలా వెల్లడైన ప్రతిసారీ కుంభకోణాల్లో నిందపడినవారు తమ వంతు వాదననూ, సంజాయిషీని ఇవ్వక తప్పదు. అందువల్లే బుధవారం మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ తన హయాంలో చోటుచేసుకున్న కుంభకోణాల గురించి మాట్లాడవలసివచ్చింది. ప్రధాని పదవిని అడ్డంపెట్టుకుని తానుగానీ, తన కుటుంబం లేదా మిత్రులుగానీ సంపద పోగేయాలనుకోలేదని ఆయన చెప్పడం వెనకున్న కారణం తేటతెల్లమే. గతంలో ట్రాయ్ చైర్మన్‌గా పనిచేసిన ప్రదీప్ బైజాల్ 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం ప్రధానాంశంగా ఓ పుస్తకం రాయడమే మన్మోహన్ స్పందనకు మూలకారణం. 2జీ లెసైన్స్‌ల విషయంలో సహకరించకపోతే హాని జరుగుతుందని మన్మోహన్ బెదిరించారన్నది బైజాల్ ఆరోపణల సారాంశం. రాజీవ్‌గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు జరిగిన బోఫోర్స్ స్కాం దశాబ్దాలు గడిచినా ఇప్పటికీ ఏదో ఒక సందర్భంలో చర్చకొస్తున్న సంగతిని గుర్తుంచుకుంటే నిన్న మొన్నటి 2జీ కుంభకోణం మరోసారి మళ్లీ ప్రస్తావనకు రావడంలో వింతేమీ లేదు. మన్మోహన్ పాలనా కాలంపై ఇప్పటికే రెండు పుస్తకాలొచ్చాయి. అందులో ఒకటి మన్మోహన్ మాజీ మీడియా సలహాదారు సంజయ బారు రాసిందికాగా, రెండోది అప్పటి బొగ్గు మంత్రిత్వశాఖ కార్యదర్శి పీసీ పరఖ్ రచించింది. వీరిలో సంజయ బారు మన్మోహన్‌కు ఆ సమయంలో అత్యంత సన్నిహితుడు. పరఖ్కు నిజాయితీ గల అధికారిగా పేరుంది. బైజాల్ సంగతి వేరు. ఆయన ఎన్డీయే పాలనా కాలం చివరిలో ట్రాయ్ చైర్మన్‌గా నియమితుడై యూపీఏ తొలి దశ పాలనలో కొంత కాలం ఆ పదవిలో కొనసాగిన వ్యక్తి. కనుకనే ఆ ఇద్దరికీ ఉన్నంత విశ్వసనీయత బైజాల్‌కు లభించకపోవచ్చు. పైగా మన్మోహన్ గురించి తెలిసివున్నవారెవరూ ఆయన బెదిరిస్తారంటే అంత త్వరగా నమ్మే అవకాశం లేదు. అలాగని మన్మోహన్ చెబుతున్నట్టు అసలు అవినీతే జరగలేదంటే విశ్వసించేవారెవరూ ఉండరు. 2జీ స్కాం పూర్వాపరాలను గుర్తుతెచ్చుకుంటే, ఆ కేసు విషయంలో జరిగిన పరిణామాలను తిరగేస్తే... నాటి యూపీఏ ప్రభుత్వం ఎన్ని పిల్లిమొగ్గలు వేసిందో అందరికీ అర్థమవుతుంది. 2జీ స్పెక్ట్రమ్‌లో అసలు కుంభకోణమే జరగలేదని ఆనాడు ప్రభుత్వ పెద్దలందరూ వాదించారు. నాటి టెలికాం మంత్రి రాజాను తొలుత వెనకేసుకొచ్చిన మన్మోహన్... అది కాస్తా ముదిరేసరికి స్వరం మార్చి ‘సంకీర్ణ ధర్మం నా చేతులు కట్టేసింద’ని చెప్పారు. రాజాను నమ్మి అన్నిటికీ సరేనన్నానని మరొక సందర్భంలో తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో మాత్రమే సీబీఐ దర్యాప్తు మొదలైంది. ఆ తర్వాత దర్యాప్తు పర్యవేక్షణ బాధ్యతను సైతం అది స్వీకరించాల్సి వచ్చింది. ఇక పార్లమెంటులో వేరే తంతు నడిచింది. స్కాంపై సంయుక్త పార్లమెంటరీ సంఘాన్ని (జేపీసీ) నియమించాలని విపక్షాలు చేసిన డిమాండును ప్రభుత్వం అంగీకరించలేదు. ఫలితంగా 2010లో శీతాకాల సమావేశాలు ఒక్కరోజు కూడా జరగలేదు. బడ్జెట్ సమావేశాల సమయంలో ఇక గత్యంతరంలేక జేపీసీ ఏర్పాటుకు ప్రభుత్వం అంగీకరించింది. ఆ కమిటీ నివేదిక మరో ముచ్చట. బయట రకరకాలుగా మాట్లాడిన మన్మోహన్... కమిటీ సభ్యులు కోరినా జేపీసీ ముందు హాజరయ్యేందుకు సిద్ధపడలేదు. మరోపక్క కమిటీ పిలిస్తే అన్నీ తేటతెల్లం చేస్తానని సంసిద్ధత వ్యక్తంచేసిన రాజాను పిలవలేదు. కుంభకోణం జరిగిందన్న ఆరోపణలు వచ్చినప్పుడు ముందుకొచ్చి మాట్లాడలేని అశక్తత ప్రదర్శించినందువల్లే మన్మోహన్ ఇప్పుడు పదేపదే సంజాయిషీలు ఇచ్చుకోవాల్సివస్తున్నది. 2జీ విషయంలో మాత్రమే కాదు... బొగ్గు కుంభకోణంలో సైతం ఆయన పరిస్థితి ఇదే. మాట్లాడవలసిన సమయంలో మౌనం వహిస్తే పర్యవసానాలెలా ఉంటాయో ఇప్పుడిప్పుడే మన్మోహన్‌కు తెలుస్తున్నట్టుంది. అందుకే తానుగానీ, తన సంబంధీకులుగానీ డబ్బు పోగేయలేదని ఆయన ప్రత్యేకించి చెప్పాల్సివచ్చింది. నిజానికి ఇది కుంభకోణం గురించి వచ్చిన ఆరోపణలకు ఏ రకంగానూ సమాధానం కాదు. స్కాం జరిగిందంటున్న వారు కూడా మన్మోహన్సింగ్ దానివల్ల లబ్ధిపొందారని చెప్పడంలేదు. స్కాం ద్వారా ఖజానాకు జరిగిన లక్షా 76 వేల కోట్ల రూపాయల నష్టం ఎవరికి లాభంగా మారిందో చెప్పాలంటున్నారు. దీన్ని నడిపించిన సూత్రధారులెవరో తేలాలంటున్నారు. నోరుతెరిస్తే వీటన్నిటికీ జవాబివ్వకుండా తప్పించుకోవడం సాధ్యం కాదు గనుకనే మన్మోహన్ మౌనంగా ఉండి పోయారన్నది కాంగ్రెస్ ప్రత్యర్థుల ఆరోపణ. సోనియా గాంధీ రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరించారని ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ అనవచ్చుగానీ ఆ సంగతిని స్టాండర్డ్ అండ్ పూర్ వంటి అంతర్జాతీయ రేటింగ్ సంస్థ రెండేళ్లక్రితమే చెప్పింది. రాజకీయాధికారం సర్వస్వం సోనియాగాంధీ చేతిలో ఉండగా, మన్మోహన్ అలంకారప్రాయంగా మిగిలిపోయారని, అందువల్లే పాలన కుంటుబడిందని అభిప్రాయపడింది. తర్వాత కాలంలో సంజయ బారు సైతం తన గ్రంథంలో ఈ సంగతే చెప్పారు. ఫైళ్లన్నీ సోనియా వద్దకు వెళ్లి వచ్చేవని, ఆమె నిర్ణయమే అంతిమంగా అమలయ్యేదని రాశారు. సర్వోన్నత న్యాయస్థానం 2 జీ స్కాంలో122 లెసైన్స్‌లను రద్దుచేశాక... బొగ్గు స్కాంలో 214 బొగ్గు క్షేత్రాల కేటాయింపులను కాదన్నాక కూడా తమ పాలనలో అవినీతే జరగలేదని మన్మోహన్ చెబితే ఎవరూ నమ్మరు. వర్తమానం తనపై కటువుగా ఉన్నా... చరిత్ర దయ దలుస్తుందని ఆశిస్తున్నానని పదవినుంచి వైదొలగే ముందు మన్మోహన్ అన్నారు. అలా దయదల్చాలంటే జరిగిన పరిణామాల విషయంలో తనవైపు నుంచి సమగ్రమైన సమాధానం రావాలి. అది జరగనంత కాలమూ ఈ స్కాంలన్నీ పదే పదే చర్చకొస్తాయి... ఆయనను సంజాయిషీ కోరతాయి. -
ఇది ఓ నిజ జీవిత కథే : మన్మోహన్
‘‘ఎనిమది సంవత్సరాల అబ్బాయికీ, తన కుటుంబానికి జరిగిన ఓ వాస్తవ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకె క్కించాం. ట్రైలర్ చూసి చాలా మంది హార్రర్ చిత్రం అనుకున్నారు కానీ ఇదొక కుటుంబ కథాచిత్రం ’’ అని మన్మోహన్ అన్నారు. లక్ష్మీ మంచు ప్రధాన పాత్రలో మన్మోహన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘బుడుగు’. భాస్కర్, సారికా శ్రీనివాస్ నిర్మాతలు. ఈ చిత్రం విజయోత్సవం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ -‘‘మాస్టర్ ప్రేమ్‌బాబుకు ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టింది. ముఖ్యంగా ప్రీ-క్లైమాక్స్ సన్నివేశాలు ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అయ్యాయి. తల్లి పాత్రలో లక్ష్మి మంచు చాలా బాగా నటించారు. అనుకున్నదానికన్నా ఈ సినిమాకు మంచి స్పందన లభిస్తోంది ’’ అన్నారు. -
బాబుకి ఏమైంది..?
బన్నీకి తొమ్మిదేళ్లు. ఎప్పుడూ ఊహల్లో ఉంటాడు. తనకు నచ్చిన పాత్రలో తనను తాను ఊహించుకుంటూ ఉంటాడు. బన్ని అల్లరి భరించలేక అతని తండ్రి బోర్డింగ్ స్కూల్లో వేసేస్తాడు. కానీ అసలు కథ అక్కడే మొదలవుతుంది. అక్కడ బన్ని విచిత్రంగా ప్రవర్తిస్తాడు. మిగతా వాళ్లందర్నీ భయపెడుతూ ఉంటాడు. అసలు బన్నీకి ఏమైంది...? అనేది తెలియాలంటే ఈ నెల 17న విడుదల కానున్న ‘బుడుగు’ చూడాల్సిందే. లక్ష్మీ మంచు, శ్రీధర్‌రావు, మాస్టర్ ప్రేమ్‌బాబు, ఇంద్రజ ముఖ్యతారలుగా మన్మోహన్ దర్శకత్వంలో భాస్కర్, సారికా శ్రీనివాస్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మన్మోహన్ దర్శకుడు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘పిల్లలూ, పెద్దలూ చూసే విధంగా ఉంటుంది. చెన్నయ్‌లో మీడియా మ్యాజిక్ వారికి ఈ చిత్రాన్ని చూపిస్తే, తమిళంలో రీమేక్ చేయాలని నిర్ణయించుకున్నారు’’ అని చెప్పారు. ఈ చిత్రానికి కచ్చితంగా అవార్డులు వస్తాయనీ, లక్ష్మీ మంచు కెరీర్లో ఓ మైలు రాయిలా నిలిచిపోతుందనీ నిర్మాత భాస్కర్ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తీక్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: వంశీ పులూరి, సమర్పణ: సుధీర్. -
కాంగ్రెస్ పార్టీ అత్యవసర సమావేశం
న్యూఢిల్లీ: భారత మాజీ ప్రధాని డా.మన్మోహన్ సింగ్‌కు సీబీఐ స్పెషల్ కోర్టు సమన్లు జారీ చేయడాన్ని సీరియస్‌గా తీసుకున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ..అత్యవసరంగా సమావేశమైంది. ఈ సమావేశంలో లీగల్ స్ట్రాటజీతో పాటు, రాజ్యసభలో ఆమోదానికి రానున్నబిల్లులపై చర్చ జరగిందని తెలుస్తోంది. మన్మోహన్‌కు సమన్ల జారీపై న్యాయస్థానంలో అప్పీలు చేయడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఆయనకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఎఐసీసీ హెడ్ క్వార్ట ర్స్ నుండి మన్మోహన్ నివాసం వరకూ ఈ ర్యాలీ సాగింది. అనంతరం మన్మోహన్‌ను కలిసి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా సోనియా మాట్లాడుతూ మన్మోహన్ నీతికీ, నిజాయితీకి మారు పేరు... ఆయనపై వచ్చిన ఆరోపణలకు వ్యతిరేకంగా పార్టీ పోరాడుతుంది.. ఆయనకు అండగా వుంటామని, ఈ కేసు నుంచి మన్మోహన్ నిర్దోషిగా బయటపడతారని తెలిపారు. కాగా బొగ్గు కుంభకోణం కేసులో నిందితుడుగా మన్మోహన్ సింగ్‌తో పాటు, కుమార మంగళం బిర్లా, పీసీ పరేఖ్ తదితరులకు సమన్లు జారీ చేసిన ప్రత్యేక కోర్టు ఏప్రిల్ 8 న కోర్టు హాజరు కావాలని కోరిన సంగతి తెలిసిందే. -
ఒబామాతో కాంగ్రెస్ ‘అణు’ చర్చలు!
అమెరికా అధ్యక్షుడితో సోనియా, మన్మోహన్ భేటీ న్యూఢిల్లీ: అత్యంత కీలకమైన పౌర అణు ఒప్పందం అంశంపై అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ సోమవారం చర్చించారు. దీంతోపాటు అమెరికా-భారత్ మధ్య పలు కీలక రంగాల్లో సహకారం, వ్యూహాత్మక భాగస్వామ్యం తదితర అంశాలపై చర్చించారు. ప్రస్తుతం ఒబామా భారత పర్యటనలో స్పష్టత వచ్చిన పౌర అణు ఒప్పందాన్ని గతంలో మన్మోహన్సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ హయాంలోనే కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఈ ఒప్పందం అమల్లో ఇంతకాలం అడ్డంకిగా ఉన్న ‘నష్టపరిహారం’ అంశానికి భారత న్యాయ చట్రం పరిధిలో పరిష్కారం చూపుతామని అమెరికాకు ప్రధాని మోదీ హామీ ఇవ్వడంపై ఆదివారం కాంగ్రెస్ పార్టీ సందేహం వ్యక్తం చేసింది. ఇన్నేళ్లు ఉన్న ఈ సమస్యలు ఎలా పరిష్కారమవుతాయని.. దీనిపై ఒప్పందం పూర్తి ప్రతిని తాము చూడాలని పేర్కొంది. ఈ నేపథ్యంలో సోనియాగాంధీ, మన్మోహన్‌తో పాటు రాహుల్‌గాంధీ, పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు ఢిల్లీలోని ఐటీసీ మౌర్య హోటల్లో ఒబామాతో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీలో అణు ఒప్పందం, వ్యూహాత్మక భాగస్వామ్యంపై సోనియా, మన్మోహన్లు ఒబామాతో చర్చించినట్లు సమాచారం. ఇరాక్, సిరియాల్లో ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ ముప్పు వంటి అంతర్జాతీయ అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. -
మౌన ముని.. మన్మోహన్!
న్యూఢిల్లీ: ఆర్థిక సంస్కరణలతో దేశానికి సరికొత్త దిశానిర్దేశం చేసిన రూపశిల్పి. ప్రపంచ స్థాయిలో భారత్‌ను ప్రబల ఆర్థిక శక్తిగా నిలిపిన కాకలుతీరిన ఆర్థికవేత్త. ఎవరూ ఊహించని విధంగా అత్యున్నత అందలమెక్కిన యాదృచ్ఛిక రాజకీయవేత్త. భారత్ వంటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి వరుసగా పదేళ్ల పాటు ప్రధానిగా కొనసాగిన అదృష్టవంతుడు. కళ్లముందే అంతులేని అవినీతి జరుగుతున్నా పట్టించుకోని నిర్లిప్తుడు. చివరికి తన సొంత కార్యాలయం నుంచి ఫైళ్లు ఎటు వెళ్తున్నాయో, ఏమవుతున్నాయో కూడా తెలుసుకోలేని నిస్సహాయుడు. పదేళ్ల పాటు పెద్దగా పెదవి విప్పకుండా కాలం గడిపిన మౌని. వెరసి... ఒక ప్రధాని ఎలా వ్యవహరించకూడదో చెప్పేందుకు ఆదర్శ నమూనా. కొన్ని విజయాలు, వాటిని ఏ దశలోనూ గుర్తుకు రానీయనంతటి భారీ అపజయాలు. అంతకుమించిన అపకీర్తులు. వాటిని కూడా తలదన్నే అవమానాలు. ఇలా మిశ్రమ అనుభూతులను మూటగట్టుకుని దేశ రాజకీయ రంగస్థలం నుంచి భారంగా నిష్ర్కమిస్తున్నారు 81 ఏళ్ల మన్మోహన్. 1991లో దేశం ఆర్థిక సంక్షోభం ముంగిట్లో నిలిచిన సమయంలో నాటి ప్రధాని పీవీ నరసింహారావు ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుడుతూ.. ఆర్థిక వేత్త మన్మోహన్సింగ్ను ఆర్థిక శాఖ మంత్రిని చేశారు. అది మొదలు దేశ ఆర్థిక రంగ ఉత్థాన, పతనాలకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మన్మోహన్ కారణమయ్యారు. యూపీఏ-1 సంకీర్ణ ప్రభుత్వ సారథిగా వామపక్షాల ఒత్తిడిని సమర్థంగా ఎదుర్కొంటూనే ఆర్థిక సంస్కరణలను అమలు చేశారు. అమెరికాతో అణు ఒప్పంద సమయంలోనూ అదే పట్టుదలను ప్రదర్శించారు. దేశ ఆర్థికాభివృద్ధికి బాటలు పరిచి తన పదవీకాలంలో రికార్డు స్థాయిలో దాదాపు 8.5% జీడీపీని నమోదు చేశారు. యూపీఏ-1ను సమర్థవంతంగా పూర్తి చేయగలిగినప్పటికీ.. యూపీఏ-2 ఆయనకు అంతులేని విషాదాన్ని, మోయలేని స్కాముల భారాన్ని, అసమర్థ ప్రధాని అన్న పేరును మిగిల్చింది. కామన్వెల్త్ క్రీడలు, 2జీ, బొగ్గు కుంభకోణం.. ఒకదాన్ని మించి మరోటి ఆయనపై తుడుచుకోలేని మరకల్ని విదిల్చాయి. సొంత మంత్రివర్గంలోనే అలవిమాలిన అవినీతిని అరికట్టలేని అసమర్థత.. ఆయన సాధించిన విజయాలపై నీలి నీడల్ని పరిచింది. ఆనందాలను, అపనిందలను మౌనంగానే భరించి.. విజయాలను, విమర్శలను సమానంగానే స్వీకరించి.. దేశ రాజకీయ చరిత్రలో తన ప్రత్యేక మౌనముద్రను మనకు వదలి ‘7 రేస్ కోర్సు భవనాన్ని’ వీడి వెళ్తున్నారు. -
స్వీయ తప్పిదాలతో మూల్యం
2009 ఎన్నికల తర్వాత ఆత్మవిశ్వాసం హెచ్చి అనుసరించిన విధానాల పర్యవసానంగానే కాంగ్రెస్ ఓటమిపాలు కాబోతోంది. ఈ ఓటమికి సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ బాధ్యత వహించక తప్పదు. మన్మోహన్‌ను తప్పించి ఆ స్థానంలో రాహుల్‌గాంధీని కూర్చోబెట్టేందుకు సోనియా వందిమాగధులు చేసిన ప్రయత్నాలు ఎవరికి తెలియవు? కేంద్రంలో పదేళ్లపాటు తిరుగులేని అధికారం చలాయించిన కాంగ్రెస్ నాయకుల మొహంలో ఓటమి కళ తాండవిస్తోంది. రాజకీయాల్లో ఓటమి ఎవరికైనా తప్పదు. శుక్రవారం ఈవీఎంలలో ఓట్ల కౌంటింగ్ ప్రారంభమయ్యాక పార్టీల జాతకాలు బయటపడతాయి. ముంచుకొస్తున్న పార్టీ పరాజయానికి ఎవరు బాధ్యత వహిస్తారు. ‘విజయానికి తండ్రులు చాలా మంది ఉంటారు, అపజయం ఎప్పుడూ అనాథే’ అని గతంలో జాన్ కెనడీ అన్న మాటలు గుర్తుంచుకోవాలి. అంతా తానై పార్టీ ప్రచారబాధ్యతను భుజానకెత్తుకున్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆయన కుటుంబమే ఓటమికి బాధ్యత వహించాలి. అయితే ఈ మాట ఏ కాంగ్రెస్ నాయకుడూ బాహాటంగా అనకపోవచ్చు. అది వేరే విషయం. ఎన్నికల్లో ఓటమికి అసలు కారణాన్ని అన్వేషించి దాన్ని స్వీకరించాలి. అలా కాకుండా తమ తప్పిదాలకు ఇతరులను బలిచేయడం కాంగ్రెస్‌లోనూ, ముఖ్యంగా గాంధీ కుటుంబంలో సాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు కూడా అదే జరగబోతోంది. వారు క్రమంగా ఎన్నికల పరాజయాన్ని తెరమరుగయ్యేలా చేస్తారు. 2009 సార్వత్రిక ఎన్నికల్లో సొంతంగా 206 సీట్లు గెలిచి మళ్లీ అధికారంలోకి రావడంతో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆమె కుటుంబంలో ఆత్మవిశ్వాసం హెచ్చింది. 110 కోట్లమంది జనాభా ఉండే దేశాన్ని పరిపాలించడం తమకు కష్టమేమీ కాదని ఆమె భావించడంతో తప్పులు మొదలయ్యాయి. హైస్కూలు వరకే చదువుకున్న సోనియాకు ఏ రంగంలోనూ చెప్పుకోదగ్గ ప్రవేశం లేదు. అయినప్పటికీ ఆమె నేతృత్వంలో 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. శాశ్వతంగా అధికారంలో కొనసాగవచ్చని ఆమె భావించారు. ప్రజల్ని ఏమార్చే పన్నాగం ఎన్నికల్లో విజయం ఎలా సాధించాలో తమకు తెలుసునని గాంధీ కుటుంబం భావించడం మొదలుపెట్టింది. వాస్తవానికి గాంధీ కుటుంబం అనుభవిస్తున్న ప్రత్యేక సౌకర్యాల పట్ల దేశంలోని మధ్యతరగతి వర్గాల్లో, నిరుద్యోగ యువకుల్లోనూ తీవ్ర వ్యతిరేకత పెల్లుబుకుతోంది. ప్రతి సందర్భంలోనూ తమ పూర్వీకులు పడ్డ పలు బాధలను గాంధీ కుటుంబీకులు ఏకరువు పెట్టడం, అధికారాన్ని అనుభవించేందుకు దాన్నే రాజమార్గంగా ఎంచుకోవడం ఒక రివాజుగా మారింది. ప్రజల్లో ప్రభుత్వం పట్ల ఉన్న అసంతృప్తిని అధిగమించడానికి కాంగ్రెస్‌పార్టీ తెలివిగా బాగా సంపన్నులనూ, ప్రముఖులనూ, నటులనూ, క్రీడాకారులనూ ఎన్నికల్లోకి దింపింది. నందన్ నీలేకనీ, మాజీ క్రికెటర్లు మహమ్మద్ అజహరుద్దీన్, మహమ్మద్ కైఫ్, శశి థరూర్, నగ్మా, నవీన్ జిందాల్ వంటి వారికి టికెట్లు ఇచ్చింది. ఇలాంటివారు పోటీచేస్తే ద్రవ్యోల్బణం, అవినీతి కుంభకోణాలు ప్రచారంలోకి రావని, ప్రజలను పిచ్చివాళ్లను చేయవచ్చన్నది కాంగ్రెస్ నాయకత్వం వ్యూహం. 2009 ఎన్నికల్లో తమవల్లే కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వచ్చిందని సోనియా కుటుంబం భావించగా, తన కృషి కారణంగానే ప్రభుత్వం నిలబ డిందని ప్రధాని మన్మోహన్ సింగ్ భావించారు. యూపీఏకు పునరధికారం డాక్టర్ సింగ్ రెక్కల కష్టమేనన్న విషయాన్ని అంగీకరించడం సోనియాకు, రాహుల్‌కూ మనసొప్పలేదు. ఆ ఖ్యాతి మన్మోహన్‌కు ఇవ్వడం వారికి ఇష్టం లేకపోయింది. సింగ్‌ను తప్పించి రాహుల్‌ను ప్రధాని పీఠంపై కూర్చోపెట్టేందుకు సోనియా వందిమాగధులు వంతపాడడం మొదలెట్టారు. దీనిపై ప్రధాని బహిరంగంగా ఏమీ మాట్లాడకపోయినా ఆయన దీన్ని పరాభవంగానే భావించారు. ఏదో ఒకరోజున రాహుల్ ప్రధాని అవుతారన్న భావన మధ్యతరగతి ప్రజల్లో ప్రభుత్వ ప్రతిష్టను మసకబర్చడమే కాకుండా ప్రధానికి పాలనపై ఆసక్తి లేదన్న అభిప్రాయం కలిగించింది. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఉన్నా ఎలాంటి పాలన లేకుండా నిస్తేజంగా కొనసాగింది. ప్రజాకర్షక పథకాల ద్వారా ఎన్నికల్లో గెలవచ్చని భావించిన సోనియా వృథా పథకాలకు రూ. లక్షల కోట్లు కేటాయించాల్సిందిగా మన్మోహన్‌ను ఆదేశించారు. ఇది ద్రవ్యోల్బణానికి దారితీసింది. 2009 నుంచి పెరుగుతున్న ధరలతో ప్రజలు ప్రభుత్వాన్ని, కాంగ్రెస్‌నూ అసహ్యించుకోవడం ప్రారంభించారు. సోనియా తప్పిదం నరేంద్ర మోడీ జాతీయస్థాయి నాయకుడుగా ఎదగగలిగారంటే అది సోనియా పుణ్యమే. గుజరాత్ మతకలహాలను దృష్టిలో పెట్టుకుని 2003 నుంచి నరేంద్ర మోడీని సోనియా ‘మృత్యు బేహారి’గా అభివర్ణించడం ప్రారంభించారు. ఈ అల్లర్లకు సంబంధించి ఆయన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టించేందుకూ, విచారణ జరిపించేందుకూ ఆమె చేయని ప్రయత్నం లేదు. ఈ అధికార దుర్వినియోగం అంతా మోడీని హీరోను చేసింది. కాంగ్రెస్ నాయకులు మోడీని పట్టించుకోకుండా ఉంటే మోడీ ఇపుడు గుజరాత్‌కు ఒక ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఉండేవారు. బీజేపీ ప్రధాని అభ్యర్థిగా నిత్యం వార్తల్లో ఉండేవారు కాదు. ఇది సోనియా చేసిన తప్పిదమే. సోనియా పెద్దగా చదువుకోకపోయినా చాలా తెలివైన నాయకురాలు. ఓటు బ్యాంకును సమకూర్చుకుంటే దాని పునాదిపై విజయాన్ని నిర్మించుకోవచ్చన్నది ఆమె వ్యూహం. ఏదైనా బహుముఖ పోటీ ఉన్న నియోజకవర్గంలో ఖాయంగా 25 శాతం ఓట్లు వేయించుకోగలిగితే 30 శాతం ఓట్లు తెచ్చుకుని గెలవచ్చన్నది ఆమె లెక్క. దేశంలోని ఓటర్లను మతం ప్రాతిపదికన చీలిక తీసుకురాగలిగితే కాంగ్రెస్‌కు గుత్తగా 20 శాతం మైనారిటీ ఓట్లు పడతాయి. అపుడు మిగతా పని సులభం అవుతుందన్నది సోనియా వ్యూహం. దీన్ని అమలుపరిచేందుకు ఆమె గుజరాత్ అల్లర్లను ఒక సాధనంగా వాడుకుని మోడీనీ, బీజేపీని దుమ్మెత్తి పోయడం మొదలు పెట్టారు. బీజేపీ అధికారంలోకి వస్తే మైనారిటీలకు రక్షణ కరువ అవుతుందనీ, కాంగ్రెస్ ఒక్కటే వారికి రక్షణ కల్పించగలదనీ భరోసా ఇవ్వసాగేరు. ఇటీవల హిమాచల్‌ప్రదేశ్‌లో రాహుల్ మాట్లాడుతూ, మోడీ అధికారంలోకి వస్తే 22 వేల మంది ముస్లింలు హత్యకు గురవుతారని అన్నట్టుగా వార్తలొచ్చాయి. దీనిపై ఎన్నికల కమిషన్ కూడా వివరణ ఇవ్వాల్సిందిగా నోటీసు జారీ చేసింది. సాధారణంగా మైనారిటీలు వ్యూహాత్మకంగా ఓట్లు వేస్తారు. ఫలానా నియోజకవర్గంలో బీజేపీని ఓడించేందుకు బలమైన అభ్యర్థికి ఓట్లు వేస్తారు. ఒక్కొక్కసారి ఇది మంచి ఫలితాలని ఇస్తుంది, అనేక సందర్భాల్లో వికటిస్తుంది కూడా. మైనారిటీలలో తానే చీలిక తీసుకువచ్చి ఆ తర్వాత బీజేపీ మత రాజకీయాలకు పాల్పడుతూ మతప్రాతిపదికన ఓటర్లను చీలుస్తోందంటూ ప్రత్యర్థిపై ఎదురు నింద వేస్తోంది. ఏదో జరుగుతుందని భావిస్తే కథ అడ్డం తిరిగింది. సోనియా తన గొయ్యిని తానే తవ్వుకుంది. బీజేపీ మైనారిటీలకు హాని చేస్తుందంటూ సోనియా, రాహుల్ నిరంతరం చేస్తున్న ప్రచార ఫలితంగా దేశంలోని మెజారిటీ వర్గాల్లోని అనేక గ్రూపులు ఏకంకావడం ప్రారంభమయ్యాయి. మీడియా ప్రభావంతో మైనారిటీలంతా ఏకం అవుతున్నందున వారిని చూసి మిగిలిన వారు.... అంటే దేశంలోని మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, పేదవర్గాలు కూడా సంఘటితం కావడం మొదలయ్యింది. కాంగ్రెస్ చేసిన హాని ఉచిత కానుకల ద్వారా, సంక్షేమ విధానాల ద్వారా దళితుల ఓట్లను దక్కించుకోవచ్చని బీఎస్పీ అధినేత మాయావతి, సోనియా భావించారు. కానీ గణనీయ సంఖ్యలో దళితులు మధ్యతరగతి వర్గం మాదిరిగానే మోడీకి ఓటు వేసినట్టు సర్వేలు చెపుతున్నాయి. ఓటర్లలో మతపరంగా చీలిక తీసుకురావడం, తమలో భయాందోళనలు రేకెత్తించడం తమను బాధిస్తోందని అనేక మంది మైనారిటీ వర్గానికి చెందిన పండితులు వాపోతున్నారు. కాంగ్రెస్ భారీస్థాయిలో చేస్తున్న ఈ ప్రచారానికి తాము నిస్సహాయులుగా ఉండిపోతున్నామని అంటున్నారు. మైనారిటీల మద్దతు లేకుండా ఇండియాలో ఏ పార్టీ అయినా అధికారంలోకి రావచ్చని ఈ ఎన్నికల్లో రుజువు కాబోతోంది. మైనారిటీలకు కాంగ్రెస్, సోనియా చేసిన హాని ఇది. మైనారిటీల ఓట్ల విలువను ఆమె తగ్గించారు. సోనియా అతి తెలివిని ప్రదర్శించి మతపరంగా ఓటర్లలో చీలికలు తీసుకువచ్చి తనకు తానే నష్టం చేసుకున్నారు. వాస్తవానికి ఆమె మోడీ రాజకీయ ఉన్నతికి ఎంతో చేయూతనిచ్చినట్టయ్యింది. సోనియా లేకపోతే మోడీ విజయం ముంగిట దాకా వచ్చేవారు కాదు! (వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు) పెంటపాటి పుల్లారావు -
ప్రజా రోగ్యానికి ‘చేతి’మాత్ర
ఈ మరణాలు అంతర్జాతీయ సమాజం ముందు మన పరువు తీస్తాయి కాబట్టి వీటి రేటు తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే దరిద్రరేఖ దిగువన ఉన్న మహిళలకు ఆసుపత్రుల్లో ప్రసవాలు చేయించడం ద్వారా మరణాల రేటు తగ్గించాలని నిర్ణయించుకుంది. యువరాజావారు కొండను తవ్వి ఎలుకను పట్టగలిగారు! ఆరోగ్య - ఆవాస అవసరాలు తీరక జనం నానా యాతన పడుతున్నారని తెలుసుకోగలిగారు. ఆయన జరిపిన మహాధ్యయనం ఆధారంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళిక రూపొందించింది. దాన్ని పవిత్ర పత్రంగా అభివర్ణించింది. జనజీవన భద్రతపై మాట్లాడే ప్రణాళికను పవిత్రమైనదంటే తప్పేమీ లేదు గానీ, కాంగ్రెస్ అధినేతలు ఇన్నేళ్లుగా ఈ రంగాల్లో చేసిందేమిటన్నది ఒక ముఖ్య ప్రశ్న. గ్రామాల్లో మెరుగైన వైద్యసేవలూ, మౌలిక సౌకర్యాలూ కల్పించేందుకు ఉద్దేశించిన జాతీయ గ్రామీణ ఆరోగ్యమిషన్ (ఎన్ఆర్హెచ్ఎం-2005) అమలులో ఆశించిన ఫలితాలు సాధించలేదన్నారు ప్రధాని మన్మోహన్. వైద్యఖర్చులు భరిం చలేక ఏటా 4 కోట్లమంది పేదరికం పాలపడుతున్నారని చెప్పారు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ. ఈ పరిస్థితిని చక్కదిద్దని కాంగ్రెస్ - ఇప్పుడు ప్రజారోగ్యానికి భరోసా ఇస్తానం టోంది. ఈ నేపథ్యంలో ఆరోగ్య రంగంలో యూపీఏ పనితీరును రేఖామాత్రంగా అవలోకిద్దాం. 2013 -14 బడ్జెట్లో ఆరోగ్య రంగానికి కేటాయించింది రూ. 37,330 కోట్లు. ఇందులో ఎన్హెచ్ఎం వాటా 21,239 కోట్లు. ఎన్ఆర్హెచ్ఎం - జాతీయ పట్టణ ఆరోగ్య మిషన్ (ఎన్యూహెచ్ఎం)లను కలిపి జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) ఏర్పాటు చేశారు. అంతకు ముందు సంవ త్సరం బడ్జెట్లో ఆరోగ్య రంగానికి రూ.30,000 కోట్లు కేటా యించగా, అందులో ఎన్ఆర్హెచ్ఎం వాటా రూ. 20,822 కోట్లన్నారు. ఈ పథకంలో ఎన్‌యూహెచ్‌ఎంను విలీనం చేశాక అదనంగా కేటాయించింది 417 కోట్లే! ఇంత స్వల్ప కేటాయింపులతో పౌరులందరికీ ఆరోగ్యభద్రత కల్పించడం అసంభవం. 12వ ప్రణాళికలో రూ.3,00,000 కోట్లతో ఆరో గ్యసేవల్ని సార్వత్రీకరిస్తామన్న ప్రభుత్వం.. ఆ దిశగా కేటా యింపులు జరపలేదని పై లెక్కలు చెబుతున్నాయి. దీన్ని బట్టి మన విధాననిర్ణేతలు ప్రజారోగ్యాన్ని ప్రైవేటు రంగానికి అప్పగించబూనుకున్నారని భావించాల్సి వస్తోంది. ప్రైవేటు రంగం గ్రామీణ ప్రాంతాల్లో, ప్రత్యేకించి వెనుకబడిన - మారుమూల గ్రామాల్లో ప్రవేశించేందుకు సిద్ధపడదు. ప్రభు త్వరంగంలో తగిన పెట్టుబడులు పెట్టడం - ఆరోగ్య పథ కాల్ని నిజాయితీగా అమలు చేయడం ద్వారా మాత్రమే ప్రజ లు మెరుగైన ఆరోగ్యసేవలు పొందేందుకూ ఆర్థిక భారాల నుంచి బయటపడేందుకూ వీలవుతుంది. కానీ ఈ విష యంలో ప్రభుత్వం విఫలమైంది. ప్రజారోగ్యానికి సంబంధించిన పలు లక్ష్యాలతో ప్రారం భమైన ఎన్ఆర్హెచ్ఎం మాతా శిశు మరణాలపైనే రవ్వంత దృష్టి సారించింది. 2005 నాటికి ప్రపంచవ్యాప్తంగా నమోద వుతున్న మాతృ మరణాల్లో 20శాతం పైగా భారతదేశంలో చోటు చేసుకున్నవే. ప్రసవానంతర నాలుగు వారాల్లో నమో దయ్యే మరణాల్లో 31 శాతం మన దేశానివే. ఈ మరణాలు అంతర్జాతీయ సమాజం ముందు మన పరువు తీస్తాయి కాబట్టి వీటి రేటు తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోంది. పైగా మాతా శిశు మరణాలు తగ్గించాలన్న సహస్రాబ్ధి అభివృద్ధి లక్ష్యాలకూ కట్టుబడింది. ఈ నేపథ్యంలో - దరిద్రరేఖ దిగు వన ఉన్న మహిళలకు ఆసుపత్రుల్లో ప్రసవాలు చేయించడం ద్వారా మరణాల రేటు తగ్గించాలని నిర్ణయించుకుంది. ఇం దుకోసం 2005లో ‘జననీ సురక్షా యోజన’ పథకం ప్రారం భించింది. గర్భిణులకు రూ.1400 ఇవ్వడం ద్వారా వారిని ఆసుపత్రి ప్రసవాల వైపు మళ్లించబూనుకుంది. నగదు బది లీతో ముడివడిన అంశం కాబట్టి - ఈ అంశంలో కొద్ది ఫలి తాలు కనిపిస్తున్నాయి. 2005లో 50శాతంగా ఉన్న ఆసుపత్రి ప్రసవాలు 2012 నాటికి 70శాతానికి పెరిగాయి. అయితే, పేదరికం - పోషకాహారలోపం కారణంగా మాతా శిశు మర ణాలు నిర్దేశించుకున్న స్థాయిలో తగ్గడం లేదు. ప్రసవానం తర నాలుగు వారాల్లో సంభవించే శిశు మరణాలు పేద కుటుంబాల్లో అధికంగా ఉంటున్నాయి (వెయ్యికి 56). 2004-06 మధ్య 254 (ప్రతి లక్ష మందికి)గా ఉన్న మాతృ మరణాల రేటు 2012 నాటికి 178కి తగ్గింది. శిశు మరణాల రేటు 2011 నాటికి 44కి చేరింది. ప్రపంచవ్యాప్తంగా పుట్టిన రోజునే చనిపోతున్న శిశువుల్లో 29 శాతం మంది మన దేశ శిశువులే. మెరుగైన ఆరోగ్య సేవలు లభిస్తే తొలిరోజు మర ణాల్లో సగానికి సగం తగ్గించవచ్చు. కానీ అనవసర ఆర్భా టం చేయడం తప్ప వీటిపై శ్రద్ధ పెట్టని మన పాలకులు - ఇప్పుడు సమ్మిళిత అభివృద్ధి తమ అజెండా అంటున్నారు. ఈ అజెండాకు కట్టుబడే ప్రభుత్వాలు ఏవైనా ముందు సామాజిక రంగాల్లో పెట్టుబడులు పెంచాలి. పరిశుభ్రమైన నీరూ, పోషకాహారమూ, పారిశుధ్యమూ, ఆరోగ్య - ఆవాస - విద్యా సౌకర్యాలతోనే ఆరోగ్యకర సమాజం నిర్మితమవుతుందని గుర్తించాలి. వి.ఉదయలక్ష్మి -
ఇద్దరిదీ ‘కార్పొరేట్’ జెండాయే!
ఎన్నికల తదుపరి ఎవరికీ అధిక్యత లభించదేమోనని కార్పొరేట్ కుబేరుల భయం. ‘జనాకర్షక పథకాలకు ప్రభుత్వ భారీ వ్యయాలు తప్పవు. దాన్ని మనం భరించలేం’ అని ‘అసోచామ్’ ఆందోళన వ్యక్తం చేసింది. నిన్నటి వరకు మన్మోహన్ జపం చేసిన వారే మోడీ నామ సంకీర్తన చేస్తున్నారు. ‘మోడీ గాలి’ని సృష్టించాలని నానా పాట్లు పడుతున్నారు. రాజకీయవేత్తల ఎన్నికల చర్చలు చెవిటివాళ్ల సంవాదంగా సాగడం సర్వ సాధారణం. నోళ్లకే తప్ప చెవులకు పెద్దగా పనుండదు. జాతీయ మీడియా రాత్రి చర్చలు చాలా వరకు ఈ కోవకు చెందేవే. నకళ్లలా రూపొందిన కాంగ్రెస్, బీజేపీల ప్రణాళికలపైన, వాటి ఆర్థిక విధానాలపైన సాగిన చర్చ అలాంటిదే. కాబట్టే ధరల భగభగలతో కడుపు మండుతున్నవాళ్లంతా తప్పక పట్టించుకోవాల్సిన ఒక వాస్తవం మరుగున పడిపోయింది. కాంగ్రెస్, బీజేపీల జెండాలు వేరైనా ఆర్థిక ఎజెండా ఒకటేనని, మోడీ, రాహుల్‌లో ఎవరు గద్దెనె క్కినా సామాన్యుల పరిస్థితి పెనం మీంచి పొయ్యిలోకి పడటమేనని తేల్చే ఆ వాస్తవం వెలుగు చూడకపోవడమే మంచిదనుకున్నారేమో. గత ఆర్థిక సంవత్సరం(2012-13) మన స్థూల జాతీయోత్పత్తిలో 4.8 శాతంగా (8,780 కోట్ల డాలర్లు) ఉన్న కరెంటు అకౌంటు లోటు ఈ ఏడాది 1.7 శాతానికి (3,200 కోట్ల డాలర్లు) తగ్గనున్నదని గత శనివారం ఆర్థిక మంత్రి చిదంబరం తెలిపారు. కాడ్ పెరుగుదల కారణంగా దేశం విదేశీ చెల్లింపుల సంక్షోభం అంచులకు చేరుతోందన్న ఆందోళన తొలగిందని, ఈ ఏడాది కోశ (ఫిస్కల్) లోటును జీడీపీలో 4.6 శాతానికి తగ్గించడం సాధ్య మైందని సంతోషం వెలిబుచ్చారు. అమాత్యులు ఒక్క విషయాన్ని విస్మరిం చారు. ప్రభుత్వ వ్యయాలు పెచ్చుపెరగడమే కోశ లోటుకు కారణమనీ, అదే సకల ఆర్థిక రుగ్మతలకు మూలమనేదే... 1991 నుంచి జెండాల తేడాలు లేకుండా పాలకులు అనుసరిస్తున్న మన్మోహనామిక్స్ లేదా స్వేచ్ఛాయుత వాణిజ్య మతం మౌలిక సూత్రం. ఆ మత శాసనాలను అనుసరించే వినియో గదారుల సబ్సిడీలు, సంక్షేమ వ్యయాలలో కోతలు, కరెంటు చార్జీల మోత లు, పెట్రో వాతలను జోరుగా సాగించారు. కోశ లోటు తగ్గింపునకు, వృద్ధికి అదే మార్గమన్నారు. కానీ అవేవీ లేకుండానే కోశ లోటును తగ్గించడం ఎలా సాధ్యమైంది? దిగుమతులకు ఎగుమతులకు మధ్య తేడాయే వాణిజ్య లోటు. అదే కరెంటు అకౌంటు లోటు (క్యాడ్)లోని ప్రధానాంశం. మన ఎగుమతులు పెరగకుండానే, చమురు దిగుమతులు తగ్గకుండానే క్యాడ్ ఎలా తగ్గింది? కలవారి స్వర్ణ దాహం కథ గత ఏడాది మూడో త్రైమాసికలో బంగారం దిగుమతుల విలువ 1,780 కోట్ల డాలర్లు కాగా. ఈ ఏడాది మూడో త్రైమాసికంలో అవి 310 కోట్ల డాలర్లకు పడిపోయాయి. ఈ ఒక్క కారణంతోనే వాణిజ్య లోటు 58 శాతం తగ్గి, క్యాడ్ 53 శాతం తగ్గింది. గత ఏడాది మూడో త్రైమాసికానికి జీడీపీలో 6.5 శాతంగా ఉన్న క్యాడ్ ఈ ఏడాది మూడవ త్రైమాసికానికి 0.9 శాతానికి తగ్గింది! కార ణం బంగారం దిగుమతులపై ఆర్బీఐ విధించిన ఆంక్షలు. 2007-08 నుంచి 2011-12 మధ్య మన దేశంలో బంగారం గిరాకీ అసాధారణంగా పెరిగింది. బంగారం నికర దిగుమమతులు 1,370 కోట్ల డాలర్ల నుంచి 4,920 కోట్ల డాలర్లకు పెరిగాయి. ఆర్థిక వ్యవస్థ అధోగతి పట్టడంతో సంపన్నవర్గాలు బం గారాన్ని పెట్టుబడిగా పోగేసుకోవడం పెరిగింది. కాబట్టే బంగారం ధరలు, దిగుమతులు జోరుగా పెరిగాయి. ఈ స్వర్ణ దుర్దాహం తాకిడికి విదేశీ వాణిజ్యంలో భారీ లోటు ఏర్పడింది. డాలర్లలో చేయాల్సిన చెల్లింపులు పెరిగి డాలర్లకు గిరాకీ పెరిగింది. రూపాయి విలువ పాతాళానికి చేరింది. విదేశీ మారకం నిల్వలు కరిగి, విదేశీ చెల్లింపుల సంక్షోభం ఏర్పడే స్థితి తలెత్తింది. ఎగుమతులు, దిగుమతుల స్వేచ్ఛలో వేలు పెట్టరాదని మడి కట్టుకున్న ప్రభు త్వ విధానానికి భిన్నంగా ఆర్బీఐ బంగారం దిగుమతులపై విధించిన ఆంక్షల వల్లనే ఆ గండం గడిచింది. ధరల పెరుగుదలకు ప్రజలు హాహాకా రాలు చేస్తే ఎవరికీ పట్టలేదు. కానీ ఆర్బీఐ, చిదంబరం త్వరలోనే బంగారం దిగుమతులపై ఆంక్షలను సడలిస్తామని హామీలు కురిపిస్తున్నారు. బంగా రంపై కస్టమ్స్ డ్యూటీని 2 శాతం నుంచి 10 శాతానికి పెంచితే ఎవరు అల్లాడిపోయారని? ఎందుకీ ఆంక్షల సడలింత? యూపీఏని సూక్ష్మదర్శినితో పరిశీలించి మరీ రచ్చకెక్కిస్తున్న బీజీపీ ఇదేమిటని నోరు మెదపడం లేదు ఎందుకు? పైకి ఏమి చెప్పినా ఆ రెండు పార్టీలది ఒకటే ఆర్థిక మతం... మన్మోహన్ సారథ్యంలో అమలవుతున్న స్వేచ్ఛా విపణి విధానాల మతం. ఇంపోర్టెడ్ ‘ప్రజాభిప్రాయం’ తమ మాటే ప్రజాభిప్రాయమని దబాయించి చలాయించుకుంటున్న జాతీ య మీడియా ఆర్థిక ‘నిపుణులు’ బంగారం దిగుమతులపై ఆంక్షలను విధించి న నాడే... ఇంకేముంది బంగారం స్మగ్లింగ్ పెరిగి పోయి, ఎక్కడికక్కడ హాజీ మస్తాన్లు పుట్టుకొచ్చేస్తారని భయపెట్టారు. గతించిన ఆంక్షల, కంట్రోళ్ల ‘లెసైన్స్ రాజ్’ తిరిగొచ్చేసిందని శోకాలు తీశారు. ఇదంతా మనోళ్ల పుర్రెలో పుట్టిన బాపతూ కాదు. బంగారు గనుల యజమానుల సంస్థ ‘వరల్డ్ గోల్డ్ కౌన్సిల్’ (డబ్ల్యూజీసీ) విలాపాల రిపీటర్ స్టేషన్ల మోత. డబ్ల్యూజీసీ బంగారం అమ్మకాలు పడిపోకూడదని తప్పుడు మాటలు, దొంగ జోస్యాలు చెప్పింది. ఆంక్షలతో చట్టబద్ధమైన, చట్టవిరుద్ధమైన బంగారం దిగుమతులు రెండూ కలిసి తడిసి మోపెడై కరెంటు అకౌంటు లోటు సమస్య మరింత విషమిస్తుందని అది ఢంకా బజాయించింది. క్యాడ్ సమస్య తీవ్రం కాలేదు. రికార్డు స్థాయిలో 1.4 శాతానికి తగ్గింది. కోశ లోటు 4.6 శాతానికి పరిమిత మైంది. బంగారం స్మగ్లింగ్ జోరు పెరిగిందీ లేదు. దొడ్డిదారిన వచ్చినా, రాచమార్గాన వచ్చినా బంగారానికి డాలర్లు చెల్లించాల్సిందే. దొడ్డి దారిన వచ్చిన బంగారానికి ఎగుమతులు-దిగుమతుల (ఎగ్జిమ్) సంస్థల పేరిట దిగుమతుల విలువను ఎక్కువగా చూపి మూల్యాన్ని చెల్లిస్తారు.అంటే స్మగ్లింగ్ పెరిగితే కాడ్ తగ్గదు, పెరుగుతుంది. కోశ లోటు తగ్గింపునకు మార్గం సంక్షేమ వ్యయాల కోతలు కానే కాదు. ప్రత్యామ్నాయాలున్నాయని కలవారి స్వర్ణ దాహం కథలోని ఆర్థిక నీతి. ఆ నీతిని విస్మరించిన ఫలితంగానే ప్రపంచం దీర్ఘకాలిక ఆర్థిక ప్రతిష్టంభనలో కొట్టు మిట్టాడుతోంది. పూజారి మారితే మతం మారేనా? ఆ విధానాల నుంచి వైదొలగినందుకు లెంపలు వేసుకుంటున్న చిదంబరం, ఆర్బీఐలు బంగారం దిగుతులపై ఆంక్షలను తొలగిస్తామంటున్నారు. మళ్లీ తలెత్తే కాడ్ సమస్యను ఎలా అధిగమిస్తారు? ఇది, గుజరాత్ సహా దేశమంతా అమలవుతున్న ఆర్థిక విధానాల సహేతుకను సవాలు చేసే ప్రశ్న. కాంగ్రెస్, బీజేపీల వద్ద ఉన్నది ఒక్కటే సమాధానం... ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ జోక్యం కూడదు. ఇద్దరిదీ ఒక్కటే పరిష్కార మార్గం... మన కార్పొరేట్ కుబేరులూ, వారి అసోచామ్, ఫిక్కీల వంటి సంస్థలు చూపుతున్న మార్గం. ‘ప్రభుత్వ వ్యయాలపై కొరడా,’ ‘వినియోగదారుల సబ్సిడీల రద్దు,’ ‘సంక్షేమ వ్యయాల్లో భారీ కోతలు.’ ఈ ఏడాది సగటు వర్షపాతానికంటే తక్కువ వర్షపాతం నమోదు కావచ్చని అంటున్నారు. మూడు నెలలుగా కాస్త ఉపశమించిన ఆహార ధరలు తిరిగి పేట్రేగుతున్నాయి. ఎంతగా విదేశీ పెట్టుబడులకు, సంస్థలకు తలుపులు బార్లా తీసినా గత ఏడాది పారిశ్రామిక ఉత్పత్తిలో వృద్ధి 0.9 శాతానికి మించలేదు. ఈ ఏడాది ఇంతవరకు -1.9 శాతం (రుణాత్మక) వృద్ధిని చూపుతోంది. ఈ పరిస్థితుల్లో వచ్చే ప్రభుత్వ ఆర్థిక విధానాలు సామాన్య ప్రజల్ని గట్టెక్కిస్తాయా? అగాధంలోకి తోసేస్తాయా? అనేదే. రేపు ఎన్నికల్లో ‘ఎవరికీ ఆధిక్యతలేని పరిస్థితి’ ఏర్పడుతుందేమోనని మన కార్పొరేట్ కుబేరుల ఆందోళన. ‘జనాకర్షక పథకాల కోసం ప్రభుత్వం భారీ వ్యయాలను చేయాల్సి వస్తుంది. అలాంటి పరిణామాన్ని మనం భరించలేం’ అని అసోచామ్ ఆ ఆందోళనను వ్యక్తం చేసింది. అందుకే అవి నిన్నటి వరకు మన్మోహన్‌ను ఆకాశానికెత్తిన నోళ్లతోనే మోడీ నామ సంకీర్తన సాగిస్తున్నాయి. జాతీయ చానళ్ల సాయంతో ‘మోడీ గాలి’ని సృష్టించడానికి నానా పాట్లు పడుతున్నాయి. కార్పొరేట్ తటస్థతను వీడి వారు నేడు మోడీ వైపు ఎందుకు మొగ్గారు? ఎన్నికల వేళ సైతం కూలినాలి, పేద జనం వ్యతిరేకతను లెక్కచేయక గ్రామీణ ఉపాధి, ఆహార భద్రతా పథకాలను తప్పు పట్టగలిగిన ఏకైక నేత ఆయనే. ఎవరికీ జంకక సంక్షేమ వ్యయాలపై కత్తి దూయగల ఏకైక వీరుడు ఆయనే. అందుకే ఆయన పట్టాభిషేకం కోసం వారి ఆరాటం. పిళ్లా వెంకటేశ్వరరావు -
మన్మోహన్‌కు సమన్లు ఇవ్వండి
సిఖ్స్ ఫర్ జస్టిస్ సంస్థకు అమెరికా కోర్టు ఆదేశం వాషింగ్టన్: భారత ప్రధానమంత్రి మన్మోహన్‌కు జూన్ 18లోగా సమన్లు అందివ్వాలని సిక్కుల మత సంస్థ సిఖ్స్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్జే)ను అమెరికా కోర్టు ఆదేశించింది. జూన్ 18లోగా ఆయనకు సమన్లు అందించనట్లయితే మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారని ఆరోపిస్తూ మన్మోహన్పై పెట్టిన కేసును కొట్టివేయాల్సి వస్తుందని స్పష్టం చేసింది. మన్మోహన్‌కు సమన్లు అందించినట్టుగా ఆధారాలను జూన్ 18లోగా తమకు సమర్పించాలని అమెరికా జిల్లా జడ్జి జేమ్స్ ఈ బోస్బెర్గ్ ఈ నెల 18న ఎస్ఎఫ్జేకు ఆదేశాలు జారీ చేశారు. 1990ల్లో పంజాబ్‌లో సిక్కులపై దాడులు, హత్యాకాండకు మన్మోహన్ సహకరించారంటూ ఎస్ఎఫ్జే వాషింగ్టన్ ఫెడరల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. గత ఏడాది సెప్టెంబర్‌లో మన్మోహన్ అమెరికా పర్యటన సందర్భంగా వాషింగ్టన్ ఫెడరల్ కోర్టు ఆయనకు సమన్లు జారీ చేసింది. ఈ సమన్లను మన్మోహన్‌కు అందివ్వాల్సిందిగా కోర్టు ఆదేశించింది. -
ఓటమికి బలిపశువు సిద్ధం
విశ్లేషణ 2009 వరకు యూపీఏ ప్రభుత్వం పనితీరు బావుందని అంతా అంగీకరిస్తారు. మన్మోహన్ సంక్షేమ వ్యయాలను నియంత్రించారు. డీఎంకేలాంటి ప్రాంతీయ పార్టీల ఆదేశాలకు విదేశాంగ విధానం లోబడకుండా ఉండేట్టు చూశారు. అ తర్వాతే కాంగ్రెస్‌కు కళ్లు నెత్తికెక్కాయి. ఆర్థిక వ్యవస్థ నెత్తురోడడం మొదలైంది. పది మంది సభ్యులు అనుభవం లేకున్నా మన్మోహన్ మంత్రివర్గ నిర్ణయా లను తోసి రాజన్నారు. అసాధ్యమైన డిమాండ్లను ముందుంచి, చట్టాలను చేయించారు, నిధులను మంజూరు చేయించారు. చాలా మంది మంత్రులు ఎన్ఏసీ సభ్యులను చాటుమాటుగా దుమ్మెత్తిపోశారు. కానీ సోనియా ముందు నోరు విప్పే ధైర్యం చేయలేదు. ఎన్ఏసీ సూచనలపై ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఇది ద్రవ్యోల్బణాన్ని సృష్టించింది. సోనియా తప్పులకు మన్మోహన్ బాధ్యులు! ఎన్ఏసీ ఒక వర్గానికి అనుకూలంగా ఉన్న మతకల్లోలాల వ్యతిరేక చట్టాన్ని తెచ్చింది. దానికి వివిధ సెక్షన్ల నుంచి విశాలమైన వ్యతిరేకత వచ్చింది. అలాంటి చట్టం అవసరమైతే ఆ పనిని న్యాయ నిపుణుల, సీనియర్ నేతల సలహాలతో చేయాల్సింది. అందుకు బదులుగా ఎన్ఏసీలోని ఔత్సాహిక ఎన్జీవోలు దాన్ని రూపొందించాయి. ఈఒక్క చర్యే మెజారిటీలో ఆందోళనను రేకెత్తించాయి. ఓటు బ్యాంకు రాజకీయాలుగా దాన్ని వారు పరిగణించారు. ఈ మతపరమైన కేంద్రీకరణకు మన్మోహన్‌ను ఏవిధంగానూ తప్పు పట్టడానికి వీల్లేదు. మన ఆర్థిక సమస్యలన్నింటికీ బహిర్గత అంశాలే కారణమని కాంగ్రెస్ పార్టీ అదే పనిగా చెప్పింది. కానీ మన బడ్జెట్ వైకల్యపూరితంగా తయారైంది. 30 శాతం వార్షిక కోశ (ఆర్థిక) లోటుకు, ద్రవ్యోల్బణానికి దారి తీసింది. విపరీత ద్రవ్యోల్బణం, నిరుద్యోగం అనే రెండు అంశాలపైనే ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. సోనియా బలవంతం మీదనే మన్మోహన్ సంక్షేమ వ్యయాలకు భారీ నిధులను కుమ్మరించి భారీ బడ్జెట్ లోట్లను అనుమతిం చారు. ఆ సంక్షేమ పథకాలే నిరర్ధకంగానూ, విషతుల్యంగానూ పరిణమించి అధిక ధరలకు, నిరుద్యోగానికి కారణమయ్యాయి. గత మూడేళ్లుగా అన్నాహజారే, కేజ్రీవాల్ అవినీతి వ్యతిరేక పోరాటా లను పెద్ద ఎత్తున నిర్వహించారు. వాటితో ఎలా వ్యవహరించాలో తెలియని సోనియా వారిని తిట్టిపోసి, వేధించమని మంత్రులను ఉసిగొల్పారు. వాళ్లింకా బలవంతులయ్యారు. చివరికి అవినీతిగ్రస్త ముద్రాంకితగా యూపీఏ ప్రభుత్వం నిలిచింది. విషాదమేమంటే చివరికి ఆమె అల్లుడు రాబర్ట్ వాద్రా అవినీతి ఒక సమస్యగా ముందుకు వచ్చింది. అందుకు కూడా మన్మోహన్‌ను ఎలా తప్పు పడతారు? 2008లో యూపీఏ ప్రభుత్వాన్ని కాపాడినప్పటి నుంచి ములాయంసింగ్‌తో మన్మోహన్‌కు మంచి సంబంధాలుండేవి. సోనియా.. ములాయం, అమర్‌సింగ్‌లను ఎప్పుడూ అవమానిస్తూ వచ్చారు. అత్యంత శక్తివంతురాలు, పెళుసు స్వభావి మమతా బెనర్జీతో సర్దుబాటు చేసుకుపోవడానికి మన్మోహన్ సిద్ధంగా ఉండేవారు. సోనియా చేజేతులారా ఇద్దరు రాజకీయమిత్రులను దూరంగా తరిమిపా రేశారు. ఇక ఆంధ్రప్రదేశ్ విభజన రాష్ట్రంలో కాంగ్రెస్ పునాదులను తుడిచి పెట్టేసింది. దాదాపు రెండేళ్లపాటూ అది కేంద్ర ప్రభుత్వాన్ని చికాకుపెట్టింది. వివాదాస్పదమైన ఏపీ రాష్ట్ర విభజన నిర్ణయం పూర్తిగా సోనియాదే. విభజనతో తెలంగాణలో కాంగ్రెస్‌కు కనీసం 16 మంది ఎంపీలు లభిస్తారని ఆమె అంచనా వేశారు. రాష్ట్ర విభజన ఎత్తుగడ పారి వుంటే ఆ ఘనత ఆమెకు దక్కేదే. కానీ అది విఫలం కావడంతో ఆమె మౌనంగా ఉన్నారు. మంచి పాలనను అందించడానికి బదులుగా ఆమె అడ్డదారిని ఆశ్రయించారు. అందుకు తప్పు పట్టాల్సింది ఆమెను మాత్రమే. అవాస్తవిక అంచనాలతోనే తిప్పలు భారత ప్రజల సంగతి తనకు బాగా తెలుసని సోనియా నమ్మారు. నిత్యమూ నరేంద్రమోడీని తిట్టిపోస్తే చాలు ఆయన అంతు చూసేయొచ్చని ఆమె అనుకున్నారు. విరుద్ధ ఫలితం కలిగింది. ఆమె ఎంతగా తిట్టిపోస్తే మోడీ అంత బలవంతునిగా ముందుకొచ్చారు. దేశంలో చాలా మంది మోడీలా ఆలోచిస్తున్నారని, సోనియా మాటలు వినడానికి వారు సిద్ధంగా లేరని ఆమె గ్రహించలేదు. సోనియా ఆయనపై సీబీఐని ప్రయోగించాలని చూశారు. అది ఆమెకే బెడిసికొట్టింది. సోనియాయే స్వయంగా తనను ఓడించనున్న శత్రువును సృష్టించారు. భజనపరులు సోనియా అత్త ఇందిరాగాంధీ, భర్త రాజీవ్‌గాంధీలకు చెరుపు చేశారని ఆమెకు తెలుసు. కానీ కుమారుడ్ని ప్రధానిని చేయాలన్న కలలకు ఆమె బానిసయ్యారు. సోనియా, రాహుల్ తమ తప్పిదాలకు ఇతరులను తప్పు పడుతున్నారు. రేపటి ఓటమికి బలిపశువుగా మన్మోహన్‌ను సిద్ధం చేశారు. పెంటపాటి పుల్లారావు వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు -
దాచేస్తే దాగని సత్యం
సంపాదకీయం అందరికీ తెలిసిన విషయాలే మళ్లీ చెప్తే పెద్దగా ఆసక్తి అనిపించక పోవచ్చు. కానీ చెప్పే తీరునిబట్టి, చెప్పేవారినిబట్టి ఒక్కోసారి మళ్లీ కొత్తగా విన్న అనుభూతి కలుగుతుంది. ఆ అంశాలకు సాధికారత వస్తుంది. ప్రముఖ పాత్రికేయుడు సంజయ బారు వెలువరించిన గ్రంథం ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్’ ఇప్పుడలాంటి ఆసక్తినే కలిగిస్తున్నది. ఇది ఎన్నికల రుతువు గనుక ఆ పుస్తకం కావలసినంత వివాదాన్నీ, సంచలనాన్నీ కూడా సృష్టిస్తున్నది. దేశాధినేతలుగా ఉన్నవారూ, ఉన్నతాధికారులుగా పనిచేసినవారూ పదవులనుంచి వైదొలగాక తమ జ్ఞాపకాలను గ్రంథస్తం చేసే సంప్రదాయం అన్ని దేశాల్లోనూ ఉంది. మన దేశమూ అందుకు భిన్నం కాదు. కానీ, ఎవరినీ ఏమీ అనలేని అశక్తత కావొచ్చు...స్వోత్కర్షలతో నింపడంవల్ల కావొచ్చు ఆ పుస్తకాలు ఆసక్తి కలిగించిన సందర్భాలు తక్కువ. అందువల్లే వచ్చినట్టు కూడా ఎవరికీ తెలియకుండానే పుస్తక దుకాణాల అల్మారాల్లో అవి మౌనంగా మిగిలిపోతాయి. సంజయ పుస్తకం ఇందుకు భిన్నం. కాంగ్రెస్ అధినాయకత్వాన్ని, వ్యక్తిగతంగా మన్మోహన్‌ను ఇరకాటంలో పెట్టే అంశాలనేకం ఉండటమే దీనికి కారణం. ఆయన చెప్పిన విషయాలు ఎవరికీ తెలియనివి కాదు. పదేళ్లుగా కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నవే. గతంలో ఎందరో విశ్లేషకులు చెప్పినవే. మన్మోహన్సింగ్, సోనియాగాంధీ... ఇద్దరికిద్దరూ రెండు అధికార కేంద్రాలుగా మారారని, అందువల్లే పాలన సర్వం కుంటుబడిందని చాలామంది అన్నారు. వివిధ దేశాలకు రేటింగ్లిచ్చే అంతర్జాతీయ సంస్థ స్టాండర్డ్ అండ్ పూర్... రాజకీయాధికారం సర్వస్వం సోనియాగాంధీ అధీనంలో ఉండగా మన్మోహన్ అలంకారప్రాయంగా మిగిలిపోయారని ఒకానొక సమయంలో ఎద్దేవా చేసింది. ఇప్పుడు సంజయ బారు కూడా దాన్నే ధ్రువపరుస్తున్నారు. రెండు రకాల అధికార కేంద్రాలవల్ల అయోమయం వస్తుంది గనుక సోనియానే అధికార కేంద్రమని మన్మోహన్ గుర్తించారని చెబుతున్నారు. సోనియా, ఆమె చుట్టూ చేరినవారి వ్యవహారశైలి... సహించలేని తత్వమూ ఈ పుస్తకం పట్టిచూపుతుంది. యూపీఏ-1 పాలనపై ప్రజల్లో మంచి అభిప్రాయమే ఉంది. అందువల్లే 2009 ఎన్నికల్లో అది గణనీయమైన విజయం సాధించింది. సర్వేల జోస్యాలన్నిటినీ తలకిందులు చేసి లోక్‌సభలో 206 స్థానాలను కైవసం చేసుకోగలిగింది. ఈ విజయాన్ని కాంగ్రెస్ అధినేత సోనియాగాంధీకి ఆపాదించాలా, మన్మోహన్ పాలనాదక్షతకు ఆపాదించాలా అన్న మీమాంసకు మీడియా పోలేదు. అప్పట్లో విడుదలై, జనాదరణ పొందిన హిందీ చిత్రం ‘సింగ్ ఈజ్ కింగ్’ అందరికీ స్ఫురణకొచ్చి మీడియా అంతటా అదే పతాక శీర్షిక అయింది. మన్మోహన్ సైతం రెండో దఫా విజయం తన ప్రజ్ఞే అనుకొని ఉండొచ్చని సంజయ అంటున్నారు. మన్మోహన్‌లో నెలకొన్న ఈ అభిప్రాయం తర్వాతి దశలో ఆయనకు మేలు కంటే కీడే చేసింది. వాస్తవానికి దేశ చరిత్రలో మన్మోహన్‌ది ప్రత్యేక స్థానం. దశాబ్దాలపాటు సోషలిస్టు ఆర్ధిక విధానాల పేరిట సాగిన దశను తారుమారు చేసి పీవీ నరసింహారావు పాలనాకాలంలో ఆర్ధిక సంస్కరణలను తీసుకురావడంలో మన్మోహన్‌దే కీలకపాత్ర. మన్మోహన్ ప్రధాని అయ్యాక జరిగిన మంచేమైనా ఉంటే సోనియాకు...చెడంతా ఆయనకూ పంపకం చేయడానికి సోనియా సన్నిహితులు ఆదినుంచీ చాలా పట్టుదలగా ఉన్నారు. ఆ పట్టుదల రెండో దఫా పాలనలో మన్మోహన్‌ను ప్రశాంతంగా పనిచేసుకోనీయనంత స్థాయికి చేర్చింది. పర్యవసానంగా అంతా అస్తవ్యస్థమైంది. వరస కుంభకోణాలు వెలుగుచూశాయి. పారిశ్రామిక ప్రగతి కుంటుబడింది. స్టాక్ మార్కెట్లు కొడిగట్టాయి. వృద్ధిరేటు దిగజారింది. నిత్యావసరాల ధరలు పెరిగి, ఉపాధి కరువై సామాన్యుడి బతుకు దుర్భరమైంది. రూపాయి పతనం, ద్రవ్యోల్బణంవంటివి మరింతగా కుంగదీశాయి. అయితే, ఈ పరిస్థితికి సోనియా అండ్ కో బాధ్యత ఎంతో, మన్మోహన్ బాధ్యతా అంతే ఉంది. స్వయంగా ఆర్ధిక నిపుణుడైన ఆయన ఈ పరిణామాలను చక్కదిద్దేందుకూ...అది సాధ్యంకాకపోతే వైదొల గేందుకూ సిద్ధపడలేదు. ఎంతో బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి కూడా నిమిత్తమాత్రంగా, మౌన సాక్షిగా మిగిలిపోయారు. సోనియా మొదట చెప్పిన వ్యక్తికి పీఎంఓలో స్థానం కల్పించకపోయినా, మరొకరి విషయంలో ఆమె మాట కాదనలేకపోయారు. ఫలితంగా ఫైళ్లన్నీ సోనియాకు వెళ్లేవని, చివరకు కీలక విధాన నిర్ణయాలకు సంబంధించి ఆమె ఆదేశాలు అమలయ్యేవన్నది సంజయ బారు అభియోగం. అసలు తన కేబినెట్లోకి ఎవరొస్తున్నారో, ఎవరికి ఏ శాఖ వెళ్తుందో తెలియనంత అయోమయంలో ప్రధాని ఉన్నాక పీఎంఓనుంచి ఫైళ్లు చట్టవిరుద్ధంగా వెలుపలకు వెళ్లడంలో వింతేమీ లేదు. ఈ గ్రంథం మన్మోహన్ నిస్సహాయతను స్పష్టంగా చూపినా, ఒకరకంగా ఆయనకు దీనివల్ల మంచే జరుగుతుంది. మరికొన్ని రోజుల్లో ముగిసే సార్వత్రిక ఎన్నికల్లో యూపీఏ ఎటూ ఘోర పరాజయాన్ని చవిచూడబోతున్నది. అందుకు పూర్తి బాధ్యతను ‘మాట్లాడని’ మన్మోహన్‌కు అంటగట్టి సోనియా, రాహుల్‌గాంధీలను మణిపూసలుగా చిత్రించే పనిలో దిగ్విజయ్, జైరాంరమేష్, సల్మాన్ ఖుర్షీద్లాంటి వందిమాగధులు ఇప్పటికే తలము నకలై ఉన్నారు. సంజయ గ్రంథం ఆ ప్రయత్నాన్ని సమర్ధవంతంగానే అడ్డుకుంటుంది. తన అశక్తతతో, పదవినిచ్చినవారిపట్ల అలివిమాలిన కృతజ్ఞతో... మొత్తానికి మన్మోహన్ మెతకగా మిగిలిపోవడం నిజం. పర్యవసానంగా జరగకూడనివెన్నో జరిగాయని పుస్తకం వెల్లడిస్తోంది. పీఎంఓ కొట్టిపారేసినంత మాత్రాన ఇదంతా సమసిపోదు. తనకు తెలి సిన విషయాల్లో సగమే రాశానని సంజయ బారు చెబుతున్నారు. ఇందులో నిజం లేదని చెప్పగలిగే ధైర్యముంటే సోనియా, మన్మోహన్ గొంతు విప్పాలి. దేశ ప్రజలకు సంజాయిషీ ఇవ్వాలి. -
గాడ్సే సోనియా.. బొమ్మ ప్రధాని
-
రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలని కోరాం
-
ప్రధానితో భేటీ అయిన వైయస్ఆర్ కాంగ్రెస్ బృందం