సీబీఐ స్పెషల్ కోర్టు సమన్లు జారీ చేయడాన్ని సీరియస్ గా తీసుకున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ..అత్యవసరంగా సమావేశమవుతున్నట్టు తెలుస్తోంది
న్యూఢిల్లీ: భారత మాజీ ప్రధాని డా.మన్మోహన్ సింగ్కు సీబీఐ స్పెషల్ కోర్టు సమన్లు జారీ చేయడాన్ని సీరియస్గా తీసుకున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ..అత్యవసరంగా సమావేశమైంది. ఈ సమావేశంలో లీగల్ స్ట్రాటజీతో పాటు, రాజ్యసభలో ఆమోదానికి రానున్నబిల్లులపై చర్చ జరగిందని తెలుస్తోంది.
మన్మోహన్కు సమన్ల జారీపై న్యాయస్థానంలో అప్పీలు చేయడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఆయనకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఎఐసీసీ హెడ్ క్వార్ట ర్స్ నుండి మన్మోహన్ నివాసం వరకూ ఈ ర్యాలీ సాగింది. అనంతరం మన్మోహన్ను కలిసి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా సోనియా మాట్లాడుతూ మన్మోహన్ నీతికీ, నిజాయితీకి మారు పేరు... ఆయనపై వచ్చిన ఆరోపణలకు వ్యతిరేకంగా పార్టీ పోరాడుతుంది.. ఆయనకు అండగా వుంటామని, ఈ కేసు నుంచి మన్మోహన్ నిర్దోషిగా బయటపడతారని తెలిపారు.
కాగా బొగ్గు కుంభకోణం కేసులో నిందితుడుగా మన్మోహన్ సింగ్తో పాటు, కుమార మంగళం బిర్లా, పీసీ పరేఖ్ తదితరులకు సమన్లు జారీ చేసిన ప్రత్యేక కోర్టు ఏప్రిల్ 8 న కోర్టు హాజరు కావాలని కోరిన సంగతి తెలిసిందే.