
ఆంధ్రులను మోసం చేస్తున్న టీడీపీ, బీజేపీ
ఆనందపేట (గుంటూరు) : టీడీపీ, బీజేపీ ప్రభుత్వాలు ఆంధ్రులను మోసం చేస్తున్నాయని రాజ్యసభ సభ్యుడు జేడీ శీలం ఆరోపించారు. స్థానిక జిల్లా కాంగ్రెస్ కార్యాలయం నుంచి శనివారం ప్రారంభమైన చలో ఢిల్లీ కార్యక్రమాన్ని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మన్మోహన్ ప్రభుత్వం అమలు చేసిన హామీలు వెంటనే నేరవేర్చాలని డిమాండ్ చేశారు. అన్ని రాజకీయ పక్షాల నాయకులను కలిసి ప్రత్యేక హోదా కోసం కృషి చేయాలని జిల్లా నాయకులకు సూచించారు. పార్టీ జిల్లా నాయకులు మక్కెన మల్లికార్జునరావు, ఎం.ముత్యాలరావు, చదలవాడ జయరాంబాబు, వణుకూరి శ్రీనివాసరెడ్డి, షేక్ అబ్దుల్ వహిద్, కొరివి వినయ్ కుమార్, కూచిపూడి సాంబశివరావు, ఈరి రాజశేఖర్, షేక్ మౌలాలి, పవన్ తేజ, మదన మెహనరెడ్డి, చిలకా రమేష్ పాల్గొన్నారు.