బాబుకి ఏమైంది..? | Budugu release on 17th April | Sakshi
Sakshi News home page

బాబుకి ఏమైంది..?

Published Thu, Apr 9 2015 12:27 AM | Last Updated on Sun, Sep 3 2017 12:02 AM

బాబుకి ఏమైంది..?

బాబుకి ఏమైంది..?

బన్నీకి తొమ్మిదేళ్లు. ఎప్పుడూ ఊహల్లో ఉంటాడు. తనకు నచ్చిన పాత్రలో తనను తాను ఊహించుకుంటూ ఉంటాడు. బన్ని అల్లరి భరించలేక అతని తండ్రి బోర్డింగ్ స్కూల్లో వేసేస్తాడు. కానీ అసలు కథ అక్కడే మొదలవుతుంది. అక్కడ బన్ని విచిత్రంగా ప్రవర్తిస్తాడు. మిగతా వాళ్లందర్నీ భయపెడుతూ ఉంటాడు. అసలు బన్నీకి ఏమైంది...? అనేది తెలియాలంటే ఈ నెల 17న విడుదల కానున్న ‘బుడుగు’ చూడాల్సిందే. లక్ష్మీ మంచు, శ్రీధర్‌రావు, మాస్టర్ ప్రేమ్‌బాబు, ఇంద్రజ ముఖ్యతారలుగా మన్‌మోహన్ దర్శకత్వంలో భాస్కర్, సారికా శ్రీనివాస్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
 
 మన్‌మోహన్ దర్శకుడు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘పిల్లలూ, పెద్దలూ చూసే విధంగా ఉంటుంది. చెన్నయ్‌లో మీడియా మ్యాజిక్ వారికి ఈ చిత్రాన్ని చూపిస్తే, తమిళంలో రీమేక్ చేయాలని నిర్ణయించుకున్నారు’’ అని చెప్పారు. ఈ చిత్రానికి కచ్చితంగా అవార్డులు వస్తాయనీ, లక్ష్మీ మంచు కెరీర్‌లో ఓ మైలు రాయిలా నిలిచిపోతుందనీ నిర్మాత భాస్కర్ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తీక్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: వంశీ పులూరి, సమర్పణ: సుధీర్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement