Budugu
-
గబగబా చదివి పారేస్తే ఘబుక్కుని పెద్దాళయిపోతాంగా!!
పాపం ఈ పెద్దవాళ్లెపుడూ యింతే. ముందస్తుగా వాళ్ల మాట వినాలి అంటారు గదా. పోనీలే మనం అల్లరి చేస్తే అప్పుడు మన్ని రష్చించరు. మళ్లీ అల్లరి చెయ్యను.. అంటే చెయ్యి అంటారు. చేస్తానూ అంటే ఒద్దూ అంటారు. ఎప్పుడూ మనమే వాళ్ల మాట వినాలి అంటారు. ఒక్కసారేనా వాళ్లు మన మాట వినరు. అంతెందుకు.. యిప్పుడు పాపం బాఘా చిన్న పిల్లలుంటారా.. వాళ్లకి కుంచెం తెలుగు వస్తుంది చూడు.. అప్పుడేమో.. ఎవరూ లేకుండా కుంచెం మాటాడుతారు. యీ అమ్మా.. నాన్నా.. బామ్మ.. యిలాటివాళ్లు ఎలాగో వినేస్తారు. అప్పుడు పక్కింటి లావుపాటి పిన్నిగారూ.. వాళ్ల ముగుడూ అలాటి వాళ్లు మనింటికొస్తారు.. అప్పుడేమో ఈ పాపాయిని కూచోబెట్టి నీ పేరు చెప్పూ అంటారు. పాపం పాపాయికి బాఘా తెలుగురాదు గదా.. దానికి భయంవేసి చెప్పదు. అప్పుడేమో ఈ పెద్దవాళ్లందరూ చూట్టూ నించుని చెప్పుచెప్పు చెప్పూ అని కేకలు వేస్తారు గదా.. పాపాయికి కోపం వచ్చేస్తుంది. దాన్ని రష్చించడానికి నేను చెప్తాననుకో పేరు! వాళ్లు వినరుగా నన్ను కొఠేస్తారు. దాని పేరు అదే చెప్పాలిట. అది చెప్పదుగా మరి. అప్పుడు వాళ్లమ్మా నాన్న దాన్ని కొఠేస్తారు మొండి పిల్లా అని. వాళ్లకి మొండి పిల్ల అంటే అసలు అర్థం తెలీదు. నాకు తెలుసనుకో. పక్కింటి లావుపాటి పిన్నిగారు ఒకసారి పేరంటానికెళ్లి వాళ్ల పాపను ఎత్తుకుంటుంది కదా.. అప్పుడు పాప చంక దిగనంటుంది కదా.. వాళ్లమ్మ పిలిచినా వాళ్లనాన్న, బామ్మ పిలిచినా రాను పో అంటుంది. ఆఖరికి ఇంకో పాపాయి వచ్చి ఉంగా భాషలో ఆలుకుందా వత్తావే అని పిలిచినా సరే లాను పో అంతుందే అదీ మొండి పిల్ల. ఏవిటో ఈ పెరపంచకంలో బోల్డుబోల్డు రకాల పిల్లలు. బోల్డురకాల పెద్ధవాళ్లు. అప్పుడప్పుడూ నేను హాచర్యపడి పోయేస్తుంటాను. బుడుగూ, మరేమోనేం మా అమ్మావాళ్లూ రోజూ నన్ను బళ్లోకి వెళ్లమంటున్నారు. లాపోతే కొట్టుతాను అంటున్నారు ఎలాగ? ముందస్తుగా నాకు కోపం వస్తుంది. ఎందుకంటే వీడు నన్ను అనుమానం చేస్తున్నాడు కదా. నా పేరు బుడుగు అయినా వీడు బుడుగు అని ఎందుకు రాయాలీ? అందుకే. అయినా వాడి ఖష్టాలు చూస్తే జాలి వేస్తోంది గదా మనకి. అసలు నీ చిన్నప్పటినించీ, మీ తాతయ్య చిన్నప్పటినించీ చిన్న పిల్లలు ఎప్పుడూ ఇలా కష్టపడుతూనే ఉన్నారు. అందరు చిన్నపిల్లలినీ ఇలా బళ్లో పెట్టెయ్యడమే. పోనీ ఏదో ప్పదిరోజులికి ఒకసారి వెళ్లితే చాలదుట. రోఝూ వెళ్లాలిట. మళ్లీ యీ పెద్దవాళ్లందరూ చిన్నప్పుడు ఇలా కష్టపడినవాళ్లే. అయినా పెద్దయ్యాక ఇప్పుడు చిన్న చిన్న పిల్లలిని బళ్లో పెఠేస్తున్నారు. అంతెందుకులే.. పాపం నన్ను కూడా రేపో మూడ్రోజులుకో బళ్లోపెట్టాలని చూస్తున్నారు గదా. నన్నేం చెయ్యలేరనుకో. అయినా చిన్నవాళ్లూ బళ్లోకెళ్లకుండా ఉండడానికని కొన్ని సంగతులు చెప్తాను. చదవండి: హెచ్చరిక!! ఈ శతాబ్దం చివరి నాటికి భూమిపై ఘోర మారణహోమం.. ఒకటి: జెరం వచ్చిందని చెప్పాలి. మనం చెప్తే నమ్మరుగదా.. అందికని యేం చెయ్యాలంటే ముందస్తుగా చొక్కా యిఫ్పేసుకోవాలి. అప్పుడేమో ఎండలో నిలబడాలి చాలాసేపు. అప్పుడు వీపు మీద .. పొట్ట మీద జెరం వచ్చేస్తుంది. అప్పుడు పరిగేసుకుని అమ్మ దగ్గిరికి వెళ్లాలి. అమ్మోయి జెరం జెరం గబగబా చూడూ.. బళ్లోకి వెళ్లద్దని చెప్పూ అని చెప్పాలన్నమాట. ఇంకోటి: జెరం రాగానే పరిగేసుకు కెళ్లి చెప్పాలి తెలుసా.. లాపోతే జెరం చల్లారిపోతుంది. ఉంకోటి కూడాను.. ఇలాంటి దానికి అసలు బామ్మ మంచిది. బామ్మకి చెప్పేస్తే చాలు.. అప్పుడు అదే అమ్మకి చెప్తుంది. రెండు: కుంచెం మంది పిల్లలు కడుపునొప్పి అని అంటారు కాని అది మంచిదికాదులే. రెండుసార్లో.. ఫదిసార్లో అయాకా అమ్మావాళ్లూ కారప్పూసా పకోడీలు చేసుకుని మనకి పెట్టకుండా తినేస్తారు. యిప్పుడు లేదుగదే అమ్మా అని చెప్పినా సరే.. పెట్టరు. ఇప్పుడు లేకపోతే రేపోప్పదిరోలుకో వస్తుందిగా అందుకని వద్దూ అని అంటారు. అందుకని, తలనొప్పి అన్నింటికన్నా మంచిది. ముందస్తుగా అమ్మ నమ్మదు అనుకో. అయినా సరే మనం తలనొప్పి తలనొప్పి అని పదిసార్లో వందసార్లో చెబితే కుంచెం నమ్ముతారు. ఇది కూడా ముందస్తుగా బామ్మకే చెప్పాలి. అమ్మకి చెబితే లాబంలేదు. అసలు ఏం చేసినా లాబంలేదు. ఎలాగేనా బళ్లోకి వెళ్లాలిలే. అందుకని కుంచెం ఎలాగో చాలా కష్టపడి రోఝూ బళ్లోకే పోవడం మంచిది. గబగబా గబగబా చదివి పారేస్తే ఘబుక్కుని పెద్దాళయిపోతాంగా. అప్పుడు ఇంచక్కా ఎప్పుడూ బడి మానేయొచ్చు. యింకోటి.. మా బాబాయంత పెద్దవాళ్లు అయ్యాకా.. అసలు ఇంక బళ్లోకి వెళ్లద్దంటారులే. మా బాబాయి అంతేగా.. బళ్లోకి వెళ్తాను వెళ్తాను అంటాడు. బామ్మా, నాన్న..యింక చాల్లే, ఆఫీసుకి వెళ్లిపో అంటారు. అదన్నమాట. ఈ పెద్దవాళెపుడూ యింతే. మనం వెళ్తాం అంటే వద్దూ అని అంటారు. మనం వెళ్లను ఒద్దూ అంటే, వెళ్లూ వెళ్లూ బళ్లోకెళ్లూ బడి దొంగా అంటారు యెలాగ? ఇంకో ఉత్తరం చూడు.. వీడు కుంచెం పెద్ద కుర్రాడిలా వున్నాడు. వురేయ్ వురేయి బుడుగూ మలేమోన మా అమ్మా నాన్నా డబ్బులు అసలు ఈటంలేదూ ఎలాగరా మరీ అని రాశాడు గదా.. ఇది కూడా చాలా కష్టమే. అసలు డబ్బులు అంటే చాలామందికి చాలా యిష్టంట. నాక్కూడా కుంచెం యిష్టమేననుకో. కాని ఏం చేస్తాం. చిన్న పిల్లలికీ, కాలేజీకి వెళ్లే బాబాయిలకీ డబ్బులు చాలా యివ్వరు. అడిగినా సరే. కాని అబద్ధం చెప్తే చాలా డబ్బులు ఇస్తారుట. బాబాయి యిలాగే చేస్తాడుట. మళ్లీనేమో నాన్నకి అమ్మ డబ్బులు ఇవ్వదు కదా. ఎందుకూ అంటుంది. అప్పుడు నాన్న కుంచెం అబద్ధాలు చెప్పుతాడుట. చిన్న పిల్లలు మాత్తరం అబద్ధం చెప్పకూడదుట. చెప్పితే కొట్టుతారు. కాని మనం నిజెం చెప్పుతాను అంటూ కుంచెం మంది పెద్దవాళ్లు డబ్బులిస్తారులే. పక్కింటి లావుపాటి పిన్నిగారి ముగుడు లేడూ.. వాడేం.. బీడీలు కాలుస్తాడులే. బీడీలు కాలచడం అంటే తప్పు కదా ఊరికే జెటకా తోలడానికి దాచుకోవాలి అంతే. వాడు నిజెంగా కాలిచేస్తాడు గదా. పక్కింటి లావుపాటి పిన్నిగారు అతనికి చెప్పిందిలే వురేయ్ ముగుడూ అలా బీడీలు కాలచకూడదూ అని. అయినా వాడు మా యింటికి వచ్చి నాన్న దగ్గర కూచుని కాలుచుతాడు గదా. అప్పుడేమో నేను వురేయ్ నీ సంగతి చెప్పుతా ఉండు అని అంటాను గదా. వాడు ఘబుకుని నన్ను ముద్దు పెఠేసుకుని ఓ కాణీయో ప్పదణాలో యిచ్చేసి చెప్పకమ్మా బుడుగు తప్పమ్మా ఒద్దమ్మా యిలాని ఏడుచుతాడు. అప్పుడు నేనేమో పోనీలే అని.. యేవండీ పక్కింటి లావుపాటి పిన్నిగారూ.. మరేమోనూ మీ ముగుడేమో మా నాన్నతో కలసి బీడీలు కాలచలేదండీ అని అబద్ధాలు చెపేస్తాను. ఏవిటో నేను యెప్పుడు ఇలా అందరినీ రష్చించుతానులే. - ముళ్లపూడి వెంకటరమణ చదవండి: టాయిలెట్లో ఎక్కువ సమయం గడుపుతున్నారా? ఆ సమస్య అందుకేనట!! -
అందుకే మంచి ఫలితం వచ్చింది!
‘‘తెల్లాపూర్ గ్రామంలో మా స్నేహితుడి అన్నయ్య కొడుకు విచిత్రంగా ప్రవర్తించేవాడు. ఆ పాయింట్‌ని తీసుకుని, ఈ చిత్రం చేశాను. కథ వినగానే నిర్మాతలు సారికా శ్రీనివాస్, భాస్కర్ మరో ఆలోచనకు తావు ఇవ్వకుండా నిర్మించడానికి అంగీకరించారు. నటీనటులు అందరూ కూడా ఈ కథతో బాగా కనెక్ట్ అయ్యారు కాబట్టే, మంచి అవుట్‌పుట్ వచ్చింది. అందుకే మంచి ఫలితం కూడా వచ్చింది’’ అని దర్శకుడు చల్లా మన్మోహన్ అన్నారు. మంచు లక్ష్మీ, శ్రీధర్, ఇంద్రజ, మాస్టర్ ప్రేమ్‌బాబు, డాలీ ముఖ్య తారలుగా సుధీర్ సమర్పణలో భాస్కర్, సారికా శ్రీనివాస్ నిర్మించిన ‘బుడుగు’ ఇటీవలే విడుదలైంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో మన్మోహన్ పత్రికలవారితో మాట్లాడుతూ -‘‘మొదటి మూడురోజుల్లోనే సినిమా ఎత్తేస్తున్న ఈ రోజుల్లో మా సినిమా ఐదో రోజుకి కూడా 37 థియేటర్లు పెంచాం. మొత్తం 130 థియేటర్లలో మంచి వసూళ్లు రాబడుతోంది. ఈ సినిమా హిందీ హక్కులను సన్నీ ఎంట ర్టైన్మెంట్స్ పొందింది’’ అని చెప్పారు. -
ఇది ఓ నిజ జీవిత కథే : మన్మోహన్
‘‘ఎనిమది సంవత్సరాల అబ్బాయికీ, తన కుటుంబానికి జరిగిన ఓ వాస్తవ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకె క్కించాం. ట్రైలర్ చూసి చాలా మంది హార్రర్ చిత్రం అనుకున్నారు కానీ ఇదొక కుటుంబ కథాచిత్రం ’’ అని మన్మోహన్ అన్నారు. లక్ష్మీ మంచు ప్రధాన పాత్రలో మన్మోహన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘బుడుగు’. భాస్కర్, సారికా శ్రీనివాస్ నిర్మాతలు. ఈ చిత్రం విజయోత్సవం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ -‘‘మాస్టర్ ప్రేమ్‌బాబుకు ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టింది. ముఖ్యంగా ప్రీ-క్లైమాక్స్ సన్నివేశాలు ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అయ్యాయి. తల్లి పాత్రలో లక్ష్మి మంచు చాలా బాగా నటించారు. అనుకున్నదానికన్నా ఈ సినిమాకు మంచి స్పందన లభిస్తోంది ’’ అన్నారు. -
బాబుకి ఏమైంది..?
బన్నీకి తొమ్మిదేళ్లు. ఎప్పుడూ ఊహల్లో ఉంటాడు. తనకు నచ్చిన పాత్రలో తనను తాను ఊహించుకుంటూ ఉంటాడు. బన్ని అల్లరి భరించలేక అతని తండ్రి బోర్డింగ్ స్కూల్లో వేసేస్తాడు. కానీ అసలు కథ అక్కడే మొదలవుతుంది. అక్కడ బన్ని విచిత్రంగా ప్రవర్తిస్తాడు. మిగతా వాళ్లందర్నీ భయపెడుతూ ఉంటాడు. అసలు బన్నీకి ఏమైంది...? అనేది తెలియాలంటే ఈ నెల 17న విడుదల కానున్న ‘బుడుగు’ చూడాల్సిందే. లక్ష్మీ మంచు, శ్రీధర్‌రావు, మాస్టర్ ప్రేమ్‌బాబు, ఇంద్రజ ముఖ్యతారలుగా మన్మోహన్ దర్శకత్వంలో భాస్కర్, సారికా శ్రీనివాస్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మన్మోహన్ దర్శకుడు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘పిల్లలూ, పెద్దలూ చూసే విధంగా ఉంటుంది. చెన్నయ్‌లో మీడియా మ్యాజిక్ వారికి ఈ చిత్రాన్ని చూపిస్తే, తమిళంలో రీమేక్ చేయాలని నిర్ణయించుకున్నారు’’ అని చెప్పారు. ఈ చిత్రానికి కచ్చితంగా అవార్డులు వస్తాయనీ, లక్ష్మీ మంచు కెరీర్లో ఓ మైలు రాయిలా నిలిచిపోతుందనీ నిర్మాత భాస్కర్ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తీక్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: వంశీ పులూరి, సమర్పణ: సుధీర్. -
సైకలాజికల్ థ్రిల్లర్
ఎనిమిదేళ్ల ఆ బాలుడు ఎవరితోనూ సరిగ్గా మాట్లాడడు. తన వయసున్న పిల్లల్లా హుషారుగా ఉండడు. ఉద్యోగస్థులైన ఆ బాలుడి తల్లితండ్రులకు అదేమీ పట్టదు. చివరకు ఇరుగుపొరుగు, స్కూల్ నుంచి ఫిర్యాదులు రావడంతో బోర్డింగ్ స్కూల్లో చేర్పిస్తారు. అక్కడ కూడా బాలుడు వింతగా ప్రవర్తిస్తుంటాడు. ఎవరూ చూడనివి చూశానని చెబుతుంటాడు. ఇంతకీ ఆ బాలుడి సమస్య ఏంటి? అతని సమస్యను ఎవరు పరిష్కరించారు? అనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘బుడుగు’. లక్ష్మీ మంచు ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రంలో టైటిల్ రోల్‌ను మాస్టర్ ప్రేమ్ చేశాడు. ఇంద్రజ, శ్రీధర్‌రావు ఇతర కీలక పాత్రలు చేశారు. సుధీర్ సమర్పణలో భాస్కర్, సారికా శ్రీనివాస్ నిర్మించిన ఈ చిత్రానికి మన్మోహన్ దర్శకత్వం వహించారు. ఇది సైకలాజికల్ థ్రిల్లర్ అనీ, కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం చేశామని దర్శకుడు తెలిపారు. ఈ వారంలోనే పాటలను విడుదల చేస్తామని నిర్మాతలు చెప్పారు. -
నిజజీవిత ఘటనలతో...
లక్ష్మీ మంచు, శ్రీధర్‌రావు, మాస్టర్ ప్రేమ్, బేబీ డాలీ కీలక పాత్రలు పోషించిన చిత్రం ‘బుడుగు’. వాస్తవ సంఘటనల ఆధారంగా మన్మోహన్ రూపొందించిన ఈ చిత్రానికి భాస్కర్, సారికా శ్రీనివాస్ నిర్మాతలు. ఈ చిత్రం ప్రచార చిత్రాలను హైదరాబాద్‌లో ప్రదర్శించారు. సారికా శ్రీనివాస్ మాట్లాడుతూ - ‘‘ఇది చైల్డ్ బేస్డ్ సైకలాజికల్ థ్రిల్లర్. పరిసరాలు పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయనేది కీలకాంశం. జనవరి మూడో వారంలో చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘ఒక సైకియాట్రిస్ట్ ద్వారా తెలిసిన విషయాల ఆధారంగా ఈ చిత్రం చేశాం. కథ బాగుందని లక్ష్మి ఒప్పుకున్నారు. ఇంద్రజ అతిథి పాత్ర చేశారు. సాయి కార్తీక్ స్వరపరచిన పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి’’ అని చెప్పారు. ‘‘కథ వినగానే బాగా నచ్చింది. ప్రేమ్‌కీ, డాలీకీ, కుక్కపిల్లకీ మన్మోహన్ ఇచ్చిన శిక్షణ సూపర్. లాస్ ఏంజిల్స్‌లో ఎలా అయితే షూటింగ్‌కి సన్నాహాలు చేస్తారో.. ఈ చిత్రానికి అలానే చేశాం’’ అని చెప్పారు. ఇంకా చిత్రబృందం మాట్లాడారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: వంశీ పులూరి, కెమెరా: సురేశ్ రఘుతు, సమర్పణ: సుధీర్. -
సైకలాజికల్ థ్రిల్లర్ “బుడుగు” స్టిల్స్
-
విచిత్ర సంఘటనలు ఎదురైతే..?
ప్రస్తుత కాలంలో పెద్దల మీద కన్నా, పిల్లలపైనే ఒత్తిడి ఎక్కువ ఉంటోంది. ఈ ఒత్తిడి ఫలితంగా చాలా అయోమయానికి గురవుతున్నారు వాళ్లు. అలాంటి అయోమయంలో ఉన్న ఎనిమిదేళ్ల పిల్లాడికి కొన్ని విచిత్ర సంఘటనలు ఎదురైతే, ఆ పిల్లాడు ఏం చేస్తాడు? ఆ పిల్లాడి కుటుంబం ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది? ఈ నేపథ్యంలో ‘బుడుగు’ చిత్రం రూపొందుతోంది. మంచు లక్ష్మీ, శ్రీధర్‌రావ్, మాస్టర్ ప్రేమ్‌బాబు, ఇందు ఆనంద్, సన ఇందులో ముఖ్యతారలు. ఇంద్రజ ప్రత్యేక పాత్రలో నటించారు. మన్మోహన్ దర్శకత్వంలో భాస్కర్, సారిక శ్రీనివాస్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఇటీవలే చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ -‘‘యధార్థ సంఘటనలతో రూపొందిస్తున్న సైక లాజికల్ థ్రిల్లర్ ఇది. సైకాలజిస్ట్‌ల సలహాలు తీసుకుని స్క్రిప్ట్ తయారు చేశాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తీక్, కెమెరా: సురేష్ రగుతు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: వంశీ పూలూరి. -
లక్ష్మీ మంచు ప్రధాన పాత్రలో ‘బుడుగు’
పిల్లల భవిష్యత్తుపై బోల్డన్ని ఆశలు పెంచుకుంటారు తల్లిదండ్రులు. కానీ, ఆ ఆశలు పిల్లలను ఎలాంటి ఒత్తిడికి గురి చేస్తాయి? తద్వారా పిల్లల ప్రవర్తన ఎలా మారుతుంది? అనే కథాంశంతో రూపొందుతోన్న చిత్రం ‘బుడుగు’. లక్ష్మీ మంచు ప్రధాన పాత్రలో శ్రీధర్ రావు కీలక పాత్రలో, టైటిల్ రోల్లో మాస్టర్ ప్రేమ్‌బాబు నటిస్తున్న ఈ చిత్రానికి మన్మోహన్ దర్శకుడు. భాస్కర్, సారికా శ్రీనివాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి కావచ్చింది. ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ - ‘‘ఒత్తిడికి గురయ్యే పిల్లాడు, అతని చుట్టూ జరిగిన కొన్ని సంఘటనల కారణంగా ఆ కుటుంబం ఎలాంటి సమస్యలు ఎదుర్కొంది? అనేది ప్రధాన ఇతివృత్తం. ప్రేక్షకులను ఉద్వేగానికి గురి చేసే ఫ్యామిలీ థ్రిల్లర్ ఇది. ఇప్పటివరకూ ఇలాంటి కథ రాలేదు’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: సాయి కార్తీక్, కెమెరా: సురేష్ రగుతు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: వంశీ పుల్లురి. -
బుడుగు మూవీ స్టిల్స్