లక్ష్మీ మంచు ప్రధాన పాత్రలో ‘బుడుగు’ | For 'Budugu', director discussed with child psychologists | Sakshi
Sakshi News home page

లక్ష్మీ మంచు ప్రధాన పాత్రలో ‘బుడుగు’

Published Mon, Aug 4 2014 1:42 AM | Last Updated on Sat, Sep 2 2017 11:19 AM

లక్ష్మీ మంచు ప్రధాన పాత్రలో ‘బుడుగు’

లక్ష్మీ మంచు ప్రధాన పాత్రలో ‘బుడుగు’

 పిల్లల భవిష్యత్తుపై బోల్డన్ని ఆశలు పెంచుకుంటారు తల్లిదండ్రులు. కానీ, ఆ ఆశలు పిల్లలను ఎలాంటి ఒత్తిడికి గురి చేస్తాయి? తద్వారా పిల్లల ప్రవర్తన ఎలా మారుతుంది? అనే కథాంశంతో రూపొందుతోన్న చిత్రం ‘బుడుగు’. లక్ష్మీ మంచు ప్రధాన పాత్రలో శ్రీధర్ రావు కీలక పాత్రలో, టైటిల్ రోల్‌లో మాస్టర్ ప్రేమ్‌బాబు నటిస్తున్న ఈ చిత్రానికి మన్‌మోహన్ దర్శకుడు. భాస్కర్, సారికా శ్రీనివాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి కావచ్చింది.
 
 ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ - ‘‘ఒత్తిడికి గురయ్యే పిల్లాడు, అతని చుట్టూ జరిగిన కొన్ని సంఘటనల కారణంగా ఆ కుటుంబం ఎలాంటి సమస్యలు ఎదుర్కొంది? అనేది ప్రధాన ఇతివృత్తం. ప్రేక్షకులను ఉద్వేగానికి గురి చేసే ఫ్యామిలీ థ్రిల్లర్ ఇది. ఇప్పటివరకూ ఇలాంటి కథ రాలేదు’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: సాయి కార్తీక్, కెమెరా: సురేష్ రగుతు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: వంశీ పుల్లురి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement