Lakshmi Prasanna
-
అబ్రకదబ్ర లోనూ ఆమె ముద్ర
‘నీపై నీకు నమ్మకం ఉంటే అద్భుతం సాధ్యం అవుతుంది’ అనే మాట మెజిషియన్ లక్ష్మికి తెలియనిదేమీ కాదు. ఆ నమ్మకం వల్లే గానం నుంచి ఇంద్రజాలం వరకు ఎన్నో విద్యల్లో ప్రావీణ్యం సాధించింది ‘ఆహా!’ అనిపిస్తుంది...అయిదు అంగుళాల పదునైన మేకును సుత్తితో ముక్కు లోనికి పంపుతూ లక్ష్మి చేసే సాహసం చూసి ప్రేక్షకుల ఒళ్లు గగుర్పొడుస్తుంది. అటూ ఇటూ కదులుతూ చేతిలోని గొడుగును ఆడిస్తూ ఒకదాని తరువాత ఒకటి చొప్పున అలవోకగా 30 కు పైగా గొడుగులు, స్వింగ్ఫ్లవర్స్ తీయడం చూస్తే ఔరా అనిపిస్తుంది. నంబర్స్‌తో మెంటలిజం మ్యాజిక్ చేసి అవాక్కు చేయడమే కాదు, వస్తువుల్ని మాయం చేయడం, పుట్టించడం, మనిషిని రెండు భాగాలు చేసినట్టు భ్రమింప చేయడం... ఇలా ఆమె చేసే ఇంద్రజాలం ప్రేక్షకులని కట్టిపడేస్తుంది.ఇంద్రజాలంతోనే కాదు తన గానంతో కూడా ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తోంది లక్ష్మి. పశ్చిమగోదావరి జిల్లా తణుకుకు చెందిన దండ లక్ష్మీప్రసన్నదేవి భర్త రాము సింగర్, డ్యాన్సర్, మిమిక్రీ ఆర్టిస్టు, మెజీషియ¯Œ , ఎంటర్టైనర్గా సుపరిచితుడు. భర్తతోపాటు ఎన్నో ప్రాంతాలకు వెళుతుండేది లక్ష్మి. అలా వెళ్లడం ద్వారా వివిధ కళా రూపాలకు ప్రేక్షకుల నుంచి వచ్చే అపురూప స్పందనను ప్రత్యక్షంగా చూసే అవకాశం వచ్చింది.రెండేళ్ల క్రితం భర్తతో కలిసి కేరళలో జరిగిన మ్యాజిక్పోటీలకు వెళ్లింది లక్ష్మి. ఆపోటీలలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్క మహిళ కూడా లేకపోవడం గమనించింది. మహిళలు కనిపించని ఆ లోటే తనను మ్యాజిక్‌పై ఆసక్తి పెంచుకునేలా చేసింది. ‘నేను మ్యాజిక్ నేర్చుకోవాలనుకుంటున్నాను’ తన మనసులో మాటను భర్తకు చెప్పింది.అతడు ఎగతాళిగా నవ్వి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదోగానీ ‘భేషుగ్గా నేర్చుకోవచ్చు’ అనడమే కాదు ఇల్లే పాఠశాలగా ఇంద్రజాల విద్య నేర్పడం మొదలుపెట్టాడు. భర్త నుంచి మ్యాజిక్ ట్రిక్స్ నేర్చుకున్న లక్ష్మి చేసిన మొదటి మ్యాజిక్ షోకు మంచి స్పందన వచ్చింది. తనమీద తనకు నమ్మకం వచ్చింది.ఇక అప్పటి నుంచి ‘మ్యాజిక్’ తని ఇంటి పేరుగా మారింది. బర్త్‌డే పార్టీల నుంచి మ్యారేజ్ వరకు రకరకాల ఫంక్షన్లలో ఇప్పటివరకు వందకు పైగా ప్రదర్శనలు ఇచ్చింది. గుంటూరులో జరిగిన ‘అమరావతి మ్యాజిక్ ఫెస్టివల్’ రాష్ట్రస్థాయిపోటీల్లో ప్రథమ బహుమతిని గెలుచుకుంది. తాజ్ మ్యాజిక్ సొసైటీ ఆగ్రాలో నిర్వహించిన జాతీయస్థాయిపోటీల్లో ద్వితీయ బహుమతి గెలుచుకుంది.దేశవ్యాప్తంగా మేకు మ్యాజిక్ చేస్తున్న ఏడుగురు మెజిషీయన్లలో ఏకైక మహిళను తానే అంటుంది లక్ష్మి. పాటలు పాడటంలో నైపుణ్యాన్ని సాధించిన లక్ష్మి యాంకర్‌గా, సింగర్‌గా వెయ్యికి పైగా షోలు చేసింది. ‘ఇంకా ఎన్నో కళలు నేర్చుకోవాలని ఉంది. దేశవ్యాప్తంగా ప్రదర్శనలు ఇవ్వాలని ఉంది’ అంటుంది లక్ష్మీప్రసన్నదేవి.ఆ చప్పట్లు చాలు...ప్రేక్షకులలో ఒకరిగా ఎంతోమంది కళాకారుల ప్రదర్శనలను చూసి చప్పట్లు కొట్టాను. ఇప్పుడు నేను ప్రదర్శన చేస్తుంటే అలాంటి చప్పట్లు వినడం అపురూపంగా ఉంది. లక్షలు, కోట్లు అక్కర్లేదు. ఆ చప్పట్లు చాలు కళాకారుడిలో నిత్య ఉత్సాహం నింపడానికి. కళకు ప్రాంతం, జెండర్ అనే తేడా తెలియదు. కళాకారులలో ఏ కొంచెం ప్రతిభ ఉన్నా ప్రపంచం సొంతం చేసుకుంటుంది. గృహిణిగా బాధ్యతలు నిర్వహిస్తున్న నేను ‘ఇప్పుడు ఇవన్నీ ఎందుకు!’ అనుకోలేదు. ‘నేను ఎందుకు నేర్చుకోకూడదు’ అని మాత్రమే అనుకున్నాను. అలా అనుకోవడం వల్లే మెజీషియన్‌గా, సింగర్‌గా, యాంకర్‌గా నాకంటూ ఎంతో కొంత గుర్తింపు వచ్చింది. మరిన్ని కళలు నేర్చుకొని, దేశవ్యాప్తంగా మరిన్ని ప్రదర్శనలు ఇవ్వాలనుకుంటున్నాను.– దండ లక్ష్మీప్రసన్నదేవి – పెనుపోతుల విజయ్‌కుమార్, సాక్షి, భీమవరం ఫొటోలు: బడేటి తిరుపతి వెంకటేశ్వరరావు -
గొడవలతో భర్తకు దూరం.. గోపితో ప్రేమ, పెళ్లి కోసం ఆందోళన..
చీరాల రూరల్: మనస్తాపంతో సచివాలయ ఉద్యోగి రైలుకిందపడి బలవన్మరణం చెందింది. ఈఘటన బుధవారం రాత్రి చీరాల–జాండ్రపేట రైల్వేస్టేషన్ల మధ్య జరిగింది. జీఆర్పీ ఎస్సై సీహెచ్ కొండయ్య వివరాల మేరకు.. చినగంజాం మండలం కడవకుదురు గ్రామానికి చెందిన లక్ష్మీప్రసన్న (30)చీరాలలోని వైకుంఠపురం విఠల్‌నగర్ సచివాలయంలో శానిటేషన్ సూపర్వైజర్గా విధులు నిర్వర్తిస్తోంది. ఈమెకు గతంలోనే వివాహం జరగగా కుటుంబ కలహాల నేపథ్యంలో విడివిడిగా ఉంటున్నారు. తల్లిదండ్రుల వద్ద ఉంటూ ఈమె విధులకు హాజరయ్యేది. ఈ క్రమంలో మృతురాలు లక్ష్మీప్రసన్న, గోపి గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారని, వీరి వివాహం విషయంలో కొంత కాలంగా ఆమె ఆందోళన చెందుతోంది. ఈ నేపథ్యంలోనే రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని ఎస్ఐ తెలిపారు. ఘటనా స్థలాన్ని ఎస్ఐ పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఎరుకుల హక్కుల పోరాట సమితి ధర్నా.. మృతురాలు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకోవడంతో మృతురాలి తండ్రి వారి బంధువులు ఎరుకుల హక్కుల పోరాల సమితి రాష్ట్ర అధ్యక్షుడు నల్లబోతుల మోహన్‌కుమార్ ధర్మతో కలసి న్యాయం చేయాలంటూ ధర్నా చేశారు. ఘటనకు కారణమైన వారిని తక్షణమే అరెస్టు చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. -
ప్రధానితో ‘మంచు’ కుటుంబం భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోం శాఖ మంత్రి అమిత్ షా, హోం శాఖ కార్యదర్శి ఎ.కె.భల్లాతో ప్రముఖ నటుడు, మాజీ ఎంపీ మంచు మోహన్ బాబు, ఆయన కుటుంబ సభ్యులు సోమవారం సమావేశమయ్యారు. తొలుత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ఆయన నివాసంలో మోహన్ బాబు, ఆయన కూతురు, నటి మంచు లక్ష్మీప్రసన్న, ఆయన కుమారుడు, నటుడు మంచు విష్ణు, కోడలు వెరోనిక సమావేశమయ్యారు. సాయంత్రం 6 గంటల సమయంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో 15 నిమిషాల పాటు సమావేశమయ్యారు. అలాగే కేంద్ర హోం కార్యదర్శి అజయ్ కుమార్ భల్లాను కలిశారు. అనంతరం మోహన్‌బాబు మీడియాతో మాట్లాడా రు. ఇవాళ ఇద్దరు గొప్ప వ్యక్తులను కలిశానని, రా ష్ట్రం, దేశం బాగుండాలని కోరుకునే వాడిననాన్నరు. వైఎస్ జగన్ మంచే చేస్తున్నారు.. ‘జగన్ ముఖ్యమంత్రి అయ్యి ఆరు మాసాలైంది. నాకు తెలిసినంత వరకు మంచే చేస్తున్నారు. వారిని కాదని నేనేమీ ఇక్కడికి రాలేదు. మోదీ అంటే నాకు చాలా చాలా ఇష్టం. క్లిష్ట పరిస్థితుల్లో భారత దేశాన్ని గొప్ప స్థానంలో నిలిపిన వ్యక్తి మోదీ. హోం మంత్రి అంటే ఆ పదవికి వన్నె తెచ్చిన నేత అమిత్ షా. ఇలాంటి నాయకులు దేశానికి కావాలని అందరూ కోరుకుంటున్నారు..’ అని మోహన్‌బాబు పేర్కొన్నారు. మీ భేటీ ఆంతర్యం ఏమిటని ప్రశ్నించగా.. ‘ఒక నటుడిగా వచ్చి గొప్ప ప్రధానిని కలిశా. వారి గొప్ప కార్యక్రమాలను అభినందించడానికి వచ్చా. ప్రధాని మోదీ ఆప్యాయంగా పల కరించారు. ప్రేమగా మాట్లాడారు. ఇంతకంటే ఏం కావాలి..’ అని పేర్కొన్నారు. బీజేపీలోకి మిమ్మల్ని ఆహ్వానించారని వచ్చిన వార్తలపై ఏమంటారని అడగ్గా.. ‘2014లో కూడా కలిశాను. ఆయన ఆప్యాయత, నవ్వు, పలకరింపు కంటే ఏం కావాలి..’ అని అన్నారు. హోం కార్యదర్శిని కలవడంపై మాట్లాడు తూ.. ‘ఒక మంచి వ్యక్తిని కలవడంలో తప్పేముంది.. ఎప్పుడొచ్చినా అందరినీ కలుస్తాం..’ అని పేర్కొన్నారు. విద్యాసంస్థలను సందర్శించాలని ఆహ్వానించాం.. ‘మీరు బాలీవుడ్ నటులను కలిశారు.. సౌత్ వాళ్లని కలవలేదని కొంత అసంతృప్తి ఉంది’ అని మోదీ దృష్టికి తీసుకెళ్లగా ప్రధాన మంత్రి స్పందించారని మంచు విష్ణు తెలిపారు. బాలీవుడ్ నటులతో అవకాశం వచ్చింది కాబట్టి కలిశానని, దక్షిణాది నటులను కూడా త్వరలోనే కలుస్తానని చెప్పారన్నారు. స్వ యంగా తానే చొరవ తీసుకుంటానని కూడా చెప్పార ని విష్ణు వివరించారు. ‘మా విద్యాసంస్థలను సంద ర్శించాలని గతంలో ఓసారి ఆహ్వానించాం. గతంలో నే రావాల్సి ఉంది. తప్పకుండా వస్తానని ప్రధాని చెప్పారు..’ అన్నారు. లక్ష్మీప్రసన్న మాట్లాడుతూ ‘ఇండియా అంటే ..ఇది అని చాటి చెప్పిన ప్రధాని మన మోదీ. నేను పుట్టిన తర్వాత ఇలాంటి గొప్ప వ్యక్తుల ను చూడలేదు. దేశం కోసం ఎలా సహాయం చేయ మంటారని మోదీని అడిగాను. అవన్నీ త్వరలో పాయింట్ టు పాయింట్ విడుదల చేస్తా’ అన్నారు. -
మెట్రో గర్ల్
పుట్టి పెరిగిన ఊరిలో సైకిల్‌పై బయటికి వెళ్లేందుకే భయపడిన అమ్మాయి హైదరాబాద్‌కే మణికిరీటం లాంటి మెట్రో రైలును ధైర్యంగా నడిపిస్తోంది! ఒంటరిగా చౌరస్తా వరకు వెళ్లే సాహసం చేయని ఆ యువతి.. రోజుకు వేలమంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు సురక్షితంగా చేరవేస్తోంది. ఏడాది క్రితం హైద్రాబాద్‌లో మెట్రో రైలు సేవలు అందుబాటులోకి రాగా అందులో పైలట్‌గా ఎంపికైన వారిలో హన్మకొండలోని కొత్తూరు ప్రాంతానికి చెందిన ఓదెల లక్ష్మీప్రసన్న ఒకరు. అత్యాధునిక సాంకేతికతతో నడుస్తున్న మెట్రో రైలునే ఏడాదిగా మచ్చలేకుండా నిర్వహిస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు లక్ష్మిప్రసన్న. హన్మకొండ పట్టణంలోని కొత్తూరు ప్రాంతానికి చెందిన ఓదెల నాగరాజు, శోభారాణిలకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు. పెద్ద కూతురైన లక్ష్మీప్రసన్న పదవ తరగతి వరకు స్థానికంగా ఉన్న సెయింట్ జోసెఫ్ (తోటబడి)లో చదువుకున్నారు. ఇంటర్మీడియట్ వాగ్దేవి కళాశాలలో చదివారు. ఆ తర్వాత 2016లో వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటలోని బిట్స్ కళాశాలలో బీటెక్ (ఈసీఈ) పూర్తి చేశారు. ఆ తర్వాత ఇంటివద్దే పోటీపరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు. సంతోషంగా ఉంది సాధారణ మధ్య తరగతి కుటుంబంలో నుంచి మెట్రో రైలు పైలట్‌గా విధులు నిర్వహించే అరుదైన గౌరవం దక్కడం నాకు సంతోషంగా ఉంది. రోజుకు 6నుంచి 8గంటల పాటు మెట్రో రైలు నడుపుతుంటాను. ప్రతి రోజు వేల సంఖ్యలో ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు సరైన సమయానికి చేరుస్తున్నానని చెప్పేందుకు గర్విస్తున్నాను. ఆడపిల్లలను భారంగా భావిస్తున్న నేటి సమాజంలో నా ఆకాంక్షలను గుర్తించి ప్రోత్సహించిన తల్లిదండ్రుల గొప్ప మనసు ముందు నాది చాలా చిన్న ఉద్యోగమే అనిపిస్తుంది. – లక్ష్మీప్రసన్న, పైలట్ మొదటి బ్యాచ్‌లోనే! స్నేహితుల సమాచారంతో హైదరాబాద్‌లో త్వరలో ప్రారంభమయ్యే మెట్రో రైలు సంస్థలో ఉద్యోగాలకోసం నోటిఫికేషన్ విడుదలైనట్లు తెలుసుకున్న లక్ష్మీప్రసన్న మెట్రోరైలులో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆ సంస్థ నిర్వహించిన రాతపరీక్షకు హాజరై అన్నింటిలోనూ ప్రతిభ కనబరిచి అర్హత సాధించారు. 2017 జూన్ 12న మెట్రో పైలట్‌గా ఉద్యోగ నియామకపు ఉత్తర్వులను అందుకున్నారు. మెట్రో రైలు ఉద్యోగ నియామకాల్లో మొదటి బ్యాచ్‌లో పైలట్‌గా ఎంపికైన సుమారు నలభై మంది అమ్మాయిల్లో లక్ష్మి ప్రసన్న ఒకరు. ఐదు నెలల శిక్షణ మెట్రో రైలు సంస్థలో ఉద్యోగానికి ఎంపికైన లక్ష్మి ప్రసన్న సహచరులతో కలిసి హైద్రాబాద్‌లోని ఆపరేషన్ కంట్రోల్ సెంటర్లో ఐదు నెలల పాటు శిక్షణ పొందారు. అత్యాధునిక సాంకేతికతతో నడిచే మెట్రో రైలు నిర్వహణపై కియోలిస్ కంపెనీ అందించిన శిక్షణను సద్వినియోగం చేసుకున్నారు. 2017 నవంబర్ 29న ప్రారంభమైన మెట్రోరైలు సేవల్లో నాటి నుంచి నేటివరకు దిగ్విజయంగా తన విధులను నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఎల్బినగర్– మియాపూర్ మధ్య మెట్రో రైలును నడిపిస్తున్నారు. – గజ్జి రమేష్, సాక్షి, హన్మకొండ -
ఎస్కేయూ విద్యార్థిని ఆత్మహత్య
అనంతపురం జిల్లా /ఎస్కేయూ: శ్రీకృష్ణ విద్యాలయం (ఎస్కేయూ) హాస్టల్లో లక్ష్మీప్రసన్న (23) అనే విద్యార్థిని సోమవారం ఆత్మహత్య చేసుకుంది. చదువులో ఎంతో చురుగ్గా ఉండే అమ్మాయి బలవన్మరణానికి పాల్పడటం కలకలం రేపింది. ఇందుకు దారి తీసిన కారణాలు ఏమిటనేది తెలియడం లేదు. వివరాలిలా ఉన్నాయి. గోరంట్లకు చెందిన నాగరాజు, జయమ్మ దంపతుల కుమార్తె లక్ష్మీప్రసన్న ఎస్కేయూ సైన్స్ క్యాంపస్ కళాశాలలో ఎమ్మెస్సీ (జువాలజీ) చదువుతోంది. గోదావరి హాస్టల్లో ఉంటోంది. సోమవారం ఉదయం 11 గంటలకు తరగతి గది నుంచి హాస్టల్ గదికి వచ్చింది. మధ్యాహ్నం భోజన విరామ సమయంలో తోటి విద్యార్థులు వచ్చి తలుపు తట్టగా లోపలి నుంచి స్పందన రాలేదు. వెంటనే వారు హాస్టల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. అనంతరం వారు పోలీసుల సాయంతో తలుపులు పగులగొట్టారు. లోనికెళ్లి చూడగా లక్ష్మీప్రసన్న ఫ్యాన్‌కు ఉరికి వేలాడుతూ కనిపించింది. మృతురాలి సోదరుడు తేజోనాథ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఇటుకలపల్లి సీఐ రాజేంద్రనాథ్ యాదవ్, ఎస్ఐ అబ్దుల్ కరీం తెలిపారు. తోటి విద్యార్థులను, స్నేహితులను ఆరా తీస్తున్నారు. లైంగిక వేధింపులతో బలవన్మరణానికి పాల్పడిందా అనే అంశంపై లక్ష్మీ ప్రసన్న కాల్ డేటా దర్యాప్తునకు కీలకం కానుందని పోలీసు అధికారులు పేర్కొంటున్నారు. దురదృష్టకరం ఎస్కేయూ వీసీ ప్రొఫెసర్ కె.రాజగోపాల్, రెక్టార్ ప్రొఫెసర్ హెచ్.లజిపతిరాయ్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కే.సుధాకర్ బాబు తదితరులు గోదావరి హాస్టల్‌ను సందర్శించారు. లక్ష్మీప్రసన్న ఉరి వేసుకొన్న ప్రదేశాన్ని పరిశీలించారు. విద్యార్థిని ఆత్మహత్య దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. కొట్టొచ్చిన భద్రతా వైఫల్యం.. విద్యార్థులకు రక్షణ కల్పించే విషయంలో వర్సిటీ అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రతి హాస్టల్లోనూ సీసీ కెమరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షణను గాలికొదిలేశారు. హాస్టల్ అధికారుల పర్యవేక్షణే గనుక ఉండి ఉంటే నేడు విద్యార్థినిని కోల్పోవాల్సి వచ్చేది కాదని తోటి విద్యార్థులు వాపోతున్నారు. ఈ విద్యాసంవత్సరం ఆరంభంలో ర్యాగింగ్ ఘటన చోటు చేసుకుంది. అదనపు బాధ్యతలు కాకుండా శాశ్వత ప్రాతిపదికన డిప్యూటీ వార్డెన్ పోస్టులను భర్తీ చేస్తే.. ఇలాంటి ఘటనలను ముందుగా పసిగట్టే అవకాశం ఉంటుందనే భావన వ్యకతమవుతోంది. నేడు ఎస్కే యూనివర్సిటీ బంద్ ఎమ్మెస్సీ విద్యార్థిని లక్ష్మీ ప్రసన్న మృతికి సంతాప సూచికంగా మంగళవారం ఎస్కే యూనివర్సిటీని బంద్ చేస్తున్నట్లు విద్యార్థి జేఏసీ ఓ ప్రకటనలో తెలిపింది. ఆత్మహత్యకు దారి తీసిన కారణాలు వెలికితీసి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపడతామని పేర్కొంది. ఆత్మహత్య చేసుకునే సమస్యలు లేవు లక్ష్మీ ప్రసన్న ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు మా కుటుంబంలో లేవు. జువాలజీ విభాగంలో ఒక ఫ్యాకల్టీ మెంబర్ కారణంగా తరచూ భయపడేది. ఇందులో హాస్టల్ మేనేజ్మెంట్ నిర్లక్ష్యం పూర్తిగా ఉంది. చనిపోయిన విషయం మాకు తెలపకుండానే మృతదేహాన్ని తరలించడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. – మీడియాతో లక్ష్మీ ప్రసన్న సోదరుడు తేజోనాథ్. అన్ని కోణాల్లో దర్యాప్తు విద్యార్థిని మృతిపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తాం. హాస్టల్లో ఉన్న సమస్యలతో పాటు అనుమానాస్పద మృతి అని కుటుంబసభ్యులు ఫిర్యాదు చేసిన అంశాలను దర్యాప్తులో పరిగణనలోకి తీసుకుంటాం. – వెంకట్రావు, అనంతపురం డీఎస్పీ -
ఈ చిన్నారులెవరో గుర్తుపట్టారా..?
బాలల దినోత్సవం సందర్భంగా సినీ ప్రముఖులు తమ చిన్ననాటి ఫొటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ముఖ్యంగా ఈ జనరేషన్ యంగ్ హీరో ఆసక్తికరమైన ఫొటోలతో తన ఫ్యాన్స్‌ను అలరించారు. అదే బాటలో యంగ్ హీరో మంచు మనోజ్ ఓ ఆసక్తికరమైన ఫొటోను తన సోషల్ మీడియా పేజ్‌లో షేర్ చేశాడు. చిన్నతనంలో అక్క లక్ష్మీ ప్రసన్న, అన్న విష్ణులతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేసిన మనోజ్, ‘మీలోని ప్రేమ, ఆనందాన్ని వ్యక్తీకరించండి, మీలోని బాల్యాన్ని సజీవంగా, ఆనందంగా ఉంచండి. అందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్ చేశాడు. ఇటీవల ఒక్కడు మిగిలాడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మనోజ్, నటుడిగా మంచి మార్కులు సాధించాడు. మరో హీరో విష్ణు ప్రస్తుతం ఆచారి అమెరికా యాత్ర షూటింగ్లో బిజీగా ఉన్నారు. Express your joy, love and laughter. Keep that inner child in you alive and happy! Happy #ChildrensDay everyone! ❤️ pic.twitter.com/HlmDzKMXel — Manoj Kumar Manchu❤️ (@HeroManoj1) 14 November 2017 -
లక్ష్మీ ప్రసన్నకు గ్రూప్-2 ఉద్యోగం
అమరావతి : తండ్రి ఉన్మాద చర్యతో కుటుంబాన్ని కోల్పోయిన లక్ష్మీ ప్రసన్న మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసింది. అనాధగా మారిన ఆమెకు గ్రూప్-2 ఉద్యోగం ఇస్తామని చంద్రబాబు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. లక్ష్మీ ప్రసన్న మంగళవారం వెలగపూడి సచివాలయానికి వచ్చి ముఖ్యమంత్రిని కలిసింది. ఆమె విద్యార్హతలు అడగ్గా ఎమ్మెస్సీ ఆర్గానిక్ కెమెస్ట్రీ అని చెప్పడంతో లక్ష్మీప్రసన్నకు గ్రూప్-2 ఉద్యోగం ఇవ్వాలని సీఎం.. అధికారులను ఆదేశించారు. అధైర్యపడకుండా, ఆత్మవిశ్వాసంతో ఉండాలని ఆమెకు సూచించిన ముఖ్యమంత్రి ప్రభుత్వపరంగానే కాకుండా వ్యక్తిగతంగా అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఉద్యోగంతో సరిపుచ్చుకోకుండా ఉన్నత స్థాయికి చేరుకోవాలని, ఆరు నెలలకు ఓసారి వచ్చి తనను కలవాలని లక్ష్మీప్రసన్నకు సూచించారు. కాగా అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన లక్ష్మీప్రసన్న తండ్రి రామసుబ్బారెడ్డి ఈ నెల 4వ తేదీన (మంగళవారం) భార్య, ఇద్దరు కుమార్తెలు దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటనలో భార్య సులోచన(45), కుమార్తె ప్రత్యూష(20) అక్కడికక్కడే మృతి చెందారు. మరో కుమార్తె ప్రతిభ(22) తీవ్ర గాయాలతో తాడిపత్రి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. అయితే రామసుబ్బారెడ్డి మరో కుమార్తె లక్ష్మీ ప్రసన్న ఆ సమయంలో ఇంటి దగ్గర లేకపోవడంతో ప్రాణాలతో బయటపడింది. ఇప్పటికే లక్ష్మీ ప్రసన్నకు ముఖ్యమంత్రి రూ.20 లక్షల ఆర్థిక సాయం కూడా ప్రకటించారు. -
త్రీ డాటర్స్
కోడళ్లను కూడా కూతుళ్లుగా పెంచుకునే సంస్కారం... మెట్టినింటిని పుట్టిల్లుగా మార్చగల అనుబంధం... ఈ ట్రిపుల్ డాడీది! సుగుణాలు సంస్కారం నుంచి పుట్టుకొస్తాయని... సంస్కారం సంబంధాల నుంచి పుట్టుకొస్తుందని... సంబంధాలు అనుబంధాల నుంచి పుట్టుకొస్తాయని నమ్మే ట్రిపుల్ డాడీ బర్త్‌డే స్పెషల్ ఇది! ⇒ మంచు కుటుంబంలోకి పెద్ద కోడలిగా అడుగుపెట్టే ముందు మీ ఫీలింగ్స్ ఎలా ఉండేవి? విరానిక: యాక్చువల్‌గా చాలా భయపడ్డాను. కొత్తగా ఓ బంధం మొదలయ్యేటప్పుడు భయం, ఆనందం... ఇలా మిక్స్డ్ ఫీలింగ్స్ ఉంటాయి. పైగా అంకుల్ చాలా క్రమశిక్షణ ఉన్న వ్యక్తి. అన్నీ పట్టించుకుంటారు. ఎలా ఉంటుందో అని భయపడ్డాను. నేను అడుగుపెట్టిన మొదటి రోజు ‘లక్ష్మీ నాకు మొదటి కూతురు. నువ్వు రెండో కూతురివి’ అన్నారు. అప్పుడు ఏ కోడలికైనా ఎలా ఉంటుందో మాటల్లో చెప్పక్కర్లేదు. ‘ఇలా ఉండాలి. అలా ఉండకూడదు... ఇవి చెయ్యకూడదు... అవే చెయ్యాలి’ వంటి రిస్ట్రిక్షన్ ఏమీ అంకుల్ పెట్టలేదు. మామూలుగా కోడలు ఇంటిపట్టున ఉండి ఇంటిని చూసుకోవాలని ఏ అత్తమామలైనా కోరుకుంటారు. కానీ, నా అత్త–మామలు మాత్రం అలా కాదు. నేను స్కూల్ వ్యవహరాలు చూసుకుంటాను. ఒక్కోసారి వాటితోనే బిజీగా ఉంటాను. ఆడపిల్లలకు కెరీర్ ఉండాలంటూ ఎంకరేజ్ చేస్తారు. ⇒ మీ భయం పోవడానికి ఎన్నాళ్లు పట్టింది? (నవ్వుతూ). ఓ రెండేళ్లు అనుకోండి. తర్వాత అంకుల్ బాగా అర్థమయ్యారు. ఇప్పుడు మేమిద్దరం మంచి ఫ్రెండ్స్. జోక్స్ వేసుకుంటాం. డైలీ ఈవినింగ్ పావుగంటైనా మాట్లాడుకోవాల్సిందే. రోజంతా ఎలా గడిచింది? అని అడిగి తెలుసుకుంటారు. వెరీ కేరింగ్. ఇప్పుడు ఆయనకు నా మీద ఎంత నమ్మకం అంటే... ఏదైనా ముఖ్యమైన పనులు ఉంటే నాతోనే చెబుతారు. నేను వాటిని చక్కగా పూర్తి చేయగలనని ఆయన నమ్మకం. ⇒ జనరల్‌గా పెళ్లయ్యాక వేరు కాపురం పెట్టేస్తారు. కానీ, ఉమ్మడి కుటుంబంలో అడ్జస్ట్ కాగలిగారు... యాక్చువల్లీ నేను పెద్ద కుటుంబం నుంచి వచ్చినదాన్ని. పెద్ద అంటే మా నాన్నగారి తోడబుట్టినవాళ్లు ఆరుగురు. అమ్మ తోడబుట్టినవాళ్లు నలుగురు. మా అమ్మానాన్నలకు నేను ఒక్కతే కూతుర్ని. పెద్దమ్మా–పెదనాన్న, బాబాయ్.. ఇలా అందరి పిల్లలం కలిపి మాది లార్జ్ ఫ్యామిలీ. బయట ఫ్రెండ్స్‌తో పనే లేనంతమంది మా ఫ్యామిలీలో ఉన్నారు. నాకు జాయింట్ ఫ్యామిలీ అంటే ఇష్టమే. అందుకే పెళ్లవగానే విష్ణుతో వేరే ఇంట్లో ఉండాలని అనుకోలేదు. పెద్దవాళ్లతో కలిసి ఉండటం వల్ల మంచి సపోర్ట్ ఉంటుంది. ఎప్పుడైనా భార్యా–భర్త మధ్య చిన్న చిన్న గొడవలు వస్తే పెద్దవాళ్లు కలగజేసుకుని సర్ది చెబుతుంటారు. ఆ సపోర్టే వేరు. ⇒ ప్రణతి మీ ఫ్రెండే కాబట్టి, తోడికోడళ్ల మధ్య మంచి బంధమే ఉండి ఉంటుంది.. ప్రణతి నాకు చాలా చిన్నప్పట్నుంచీ తెలుసు. చాలా మంచి అమ్మాయి. డౌన్ టు ఎర్త్. ఇంటిని బాగా చూసుకుంటుంది. వెరీ ఇంటిలిజెంట్. అందరితో కలసిపోతుంది. మేమందరం బాగుంటాం. ⇒ బ్రదర్‌కి పెళ్లవుతుందంటే ఏ సిస్టర్కైనా కొంచెం ఇన్‌సెక్యూర్టీ ఉంటుంది. మరి, మీ ఆడపడుచు (లక్ష్మీప్రసన్న)కు ఆ ఫీలింగ్ ఏమైనా ఉండేదా? ఏ అమ్మాయి అయినా బ్రదర్స్ విషయంలో కొంచెం పొసెసివ్‌గా ఉంటుంది. అది తప్పు కాదు. అప్పటివరకూ అక్కాతమ్ముళ్లు మాత్రమే ఉంటారు. సడన్‌గా తమ్ముడి జీవితంలోకి ఓ అమ్మాయి వస్తే... ఎక్కడ తన తమ్ముడు తనకు కాకుండా పోతాడేమోనని ఓ ఇన్‌సెక్యూర్టీ ఉండటం సహజం. నేను ఇంటికి పెద్ద కోడలిని కాబట్టి, నా మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. అందుకే ఈ ఇంటికి వచ్చిన కొత్తలోనే నేను, లక్ష్మీ చాలా ఓపెన్‌గా మాట్లాడుకున్నాం. విష్ణు నాకు భర్తే అయినా... నీకు తమ్ముడు కూడా అనేది కన్వే చేయగలిగాను. తను అర్థం చేసుకుంది. ‘షీ ఈజ్ వెరీ కేరింగ్’. మా మధ్య ఓ‘స్పెషల్ బాండింగ్’ ఏర్పడింది. ⇒ మీ కూతుళ్లు ఆరియానా, వివియానాలో మోహన్‌బాబుగారి లక్షణాలు ఎవరిలో ఎక్కువ? ఆరియానాలోనే. అంకుల్‌లో ఉన్న లీడర్షిప్ క్వాలిటీస్ అన్నీ తనలో ఉన్నాయి. ఆరి నడక, మాటలు అన్నీ అంకుల్ని గుర్తు చేస్తాయి. ఆరీకి మూడేళ్ల వయసప్పుడు అనుకుంటా.. పెద్దయ్యాక ఏమవుతావ్? అని అడిగితే ‘ఐ విల్ బికమ్ అమెరికన్ ప్రెసిడెంట్’ అంది. ఆశ్చర్యపోయాం. లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయని చాలా మురిసిపోయాను. ⇒ ఫైనల్లీ... మంచు కుటుంబం కోడలు అయినందుకు మీ ఫీలింగ్? ‘ఐయామ్ బ్లెస్డ్’. నో డౌట్ అండీ. విష్ణు ఈజ్ ఎ కేరింగ్ హజ్బెండ్. ఇక అంకుల్–ఆంటీ అయితే సూపర్. ఆంటీతో మాట్లాడుతుంటే ఓ అత్తగారితో మాట్లాడుతున్నట్లుగా అనిపించదు. మేమిద్దరం కలసి షాపింగ్‌కి వెళతాం. బోల్డన్ని కబుర్లు చెప్పుకుంటాం. ఇక, అంకుల్ గురించి చెప్పాలంటే... మా అందర్నీ బాగా చూసుకుంటారు. మనవరాళ్ల విషయంలో కేరింగ్‌గా ఉంటారు. ఒక్కోసారి వాళ్లకు స్వయంగా తినిపిస్తుంటారు. ఆడిస్తుంటారు. ఈ కుటుంబంలో ఓ మెంబర్ని అయినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. జీవితంలో ఇంతకన్నా కోరుకునేది ఏమీ ఉండదు. ⇒ మీకు వంట వచ్చా? లేదండీ. బ్యాడ్ కుక్‌ని. పుట్టింట్లో ఉన్నప్పుడు నేర్చుకోలేదు. అత్తగారింట్లోనూ పెద్దగా స్కోప్ లేదు. నాకు, అంకుల్‌కి థాయ్ ఫుడ్స్ ఇష్టం. నాకు అవి చేయడం వచ్చు. మా ఇద్దరి కోసం కుక్ చేస్తుంటాను. ఆ రోజు మాత్రం నేను, అంకుల్ ఫుల్లుగా లాగించేస్తాం. ⇒ కోడళ్లను కూడా కూతుళ్లని మీ నాన్నగారు అంటారు.. మరి... వాళ్లు వచ్చాక మీ స్పేస్ తగ్గిందనే ఫీల్ ఏమైనా? లక్ష్మీప్రసన్న: ఆ ఫీలింగ్ ఎప్పుడూ కలగలేదు. విన్నీ (విష్ణు భార్య విరానికా) మా అందరికన్నా నాన్నకి బాగా దగ్గరైంది. ఇప్పుడు నాకేం కావాలన్నా విన్నీతోనే రికమండేషన్ చేయించుకోవాల్సి వస్తోంది (నవ్వుతూ). మా ఇల్లు దూరం. విష్ణు–విన్నీ నాన్నవాళ్లతోనే ఉంటారు. నాన్నని విన్నీ భలేగా హ్యాండిల్ చేస్తుంది. మాకది తెలియదు. ఇంకో విషయం ఏంటంటే... మా నాన్నకి మా మధ్య పుల్లలు పెట్టి తమాషా చూడటం అలవాటు. మేం గొడవ పడుతుంటే నవ్వుతుంటారు. మేమంతా కలసి మా అమ్మను ఏడిపిస్తుంటే ఆయనకు ఏదో తెలియని సంతోషం. మొన్న మా అమ్మను విన్నీ క్యాజువల్‌గా ఏదో అంది. దాన్ని మా నాన్నగారు పెద్దది చేసి ‘నిమ్మీ (మోహన్‌బాబు భార్య నిర్మల) తను నిన్ను ఏమందో విన్నావా? అసలు అలా అనొచ్చా?’ అని పుల్లలు పెట్టడానికి ట్రై చేస్తే, అమ్మేమో చాలా క్యాజువల్‌గా ‘ఆ.. ఆ.. తెలుసు. పెద్దగా ఏమీ అనలేదే’ అంది. దాంతో విన్నీ, మేమూ నవ్వేశాం. ⇒ మీ తమ్ముళ్ల భార్య (విరానికా, మనోజ్ భార్య ప్రణతి) లతో మీ బాండింగ్? మేం ఏదైనా సరే ఓపెన్‌గా మాట్లాడుకుంటాం. నచ్చని విషయాలుంటే నచ్చలేదని మొహం మీదే చెప్పేస్తాం. ఆ మధ్య ఓ ఫంక్షన్‌కి వెళ్లాం. నేను చీర కట్టుకుని, నగలు పెట్టుకుని గ్రాండ్‌గా రెడీ అయ్యాను. ప్రణతి మామూలు చుడీదార్ వేసుకుని మా ఇంటికి వచ్చింది. ‘ఇంత సింపుల్గానా’ అని నాలుగు తిట్లు తిట్టి, చీర కట్టుకుని రెడీ అవ్వమన్నాను. తనేమనుకున్నా ఫర్వాలేదు. ఆ ఫంక్షన్‌కి నేను చెప్పినట్లు వెళ్లడమే కరెక్ట్ అని నాకనిపించింది. ప్రణతి కూడా నా మాట కాదనలేదు. ఏమైనా అనుకుంటుందేమో అని చెప్పకుండా మనసులో పెట్టుకుని, ఆ తర్వాత సూటీపోటీ మాటలు అనుకోవడంకన్నా, అలా ఫ్రాంక్‌గా మాట్లాడుకుంటే... మనసులో ఏమీ ఉండదు. నేను, విన్నీ, ప్రణతి ముగ్గరం అలానే ఉంటాం. అందుకే మా మధ్య బాండింగ్ బాగుంటుంది. పైగా నా తమ్ముళ్లను వీళ్ల చేతిలో పెట్టాను. వాళ్లను బాగా చూసుకోవాల్సిన బాధ్యత వీళ్లదే. అందుకే నేను వీళ్లను బాగా చూసుకుంటాను. ⇒ మీ ముగ్గురి (అక్కాతమ్ముళ్లు)లో మోహన్‌బాబుగారు చెప్పినవి ఇమ్మీడియట్‌గా పాటించేది ఎవరు? నేను, మనోజ్ వాదిస్తాం. నాన్న బర్త్‌డే (మార్చి, 20) సెలబ్రేషన్స్ కోసం నాన్న, అమ్మ... ఇంకా అందరూ ఓ వారం రోజుల ముందే తిరుపతి వెళ్లారు. నేనేమో తర్వాత వస్తానన్నా. ‘ఎందుకూ... నా బర్త్‌డే రోజు మార్నింగ్ రా’ అన్నారు నాన్న. ఆయన ఏదనుకుంటే అది జరగాల్సిందే. నాన్న ఏది చెబితే అది ఆల్మోస్ట్ చేయడం విష్ణు అలవాటు. నేనూ, మనోజ్ ఫ్రెండ్లీగా వాదిస్తుంటాం. కానీ, ఆయన శాసిస్తే... ఆ మాటను ధిక్కరించే సాహసం మేమెవరం చేయం. ⇒ డైనమిక్‌గా కనిపించే మీ నాన్నగారు భయపడేది? చెబితే నమ్మరేమో. ఆయనకు సూది అంటే భయమండీ బాబూ. చీకటంటే కూడా చాలా భయం. చిన్నప్పుడు మా పాత ఇంట్లో పై గదికి వెళ్లే మెట్లు దగ్గర లైట్లు ఉండేవికావు. అందుకుని నాన్నగారు పైకి వెళ్లాల్సి వచ్చినప్పుడు ఎవరినో ఒకరిని వెంట తీసుకుని వెళ్లేవారు. లైట్లు వేశాక ఆ వ్యక్తిని కిందకు పంపించి వేసేవారు. ఈ విషయంలో మా నాన్నగారిని అమ్మ సరదాగా ఆటపట్టించేవారు. అసలు నాన్న పైకి కఠినంగా కనిపిస్తారు కానీ, లోపల చిన్నపిల్లల మనస్తత్వమే. ఈ మధ్య ఆయనకు షోల్డర్ సర్జరీ అయ్యింది. మొన్న ఒక్కరోజు నేను చూడ్డానికి వెళ్లలేదు. అంతే అలిగారు. ‘నాన్నా... నాకూ ఫ్యామిలీ ఉంది. పాపను చూసుకోవాలి’ అంటే ఓ నవ్వు నవ్వేసి, అంతేలే అన్నారు. ఎప్పుడూ ఆయన చుట్టూ అందరూ ఉండాలని కోరుకుంటారు. ⇒ మీ నాన్నగారి నుంచి మీరు నేర్చుకున్నది... వద్దనుకునేది? నేర్చుకున్నది ముక్కసూటితనం. వద్దనుకుంటున్నది కూడా అదే. ఆయనకు అందరూ సమానమే. తప్పు ఎవరు చేసినా మొహం మీదే చెప్పేస్తారు. నాకేమో అది నచ్చదు. అంత సూటిగా ఎందుకు ఉండటం అనుకుంటా. కానీ, ఎవరి తత్వం వారిది. నా దృష్టిలో మా నాన్నగారు ‘సూపర్ హీరో’. ఆయన లైఫ్ చూసి, ఒక సినిమా హిట్ అయితే ఎంతమంది ఇంటికి వస్తారు? అనేది తెలుసుకున్నా. ఫ్లాప్ అయితే ఇంటివైపు రారనే విషయం కూడా అర్థం చేసుకున్నా. సక్సెస్‌లో ఎలా ఉండాలి అనేకన్నా ఫెయిల్యూర్ ఎదురైనప్పుడు ఎలా ఉండాలో నాన్న లైఫ్ నేర్పించింది. కష్టాల్లో ఉన్నప్పుడు ఎంత ధైర్యాన్ని, నమ్మకాన్ని కూడగట్టుకోవాలో ఆచరించి చూపించారు. ఆయన లైఫ్ మాకు ఓ మంచి లెసన్. ఇవాళ నాన్న ఇంత మంచి పేరు తెచ్చుకున్నారంటే అది ఎవరూ ధారాదత్తం చేసింది కాదు. పగలనకా, రాత్రనకా శ్రమించి సంపాదించుకున్నది. కుటుంబానికి ఆయన పంచే ప్రేమ వండర్ఫుల్. డైలీ ఫోన్ చేసి మాట్లాడతారు. ఆనంద్ (లక్ష్మీప్రసన్న భర్త) ఏం చేస్తున్నాడు? తిన్నాడా? అని అడుగుతారు. మనవరాళ్ల గురించి తెలుసుకుంటారు. నివ్వీ, ఆరీ, వివ్వీ (మనవరాళ్లు)ను కూర్చోబెట్టుకుని ‘తాతయ్య గ్రేట్’, ‘అమ్మమ్మ బ్యాడ్’ అని చెప్పించుకుని, సంబరపడతారు. అమ్మమ్మ అంటే నివ్వీకి చాలా ఇష్టం. అందుకే తాతయ్య ముందు ‘తాతయ్య గ్రేట్’, ‘అమ్మమ్మ బ్యాడ్’ అని... ఆ తర్వాత మా అమ్మ దగ్గరికి వచ్చి ‘సారీ అమ్మమ్మా’ అంటుంది. నాన్న ఆటలన్నీ ఇలానే ఉంటాయి. ⇒ మీ నాన్నగారిలా మీరు డైనమిక్‌గా కనిపిస్తారు కాబట్టి, ఆయన ప్రభావం మీ మీద చాలా ఉందనిపిస్తోంది... కచ్చితంగా ఉంది. చాలామంది నేను నాన్నలానే నడుస్తానని అంటుంటారు. అప్పుడు సంతోషంగా ఉంటుంది. ఒక అమ్మాయిలా నన్నెప్పుడూ ఆయన పెంచలేదు. అబ్బాయిలతో మాట్లాడొద్దు, గట్టిగా నవ్వొద్దనీ మా అమ్మమ్మ చాలా రూల్స్ పెట్టేవారు. నాన్న అలాంటివేమీ చెప్పేవారు కాదు. ఎప్పుడూ ధైర్యంగా ఉండాలనేవారు. ⇒ పుట్టింటి నుంచి మెట్టినింటిలోకి అడుగుపెట్టేటప్పుడు ఏ అమ్మాయికైనా కొన్ని భయాలుంటాయ్... మీకలా? ప్రణతి: విన్నీ నాకు మంచి ఫ్రెండ్. దాంతో నాకు వేరే ఇంటికి వెళుతున్నట్లు అనిపించలేదు. పెళ్లికి ముందు ఒకే ఒక్కసారి మామయ్యగారిని కలిశాను. అది కూడా విన్నీ ద్వారానే. అప్పుడు పెద్దగా ఏం మాట్లాడలేదు. అయినా నాకేం భయంగా అనిపించలేదు. నిజానికి నేను ఎక్కడికో వెళ్లిపోతున్నాను అనే ఫీలింగ్ కలగలేదు. ఒక మంచి ఫ్యామిలీలోకి వెళుతున్నాం అనే ఫీలింగ్‌తోనే ఈ కుటుంబంలోకి వచ్చాను. ⇒ మోహన్‌బాబుగారి గురించి ఏమనిపించింది? మామయ్యగారిని చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంటుంది. జీవితంలో ఎంతో సాధించారు. కొంతమంది ఆర్టిస్టులుగానే మిగిలిపోతారు. కానీ, మామయ్యగారు చదువుకున్న వ్యక్తి. సినిమా ఫీల్డ్‌లో తిరుగులేదనిపించుకున్నారు. పొలిటీషియన్. విద్యావేత్త. టోటల్‌గా సక్సెస్ఫుల్మేన్. అందుకే సొసైటీలో అంత గౌరవం సంపాదించుకోగలిగారు. పేరూ, డబ్బూ సంపాదించుకున్నా ఆయన రిలాక్స్ కాలేదు. ఖాళీగా ఉండరు. ఇటు ఇంట్లో, అటు తిరుపతి స్కూల్లో చిన్న మొక్క నాటడం నుంచి కిచెన్ వరకూ... అన్నీ పట్టించుకుంటారు. ఇంట్లో చిన్న శుభకార్యమైనా అన్నీ దగ్గరుండి చూసుకుంటారు. పండగలంటే అందరం కలసి సెలబ్రేట్ చేసుకోవాల్సిందే. నేను అమెరికాలో ఉండేదాన్ని. నాకు ఇలా కలసి పండగలు చేసుకోవడం ఇవన్నీ తెలియదు. ఇక్కడ ఇలా చేసుకోవడం బాగుంది. అలాగే, ఇంట్లో అందరం కలసి ఏదో అప్పుడప్పుడూ హాలిడే ట్రిప్ వెళ్లాల్సిందే. ఆ ట్రిప్స్‌ని బాగా ఎంజాయ్ చేస్తుంటాం. ⇒ మీకన్నా మీ తోడికోడలు మీ మావయ్యగారికి క్లోజ్ కదా. మీకు అసూయ ఏమైనా? అస్సలు లేదు. విన్నీకి పెళ్లై 8 ఏళ్లు, నా పెళ్లై రెండేళ్లు. అందుకని మావయ్యగారితో ఎలా మాట్లాడాలో విన్నీకి బాగా తెలుసు. సిచ్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేయడంలో తను బెస్ట్. నేను చేయలేనిది తను చేయగలుగుతుంది కాబట్టి, ఐయామ్ హ్యాపీ. ⇒ మీ ఆడపడుచు (లక్ష్మీప్రసన్న) మిమ్మల్ని చుడీదార్ బదులు చీర కట్టుకోమని అన్నానని ఇంతకుముందే చెప్పారు. అప్పుడు కొంచెం కూడా కోపం రాలేదా? కోపం ఎందుకు? చెప్పే హక్కు తనుకుంది. ఏం చెప్పినా నా మంచికే చెబుతుందని నాకు తెలుసు. ఒకవేళ తను అలా ఓపెన్‌గా ఉండకపోతేనే నేను ఫీలవుతా. బయటకు అలా ఫీలింగ్స్ ఎక్స్‌ప్రెస్ చేయడం వల్ల మా బాండింగ్ ఇంకా బలపడింది. ఒకే కుటుంబానికి చెందినవాళ్లెవరైనా ఓపెన్‌గా మాట్లాడుకోవడం మంచిది. అప్పుడే ‘మనమంతా ఒకటే’ అనే ఫీలింగ్ కలుగుతుంది. ⇒ సరే... మీ మావయ్యగారు పెట్టే ‘స్వీట్ టార్చర్’ గురించి ఏమైనా? అదైతే కొంత ఉందండీ. శంషాబాద్ ఇంట్లో మావయ్యగారు ఆర్గానిక్ వెజిటబుల్స్ పండిస్తారు. కూరగాయలు పండించి మా ఇంటికీ, లక్ష్మీ ఇంటికీ పంపిస్తారు. ‘ఇవాళ క్యాబేజ్ పంపించా... వండారా?’ అని ఫోన్ చేసి మరీ అడుగుతారు. ఆరోగ్యానికి మంచివనేవన్నీ కంపల్సరీగా మేం తినాల్సిందే. లేకపోతే ఊరుకోరు. చెబితే నమ్మరేమో... ఎవరైనాసరే కొబ్బరి పువ్వు ఎంత తినగలుగుతారండీ. ఏదో కొంచెం. అంతే కదా. ఒకసారి నాకూ, లక్ష్మీకి బోల్డంత కొబ్బరి పువ్వు పంపించారు. ‘అది మొత్తం తిన్నారా?’ అని ఫోన్ చేసి, అడిగారు. ఏం చెప్పాలో తెలియలేదు (నవ్వుతూ). ప్రతిరోజూ మాతో మాట్లాడాల్సిందే. మావయ్యగారు చాలా కేరింగ్. ⇒ మీ హజ్బెండ్ మనోజ్‌ని మీ నాన్నని చూసి నేర్చుకుంటే బాగుంటుందని అంటుంటారా? అలా చెప్పనండీ. ఎందుకంటే ఎవరి వ్యక్తిత్వం వాళ్లది. నాలా ఇంకొకరు ఉండరు. ఉండలేరు. అలాగే, మావయ్యగారిలా ఆయన మాత్రమే ఉండగలుగుతారు. కాకపోతే మావయ్యగారిలో ఉన్న లక్షణాలు పది శాతం నేర్చుకున్నా చాలు... గొప్పవాళ్లం అయిపోతాం అని మనోజ్‌తో అంటుంటాను. అసలాయన లెవల్ ఆఫ్ థింకింగ్ చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఇంతలా ఆలోచించాలా అనిపిస్తుంది. ఆయనదొక విజన్. పెళ్లి కాకముందు మోహన్‌బాబుగారు ఒక నటుడిగానే నాకు తెలుసు. వివాహం తరువాత ఆయన గొప్పదనం తెలుసుకున్నాను. ఈ స్థాయికి రావడానికి ఆయన ఎంత కష్టపడ్డారు అనేది పెళ్లి తర్వాతే తెలుసుకున్నా. ఇంత ఉన్నత స్థాయికి చేరుకుని... నిగర్విగా ఉండటం అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు. ఆయన విల్పవర్లో పది శాతం అయినా నేర్చుకుని ఆచరణలో పెట్టగలిగితే చాలు. ⇒ మరి... మనవడో... మనవరాలినో ఎప్పుడు గిఫ్ట్‌గా ఇస్తారు? ఆ విషయం గురించి అత్తయ్య–మావయ్య అడుగుతుంటారు. లక్ష్మీ అయితే మా పిల్లలతో కలసి పెరుగుతారు... త్వరగా బిడ్డల్ని కనండి... అంటుంటుంది. దేనికైనా టైమ్ రావాలి. – డి.జి. భవాని -
లక్ష్మీ ప్రసన్న హత్య కేసులో కొత్త మలుపు
-
లక్ష్మీ ప్రసన్న హత్య కేసులో కొత్త మలుపు
మేడ్చల్: చిన్నారి లక్ష్మీ ప్రసన్న హత్యకేసులో విచారణను మేడ్చల్ పోలీసులు ముమ్మరం చేశారు. లక్ష్మీ ప్రసన్న తల్లితండ్రులకు మిగతా కుటుంబసభ్యులకు తరచూ గొడవలవుతూ ఉండేవని, భార్యభర్తల మధ్య కూడా అన్యోన్యత లేదని గ్రామస్ధులు చెబుతున్నారు. ఈ మేరకు కుటుంబసభ్యుల కాల్ డేటా వివరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. పథకం ప్రకారమే చిన్నారిని హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. కుటుంబసభ్యులే చిన్నారిని హతమార్చి ఉంటారని గ్రామస్ధులు చెబుతుండటంతో పోలీసుల అనుమానం బలపడింది. ఎల్లంపేటలో హత్య జరిగిన రోజు మధ్యాహ్న సమయంలో లక్ష్మీ ప్రసన్న తాత ఇంటికి వచ్చి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో లక్ష్మీ ప్రసన్న తల్లి, తండ్రి, పిన్ని, తాతయ్యలను పోలీసులు ప్రశ్నించి.. తాతను అదుపులోకి తీసుకున్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని తెలిపారు. -
‘లక్ష్మీ బాంబ్’ వర్కింగ్ స్టిల్స్
-
పవర్ఫుల్ బాంబ్
చట్టం ఎవరి చుట్టమూ కాదని ఆ న్యాయమూర్తి అభిప్రాయం. నీతికి, నిజాయితీకి కట్టుబడిన ఆ మహిళా మూర్తికి ఎటువంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అప్పుడామె ఏం చేసింది? అనే కథాంశంతో రూపొందుతోన్న చిత్రం ‘లక్ష్మీ బాంబ్’. ఫ్రమ్ శివకాశి.. అనేది ఉపశీర్షిక. మంచు లక్ష్మీప్రసన్న న్యాయమూర్తిగా ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ చిత్రాన్ని వేళ్ల మౌనిక చంద్రశేఖర్, ఉమా లక్ష్మీనరసింహ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కార్తికేయ గోపాలకృష్ణ దర్శకుడు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. నిర్మాతలు మాట్లాడుతూ - ‘‘మంచు లక్ష్మిగారి పాత్ర చాలా శక్తిమంతంగా ఉంటుంది. ఇటీవల రెండు ఫైట్స్, రెండు పాటలు చిత్రీకరించాం. ఆగస్టు నెలాఖరు వరకూ కంటిన్యూస్‌గా జరిగే షెడ్యూల్లో చిత్రీకరణ పూర్తిచేస్తాం’’ అన్నారు. ‘‘కొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోన్న కామెడీ థ్రిల్లర్ ఇది’’ అని దర్శకుడు తెలిపారు. పోసాని, హేమ, ప్రభాకర్, జీవా తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి కథ-మాటలు: ‘డార్లింగ్’ స్వామి, కెమేరా: జోషి, సహ నిర్మాతలు : మురళి, సుబ్బారావ్, సమర్పణ: గూనపాటి సురేశ్ రెడ్డి, సంగీతం: సునీల్ కశ్యప్. -
రైలు నుంచి జారిపడి యువతి మృతి
వరంగల్ జిల్లా డొర్నకల్, ఖమ్మం జిల్లా గార్ల రైల్వే స్టేషన్ల మధ్యలో ప్రమాదవశాత్తూ ఇంటర్ సిటీ రైలు నుంచి జారిపడి ఓ యువతి మృతిచెందింది. యువతి పేరు లక్ష్మీప్రసన్నగా గుర్తించారు. ఆమె తీసుకున్న టికెట్‌ను బట్టి ఖమ్మం జిల్లాకు చెందిన యువతిగా భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
న్యాయమూర్తిగా...
మంచు లక్ష్మీ ప్రసన్న ఇప్పుడు న్యాయమూర్తిగా ఓ విభిన్నమైన పాత్రలో కనిపించడానికి సిద్ధమవుతున్నారు. ఆమె ప్రధాన పాత్రలో ఉద్భవ్ ప్రొడక్షన్స్ పతాకంపై వేళ్ల మౌనికా చంద్రశేఖర్, ఉమా లక్ష్మి నరసింహ నిర్మించనున్న ఈ చిత్రం ఈ నెల 20న ప్రారంభం కానుంది. కార్తికేయ గోపాలకృష్ణ దర్శకుడు. నిర్మాతలు మాట్లాడుతూ- ‘‘జూన్‌లో రెగ్యులర్ షూటింగ్ జరపనున్నాం. థ్రిల్లర్, కామెడీ నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించనున్నాం’’ అని చెప్పారు. -
కారంపొడి చల్లి.. గొలుసు చోరీ
వాకింగ్ కోసం వెళ్తున్న మహిళ మెడపైన కారంపొడి చల్లిబంగారు గొలుసు తస్కరించిన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జూబ్లీహిల్స్ రోడ్ నెం. 71లో నివసించే ప్రసన్నలక్ష్మి(37) సోమవారం ఉదయం సీవీఆర్ న్యూస్ చౌరస్తా నుంచి కేబీఆర్ పార్కు జీహెచ్ఎంసీ వాక్‌వేలో వాకింగ్ చేసేందుకు వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన ఆగంతకుడు ఆమె మెడపైన కారంపొడి చల్లి ఆమె అప్రమత్తమయ్యేలోగా మెడలోని నాలుగు తులాల బంగారు గొలుసు లాక్కొని పరారయ్యాడు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకొని ఈ చౌరస్తాలో ఉన్నో సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఈ ప్రాంతంలో ఇటీవలనే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పోలీసులకు దర్యాప్తులో కీలక సమాచారం లభించే అవకాశాలు ఉన్నాయి. -
విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
రుద్రవరం మండలకేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న లక్ష్మీప్రసన్న(14) అనే విద్యార్థిని ఆత్మాహత్యాయత్నం చేసింది. మరో విద్యార్థినితో గొడవపడి ఇంటికెళ్లి ఒంటిపై కిరోసిన్‌పోసుకుని నిప్పంటించుకుంది. తీవ్రగాయాలపాలైన ప్రసన్నను చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
అక్టోబర్ 8 పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు
ఈరోజు మీతోపాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు: లక్ష్మీ ప్రసన్న మంచు, (నటి), అభిషేక్ నాయర్ (క్రికెటర్) ఈ రోజు పుట్టిన వారి సంవత్సర సంఖ్య 8. పుట్టిన తేదీ కూడా 8. ఇది కూడా శనికి సంబంధించిన సంఖ్యే కావడం వల్ల వీరిపై శని ప్రభావం మరింత బలంగా ఉంటుంది. దీనికి అధిపతి అయిన శనైశ్చరుడు వృత్తికారకుడు కావడం వల్ల ఈ సంవత్సరం ఉద్యోగంలో, వ్యాపారంలో స్థిరత్వాన్ని పొందుతారు. మనోబలం పెరుగుతుంది. వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు మంచి మార్కులు వచ్చి, కోరుకున్న కోర్సులలో సీటు వస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగం, ఉద్యోగులకు ప్రమోషన్ లేదా జీతాల పెంపుదల ఉంటుంది. మనీ మేనేజ్మెంట్ వీరికి బాగా తెలియడం వల్ల వీరు ఈ ఏడాది పెట్టిన పెట్టుబడులు మంచి లాభాలనిస్తాయి. క్రమశిక్షణకు కట్టుబడి, న్యాయం, ధర్మం, సమానత్వం అనే గుణాలను కలిగి ఉండటం వల్ల ఆదర్శభావాలతో సంఘంలో మంచి పేరు తెచ్చుకుంటారు. పిల్లలకు వివాహాది శుభకార్యలు జరిపిస్తారు. న్యాయవాద వృత్తిలో ఉన్న వారు ఆర్థికంగా బలపడతారు. మేనేజిమెంట్ రంగంలోని వారు రాణిస్తారు. అయితే అందరూ క్రమశిక్షణతో ఉండాలని కోరుకోవడం వల్ల బీపీ, గుండె సంబంధ వ్యాధులు తలెత్తే అవకాశం ఉంది. యోగ, మెడిటేషన్ చేస్తూ వైద్య సలహాలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉండటం మంచిది. ఐ.ఎ.ఎస్‌లు, ఐపీఎస్‌లు తదితర అధికారులకు ప్రమోషన్లు లభిస్తాయి. లక్కీ డేస్: 1,3,8,9; లక్కీ కలర్స్: ఎల్లో, గోల్డెన్, బ్లూ, బ్లాక్; లక్కీ డేస్: గురు, శుక్ర, శనివారాలు. సూచనలు: శనికి తైలాభిషేకం, శివునికి మహన్యాసపూర్వక రుద్రాభిషేకం చేయించుకోవడం, అనాథలకు అన్నదానం చేయడం, వృద్ధులను ఆదరించడం, పిల్లులకు, కుక్కలకు ఆహారం పెట్టడం, మాట్లాడేటప్పుడు సంయమనం పాటించడం మంచిది. - డాక్టర్ మహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరో గ్రాఫో థెరపిస్ట్ -
సైకలాజికల్ థ్రిల్లర్ “బుడుగు” స్టిల్స్
-
లక్ష్మీ మంచు ప్రధాన పాత్రలో ‘బుడుగు’
పిల్లల భవిష్యత్తుపై బోల్డన్ని ఆశలు పెంచుకుంటారు తల్లిదండ్రులు. కానీ, ఆ ఆశలు పిల్లలను ఎలాంటి ఒత్తిడికి గురి చేస్తాయి? తద్వారా పిల్లల ప్రవర్తన ఎలా మారుతుంది? అనే కథాంశంతో రూపొందుతోన్న చిత్రం ‘బుడుగు’. లక్ష్మీ మంచు ప్రధాన పాత్రలో శ్రీధర్ రావు కీలక పాత్రలో, టైటిల్ రోల్లో మాస్టర్ ప్రేమ్‌బాబు నటిస్తున్న ఈ చిత్రానికి మన్మోహన్ దర్శకుడు. భాస్కర్, సారికా శ్రీనివాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి కావచ్చింది. ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ - ‘‘ఒత్తిడికి గురయ్యే పిల్లాడు, అతని చుట్టూ జరిగిన కొన్ని సంఘటనల కారణంగా ఆ కుటుంబం ఎలాంటి సమస్యలు ఎదుర్కొంది? అనేది ప్రధాన ఇతివృత్తం. ప్రేక్షకులను ఉద్వేగానికి గురి చేసే ఫ్యామిలీ థ్రిల్లర్ ఇది. ఇప్పటివరకూ ఇలాంటి కథ రాలేదు’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: సాయి కార్తీక్, కెమెరా: సురేష్ రగుతు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: వంశీ పుల్లురి.