త్రీ డాటర్స్‌ | Mohan Babu special interview on he's birth day | Sakshi
Sakshi News home page

త్రీ డాటర్స్‌

Published Sat, Mar 18 2017 11:20 PM | Last Updated on Tue, Sep 5 2017 6:26 AM

Mohan Babu special interview on he's birth day


కోడళ్లను కూడా కూతుళ్లుగా పెంచుకునే సంస్కారం...
మెట్టినింటిని పుట్టిల్లుగా మార్చగల అనుబంధం... ఈ ట్రిపుల్‌ డాడీది!
సుగుణాలు సంస్కారం నుంచి పుట్టుకొస్తాయని...
సంస్కారం సంబంధాల నుంచి పుట్టుకొస్తుందని...
సంబంధాలు అనుబంధాల నుంచి పుట్టుకొస్తాయని నమ్మే
ట్రిపుల్‌ డాడీ బర్త్‌డే స్పెషల్‌ ఇది!


మంచు కుటుంబంలోకి పెద్ద కోడలిగా అడుగుపెట్టే ముందు మీ ఫీలింగ్స్‌ ఎలా ఉండేవి?
విరానిక: యాక్చువల్‌గా చాలా భయపడ్డాను. కొత్తగా ఓ బంధం మొదలయ్యేటప్పుడు భయం, ఆనందం... ఇలా మిక్స్‌డ్‌ ఫీలింగ్స్‌ ఉంటాయి. పైగా అంకుల్‌ చాలా క్రమశిక్షణ ఉన్న వ్యక్తి. అన్నీ పట్టించుకుంటారు. ఎలా ఉంటుందో అని భయపడ్డాను. నేను అడుగుపెట్టిన మొదటి రోజు ‘లక్ష్మీ నాకు మొదటి కూతురు. నువ్వు రెండో కూతురివి’ అన్నారు. అప్పుడు ఏ కోడలికైనా ఎలా ఉంటుందో మాటల్లో చెప్పక్కర్లేదు. ‘ఇలా ఉండాలి. అలా ఉండకూడదు... ఇవి చెయ్యకూడదు... అవే చెయ్యాలి’ వంటి రిస్ట్రిక్షన్‌ ఏమీ అంకుల్‌ పెట్టలేదు. మామూలుగా కోడలు ఇంటిపట్టున ఉండి ఇంటిని చూసుకోవాలని ఏ అత్తమామలైనా కోరుకుంటారు. కానీ, నా అత్త–మామలు మాత్రం అలా కాదు. నేను స్కూల్‌ వ్యవహరాలు చూసుకుంటాను. ఒక్కోసారి వాటితోనే బిజీగా ఉంటాను. ఆడపిల్లలకు కెరీర్‌ ఉండాలంటూ ఎంకరేజ్‌ చేస్తారు.

మీ భయం పోవడానికి ఎన్నాళ్లు పట్టింది?
 (నవ్వుతూ). ఓ రెండేళ్లు అనుకోండి. తర్వాత అంకుల్‌ బాగా అర్థమయ్యారు. ఇప్పుడు మేమిద్దరం మంచి ఫ్రెండ్స్‌. జోక్స్‌ వేసుకుంటాం. డైలీ ఈవినింగ్‌ పావుగంటైనా మాట్లాడుకోవాల్సిందే. రోజంతా ఎలా గడిచింది? అని అడిగి తెలుసుకుంటారు. వెరీ కేరింగ్‌. ఇప్పుడు ఆయనకు నా మీద ఎంత నమ్మకం అంటే... ఏదైనా ముఖ్యమైన పనులు ఉంటే నాతోనే చెబుతారు. నేను వాటిని చక్కగా పూర్తి చేయగలనని ఆయన నమ్మకం.

జనరల్‌గా పెళ్లయ్యాక వేరు కాపురం పెట్టేస్తారు. కానీ, ఉమ్మడి కుటుంబంలో అడ్జస్ట్‌ కాగలిగారు...
యాక్చువల్లీ నేను పెద్ద కుటుంబం నుంచి వచ్చినదాన్ని. పెద్ద అంటే మా నాన్నగారి తోడబుట్టినవాళ్లు ఆరుగురు. అమ్మ తోడబుట్టినవాళ్లు నలుగురు. మా అమ్మానాన్నలకు నేను ఒక్కతే కూతుర్ని. పెద్దమ్మా–పెదనాన్న, బాబాయ్‌.. ఇలా అందరి పిల్లలం కలిపి మాది లార్జ్‌ ఫ్యామిలీ. బయట ఫ్రెండ్స్‌తో పనే లేనంతమంది మా ఫ్యామిలీలో ఉన్నారు. నాకు జాయింట్‌ ఫ్యామిలీ అంటే ఇష్టమే. అందుకే పెళ్లవగానే విష్ణుతో వేరే ఇంట్లో ఉండాలని అనుకోలేదు. పెద్దవాళ్లతో కలిసి ఉండటం వల్ల మంచి సపోర్ట్‌ ఉంటుంది. ఎప్పుడైనా భార్యా–భర్త మధ్య చిన్న చిన్న గొడవలు వస్తే పెద్దవాళ్లు కలగజేసుకుని సర్ది చెబుతుంటారు. ఆ సపోర్టే వేరు.

ప్రణతి మీ ఫ్రెండే కాబట్టి, తోడికోడళ్ల మధ్య మంచి బంధమే ఉండి ఉంటుంది..
ప్రణతి నాకు చాలా చిన్నప్పట్నుంచీ తెలుసు. చాలా మంచి అమ్మాయి. డౌన్‌ టు ఎర్త్‌. ఇంటిని బాగా చూసుకుంటుంది. వెరీ ఇంటిలిజెంట్‌. అందరితో కలసిపోతుంది. మేమందరం బాగుంటాం.

బ్రదర్‌కి పెళ్లవుతుందంటే ఏ సిస్టర్‌కైనా కొంచెం ఇన్‌సెక్యూర్టీ ఉంటుంది. మరి, మీ ఆడపడుచు  (లక్ష్మీప్రసన్న)కు ఆ ఫీలింగ్‌ ఏమైనా ఉండేదా?
ఏ అమ్మాయి అయినా బ్రదర్స్‌ విషయంలో కొంచెం పొసెసివ్‌గా ఉంటుంది. అది తప్పు కాదు. అప్పటివరకూ అక్కాతమ్ముళ్లు మాత్రమే ఉంటారు. సడన్‌గా తమ్ముడి జీవితంలోకి ఓ అమ్మాయి వస్తే... ఎక్కడ తన తమ్ముడు తనకు కాకుండా పోతాడేమోనని ఓ ఇన్‌సెక్యూర్టీ ఉండటం సహజం. నేను ఇంటికి పెద్ద కోడలిని కాబట్టి, నా మీద ఎక్కువ కాన్‌సన్‌ట్రేషన్‌ ఉంటుంది. అందుకే ఈ ఇంటికి వచ్చిన కొత్తలోనే నేను, లక్ష్మీ చాలా ఓపెన్‌గా మాట్లాడుకున్నాం. విష్ణు నాకు భర్తే అయినా... నీకు తమ్ముడు కూడా అనేది కన్వే చేయగలిగాను. తను అర్థం చేసుకుంది. ‘షీ ఈజ్‌ వెరీ కేరింగ్‌’. మా మధ్య ఓ‘స్పెషల్‌ బాండింగ్‌’ ఏర్పడింది.

మీ కూతుళ్లు ఆరియానా, వివియానాలో మోహన్‌బాబుగారి లక్షణాలు ఎవరిలో ఎక్కువ?
 ఆరియానాలోనే. అంకుల్‌లో ఉన్న లీడర్‌షిప్‌ క్వాలిటీస్‌ అన్నీ తనలో ఉన్నాయి. ఆరి నడక, మాటలు అన్నీ అంకుల్‌ని గుర్తు చేస్తాయి. ఆరీకి మూడేళ్ల వయసప్పుడు అనుకుంటా.. పెద్దయ్యాక ఏమవుతావ్‌? అని అడిగితే ‘ఐ విల్‌ బికమ్‌ అమెరికన్‌ ప్రెసిడెంట్‌’ అంది. ఆశ్చర్యపోయాం. లీడర్‌షిప్‌ క్వాలిటీస్‌ ఉన్నాయని చాలా మురిసిపోయాను.

ఫైనల్లీ... మంచు కుటుంబం కోడలు అయినందుకు మీ ఫీలింగ్‌?
‘ఐయామ్‌ బ్లెస్డ్‌’. నో డౌట్‌ అండీ. విష్ణు ఈజ్‌ ఎ కేరింగ్‌ హజ్బెండ్‌. ఇక అంకుల్‌–ఆంటీ అయితే సూపర్‌. ఆంటీతో మాట్లాడుతుంటే ఓ అత్తగారితో మాట్లాడుతున్నట్లుగా అనిపించదు. మేమిద్దరం కలసి షాపింగ్‌కి వెళతాం. బోల్డన్ని కబుర్లు చెప్పుకుంటాం. ఇక, అంకుల్‌ గురించి చెప్పాలంటే... మా అందర్నీ బాగా చూసుకుంటారు. మనవరాళ్ల విషయంలో కేరింగ్‌గా ఉంటారు. ఒక్కోసారి వాళ్లకు స్వయంగా తినిపిస్తుంటారు. ఆడిస్తుంటారు. ఈ కుటుంబంలో ఓ మెంబర్‌ని అయినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. జీవితంలో ఇంతకన్నా కోరుకునేది ఏమీ ఉండదు.

మీకు వంట వచ్చా?
లేదండీ. బ్యాడ్‌ కుక్‌ని. పుట్టింట్లో ఉన్నప్పుడు నేర్చుకోలేదు. అత్తగారింట్లోనూ పెద్దగా స్కోప్‌ లేదు. నాకు, అంకుల్‌కి థాయ్‌ ఫుడ్స్‌ ఇష్టం. నాకు అవి చేయడం వచ్చు. మా ఇద్దరి కోసం కుక్‌ చేస్తుంటాను. ఆ రోజు మాత్రం నేను, అంకుల్‌ ఫుల్లుగా లాగించేస్తాం.

కోడళ్లను కూడా కూతుళ్లని మీ నాన్నగారు అంటారు.. మరి... వాళ్లు వచ్చాక మీ స్పేస్‌ తగ్గిందనే ఫీల్‌ ఏమైనా?
లక్ష్మీప్రసన్న: ఆ ఫీలింగ్‌ ఎప్పుడూ కలగలేదు. విన్నీ (విష్ణు భార్య విరానికా) మా అందరికన్నా నాన్నకి బాగా దగ్గరైంది. ఇప్పుడు నాకేం కావాలన్నా విన్నీతోనే రికమండేషన్‌ చేయించుకోవాల్సి వస్తోంది (నవ్వుతూ). మా ఇల్లు దూరం. విష్ణు–విన్నీ నాన్నవాళ్లతోనే ఉంటారు. నాన్నని విన్నీ భలేగా హ్యాండిల్‌ చేస్తుంది. మాకది తెలియదు. ఇంకో విషయం ఏంటంటే... మా నాన్నకి మా మధ్య పుల్లలు పెట్టి తమాషా చూడటం అలవాటు. మేం గొడవ పడుతుంటే నవ్వుతుంటారు. మేమంతా కలసి మా అమ్మను ఏడిపిస్తుంటే ఆయనకు ఏదో తెలియని సంతోషం. మొన్న మా అమ్మను విన్నీ క్యాజువల్‌గా ఏదో అంది. దాన్ని మా నాన్నగారు పెద్దది చేసి ‘నిమ్మీ (మోహన్‌బాబు భార్య నిర్మల)  తను నిన్ను ఏమందో విన్నావా? అసలు అలా అనొచ్చా?’ అని పుల్లలు పెట్టడానికి ట్రై చేస్తే, అమ్మేమో చాలా క్యాజువల్‌గా ‘ఆ.. ఆ.. తెలుసు. పెద్దగా ఏమీ అనలేదే’ అంది. దాంతో విన్నీ, మేమూ నవ్వేశాం.

మీ తమ్ముళ్ల భార్య (విరానికా, మనోజ్‌ భార్య ప్రణతి) లతో మీ బాండింగ్‌?
మేం ఏదైనా సరే ఓపెన్‌గా మాట్లాడుకుంటాం. నచ్చని విషయాలుంటే నచ్చలేదని మొహం మీదే చెప్పేస్తాం. ఆ మధ్య ఓ ఫంక్షన్‌కి వెళ్లాం. నేను చీర కట్టుకుని, నగలు పెట్టుకుని గ్రాండ్‌గా రెడీ అయ్యాను. ప్రణతి మామూలు చుడీదార్‌ వేసుకుని మా ఇంటికి వచ్చింది. ‘ఇంత సింపుల్‌గానా’ అని నాలుగు తిట్లు తిట్టి, చీర కట్టుకుని రెడీ అవ్వమన్నాను. తనేమనుకున్నా ఫర్వాలేదు. ఆ ఫంక్షన్‌కి నేను చెప్పినట్లు వెళ్లడమే కరెక్ట్‌ అని నాకనిపించింది. ప్రణతి కూడా నా మాట కాదనలేదు. ఏమైనా అనుకుంటుందేమో అని చెప్పకుండా మనసులో పెట్టుకుని, ఆ తర్వాత సూటీపోటీ మాటలు అనుకోవడంకన్నా, అలా ఫ్రాంక్‌గా మాట్లాడుకుంటే... మనసులో ఏమీ ఉండదు. నేను, విన్నీ, ప్రణతి ముగ్గరం అలానే ఉంటాం. అందుకే మా మధ్య బాండింగ్‌ బాగుంటుంది. పైగా నా తమ్ముళ్లను వీళ్ల చేతిలో పెట్టాను. వాళ్లను బాగా చూసుకోవాల్సిన బాధ్యత వీళ్లదే. అందుకే నేను వీళ్లను బాగా చూసుకుంటాను.

మీ ముగ్గురి (అక్కాతమ్ముళ్లు)లో మోహన్‌బాబుగారు చెప్పినవి ఇమ్మీడియట్‌గా పాటించేది ఎవరు?
నేను, మనోజ్‌ వాదిస్తాం. నాన్న బర్త్‌డే (మార్చి, 20) సెలబ్రేషన్స్‌ కోసం నాన్న, అమ్మ... ఇంకా అందరూ ఓ వారం రోజుల ముందే తిరుపతి వెళ్లారు. నేనేమో తర్వాత వస్తానన్నా. ‘ఎందుకూ... నా బర్త్‌డే రోజు మార్నింగ్‌ రా’ అన్నారు నాన్న. ఆయన ఏదనుకుంటే అది జరగాల్సిందే. నాన్న ఏది చెబితే అది ఆల్‌మోస్ట్‌ చేయడం విష్ణు అలవాటు. నేనూ, మనోజ్‌ ఫ్రెండ్లీగా వాదిస్తుంటాం. కానీ, ఆయన శాసిస్తే... ఆ మాటను ధిక్కరించే సాహసం మేమెవరం చేయం.

డైనమిక్‌గా కనిపించే మీ నాన్నగారు భయపడేది?
చెబితే నమ్మరేమో. ఆయనకు సూది అంటే భయమండీ బాబూ. చీకటంటే కూడా చాలా భయం. చిన్నప్పుడు మా పాత ఇంట్లో పై గదికి వెళ్లే మెట్లు దగ్గర లైట్లు ఉండేవికావు. అందుకుని నాన్నగారు పైకి వెళ్లాల్సి వచ్చినప్పుడు ఎవరినో ఒకరిని వెంట తీసుకుని వెళ్లేవారు. లైట్లు వేశాక ఆ వ్యక్తిని కిందకు పంపించి వేసేవారు. ఈ విషయంలో మా నాన్నగారిని అమ్మ సరదాగా ఆటపట్టించేవారు. అసలు నాన్న పైకి కఠినంగా కనిపిస్తారు కానీ, లోపల చిన్నపిల్లల మనస్తత్వమే. ఈ మధ్య ఆయనకు షోల్డర్‌ సర్జరీ అయ్యింది. మొన్న ఒక్కరోజు నేను చూడ్డానికి వెళ్లలేదు. అంతే అలిగారు. ‘నాన్నా... నాకూ ఫ్యామిలీ ఉంది. పాపను చూసుకోవాలి’ అంటే  ఓ నవ్వు నవ్వేసి, అంతేలే అన్నారు. ఎప్పుడూ ఆయన చుట్టూ అందరూ ఉండాలని కోరుకుంటారు.

మీ నాన్నగారి నుంచి మీరు నేర్చుకున్నది... వద్దనుకునేది?
నేర్చుకున్నది ముక్కసూటితనం. వద్దనుకుంటున్నది కూడా అదే. ఆయనకు అందరూ సమానమే. తప్పు ఎవరు చేసినా మొహం మీదే చెప్పేస్తారు. నాకేమో అది నచ్చదు. అంత సూటిగా ఎందుకు ఉండటం అనుకుంటా. కానీ, ఎవరి తత్వం వారిది. నా దృష్టిలో మా నాన్నగారు ‘సూపర్‌ హీరో’. ఆయన లైఫ్‌ చూసి, ఒక సినిమా హిట్‌ అయితే ఎంతమంది ఇంటికి వస్తారు? అనేది తెలుసుకున్నా. ఫ్లాప్‌ అయితే ఇంటివైపు రారనే విషయం కూడా అర్థం చేసుకున్నా. సక్సెస్‌లో ఎలా ఉండాలి అనేకన్నా ఫెయిల్యూర్‌ ఎదురైనప్పుడు ఎలా ఉండాలో నాన్న లైఫ్‌ నేర్పించింది. కష్టాల్లో ఉన్నప్పుడు ఎంత ధైర్యాన్ని, నమ్మకాన్ని కూడగట్టుకోవాలో ఆచరించి చూపించారు. ఆయన లైఫ్‌ మాకు ఓ మంచి లెసన్‌. ఇవాళ నాన్న ఇంత మంచి పేరు తెచ్చుకున్నారంటే అది ఎవరూ ధారాదత్తం చేసింది కాదు.

పగలనకా, రాత్రనకా శ్రమించి సంపాదించుకున్నది. కుటుంబానికి ఆయన పంచే ప్రేమ వండర్‌ఫుల్‌. డైలీ ఫోన్‌ చేసి మాట్లాడతారు. ఆనంద్‌ (లక్ష్మీప్రసన్న భర్త) ఏం చేస్తున్నాడు? తిన్నాడా? అని అడుగుతారు. మనవరాళ్ల గురించి తెలుసుకుంటారు. నివ్వీ, ఆరీ, వివ్వీ (మనవరాళ్లు)ను కూర్చోబెట్టుకుని ‘తాతయ్య గ్రేట్‌’, ‘అమ్మమ్మ బ్యాడ్‌’ అని చెప్పించుకుని, సంబరపడతారు. అమ్మమ్మ అంటే నివ్వీకి చాలా ఇష్టం. అందుకే తాతయ్య ముందు ‘తాతయ్య గ్రేట్‌’, ‘అమ్మమ్మ బ్యాడ్‌’ అని... ఆ తర్వాత మా అమ్మ దగ్గరికి వచ్చి ‘సారీ అమ్మమ్మా’ అంటుంది. నాన్న ఆటలన్నీ ఇలానే ఉంటాయి.

మీ నాన్నగారిలా మీరు డైనమిక్‌గా కనిపిస్తారు కాబట్టి, ఆయన ప్రభావం మీ మీద చాలా ఉందనిపిస్తోంది...
కచ్చితంగా ఉంది. చాలామంది నేను నాన్నలానే నడుస్తానని అంటుంటారు. అప్పుడు సంతోషంగా ఉంటుంది. ఒక అమ్మాయిలా నన్నెప్పుడూ ఆయన పెంచలేదు. అబ్బాయిలతో మాట్లాడొద్దు, గట్టిగా నవ్వొద్దనీ మా అమ్మమ్మ చాలా రూల్స్‌ పెట్టేవారు. నాన్న అలాంటివేమీ చెప్పేవారు కాదు. ఎప్పుడూ ధైర్యంగా ఉండాలనేవారు.

పుట్టింటి నుంచి మెట్టినింటిలోకి అడుగుపెట్టేటప్పుడు ఏ అమ్మాయికైనా కొన్ని భయాలుంటాయ్‌... మీకలా?
ప్రణతి: విన్నీ నాకు మంచి ఫ్రెండ్‌. దాంతో నాకు వేరే ఇంటికి వెళుతున్నట్లు అనిపించలేదు. పెళ్లికి ముందు ఒకే ఒక్కసారి మామయ్యగారిని కలిశాను. అది కూడా విన్నీ ద్వారానే. అప్పుడు పెద్దగా ఏం మాట్లాడలేదు. అయినా నాకేం భయంగా అనిపించలేదు. నిజానికి నేను ఎక్కడికో వెళ్లిపోతున్నాను అనే ఫీలింగ్‌ కలగలేదు. ఒక మంచి ఫ్యామిలీలోకి వెళుతున్నాం అనే ఫీలింగ్‌తోనే ఈ కుటుంబంలోకి వచ్చాను.

మోహన్‌బాబుగారి గురించి ఏమనిపించింది?
మామయ్యగారిని చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంటుంది. జీవితంలో ఎంతో సాధించారు. కొంతమంది ఆర్టిస్టులుగానే మిగిలిపోతారు. కానీ, మామయ్యగారు చదువుకున్న వ్యక్తి. సినిమా ఫీల్డ్‌లో తిరుగులేదనిపించుకున్నారు. పొలిటీషియన్‌. విద్యావేత్త. టోటల్‌గా సక్సెస్‌ఫుల్‌మేన్‌. అందుకే సొసైటీలో అంత గౌరవం సంపాదించుకోగలిగారు. పేరూ, డబ్బూ సంపాదించుకున్నా ఆయన రిలాక్స్‌ కాలేదు. ఖాళీగా ఉండరు. ఇటు ఇంట్లో, అటు తిరుపతి స్కూల్‌లో చిన్న మొక్క నాటడం నుంచి కిచెన్‌ వరకూ... అన్నీ పట్టించుకుంటారు. ఇంట్లో చిన్న శుభకార్యమైనా అన్నీ దగ్గరుండి చూసుకుంటారు. పండగలంటే అందరం కలసి సెలబ్రేట్‌ చేసుకోవాల్సిందే. నేను అమెరికాలో ఉండేదాన్ని. నాకు ఇలా కలసి పండగలు చేసుకోవడం ఇవన్నీ తెలియదు. ఇక్కడ ఇలా చేసుకోవడం బాగుంది. అలాగే, ఇంట్లో అందరం కలసి ఏదో అప్పుడప్పుడూ హాలిడే ట్రిప్‌ వెళ్లాల్సిందే. ఆ ట్రిప్స్‌ని బాగా ఎంజాయ్‌ చేస్తుంటాం.

మీకన్నా మీ తోడికోడలు మీ మావయ్యగారికి క్లోజ్‌ కదా. మీకు అసూయ ఏమైనా?
అస్సలు లేదు. విన్నీకి పెళ్లై 8 ఏళ్లు, నా పెళ్లై రెండేళ్లు. అందుకని మావయ్యగారితో ఎలా మాట్లాడాలో విన్నీకి బాగా తెలుసు. సిచ్యుయేషన్స్‌ని హ్యాండిల్‌ చేయడంలో తను బెస్ట్‌. నేను చేయలేనిది తను చేయగలుగుతుంది కాబట్టి, ఐయామ్‌ హ్యాపీ.

మీ ఆడపడుచు (లక్ష్మీప్రసన్న) మిమ్మల్ని చుడీదార్‌ బదులు చీర కట్టుకోమని అన్నానని ఇంతకుముందే చెప్పారు. అప్పుడు కొంచెం కూడా కోపం రాలేదా?
కోపం ఎందుకు? చెప్పే హక్కు తనుకుంది. ఏం చెప్పినా నా మంచికే చెబుతుందని నాకు తెలుసు. ఒకవేళ తను అలా ఓపెన్‌గా ఉండకపోతేనే నేను ఫీలవుతా. బయటకు అలా ఫీలింగ్స్‌ ఎక్స్‌ప్రెస్‌ చేయడం వల్ల మా బాండింగ్‌ ఇంకా బలపడింది. ఒకే కుటుంబానికి చెందినవాళ్లెవరైనా ఓపెన్‌గా మాట్లాడుకోవడం మంచిది. అప్పుడే ‘మనమంతా ఒకటే’ అనే ఫీలింగ్‌ కలుగుతుంది.

సరే... మీ మావయ్యగారు పెట్టే ‘స్వీట్‌ టార్చర్‌’ గురించి ఏమైనా?
అదైతే కొంత ఉందండీ. శంషాబాద్‌ ఇంట్లో మావయ్యగారు ఆర్గానిక్‌ వెజిటబుల్స్‌ పండిస్తారు. కూరగాయలు పండించి మా ఇంటికీ, లక్ష్మీ ఇంటికీ పంపిస్తారు. ‘ఇవాళ క్యాబేజ్‌ పంపించా... వండారా?’ అని ఫోన్‌ చేసి మరీ అడుగుతారు. ఆరోగ్యానికి మంచివనేవన్నీ కంపల్సరీగా మేం తినాల్సిందే. లేకపోతే ఊరుకోరు. చెబితే నమ్మరేమో... ఎవరైనాసరే కొబ్బరి పువ్వు ఎంత తినగలుగుతారండీ. ఏదో కొంచెం. అంతే కదా. ఒకసారి నాకూ, లక్ష్మీకి బోల్డంత కొబ్బరి పువ్వు పంపించారు. ‘అది మొత్తం తిన్నారా?’ అని ఫోన్‌ చేసి, అడిగారు. ఏం చెప్పాలో తెలియలేదు (నవ్వుతూ). ప్రతిరోజూ మాతో మాట్లాడాల్సిందే. మావయ్యగారు చాలా కేరింగ్‌.

మీ హజ్బెండ్‌ మనోజ్‌ని మీ నాన్నని చూసి నేర్చుకుంటే బాగుంటుందని అంటుంటారా?
అలా చెప్పనండీ. ఎందుకంటే ఎవరి వ్యక్తిత్వం వాళ్లది. నాలా ఇంకొకరు ఉండరు. ఉండలేరు. అలాగే, మావయ్యగారిలా ఆయన మాత్రమే ఉండగలుగుతారు. కాకపోతే మావయ్యగారిలో ఉన్న లక్షణాలు పది శాతం నేర్చుకున్నా చాలు... గొప్పవాళ్లం అయిపోతాం అని మనోజ్‌తో అంటుంటాను. అసలాయన లెవల్‌ ఆఫ్‌ థింకింగ్‌ చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఇంతలా ఆలోచించాలా అనిపిస్తుంది. ఆయనదొక విజన్‌. పెళ్లి కాకముందు మోహన్‌బాబుగారు ఒక నటుడిగానే నాకు తెలుసు. వివాహం తరువాత ఆయన గొప్పదనం తెలుసుకున్నాను. ఈ స్థాయికి రావడానికి ఆయన ఎంత కష్టపడ్డారు అనేది పెళ్లి తర్వాతే తెలుసుకున్నా. ఇంత ఉన్నత స్థాయికి చేరుకుని... నిగర్విగా ఉండటం అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు. ఆయన విల్‌పవర్‌లో పది శాతం అయినా నేర్చుకుని ఆచరణలో పెట్టగలిగితే చాలు.

మరి... మనవడో... మనవరాలినో ఎప్పుడు గిఫ్ట్‌గా ఇస్తారు?
ఆ విషయం గురించి అత్తయ్య–మావయ్య అడుగుతుంటారు. లక్ష్మీ అయితే మా పిల్లలతో కలసి పెరుగుతారు... త్వరగా బిడ్డల్ని కనండి... అంటుంటుంది. దేనికైనా టైమ్‌ రావాలి. – డి.జి. భవాని

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement