pranathi
-
నార్నే నితిన్, శివానిల నిశ్చితార్థం (ఫొటోలు)
-
మెగాస్టార్‌ను కలిసిన ఇండియన్ ఐడల్ సింగర్
ప్రముఖ తొలి తెలుగు ఓటీటీ సంస్థ ‘ఆహా’ నిర్వహిస్తున్న తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్-2 సంగీత ప్రియులను అలరిస్తున్న సంగతి తెలిసిందే. మొదటి సీజన్ సక్సెస్ కావడంతో రెండో సీజన్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ సీజన్లో తన మధురమైన గొంతుతో ప్రేక్షకులను మెప్పించిన ఇండియన్ ఐడల్ ప్రణతి తాజాగా మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. హైదరాబాద్‌లోని చిరంజీవి నివాసంలో కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. (ఇది చదవండి: సితార.. నీ హృదయంతో చేయి.. నమ్రత పోస్ట్ వైరల్!) అక్కడే అన్నమాచార్య కీర్తన పాడి అందరినీ మెప్పించింది. ప్రణతి ప్రతిభకు మెగాస్టార్ దంపతులు ఫిదా అయ్యారు. భవిష్యత్తులో గొప్ప సింగర్ కావాలని ఆకాంక్షించారు. తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ -2లో సక్సెస్ సాధించాలని ఆశీర్వదించారు. కాగా.. విశాఖపట్టణానికి చెందిన ప్రణతి సీజన్ మొదటి రోజే తన గాత్రంతో మెప్పించి అందరి ప్రశంసలు అందుకుంది. (ఇది చదవండి: ఫైవ్ స్టార్ హోటల్లో వ్యభిచారం.. ప్రముఖ నటి అరెస్ట్!) -
ఆ వయసు ఏంటి ఆ పాట ఏంటి జడ్జెస్‌ని కట్టిపడేసిన ప్రణతి
-
గ్రాండ్‌గా ఎన్టీఆర్ భార్య ప్రణతి బర్త్‌డే సెలబ్రేషన్స్.. ఫోటోలు వైరల్
సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా ఫ్యామిలీతో ఎక్కువ సమయం గడిపేందుకు ప్రయత్నిస్తారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఇక ఫ్యామిలీ ఫోటోలను చాలా అరుదుగా పోస్ట్ చేసే తారక్ ఇటీవలి కాలంలో తన భార్య ప్రణతితో ఉన్న స్పెషల్ మూమెంట్స్‌ను షేర్ చేసుకుంటున్నారు. తాజాగా ప్రణతి పుట్టినరోజు సందర్భంగా ‘హ్యాపీ బర్త్ డే అమ్మలు’.. అంటూ ఓ క్యూట్ ఫోటోను పోస్ట్ చేయగా క్షణాల్లోనే ఆ పిక్ వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. భార్య 30వ బర్త్‌డేను మరింత స్పెషల్‌గా చేస్తూ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి బర్త్‌డే పార్టీ ఇచ్చారు తారక్. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.ఇది చూసిన నెటిజన్లు తారక్‌కు భార్య ప్రణతి అంటే ఎంతిష్టమో, క్యూట్ కపుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా 2011లో ఎన్టీఆర్-లక్ష్మీ ప్రణతిల వివాహం జరగగా, వీరికి అభయ్ రామ్, భార్గవ్ రామ్ సంతానం. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్30లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంతో జాన్వీ కపూర్ టాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తుంది. -
సతీమణికి జూనియర్ ఎన్టీఆర్ స్పెషల్ విషెస్.. పోస్ట్ వైరల్
జూనియర్ ఎన్టీఆర్ సతీమణి ప్రణతి బర్త్ డే సందర్భంగా స్పెషల్ విషెస్ తెలిపారు యంగ్ టైగర్. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఎన్టీఆర్ తన ఇన్‌స్టాలో రాస్తూ..'హ్యాపీ బర్త్ డే అమ్మలు' అంటూ తన ప్రేమను చాటుకున్నారు. ఇది చూసిన అభిమానులు ప్రణతికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. సినిమాలతో ఎంత బిజీగా ఉన్న ఫ్యామిలీ కూడా సమయం కేటాయిస్తారు తారక్. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ప్రణతితో కలిసి దిగిన ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తుంటారు. ఇవాళ ప్రణతి పుట్టిన రోజు సందర్భంగా తారక్ చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. కాగా.. ఈ జంటకు అభయ్ రామ్, భార్గవ్ రామ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా.. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు తాత్కాలికంగా ఎన్టీఆర్30 పేరు పెట్టారు. ఇటీవలే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ టాలీవుడ్లో ఎంట్రీ ఇస్తోంది. ఆర్ఆర్ఆర్ తర్వాత నటిస్తున్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. View this post on Instagram A post shared by Jr NTR (@jrntr) -
భార్గవ రామ్ @ 1
చిన్న తనయుడు భార్గవ రామ్ పుట్టినరోజున (శుక్రవారం) హీరో ఎన్టీఆర్ రెట్టింపు ఆనందంతో సమయాన్ని గడిపారు. ఆ మధుర జ్ఞాపకాలను ఫొటోలుగా మలిచి అభిమానులతో షేర్ చేసుకున్నారు ఎన్టీఆర్. ‘‘భార్గవ రామ్ ఏడాది పూర్తి చేసుకున్నాడు’’ అన్నారు ఎన్టీఆర్. 2011లో లక్ష్మీ ప్రణతిని ఎన్టీఆర్ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 2014లో ఈ దంపతులకు అభయ్ రామ్ జన్మించాడు. రెండో కొడుకు భార్గవ రామ్‌కు ఈ శుక్రవారంతో ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా అన్నదమ్ములిద్దర్నీ ఫొటో తీసి, దాన్ని కూడా షేర్ చేశారు ఎన్టీఆర్. ఇక సినిమాల విషయానికి వస్తే... రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో రామ్‌చరణ్ మరో హీరో. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ సినిమాకు దర్శకత్వం వహించే పేర్లలో ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్, తమిళ దర్శకుడు అట్లీ పేర్లు వినిపిస్తున్నాయి. -
చికిత్స పొందుతూ చిన్నారి ప్రణతి మృతి
హైదరాబాద్: యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామి దేవాలయం వద్ద ఈ నెల 8న పోలీసు వాహనం ఢీకొట్టిన ఘటనలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి ప్రణతి ఆదివారం తెల్లవారుజామున మృతిచెందింది. వివరాలు.. ఎల్బీనగర్ చైతన్యపురి డివిజన్ మున్సిపల్ కాలనీకి చెందిన పి.మల్లేష్ జీహెచ్ఎంసీలో ఔట్సోర్సింగ్ ఉద్యోగి. 7 నెలల క్రితం మల్లేశ్ భార్య సంధ్య డెంగ్యూ వ్యాధితో మృతి చెందింది. మల్లేశ్‌కు ఇద్దరు కుమార్తెలు ప్రీతి (5), ప్రణతి (మూడున్నరేళ్లు) ఉన్నారు. అక్క కుమార్తె నవీనకు బియ్యం పోస్తుండటంతో ఈ 8వ తేదీ సాయంత్రం తన తల్లి, పిల్లలతో కలసి మల్లేశ్ యాదగిరిగుట్టకు వెళ్లాడు. అనంతరం 9వ తేదీ ఉదయం పాత లక్ష్మీనర్సింహస్వామి గుడిలో సత్యనారాయణస్వామి వ్రతం చేయించుకునేందుకు బంధువులతో కలసి పాత గుట్టకు వెళ్లాడు. ఈ క్రమంలో మల్లేశ్ తన తల్లి బుచ్చ మ్మ, చిన్న కుమార్తె ప్రణతితో కలసి దేవాలయానికి ఎదురుగా ఉన్న పార్కింగ్లోని చెట్టు నీడలో సేద తీరుతున్నారు. ఈ సమయంలో అటుగా వచ్చిన యాదాద్రి పోలీస్‌స్టేషన్‌కు చెందిన పోలీసు వాహనం (టీఎస్09 పీఏ 5508) నీడలో సేద తీరుతున్న మల్లేశ్, ప్రణతిలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ప్రణతిని ఎల్బీనగర్లోని కామినేని ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ ప్రణతి ఆదివారం తెల్లవారుజామున 5.45 గంటలకు మృతి చెందింది. దీంతో చిన్నారి తండ్రి మల్లేశ్, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ ప్రమాదానికి వాహన డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమంటూ బంధువులు, కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు నెలల క్రితం భార్య, ఇప్పుడు కుమార్తె మృతి చెంద డంతో మల్లేశ్ బోరున విలపించాడు. ప్రణతి అంత్యక్రియలను సైదాబాద్ దోభిఘాట్ శ్మశానవాటికలో నిర్వహించారు. ప్రణతి మృతి చెందిన సమాచారం అందుకున్న రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ ఆస్పత్రికి చేరుకుని చిన్నారి మృతదేహానికి నివాళులర్పించారు. ప్రణతి అక్క ప్రీతి చదువుకు అయ్యే ఖర్చును భరిస్తామని, ఆర్థికంగా సాయం అందిస్తామని ఎల్బీనగర్ ఏసీపీ పృద్వేందర్రావు తెలిపారు. చిన్నారి అంత్యక్రియలకు పోలీసులు రూ.50 వేలు ప్రణతి కుటుంబసభ్యులకు అందజేశారు. -
మరెన్నో జరుపుకోవాలి
మే నెల ఎన్టీఆర్‌కు చాలా స్పెషల్. తన బర్త్‌డే, మ్యారేజ్ డే.. ఇలా బ్యూటిఫుల్ మూమెంట్స్ అన్నీ మే నెలలో ఉన్నాయి. 2011 మే 5న ఎన్టీఆర్, ప్రణతిల పెళ్లి రోజు. వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా శ్రీమతితో కలిసి దిగిన ఓ సెల్ఫీని తన సోషల్‌మీడియాలో పోస్ట్ చేసి, ‘‘8 ఏళ్లు అయింది. మరెన్నో వెడ్డింగ్ యానివర్సరీలు జరుపుకోవాలని కోరుకుంటున్నాను’’ అని క్యాప్షన్ పెట్టారు ఎన్టీఆర్. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్నారాయన. -
డైరెక్టర్ ప్రదీప్.. సన్నాఫ్ ఏవీఎస్
‘‘ఏవీయస్‌గారు నాకు మంచి మిత్రులు. అద్భుతమైన కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వ్యక్తి. సినిమాలను, సాహిత్యాన్ని ఔపోసన పట్టారు. ‘తుత్తి, రంగు పడుద్ది’ వంటి మేనరిజమ్స్‌ను ఆయన చాలా బాగా వాడేవారు. ఏవీఎస్‌గారు లేని లోటు ఇండస్ట్రీలో ఉంది. ఆయన తనయుడు రాఘవేంద్ర ప్రదీప్ తెరకెక్కించిన ‘వైదేహి’ ట్రైలర్ బావుంది’’ అని డైరెక్టర్ ఎన్. శంకర్ అన్నారు. మహేష్, ప్రణతి, సందీప్, అఖిల, లావణ్య, ప్రవీణ్ ముఖ్య తారలుగా ఏవీయస్ తనయుడు ఎ.రాఘవేంద్ర ప్రదీప్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘వైదేహి’. ఎ.జి.ఆర్. కౌశిక్ సమర్పణలో యాక్టివ్ స్టూడియోస్ పతాకంపై ఎ.జననీ ప్రదీప్ నిర్మిస్తున్నారు. దివంగత నటుడు ఏవీయస్ జయంతిని పురస్కరించుని బుధవారం హైదరాబాద్‌లో ఈ సినిమా ట్రైలర్‌ని ఎన్. శంకర్ విడుదల చేశారు. ఏవీయస్ జయంతి సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ పసుపులేటి రామారావు కేక్ కట్ చేశారు. ఎ.రాఘవేంద్ర ప్రదీప్ మాట్లాడుతూ– ‘‘మా నాన్నగారి జయంతి నాడు మా సినిమా ట్రైలర్ విడుదల చేయడం హ్యాపీ. మా బావగారు నాకు ఇచ్చే సపోర్ట్‌ను మర్చిపోలేను. చాలా సందర్భాల్లో ఆయన మా నాన్నగారిలాగా నన్ను ప్రోత్సహిస్తున్నారు’’ అన్నారు. ‘‘బాపు–రమణగారికి, ఏవీయస్‌గారికి ఉన్న అనుబంధం చాలా గొప్పది. ఏవీయస్‌గారితో నాకూ చక్కటి సాన్నిహిత్యం ఉంది. వాళ్ల అబ్బాయి దర్శకుడు కావడం ఆనందంగా ఉంది’’ అన్నారు పసుపులేటి రామారావు. ఈ సినిమాకు కెమెరా: దేవేంద్ర సూరి, సంగీతం: షారుఖ్. -
ఎన్టీఆర్ చిన్న కొడుకు పేరేంటంటే..!
గత నెల 14న ఎన్టీఆర్ దంపతులకు మగ బిడ్డ జన్మించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ముద్దులొలికే చిన్నారి ఫొటోను అభిమానుల కోసం తన సోషల్ మీడియా పేజ్‌లో షేర్ చేసిన ఎన్టీఆర్ తాజాగా చిన్నారి పేరును రివీల్ చేశారు. తమ రెండో కుమారుడికి భార్గవ రామ్ అని నామకరణం చేశారు ఎన్టీఆర్, ప్రణీత దంపతులు. వీరికి ఇప్పటికే అభయ్ రామ్ అనే కొడుకు ఉన్నాడు. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అరవింద సమేత షూటింగ్లో ఎన్టీఆర్ బిజీగా ఉన్నాడు. పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా రాయలసీమ ఫ్యాక్షన్ డ్రాప్ లో తెరకెక్కుతోంది. ఆ సినిమాలో ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్‌తో సరికొత్త లుక్‌లో దర్శనమివ్వనున్నాడు. The little one is, Bhargava Ram https://t.co/2mp6DTTMO0 — Jr NTR (@tarak9999) 4 July 2018 -
పెద్దోడు.. చిన్నోడు...
ఇటీవలే ఎన్టీఆర్, ప్రణతీలకు బాబు జన్మించిన విషయం తెలిసిందే. ‘‘మా ఫ్యామిలీ కొంచెం పెద్దదైంది’’ అని న్యూస్ బ్రేక్ చేసిన ఎన్టీఆర్, ఇప్పుడు బుజ్జాయి ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఆ ఫొటోలో ఎన్టీఆర్ పెద్ద కుమారుడు అభయ్ రామ్ తమ్ముణ్ని ఒడిలో పడుకోబెట్టుకుని ఉండటం, కొడుకులిద్దర్నీ తండ్రి కెమెరాలో క్యాప్చర్ చేయడం చూడ్డానికి బాగుంది. విశేషం ఏంటంటే.. కొడుకులను మురిపెంగా ఎన్టీఆర్ ఫొటో తీస్తుంటే, భర్త–బిడ్డలు ఉన్న ఫ్రేమ్‌ని ప్రణతి అంతే మురిపెంగా తన కెమెరాలో క్లిక్‌మనిపించారు. ‘‘మా ఇంట్లో ఉన్న బ్యాడ్ బాయ్స్ గ్యాంగ్‌కి ఇంకొకడ్ని వెల్కమ్ చేస్తున్నాం. ఫొటో ప్రణతీ తీసింది. మేం చేయబోయే అల్లరి ఎంతలా ఉండబోతోందో తనకి తెలియదు’’ అని పేర్కొన్నారు ఎన్టీఆర్. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తోన్న ‘అరవింద సమేత వీరరాఘవ’ చిత్రానికి కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చారు ఎన్టీఆర్. బాబుకి టైమ్ కేటాయించడానికి గ్యాప్ తీసుకున్నారని సమాచారం. ఈ సినిమాను అక్టోబర్ 10న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. -
రెండోసారి తండ్రైన ఎన్టీఆర్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ రెండోసారి తండ్రయ్యాడు. తారక్, ప్రణతీ దంపతులకు ఈ రోజు పండంటి మగబిడ్డ జన్మించాడు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు. ‘నా కుటుంబం మరింత పెద్దదైంది. మగ బిడ్డ’ అంటూ ట్వీట్ చేశాడు ఎన్టీఆర్. తారక్ ట్వీట్ చేసిన వెంటనే వారికి సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. తారక సోదరుడు హీరో కల్యాణ్ రామ్ ఎన్టీఆర్‌కు విషెస్ తెలియజేశారు. ఇప్పటికే ఎన్టీఆర్ దంపతులకు అభయ్ రామ్ అనే కొడుకు ఉన్నాడు. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అరవింద సమేత షూటింగ్లో ఎన్టీఆర్ బిజీగా ఉన్నాడు. పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా రాయలసీమ ఫ్యాక్షన్ డ్రాప్ లో తెరకెక్కుతోంది. ఆ సినిమాలో ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్‌తో సరికొత్త లుక్‌లో దర్శనమివ్వనున్నాడు. The family grows bigger. It’s a BOY! — Jr NTR (@tarak9999) 14 June 2018 -
అల్లరి అభయ్
పాలు తాగడానికి కొంత మంది పిల్లలు మారం చేస్తుంటారు. అప్పుడు అమ్మలు కపట కోపాన్ని ప్రదర్శిస్తుంటారు. ఇలాంటి కోపాన్ని నటిస్తూ తనయుడు అభయ్‌తో పాలు తాగించారు ఎన్టీఆర్ భార్య ప్రణతి. ఈ బ్యూటిఫుల్ మూమెంట్‌ని ఎన్టీఆర్ పంచుకుంటూ – ‘‘రోజూ పాలు తాగే విషయంలో వాళ్ల అమ్మ (ప్రణతి) స్ట్రిక్ట్ చూపుల నుంచి అభయ్ తప్పించుకోలేడు’’ అంటూ కోపంగా చూస్తున్న ప్రణతి, పాలు తాగుతున్న అభయ్ ఫొటోను షేర్ చేశారు ఎన్టీఆర్. -
తనే నా దేవత!
వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను మెప్పించి టాలీవుడ్లో మంచి స్థానం సంపాదించుకున్నారు హీరో మంచు మనోజ్. మూడేళ్ల కిత్రం ప్రణతి మెడలో మూడు ముళ్లు వేసి వివాహం చేసుకున్నారు మనోజ్. కానీ సడన్‌గా ఈ దంపతులు విడాకులు తీసుకోబోతున్నారన్న పుకార్లు వచ్చాయి. వీటిపై మనోజ్ ట్వీటర్లో చేసిన చాట్‌లో భాగంగా స్పందించారు. ఆ పుకార్లను నమ్మవద్దని ఆయన పేర్కొన్నారు. ‘‘ 2010లో తను నా జీవితంలోకి అడుగు పెట్టింది. నా గుండె ఆగిపోయేంత వరకు తనే నా దేవత’ అని ఓ అభిమాని ప్రశ్నకు బదులిచ్చారు మనోజ్. అలాగే.. ‘‘మీ సినిమాల్లోనుంచి ఏయే సాంగ్స్‌ను వదినకు డెడికేట్ చేస్తారు’’ అని మరో అభిమాని అడిగిన ప్రశ్నకు మనోజ్ బదులిస్తూ– ‘‘పోటుగాడు’చిత్రంలోని ‘దేవత’, ‘కరెంట్ తీగ’ సినిమాలోని ‘పిల్లా ఓ పిల్లా’ సాంగ్స్‌ను ఆమె కోసమే స్పెషల్‌గా చేశాను’’ అన్నారు. -
చలో బ్యాంకాక్
బ్యాంకాక్ వెళ్లడానికి అన్నీ రెడీ చేసుకుంటున్నారు హీరో రామ్‌చరణ్. సమ్మర్ కదా ఫ్యామిలీ ట్రిప్ అనుకునేరు... కానే కాదు. షూటింగ్ కోసమే. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్‌చరణ్ హీరోగా డీవీవీ దానయ్య ఓ సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో కియారా అద్వానీ కథానాయిక. ఈ చిత్రం నెక్ట్స్ షెడ్యూల్ బ్యాంకాక్‌లో జరగనుంది. అంటే రామ్‌చరణ్ అండ్ టీమ్ బ్యాంకాక్ వెళతారన్న మాట. నిర్మాత దానయ్య మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రం షూటింగ్ స్పీడ్‌గా జరుగుతోంది. హైదరాబాద్‌లో జరిగిన మేజర్ షెడ్యూల్లో ఫ్యామిలీ సన్నివేశాలు, యాక్షన్ ఎపిసోడ్‌ను పూర్తి చేశాం. సినిమాలోని ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరించాం. అంతకముందు షెడ్యూల్లో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్‌పై సన్నివేశాలను షూట్ చేశాం. ఈ నెల 12న బ్యాంకాక్‌లో కొత్త షెడ్యూల్ ప్రారంభం అవుతుంది. ఈ షెడ్యూల్ 15 రోజులపాటు జరగనుంది’’ అన్నారు. ప్రశాంత్, స్నేహ తదితరులు కీలక పాత్రలు చేస్తున్న ఈ సినిమాకు సంగీతం: దేవి శ్రీ ప్రసాద్. శనివారం ఎన్టీఆర్, ప్రణతి దంపతుల మ్యారేజ్ యానీవర్శరీ. ఈ వేడకకు రామ్‌చరణ్, ఆయన సతీమణి ఉపాసన వెళ్లారు. ‘‘తారక్ (ఎన్టీఆర్), ప్రణతిలకు హ్యాపీ యానీవర్శరీ. తారక్, ప్రణతి, అభయ్ (ఎన్టీఆర్ తనయుడు) నా బెస్ట్ ఫ్రెండ్స్ లిస్ట్‌లోకి చేరిపోయారు’’ అని పేర్కొన్నారు ఉపాసన. అన్నట్లు ఇంకోమాట. వచ్చే యానీవర్శరీకి ఇంకో గెస్ట్ కూడా ఉంటారు. అదేనండీ.. ఎన్టీఆర్ సతీమణి ఇప్పుడు ప్రెగ్నెంట్ కదా. వచ్చే ఏడాది అభయ్కు తోడుగా తమ్ముడో, చెల్లెలో ఉంటారు. -
భార్యకు ప్రేమతో టాలీవుడ్ హీరో..
హైదరాబాద్: టాలీవుడ్ హీరో మంచు మనోజ్ ఆయన భార్యకు ప్రేమతో చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నేడు (జూలై 20న) తన భార్య ప్రణతి పుట్టినరోజు సందర్భంగా ఆమెకు ఫేస్బుక్, ట్విట్టర్ ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు మనోజ్. భార్య పుట్టినరోజును సెలబ్రేట్ చేస్తున్న సందర్భంగా తీసిన ఓ ఫొటోను తన ఫాలోయర్స్, అభిమానులతో షేర్ చేసుకున్నాడు. అయితే మనోజ్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ అందరినీ ఆకట్టుకుంటోంది. ‘ నా మనసును దోచుకున్న మహిళకు పుట్టినరోజు శుభాకాంక్షలు. చివరిక్షణం వరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. ఆ తర్వాత కూడా నీపై ప్రేమ అలాగే ఉండిపోతుందంటూ’ మంచు మనోజ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. మనోజ్ అభిమానులు, ఫాలోయర్లు ఈ పోస్ట్ పై స్పందిస్తూ.. ప్రణతికి బర్త్ డే విషెస్ తెలిపారు. వీరి జీవితం ఎంతో ఆనందంగా సాగిపోవాలని మరికొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. Happy bday to the woman who stole my heart and soul. love you till my last and even after :)❤❤ pic.twitter.com/mehNNB2mLc — Manoj Manchu ❤️ -
త్రీ డాటర్స్
కోడళ్లను కూడా కూతుళ్లుగా పెంచుకునే సంస్కారం... మెట్టినింటిని పుట్టిల్లుగా మార్చగల అనుబంధం... ఈ ట్రిపుల్ డాడీది! సుగుణాలు సంస్కారం నుంచి పుట్టుకొస్తాయని... సంస్కారం సంబంధాల నుంచి పుట్టుకొస్తుందని... సంబంధాలు అనుబంధాల నుంచి పుట్టుకొస్తాయని నమ్మే ట్రిపుల్ డాడీ బర్త్‌డే స్పెషల్ ఇది! ⇒ మంచు కుటుంబంలోకి పెద్ద కోడలిగా అడుగుపెట్టే ముందు మీ ఫీలింగ్స్ ఎలా ఉండేవి? విరానిక: యాక్చువల్‌గా చాలా భయపడ్డాను. కొత్తగా ఓ బంధం మొదలయ్యేటప్పుడు భయం, ఆనందం... ఇలా మిక్స్డ్ ఫీలింగ్స్ ఉంటాయి. పైగా అంకుల్ చాలా క్రమశిక్షణ ఉన్న వ్యక్తి. అన్నీ పట్టించుకుంటారు. ఎలా ఉంటుందో అని భయపడ్డాను. నేను అడుగుపెట్టిన మొదటి రోజు ‘లక్ష్మీ నాకు మొదటి కూతురు. నువ్వు రెండో కూతురివి’ అన్నారు. అప్పుడు ఏ కోడలికైనా ఎలా ఉంటుందో మాటల్లో చెప్పక్కర్లేదు. ‘ఇలా ఉండాలి. అలా ఉండకూడదు... ఇవి చెయ్యకూడదు... అవే చెయ్యాలి’ వంటి రిస్ట్రిక్షన్ ఏమీ అంకుల్ పెట్టలేదు. మామూలుగా కోడలు ఇంటిపట్టున ఉండి ఇంటిని చూసుకోవాలని ఏ అత్తమామలైనా కోరుకుంటారు. కానీ, నా అత్త–మామలు మాత్రం అలా కాదు. నేను స్కూల్ వ్యవహరాలు చూసుకుంటాను. ఒక్కోసారి వాటితోనే బిజీగా ఉంటాను. ఆడపిల్లలకు కెరీర్ ఉండాలంటూ ఎంకరేజ్ చేస్తారు. ⇒ మీ భయం పోవడానికి ఎన్నాళ్లు పట్టింది? (నవ్వుతూ). ఓ రెండేళ్లు అనుకోండి. తర్వాత అంకుల్ బాగా అర్థమయ్యారు. ఇప్పుడు మేమిద్దరం మంచి ఫ్రెండ్స్. జోక్స్ వేసుకుంటాం. డైలీ ఈవినింగ్ పావుగంటైనా మాట్లాడుకోవాల్సిందే. రోజంతా ఎలా గడిచింది? అని అడిగి తెలుసుకుంటారు. వెరీ కేరింగ్. ఇప్పుడు ఆయనకు నా మీద ఎంత నమ్మకం అంటే... ఏదైనా ముఖ్యమైన పనులు ఉంటే నాతోనే చెబుతారు. నేను వాటిని చక్కగా పూర్తి చేయగలనని ఆయన నమ్మకం. ⇒ జనరల్‌గా పెళ్లయ్యాక వేరు కాపురం పెట్టేస్తారు. కానీ, ఉమ్మడి కుటుంబంలో అడ్జస్ట్ కాగలిగారు... యాక్చువల్లీ నేను పెద్ద కుటుంబం నుంచి వచ్చినదాన్ని. పెద్ద అంటే మా నాన్నగారి తోడబుట్టినవాళ్లు ఆరుగురు. అమ్మ తోడబుట్టినవాళ్లు నలుగురు. మా అమ్మానాన్నలకు నేను ఒక్కతే కూతుర్ని. పెద్దమ్మా–పెదనాన్న, బాబాయ్.. ఇలా అందరి పిల్లలం కలిపి మాది లార్జ్ ఫ్యామిలీ. బయట ఫ్రెండ్స్‌తో పనే లేనంతమంది మా ఫ్యామిలీలో ఉన్నారు. నాకు జాయింట్ ఫ్యామిలీ అంటే ఇష్టమే. అందుకే పెళ్లవగానే విష్ణుతో వేరే ఇంట్లో ఉండాలని అనుకోలేదు. పెద్దవాళ్లతో కలిసి ఉండటం వల్ల మంచి సపోర్ట్ ఉంటుంది. ఎప్పుడైనా భార్యా–భర్త మధ్య చిన్న చిన్న గొడవలు వస్తే పెద్దవాళ్లు కలగజేసుకుని సర్ది చెబుతుంటారు. ఆ సపోర్టే వేరు. ⇒ ప్రణతి మీ ఫ్రెండే కాబట్టి, తోడికోడళ్ల మధ్య మంచి బంధమే ఉండి ఉంటుంది.. ప్రణతి నాకు చాలా చిన్నప్పట్నుంచీ తెలుసు. చాలా మంచి అమ్మాయి. డౌన్ టు ఎర్త్. ఇంటిని బాగా చూసుకుంటుంది. వెరీ ఇంటిలిజెంట్. అందరితో కలసిపోతుంది. మేమందరం బాగుంటాం. ⇒ బ్రదర్‌కి పెళ్లవుతుందంటే ఏ సిస్టర్కైనా కొంచెం ఇన్‌సెక్యూర్టీ ఉంటుంది. మరి, మీ ఆడపడుచు (లక్ష్మీప్రసన్న)కు ఆ ఫీలింగ్ ఏమైనా ఉండేదా? ఏ అమ్మాయి అయినా బ్రదర్స్ విషయంలో కొంచెం పొసెసివ్‌గా ఉంటుంది. అది తప్పు కాదు. అప్పటివరకూ అక్కాతమ్ముళ్లు మాత్రమే ఉంటారు. సడన్‌గా తమ్ముడి జీవితంలోకి ఓ అమ్మాయి వస్తే... ఎక్కడ తన తమ్ముడు తనకు కాకుండా పోతాడేమోనని ఓ ఇన్‌సెక్యూర్టీ ఉండటం సహజం. నేను ఇంటికి పెద్ద కోడలిని కాబట్టి, నా మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. అందుకే ఈ ఇంటికి వచ్చిన కొత్తలోనే నేను, లక్ష్మీ చాలా ఓపెన్‌గా మాట్లాడుకున్నాం. విష్ణు నాకు భర్తే అయినా... నీకు తమ్ముడు కూడా అనేది కన్వే చేయగలిగాను. తను అర్థం చేసుకుంది. ‘షీ ఈజ్ వెరీ కేరింగ్’. మా మధ్య ఓ‘స్పెషల్ బాండింగ్’ ఏర్పడింది. ⇒ మీ కూతుళ్లు ఆరియానా, వివియానాలో మోహన్‌బాబుగారి లక్షణాలు ఎవరిలో ఎక్కువ? ఆరియానాలోనే. అంకుల్‌లో ఉన్న లీడర్షిప్ క్వాలిటీస్ అన్నీ తనలో ఉన్నాయి. ఆరి నడక, మాటలు అన్నీ అంకుల్ని గుర్తు చేస్తాయి. ఆరీకి మూడేళ్ల వయసప్పుడు అనుకుంటా.. పెద్దయ్యాక ఏమవుతావ్? అని అడిగితే ‘ఐ విల్ బికమ్ అమెరికన్ ప్రెసిడెంట్’ అంది. ఆశ్చర్యపోయాం. లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయని చాలా మురిసిపోయాను. ⇒ ఫైనల్లీ... మంచు కుటుంబం కోడలు అయినందుకు మీ ఫీలింగ్? ‘ఐయామ్ బ్లెస్డ్’. నో డౌట్ అండీ. విష్ణు ఈజ్ ఎ కేరింగ్ హజ్బెండ్. ఇక అంకుల్–ఆంటీ అయితే సూపర్. ఆంటీతో మాట్లాడుతుంటే ఓ అత్తగారితో మాట్లాడుతున్నట్లుగా అనిపించదు. మేమిద్దరం కలసి షాపింగ్‌కి వెళతాం. బోల్డన్ని కబుర్లు చెప్పుకుంటాం. ఇక, అంకుల్ గురించి చెప్పాలంటే... మా అందర్నీ బాగా చూసుకుంటారు. మనవరాళ్ల విషయంలో కేరింగ్‌గా ఉంటారు. ఒక్కోసారి వాళ్లకు స్వయంగా తినిపిస్తుంటారు. ఆడిస్తుంటారు. ఈ కుటుంబంలో ఓ మెంబర్ని అయినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. జీవితంలో ఇంతకన్నా కోరుకునేది ఏమీ ఉండదు. ⇒ మీకు వంట వచ్చా? లేదండీ. బ్యాడ్ కుక్‌ని. పుట్టింట్లో ఉన్నప్పుడు నేర్చుకోలేదు. అత్తగారింట్లోనూ పెద్దగా స్కోప్ లేదు. నాకు, అంకుల్‌కి థాయ్ ఫుడ్స్ ఇష్టం. నాకు అవి చేయడం వచ్చు. మా ఇద్దరి కోసం కుక్ చేస్తుంటాను. ఆ రోజు మాత్రం నేను, అంకుల్ ఫుల్లుగా లాగించేస్తాం. ⇒ కోడళ్లను కూడా కూతుళ్లని మీ నాన్నగారు అంటారు.. మరి... వాళ్లు వచ్చాక మీ స్పేస్ తగ్గిందనే ఫీల్ ఏమైనా? లక్ష్మీప్రసన్న: ఆ ఫీలింగ్ ఎప్పుడూ కలగలేదు. విన్నీ (విష్ణు భార్య విరానికా) మా అందరికన్నా నాన్నకి బాగా దగ్గరైంది. ఇప్పుడు నాకేం కావాలన్నా విన్నీతోనే రికమండేషన్ చేయించుకోవాల్సి వస్తోంది (నవ్వుతూ). మా ఇల్లు దూరం. విష్ణు–విన్నీ నాన్నవాళ్లతోనే ఉంటారు. నాన్నని విన్నీ భలేగా హ్యాండిల్ చేస్తుంది. మాకది తెలియదు. ఇంకో విషయం ఏంటంటే... మా నాన్నకి మా మధ్య పుల్లలు పెట్టి తమాషా చూడటం అలవాటు. మేం గొడవ పడుతుంటే నవ్వుతుంటారు. మేమంతా కలసి మా అమ్మను ఏడిపిస్తుంటే ఆయనకు ఏదో తెలియని సంతోషం. మొన్న మా అమ్మను విన్నీ క్యాజువల్‌గా ఏదో అంది. దాన్ని మా నాన్నగారు పెద్దది చేసి ‘నిమ్మీ (మోహన్‌బాబు భార్య నిర్మల) తను నిన్ను ఏమందో విన్నావా? అసలు అలా అనొచ్చా?’ అని పుల్లలు పెట్టడానికి ట్రై చేస్తే, అమ్మేమో చాలా క్యాజువల్‌గా ‘ఆ.. ఆ.. తెలుసు. పెద్దగా ఏమీ అనలేదే’ అంది. దాంతో విన్నీ, మేమూ నవ్వేశాం. ⇒ మీ తమ్ముళ్ల భార్య (విరానికా, మనోజ్ భార్య ప్రణతి) లతో మీ బాండింగ్? మేం ఏదైనా సరే ఓపెన్‌గా మాట్లాడుకుంటాం. నచ్చని విషయాలుంటే నచ్చలేదని మొహం మీదే చెప్పేస్తాం. ఆ మధ్య ఓ ఫంక్షన్‌కి వెళ్లాం. నేను చీర కట్టుకుని, నగలు పెట్టుకుని గ్రాండ్‌గా రెడీ అయ్యాను. ప్రణతి మామూలు చుడీదార్ వేసుకుని మా ఇంటికి వచ్చింది. ‘ఇంత సింపుల్గానా’ అని నాలుగు తిట్లు తిట్టి, చీర కట్టుకుని రెడీ అవ్వమన్నాను. తనేమనుకున్నా ఫర్వాలేదు. ఆ ఫంక్షన్‌కి నేను చెప్పినట్లు వెళ్లడమే కరెక్ట్ అని నాకనిపించింది. ప్రణతి కూడా నా మాట కాదనలేదు. ఏమైనా అనుకుంటుందేమో అని చెప్పకుండా మనసులో పెట్టుకుని, ఆ తర్వాత సూటీపోటీ మాటలు అనుకోవడంకన్నా, అలా ఫ్రాంక్‌గా మాట్లాడుకుంటే... మనసులో ఏమీ ఉండదు. నేను, విన్నీ, ప్రణతి ముగ్గరం అలానే ఉంటాం. అందుకే మా మధ్య బాండింగ్ బాగుంటుంది. పైగా నా తమ్ముళ్లను వీళ్ల చేతిలో పెట్టాను. వాళ్లను బాగా చూసుకోవాల్సిన బాధ్యత వీళ్లదే. అందుకే నేను వీళ్లను బాగా చూసుకుంటాను. ⇒ మీ ముగ్గురి (అక్కాతమ్ముళ్లు)లో మోహన్‌బాబుగారు చెప్పినవి ఇమ్మీడియట్‌గా పాటించేది ఎవరు? నేను, మనోజ్ వాదిస్తాం. నాన్న బర్త్‌డే (మార్చి, 20) సెలబ్రేషన్స్ కోసం నాన్న, అమ్మ... ఇంకా అందరూ ఓ వారం రోజుల ముందే తిరుపతి వెళ్లారు. నేనేమో తర్వాత వస్తానన్నా. ‘ఎందుకూ... నా బర్త్‌డే రోజు మార్నింగ్ రా’ అన్నారు నాన్న. ఆయన ఏదనుకుంటే అది జరగాల్సిందే. నాన్న ఏది చెబితే అది ఆల్మోస్ట్ చేయడం విష్ణు అలవాటు. నేనూ, మనోజ్ ఫ్రెండ్లీగా వాదిస్తుంటాం. కానీ, ఆయన శాసిస్తే... ఆ మాటను ధిక్కరించే సాహసం మేమెవరం చేయం. ⇒ డైనమిక్‌గా కనిపించే మీ నాన్నగారు భయపడేది? చెబితే నమ్మరేమో. ఆయనకు సూది అంటే భయమండీ బాబూ. చీకటంటే కూడా చాలా భయం. చిన్నప్పుడు మా పాత ఇంట్లో పై గదికి వెళ్లే మెట్లు దగ్గర లైట్లు ఉండేవికావు. అందుకుని నాన్నగారు పైకి వెళ్లాల్సి వచ్చినప్పుడు ఎవరినో ఒకరిని వెంట తీసుకుని వెళ్లేవారు. లైట్లు వేశాక ఆ వ్యక్తిని కిందకు పంపించి వేసేవారు. ఈ విషయంలో మా నాన్నగారిని అమ్మ సరదాగా ఆటపట్టించేవారు. అసలు నాన్న పైకి కఠినంగా కనిపిస్తారు కానీ, లోపల చిన్నపిల్లల మనస్తత్వమే. ఈ మధ్య ఆయనకు షోల్డర్ సర్జరీ అయ్యింది. మొన్న ఒక్కరోజు నేను చూడ్డానికి వెళ్లలేదు. అంతే అలిగారు. ‘నాన్నా... నాకూ ఫ్యామిలీ ఉంది. పాపను చూసుకోవాలి’ అంటే ఓ నవ్వు నవ్వేసి, అంతేలే అన్నారు. ఎప్పుడూ ఆయన చుట్టూ అందరూ ఉండాలని కోరుకుంటారు. ⇒ మీ నాన్నగారి నుంచి మీరు నేర్చుకున్నది... వద్దనుకునేది? నేర్చుకున్నది ముక్కసూటితనం. వద్దనుకుంటున్నది కూడా అదే. ఆయనకు అందరూ సమానమే. తప్పు ఎవరు చేసినా మొహం మీదే చెప్పేస్తారు. నాకేమో అది నచ్చదు. అంత సూటిగా ఎందుకు ఉండటం అనుకుంటా. కానీ, ఎవరి తత్వం వారిది. నా దృష్టిలో మా నాన్నగారు ‘సూపర్ హీరో’. ఆయన లైఫ్ చూసి, ఒక సినిమా హిట్ అయితే ఎంతమంది ఇంటికి వస్తారు? అనేది తెలుసుకున్నా. ఫ్లాప్ అయితే ఇంటివైపు రారనే విషయం కూడా అర్థం చేసుకున్నా. సక్సెస్‌లో ఎలా ఉండాలి అనేకన్నా ఫెయిల్యూర్ ఎదురైనప్పుడు ఎలా ఉండాలో నాన్న లైఫ్ నేర్పించింది. కష్టాల్లో ఉన్నప్పుడు ఎంత ధైర్యాన్ని, నమ్మకాన్ని కూడగట్టుకోవాలో ఆచరించి చూపించారు. ఆయన లైఫ్ మాకు ఓ మంచి లెసన్. ఇవాళ నాన్న ఇంత మంచి పేరు తెచ్చుకున్నారంటే అది ఎవరూ ధారాదత్తం చేసింది కాదు. పగలనకా, రాత్రనకా శ్రమించి సంపాదించుకున్నది. కుటుంబానికి ఆయన పంచే ప్రేమ వండర్ఫుల్. డైలీ ఫోన్ చేసి మాట్లాడతారు. ఆనంద్ (లక్ష్మీప్రసన్న భర్త) ఏం చేస్తున్నాడు? తిన్నాడా? అని అడుగుతారు. మనవరాళ్ల గురించి తెలుసుకుంటారు. నివ్వీ, ఆరీ, వివ్వీ (మనవరాళ్లు)ను కూర్చోబెట్టుకుని ‘తాతయ్య గ్రేట్’, ‘అమ్మమ్మ బ్యాడ్’ అని చెప్పించుకుని, సంబరపడతారు. అమ్మమ్మ అంటే నివ్వీకి చాలా ఇష్టం. అందుకే తాతయ్య ముందు ‘తాతయ్య గ్రేట్’, ‘అమ్మమ్మ బ్యాడ్’ అని... ఆ తర్వాత మా అమ్మ దగ్గరికి వచ్చి ‘సారీ అమ్మమ్మా’ అంటుంది. నాన్న ఆటలన్నీ ఇలానే ఉంటాయి. ⇒ మీ నాన్నగారిలా మీరు డైనమిక్‌గా కనిపిస్తారు కాబట్టి, ఆయన ప్రభావం మీ మీద చాలా ఉందనిపిస్తోంది... కచ్చితంగా ఉంది. చాలామంది నేను నాన్నలానే నడుస్తానని అంటుంటారు. అప్పుడు సంతోషంగా ఉంటుంది. ఒక అమ్మాయిలా నన్నెప్పుడూ ఆయన పెంచలేదు. అబ్బాయిలతో మాట్లాడొద్దు, గట్టిగా నవ్వొద్దనీ మా అమ్మమ్మ చాలా రూల్స్ పెట్టేవారు. నాన్న అలాంటివేమీ చెప్పేవారు కాదు. ఎప్పుడూ ధైర్యంగా ఉండాలనేవారు. ⇒ పుట్టింటి నుంచి మెట్టినింటిలోకి అడుగుపెట్టేటప్పుడు ఏ అమ్మాయికైనా కొన్ని భయాలుంటాయ్... మీకలా? ప్రణతి: విన్నీ నాకు మంచి ఫ్రెండ్. దాంతో నాకు వేరే ఇంటికి వెళుతున్నట్లు అనిపించలేదు. పెళ్లికి ముందు ఒకే ఒక్కసారి మామయ్యగారిని కలిశాను. అది కూడా విన్నీ ద్వారానే. అప్పుడు పెద్దగా ఏం మాట్లాడలేదు. అయినా నాకేం భయంగా అనిపించలేదు. నిజానికి నేను ఎక్కడికో వెళ్లిపోతున్నాను అనే ఫీలింగ్ కలగలేదు. ఒక మంచి ఫ్యామిలీలోకి వెళుతున్నాం అనే ఫీలింగ్‌తోనే ఈ కుటుంబంలోకి వచ్చాను. ⇒ మోహన్‌బాబుగారి గురించి ఏమనిపించింది? మామయ్యగారిని చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంటుంది. జీవితంలో ఎంతో సాధించారు. కొంతమంది ఆర్టిస్టులుగానే మిగిలిపోతారు. కానీ, మామయ్యగారు చదువుకున్న వ్యక్తి. సినిమా ఫీల్డ్‌లో తిరుగులేదనిపించుకున్నారు. పొలిటీషియన్. విద్యావేత్త. టోటల్‌గా సక్సెస్ఫుల్మేన్. అందుకే సొసైటీలో అంత గౌరవం సంపాదించుకోగలిగారు. పేరూ, డబ్బూ సంపాదించుకున్నా ఆయన రిలాక్స్ కాలేదు. ఖాళీగా ఉండరు. ఇటు ఇంట్లో, అటు తిరుపతి స్కూల్లో చిన్న మొక్క నాటడం నుంచి కిచెన్ వరకూ... అన్నీ పట్టించుకుంటారు. ఇంట్లో చిన్న శుభకార్యమైనా అన్నీ దగ్గరుండి చూసుకుంటారు. పండగలంటే అందరం కలసి సెలబ్రేట్ చేసుకోవాల్సిందే. నేను అమెరికాలో ఉండేదాన్ని. నాకు ఇలా కలసి పండగలు చేసుకోవడం ఇవన్నీ తెలియదు. ఇక్కడ ఇలా చేసుకోవడం బాగుంది. అలాగే, ఇంట్లో అందరం కలసి ఏదో అప్పుడప్పుడూ హాలిడే ట్రిప్ వెళ్లాల్సిందే. ఆ ట్రిప్స్‌ని బాగా ఎంజాయ్ చేస్తుంటాం. ⇒ మీకన్నా మీ తోడికోడలు మీ మావయ్యగారికి క్లోజ్ కదా. మీకు అసూయ ఏమైనా? అస్సలు లేదు. విన్నీకి పెళ్లై 8 ఏళ్లు, నా పెళ్లై రెండేళ్లు. అందుకని మావయ్యగారితో ఎలా మాట్లాడాలో విన్నీకి బాగా తెలుసు. సిచ్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేయడంలో తను బెస్ట్. నేను చేయలేనిది తను చేయగలుగుతుంది కాబట్టి, ఐయామ్ హ్యాపీ. ⇒ మీ ఆడపడుచు (లక్ష్మీప్రసన్న) మిమ్మల్ని చుడీదార్ బదులు చీర కట్టుకోమని అన్నానని ఇంతకుముందే చెప్పారు. అప్పుడు కొంచెం కూడా కోపం రాలేదా? కోపం ఎందుకు? చెప్పే హక్కు తనుకుంది. ఏం చెప్పినా నా మంచికే చెబుతుందని నాకు తెలుసు. ఒకవేళ తను అలా ఓపెన్‌గా ఉండకపోతేనే నేను ఫీలవుతా. బయటకు అలా ఫీలింగ్స్ ఎక్స్‌ప్రెస్ చేయడం వల్ల మా బాండింగ్ ఇంకా బలపడింది. ఒకే కుటుంబానికి చెందినవాళ్లెవరైనా ఓపెన్‌గా మాట్లాడుకోవడం మంచిది. అప్పుడే ‘మనమంతా ఒకటే’ అనే ఫీలింగ్ కలుగుతుంది. ⇒ సరే... మీ మావయ్యగారు పెట్టే ‘స్వీట్ టార్చర్’ గురించి ఏమైనా? అదైతే కొంత ఉందండీ. శంషాబాద్ ఇంట్లో మావయ్యగారు ఆర్గానిక్ వెజిటబుల్స్ పండిస్తారు. కూరగాయలు పండించి మా ఇంటికీ, లక్ష్మీ ఇంటికీ పంపిస్తారు. ‘ఇవాళ క్యాబేజ్ పంపించా... వండారా?’ అని ఫోన్ చేసి మరీ అడుగుతారు. ఆరోగ్యానికి మంచివనేవన్నీ కంపల్సరీగా మేం తినాల్సిందే. లేకపోతే ఊరుకోరు. చెబితే నమ్మరేమో... ఎవరైనాసరే కొబ్బరి పువ్వు ఎంత తినగలుగుతారండీ. ఏదో కొంచెం. అంతే కదా. ఒకసారి నాకూ, లక్ష్మీకి బోల్డంత కొబ్బరి పువ్వు పంపించారు. ‘అది మొత్తం తిన్నారా?’ అని ఫోన్ చేసి, అడిగారు. ఏం చెప్పాలో తెలియలేదు (నవ్వుతూ). ప్రతిరోజూ మాతో మాట్లాడాల్సిందే. మావయ్యగారు చాలా కేరింగ్. ⇒ మీ హజ్బెండ్ మనోజ్‌ని మీ నాన్నని చూసి నేర్చుకుంటే బాగుంటుందని అంటుంటారా? అలా చెప్పనండీ. ఎందుకంటే ఎవరి వ్యక్తిత్వం వాళ్లది. నాలా ఇంకొకరు ఉండరు. ఉండలేరు. అలాగే, మావయ్యగారిలా ఆయన మాత్రమే ఉండగలుగుతారు. కాకపోతే మావయ్యగారిలో ఉన్న లక్షణాలు పది శాతం నేర్చుకున్నా చాలు... గొప్పవాళ్లం అయిపోతాం అని మనోజ్‌తో అంటుంటాను. అసలాయన లెవల్ ఆఫ్ థింకింగ్ చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఇంతలా ఆలోచించాలా అనిపిస్తుంది. ఆయనదొక విజన్. పెళ్లి కాకముందు మోహన్‌బాబుగారు ఒక నటుడిగానే నాకు తెలుసు. వివాహం తరువాత ఆయన గొప్పదనం తెలుసుకున్నాను. ఈ స్థాయికి రావడానికి ఆయన ఎంత కష్టపడ్డారు అనేది పెళ్లి తర్వాతే తెలుసుకున్నా. ఇంత ఉన్నత స్థాయికి చేరుకుని... నిగర్విగా ఉండటం అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు. ఆయన విల్పవర్లో పది శాతం అయినా నేర్చుకుని ఆచరణలో పెట్టగలిగితే చాలు. ⇒ మరి... మనవడో... మనవరాలినో ఎప్పుడు గిఫ్ట్‌గా ఇస్తారు? ఆ విషయం గురించి అత్తయ్య–మావయ్య అడుగుతుంటారు. లక్ష్మీ అయితే మా పిల్లలతో కలసి పెరుగుతారు... త్వరగా బిడ్డల్ని కనండి... అంటుంటుంది. దేనికైనా టైమ్ రావాలి. – డి.జి. భవాని -
ఆ అందాలు తనివి తీరనివి
కాకినాడ : గోదావరి అందాలు తనను అబ్బురపరుస్తున్నాయని సినీ హీరోయిన్ ప్రణీత అన్నారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై దేవా కట్టా దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా సొంతంగా రూపొందించిన ‘డైనమైట్’ చిత్రంలో ఆమె హీరోయిన్. ఆ చిత్రం ప్రచారంలో భాగంగా శుక్రవారం స్థానిక జీఎస్ఎల్ వైద్య కళాశాలకు వచ్చిన బృందంలో ఆమె కూడా ఉన్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ గోదావరి తీరం సినిమా షూటింగ్‌లకు ఎంతో అనువైన ప్రాంతమని, ఈ పరిసరాల్లోని దృశ్యాలను ఎన్నిసార్లు చూసినా తనివి తీరదని అన్నారు. ‘అత్తారింటికి దారేది, రభస’లతోపాటు ఇంతవరకు తెలుగులో ఆరు సినిమాలు చేశానన్నారు. ‘డైనమైట్’ వంటి యాక్షన్ థ్రిల్లర్‌లో మొదటిసారిగా నటించానన్నారు. ఈ సినిమా షూటింగ్లో కొన్ని సందర్భాలలో గాయాలైనా ప్రివ్యూ చూశాక ఆ వాటన్నింటినీ మరిచిపోయానని చెప్పారు. ప్రస్తుతం పేరు పెట్టని మరో చిత్రం షూటింగ్లో ఉందన్నారు. ‘బాహుబలి’ వంటి సినిమాల్లో నటించాలని ఉందని, ఏ పాత్ర వచ్చినా చేయడానికి సిద్ధమేనని చెప్పారు. -
మనోజ్ దంపతులకు కేసీఆర్ ఆశీస్సులు
-
మనోజ్ దంపతులకు చంద్రబాబు ఆశీస్సులు