
సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా ఫ్యామిలీతో ఎక్కువ సమయం గడిపేందుకు ప్రయత్నిస్తారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఇక ఫ్యామిలీ ఫోటోలను చాలా అరుదుగా పోస్ట్ చేసే తారక్ ఇటీవలి కాలంలో తన భార్య ప్రణతితో ఉన్న స్పెషల్ మూమెంట్స్‌ను షేర్ చేసుకుంటున్నారు. తాజాగా ప్రణతి పుట్టినరోజు సందర్భంగా ‘హ్యాపీ బర్త్ డే అమ్మలు’.. అంటూ ఓ క్యూట్ ఫోటోను పోస్ట్ చేయగా క్షణాల్లోనే ఆ పిక్ వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే.
భార్య 30వ బర్త్‌డేను మరింత స్పెషల్‌గా చేస్తూ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి బర్త్‌డే పార్టీ ఇచ్చారు తారక్. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.ఇది చూసిన నెటిజన్లు తారక్‌కు భార్య ప్రణతి అంటే ఎంతిష్టమో, క్యూట్ కపుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
కాగా 2011లో ఎన్టీఆర్-లక్ష్మీ ప్రణతిల వివాహం జరగగా, వీరికి అభయ్ రామ్, భార్గవ్ రామ్ సంతానం. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్30లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంతో జాన్వీ కపూర్ టాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment