lakshmi pranati
-
గ్రాండ్‌గా ఎన్టీఆర్ భార్య ప్రణతి బర్త్‌డే సెలబ్రేషన్స్.. ఫోటోలు వైరల్
సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా ఫ్యామిలీతో ఎక్కువ సమయం గడిపేందుకు ప్రయత్నిస్తారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఇక ఫ్యామిలీ ఫోటోలను చాలా అరుదుగా పోస్ట్ చేసే తారక్ ఇటీవలి కాలంలో తన భార్య ప్రణతితో ఉన్న స్పెషల్ మూమెంట్స్‌ను షేర్ చేసుకుంటున్నారు. తాజాగా ప్రణతి పుట్టినరోజు సందర్భంగా ‘హ్యాపీ బర్త్ డే అమ్మలు’.. అంటూ ఓ క్యూట్ ఫోటోను పోస్ట్ చేయగా క్షణాల్లోనే ఆ పిక్ వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. భార్య 30వ బర్త్‌డేను మరింత స్పెషల్‌గా చేస్తూ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి బర్త్‌డే పార్టీ ఇచ్చారు తారక్. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.ఇది చూసిన నెటిజన్లు తారక్‌కు భార్య ప్రణతి అంటే ఎంతిష్టమో, క్యూట్ కపుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా 2011లో ఎన్టీఆర్-లక్ష్మీ ప్రణతిల వివాహం జరగగా, వీరికి అభయ్ రామ్, భార్గవ్ రామ్ సంతానం. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్30లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంతో జాన్వీ కపూర్ టాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తుంది. -
తాతగారు మళ్లీ పుట్టారు!
ఉద్యోగంలో పదోన్నతి లభిస్తే ఎంతో ఆనందం. ఇక జీవితంలోనే పదోన్నతి లభిస్తే.. ఆనందం అంబరాన్నంటుతుంది. ప్రస్తుతం అలాంటి స్థితిలోనే ఉన్నారు ఎన్టీఆర్. కారణం... ఆయనకు తండ్రిగా ప్రమోషన్ రావడమే. ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీప్రణతి మంగళవారం ఉదయం హైదరాబాద్‌లోని రెయిన్బో ఆసుపత్రిలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీ, బిడ్డ క్షేమం. ఈ సందర్భంగా ‘సాక్షి’ ప్రతినిధితో ఎన్టీఆర్ మాట్లాడుతూ,‘‘మళ్లీ తాతగారు పుట్టారు. నా జీవితంలో ఇది మరచిపోలేని రోజు’’ అంటూ సంబరపడిపోయారు. ఎన్టీఆర్ తండ్రి అయినందుకు ఆయన అభిమానుందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆగస్ట్ 1న ‘రభస పాటల పండుగ ఇది ఇలా ఉంటే... సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ కథానాయకునిగా బెల్లంకొండ సురేశ్ సమర్పిస్తున్న ‘రభస’ చిత్రం స్విట్జర్లాండ్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. దాంతో సోమవారం చిత్ర యూనిట్ సభ్యులు హైదరాబాద్ చేరుకున్నారు. ఆ మరుసటి రోజే ఎన్టీఆర్ తండ్రి అయిన వార్త తెలియడంతో.. యూనిట్ సభ్యులు ఆనందం వెలిబుచ్చారు. బెల్లంకొండ సురేశ్ మాట్లాడుతూ -‘‘ఇది నిజంగా శుభవార్త. బుధవారం ముఖ్యతారాగణంపై తీసే షాట్‌తో షూటింగ్ పూర్తవుతుంది. ఓ పక్క పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. తమన్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను ఆగస్ట్ 1న వైభవంగా విడుదల చేస్తాం’’ అని తెలిపారు. యువతరం మెచ్చే కుటుంబ కథగా ‘రభస’ రూపొందుతోందని, ఇందులో ఎన్టీఆర్ స్వయంగా ఓ పాట పాడారని, అది సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని దర్శకుడు చెప్పారు. సమంత కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: శ్యామ్ కె.నాయుడు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఎస్. వెంకటరత్నం, నిర్మాత: బెల్లంకొండ గణేశ్. -
జూనియర్ ఎన్టీఆర్‌కు కొడుకు పుట్టాడు!
-
జూనియర్ ఎన్టీఆర్‌కు కొడుకు పుట్టాడు!
నందమూరి కుటుంబంలో మరో వారసుడు పుట్టాడు. అచ్చం తాత పోలికలతో సినీరంగ ప్రవేశం చేసిన జూనియర్ ఎన్టీఆర్‌కు కొడుకు పుట్టాడు. ఈ విషయాన్ని శ్రేయస్ మీడియా తన అధికారిక ఫేస్బుక్ పేజీ ద్వారా తెలిపింది. బంజారాహిల్స్‌లోని రెయిన్బో ఆస్పత్రిలో ఉదయం 11 గంటలకు ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్లు ఆ పోస్టింగ్‌లో పేర్కొన్నారు. ఈ మేరకు ఎన్టీఆర్‌కు అభినందనలు కూడా తెలియజేశారు. ఆ విషయం చెప్పగానే సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్‌కు అభినందనలు వెల్లువెత్తాయి. (చదవండి: మరికొద్ది రోజుల్లో జూనియర్ ఎన్టీఆర్ కు ప్రమోషన్) కాగా, ఇటీవలి కాలంలో అల్లు అర్జున్‌కు, ఆర్యన్ రాజేష్‌కు కొడుకులు పుట్టారు. లక్ష్మీ మంచు సరొగసీ పద్ధతిలో కూతురిని పొందింది. దీంతో టాలీవుడ్ నటీ నటుల వారసులు ముగ్గురు వరుసగా వచ్చినట్లయింది. Follow @sakshinews