జూనియర్ ఎన్టీఆర్కు కొడుకు పుట్టాడు!
నందమూరి కుటుంబంలో మరో వారసుడు పుట్టాడు. అచ్చం తాత పోలికలతో సినీరంగ ప్రవేశం చేసిన జూనియర్ ఎన్టీఆర్కు కొడుకు పుట్టాడు. ఈ విషయాన్ని శ్రేయస్ మీడియా తన అధికారిక ఫేస్బుక్ పేజీ ద్వారా తెలిపింది.
బంజారాహిల్స్లోని రెయిన్బో ఆస్పత్రిలో ఉదయం 11 గంటలకు ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్లు ఆ పోస్టింగ్లో పేర్కొన్నారు. ఈ మేరకు ఎన్టీఆర్కు అభినందనలు కూడా తెలియజేశారు. ఆ విషయం చెప్పగానే సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్కు అభినందనలు వెల్లువెత్తాయి. (చదవండి: మరికొద్ది రోజుల్లో జూనియర్ ఎన్టీఆర్ కు ప్రమోషన్)
కాగా, ఇటీవలి కాలంలో అల్లు అర్జున్కు, ఆర్యన్ రాజేష్కు కొడుకులు పుట్టారు. లక్ష్మీ మంచు సరొగసీ పద్ధతిలో కూతురిని పొందింది. దీంతో టాలీవుడ్ నటీ నటుల వారసులు ముగ్గురు వరుసగా వచ్చినట్లయింది.