‘పుష్ప- 2పై కొందరికి జెలసీగా ఉంది’ | YSRCP Ambati Reacts On Anti Pushpa 2 Campaign In Social Media | Sakshi
Sakshi News home page

‘పుష్ప- 2పై కొందరికి జెలసీగా ఉంది’

Published Mon, Nov 25 2024 2:33 PM | Last Updated on Mon, Nov 25 2024 2:57 PM

YSRCP Ambati Reacts On Anti Pushpa 2 Campaign In Social Media

గుంటూరు, సాక్షి: అల్లు అర్జున్‌ పుష్ప-2 చిత్రంపై సోషల్‌ మీడియాలో నడుస్తున్న ట్రోలింగ్‌పై మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. గుంటూరులో సోషల్‌ మీడియా అరెస్టుల అంశంపై ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. పనిగట్టుకుని కొందరు ఆ చిత్రంపై పోస్టులు చేయడం గురించి ప్రస్తావించారు. 

‘అల్లు అర్జున్ సినిమాను చూడకుండా ఎవరూ ఆపలేరు. అతనొక ఇంటర్నేషనల్ స్టార్. పుష్ప-2 అడ్డుకోవడం ఎవరి వల్ల కాదు. గతంలో జూనియర్ ఎన్టీఆర్ సినిమాలను కూడా అడ్డుకోవాలనుకున్నారు. ఏమైంది?.. సినిమా బాగుంటే ఎవరైనా చూస్తారు. పుష్ప-2 కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. 

.. నేను కూడా ఆ సినిమా చూడడానికి రెడీగా ఉన్నాను.మొదటి పార్ట్ అద్భుతంగా ఉంది.పుష్ప-2పై కొంతమందికి జెలసీగా ఉంది. అరచేతిని అడ్డుపెట్టుకుని ఒక సినిమా విజయాన్ని ఆపలేరు. ఎన్టీఆర్, అల్లు అర్జున్‌ చిత్రాలను అడ్డుకోవాలనుకోవడం అవివేకం’అని అంబటి అన్నారు.

Ambati Rambabu: పుష్ప రాజ్ ఇంటర్నేషనల్ స్టార్..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement