
ఓపెన్ఏఐ సీఈఓ 'శామ్ ఆల్ట్‌మాన్'.. మగబిడ్డకు స్వాగతం పలికారు. ఈ విషయాన్ని తన ఎక్స్ ఖాతాలో అధికారికంగా వెల్లడించారు. ఫోటో కూడా షేర్ చేశారు.
ప్రపంచానికి స్వాగతం, చిన్నవాడా!, అని పేర్కొంటూ శామ్ ఆల్ట్‌మాన్.. బిడ్డ చేతిని చూపుడు వేలుతో పట్టుకున్న ఫోటో షేర్ చేశారు. తన బిడ్డ ముందుగానే జన్మించినట్లు, ప్రస్తుతం నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (NICU)లో వైద్య సంరక్షణలో ఉన్నట్లు వెల్లడించారు. నేను ఇంత ప్రేమను ఎప్పుడూ అనుభవించలేదని అన్నారు.
శామ్ ఆల్ట్‌మాన్ వెల్లడించిన ఈ విషయంపై.. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల స్పందించారు. "నా హృదయపూర్వక అభినందనలు, శామ్! పేరెంట్‌హుడ్ అనేది జీవితంలో అత్యంత గొప్ప అనుభవాలలో ఒకటి. మీకు.. మీ కుటుంబానికి శుభాకాంక్షలు" అని ట్వీట్ చేశారు. పలువురు నెటిజన్లు కూడా శుభాకాంక్షలు చెబుతున్నారు.
ఇదీ చదవండి: బిలియనీర్ కుమార్తె జైలు కష్టాలు: ఆహారం, నీరు ఇవ్వడానికి కూడా..
శామ్ ఆల్ట్‌మాన్.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆలివర్ ముల్హెరిన్‌ను వివాహం చేసుకున్నారు. ఈ జంట సముద్రతీర ప్రదేశంలో ఉంగరాలు మార్చుకుంటున్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వీరు జంటగా కనిపించిన సందర్భాలు చాలా తక్కువ.
My heartfelt congratulations, @sama! Parenthood is one of life’s most profound and rewarding experiences. Wishing you and your family the very best.
— Satya Nadella (@satyanadella) February 22, 2025
Comments
Please login to add a commentAdd a comment