
జిబ్లీ స్టైల్ ఫోటోలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్న సమయంలో.. ఓపెన్ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మాన్ మరో ట్రెండ్‌కు శ్రీకారం చుట్టారు. యానిమే స్టైల్ ఫోటోను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసారు. ఇది ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అయింది. దీనిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
శామ్ ఆల్ట్‌మాన్ యానిమే స్టైల్ ఫోటో గమనించినట్లయితే.. ఆల్ట్‌మాన్ టీమిండియా జెర్సీ వేసుకుని, చేతిలో బ్యాట్ పట్టుకుని.. కళ్ళు బంతిని చూస్తున్నట్లు ఉండటం చూడవచ్చు. మొత్తానికి శామ్ ఆల్ట్‌మాన్ క్రికెటర్ అవతారమెత్తాడు. ఫోటో షేర్ చేస్తూ.. ''ప్రాంప్ట్: యానిమే స్టైల్‌లో క్రికెట్ ఆటగాడిగా శామ్ ఆల్ట్‌మాన్'' అని పేర్కొన్నాడు.
శామ్ ఆల్ట్‌మాన్ టీమిండియా జెర్సీ వేసుకోవడం చాలామందిని ఆకర్శించింది. మీరు ఇండియా తరపున ఆడుతున్నావా?, అని ఒకరు కామెంట్ చేస్తే.. మరొకరు భారతీయ వినియోగదారులను ఆకర్శించడానికి శామ్ ప్రయత్నిస్తున్నాడని అన్నారు.
ఇదీ చదవండి: మారిన రూల్స్.. ఆ టికెట్‌తో ట్రైన్ జర్నీ కుదరదు!
భారతదేశం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)లో ఆధిపత్యాన్ని చెలాయిస్తూ.. ప్రపంచాన్ని అధిగమిస్తోందని చెప్పిన కొన్ని గంటల తరువాత ఆల్ట్‌మాన్ ఈ పోస్ట్ చేశారు. ఫిబ్రవరిలో భారతదేశ పర్యటన సందర్భంగా కూడా ఏఐ రంగంలో ఇండియా ప్రాముఖ్యతను శామ్ హైలెట్ చేశారు.
Are you playing for India?
— RB - The Peace Coach (@rajeshbmore) April 2, 2025