Sam Altman
-
చైనాతో పోటీ.. ఓపెన్ఏఐ సరికొత్త ప్లాన్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ను అభివృద్ధి చేసుకోవడానికి మాత్రమే కాకుండా.. చైనాతో పోటీ పడేందుకు కావలసిన అవసరమైన మౌలిక సదుపాయాలకు ఏర్పాటు చేసుకోవాలని ఓపెన్ఏఐ పిలుపునిచ్చింది. దీనికోసం యూఎస్.. దాని మిత్రదేశాలు కలిసి పనిచేయాలని కోరింది. వాషింగ్టన్లో జరిగిన సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ నిర్వహించిన కార్యక్రమంలో ఓపెన్ఏఐ కొత్త పాలసీ బ్లూప్రింట్‌లో ఈ ప్రతిపాదన వెల్లడించింది.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో అమెరికా తన ఆధిక్యాన్ని ఎలా కొనసాగించగలదో ఓపెన్ఏఐ వివరించింది. ఇదే జరిగితే యూఎస్ మిత్ర దేశాలు లేదా భాగస్వాములు గ్లోబల్ నెట్వర్క్ కూడా పెరుగుతుంది. చైనా నుంచి మన దేశాన్ని, మిత్ర దేశాలను రక్షించుకోవడానికి ఏఐ ఆవశ్యకతను కూడా ఓపెన్ఏఐ వెల్లడించింది.దేశం వేగంగా అభివృద్ధి చెందడానికి ఏఐ ఓ అద్భుతమైన అవకాశం అని వెల్లడించింది. ప్రజాస్వామ్య విలువలతో కూడిన ఏఐను అందించడం, సాధ్యమైనంత ఎక్కువ మందికి ప్రయోజనం చేకూర్చడం వంటివి కూడా ఏఐ ద్వారా సాధ్యమవుతుందని స్పష్టం చేసింది.ఇదీ చదవండి: ఎక్కువమంది కామన్ పాస్వర్డ్లు ఇవే.. చూస్తే ఆశ్చర్యపోతారు!ఏఐను అభివృద్ధి చేయడానికి అవసరమైన చిప్స్, పవర్, డేటా సెంటర్ల సరఫరాను విస్తరించేందుకు ఓపెన్ఏఐ గతంలో కూడా ప్రయత్నించింది. దీనికోసం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సామ్ ఆల్ట్మాన్ యూఎస్ అధికారులతో సమావేశమై ప్రణాళికను రూపొందించారు. ఇప్పుడు అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ కూడా ఏఐను అభివృద్ధి చేయడానికి సుముఖత చూపుతున్నారు. కాబట్టి అగ్రరాజ్యంలో ఏఐ టెక్నాలజీ మరింత అభివృద్ధి చెందుతుందని స్పష్టమవుతోంది. -
ఓపెన్ఏఐ చేతికి రూ.126 కోట్ల డొమైన్
ఓపెన్ఏఐ పురాతన డొమైన్ పేర్లలో ఒకటైన 'చాట్.కామ్'ను హబ్స్పాట్ ఫౌండర్ 'ధర్మేష్ షా' నుంచి 15 మిలియన్లకు (సుమారు రూ.126 కోట్లు) కొనుగోలు చేసింది. మార్చిలో ధర్మేష్ షా చాట్.కామ్ డొమైన్‌ను విక్రయించారు. అయితే అప్పట్లో దీనిని ఎవరికి విక్రయించారు అనే విషయాన్ని ఆయన వెల్లడించలేదు.సెప్టెంబర్ 1996లో రిజిస్టర్ అయిన చాట్.కామ్ వానిటీ డొమైన్‌ను వానిటీ డొమైన్ అని కూడా పిలుస్తారు. దీనిని ఓపెన్ ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్మాన్ కొనుగోలు చేసినట్లు.. ధర్మేష్ షా తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు. ఇప్పుడు వెబ్‌సైట్‌ను క్లిక్ చేస్తే.. అది చాట్‌జీపీటీకి వెళ్తుంది. సామ్ ఆల్ట్మాన్ కూడా తన ఎక్స్ ఖాతాలో చాట్.కామ్ అని పేర్కొన్నారు.అత్యంత ప్రజాదరణ పొందిన ఏఐ చాట్‌బాట్ చాట్‌జీపీటీని.. ప్రపంచ వ్యాప్తంగా మరింత ఎక్కువ మంది ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి ఓపెన్ఏఐ చాట్.కామ్ కొనుగోలు చేసినట్లు సమాచారం. చాట్.కామ్ కొనుగోలుకు ఎంత మొత్తం వెచ్చించారు అనేది సామ్ ఆల్ట్మాన్ అధికారికంగా వెల్లడించలేదు.ఇదీ చదవండి: లేటు వయసులో రెండో పెళ్లికి రెడీ అయిన ప్రపంచ కుబేరుడు.. ఆరేళ్లుగా!నిజానికి వానిటీ డొమైన్లు చాలా విలువైనవి. ఎందుకంటే.. చిన్నవిగా ఉండటం వల్ల ఉచ్చరించడానికి మాత్రమే కాకుండా, గుర్తుంచుకోవడానికి కూడా సులభంగా ఉంటుంది. కాబట్టి ఎక్కువమంది యూజర్లు ఇలాంటి పేర్లను సులభంగా గుర్తుంచుకుని సెర్చ్ చేస్తారు. దీనివల్ల ఇలాంటి డొమైన్స్ ధర కొంత అధికం.BREAKING NEWS: Secret acquirer of $15+ million domain chat .com revealed and it's exactly who you'd think.For those of you that have been following me for a while, you may recall that I announced earlier this year that I had acquired the domain chat .com for an "8 figure sum"… https://t.co/nv1IyddP5z— dharmesh (@dharmesh) November 6, 2024 -
ఉద్యోగాల్లో పెను మార్పులు సంభవిస్తాయి: శామ్ ఆల్ట్‌మన్
మారుతున్న కాలంతో పాటు మనిషి కూడా మారుతూ ఉండాలి. లేకుంటే మనుగడ కష్టమవుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వచ్చిన తరువాత చాలామంది ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని నిపుణులు పేర్కొన్నారు. దీనిపై తాజాగా ఓపెన్ఏఐ సీఈఓ 'శామ్ ఆల్ట్‌మన్' స్పందించారు.ఏఐ వల్ల ఉద్యోగాల్లో పెను మార్పులు సంభవిస్తాయనే మాట నిజమే.. కానీ ఉద్యోగుల్లో కూడా మార్పు వస్తుందని ఆల్ట్‌మన్ అన్నారు. ఏఐ ఉద్యోగులకు పని లేకుండా చేస్తుందేమో అని భయం ఎవరికీ ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనిషి సృజనాత్మకతతో మరిన్ని మార్గాలను అన్వేషించగలడు. ఇదే వారి సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది.ఈ రోజు చేస్తున్న ఉద్యోగాలు కొన్ని సంవత్సరాల క్రితం లేదు, అదే విధంగా ఇప్పుడు మనం చేస్తున్న ఉద్యోగాలు రాబోయే తరాలకు చాలా చిన్నవిగా లేదా అనవసరమైనవిగా కూడా అనిపించవచ్చు. కొత్తగా వచ్చిన మార్పులను మనిషి ఎలా స్వీకరించారో.. ఏఐ వల్ల వచ్చే మార్పులను కూడా స్వీకరించడానికి కూడా సిద్ధంగా ఉండాలని ఆల్ట్‌మన్ అన్నారు. ఏఐ ఉద్యోగుల మీద మాత్రమే కాకుండా.. సమాజం మీద కూడా ప్రభావం చూపుతుందని అన్నారు.ఇదీ చదవండి: ఎక్స్‌లో బ్లాక్ బటన్ తొలగింపు: మస్క్ ట్వీట్ వైరల్ఈ రోజు ఏఐ ఎంతలా విస్తరించింది అంటే.. విద్య, వైద్యం వంటి చాలా రంగాల్లో గణనీయమైన మార్పులు తీసుకురావడంలో ఏఐ పెద్ద పాత్ర పోషిస్తోంది. కాబట్టి ఏఐ రాక జీవితాలను ఇప్పుడున్నదానికంటే ఉన్నతంగా మార్చుకోవడానికి సహాయపడుతుందని అన్నారు. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. టెక్నాలజీని చాలా జాగ్రత్తగా వినియోగించుకోవాలని ఆల్ట్‌మన్ హెచ్చరించారు. ఏఐ వల్ల అనుకూల ప్రయోజనాలు మాత్రమే కాకుండా.. ప్రతికూలతలు ఉన్నాయని అన్నారు. -
ఏఐ కంపెనీని స్థాపించిన చాట్‌జీపీటీ కోఫౌండర్
ఓపెన్ఏఐ ఆధ్వర్యంలోని చాట్‌జీపీటీ సహ వ్యవస్థాపకుడు, మాజీ చీఫ్ సైంటిస్ట్ ఇల్యా సట్స్కేవర్ కొత్త ఏఐ కంపెనీని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఈమేరకు ఆయన తన ఎక్స్‌ఖాతాలో పోస్ట్ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘జనరేటివ్ ఏఐకు భవిష్యత్తులో భారీ డిమాండ్ ఉంటుంది. కొన్ని పెద్ద కంపెనీలే ఈ రంగంలో ఆధిపత్యం చలాయిస్తున్నాయి. నేను స్థాపించిన కొత్త కంపెనీ ‘సేఫ్ సూపర్ ఇంటెలిజెన్స్’ సురక్షితమైన ఏఐ వాతావరణాన్ని సృష్టిస్తుంది. అమెరికాలోని పాలో ఆల్టో, టెల్ అవీవ్ల్లో సంస్థ కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నాం. మా వ్యాపార నమూనా సేఫ్టీ, సెక్యూరిటీ, పురోగతి వంటి కీలక అంశాలపై ఆధారపడుతుంది’ అన్నారు.గత ఏడాది నవంబర్‌లో ఓపెన్ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్మాన్తోపాటు సట్స్కేవర్ను కూడా ఉద్యోగం నుంచి తొలగించారు. సామ్‌ను తొలగిస్తున్నట్లు ప్రకటించిన తర్వాత ఆయన మైక్రోసాఫ్ట్‌తో చర్చలు జరిపారు. కానీ నాటకీయ పరిణామాల తర్వాత తిరిగి ఓపెన్ఏఐలోని కొనసాగుతున్నట్లు ప్రకటనలు వెలువడ్డాయి. కానీ సామ్‌తో పాటు ఉద్యోగం నుంచి తొలగించబడిన సట్స్కేవర్ను తిరిగి బోర్డులో చేర్చుకోలేదు. దాంతో ఆయన కొత్త కంపెనీ పనులు ప్రారంభించారు. ఇటీవల అందుకు సంబంధించిన ప్రకటన చేశారు.ఇదీ చదవండి: కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డుల ఉపయోగాలివే..సట్స్కేవర్తో పాటు మాజీ ఓపెన్ఏఐ సైంటిస్ట్ డేనియల్ లెవీ, ‘క్యూ’ కంపెనీ సహ వ్యవస్థాపకుడు, యాపిల్‌లో మాజీ ఏఐ లీడ్‌గా వ్యవహరించిన డేనియల్ గ్రాస్ సేఫ్ సూపర్ ఇంటెలిజెన్స్ కోఫౌండర్లుగా చేరారు. -
వివాదంలో చాట్‌జీపీటీ.. అడ్డంగా బుక్కైన సీఈఓ శామ్ ఆల్ట్‌మన్
ఓపెన్ ఏఐ సీఈఓ, చాట్‌జీపీటీ సృష్టికర్త శామ్ ఆల్ట్‌మన్ అడ్డంగా దొరికిపోయారు. ఇక చేసిది లేక తన చాట్‌జీపీటీ స్కై వాయిస్‌ను నిలిపి వేశారు.యాపిల్ సిరి వాయిస్ అసిస్టెంట్, అమెజాన్ అలెక్సా వాయిస్ అసిస్టెంట్ తరహాలో చాట్ జీపీటీ యూజర్లకు వాయిస్ అసిస్టెంట్ సేవల్ని అందించేందుకు సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ పనిచేస్తున్నారు. స్కై వాయిస్ పేరుతో తెచ్చే ఈ ఫీచర్లో ప్రముఖుల వాయిస్ వినిపిస్తుంది. మీకు ఎవరి వాయిస్ కావాలనుకుంటారో.. దాన్ని సెలక్ట్ చేసుకుంటే చాట్ జీపీటీ సమాధానాల్ని టెక్ట్స్ కాకుండా వాయిస్‌లో రూపంలో అందిస్తుంది.నా అనుమతి లేకుండా నా వాయిస్‌ను దీన్ని డెవలప్ చేసే సమయంలో శామ్ ఆల్ట్‌మన్.. అద్భుత నటిగా, అత్యధిక పారితోషికం అందుకుంటున్న ఫిమేల్ యాక్టర్‌గా, హాలీవుడ్‌లోని ఎన్నో ప్రముఖ చిత్రాల్లో నటించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ స్కార్లెట్ జాన్సన్ వాయిస్‌ను వినియోగించారు. దీంతో తనని సంప్రదించకుండా తన వాయిస్‌ను కాపీ చేసి చాట్‌జీపీటీ స్కైవాయిస్‌లో ఎలా వినియోగిస్తారంటూ స్కార్లెట్ జాన్సన్.. ఓపెన్ ఏఐ సీఈఓపై ఆరోపణలు గుప్పిస్తున్నారు.వేరే ప్రొఫెషనల్ నటికి చెందినదనిఆరోపణలపై శామ్ ఆల్ట్‌మన్ స్పందించారు. కంపెనీనీ ప్రశ్నార్థకంలో పడేసి చాట్‌జీపీటీ వాయిస్‌ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. అదే సమయంలో స్కై సిస్టమ్ వాయిస్ స్కార్లెట్ జాన్సన్‌ది కాదని, వేరే ప్రొఫెషనల్ నటికి చెందినదని తెలిపారు. స్కార్లెట్ జాన్సన్ ఏమన్నారంటే తన వాయిస్‌ను ఓపెన్ ఏఐ కాపీ చేయడంపై అవెంజర్ ముద్దుగమ్మ స్కార్లెట్ జాన్సన్ మాట్లాడుతూ.. ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ చాట్‌జీపీటీ వాయిస్ ఆప్షన్ కోసం గతేడాది సెప్టెంబర్‌లో నన్ను సంప్రదించారు.అయితే, ఆ ఆఫర్‌ను నేను తిరస్కరించా. అయినప్పటికీ ఆల్ట్‌మన్ తనలాగే వినిపించే 'చాట్‌జీపీటీ 4.0 సిస్టమ్' కోసం నా ప్రమేయం లేకుండా నా వాయిస్‌ని ఉపయోగించుకున్నారు’ అని ఆరోపించారు. జాన్సన్ ఆరోపణల్ని ఖండించిన ఓపెన్ఏఐ అయితే స్కార్లెట్ జాన్సన్ వ్యాఖ్యల్ని శామ్ ఆల్ట్‌మన్ ఖండించారు. చాట్‌జీపీటీ స్కై వాయిస్ స్కార్లెట్ జాన్సన్ వాయిస్ కాదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జాన్సన్ పట్ల ఉన్న గౌరవంతో మేం మా ప్రొడక్ట్‌లలో స్కై వాయిస్ ఉపయోగించడం నిలిపివేశాము. ఈ విషయంలో జాన్సన్‌కు తగిన విధంగా సమాచారం అందించకపోవడం క్షమాపణలు చెప్పారు. -
పదేళ్ల తర్వాత.. చాట్‌జీపీటీ కంపెనీ కోఫౌండర్ సంచలన నిర్ణయం!
కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో అగ్రగామిగా పేరొందిన ఓపెన్ఏఐ (OpenAI) సహ వ్యవస్థాపకుడు ఇల్యా సుట్స్కేవర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కంపెనీని స్థాపించిన ఇన్నేళ్లకు సంస్థను వీడుతున్నట్లు తాజాగా ప్రకటించారు."దాదాపు ఒక దశాబ్దం తర్వాత, నేను ఓపెన్ఏఐ నుంచి నిష్క్రమించాలని నిర్ణయం తీసుకున్నాను" అని సుట్స్కేవర్ ‘ఎక్స్’ (ట్విటర్)లో ఒక పోస్ట్‌లో చెప్పారు. ఇతర కోఫౌండర్లు సామ్ ఆల్ట్‌మన్, గ్రెగ్ బ్రాక్‌మన్, సీటీవో మిరా మురాతి, జాకబ్ పచోకీల నాయకత్వంలో కంపెనీ మరింత పురోగమిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అలాగే తాను మరో ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. దానికి సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడిస్తానన్నారు.ఓపెన్ఏఐ అనేది ఇటీవల చాలా పాపులర్ అయిన చాట్‌బాట్ ‘చాట్ జీపీటీ’ నిర్వహణ సంస్థ. మైక్రోసాఫ్ట్ మద్దతు గల ఈ కంపెనీ సీఈఓ సామ్ ఆల్ట్మాన్ మాట్లాడుతూ.. ఓపెన్ఏఐ కంపెనీ నేడు ఈ స్థాయిలో ఉందంటే దానికి కారణం సుట్స్కేవర్ అని, ఆయన లేకుంటే సంస్థ ఇలా ఉండేది కాదని పేర్కొన్నారు. జాకుబ్ పచోకీ కంపెనీకి కొత్త చీఫ్ సైంటిస్ట్ అవుతారని చెప్పారు. పచోకి గతంలో ఓపెన్ పరిశోధన డైరెక్టర్‌గా పనిచేశారు. GPT-4, ఓపెన్ఏఐ ఫైవ్ అభివృద్ధికి నాయకత్వం వహించారు.After almost a decade, I have made the decision to leave OpenAI. The company’s trajectory has been nothing short of miraculous, and I’m confident that OpenAI will build AGI that is both safe and beneficial under the leadership of @sama, @gdb, @miramurati and now, under the…— Ilya Sutskever (@ilyasut) May 14, 2024 -
చాట్‌జీపీటీలో మరో కీలక పరిణామం!
ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ తిరిగి సంస్థ బోర్డ్ సభ్యుడిగా అడుగుపెట్టారు. గత ఏడాది సీఈఓగా ఆల్ట్‌మన్‌ని తొలగిస్తూ సంస్థ బోర్డ్ మెంబర్స్ నిర్ణయం తీసుకోవడం ఓ సంచలనం. అయితే కంపెనీలో ఆల్ట్‌మన్ తొలగింపుతో ఓపెన్ఏఐ పరిస్థితులపై న్యాయ సంస్థ విల్మర్హేల్ రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టింది. తాజాగా, సంస్థలో పరిస్థితులు చక్కబడడంతో దర్యాప్తు నిలిపివేసింది. ఆల్ట్‌మన్ సైతం బోర్డ్లోకి వచ్చినట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా ఓపెన్ ఏఐ బోర్డ్లోకి ఆల్ట్ మన్తో పాటు బోర్డ్లోకి బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ మాజీ సీఈవో స్యూ డెస్మండ్-హెల్ మన్, సోనీ ఎంటర్ టైన్ మెంట్ మాజీ అధ్యక్షుడు నికోల్ సెలిగ్ మన్, ఇన్ స్టాకార్ట్ సీఈఓ ఫిడ్జీ సిమోలను కొత్త డైరెక్టర్లుగా బాధ్యతలు చేపట్టారు. ఆల్ట్ మన్ కొత్త బోర్డు సభ్యులను స్వాగతించారు. కంపెనీ భవిష్యత్ లక్ష్యాల్ని వారికి వివరించారు. -
‘తప్పు చేస్తున్నావ్ ఆల్ట్‌మన్’.. చాట్‌జీపీటీ సృష్టికర్తపై మస్క్ ఆగ్రహం!
అపరకుబేరుడు ఎలోన్ మస్క్ కోర్టు మెట్లెక్కారు. 2015 చాట్‌జీపీటీ తయారీలో కుదుర్చుకున్న కాంట్రాక్ట్‌ను ఉల్లంఘించారంటూ చాట్‌జీపీటీ సృష్టికర్త, ఓపెన్ ఏఐ కో-ఫౌండర్ సామ్ ఆల్ట్‌మాన్‌తో పాటు పలువురిపై శాన్ఫ్రాన్సిస్కో కోర్టులో దావా వేశారు. దావాలో సామ్ ఆల్ట్మాన్, ఓపెన్ఏఐ సహ వ్యవస్థాపకుడు గ్రెగ్ బ్రాక్‌మాన్‌తో కలిసి మానవాళికి ప్రయోజనం చేకూర్చేలా లాభపేక్షలేకుండా కృత్రిమ మేధస్సు సాంకేతికతను అభివృద్ధి చేసేలా మస్క్‌ను కలిశారు. అప్పటికే వ్యాపార రంగంలో అప్రతిహతంగా కొనసాగుతున్న మస్క్‌ను వ్యాపారం, ఆర్ధికంగా మద్దతు కావాలని కోరారు. మస్క్‌తో కలిసి ఉమ్మడిగా ఓపెన్ఏఐ సంస్థను ఏర్పాటు చేశారు. చాట్ జీపీటీపై పనిచేశారు. అయితే ఆ సమయంలో మస్క్-ఆల్ట్‌మన్‌లు ఓ బిజినెస్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. ఇప్పుడు దానిని ఆల్ట్‌మన్ అతిక్రమించారంటూ కోర్టులో వేసిన దావాలో మస్క్ తరుపు న్యాయ వాదులు పేర్కొన్నారు. అయితే, తనతో ఆల్ట్‌మన్ ఒప్పందం కుదుర్చుకున్నట్లగా కాకుండా కంపెనీ ఇప్పుడు లాభపేక్షతో వ్యాపారం చేస్తూ ఆ అగ్రిమెంట్ నిబంధనల్ని ఉల్లంఘించినట్లు ఎలోన్ మస్క్ తరపు న్యాయవాదులు వ్యాజ్యంలో హైలెట్ చేశారు. ఈ దావాపై ఓపెన్ ఏఐ, ఆ కంపెనీకి మద్దతిస్తున్న మైక్రోసాఫ్ట్, ఇటు ఎలోన్ మస్క్‌లు స్పందించాల్సి ఉంది. చదవండి👉 ఇంతకీ ఈ రామేశ్వరం కేఫ్ ఎవరిది? -
ప్రపంచ టెక్ సంస్థలకు సీఈవోలు.. ఈ ‘గే’లు..
ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ ఇటీవల తన బాయ్‌ఫ్రెండ్ ఆలివర్ మల్హెరిన్‌ను వివాహం చేసుకున్నారు. ఈమేరకు వివాహానికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. అయితే చాలామంది ఆ ఫొటోలను ఏఐ రూపొందించిందా అని అభిప్రాయపడ్డారు. డీప్‌ఫేక్ అందుబాటులోకి రావడంతో ఇలాంటి అనుమానాలు రావడం సహజం. దాంతో ఆల్ట్‌మన్ తన పెళ్లిపై స్పందిస్తూ ఓ ప్రముఖ మీడియా సంస్థతో ఈ విషయాన్ని ధ్రువీకరించారు. హైస్కూల్లో చదువుతున్న సమయంలోనే తాను ‘గే’నని ఆల్ట్‌మన్ ప్రకటించారు. తొమ్మిదేళ్ల పాటు లూప్ట్ సంస్థ సహ వ్యవస్థాపకుడు నిక్ సివోతో డేటింగ్ చేసి 2012లో శామ్ విడిపోయారు. ప్రపంచ దిగ్గజ టెక్ కంపెనీలకు సారథ్యం వహిస్తున్న సీఈఓలు తమ వ్యక్తిగత జీవితంలో తీసుకునే నిర్ణయాలను కొందరు వ్యతిరేకిస్తారు, మరికొందరు ఆహ్వానిస్తారు. ఏదిఏమైనా వారు తమ జీవితంలో ఏ నిర్ణయం తీసుకోవడానికైనా పూర్తి హక్కు ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా చాలా కంపెనీల సీఈవోలు తమనుతాము ‘గే’గా ప్రకటించుకుని వారి జీవితాల్లో సంతోషంగా ఉన్నట్లు చెబుతున్నారు. వారిలో కొందరి వివరాలు కొంద తెలుపబడ్డాయి. శామ్ ఆల్ట్‌మన్, ఓపెన్ ఏఐ సీఈవో హైస్కూల్లో 17 సంవత్సరాల వయసులో తాను ఒక గే అని ప్రకటించుకున్నారు. ఆ సమయంలో తోటి విద్యార్థుల నుంచి చాలా అభ్యంతరాలను ఎదుర్కొన్నట్లు చెప్పారు. తాజాగా మల్హెరిన్‌తో పెళ్లికి ముందు లూప్ట్ సంస్థలో తన సహ వ్యవస్థాపకుడు నిక్ శివోతో సహజీవనం చేసినట్లు ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. సంయుక్తంగా అమెరికన్ జియోలొకేషన్ సాఫ్ట్వేర్ కంపెనీని స్థాపించిన వీరిద్దరూ తొమ్మిదేళ్ల పాటు కలిసి ఉన్నారు. 2012లో కంపెనీని విక్రయించిన తర్వాత ఇద్దరూ విడిపోయారు. ఆల్ట్మాన్ అనేక సందర్భాల్లో మల్హెరిన్‌తో డేటింగ్ గురించి పబ్లిక్‌గా మాట్లాడారు. సెప్టెంబరు 2023లో న్యూయార్క్ మ్యాగజైన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సామ్ ఆల్ట్మాన్ త్వరలో మల్హెరిన్‌తో పిల్లలను కనాలని ఆశపడుతున్నట్లు వెల్లడించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వైట్‌హౌస్‌లో ఇచ్చిన విందులోనూ ఇద్దరు చాలా సన్నిహితంగా కనిపించినట్లు మీడియా కథనాల ద్వారా తెలిసింది. టిమ్ కుక్, యాపిల్ సీఈవో యాపిల్ సీఈవో టిమ్ కుక్ 2014లో స్వలింగ సంపర్కుడిగా ప్రకటించుకున్నారు. ఆ సంవత్సరం జూన్‌లో ‘శాన్ ఫ్రాన్సిస్కో గే ప్రైడ్ పరేడ్’లో యాపిల్ సిబ్బందితో కలిసి పాల్గొన్నారు. అక్టోబరు 30, 2014న కుక్ బహిరంగంగా ‘నేను స్వలింగ సంపర్కుడిగా గర్వపడుతున్నాను. స్వలింగ సంపర్కం దేవుడు నాకిచ్చిన గొప్ప బహుమతిగా భావిస్తున్నాను’ అని చెప్పారు. పీటర్ థీల్, పేపాల్ సహ వ్యవస్థాపకుడు 2016లో రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్‌లో పీటర్ థీల్ తాను స్వలింగ సంపర్కుడిగా గర్విస్తున్నట్లు చెప్పారు. 2002లో, ‘ఈబే’ పేపాల్‌ను 1.5 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. ఈ డీల్ థీల్ను బిలియనీర్‌గా మార్చింది. క్రిస్ హ్యూస్, ఫేస్బుక్ సహ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్‌తో పాటు ఫేస్బుక్ నలుగురు సహ వ్యవస్థాపకులలో క్రిస్ హ్యూస్ ఒకరు. అతడు బహిరంగంగా ‘గే’ ప్రకటించుకున్నారు. హ్యూస్ 2012లో సీన్ ఎల్డ్రిడ్జ్ను వివాహం చేసుకున్నారు. 2019లో హ్యూస్ ఫేస్బుక్, మార్క్ జుకర్‌బర్గ్‌పై విమర్శలు గుప్పించి వార్తల్లోకెక్కారు. క్లాడియా బ్రిండ్, మేనేజింగ్ డైరెక్టర్, ఐబీఎం క్లాడియా బ్రిండ్ ఐబీఎంలో ఇంటెలెక్చువల్ ప్రాపర్టీకి వైస్ ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. 1990లో ఆ సంస్థలో తన కెరీర్‌ను ప్రారంభించిన ఆమె తాను ఒక లెస్బియన్‌గా ప్రకటించుకున్నారు. ఇదీ చదవండి: బుల్లెట్ రైలు ప్రాజెక్ట్.. కీలక సమాచారాన్ని వెల్లడించిన మంత్రి ఆన్ మే చాంగ్, కాండిడ్, సీఈవో యాపిల్, గూగుల్, ఇన్టుఇట్ కంపెనీల్లో కీలక స్థానాల్లో పని చేసిన ఆమె ప్రస్తుతం సామాజిక రంగానికి సంబంధించిన డేటాను అందించే ఒక నాన్‌ప్రాఫిట్ సంస్థ కాండిడ్‌లో పని చేస్తున్నారు. లెస్బియన్ల హక్కుల కోసం వివిధ వేదికలపై ఆమె మాట్లాడారు. -
సహచరుడితో చాట్‌జీపీటీ సీఈఓ వివాహం!
శామ్ ఆల్ట్‌మన్..ఓపెన్ ఏఐ సీఈఓ. ప్రపంచానికి చాట్‌జీపీటీను పరిచయం చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ఓ కీలకమార్పు తీసుకొచ్చి అన్ని దిగ్గజ టెక్ కంపెనీలకు సవాలు విసిరిన ఘనుడు. అలాంటి వ్యక్తిని కొద్ది రోజుల క్రితం ఓపెన్ ఏఐ సంస్థ బోర్డ్ అతనిని సీఈఓ పదవి నుంచి తొలగించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పరిణామాల వల్ల ఆల్ట్‌మన్‌ను తిరిగి సంస్థలోకి తీసుకోక తప్పలేదు. తాజాగా శామ్ ఆల్ట్‌మన్ తన బాయ్‌ఫ్రెండ్ ఆలివర్ మల్హెరిన్‌ను వివాహం చేసుకున్నారు. ఈమేరకు వివాహానికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. దాంతో ఆల్ట్‌మన్ తన పెళ్లిపై స్పందిస్తూ ఓ ప్రముఖ మీడియా సంస్థతో ఈ విషయాన్ని ధ్రువీకరించారు. హవాయ్ నగరంలో సముద్రపు ఒడ్డున కొంతమంది సన్నిహితుల మధ్య వీరు ఒక్కటైనట్లు మీడియా కథనాల్లో వెల్లడైంది. శామ్ వివాహ చేసుకున్న మల్హెరిన్ ఆస్ట్రేలియాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. మెల్బోర్న్ విశ్వవిద్యాలయం నుంచి ఆయన పట్టా పొందినట్లు మల్హెరిన్ లింక్డిన్ ప్రొఫైల్ ప్రకారం తెలుస్తోంది. 2020 ఆగస్టు నుంచి 2022 నవంబర్ వరకు మెటాలో పనిచేశారు. ఆల్ట్‌మన్, మల్హెరిన్ తమ బంధం గురించి ఎప్పుడూ బయట మాట్లాడిన సందర్భాలు లేవు. ఇదీ చదవండి: సినిమా చూపిస్తూ కోట్లు సంపాదన! 2023 సెప్టెంబర్‌లో న్యూయార్క్ మ్యాగజైన్ మీడియాతో మాట్లాడుతూ ఇద్దరూ శాన్ఫ్రాన్సిస్కోలో ఒకే ఇంట్లో ఉంటున్నట్లు ఆల్ట్‌మన్ వెల్లడించారు. గత ఏడాది భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అమెరికా అధ్యక్షుడు బైడెన్ శ్వేతసౌధంలో ఏర్పాటు చేసిన విందుకు ఆల్ట్‌మన్ మొదటిసారి మల్హెరిన్‌తో కలిసి వచ్చారు. ఇదిలాఉండగా హై స్కూల్లో చదువుతున్న సమయంలోనే తాను ‘గే’నని ఆల్ట్‌మన్ ప్రకటించారు. తొమ్మిదేళ్ల పాటు లూప్ట్ సంస్థ సహ వ్యవస్థాపకుడు నిక్ సివోతో డేటింగ్ చేసి 2012లో శామ్ విడిపోయారు. -
రూ.167 కోట్ల కారులో కనిపించిన 'శామ్ ఆల్ట్‌మన్' - వీడియో వైరల్
గత నెలలో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలిచిన ఓపెన్ ఏఐ(OpenAI) సీఈఓ 'శామ్ ఆల్ట్‌మన్' ఇటీవల ఓ ఖరీదైన కారులో కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఇందులో కనిపించే ప్రత్యేకమైన సూపర్‌కార్ చూపరులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ కథనంలో ఆ కారు గురించి మరిన్ని వివరాలు వివరంగా తెలుసుకుందాం. వెల్థినెక్స్జెన్ ఇన్‌స్టాగ్రామ్‌లో కనిపించే వీడియోలో అత్యంత ఖరీదైన 'మెక్లారెన్ F1' సూపర్ కారును చూడవచ్చు. 1992లో ప్రారంభమైన ఈ కారు ధర భారతదేశంలో రూ. 167 కోట్ల కంటే ఎక్కువే. ఇది ప్రపంచ మార్కెట్లో అందుబాటులో ఉన్న అత్యంత ఖరీదైన సూపర్ కార్ల జాబితాలో ఒకటి కావడం గమనార్హం. శామ్ ఆల్ట్మాన్ తన మెక్లారెన్ ఎఫ్1 సూపర్‌కార్‌లో కాలిఫోర్నియాలోని ఫ్యూయెల్ స్టేషన్ వద్ద ఉంటడం వీడియోలో చూడవచ్చు. వెర్మిలియన్ రెడ్ కలర్లో కనిపించే ఈ కారు సిల్వర్ కలర్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది. ఈ కారుని స్వయంగా ఆల్ట్మాన్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్లడం గమనించవచ్చు. మెక్లారెన్ ఎఫ్1 నిజానికి కారు అనగానే అందులో కనీసం నలుగురు కూర్చోవడానికి సీట్లు ఉంటాయని తెలుసు. కానీ ఇక్కడ కనిపించే మెక్లారెన్ ఎఫ్1 మూడు సీట్ల కారు. మధ్యలో డ్రైవర్ సీటింగ్ పొజిషన్‌తో కేవలం ఒకే సీటు ఉంటుంది. వెనుకవైపు ఇద్దరు కూర్చోవడానికి అవకాశం ఉంటుంది. ఈ కారును 1992లో ప్రముఖ కార్ డిజైనర్ 'గోర్డాన్ ముర్రే' ప్రత్యేకంగా తయారుచేశారు. ఇవి కేవలం 106 యూనిట్లకు మాత్రమే పరిమితం చేశారు. మెక్లారెన్ ఎఫ్1 సూపర్ కారులో 6.1 లీటర్ వీ12 పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 627 పీఎస్ పవర్, 650 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ కలిగిన ఈ కారు సుమారు కేవలం 3.2 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఈ కారు గరిష్ట వేగం గంటకు రూ. 386 కిమీ/గం కావడం గమనార్హం. ఇదీ చదవండి: నాలుగు అపార్ట్మెంట్లను అమ్మేసిన శ్రీదేవి ఫ్యామిలీ! మెక్లారెన్ ఎఫ్1 కారు ఇప్పటికే రోవాన్ అట్కిన్సన్ (మిస్టర్ బీన్), ఎలోన్ మస్క్ వద్ద కూడా ఉంది. అయితే రోవాన్ అట్కిన్సన్ కొన్ని రోజుల తరువాత ఈ కారుని విక్రయించినట్లు సమాచారం, మస్క్ మాత్రం ఈ కారును ఇప్పటికీ వినియోగిస్తున్నట్లు చెబుతున్నారు. View this post on Instagram A post shared by Motivation | Business | Wealth (@wealthynexgen) -
‘శామ్ అవుట్’.. వెలుగులోకి సీఈవోల సీక్రెట్ వాట్సాప్ చాట్
చాట్ జీపీటీ సృష్టికర్త శామ్ ఆల్ట్‌మన్ తొలగింపు వ్యవహారం టెక్ ప్రపంచంలో అలజడి సృష్టించింది. ఈ ఉదంతం మార్క్ జుకర్‌బర్గ్, డ్రూ హ్యూస్టన్లతో సహా 100 మందికి పైగా సిలికాన్ వ్యాలీ సీఈవోలు ఉన్న ప్రైవేటు వాట్సాప్ చాట్ గ్రూప్‌లో హల్చల్ చేసింది. దీనికి సంబంధించిన వాట్సాప్ చాట్ తాజాగా వెలుగులోకి వచ్చింది. ఓపెన్ఏఐ సీఈఓ పదవి నుంచి శామ్ ఆల్ట్‌మన్‌ను ఆ పదవి నుంచి తొలగించింది. ఆ తర్వాత జరిగిన వరుస పరిణామాలతో ఆల్ట్‌మన్‌ను తిరిగి వెనక్కి తీసుకున్నారు ఆ సంస్థ బోర్డ్ సభ్యులు. అయితే ఆల్ట్‌మన్ అనూహ్య తొలగింపు ఉదంతం.. మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్, డ్రాప్‌బాక్స్ సీఈవో డ్రూ హ్యూస్టన్‌తో సహా యూఎస్‌లోని పలు అతిపెద్ద టెక్నాలజీ కంపెనీల సీఈవోలను దిగ్భ్రాంతికి గురిచేసింది. న్యూయార్క్ టైమ్స్‌లో వచ్చిన ఓ కథనం ప్రకారం.. నవంబర్ 17న ఆల్ట్‌మన్‌ను ఓపెన్ఏఐ తొలగించినట్లు వార్తలు వెలువడినప్పుడు, సిలికాన్ వ్యాలీ కంపెనీలకు చెందిన 100 మందికి పైగా చీఫ్ ఎగ్జిక్యూటివ్‌లతో కూడిన ఈ ప్రైవేట్ వాట్సాప్ గ్రూప్‌లో ఒక సందేశం వచ్చింది. ఇంతకీ ఏంటది? సీఈవోల వాట్సాప్ గ్రూప్‌లో ఆ రోజు "శామ్ అవుట్" అని ఓ సందేశం వచ్చింది. దీనిపై గ్రూప్ సభ్యులు వెంటనే స్పందించారు. శామ్ ఏమి చేశాడు.. అంటూ రకరకాల ప్రశ్నలు వచ్చాయి. ఉన్నంటుండి తొలగించడానికి శామ్ ఆల్ట్‌మన్ చేసిన తప్పేంటి అనేదానికిపై అనేక ఊహాగానాలు బయలుదేరాయి. సత్య నాదెళ్లకు అర్జెంట్ కాల్! ఓపెన్ఏఐ సంస్థకు అతిపెద్ద పెట్టుబడిదారైన మైక్రోసాఫ్ట్‌లో కూడా దీనిపై అలజడి చలరేగింది. మైక్రోసాఫ్ట్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ కెవిన్ స్కాట్‌కి ఓపెన్ఏఐ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ మీరా మురాటి నుంచి కాల్ వచ్చినట్లు వాట్సాప్ చాట్‌లో ఉంది. ఆల్ట్‌మన్‌ను తొలగించినట్లు ఓపెన్ఏఐ బోర్డు ప్రకటించబోతోందని, తానే తాత్కాలిక చీఫ్‌గా ఉండనున్నట్లు ఆ కాల్లో ఆమె స్కాట్‌తో చెప్పినట్లు సందేశంలో పేర్కొన్నారు. దీంతో స్కాట్ వెంటనే మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లకు అర్జెంట్ కాల్ చేశారట. ఆ సమయంలో ఆయన రెడ్‌మండ్‌లోని మైక్రోసాఫ్ట్ హెడ్‌క్వార్టర్స్‌లో టాప్ ఎగ్జిక్యూటివ్‌లతో సమావేశంలో ఉన్నారు. ఈ ఉదంతం గురించి తెలుసుకుని ఆశ్చర్యపోయిన సత్య నాదెళ్ల తక్షణమే ఓపెన్ఏఐ సీటీవో మీరా మురాటికి ఫోన్ చేసి బోర్డు నిర్ణయం వెనుక ఉన్న కారణాన్ని ఆరా తీసినట్లు వాట్సాప్ సందేశాల ద్వారా తెలుస్తోంది. అయితే ఆమె నుంచి సమాధానం లేదు. దీంతో ఆయన ఓపెన్ఏఐ ప్రధాన స్వతంత్ర డైరెక్టర్ డీఏంజెలోకి కాల్ చేసి ఏం జరిగిందని అడిగినా కారణం తెలియరాలేదు. అయితే తమతో ఆల్ట్‌మన్ సమన్వయం సక్రమంగా లేదని మాత్రమే బోర్డు చెప్పినట్లు వాట్సాప్ సందేశాల సారాంశం. -
‘ఓపెన్ ఏఐ సీఈఓ పదవికి ఎసరు పెట్టి’.. ఇల్యాకు ఎలాన్ మస్క్ బంపరాఫర్!
ఓపెన్ఏఐ సీఈఓ పదవి నుంచి శామ్ ఆల్ట్‌మన్‌ను ఆ పదవి నుంచి తొలగించింది. ఆ తర్వాత జరిగిన వరుస పరిణామాలతో ఆల్ట్‌మన్‌ను తిరిగి వెనక్కి తీసుకున్నారు ఆ సంస్థ బోర్డ్ సభ్యులు. అయితే ఆల్ట్‌మన్‌ను ఓపెన్ఏఐ నుంచి తొలగించేలా బోర్డ్ సభ్యులకు ఓపెన్ ఏఐ కో-ఫౌండర్ ఇల్యా సుట్స్కేవర్ సహాయం చేశారు. ఇప్పుడు అదే సుట్స్కేవర్కు టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ బంపరాఫర్ ఇచ్చారు. హోల్ మార్స్ కేటలాగ్ అనే ఎక్స్.కామ్ యూజర్ ఓ ట్వీట్ చేశారు. అందులో సుట్స్కేవర్ ఓపెన్ఏఐలో అదృశ్యమయ్యారు. అతని భవిష్యత్ ఆందోళన కరంగా మారిందన్న వార్త కథనాన్ని షేర్ చేశారు. దీనికి సుట్స్కేవర్ మీరు టెస్లాలో పనిచేయొచ్చనే క్యాప్షన్‌ను జోడించాడు. కేటలాగ్ ట్వీట్‌పై మస్క్ స్పందించారు. ‘‘ఆర్ ఎక్స్’’ అంటూ తన కృత్తిమ మేధ కంపెనీలో ఎక్స్ఏఐలో సుట్స్కేవర్ చేరొచ్చంటూ ఎలాన్ మస్క్ పరోక్షంగా సంకేతాలిచ్చారు. Ilya should come work at Tesla! pic.twitter.com/UDk4WKu6ts — Whole Mars Catalog (@WholeMarsBlog) December 9, 2023 అయితే ఒక సారి లేఆఫ్స్ గురై.. తిరిగి సీఈఓగా బాధ్యతలు చేపట్టిన సమయంలో ఆల్ట్‌మన్.. సుట్స్కేవర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సుట్స్కేవర్ కు తనకు మధ్య ఎలాంటి విరోధం లేదు. నేను తనిని గౌరవిస్తాను. సుట్స్కేవర్ ఇకపై బోర్డులో పనిచేయనప్పటికీ, చేస్తున్న పనిలో ఇరువురి సహకారంతో ముందుకు సాగుతాం’’ అని పేర్కొన్నారు. అయితే ఇప్పుడు సుట్స్కేవర్ ఓపెన్ఏఐ నుంచి అదృశ్యమయ్యాడన్న కథనాలతో పరిశ్రమ వర్గాల్లో సంచలనంగా మారింది. -
‘అదో పీడకల’.. పదవి నుంచి తొలగించడంపై శామ్ ఆల్ట్‌మన్..
సీఈఓ పదవి నుంచి తనని అర్ధాంతరంగా తొలగించడంపై ఓపెన్ఏఐ శామ్ఆల్ట్ మన్ స్పందించారు. సీఈఓగా తొలగించిన సమయంలో తనకు ఎదురైన చేదు జ్ఞాపకాల్ని ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో వెలుగులోకి తెచ్చారు. శామ్ ఆల్ట్‌మన్..ఓపెన్ ఏఐ సీఈఓ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో పరిచయం అక్కర్లేని పేరు. చాట్‌జీపీటీ విడుదలతో ప్రపంచం మొత్తాన్ని తనవైపుకు తిప్పుకున్న అసాధ్యుడు. అలాంటి ఆల్ట్‌మన్‌ను కొద్ది రోజుల క్రితం ఓపెన్ ఏఐ సంస్థ బోర్డ్ అతనిని సీఈఓ పదవి నుంచి తొలగించింది. ఆ తర్వాత వరుస పరిణామాలతో ఆల్ట్‌మన్‌ను తిరిగి సంస్థలోకి తీసుకోక తప్పలేదు ఆ బోర్డ్ సభ్యులకు. అయితే పదవీచ్యుతుడైన తరువాత ‘‘ టైమ్స్ సీఈఓ ఆఫ్ ది ఇయర్ 2023’’ కి ఎంపికయ్యారు. ఈ తరుణంలో దక్షిణాఫ్రికా కమెడియన్, ట్రెవర్ నోహ్ నిర్వహించిన పాడ్‌కాస్ట్‌లో ఆల్ట్‌మన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తనకి పింక్ స్లిప్ ఇచ్చిన తర్వాత ఏమైందనే విషయాల్ని పంచుకున్నారు. శామ్ ఆల్ట్‌మన్‌ని సీఈఓ పదవి నుంచి ఎప్పుడు తొలగించారు? నవంబర్ 17, 2023న ఓపెన్ ఏఐ బోర్డ్ ఆల్ట్‌మన్‌ని సీఈఓ పదవి నుంచి తొలగించింది. ఆల్ట్‌మన్ ఐఫోన్‌కి ఏమైంది? ట్రెవర్ నోహ్ పాడ్‌కాస్ట్‌లో ఓపెన్ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ మాట్లాడుతూ.. ‘‘ ఈ పరిణామం (తనను తొలగించడం) నన్ను మరింత గందర గోళంలోకి నెట్టింది. నా ఐఫోన్ కూడా పనిచేయడం ఆగిపోయింది. నేను హోటల్ గదిలో ఉండగా.. ఓ ఫోన్ కాల్ వచ్చింది. అవతలి నుంచి ‘‘ మిమ్మల్ని ఓపెన్ ఏఐ బోర్డ్ సభ్యులు సీఈఓ పదవి నుంచి తొలగించారు’’ అని ఆ కాల్ సారాంశం. ఏం జరిగిందో తెలియదు. అంతా గందర గోళం. ఓ వైపు నన్ను తొలగిస్తున్నట్లు ఫోన్ కాల్, మరోవైపు నా ఐఫోన్ పనిచేయడం లేదు. దానంతటికి ఐమెసేజ్ అని అర్ధమైంది. కొద్ది సేపటికి ఐమెసేజ్కు వరుసగా మెసేజ్‌లు వస్తున్నాయి. ఆమెసేజ్లు నాతో పనిచేయాలనుకున్న వారి నుంచేనని అర్ధమైంది. అన్నింటిని చదివాను. వాటిని చదివాక అయోమయంలో పడ్డాను. అదో పీడ కలలా అనిపించింది. బోర్డు నిర్ణయంతో కలత చెందాను’’ అని అన్నారు. -
OpenAI : భారతీయుడు రిషీ జైట్లీకి జాక్‌పాట్!
భారతీయుడు, మాజీ ట్విటర్ ఇండియా హెడ్ రిషీ జైట్లీకి జాక్ పాట్ తగిలింది. సలహాలు తీసుకునేందుకు రిషిని ఓపెన్ ఏఐ నియమించుకున్నట్లు తెలుస్తోంది. భారత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంపై చాట్‌జీపీటీ (openai) సృష్టికర్త ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ దృష్టిసారించారు. ఇందులో భాగంగా దేశీయంగా కృత్తిమమేధ పాలసీ, విధి విధానాల అమలు వంటి అంశాలపై సలహాలు తీసుకునేందుకు ట్విటర్ మాజీ ఇండియా హెడ్ రిషి జైట్లీని సలహాదారుగా నియమించున్నట్లు సమాచారం. టెక్ క్రంచ్ నివేదిక ప్రకారం.. ‘‘జైట్లీ ఓపెన్ఏఐలో సీనియర్ సలహాదారుగా చేరారు. ఏఐ విధానాలకు సంబంధించి ప్రభుత్వ పెద్దలతో కుదుర్చుకునే ఒప్పందాలు మరింత సులభ తరం చేసేందుకు ఆల్ట్‌మన్ సిద్ధమయ్యారు. ఏఐకి ఉన్న డిమాండ్ దృష్ట్యా దేశీయంగా ఆయా విభాగాల్లో నిష్ణాతులైన నిపుణులను ఓపెన్ ఏఐ నియమించుకుంటుంది’’ అని టెక్ క్రంచ్ నివేదిక హైలెట్ చేసింది. మోదీతో ఆల్ట్‌మన్ భేటీ ఈ ఏడాది భారత పర్యటన సందర్భంగా జూన్ 9న ఓపెన్ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ ప్రధాని మోదీని కలిశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ‘‘కృత్రిమ మేధ గురించి తెలుసుకునేందుకు ఎంతో ఆసక్తి కనబరిచారు. ప్రస్తుతం కృత్రిమ మేధ వల్ల భారత్‌లో వచ్చే ఉద్యోగావకాశాలు, దాని వల్ల ఎదురయ్యే సవాళ్ల గురించి చర్చించాం. కృత్రిమ మేధకు చట్టబద్ధత కల్పించడంపై కూడా మా మధ్య చర్చ జరిగింది’’ అని శామ్ ఆల్ట్‌మన్ తెలిపారు. ఎవరీ రిషీ జైట్లీ రిషీజైట్లీ 2007 - 2009 మధ్య భారత్ తరపున ప్రైవేట్ - పబ్లిక్ పార్ట్నర్ షిప్ గూగుల్ విభాగం అధినేతగా పనిచేశారు. తదనంతరం, 2012లో ట్విటర్ హెడ్‌గా చేరారు. 2016 చివరలో ట్విటర్‌ను వదిలేసి జైట్లీ, టైమ్స్ గ్రూప్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ విభాగమైన టైమ్స్ బ్రిడ్జ్ సహ వ్యవస్థాపకుడి కలిసి సీఈఓగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు. -
టెక్ ప్రపంచంలో సంచలనం.. ఈ యేటి మేటి సీఈవో ఈయనే..
Time’s CEO of the Year 2023: టెక్ ప్రపంచంలో సంచలనం సృష్టించిన చాట్‌జీపీటీ (ChatGPT)కంపెనీ ఓపెన్ఏఐ (OpenAI) సీఈవో సామ్ ఆల్ట్‌మన్ (Sam Altman) ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్ ‘సీఈవో ఆఫ్ ది ఇయర్-2023’గా ఎంపికయ్యారు. ఆల్ట్మాన్ టెక్ పరిశ్రమకు చేసిన సేవలకు గాను అవార్డు పొందారు. 5 రోజుల్లోనే మిలియన్ యూజర్లు 2022 నవంబర్ లో ప్రారంభమైన చాట్‌జీపీటీ 5 రోజుల్లోనే మిలియన్ మంది యూజర్లను సంపాదించకుందని టైమ్ మ్యాగజైన్ పేర్కొంది. చాట్‌జీపీటీకి ప్రస్తుతం 100 మిలియన్ల మంది యూజర్లు ఉన్నారు. ఈ బెంచ్‌మార్క్‌ను చేరుకోవడానికి ఫేస్‌బుక్‌కు 4.5 సంవత్సరాలు పట్టింది. 2022లో 28 మిలియన్ల డాలర్ల ఆదాయాన్ని నివేదించిన ఓపెన్ఏఐ 2023లో నెలకు 100 మిలియన్ డాలర్ల ఆదాయానికి చేరుకుంది. ఓ వైపు చాలా టెక్ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తూ పింక్ స్లిప్‌లు ఇస్తున్న సమయంలో ఓపెన్ఏఐ మాత్రం నియామకాలు చేపట్టడం విశేషం. చాట్‌జీపీటీ భారీ విజయం తర్వాత ఈ ఏడాది మార్చిలో జీపీటీ-4ను ఓపెన్ఏఐ తీసుకొచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై ఓ వైపు యూఎస్ సెనేట్‌లో చర్చలు జరుగుతున్న సమయంలో ఆల్ట్‌మన్ భారత్, ఇజ్రాయెల్, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలకు వెళ్లి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ప్రాముఖ్యత గురించి ప్రపంచ దేశాలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. మళ్లీ సీఈవోగా.. బోర్డు సభ్యులతో విభేదాల కారణంగా ఆల్ట్‌మన్ ఓపెన్ ఏఐ కంపెనీ నుంచి వైదొలిగారు. గత నవంబర్ 17న బోర్డు ఆల్ట్‌మాన్‌ను కంపెనీ నుంచి తొలగించింది. ఈ ఘటన జరిగిన వెంటనే మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఆల్ట్‌మన్‌కు అండగా నిలిచారు. మైక్రోసాఫ్ట్‌లో అవకాశం ఇచ్చేందుకు ముందుకొచ్చారు. అయితే 5 రోజుల నాటకీయ పరిణామాల అనంతరం ఆయన మళ్లీ కంపెనీ సీఈవోగా నియమితులయ్యారు. -
Openai : ఓపెన్ఏఐలో ఆల్ట్‌మన్ ఉద్యోగం ఊడింది..ఇందుకేనా?
టెక్ ప్రపంచంలో సంచలనంగా మారిన శామ్ ఆల్ట్‌మన్ తొలగింపు కథ సుఖాంతమైంది. ఆయన తిరిగి ఓపెన్ ఏఐ సీఈఓగా వస్తున్నట్టు బోర్డు తెలిపింది. అలాగే బోర్డులో కొత్త సభ్యుల నియామకంపై సూత్రప్రాయమైన అంగీకారం కుదిరినట్టు పేర్కొంది. అయితే ఈ తరుణంలో శామ్ ఆల్ట్‌మన్‌ని ఓపెన్ఏఐని నుంచి తొలగించిన కారణాల్ని వివరిస్తూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఓపెన్ఏఐ నుంచి ఆల్ట్‌మన్‌ని ఫైరింగ్ ఏపిసోడ్ తర్వాత.. ఓపెన్ ఏఐలోని రీసెర్చర్ల బృందం ప్రాజెక్ట్ క్యూ (క్యూ-స్టార్) గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ బోర్డ్‌కు ఓ లెటర్‌ను రాశారు. ఆ లెటర్ ఆధారంగా రాయిటర్స్ ఓ కథనాన్ని వెలుగులోకి తెచ్చింది. ప్రాజెక్ట్ క్యూ (What is Project Q) అంటే ఏమిటి? శామ్ ఆల్ట్‌మన్ ఈ ఏడాది ప్రారంభంలో ఓపెన్ఏఐ కొత్త టెక్నాలజీ ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్( ఏజీఐ) గురించి ప్రస్తావించారు. ప్రాజెక్ట్ క్యూస్టార్ పేరుతో చాట్‌జీపీటీ తర్వాత ఓపెన్ఏఐ ఏజీఐ అనే టెక్నాలజీ మీద పనిచేస్తుందని, ఈ సాంకేతిక మనుషుల కంటే స్మార్ట్‌గా పనిచేస్తుందని వివరించారు. అంతేకాదు ఏజీఐ విజయవంతంగా ఎలా తయారు చేయగలిగారు? ఈ లేటెస్ట్ టెక్నాలజీ వినియోగంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వినియోగదారులు ఆర్ధికంగా ఎలాంటి పురోగతి సాధిస్తారు? వంటి విషయాల్ని ప్రస్తావించారు. అదే సమయంలో దాని వల్ల సమాజానికి, మనుషులకు ఎలాంటి నష్టం వాటిల్లుతుందో తెలిపారు. ఏజీఐని దుర్వినియోగం చేయడం వల్ల జరిగే తీవ్రమైన అనార్ధాలు, మానవాళి మనుగడకు ముప్పు వంటి అంశాలపై బహిర్ఘతంగా మాట్లాడారు. ఏజీఐ చాలా గొప్పది ‘ఏజీఐ చాలా గొప్పది. సమాజంలో జరిగే అభివృద్దిని అడ్డుకుంటుందని, లేదంటే అడ్డుకోవాలని ఏజీఐ కోరుకుంటుందని నేను నమ్మడం లేదు. బదులుగా, యూజర్లు ఏజీఐని ఎలా సమర్ధవంతంగా వినియోగించుకోవాలి..తద్వారా ఎలాంటి ప్రయోజనాల్ని పొందవచ్చనే అంశాన్ని దాని డెవలపర్లు గుర్తించాలి’ అని ఆల్ట్‌మన్ తన బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొన్నారు. చర్చాంశనీయంగా అల్ట్మన్ తొలగింపు ఈ ఏజీఐ ప్రాజెక్ట్ వల్ల జరిగే ప్రమాదాల గురించి ఆల్ట్‌మన్ బహిరంగంగా వ్యాఖ్యలు చేయడాన్ని బోర్డ్ సభ్యులకు నచ్చలేదని తెలుస్తోంది. కాబట్టే ఓపెన్ఏఐ నుంచి శామ్ ఆల్ట్‌మన్‌ని తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారని నివేదికలు హైలెట్ చేశారు. కాగా ఏజీఐ టెక్నాలజీ వల్ల జరిగే అనార్ధాల గురించి దాని డెవలపర్లు రాసిన లెటర్ బోర్డ్ సభ్యులకు చేరకముందే.. ఆల్ట్‌మన్‌కి పింక్ స్లిప్ ఇవ్వడం చర్చాంశనీయంగా మారింది. -
మళ్లీ ఓపెన్ఏఐలోకి సామ్ ఆల్ట్‌మన్
శాన్ ఫ్రాన్సిస్కో: కృత్రిమ మేధ(ఏఐ) రంగంలో సంచలనం సృష్టించిన చాట్‌జీపీటీ తయారీసంస్థ ఓపెన్ఏఐ మరోసారి వార్తల్లో నిలిచింది. సీఈవో బాధ్యతల నుంచి తప్పుకున్న సామ్ ఆల్ట్‌మన్‌ను తిరిగి అదే పదవిలోకి తీసుకుంటున్నట్లు ఓపెన్ఏఐ తాజాగా ప్రకటించింది. తనను తొలగించిన కంపెనీ బోర్డును పునర్వ్యవస్థీకరించాలని సామ్ పెట్టిన షరతుకు ఓపెన్ఏఐ ఒప్పుకున్నట్లు సమాచారం. ఇందుకు అనుగుణంగానే కొత్తగా బ్రెట్ టైలర్ నేతృత్వంలో నూతన బోర్డును ఏర్పాటుచేస్తున్నట్లు సంస్థ తెలిపింది. ఇటీవల బహిష్కరణ తర్వాత సామ్‌ను మైక్రోసాఫ్ట్‌కు చెందిన నూతన అడ్వాన్స్డ్ ఏఐ పరిశోధనా బృందంలో చేర్చుకుంటున్నట్లు మైక్రోసాఫ్ట్ సారథి సత్య నాదెళ్ల ప్రకటించడం తెల్సిందే. సామ్‌ను మళ్లీ సంస్థలోకి తీసుకోవాలని వాటాదారుల నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో అతని షరతులకు సంస్థ ఒప్పుకోకతప్పలేదని తెలుస్తోంది. సంస్థలోకి పునరాగమనాన్ని సామ్ ధ్రువీకరించారు. మళ్లీ కృత్రిమ మేధ విభాగంలో అవిశ్రాంతంగా పనిచేస్తానని ప్రకటించారు. -
ఊహించని పరిణామం, ఓపెన్ఏఐ సీఈఓగా శామ్ ఆల్ట్‌మన్ బాధ్యతలు
ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ ఓపెన్ ఏఐ ఆసక్తికర ప్రకటన చేసింది. కంపెనీ సీఈఓగా తిరిగి శామ్ ఆల్ట్‌మన్ బాధ్యతలు చేపట్టినట్లు తెలిపింది. ముందే ఊహించినట్లుగానే ఓపెన్ఏఐ బోర్డు కొత్త సభ్యులు బ్రెట్ టేలర్, లారీ సమ్మర్స్, ఆడమ్ డి ఏంజెలో’లను నియమించింది. తాజాగా, పరిణామాలపై శామ్ ఆల్ట్‌మన్ స్పందించారు. ‘ఐ లవ్ ఓపెన్ఏఐ. నేను ఓపెన్ఏఐలోకి తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్నాను. అలాగే, మైక్రోసాఫ్ట్‌తో మరింత బలమైన భాగస్వామ్యంతో ముందుకు సాగాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. ఓపెన్ఏఐలో మైక్రోసాఫ్ట్ భారీ పెట్టుబడులు శామ్ ఆల్ట్‌మన్ ఓపెన్ఏఐ సీఈఓగా తిరిగి రావాలని తన నిర్ణయాన్ని ప్రకటించిన కొద్ది నిమిషాల తర్వాత మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల ధృవీకరించారు. ఓపెన్ఏఐలో మైక్రోసాఫ్ట్ రూ.1300 కోట్లు పెట్టుబడులు పెట్టింది.అయితే ఓపెన్ ఏఐ ఆల్ట్‌మన్‌ను తొలగించడంతో.. ఆయనను మైక్రోసాఫ్ట్ ఏఐ విభాగంలోకి తీసుకునేందుకు సత్యనాదెళ్ల ప్రయత్నించారు. గత వారం రోజులుగా జరుగుతున్న వరుస పరిణామాలతో ఆల్ట్‌మన్ తిరిగి ఓపెన్ఏఐ సీఈఓ బాధ్యతలు చేపడుతున్నారంటూ మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల బుధవారం ఎక్స్ పోస్ట్‌లో తెలిపారు. చాట్‌జీపీటీతో వెలుగులోకి గత ఏడాది కృత్తిమ మేధ (ఏఐ) చాట్‌బాట్ చాట్‌జీపీటీ విడుదలతో ఓపెన్ ఏఐ సీఈఓగా శామ్ ఆల్ట్‌మన్ వెలుగులోకి వచ్చారు. అంతేకాదు, ఏఐ రీసెర్చ్, డెవలప్మెంట్పై బిలియన్ డాలర్లు పెట్టుబడులు పెట్టేలా దోహద పడ్డారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ రేసులో ముందంజలో ఉండటమే కాదు.. గత ఏడాది చాట్‌బాట్ చాట్‌జీపీటీ విడుదలతో ఓపెన్ ఏఐ సీఈఓగా శామ్ ఆల్ట్‌మన్ వెలుగులోకి వచ్చారు. -
సంచలనం.. రాజీనామాలో 500 మంది ఉద్యోగులు, ఓపెన్ఏఐకి ఎదురు దెబ్బ!
శామ్ ఆల్ట్‌మన్‌ను సీఈఓ బాధ్యతల నుంచి తొలగిస్తూ ఓపెన్ఏఐ సంస్థ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నిర్ణయంపై ఓపెన్ఏఐలోని ఉద్యోగులు తిరగబడ్డారు. ఉన్న 730 మంది ఉద్యోగుల్లో 500 మంది రాజీనామా చేస్తామంటూ బోర్డ్‌ను బెదిరించారు. ఈ మేరకు వారు ఓ లేఖ రాశారు. ఓపెన్ ఏఐ ఉద్యోగుల్ని నియమించుకునేందుకు మైక్రోసాఫ్ట్ సుముఖంగా ఉందని, ఇదే విషయంపై హామీ ఇచ్చినట్లు కూడా ఆ లేఖలో పేర్కొన్నారు. శామ్ ఆల్ట్‌మన్‌ని మళ్లీ సంస్థలోకి చేర్చుకుంటే రాజీనామాలపై పునరాలోచన చేస్తామని ఉద్యోగులు ఆ లేఖలో స్పష్టం చేశారు. ‘‘ఓపెన్ ఏఐని పర్యవేక్షించే సామర్థ్యం మీకు లేదని మీ చర్యల ద్వారా స్పష్టం అవుతుంది. మా లక్ష్యం, ఉద్యోగుల పట్ల విశ్వాసం, సంస్థ పట్ల నిబద్ధత లేని వారి కోసం మేం పని చేయలేకపోతున్నాం.‘అందుకే, ప్రస్తుత బోర్డ్ సభ్యులందరూ రాజీనామా చేయాలి. లేదంటే మేం వెంటనే ఓపెన్ఏఐకి రాజీనామా చేసి మైక్రోసాఫ్ట్ ఏఐ విభాగంలో చేరిపోతాం. బ్రెట్ టేలర్, విల్ హర్డ్ వంటి ఇద్దరు కొత్త ఇండిపెండెంట్ డైరెక్టర్లను బోర్డు నియమించి, శామ్ ఆల్ట్మాన్, గ్రెగ్ బ్రోక్‌మాన్‌లను తిరిగి నియమిస్తే అప్పుడు ఆలోచిస్తామని’ అని లేఖలో తెలిపారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే? ఇక్కడ విచిత్రం ఏంటంటే..ఆల్ట్‌మన్‌ను తొలగించేలా బోర్డ్ ప్రయత్నాలకు ఓపెన్ఏఐ చీఫ్ సైంటిస్ట్ ఇల్యా సట్స్కేవర్ నాయకత్వం వహించారు. ఇప్పుడు అదే సట్స్కేవర్ శామ్ ఆల్ట్‌మన్ సంస్థ నుంచి తొలగించడంపై విచారం వ్యక్తం చేస్తున్నారు. బోర్డ్ ప్రయత్నాల్లో తన పాత్ర ఉండడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. శామ్ ఆల్ట్‌మన్‌ను ఎందుకు తొలగించింది శామ్ ఆల్ట్‌మన్‌ను సీఈఓ బాధ్యతల నుంచి తొలగిస్తూ ఓపెన్ఏఐ సంస్థ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఓపెన్ఏఐ ఆయనను విశ్వసించకపోవడమే కారణమని బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. ఆయన స్థానంలో తాత్కాలికంగా చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ మిరా మురాటీ సీఈఓగా వ్యవహరిస్తారని ప్రకటించింది. ఆల్ట్‌మన్‌ను బాధ్యతల నుంచి తొలగించిన గంటల వ్యవధిలోనే సహ వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు గ్రెగ్ బ్రాక్‌మన్ తన పదవికి రాజీనామా చేశారు. చదవండి👉‘AI’ వల్ల ఉద్యోగాలు పోవడం ఖాయం.. చాట్‌జీపీటీ సృష్టి కర్త సంచలన వ్యాఖ్యలు! -
మరో కీలక పరిణామం, ‘ఓపెన్ఏఐ’లోకే శామ్ ఆల్ట్‌మన్?
ప్రముఖ ఏఐ సంస్థ ఓపెన్ఏఐలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మైక్రోసాఫ్ట్ ఏఐ విభాగంలో పనిచేయడం కంటే శామ్ ఆల్ట్‌మన్ ఓపెన్ఏఐకి వెళ్లడమే మంచిదన్న అభిప్రాయం వ్యక్తం చేశారు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల ఓపెన్ఏఐ మాజీ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్‌ని తొలగించడం.. ఆ తర్వాత ఆయన భవితవ్యంపై మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల బ్లూమ్‌బెర్గ్ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘ఓపెన్ఏఐలో ఆల్ట్‌మన్ ఎలాంటి తప్పు చేయలేదని చెప్పారు. నేను అతనిమీద, అతని నాయకత్వం, సామర్థ్యంపై నమ్మకంగా ఉన్నాను. కాబట్టే మేం అతనిని మైక్రోసాఫ్ట్‌లోకి స్వాగతించాలనుకుంటున్నాము’ అని సత్యనాదెళ్ల ఇంటర్వ్యూలో చెప్పారు. ఆల్ట్‌మన్ తమ కంపెనీ కొత్త ఏఐ రీసెర్చ్ బృందంలో చేరనున్నారని వెల్లడించారు. ఆయనతో పాటు ఓపెన్ఏఐ నుంచి బయటకు వచ్చిన గ్రెగ్ బ్రాక్‌మన్ సైతం మైక్రోసాఫ్ట్‌తో కలిసి పనిచేయనున్నట్లు తెలిపారు. అయితే, ఓపెన్ఏఐలోని పెట్టుబడి దారులు శామ్ ఆల్ట్‌మన్‌ని సంస్థలోకి తీసుకోవాలని బోర్డ్ సభ్యులపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ తరుణంలో శామ్ ఆల్ట్‌మన్ మైక్రోసాఫ్ట్‌లో చేరడం కంటే, తిరిగి ఓపెన్ఏఐకి వెళితే బాగుండేదన్న సంకేతాలిచ్చారు సత్యనాదెళ్ల. మరి ఈ వరుస పరిణామాలు ఎటు దారి తీస్తాయో చూడాల్సి ఉంది. చదవండి👉సంచలనం.. రాజీనామాలో 500 మంది ఉద్యోగులు, ఓపెన్ఏఐకి ఎదురు దెబ్బ! -
మైక్రోసాఫ్ట్‌లోకి సామ్ ఆల్ట్‌మ్యాన్
వాషింగ్టన్: కృత్రిమ మేధ(ఏఐ) రంగంలో చర్చనీయాంశంగా మారిన సామ్ ఆల్ట్‌మ్యాన్ ఉద్వాసన పర్వం కొత్త మలుపు తీసుకుంది. ఓపెన్ఏఐ సంస్థ సీఈవో పదవి నుంచి తీసేశాక సామ్ ఆల్ట్‌మ్యాన్ తాజాగా మైక్రోసాఫ్ట్‌లో చేరి పోయారు. ఈ విషయాన్ని స్వయంగా మైక్రోసాఫ్ట్ చైర్మన్, సీఈవో సత్య నాదెళ్ల సోమవారం ట్వీట్ చేశారు. ఆల్ట్‌మ్యాన్‌ను తొలగించిన కొద్దిసేపటికే ఓపెన్ఏఐ సహవ్యవస్థాపకుడు, అధ్యక్షుడు గ్రెగ్ బ్రోక్‌మ్యాన్ సైతం ఓపెన్ఏఐ నుంచి వైదొలగారు. ‘‘ ఆల్ట్‌మ్యాన్, బ్రోక్‌మ్యాన్ ఇద్దరూ మైక్రోసాఫ్ట్ నూతన అడ్వాన్స్డ్ ఏఐ రీసెర్చ్ బృందంలో కలిసి పనిచేస్తారు’’ అని నాదెళ్ల ట్వీట్‌చేశారు. -
సొంత కంపెనీల్లోనే ఉద్యోగాలు కోల్పోయిన సీఈవోలు వీరే!
ఇటీవల ఓపెన్ఏఐ కంపెనీ తన సీఈఓ 'శామ్ ఆల్ట్‌మన్'ను పదవి నుంచి తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ వార్త టెక్ ప్రపంచంలో పెద్ద చర్చలకు దారి తీసింది. సీఈఓ జాబ్ కూడా గ్యారెంటీ కాదని కొందరు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. 2022లో 969 మంది సీఈఓలు తమ ఉద్యోగాలకు రాజీనామా చేయగా.. ఈ ఏడాది మొదటి తొమ్మిది ఈ సంఖ్య 1425 కు చేరింది. వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ (World of Statistics) ప్రకారం, తాము నెలకొల్పిన సంస్థల నుంచి తమ సీఈఓ పదవులు కోల్పోయిన వారు ఎవరనేది ఈ కథనంలో తెలుసుకుందాం. స్టీవ్ జాబ్స్ (Steve Jobs) యాపిల్ కంపెనీ కో ఫౌండర్, సీఈఓ స్టీవ్ జాబ్స్ ఒకప్పుడు ఆ కంపెనీలోనే తన సీఈఓ జాబ్ కోల్పోయిన సంగతి బహుశా చాలామందికి తెలియకపోవచ్చు. సంస్థ ప్రారంభమైనప్పుడు అతని వయసు 21 సంవత్సరాలు మాత్రమే, అయితే ఆ కంపెనీ స్థాపించిన సుమారు 9 సంవత్సరాలకు కంపెనీ బోర్డు సీఈఓగా తొలగించి, ఆ స్థానంలో జాన్ స్కూల్లేను నియమించింది. ఆ తరువాత 1997లో స్టీవ్ జాబ్స్ సీఈఓగా బాధ్యతలు చేపట్టాడు. ఈయన 2011లో అనారోగ్య కారణాల వల్ల కన్నుమూశాడు. ప్రస్తుతం ఈ స్థానంలో 'టిమ్ కుక్' ఉన్నారు. అంకితి బోస్ (Ankiti Bose) జిలింగో కో-ఫౌండర్, సీఈఓ అంకితి బోస్ కొన్ని ఆర్ధిక అవకతవకల దర్యాప్తు కారణంగా 2022లో సీఈఓగా తొలగించారు. బోర్డు ఆమోదం లేకుండానే.. ఆమె జీతం దాదాపు 10 రెట్లు పెరగటం కారణంగా సీఈఓగా తొలగించినట్లు తెలుస్తోంది. అప్పట్లో ఈ వార్త టెక్ ప్రపంచంలో పెద్ద సంచలనంగా మారింది. పరాగ్ అగర్వాల్ (Parag Agrawal) ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఎక్స్ (ట్విటర్) సంస్థను కొనుగోలు చేసిన తరువాత కంపెనీలో చాలామంది సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లను తొలగించారు. 2021లో సీఈఓగా ఎంపికైన పరాగ్ అగర్వాల్ ఆ సమయంలో కంపెనీని విడిచిపెట్టిన మొదటి వ్యక్తి. విధుల నుంచి తొలగించినందుకు నష్టపరిహారంగా పరాగ్ అగర్వాల్ దాదాపు 40 మిలియన్ల డాలర్ల భారీ మొత్తాన్ని అందుకున్నట్లు సమాచారం. ఫనీష్ మూర్తి (Phaneesh Murthy) ప్రముఖ ఐటీ సంస్థ 'ఐగేట్' (iGate) ప్రెసిడెంట్, సీఈఓ ఫనీష్ మూర్తికి తన సహోద్యోగితో సంబంధం ఉందనే కారణంగా తన ఉద్యోగాన్ని కోల్పోయాడు. అరాసెలి రోయిజ్ అనే ఉద్యోగి లైంగిక వేధింపుల దావా వేసినప్పుడు విచారణంలో దోషిగా తేలడం వల్ల ఈయన సీఈఓగా తొలగించారు. ఈయన ఇన్ఫోసిస్‌లో ఉన్నప్పుడు కూడా ఇలాంటి ఆరోపణలే ఎదుర్కొన్నట్లు సమాచారం. జాక్ డోర్సే (Jack Dorsey) 2006లో ప్రారంభమైన మైక్రోబ్లాగింగ్ స్టార్టప్ ట్విటర్ కో-ఫౌండర్ అండ్ సీఈఓ 'జాక్ డోర్సే' 2008లో కొన్ని కారణాల వల్ల తన పదవి కోల్పోయాడు. ఆ తరువాత ఆయన స్థానంలోకి పరాగ్ అగర్వాల్ నియమితుడై సీఈఓ బాధ్యతలు చేపట్టారు. శామ్ ఆల్ట్మాన్ (Sam Altman) సంస్థలో జరుగుతున్న అంతర్గత చర్చల్లో నిజాయతీ పాటించడం లేదని, బోర్డు తీసుకునే నిర్ణయాలకు అతడు అడ్డుపడుతున్నాడని.. ఓపెన్ఏఐకి నాయకత్వం వహించే అతడి సామర్థ్యంపై బోర్డు నమ్మకం కోల్పోయిందనే కారణంగా 'ఓపెన్ఏఐ' (OpenAI) 'శామ్ ఆల్ట్‌మన్'ను సీఈఓ పదవి నుంచి తొలగించింది. ఇదీ చదవండి: ఆ రెండు కార్ల ఖరీదే రూ.20 కోట్లు - అట్లుంటది అంబానీ ఫ్యామిలీ అంటే.. తమ కంపెనీలలోనే సీఈఓ పదవి కోల్పోయిన వ్యక్తుల జాబితాలో యాహూ సీఈఓ కరోల్ బార్ట్జ్ (2011), హెచ్‌టీసీ సీఈఓ పీటర్ చౌ (2015), తైవాన్‌కు కంప్యూటర్ కంపెనీ ఏసర్ సీఈఓ జియాన్ఫ్రాంకో లాన్సి (2011), విప్రో జాయింట్ సీఈఓలు గిరీష్ పరంజ్పే & సురేష్ వాస్వానీ (2011), మైక్రోసాఫ్ట్ సీఈఓ స్టీఫెన్ ఎలోప్, హెచ్‌పీ సీఈఓ మార్క్ హర్డ్ (2010) ఉన్నారు. -
ఓపెన్ఏఐలో ఆసక్తికర పరిణామాలు, సీఈఓగా ఆల్ట్‌మన్?
చాట్‌జీపీటీ సృష్టికర్త, ఓపెన్ ఏఐ మాజీ సీఈఓ శామ్ అల్ట్మన్ సీఈఓగా బాధ్యతలు స్వీకరించనున్నారా? శనివారం ఆల్ట్‌మన్‌ను సీఈఓ పదవి నుంచి తొలగిస్తూ తీసుకున్న నిర్ణయం టెక్ ప్రపంచంలో చర్చకు దారి తీసింది. అయితే ఆల్ట్‌మన్‌ను మళ్లీ తిరిగి తీసుకోవాలని ఓపెన్ ఏఐ ప్రధాన పెట్టుబడి దారులు ఒత్తిడి తెస్తున్నారా? అంటే అవుననే అంటున్నాయి తాజా పరిణామాలు ఓపెన్ ఏఐ బోర్డ్ సభ్యులు సంస్థ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్‌ని తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న పలువురు ఇన్వెస్టర్లు బోర్డ్ సభ్యులతో చర్చిస్తున్నారని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. శామ్ ఆల్ట్‌మన్‌ను తొలగించే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఓపెన్ఏఐ ఇన్వెస్టర్లు కంపెనీ బోర్డుపై ఒత్తిడి తెస్తున్నారంటూ కథనాలు వెలువడ్డాయి. ఇప్పటికే ఆల్ట్‌మన్‌ని సీఈఓగా నియమించాలని కోరుతూ పెట్టుబడి దారులు ఓపెన్ ఏఐలో అతిపెద్ద వాటాదారుగా ఉన్న మైక్రోసాఫ్ట్‌తో సైతం చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. మైక్రోసాఫ్ట్ సైతం మద్దతు ఆల్ట్‌మన్‌కు ఉద్వాసన పలికిన ఓపెన్ఓఐ బోర్డు సభ్యులు తాత్కాలిక సీఈవోగా మిరా మురాటిని ఎంపిక చేసుకున్నారు. బోర్డు నిర్ణయం మేరకు మిరా మురాటికి మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల మద్దతు పలికారు. అయితే, తాజాగా మళ్లీ సీఈఓగా తిరిగి ఆల్ట్‌మన్ తీసుకోవాలన్న పెట్టుబడిదారుల నిర్ణయాన్ని సమర్ధిస్తూ సత్యనాదెళ్ల ఓపెన్ ఏఐ మాజీ సీఈఓతో మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. ఓపెన్ ఏఐ సిబ్బంది హెచ్చరికలు ఓపెన్ ఏఐ సీఈఓగా శామ్ ఆల్ట్‌మన్‌ను సీఈఓగా తీసుకోవాలని, లేదంటే సంస్థ నుంచి బయటకు వెళ్లిపోతామంటూ సిబ్బంది బోర్డు సభ్యులకు హెచ్చరికలు జారీ చేసినట్లు నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. ఆల్ట్‌మన్ సొంత వెంచర్ ఓపెన్ఏఐతో జరుగుతున్న చర్చలు విఫలమైతే ఆల్ట్‌మన్ తన సొంత వెంచర్‌ను ప్రారంభించాలని యోచిస్తున్నట్లు కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. ఆయనకు మద్దతుగా మాజీ ఓపెన్ఏఐ ప్రెసిడెంట్ గ్రెగ్ బ్రోక్మాన్ సైతం అదే బాటలో ఉన్నారనని నివేదికలు పేర్కొన్నాయి. -
ఓపెన్ ఏఐ సహ వ్యవస్థాపకుడికి ఉద్వాసన
శాన్ ఫ్రాన్సిస్కో: చాట్ జీపీటీకి రూపకల్పన చేసిన ఓపెన్ ఏఐ కంపెనీ సహవ్యవస్థాపకుడు, సీఈవో శామ్ ఆల్ట్‌మన్‌కు ఆ సంస్థ ఉద్వాసన పలికింది. కంపెనీ బోర్డుకు విశ్వాసం కలిగేలా ఆయన వ్యవహరించడం లేదని ఓపెన్ ఏఐ ఒక ప్రకటనలో తెలిపింది. ఓపెన్ ఏఐకి సారథిగా ఆయన సామర్థ్యంపై కంపెనీ బోర్డుకు విశ్వాసం పోయిందని పేర్కొంది. ఆయన స్థానంలో ఓపెన్ ఏఐ చీఫ్ టెక్నాలజీ అధికారిణి మిరా మురాటికి తాత్కాలిక సీఈవో బాధ్యతలను అప్పగిస్తున్నట్లు తెలిపింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రకటించింది.