ఓపెన్‌ఏఐ (OpenAI)కి చెందిన ఉత్పాదక కృత్రిమ మేధస్సు చాట్‌బాట్ చాట్‌జీపీటీ (ChatGPT) సేవల్లో గణనీయమైన అంతరాయాలను యూజర్లు ఎదుర్కొన్నారు. ఈ సమస్యపై ఓపెన్‌ఏఐ వ్యాఖ్యానించనప్పటికీ, చాట్‌జీపీటీని ఉపయోగిస్తున్నప్పుడు సమస్యలను గుర్తించినట్లు వేలాది మంది యూజర్లు అవుట్‌టేజ్ ట్రాకింగ్ వెబ్‌సైట్ డౌన్‌డెటెక్టర్‌లో ఫిర్యాదులను నమోదు చేశారు.
అంతరాయాలు కేవలం చాట్‌జీపీటీని మాత్రమే కాకుండా ఇతర ఓపెన్‌ఏఐ సేవలను కూడా ప్రభావితం చేశాయి. జీపీటీ-4ఓ (GPT-4o), జీపీటీ-4ఓ మినీ (GPT-4o mini) మోడల్‌లు డౌన్‌టైమ్‌ను ఎదుర్కొన్నట్లు ఊహాగానాలు వచ్చాయి. దీనిపై సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లైన ‘ఎక్స్’, ఇన్స్‌టాగ్రామ్‌లలో వినియోగదారులు తమ అనుభవాలు, ఇబ్బందులను షేర్ చేశారు.
ఏది ఏమైనప్పటికీ సామాన్యుడి రోజువారీ జీవితంలో చాట్‌జీపీటీ, ఇతర కృత్రిమ మేధస్సు ప్లాట్‌ఫామ్‌ల వాడకం రోజురోజుకు పెరుగుతోంది. ఇది త్వరలో మానవ మేధస్సును అధిగమించబోతున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల ఓపెన్‌ఏఐ సీఈవో సామ్ ఆల్ట్‌మాన్ ఒక అడుగు ముందుకేసి తనకు పుట్టబోయే బిడ్డ కూడా ఏఐ కంటే తెలివిగా ఎప్పటికీ ఉండడని పేర్కొన్నారు. ఇటీవల ఓ పోడ్‌కాస్ట్‌లో మాట్లాడిన ఆయన కృత్రిమ మేధస్సు మానవ మేధస్సును అధిగమించే భవిష్యత్తు గురించి తన దృష్టిని పంచుకున్నారు. త్వరలో తండ్రి కాబోతున్న ఆల్ట్‌మన్ ఈ మార్పు తరతరాలుగా జీవితంలో సహజమైన భాగంగా ఉంటుందని నమ్ముతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment