ఓపెన్ ఏఐ సీఈఓ, చాట్‌జీపీటీ సృష్టికర్త శామ్ ఆల‍్ట్‌మన్ అడ్డంగా దొరికిపోయారు. ఇక చేసిది లేక తన చాట్‌జీపీటీ స్కై వాయిస్‌ను నిలిపి వేశారు.
యాపిల్ సిరి వాయిస్ అసిస్టెంట్, అమెజాన్ అలెక్సా వాయిస్ అసిస్టెంట్ తరహాలో చాట్ జీపీటీ యూజర్లకు వాయిస్ అసిస్టెంట్ సేవల్ని అందించేందుకు సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ పనిచేస్తున్నారు. స్కై వాయిస్ పేరుతో తెచ్చే ఈ ఫీచర్‌లో ప్రముఖుల వాయిస్ వినిపిస్తుంది. మీకు ఎవరి వాయిస్ కావాలనుకుంటారో.. దాన్ని సెలక్ట్ చేసుకుంటే చాట్ జీపీటీ సమాధానాల్ని టెక్ట్స్ కాకుండా వాయిస్‌లో రూపంలో అందిస్తుంది.
నా అనుమతి లేకుండా నా వాయిస్‌ను
దీన్ని డెవలప్ చేసే సమయంలో శామ్ ఆల్ట్‌మన్.. అద్భుత నటిగా, అత్యధిక పారితోషికం అందుకుంటున్న ఫిమేల్ యాక్టర్‌గా, హాలీవుడ్‌లోని ఎన్నో ప్రముఖ చిత్రాల్లో నటించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ స్కార్లెట్ జాన్సన్ వాయిస్‌ను వినియోగించారు. దీంతో తనని సంప్రదించకుండా తన వాయిస్‌ను కాపీ చేసి చాట్‌జీపీటీ స్కైవాయిస్‌లో ఎలా వినియోగిస్తారంటూ స్కార్లెట్ జాన్సన్.. ఓపెన్ ఏఐ సీఈఓపై ఆరోపణలు గుప్పిస్తున్నారు.
వేరే ప్రొఫెషనల్ నటికి చెందినదని
ఆరోపణలపై శామ్ ఆల్ట్‌మన్ స్పందించారు. కంపెనీనీ ప్రశ్నార్థకంలో పడేసి చాట్‌జీపీటీ వాయిస్‌ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. అదే సమయంలో స్కై సిస్టమ్ వాయిస్ స్కార్లెట్ జాన్సన్‌ది కాదని, వేరే ప్రొఫెషనల్ నటికి చెందినదని తెలిపారు.
స్కార్లెట్ జాన్సన్ ఏమన్నారంటే
తన వాయిస్‌ను ఓపెన్ ఏఐ కాపీ చేయడంపై అవెంజర్ ముద్దుగమ్మ స్కార్లెట్ జాన్సన్ మాట్లాడుతూ.. ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ చాట్‌జీపీటీ వాయిస్ ఆప్షన్ కోసం గతేడాది సెప్టెంబర్‌లో నన్ను సంప్రదించారు.అయితే, ఆ ఆఫర్‌ను నేను తిరస్కరించా. అయినప్పటికీ ఆల్ట్‌మన్ తనలాగే వినిపించే 'చాట్‌జీపీటీ 4.0 సిస్టమ్' కోసం నా ప్రమేయం లేకుండా నా వాయిస్‌ని ఉపయోగించుకున్నారు’ అని ఆరోపించారు.
జాన్సన్ ఆరోపణల్ని ఖండించిన ఓపెన్‌ఏఐ
అయితే స్కార్లెట్ జాన్సన్ వ్యాఖ్యల్ని శామ్ ఆల్ట్‌మన్ ఖండించారు. చాట్‌జీపీటీ స్కై వాయిస్ స్కార్లెట్ జాన్సన్ వాయిస్ కాదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జాన్సన్ పట్ల ఉన్న గౌరవంతో మేం మా ప్రొడక్ట్‌లలో స్కై వాయిస్ ఉపయోగించడం నిలిపివేశాము. ఈ విషయంలో జాన్సన్‌కు తగిన విధంగా సమాచారం అందించకపోవడం క్షమాపణలు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment