వాషింగ్టన్: కృత్రిమ మేధ(ఏఐ) రంగంలో చర్చనీయాంశంగా మారిన సామ్ ఆల్ట్‌మ్యాన్ ఉద్వాసన పర్వం కొత్త మలుపు తీసుకుంది. ఓపెన్‌ఏఐ సంస్థ సీఈవో పదవి నుంచి తీసేశాక సామ్ ఆల్ట్‌మ్యాన్ తాజాగా మైక్రోసాఫ్ట్‌లో చేరి పోయారు.
ఈ విషయాన్ని స్వయంగా మైక్రోసాఫ్ట్ చైర్మన్, సీఈవో సత్య నాదెళ్ల సోమవారం ట్వీట్ చేశారు. ఆల్ట్‌మ్యాన్‌ను తొలగించిన కొద్దిసేపటికే ఓపెన్‌ఏఐ సహవ్యవస్థాపకుడు, అధ్యక్షుడు గ్రెగ్ బ్రోక్‌మ్యాన్ సైతం ఓపెన్‌ఏఐ నుంచి వైదొలగారు. ‘‘ ఆల్ట్‌మ్యాన్, బ్రోక్‌మ్యాన్ ఇద్దరూ మైక్రోసాఫ్ట్ నూతన అడ్వాన్స్‌డ్ ఏఐ రీసెర్చ్ బృందంలో కలిసి పనిచేస్తారు’’ అని నాదెళ్ల ట్వీట్‌చేశారు.
Comments
Please login to add a commentAdd a comment