Microsoft CEO Satya Nadella
-
సత్య నాదెళ్ళ కీలక ప్రకటన.. 75 వేల మహిళలకు అవకాశం
ఈ ఏడాది 75,000 మంది మహిళా డెవలపర్లకు శిక్షణ ఇవ్వడమే లక్ష్యంగా 'కోడ్ వితౌట్ బ్యారియర్' అనే కార్యక్రమాన్ని భారత్‌కు విస్తరింపజేస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ చీఫ్ 'సత్య నాదెళ్ల' ఇటీవలే ప్రకటించారు. కోడ్ వితౌట్ బ్యారియర్స్ అంటే ఏమిటి, దీని వల్ల ఉపయోగమేంటనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. మైక్రోసాఫ్ట్ AI టూర్లో 1100 మంది డెవలపర్లు & టెక్నాలజీ లీడర్లను ఉద్దేశించి ప్రసంగించిన సందర్భంగా, ప్రపంచవ్యాప్తంగా AI ఆవిష్కరణలను వేగవంతం చేయడంలో భారతీయ డెవలపర్లు చూపుతున్న ప్రభావం గురించి మైక్రోసాఫ్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సత్య నాదెళ్ల మాట్లాడారు. కోడ్ వితౌట్ బ్యారియర్ కార్యక్రమం 75,000 మంది మహిళా డెవలపర్లకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని సత్య నాదెళ్ల వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమాన్ని సంస్థ 2021లోనే తొమ్మిది ఆసియా పసిఫిక్ దేశాల్లో విస్తరించింది. దీని ద్వారా క్లౌడ్, ఏఐ రంగాల్లో లింగ భేదాలను తొలగించాలనేది కూడా ఇందులో ఒక ప్రధాన అంశం. ఇదీ చదవండి: భవిష్యత్ అంతా అందులోనే!.. ఉద్యోగాలు పెరుగుతాయ్.. 20 లక్షల మందికి ఏఐ శిక్షణ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీలో రెండేళ్లలో 20 లక్షల మంది భారతీయులకు నైపుణ్యం కల్పిస్తామని సత్య నాదెళ్ల బుధవారం తెలిపారు. కన్సల్టెన్సీలు, చట్టపర సంస్థలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీలకు చెందిన వ్యాపారవేత్తలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఏఐపై నిబంధనలను రూపొందించడంలో భారత్, యూఎస్ సహకరించుకోవడం అత్యవసరం అని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. -
మైక్రోసాఫ్ట్‌లోకి సామ్ ఆల్ట్‌మ్యాన్
వాషింగ్టన్: కృత్రిమ మేధ(ఏఐ) రంగంలో చర్చనీయాంశంగా మారిన సామ్ ఆల్ట్‌మ్యాన్ ఉద్వాసన పర్వం కొత్త మలుపు తీసుకుంది. ఓపెన్ఏఐ సంస్థ సీఈవో పదవి నుంచి తీసేశాక సామ్ ఆల్ట్‌మ్యాన్ తాజాగా మైక్రోసాఫ్ట్‌లో చేరి పోయారు. ఈ విషయాన్ని స్వయంగా మైక్రోసాఫ్ట్ చైర్మన్, సీఈవో సత్య నాదెళ్ల సోమవారం ట్వీట్ చేశారు. ఆల్ట్‌మ్యాన్‌ను తొలగించిన కొద్దిసేపటికే ఓపెన్ఏఐ సహవ్యవస్థాపకుడు, అధ్యక్షుడు గ్రెగ్ బ్రోక్‌మ్యాన్ సైతం ఓపెన్ఏఐ నుంచి వైదొలగారు. ‘‘ ఆల్ట్‌మ్యాన్, బ్రోక్‌మ్యాన్ ఇద్దరూ మైక్రోసాఫ్ట్ నూతన అడ్వాన్స్డ్ ఏఐ రీసెర్చ్ బృందంలో కలిసి పనిచేస్తారు’’ అని నాదెళ్ల ట్వీట్‌చేశారు. -
అప్పుడు షాక్‌కి గురయ్యా..! ఇంటర్వ్యూలో సత్య నాదెళ్ల..
ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కంపెనీ సీఈఓ 'సత్య నాదెళ్ల' (Satya Nadella) 2014లో సీఈఓ అవుతానని తెలిసినప్పుడు ఎలా అనిపించిందో ఇటీవల బెర్లిన్ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 2023 యాక్సెల్ స్ప్రింగర్ అవార్డు అందుకున్న సత్య నాదెళ్ల తన కెరీర్ గురించి, నాయకత్వం గురించి చాలా విషయాలను ఇంటర్వ్యూలో వెల్లడించాడు. మైక్రోసాఫ్ట్‌లో స్టీవ్ బాల్మెర్ కంపెనీ నుంచి బయటకు వెళ్తున్నట్లు తెలుసుకుని షాక్‌కి గురైనట్లు, ఆ తరువాత మైక్రోసాఫ్ట్ బోర్డు సీఈఓ పదవికి ఎంపికైన నలుగురు టాప్ అభ్యర్థుల్లో నాదెళ్ల కూడా ఉన్నట్లు తెలిపాడు. బోర్డు సభ్యులలో ఒకరు నన్ను మీరు CEO అవ్వాలనుకుంటున్నారా? అని అడిగిన విషయం స్పష్టంగా గుర్తుందని.. నేను ఎప్పుడూ సీఈఓ కావాలనుకునే విషయం గురించి ఆలోచించలేదని, అయితే నా మీద నమ్మకంతో సీఈఓ బాధ్యతలు అప్పగించారని వివరించారు. ఇదీ చదవండి: ఉద్యోగుల పనిగంటల రిపోర్ట్ - భారత్ ప్రపంచంలోనే.. ఇంజినీరింగ్ నైపుణ్యాలు, వ్యాపార దృక్పథం, ఉద్యోగులను ఏకతాటిపైకి తీసుకురాగల సామర్థ్యం కలిగిన సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్‌కు నాయకత్వం వహించడానికి సరైన వ్యక్తి అని బిల్ గేట్స్ ప్రకటించాడు. ఆ తరువాత సత్య నాదెళ్ల నాయకత్వంలో మైక్రోసాఫ్ట్ ఎన్నో విజయాలను సొంతం చేసుకోగలిగింది. ఇదీ చదవండి: వచ్చే ఏడాది ఈ రంగాల్లో 9.8 శాతం జీతాలు పెరగనున్నాయ్.. 1975లో మైక్రోసాఫ్ట్ స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు కంపెనీకి నాయకత్వం వహించిన ముగ్గురు వ్యక్తులలో తెలుగు తేజం సత్య నాదెళ్ల ఒకరు కావడం గర్వించదగ్గ విషయం. అంతకు ముందు బిల్ గేట్స్, స్టీవ్ బాల్మర్ ఈ కంపెనీ బాధ్యతలు నిర్వహించారు. -
మైక్రోసాఫ్ట్ ఆదాయం 13శాతం వృద్ధి
సిలికాన్ వ్యాలీ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది అంచనాలను మించి 13శాతం ఆదాయం వృద్ధి చెందినట్లు తెలిపింది. అయితే ముందుగా విశ్లేషకులు, నిపుణులు కంపెనీ ఆదాయం రూ.4.4లక్షలకోట్లు ఉంటుందని అంచనా వేశారు. కానీ అంచనాలను మించి ఆదాయం రూ.4.6లక్షలకోట్లకు చేరింది. గత త్రైమాసికంలో మూలధన వ్యయం రూ.83వేలకోట్లు నుంచి రూ.91వేలకోట్లు చేరింది. 2016 తర్వాత కంపెనీ చేసిన అత్యధిక మూలధన వ్యయంగా ఇది నిలిచింది. ఫలితాలు విడుదల చేసిన కొంతసేపటికే మైక్రోసాఫ్ట్ షేర్లు మూడు శాతం పెరిగాయి. సంస్థ ప్రతిష్టాత్మంగా ఉన్న అజూర్ సేవలు అంచనావేసిన 26.2 కంటే పెరిగి 29 శాతానికి చేరాయి. అజూర్ అనేది మైక్రోసాఫ్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సొల్యూషన్‌లో ఫీచర్ ప్లాట్‌ఫామ్. క్లౌడ్ బిజినెస్ కోసం త్రైమాసిక అమ్మకాల పెరుగుదలలో ఏఐ సేవలు కీలకమని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఓపెన్ఏఐతో చాలా ఉత్పత్తులను ఇంకా ప్రారంభించలేదని సంస్థ తెలిపింది. త్వరలో వాటిని అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. -
‘అదే నన్ను సాధారణ ఉద్యోగి నుంచి మైక్రోసాఫ్ట్ సీఈవోని చేసింది’
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలో మోస్ట్ పవర్ఫుల్ టెక్ కంపెనీ మైక్రోసాఫ్ట్‌కు నాయకత్వం వహిస్తానని ఊహించలేదని అన్నారు. 1992లో మైక్రోసాఫ్ట్‌లో యువ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా అడుగుపెట్టిన తాను కంపెనీ సీఈవో అవుతానన్న ఆలోచన కూడా లేదంటూ లింక్డిన్ సీఈవో ర్యాన్ రోస్లాన్స్కీ నిర్వహించిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఈ సందర్భంగా ‘1992లో 22 ఏళ్ల వయసులో మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగంలో చేరాక, ఈ ప్రపంచంలోనే గొప్ప ఉద్యోగం చేస్తున్నానని అనుకునేవాణ్ని. నేను చేస్తున్న పని గొప్పదనే భావనతో ఉండేవాణ్ని. మరో చోటికి వెళ్లి ఉద్యోగం చేయాలనే ఆలోచన నాకు ఉండేది కాదు’ అని అన్నారు. చేస్తున్న ఉద్యోగంలో ఎదుగుదల లేదని, వేరే ఆఫీస్‌లో చేరదాం అనే ఆలోచనతో కాకుండా.. ప్రస్తుతం ఆఫీస్‌లో మీరు చేస్తున్న పాత్రని విజయవంతంగా పోషించండి. మైక్రోసాఫ్ట్‌లో నేను నేర్చుకున్న పాఠం ఇదే. మీరు బాగా పనిచేసేందుకు మరో ఉద్యోగం కోసం ఎదురుచూడొద్దు. మొత్తం 30 ఏళ్ల మైక్రోసాఫ్ట్ కెరియర్లో నేను చేస్తున్న ఉద్యోగం గురించి ఎప్పుడూ ఆలోచించిన సందర్భం లేదు. నేను అక్కడ చేస్తున్న ఉద్యోగం చాలా ముఖ్యమైన విషయంగా భావించినట్లు వివరించారు. మీ ప్రస్తుత ఉద్యోగాన్ని మీ కెరీర్ లక్ష్యాలను చేరుకోవడానికి అడ్డంకిగా భావించడానికి బదులుగా ఆసక్తిని, అంకితభావాన్ని, నేర్చుకోవడాన్ని ఓ అవకాశంగా భావించాలి. ఈ మనస్తత్వాన్ని అవలంబించడం ద్వారా మీరు అనుకున్న లక్ష్యాల్ని అంటే ప్రమోషన్లు లేదా శాలరీల పెంపును వేగంగా పొందగలుగుతారని అన్నారు. చేస్తున్న పని వల్ల ఎదుగుదల ఉండడం లేదని అనిపిస్తే మీరు ఎప్పటికీ ఎదగలేరని సూచించారు. ఇప్పటికీ చాలా మంది కెరీర్‌కు సంబంధించి మంచి సలహా ఇవ్వమని అడుగుతుంటారు. వారికి నేను చెప్పేదొక్కటే.. మీరు బాగా పనిచేసేందుకు మరో ఉద్యోగం కోసం ఎదురుచూడొద్దని చెబుతాను. నేను సీఈవో అయ్యే ముందు రోజు వరకు నాకు అలాంటి ఆలోచనేలేదు అని లింక్డిన్ సీఈవో ర్యాన్ రోస్లాన్స్కీ నిర్వహించిన ఇంటర్వ్యూలో సత్యనాదెళ్ల తన మనసులో మాటని బయటపెట్టారు. చదవండి👉 కోడింగ్ రానక్కర్లేదు.. మైక్రోసాఫ్ట్ మరో సంచలనం! -
మైక్రోసాఫ్ట్‌లో 10 వేల ఉద్యోగాల కోత
న్యూయార్క్: టెక్ కంపెనీల్లో ఉద్యోగాల కోత కొనసాగుతోంది. తాజాగా మైక్రోసాఫ్ట్ 10,000 మంది సిబ్బందిని తొలగించనుంది. ఇది కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిబ్బందిలో సుమారు అయిదు శాతం. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల బుధవారం ఈ విషయం వెల్లడించారు. అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితులు నెలకొన్న నేపథ్యంలో కంపెనీ ముందుకు సాగాలంటే ఈ కఠిన నిర్ణయం తీసుకోక తప్పలేదని ఆయన పేర్కొన్నారు. ‘ప్రస్తుతం చేపడుతున్న మార్పుల కారణంగా 2023 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం ఆఖరు నాటికి మొత్తం మీద 10,000 ఉద్యోగాలు తగ్గనున్నాయి. ఇది మొత్తం ఉద్యోగుల సంఖ్యలో 5 శాతం లోపే ఉంటుంది‘ అని సిబ్బందికి పంపిన ఈమెయిల్లో సత్య నాదెళ్ల వివరించారు. తొలగించే ఉద్యోగులకు చెల్లించే పరిహారాలు మొదలైన వాటికి సంబంధించి 1.2 బిలియన్ డాలర్ల వ్యయాలను రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాల్లో మైక్రోసాఫ్ట్ చూపనుంది. ఉద్వాసనకు గురైన ఉద్యోగులకు పరిహారం, ఆరు నెలల పాటు ఆరోగ్య సంరక్షణ కవరేజీ మొదలైనవి ప్రయోజనాలు దక్కుతాయి. ప్రస్తుతం పరిస్థితులు గణనీయంగా మారిపోతున్నాయని నాదెళ్ల పేర్కొన్నారు. కొన్ని దేశాల్లో ఇప్పటికే మాంద్యం నెలకొనగా, మరికొన్నింటిలో మాంద్యం తలెత్తవచ్చన్న అంచనాలుండటంతో కంపెనీలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయని వివరించారు. ఇప్పటికే ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ తదితర సంస్థలు 11,000 పైచిలుకు ఉద్యోగాల్లో కోత విధించాయి. అమెజాన్ కూడా 18,000 మంది ఉద్యోగులను తొలగిస్తోంది. -
డిజిటల్ ఇండియా విజన్‌కు సహకరిస్తాం
న్యూఢిల్లీ: ‘డిజిటల్ ఇండియా విజన్’ సాకారం కావడానికి తమ వంతు సహకారం అందిస్తామని మైక్రోసాఫ్ట్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, సీఈఓ సత్య నాదెళ్ల హామీ ఇచ్చారు. గురువారం ఢిల్లీలో ప్రధాని మోదీతో ఆయన సమావేశమయ్యారు. పలు కీలక అంశాలపై ఇరువురూ చర్చించుకున్నారు. ప్రధాని మోదీతో తన భేటీ చక్కగా జరిగిందని సత్య నాదెళ్ల వెల్లడించారు. డిజిటల్ ఇండియా విజన్ మొత్తం ప్రపంచానికి వెలుగును చూపుతుందని ఉద్ఘాటించారు. తర్వాత మోదీ ట్వీట్ చేశారు. దేశ యువత నూతన ఆలోచనలు భూగోళాన్ని ప్రభావితం చేయగలవని వివరించారు. డేటా సెంటర్ల ఏర్పాటుకు పెట్టుబడులు బెంగళూరు: భారత్‌లో డేటా సెంటర్ల ఏర్పాటు కోసం పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నామని నాదెళ్ల తెలిపారు. తమ దారిలోనే ఇతర కంపెనీలు సైతం నడుస్తాయని, భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తాయని భావిస్తున్నట్లు వెల్లడించారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ‘ఫ్యూచర్ రెడీ టెక్నాలజీ సదస్సు’లో సత్య నాదెళ్ల పాల్గొన్నారు. అనంతరం మీడియాతో భారతదేశ టెక్నాలజీ స్టోరీ విస్తరించడానికి సహకరిస్తామని వ్యాఖ్యానించారు. టెక్నాలజీలో భారత్ అద్భుత విజయాలు సాధిస్తోందని ప్రశంసించారు. ఇది రాయాల్సిన, మాట్లాడుకోవాల్సిన చరిత్ర అని చెప్పారు. బిర్యానీ.. సౌతిండియా ‘టిఫిన్’ కాదు: సత్య నాదెళ్ల ఆధునిక కృత్రిమ మేధ(ఏఐ) ఆధారిత సాఫ్ట్‌వేర్‌తో పనిచేసే చాట్ రోబో ‘చాట్‌జీపీటీ’లో తనకు ఎదురైన అనుభవాన్ని సత్య నాదెళ్ల వివరించారు. దక్షిణ భారతదేశంలో బాగా పేరున్న టిఫిన్ల గురించి తాను అడగ్గా.. ఇడ్లి, దోశ, వడతోపాటు బిర్యానీ అంటూ చాట్‌జీపీటీ బదులిచ్చిందని అన్నారు. తాను హైదరాబాదీనని, తన పరిజ్ఞానాన్ని తక్కువ అంచనా వేయొద్దని, బిర్యానీ అనేది టిఫిన్ కాదను తాను గట్టిగా చెప్పడంతో చాట్‌జీపీటీ క్షమాపణ కోరిందని వెల్లడించారు. -
కొత్త అవతారంలో మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల..!
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల కొత్త అవతారంతో కన్పించనున్నారు. బెంగుళూరుకు చెందిన మ్యూచువల్ ఫండ్స్ అండ్ స్టాక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్‌ఫాంలో పెట్టుబడి పెట్టినట్లుగా తెలుస్తోంది. ఇన్వెస్టర్‌గానే కాకుండా సదరు కంపెనీకి అడ్వైజర్‌గా కూడా పనిచేయనున్నారు. ఇన్వెస్టర్‌గా, అడ్వైజర్‌గా..! ప్రముఖ మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ ఫిన్‌టెక్ సంస్థ గ్రో (Groww) లో మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఇన్వెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇన్వెస్టర్‌తో పాటుగా కంపెనీకి అడ్వైజర్‌గా కూడా పనిచేయనున్నారు. ఈ విషయాన్ని గ్రో సహ వ్యవస్థాపకుడు, సీఈవో లలిత్ కేశ్రే శనివారం ట్విటర్లో వెల్లడించారు. ప్రపంచంలో అత్యుత్తమ సీఈవోల్లో ఒకరు గ్రోకు ఇన్వెస్టర్‌గా, అడ్వైజర్‌గా వ్యవహరించనున్నారు. భారత్‌లో ఆర్థికసేవల్ని ప్రజలకు మరింత చేరువ చేయాలన్న మా ఆశయంలో మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల పాలుపంచుకోవడం సంతోషంగా ఉందని లలిత్ ట్వీట్ చేశారు. భారీ ఆదరణతో ‘గ్రో’త్..! యువతను ఆకర్షించడంలో గ్రో విజయవంతమైంది. తక్కువ కాలంలోనే ఆయా ఇన్వెస్టర్ల నుంచి భారీగా పెట్టుబడులను గ్రో సమీకరించింది. గత ఏడాదిలో జరిగిన రెండు ఫండింగ్ రౌండ్లలో మొత్తంగా 251 డాలర్లను గ్రో సేకరించింది. దీంతో అక్టోబర్ 2021 నాటికి మూడు బిలియన్ డాలర్ల విలువ గల కంపెనీగా గ్రో అవతరించింది. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్లతో పాటుగా రాబిట్ క్యాపిటల్, సింఖోయా వై కాంబినేటర్, టైగర్ గ్లోబల్, ప్రొపెల్ వెంచర్ పార్ట్నర్స్, ఐకానిక్ గ్రోత్, అల్కెన్, లోన్ పైన్క్యాపిటల్, స్టెడ్‌ఫాస్ట్ మొదలైనవి గ్రో(Groww)కు ఇన్వెస్టింగ్ పార్టనర్స్‌గా ఉన్నాయి. గతంలో ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో పనిచేసిన లలిత్ కేశ్రే, హర్ష్ జైన్, నీరజ్ సింగ్, ఇషాన్ బన్సల్ 2018లో గ్రోని స్థాపించారు. దీనిలో సుమారు 20లక్షల మంది యూజర్లు ఉన్నారు. Groww gets one of the world’s best CEOs as an investor and advisor. Thrilled to have @satyanadella join us in our mission to make financial services accessible in India. — Lalit Keshre (@lkeshre) January 8, 2022 చదవండి: బెంగళూరుకి ఝలక్ ! నియామకాల్లో హైదరాబాద్ టాప్ -
అదిరిపోయే ఫీచర్స్, త్వరలో మెక్రోసాఫ్ట్ విండోస్ 11 విడుదల
న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తాజాగా తమ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో కొత్త వెర్షన్ విండోస్ 11ను ఆవిష్కరించింది. మరింత సరళతరమైన డిజైన్‌తో రూపొందించిన ఈ ఓఎస్.. ఈ ఏడాది ఆఖరు నుంచి మార్కెట్లో అందుబాటులోకి రానుంది. ఇందులో ఈసారి ఆండ్రాయిడ్ యాప్స్ కూడా అందుబాటులో ఉండనున్నాయి. విండోస్‌కి సంబంధించి ఇది కొత్త శకమని, రాబోయే దశాబ్దం .. అంతకు మించిన కాలానికి ఉపయోగపడేలా దీన్ని రూపొందించినట్లు వర్చువల్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా కంపెనీ సీఈవో సత్య నాదెళ్ల తెలిపారు. చదవండి: బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ డేటా చైనా సర్వర్లలోకి! -
లాక్డౌన్ ఎఫెక్ట్ : మైక్రోసాఫ్ట్ దూకుడు
సాక్షి,న్యూఢిల్లీ: కరోనా వైరస్ ఆందోళన, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక కార్యకలాపాలు స్థంభించి పోయినప్పటికీ, ప్రపంచ సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ప్రోత్సాహకర ఫలితాలను ప్రకటించింది. మైక్రోసాఫ్ట్ బుధవారం ప్రకటించిన మూడవ త్రైమాసికంలో భారీ లాభాలను, ఆదాయాన్ని సాధించింది. తద్వారా వాల్ స్ట్రీట్ అంచనాలను అధిగమించింది. ముఖ్యగా కోవిడ్-19 వైరస్ విస్తరణ,లాక్డౌన్ కారణంగా ఇంటికే పరిమిత మైన ఉద్యోగులు క్లౌడ్ కంప్యూటింగ్ సేవలను విరివిగా వినియోగించడంతో ఈ సంక్షోభ కాలంలో కూడా మైక్రోసాఫ్ట్ మెరుగైన ఫలితాలను సాధించింది. (రూపాయి రయ్..రయ్...) మార్చి 31తో ముగిసిన త్రైమాసికంలో మైక్రోసాఫ్ట్ ఆదాయం 35 బిలియన్ డాలర్లకు చేరింది. అంతకుముందు త్రైమాసికంతో పోలిస్తే ఆదాయాలు15 శాతం పెరిగాయి.నికర ఆదాయం 22 పెరిగి 10.8 బిలియన్ డాలర్లుకు చేరుకుంది. అమ్మకాలు 22 శాతం పెరిగాయి. ఆదాయం 33.6 బిలియన్ డాలర్లుగా వుంటుందని విశ్లేషకులు అంచనా వేశారు. క్లౌడ్ కంప్యూటింగ్ సేవల ద్వారా మైక్రోసాఫ్ట్ ఈ విజయాన్ని సాధించింది. లాక్డౌన్ తో ప్రజలు కంప్యూటర్లకు పరిమితమై ఇంటి నుండి పనిచేయడం ఆన్ లైన్ పాఠాలు లాంటి కారణాలతో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్, సర్ఫేస్ హార్డ్‌వేర్ అమ్మకాలు పుంజకున్నాయి. అలాగే ఎక్కువ గేమింగ్ వైపు మొగ్గు చూపడంతో ఎక్స్ బాక్స్ వ్యాపారం కూడా లాభపడింది. తాజా ఫలితాలతో 1.35 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్‌తో ప్రపంచంలోనే అత్యంత విలువైన సంస్థగా మైక్రోసాఫ్ట్ స్థానాన్ని దక్కించుకుంది. (ట్రంప్ టీంలో మన దిగ్గజాలు) గత త్రైమాసికంలో ఇంటర్నెట్ ఆధారిత కంప్యూటింగ్ సేవల వైపు చాలా కంపెనీలు మొగ్గు చూపాయని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల పేర్కొన్నారు. దీంతో కేవలం రెండునెలల్లో రెండు సంవత్సరాల డిజిటల్ పరివర్తన చూశామన్నారు. రోజువారీ 75 మిలియన్లకు పైగా క్రియాశీల వినియోగదారులతో ఒక రోజులో 200 మిలియన్లకు పైగా సమావేశాల్లో పాల్గొన్నారని ఆయన చెప్పారు. అలాగే ఎక్స్‌బాక్స్ లైవ్ ఆన్లైన్ గేమింగ్‌కు సంబంధించి దాదాపు 90 మిలియన్ల నెలవారీ క్రియాశీల వినియోగదారులుంటే ఈ కాలంలో రికార్డు స్థాయిలో 10 మిలియన్ల యూజర్లు అదనంగా చేరారని నాదెళ్ల ప్రకటించారు. (కరోనా కట్టడిలో కొత్త ఆశలు : ఈ మందుపై ప్రశంసలు) -
అప్పట్లో సచిన్, ఇప్పుడు విరాట్: సత్య నాదెళ్ల
న్యూఢిల్లీ: చాలా మంది భారతీయుల్లాగే సత్య నాదెళ్లకు క్రికెట్ అంటే ప్రేమే. కంప్యూటర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌కు సీఈఓగా వ్యహరిస్తున్న నాదెళ్లకు ఇష్టమైన సబ్జెక్ట్ ఏదో మీరు ఊహించగలరా ? లెక్కలు, లేదా సైన్స్ అని ఊహిస్తే, మీరు పప్పులో కాలేసినట్లే. ఆయనకు ఇష్టమైన సబ్జెక్ట్.. చరిత్ర. ఇక కోడింగ్.. కవిత్వం లాంటిదేనని ఆయన అభిప్రాయపడ్డారు. మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రెసిడెంట్ అనంత్ మహేశ్వరితో పిచ్చాపాటిగా జరిపిన సంభాషణలో ఆసక్తికరమైన విషయాలను సత్య నాదెళ్ల వెల్లడించారు. ఎక్కడ ఉన్నా, మదిలో అదే...! సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లిలో ఎవర్ని ఎన్నుకుంటారని అనంత్ అడుగగా, అప్పట్లో సచిన్ టెండూల్కర్ అని, ఇప్పుడైతే విరాట్ కోహ్లి అని సత్య నాదెళ్ల బదులిచ్చారు. తన పుస్తకం హిట్ రిఫ్రెష్‌లో క్రికెట్ ఆట తన వ్యక్తిగత, వృత్తిగత జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపిందో ఆయన పేర్కొన్నారు. తాను ఎక్కడ ఉన్నా, తన మదిలో క్రికెడ్ క్రీడ మెదులుతూనే ఉంటుందని వివరించారు. కోడింగ్ కవిత్వం లాంటిదేనని పేర్కొన్నారు. -
భారత పర్యటనకు సత్యా నాదెళ్ల
న్యూఢిల్లీ: మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యా నాదెళ్ల భారత్‌లో పర్యటించనున్నారు. తెలుగువాడైన నాదెళ్ల ఈ నెల 24–26 తేదీల్లో తన సొంత దేశంలో ఉండనున్నారు. కస్టమర్లు, యువ సాధకులు, విద్యార్థులు, డెవలపర్లు, టెక్ సంస్థల వ్యవస్థాపకులను కలిసేందుకు ఈయన భారత్ వస్తున్నారని ఒక ఈ–మెయిల్ ప్రశ్నకు కంపెనీ బదులిచ్చింది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు నగరాల్లో నాదెళ్ల పర్యటించే అవకాశం ఉందని తెలుస్తోంది. సంస్థ చీఫ్ హోదాలో ఇప్పటికే పలు మార్లు ఈయన భారత్‌కు వచ్చిన విషయం తెలిసిందే కాగా, ఈ సారి పర్యటన ఎందుకనే విషయాన్ని మాత్రం ఇప్పటి వరకు కంపెనీ స్పష్టంచేయలేదు. -
గోప్యత మానవహక్కే: సత్య నాదెళ్ల
లండన్: గోప్యతను మానవ హక్కుగా భావించాలని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల టెక్నాలజీ సంస్థలకు పిలుపునిచ్చారు. సైబర్ నేరాల నుంచి ప్రజలను కాపాడటానికి ప్రభుత్వాలు, సంస్థలు కలసి పనిచేయాలని కోరారు. లండన్‌లో గురువారం జరిగిన ఓ కాన్ఫరెన్స్‌లో గోప్యత, సైబర్ భద్రత, కృత్రిమ మేధ తదితరాలను ఆయన ప్రస్తావించారు. డిజిటల్ ప్రపంచంలో ఎదురైన అనుభవాల దృష్ట్యా గోప్యతను మానవ హక్కుగా గుర్తించాలని ఆయన సూచించారు. సైబర్ దాడులకు గురయ్యే వర్గాలను కాపాడటం సాంకేతిక పరిశ్రమ ఒక్కదాని వల్లే కాదని, ప్రభుత్వాలు కూడా సహకారం అందించాలని అభిప్రాయపడ్డారు. యూరప్‌లో కఠిన ఆన్లైన్ ప్రైవసీ ప్రమాణాలు నెలకొల్పేందుకు తీసుకొచ్చిన చట్టం జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్‌ను ప్రశంసించారు. -
సామాన్యులకూ టెక్నాలజీ ఫలాలు అందాలి
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ⇒ ఉద్యోగార్థుల కోసం ప్రాజెక్ట్ 'సంగం' ⇒ స్కైప్ లైట్ వెర్షన్ ఆవిష్కరణ ముంబై: డిజిటల్ టెక్నాలజీలు కేవలం పెద్ద వ్యాపార సంస్థలకే పరిమితం కాకుండా సామాన్యులకు సాధికారత చేకూర్చేందుకు తోడ్పడాలని టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ళ అభిప్రాయపడ్డారు. అప్పుడే దేశ ఆర్థిక వ్యవస్థ పురోగతి సాధించగలదన్నారు. ‘మనం టెక్నాలజీ గురించి గొప్పగా చెప్పుకోవచ్చు. కానీ ప్రతి భారతీయుడికి సాధికారత చేకూర్చలేనప్పుడు.. ప్రతి భారతీయ సంస్థ మరింత గొప్ప లక్ష్యాలు సాధించడానికి అది ఉపయోగపడనప్పుడు టెక్నాలజీ వల్ల మనకు ఒరిగిందేమీ ఉండదు‘ అని సత్య వ్యాఖ్యానించారు. కంపెనీ నిర్వహించిన ఫ్యూచర్ డీకోడెడ్ కార్యక్రమంలో పాల్గొన్న సత్య ఈ విషయాలు తెలిపారు. ఈ సందర్భంగా పలు ప్రాజెక్టులను ఆయన ఆవిష్కరించారు. భారత్‌లో అవసరాలకు అనుగుణంగా వీడియో ఇంటరాక్షన్ అప్లికేషన్ స్కైప్‌లో లైట్ వెర్షన్ వీటిలో ఒకటి. తక్కువ బ్యాండ్‌విడ్త్‌లో ఆడియో, వీడియో కాలింగ్, మెసేజీలకు ఉపయోగపడే స్కైప్ లైట్ వెర్షన్ .. ఆండ్రాయిడ్ డివైజ్‌లలో పనిచేస్తుందని సత్య వివరించారు. తెలుగు, తమిళం తదితర ప్రాంతీయ భాషలను ఇది సపోర్ట్ చేస్తుంది. అటు, ఆధార్ ఆధారిత స్కైప్‌ను కూడా ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తున్నట్లు మరో కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా సత్య చెప్పారు. దీనితో బ్యాంక్ ఖాతాలు మొదలుకుని రేషన్ షాప్‌లో సరుకులు తీసుకోవడం దాకా అన్ని పనులను సులభతరంగా నిర్వహించుకునేందుకు సాధ్యమవుతుందని ఆయన వివరించారు. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ తరహాలోనే ప్రభుత్వాలు, ప్రభుత్వ.. ప్రైవేట్ రంగ సంస్థలు, స్టార్టప్‌లు క్లౌడ్ కంప్యూటింగ్ టెక్నాలజీ ప్రయోజనాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. సెమీ స్కిల్డ్ వర్కర్లకు తోడ్పాటు.. తమ ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ సైట్ లింక్డ్ఇన్ ఆధారంగా ఉద్యోగార్థుల కోసం ’సంగం’ ప్లాట్‌ఫాంను సత్య ఆవిష్కరించారు. ఇప్పటిదాకా ప్రొఫెషనల్స్‌కే పరిమితమైన లింక్డ్ఇన్ను మధ్య, కనిష్ట స్థాయి నైపుణ్యాలున్న వర్కర్లకు కూడా అందుబాటులోకి తెస్తున్నామని సత్య చెప్పారు. కొత్త ఉద్యోగాలకు అనుగుణంగా సెమీ–స్కిల్డ్ వర్కర్లు వొకేషనల్ ట్రెయినింగ్ పొందేందుకు, ఉద్యోగావకాశాలు దక్కించుకునేందుకు ఇది తోడ్పడగలదని ఆయన వివరించారు. ఆతిథ్య రంగం మొదలైన పరిశ్రమలకు దీని వల్ల ప్రయోజనం చేకూరగలదన్నారు. ప్రస్తుతానికి ఇది ప్రివ్యూ దశలోనే ఉందని, త్వరలో పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేగలమని సత్య చెప్పారు. భారత్‌లో సరైన ఉద్యోగం దొరకపుచ్చుకోవడం గ్రాడ్యుయేట్స్‌కు పెద్ద సవాలుగా ఉంటోందని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో లింక్డ్ఇన్లో ’ప్లేస్‌మెంట్స్’ పేరిట కొత్తగా మరో సర్వీసును అందుబాటులోకి తెస్తున్నట్లు సత్య వివరించారు. దేశీయంగా కాలేజీ గ్రాడ్యుయేట్స్ తమ నైపుణ్యాలకు తగ్గట్లుగా తగిన ఉద్యోగావకాశాలు అందిపుచ్చుకునేందుకు ఇది ఉపయోగపడుతుందన్నారు. లింక్డ్‌ఇన్‌కి భారత్‌లో దాదాపు 3.9 కోట్ల మంది సభ్యులు ఉన్నారని, దీని లైట్ వెర్షన్ 2జీ స్పీడ్‌లో కూడా పనిచేస్తుందని సత్య చెప్పారు. వలసవాదుల దేశం.. అమెరికా.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇమిగ్రేషన్ విధానాలపై స్పందిస్తూ.. అమెరికా అంటేనే వలసవాదుల దేశంగా సత్య అభివర్ణించారు. భిన్నత్వానికి అమెరికా ప్రతీకగా నిలుస్తుందని, అత్యుత్తమమైన ఆ దేశ వలసచట్టాలతో ప్రయోజనం పొందినవారిలో తాను కూడా ఒకర్నని ఆయన పేర్కొన్నారు. అయితే ఉద్యోగాల కల్పన విషయానికొస్తే.. భారత్‌లో భారతీయులకే తొలి ప్రాధాన్యం దక్కాలని, అలాగే అమెరికాలోనూ అదే విధానం ఉండాలని సత్య అభిప్రాయపడ్డారు. తమ కార్యకలాపాలు ఉన్న ప్రతీ దేశంలో ఆర్థిక వృద్ధి అవకాశాలు కల్పించాలన్నదే మైక్రోసాఫ్ట్ లక్ష్యమని ఆయన చెప్పారు. ‘ఉదాహరణకు నేనిప్పుడు భారత్‌కి వచ్చినప్పుడు భారత ప్రయోజనాల గురించి మాట్లాడగలగాలి. భారత ఆర్థిక వృద్ధికి తోడ్పడేలా మేం ఏం చేయగలిగామన్నది చెప్పగలిగి ఉండాలి. అదే విధంగా అమెరికాలో అమెరికాకు తొలి ప్రాధాన్యమివ్వాలి.. బ్రిటన్ వెడితే బ్రిటన్‌కు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి‘ అని సత్య పేర్కొన్నారు. భేదం చూపించకుండా అందరికీ సమానఅవకాశాలు కల్పించడం వంటి అమెరికా విలువలను కాపాడటానికి కూడా మైక్రోసాఫ్ట్ అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని వివరించారు. -
నేడు హైదరాబాద్‌కు సత్య నాదెళ్ల
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల సోమవారం (డిసెంబర్ 28) హైదరాబాద్ వస్తున్నారు. నాలుగు రోజుల పర్యటన నిమిత్తం భాగ్యనగరంలో అడుగుపెడుతున్నారు. మైక్రోసాఫ్ట్ సీఈవోగా బాధ్యతలు చేపట్టిన తర్వాత హైదరాబాద్‌కు రావడం ఇది రెండోసారి. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఇంకుబేటర్ ‘టి-హబ్’ను ఈ సందర్భంగా సత్య నాదెళ్ల సందర్శించనున్నారు. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావుతో కలిసి ఒక గంటపాటు టి-హబ్‌లో గడపనున్నట్టు సమాచారం. ఈ సందర్భంగా టీ-హబ్‌లోని స్టార్టప్ కంపెనీల ప్రతినిధులతో సమావేశం కానున్నట్టు తెలుస్తోంది. ఈ విషయమై తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. కాగా, సత్య నాదెళ్ల ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడుతో కలిసి నేడు అల్పాహారం(బ్రేక్‌ఫాస్ట్) చేయనున్నారు. పలు ప్రాజెక్టుల కోసం టెక్నాలజీ అమలుకు ఈ సందర్భంగా మైక్రోసాఫ్ట్‌తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం చేసుకునే అవకాశం ఉంది. -
వచ్చే నెలలో హైదరాబాద్‌కు సత్యనాదెళ్ల!
-
వచ్చే నెలలో హైదరాబాద్‌కు సత్యనాదెళ్ల!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల డిసెంబరులో హైదరాబాద్‌కు రానున్నట్టు సమాచారం. క్లౌడ్ సేవల కోసం ఉద్దేశించిన డేటా సెంటర్ ఏర్పాటుపై తెలంగాణ ప్రభుత్వంతో చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవలే మైక్రోసాఫ్ట్ పుణే, ముంబై, చెన్నైలో డేటా సెంటర్లు ప్రారంభించిన సంగతి తెలిసిందే. వాస్తవానికి భారత్‌లో తొలి డేటా సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని సంస్థ గతంలోనే భావించింది. కొన్ని అనివార్య కారణాలతో ఈ ప్రతిపాదనకు బ్రేక్ పడింది. భాగ్యనగరిలో కంపెనీకి సొంత స్థలం కూడా ఉందని మైక్రోసాఫ్ట్ వర్గాలు చెబుతున్నాయి. డేటా సెంటర్ ఏర్పాటు ఆలోచనను మైక్రోసాఫ్ట్ విరమించుకోలేదని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. వచ్చే నెల హైదరాబాద్‌కు నాదెళ్ల వస్తున్నారని, ఈ సందర్భంగా సెంటర్ నెలకొల్పే అంశంపై స్పష్టత రావొచ్చన్నారు. నూతన పారిశ్రామిక విధానం ప్రకటించిన తర్వాత దేశ, విదేశీ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులకు ఉత్సాహం చూపిస్తున్నాయని గుర్తు చేశారు. కాగా, మైక్రోసాఫ్ట్‌కు సీఈవో బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా నాదెళ్ల సెప్టెంబరులో హైదరాబాద్‌లో అడుగు పెట్టారు. గచ్చిబౌలిలో ఉన్న మైక్రోసాఫ్ట్ ఇండియా డెవలప్మెంట్ సెంటర్లో సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్ సెంటర్‌ను విస్తరించనున్నట్టు ఆ సమయంలో ప్రకటించారు కూడా. -
స్టార్టప్‌లకు మైక్రోసాఫ్ట్ దన్ను..
సంస్థ సీఈవో సత్య నాదెళ్ల వెల్లడి జస్ట్‌డయల్, పేటీఎం, స్నాప్‌డీల్‌తో ఒప్పందం ముంబై: భారత్‌లో స్మార్ట్ సిటీల రూపకల్పనలో నిమగ్నమైన వందల కొద్దీ స్టార్టప్ సంస్థలకు, ఔత్సాహిక యువ వ్యాపారవేత్తలకు తోడ్పాటు ఇవ్వనున్నట్లు సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల చెప్పారు. ఇక్కడి స్టార్టప్ సంస్కృతి తనను అబ్బురపరుస్తోందన్నారు. కొత్తగా ప్రవేశపెట్టిన స్థానిక మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సేవలు, నూతన డివైజ్‌లు.. అపార వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఎంట్రప్రెన్యూర్లకి ఉపయోగపడగలవని ఆయన తెలిపారు. భారత్‌లో తొలిసారిగా మైక్రోసాఫ్ట్ భారీ ఎత్తున నిర్వహించిన క స్టమర్ల సదస్సులో పాల్గొన్న సందర్భంగా నాదెళ్ల ఈ విషయాలు వివరించారు. భారత్‌లో క్లౌడ్ కంప్యూటింగ్‌కి ప్రాధాన్యం పెరుగుతున్న తీరు తనను ఎంతగానో ఆకట్టుకుందని నాదెళ్ల చెప్పారు. ఈ నేపథ్యంలోనే పుణే, ముంబై, చెన్నైలలో మైక్రోసాఫ్ట్ మూడు డేటా సెంటర్లు ప్రారంభించిందని పేర్కొన్నారు. మరోవైపు, ఈ-కామర్స్ సంస్థలు జస్ట్‌డయల్, పేటీఎం, స్నాప్‌డీల్ సంస్థలతో మైక్రోసాఫ్ట్ భాగస్వామ్యం కుదుర్చుకుంది. వ్యాల్యుయేషన్ల గురించి ఆందోళన లేదు.. స్టార్టప్ సంస్థల్లో తాము ఇన్వెస్టర్లుగా ఉండబోవడం లేదు కాబట్టి.. వాటి వ్యాల్యుయేషన్ల గురించి పెద్దగా ఆలోచించడం లేదని నాదెళ్ల చెప్పారు. ఆయా ఆవిష్కర్తల అబ్బురపరిచే ఐడియాలపైనే తాము ఆసక్తిగా ఉన్నామని ఆయన వివరించారు. స్టార్టప్ ఎంట్రప్రెన్యూర్లు కొంగొత్త ఆవిష్కరణలు చేసేందుకు దాదాపు రూ.80 లక్షల విలువైన అజూర్ కంప్యూటింగ్ సొల్యూషన్స్‌ను అందిస్తామని నాదెళ్ల పేర్కొన్నారు. స్మార్ట్ సిటీల ఏర్పాటుకు తోడ్పడే డిజిటల్ ప్రాజెక్టులను నిర్వహిస్తామన్నారు. తాము చేపట్టిన కార్యక్రమాల ప్రభావం వచ్చే ఐదేళ్లలో 50 స్మార్ట్ సిటీలపై కనిపించగలవని నాదెళ్ల చెప్పారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం, ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసిలో పైలట్ ప్రాజెక్టులు అమలు చేస్తున్నామని తెలిపారు. కస్టమర్లకు మరింత మెరుగైన సేవలు: సెర్చి ఇంజిన్ బింగ్, క్లౌడ్ ఆధారిత అనలిటిక్స్ తోడ్పాటుతో కస్టమర్లకు మెరుగైన సేవలు అందించేందుకు మైక్రోసాఫ్ట్, జస్ట్‌డయల్ కలిసి పనిచేయనున్నాయి. కస్టమర్లు మొబైల్ లావాదేవీలు సులువుగా నిర్వహించుకునేందుకు, బిల్లులను సులభతరంగా ఆన్లైన్లోనే చెల్లించే వీలు కల్పించేందుకు కోర్టానా బ్రౌజర్‌తో పేటీఎం యాప్, పేటీఎం వాలెట్‌ను అనుసంధానం చేసే అంశంపై పేటీఎం, మైక్రోసాఫ్ట్ చేతులు కలిపాయి. ఈ డీల్‌లో భాగంగా పేటీఎం తమ నెట్వర్క్ ద్వారా మైక్రోసాఫ్ట్ సర్వీస్ సేల్స్‌కు తోడ్పాటునివ్వనుంది. అటు ఆన్లైన్లో వాహనాల విక్రయానికి తోడ్పడేలా రూపొందిస్తున్న వ్యవస్థ కోసం స్నాప్‌డీల్.. మైక్రోసాఫ్ట్ క్లౌడ్ ప్లాట్‌ఫాంను ఉపయోగించుకోనుంది. పాస్వర్డ్హ్రిత ప్రపంచంపై కసరత్తు .. ఈమెయిల్స్, మొబైల్ ఫోన్స్ భద్రతపై ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో యూజర్లకు పాస్వర్డ్ కష్టాల నుంచి విముక్తి కల్పించే దిశగా కసరత్తు చేస్తున్నట్లు నాదెళ్ల తెలిపారు. పాస్వర్డ్లు హ్యాకింగ్‌కు గురయ్యే ప్రసక్తి లేకుండా కంప్యూటింగ్ పరికరాలకు రక్షణ కల్పించాలన్నది తమ ఉద్దేశమన్నారు. ప్రపంచం, టెక్నాలజీలు మారిపోతున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు ఉత్పాదకత ను, వ్యాపార ప్రక్రియలను మెరుగుపర్చుకోవాలన్నది తమ కంపెనీ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. తాను వ్యక్తిగతంగా ఉపయోగించే సాధనాల గురించీ నాదెళ్ల ప్రస్తావించారు. ‘నేను మా కంపెనీ తయారు చేసే హైఎండ్ లూమియాతో పాటు ఐఫోన్ నూ వాడతా ను. అయితే, దీన్ని ఐఫోన్ ప్రోగా భావిస్తా. ఎందుకంటే ఇందు లో మా మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్ మొత్తం ఉంటుంది’ అని సత్య చెప్పారు. జనవరిలో సర్ఫేస్ ప్రో 4.. వచ్చే ఏడాది జనవరిలో సర్ఫేస్ ప్రో 4 ట్యాబ్లెట్‌ను భారత్‌లో ఆవిష్కరించనున్నట్లు నాదెళ్ల తెలిపారు. 12.3 అంగుళాల పిక్సెల్సెన్స్ డిస్ప్లే, 9 గంటల బ్యాటరీ లైఫ్, 64 జీబీ నుంచి 500 జీబీ దాకా స్టోరేజ్ ఆప్షన్స్ ఇందులో ఉంటాయి. దీని ఖరీదు రూ. 75,000గా ఉండొచ్చని అంచనా. డిసెంబర్లో లుమియా 950, లుమియా 950 ఎక్స్ఎల్ ఫోన్లను ప్రవేశపెట్టనున్నట్లు మైక్రోసాఫ్ట్ ఇండియా చైర్మన్ భాస్కర్ ప్రామాణిక్ తెలిపారు. సంస్కరణల అమలుతోనే పురోగతి.. గడచిన 12 నెలలుగా తమ క్లౌడ్ వ్యాపారం గణనీయంగా వృద్ధి చెందిందని, వ్యవస్థాగతమైన సంస్కరణలు అమలవుతుండటం వల్లే ఇది సాధ్యపడిందని తాను భావిస్తున్నట్లు నాదెళ్ల పేర్కొన్నారు. ప్రభుత్వ విభాగాలతో సాధ్యమైనంత వరకూ ఘర్షణాత్మక పరిస్థితి లేకుండా చూసుకునేందుకే తాను ప్రాధాన్యం ఇస్తానని ఎడిటర్లతో జరిగిన సమావేశంలో ఆయన వివరించారు. ఏడాది క్రితం ప్రవేశపెట్టిన తమ క్లౌడ్ సర్వీసులను ప్రైవేట్ సంస్థలే కాకుండా ప్రభుత్వ సంస్థలు కూడా పెద్ద ఎత్తున వినియోగిస్తుండటం తనను ఆశ్చర్యపర్చిందన్నారు. -
మైక్రోసాఫ్ట్‌లో 7,800 ఉద్యోగాల కోత
నోకియా డీల్‌లో 7.6 బిలియన్ డాలర్ల రైటాఫ్ న్యూయార్క్ : మొబైల్ పరికరాల వ్యాపార విభాగం పునర్వ్యవస్థీకరణలో భాగంగా టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 7,800 ఉద్యోగాల్లో కోత విధించనుంది. అలాగే నోకియా డివెజైస్ అండ్ సర్వీసెస్ వ్యాపారం కొనుగోలుకు సంబంధించి 7.6 బిలియన్ డాలర్లు రైటాఫ్ చేయనుంది. దీనికి అదనంగా దాదాపు 750-850 మిలియన్ డాలర్ల మేర రీస్ట్రక్చరింగ్ వ్యయాలను భరించనుంది. కంపెనీ సీఈవో సత్య నాదెళ్ల.. మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు రాసిన ఈ-మెయిల్లో ఈ విషయాలు వివరించారు. ‘ఫోన్ల వ్యాపారంపై తీసుకున్న నిర్ణయాల ప్రభావాలను మీకు తెలియజేయదల్చుకున్నాను. ఈ మార్పులు, చేర్పుల వల్ల ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా ఫోన్ల వ్యాపార విభాగంలో దాదాపు 7,800 దాకా ఉద్యోగాల్లో కోత పడే అవకాశం ఉంది’ అని ఈమెయిల్లో ఆయన పేర్కొన్నారు. అయితే, భారత్‌లో ఈ ప్రభావం ఎంత మేరకు ఉండొచ్చన్నది వెల్లడించలేదు. -
మైక్రోసాఫ్ట్‌కు భారత్‌లో అపార వ్యాపారావకాశాలు
శాన్ ఫ్రాన్సిస్కో: క్లౌడ్ కంప్యూటింగ్‌కి ప్రాచుర్యం పెరుగుతున్న నేపథ్యంలో తమ సంస్థకు భారత్‌లో అపార వ్యాపారావకాశాలు ఉన్నాయని ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల తెలిపారు. రాబోయే రోజుల్లో మొబైల్ , క్లౌడ్ కంప్యూటింగ్‌కి మరింత ప్రాధాన్యం పెరుగుతుందని వివరించారు. బిల్డ్ 2015 కాన్ఫరెన్స్‌లో భాగంగా జరిగిన ఇన్వెస్టర్ల సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. కస్టమర్లు తమ వ్యాపారాలను మెరుగుపర్చుకోవడంలో గణనీయంగా తోడ్పాటు అందించడమే తమ లక్ష్యమని సత్య నాదెళ్ల వివరించారు.