
న్యూఢిల్లీ: మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యా నాదెళ్ల భారత్‌లో పర్యటించనున్నారు. తెలుగువాడైన నాదెళ్ల ఈ నెల 24–26 తేదీల్లో తన సొంత దేశంలో ఉండనున్నారు. కస్టమర్లు, యువ సాధకులు, విద్యార్థులు, డెవలపర్లు, టెక్ సంస్థల వ్యవస్థాపకులను కలిసేందుకు ఈయన భారత్ వస్తున్నారని ఒక ఈ–మెయిల్ ప్రశ్నకు కంపెనీ బదులిచ్చింది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు నగరాల్లో నాదెళ్ల పర్యటించే అవకాశం ఉందని తెలుస్తోంది. సంస్థ చీఫ్ హోదాలో ఇప్పటికే పలు మార్లు ఈయన భారత్‌కు వచ్చిన విషయం తెలిసిందే కాగా, ఈ సారి పర్యటన ఎందుకనే విషయాన్ని మాత్రం ఇప్పటి వరకు కంపెనీ స్పష్టంచేయలేదు.