సునీతా విలియమ్స్‌కు ప్రధాని మోదీ లేఖ.. ఏమన్నారంటే? | PM Modi Letter To Sunita Williams | Sakshi
Sakshi News home page

Sunita Williams : సునీతా విలియమ్స్‌కు ప్రధాని మోదీ లేఖ.. ఏమన్నారంటే?

Published Tue, Mar 18 2025 2:43 PM | Last Updated on Tue, Mar 18 2025 4:27 PM

PM Modi Letter To Sunita Williams

ఢిల్లీ : భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్‌ (sunita Williams)కు ప్రధాని మోదీ (narendra modi) లేఖ రాశారు. భారత్‌లో పర్యటించాలని కోరారు.

దాదాపు 9 నెలల పాటు అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్‌, మరో వ్యోమగామి బుచ్‌ విల్మోర్‌ ఎట్టకేలకు భూమ్మీదకు రానున్నారు. బుధవారం ఉదయం 3 గంటల తర్వాత భూమ్మీదకు చేరుకున్నారు.

ఈ తరుణంలో సునీతా విలియమ్స్‌కు ప్రధాని మోదీ లేఖ రాశారు. ఆ లేఖను కేంద్ర మంత్రి జితేందర్‌ సింగ్‌ సోషల్‌ మీడియా వేదికగా షేర్‌ చేశారు. మోదీ సునీతా విలియమ్స్‌కు రాసిన లేఖలో ‘సునీతా విలియమ్స్‌ సురక్షితంగా భూమ్మీదకు చేరాలని ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోంది. ఆమె వేలమైళ్లు దూరంలో ఉన్నా.. మన హృదయాలకు దగ్గరగానే ఉన్నారు. ఆమె ఆరోగ్యం బాగుండాలని దేశ ప్రజలు ప్రార్థిస్తున్నారు’ అని గుర్తు చేశారు.  

అంతేకాదు, మోదీ తన అమెరికా పర్యటనలో గతేడాది జూన్‌ 5న అంతరిక్ష కేంద్రానికి వెళ్లి, ప్రతికూల పరిస్థితుల కారణంగా సునీతా విలియమ్స్‌, మరో వ్యోమగామి బుచ్‌ విల్మోర్‌లు అక్కడ చిక్కుకున్నారు. అప్పటి నుంచి ఆస్ట్రోనాట్స్‌ను భూమ్మీదకు తెచ్చేందుకు నాసా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఆ ప్రయత్నాలతో పాటు ఆస్ట్రోనాట్స్‌ గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో పాటు మాజీ అధ్యక్షుడు జోబైడెన్‌ వద్ద ఆరా తీసినట్లు లేఖలో తెలిపారు.

ఈ నెలలో ఢిల్లీలో నాసా మాజీ వ్యోమగామి మైక్ మాసిమినోతో జరిగిన సమావేశంలో సునీత విలియమ్స్‌ పేరును ప్రస్తావనకు తేవడమే కాదు, ఆమె సేవల్ని తమ సంభాషణలో ప్రస్తావనకు వచ్చిందని ప్రధాని మోదీ గుర్తు చేసుకున్నారు.

ISSలో ఉండగా సునీత విలియమ్స్ కు ప్రధాని మోదీ లేఖ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement