బైడెన్.. ఎవరిని గెలిపించేందుకు భారత్‌కు డబ్బులిచ్చారు?: ట్రంప్‌ | Donld Trump Key Comments Over USAID fund To Indian government | Sakshi
Sakshi News home page

బైడెన్.. ఎవరిని గెలిపించేందుకు భారత్‌కు డబ్బులిచ్చారు?: ట్రంప్‌

Feb 20 2025 9:12 AM | Updated on Feb 20 2025 11:34 AM

Donld Trump Key Comments Over USAID fund To Indian government

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌, భారత్‌పై సంచలన ఆరోపణలు చేశారు. భారత్‌లో ఓటింగ్‌ శాతం కోసం 21 మిలియన్‌ డాలర్లను అమెరికా ఎందుకు ఖర్చు చేయాలి? అని ప్రశ్నించారు. ఎవరినో గెలిపించేందుకే బైడెన్‌ ఇలా చేశారని ఆరోపించారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్‌ ట్రంప్‌ తాజాగా మియామీలో ఓ సదస్సుల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రంప్‌ మాట్లాడుతూ..‘భారత్‌లో ఓటింగ్‌ శాతం కోసం మనమెందుకు 21 మిలియన్‌ డాలర్లను ఖర్చు చేయాలి?. భారత్‌లో మరెవర్నో గెలిపించేందుకు వారు (బైడెన్‌ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ) ప్రయత్నించినట్లు అర్థమవుతోంది. ఈ విషయాన్ని భారత ప్రభుత్వానికి తప్పనిసరిగా తెలియజేయాలి. ఎవరి కోసం బైడెన్‌ డబ్బులు ఇచ్చారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. అదే కీలక ముందడుగు అవుతుంది’ అంటూ కామెంట్స్‌ చేశారు.

ఇదిలా ఉండగా.. భారత్‌లో జరిగే ఎన్నికల్లో ఓటర్ల సంఖ్యను పెంచేందుకు అందించే 21 మిలియన్ డాలర్ల ఫండ్‌ను ఇటీవల అమెరికా డోజ్‌ విభాగం రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే భారత్‌పై ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత ఎన్నికల్లో ఓటర్ల సంఖ్యను పెంచేందుకు అమెరికా డబ్బులు ఎందుకు?. 21 మిలియన్‌ డాలర్లు ఇవ్వడమేంటి?. భారత్‌ వద్దే చాలా సొమ్ము ఉంది. ప్రపంచంలోనే అత్యధిక పన్నులు వసూలు చేస్తున్న దేశాల్లో భారత్‌ ఒకటి. మాకు భారత ప్రజలు, ఆ దేశ ప్రధాని మోదీ పట్ల చాలా గౌరవం ఉంది అంటూ కామెంట్స్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement