![Trump to Modi: We Missed You A Lot](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/14/modi_0.jpg.webp?itok=AIuP_B6s)
వాషింగ్టన్ : ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi US Visit) రెండురోజుల అమెరికా పర్యటనలో భాగంగా దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (donald trump)తో భేటీ అయ్యారు. భారత కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో వాషింగ్టన్ వైట్ హౌస్ (white house) వెస్ట్ వింగ్ లాబీలో ట్రంప్‌తో మోదీ భేటీ అయ్యారు. ఈ భేటీలో ఆసక్తికర సన్నివేశం జరిగింది.
వెస్ట్‌లాబీలో ఉన్న ట్రంప్‌తో మోదీ కరచాలనం చేశారు. అనంతరం, ఒకరినొకరు కౌగిలించుకున్నారు. ఆ సమయంలో ‘మిత్రమా నేను మిమ్మల్ని చాలా మిస్సయ్యాను’అంటూ ట్రంప్‌తో మోదీని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. మోదీ సైతం ట్రంప్‌ను ఆప్యాయంగా పలకరించారు. ఆ ఆసక్తిర సన్నివేశాన్ని వైట్‌హౌస్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ డాన్ స్కావినో ఎక్స్ వేదిగా ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
#WATCH | Washington, DC | PM Narendra Modi and President Donald Trump share a hug as the US President welcomes the PM at the White House
President Trump says, "We missed you, we missed you a lot." pic.twitter.com/XTk1h7mINM— ANI (@ANI) February 13, 2025
ఇక ట్రంప్‌తో మోదీ భేటీ సమయంలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఎ) అజిత్ దోవల్, యుఎస్‌లో భారత రాయబారి వినయ్ మోహన్ క్వాత్రాతో సహా భారత ప్రతినిధి బృందం పాల్గొన్నారు.
వైట్‌హౌస్‌లో ప్రెసిడెంట్ ట్రంప్‌తో సమావేశానికి ముందు ప్రధాని మోదీ యుఎస్ జాతీయ భద్రతా సలహాదారు మైక్ వాల్ట్జ్, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్, భారత సంతతికి చెందిన వ్యవస్థాపకుడు వివేక్ రామస్వామి, యుఎస్ డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ (డిఎన్‌ఐ) తులసి గబ్బార్డ్‌లతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు
అంతకుముందు, ప్రధాని మోదీ రాకకు ముందు వైట్‌హౌస్‌లో భారత జెండాలను ఏర్పాటు చేశారు. అధ్యక్షుడు ట్రంప్ ప్రమాణస్వీకారం తర్వాత అమెరికాలో పర్యటించిన అతి కొద్ది మంది దేశాది నేతల్లో ప్రధాని మోదీ ఒకరు. ట్రంప్ నూతన అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే అమెరికాలో పర్యటించాలని మోదీకి ఆహ్వానం అందింది. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ట్రంప్‌తో మోదీ రెండుసార్లు ఫోన్‌లో మాట్లాడారు. ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీ ప్రత్యేక ప్రతినిధిగా విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment