ట్రంప్‌ విజయంపై భారత్‌ ఆందోళన?.. జైశంకర్‌ రిప్లై ఇదే.. | S Jaishankar Says India Not Among Countries Nervous Over Donald Trump Poll Victory In US Elections, See Details | Sakshi
Sakshi News home page

ట్రంప్‌ విజయంపై భారత్‌ ఆందోళన?.. జైశంకర్‌ రిప్లై ఇదే..

Published Mon, Nov 11 2024 7:39 AM | Last Updated on Mon, Nov 11 2024 9:13 AM

S Jaishankar says India not among countries nervous over Trump poll victory

ముంబై: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌ ఘన విజయం సాధించి.. అధ్యక్షుడిగా ఎన్నికవటంపై భారత్‌ విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌. జైశంకర్‌ ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు. ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక చాలా దేశాలు భయాందోళనకు గురవుతున్నాయని, కానీ వాటిలో భారత్ లేదని స్పష్టం చేశారు. ముంబైలో ఆదిత్య బిర్లా 25వ సిల్వర్ జూబ్లీ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్‌లో పాల్గొన్న  ఆయన ప్రసంగిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.

‘‘ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికాకు అధ్యక్షులుగా పని చేసిన పలువురితో సత్సంబంధాలను ఏర్పరచుకున్నారు. మోదీ.. మొదట వాషింగ్టన్ డీసీని సందర్శించినప్పుడు.. బరాక్ ఒబామా అధ్యక్షుడిగా ఉన్నారు. తర్వాత డొనాల్డ్ ట్రంప్, ఆయన అనంతరం జో బిడెన్ అధ్యక్షులుగా ఉన్నారు. మోదీ అమెరికా అధ్యక్షులుగా ఉన్నవారితో సంబంధాలను సహజంగానే ఏర్పరుచుకుంటారు. అయితే.. ప్రస్తుత పరిస్థితులల్లో అనేక దేశాలు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్‌ గురించి ఆందోళన చెందుతున్నాయి.  అయితే వాటిలో భారత్‌ లేదు’’ అని స్పష్టం చేశారు.

ఇక.. నవంబర్ 5న జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌ ఘన విజయం సాధించిన అనంతరం భారత ప్రధాని మోదీ ఆయనకు ఫోన్ చేసి అభినందనలు తెలిపిన విషయం తెలిసిందే. ఫోన్‌ సంభాషణ సమయంలో.. ప్రధాని మోదీపై ట్రంప్‌ ప్రశంసలు కురిపించారు. మోదీని అద్భుతమైన వ్యక్తిగా అభివర్ణించారు. ప్రపంచం మొత్తం మోదీని ప్రేమిస్తోందని అన్నారు.

చదవండి: ట్రంప్‌ ‘2.0’ విదేశీ విధానంపై సర్వత్రా ఉత్కంఠ 

చదవండి: కెనడాలో ఆలయంపై దాడి.. స్పందించిన భారత విదేశాంగ శాఖ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement