S Jaishankar
-
ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం, వేదిక ఖరారు
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ (donald trump) ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు షురూ అయ్యాయి. ప్రమాణ స్వీకార మహోత్సవానికి సంబంధిత విభాగం ఆయా దేశాలకు ఆహ్వానం పంపుతోంది. తాజాగా భారత్ (india)కు సైతం ఆహ్వానం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకార చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకారంలో పాల్గొనాలంటూ భారత్‌కు ఆహ్వానం అందింది. భారత్ తరుఫున కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ (S Jaishankar) హాజరు కానున్నారు.గతేడాది అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన ట్రంప్ జనవరి 20న అధ్యక్షుడిగా ప్రమాణం స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా ‘ట్రంప్-వాన్స్ ప్రారంభోత్సవ కమిటీ ఆహ్వానం మేరకు, విదేశాంగ మంత్రి డాక్టర్ జైశంకర్ అమెరికా 47వ అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవంలో భారత ప్రభుత్వం తరపున ప్రాతినిధ్యం వహిస్తారు.’ అని కేంద్రం వెల్లడించింది. అమెరికా పర్యటనలో ట్రంప్‌తో పాటు, ఇతర నేతలు, రాజకీయేతర ప్రముఖుల్ని సైతం కలవనున్నారు. క్యాపిటల్ భవనం ముందు అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమంలో ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం ట్రంప్ ప్రసంగిస్తారు. ప్రమాణ స్వీకారానికి జో బైడెన్ హాజరుకానున్నారు. కాగా, 2020 అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి పాలైన ట్రంప్.. జోబైడెన్ ప్రమాణ స్వీకారానికి గైర్హాజరయ్యారు. ట్రంప్ ప్రారంభోత్సవ వేడుకకు పలువురు ప్రపంచ నేతలను ఆహ్వానించినట్లు సమాచారం. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలీ, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అంగీకరించినట్లు సమాచారం 👉చదవండి : నా ఉరిశిక్షను రద్దు చేయండి.. కోర్టుకు ట్విన్ టవర్స్ దాడి మాస్టర్‌మైండ్ -
ట్రంప్ విజయంపై భారత్ ఆందోళన?.. జైశంకర్ రిప్లై ఇదే..
ముంబై: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించి.. అధ్యక్షుడిగా ఎన్నికవటంపై భారత్ విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక చాలా దేశాలు భయాందోళనకు గురవుతున్నాయని, కానీ వాటిలో భారత్ లేదని స్పష్టం చేశారు. ముంబైలో ఆదిత్య బిర్లా 25వ సిల్వర్ జూబ్లీ స్కాలర్షిప్ ప్రోగ్రామ్‌లో పాల్గొన్న ఆయన ప్రసంగిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.‘‘ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికాకు అధ్యక్షులుగా పని చేసిన పలువురితో సత్సంబంధాలను ఏర్పరచుకున్నారు. మోదీ.. మొదట వాషింగ్టన్ డీసీని సందర్శించినప్పుడు.. బరాక్ ఒబామా అధ్యక్షుడిగా ఉన్నారు. తర్వాత డొనాల్డ్ ట్రంప్, ఆయన అనంతరం జో బిడెన్ అధ్యక్షులుగా ఉన్నారు. మోదీ అమెరికా అధ్యక్షులుగా ఉన్నవారితో సంబంధాలను సహజంగానే ఏర్పరుచుకుంటారు. అయితే.. ప్రస్తుత పరిస్థితులల్లో అనేక దేశాలు అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ గురించి ఆందోళన చెందుతున్నాయి. అయితే వాటిలో భారత్ లేదు’’ అని స్పష్టం చేశారు.#WATCH | Mumbai: At Aditya Birla 25th Silver Jubilee Scholarship Program, EAM Dr S Jaishankar says "...The Prime Minister was among the first three calls President Trump took. PM Modi has built rapport across multiple Presidents. When he first came to DC, Obama was the President,… pic.twitter.com/hSLDK8sKKF— ANI (@ANI) November 10, 2024ఇక.. నవంబర్ 5న జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించిన అనంతరం భారత ప్రధాని మోదీ ఆయనకు ఫోన్ చేసి అభినందనలు తెలిపిన విషయం తెలిసిందే. ఫోన్ సంభాషణ సమయంలో.. ప్రధాని మోదీపై ట్రంప్ ప్రశంసలు కురిపించారు. మోదీని అద్భుతమైన వ్యక్తిగా అభివర్ణించారు. ప్రపంచం మొత్తం మోదీని ప్రేమిస్తోందని అన్నారు.చదవండి: ట్రంప్ ‘2.0’ విదేశీ విధానంపై సర్వత్రా ఉత్కంఠ చదవండి: కెనడాలో ఆలయంపై దాడి.. స్పందించిన భారత విదేశాంగ శాఖ -
పన్నూ మమ్మల్ని బెదిరించాడు: ఆస్ట్రేలియన్ టుడే
భారతదేశ విదేశాంగశాఖ మంత్రి ఎస్. జైశంకర్ ఇంటరర్వ్యూ ప్రసారం చేసినందుకు ఆస్ట్రేలియా టుడే మీడియా సంస్థపై ఇటీవల కెనడా నిషేధం విధించింది. అయితే.. వ్యవహారంపై తాజాగా ఆ మీడియా సంస్థ వ్యవస్థాపకుడు, ఎడిటర్-ఇన్-చీఫ్ జితార్థ్ జై భరద్వాజ్ స్పందించారు. ప్రతికాస్వేచ్ఛను హత్య చేయటమేనని జస్టిన్ ట్రూడో ప్రభుత్వంపై మండిపడ్డారు. గుళ్లపై పదేపదే దాడులు జరుగుతున్నా ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రశ్నిచారు.‘‘ కెనడా చర్య.. పత్రికా స్వేచ్ఛను హతమార్చటం అవుతుంది. ప్రజాస్వామ్యంలో విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేసే హక్కు ఉంది. విభిన్న అభిప్రాయాలన్నింటినీ చర్చించడానికి, అర్థం చేసుకోవడానికి, విశ్లేషించడానికే పత్రికలు ఉన్నాయి. గురుపత్వంత్ సింగ్ పన్నూ మమ్మల్ని బెదిరించాడు. ...ఇతర వేర్పాటువాదుల నుంచి కూడా బెదిరింపులు వచ్చాయి. అమెరికా, కెనడాలో కవరేజీ చేసినందుకు మా చిత్రాలను పన్నూ ఆన్లైన్లో పెట్టారు. అనేక రకాలుగా హాని తలపెట్టమని ఆయన మద్దతుదారులను ఉసిగొల్పారు. అయినా.. మేం భయపడకుండా నిరంతరం రిపోర్టింగ్ చేస్తున్నాం’’అని అన్నారు.చదవండి: కెనడాలో ‘ఆస్ట్రేలియా టుడే’పై నిషేధం -
కెనడాలో ఆలయంపై దాడి.. స్పందించిన భారత విదేశాంగ శాఖ
బ్రాంప్టన్‌లోని హిందూ దేవాలయంపై ఇటీవల జరిగిన దాడిపై భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. అధ్యక్షుడు జస్టిన్ ట్రూడో నేతృత్వంలోని కెనడా ప్రభుత్వం.. తీవ్రవాద శక్తులకు రాజకీయాల్లో చోటు కల్పిస్తోందని ఆరోపణలు చేశారు. మంగళవారం ఆయన ఆస్ట్రేలియాలో మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు.‘‘కెనడాలోని బ్రాంప్టన్‌లో ఖలిస్తాన్ తీవ్రవాదులు.. హిందూ ఆలయంపై దాడి చేశారు. హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో కెనడా నిరాధారమైన ఆరోపణలు చేసింది. కెనడా అక్రమంగా భారతీయ దౌత్యవేత్తలను నిఘాలో ఉంచింది. కెనడా భారత్‌పై ఆరోపణలు చేసే విధానాన్ని ముందుకు తీసుకువెళ్తోంది. కెనడా భారత్ దౌత్యవేత్తలు నిఘా ఉంచింది. ఇది ఆమోదయోగ్యం కాని విషయం. కెనడా తీవ్రవాద శక్తులకు రాజకీయాల్లో చోటు కల్పిస్తోందని భావిస్తున్నా. కెనడాలో జరిగిన దాడి ఘటన భారత్‌కు ఆందోళన కలిగించింది’’ అని అన్నారు.#Breaking: EAM Dr S Jaishankar reacts to Canada developments "Canada has developed a pattern of making allegations without providing specifics" Unacceptable Indian diplomats put under surveillance "Political space given to extremists force" in #Canada pic.twitter.com/lj9bIjTv91— Rohit Chaudhary (@rohitch131298) November 5, 2024 -
పాకిస్తాన్లో జై శంకర్.. ప్రధాని షరీఫ్‌తో కరచాలనం
ఇస్లామాబాద్: షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్సీఓ) సదస్సుకు హాజరయ్యేందుకు భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ మంగళవారం పాకిస్తాన్ చేరుకున్నారు. ఆయనకు నూర్ ఖాన్ ఎయిర్‌బేస్ వద్ద పాకిస్తాన్ సీనియర్ అధికారులు సాదర స్వాగతం పలికారు. అనంతరం ఇస్లామాబాద్‌లో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో జై శంకర్ మావేశమయ్యారు.సభ్యదేశాల అతిథుల కోసం షరీఫ్ ఏర్పాటు చేసిన విందులో ఇరువురు నేతలం కరచాలనం చేసుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కాగా రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తోంది. సభ్యదేశాల నుంచి అగ్రనేతలు పాల్గొంటున్న ఈ సమ్మిట్‌లో ఆర్థిక, వాణిజ్య, పర్యావరణ, సామాజిక-సాంస్కృతిక సంబంధాల్లో సభ్యదేశాల పరస్పర సహకారంపై చర్చించనున్నారు. #WATCH | Islamabad: Pakistan PM Shehbaz Sharif welcomes EAM Dr S Jaishankar and other SCO Council Heads of Government, to a dinner hosted by him.EAM is in Pakistan to participate in the 23rd Meeting of SCO Council of Heads of Government.(Video Source: PTV) pic.twitter.com/BHtUhuLm9e— ANI (@ANI) October 15, 2024ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. భద్రతా కారణాల దృష్ట్యా ఇస్లామాబాద్, రావల్పిండిలో కీలక మార్గాలు, వ్యాపారాలను మూసివేశారు. ఇదిలా ఉండగా భారత్-పాక్ మధ్య సంబంధాలు సన్నగిల్లిన క్రమంలో భారత సీనియర్ మంత్రి ఆదేశంలో అడుగుపెట్టడం గత తొమ్మిదేళ్లలో ఇదే మొదటిసారి. చివరిసారిగా 2015 డిసెంబర్లో అప్పటి భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ఆప్ఘనిస్థాన్‌లో సదస్సు కోసం ఇస్లామాబాద్ వెళ్లారు.Landed in Islamabad to take part in SCO Council of Heads of Government Meeting. pic.twitter.com/PQ4IFPZtlp— Dr. S. Jaishankar (@DrSJaishankar) October 15, 2024 -
కిమ్ కాదు, సోరోస్ కాదు.. ఉపవాసానికే నా ఓటు!
ఓవైపు అంతర్జాతీయ అంశాలపై అనర్గళంగా మాట్లాడి ఆకట్టుకునే విదేశాంగ మంత్రి ఎస్.జైశకంర్ తనలోని సరదా కోణాన్ని ఆవిష్కరించారు. వాక్చాతుర్యంతో సభికులను కడుపుబ్బా నవ్వించారు. ఒక కార్యక్రమంలో ముఖాముఖి సందర్భంగా వ్యాఖ్యాత ఆయనకు ర్యాపిడ్‌ఫైర్ ప్రశ్న సంధించారు. ఉత్తరకొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్, భారత్‌ను విమర్శించే హంగరీ అమెరికన్ కుబేరుడు జార్జ్ సోరోస్ల్లో మీరు ఎవరితో భోజనం చేస్తారని అడిగారు. జైశంకర్ ఏ మాత్రం తడుముకోకుండా, ‘దుర్గా నవరాత్రులు కదండీ! నేను ఉపవాస దీక్షలో ఉన్నా!’ అంటూ బదులివ్వడంతో అంతా పగలబడి నవ్వారు. ఐరాస.. ఓ పాత కంపెనీ ఐక్యరాజ్యసమితి ప్రస్తుత పరిస్థితిపై జైశంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎంతో స్థలాన్ని ఆక్రమించుకుని, మార్కెట్ అవసరాలను పూర్తి స్థాయిలో తీర్చలేని పాత కంపెనీలా మారిందంటూ ఆక్షేపించారు. ఆదివారం ఆయన కౌటిల్య ఆర్థిక సదస్సులో మాట్లాడారు. ‘‘ప్రపంచ దేశాలను నేడు రెండు తీవ్ర సంక్షోభాలు తీవ్రంగా ఆందోళన పరుస్తున్నాయి. ఇలాంటి కీలక సమయంలో ఐరాస ప్రేక్షకపాత్రకు పరిమితమైంది. కీలకాంశాలను పట్టించుకోకుంటే దేశాలు తమ దారి చూసుకుంటాయి. కోవిడ్ కల్లోలంలోనూ ఐరాస చేసింది చాలా తక్కువ’’ అన్నారు. – న్యూఢిల్లీ -
నాడు సుష్మా స్వరాజ్.. మళ్లీ ఇప్పుడు పాకిస్తాన్‌కు జైశంకర్
ఢిల్లీ: ఇస్లామాబాద్‌లో జరిగే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్సీఓ) సమావేశంలో పాల్గొనేందుకు భారత విదేశాంగశాఖ మంత్రి ఎస్ జైశంకర్ పాకిస్తాన్ వెళ్లనున్నారు. ఎస్సీఓ కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ సమావేశాలు అక్టోబర్ 15-16 తేదీలో జరగనున్నాయి. ఈ సమావేశాలకి సంబంధించి.. పాకిస్తాన్ నుంచి ఆహ్వానం అందినట్లు భారత్ ఆగస్టు 30న ధృవీకరించింది. ఎస్సీఓ సమావేశంలో మంత్రి జైశంకర్ భేటీ అవుతారనే విషయాన్ని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ ప్రకటించారు. 2015 డిసెంబర్ అనంతరం భారత విదేశాంగ మంత్రి పాకిస్తాన్‌కు వెళ్లడం ఇదే తొలిసారి. దివంగత మాజీ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ 2015లో ఆఫ్ఘనిస్తాన్‌కు సంబంధించి భద్రతా సదస్సులో పాల్గొనేందుకు ఇస్లామాబాద్‌ను సందర్శించారామె.ఈసారి పాకిస్తాన్ అధ్యక్షతన ఎస్సీఓ ప్రభుత్వాధినేతల సమావేశాలు ఇస్లామాబాద్‌లో రెండురోజుల పాటు జరగనున్నాయి. ఈ శిఖరాగ్ర సమావేశాలకు ముందుగా మంత్రివర్గ సమావేశం, ఎస్సీఓ సభ్య దేశాల మధ్య ఆర్థిక, ఆర్థిక, సామాజిక-సాంస్కృతిక, మానవతా సహకారంపై దృష్టి సారించే విధంగా పలు సీనియర్ అధికారుల సమావేశాలు జరుగనున్నాయి.MEA Spokesperson Randhir Jaiswal confirms: "EAM Jaishankar will lead a delegation to Pakistan for the SCO summit in Islamabad on 15th and 16th October."#SJaishankar #Pakistan #Islamabad #India #SCOSummit #IndiaPakRelations pic.twitter.com/Aq5UHYYjzy— Neha Bisht (@neha_bisht12) October 4, 2024ఇక.. రష్యా, చైనా, కిర్గిజ్ రిపబ్లిక్, కజకిస్తాన్, తజికిస్థాన్, ఉజ్బెకిస్థాన్ దేశాల అధ్యక్షులు కలిసి.. 2001లో షాంఘైలో షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్‌ను స్థాపించారు. 2017లో భారత్, పాకిస్తాన్‌లు ఎస్సీఓలో శాశ్వత సభ్యత్వం పొందాయి. గత ఏడాది జూలైలో భారతదేశం నిర్వహించిన వర్చువల్ సమ్మిట్ ఆఫ్ గ్రూపింగ్‌లో ఇరాన్ కూడా ఎస్సీఓలో శాశ్వత సభ్యత్వం పొందింది. ఆర్థిక, భద్రతా కూటమిగా, అతిపెద్ద ట్రాన్స్-రీజినల్ అంతర్జాతీయ సంస్థలలో ఒకటిగా ఎస్సీఓ ప్రారంభమైంది. గత ఏడాది ఎస్సీఓ సమ్మిట్‌ను భారత్ వర్చువల్‌గా నిర్వహించగా.. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు.చదవండి: ‘మీరే హిందూ మతానికి అసలైన శత్రువులు’.. పవన్‌కు డీఎంకే కౌంటర్ -
పాక్ తగిన మూల్యం చెల్లించుకుంటుంది: జైశంకర్
న్యూయార్క్: జమ్ము కశ్మీర్‌పై పాకిస్తాన్ మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేసింది. ఈక్రమంలో భారత్.. పాకిస్తాన్‌కు స్ట్రాంగ్ కౌంటరిచ్చింది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ తగిన ఫలితం తప్పకుండా అనుభవిస్తుందని విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ అన్నారు. సరిహద్దు ఉగ్రవాదమే పాకిస్తాన్ విధానం అంటూ ఎద్దేవా చేశారు.ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 79వ సమావేశంలో జైశంకర్ మాట్లాడుతూ..‘కశ్మీర్ అంశంపై పాక్ ప్రధాని షరీఫ్ విచిత్రమైన వాదనలు చేశారు. పాక్ తీరుపై భారత్ వైఖరిని నేను స్పష్టం చేస్తున్నా. సరిహద్దుల వెంబడి పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోంది. పాక్ విధానం ఎప్పటికీ సఫలం కాదు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న ఆ దేశం తగిన ఫలితం అనుభవించక తప్పదు. అక్రమంగా ఆక్రమించుకున్న భారత భూభాగాన్ని పాకిస్తాన్ ఖాళీ చేయడం ఒక్కటే రెండు దేశాల మధ్య ఉన్న ఈ సమస్యకు పరిష్కారం. పాకిస్తాన్ దేశ ఆవిర్భావం నుంచి అత్యంత దారుణమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఇందుకు ఉగ్రవాదాన్ని ఎంచుకోవడం కూడా ఒక కారణం. రాజకీయాలతో మతోన్మాదాన్ని ప్రేరిపిస్తున్న ఆ దేశంలో తీవ్రవాదం, దాని ఎగుమతుల పరంగానే జీడీపీ కొలవాలి అని స్పష్టం చేశారు.ఇక, అంతకుముందు.. ఐరాస జనరల్ అసెంబ్లీలో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రసంగిస్తూ.. కశ్మీర్ అంశంలో అక్కసు వెళ్లగక్కారు. కశ్మీర్లో పరిస్థితిని పాలస్తీనాతో పోల్చారు. ఆర్టికల్ 370 గురించి ప్రస్తావించారు. ఆర్టికల్ రద్దు తర్వాత కశ్మీర్ ప్రజలు సైతం స్వేచ్ఛ, నిర్ణయాధికారం పోరాటం చేస్తున్నారు. భారత్ చట్ట విరుద్ధంగా చేపట్టిన చర్యలను వెనక్కి తీసుకోవాలని అన్నారు. ఆయన వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది.ఇది కూడా చదవండి: ఇజ్రాయెల్ హెచ్చరిక.. ఇరాన్ కీలక నిర్ణయం -
ఆసియా భవిష్యత్తుకు భారత్-చైనా సంబంధాలే కీలకం: జై శంకర్
భారత్-చైనా సరిహద్దు వివాదంపై విదేశాంగశాఖ మంత్రి జై శంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. న్యూయార్క్‌లోని ఆసియా సొసైటీ పాలసీ ఇన్స్టిట్యూట్లో జై శంకర్ మాట్లాడుతూ.. 2020 నుంచి గాల్వాన్ వ్యాలీ వద్ద భారత్, చైనా మధ్య ప్రతిష్టంభన నెలకొందని తెలిపారు. అక్కడ జరిగిన ఘర్షణలు భారత్-చైనా సంబంధాలను పూర్తిగా దెబ్బతీశాయని అన్నారు. అయితే చైనాతో సమస్య పరిష్కారానికి ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు.తూర్పు లఢక్‌లో సైన్యం తొలగింపు విషయంలో భారత్-చైనా సరిహద్దు వివాద చర్చల్లో 75 శాతం పురోగతి సాధించినట్లు చెప్పారు.సరిహద్దులో హింస ఉండకూడదని, ఒకవేళ ఉద్రిక్త పరిస్థితులు ఉంటే ఇరుదేశాల సంబంధాలపై ప్రభావం చూపుతాయని అన్నారు. చైనాతో భారత్‌కు స్పష్టమైన ఒప్పందాలు ఉన్నప్పటికీ 2020లో బీజింగ్ అనేక మంది సైనికులను వాస్తవ నియంత్రణ రేఖకు తరలించిందని జైశంకర్ అన్నారు.‘చైనాతో ఢిల్లీకి కష్టమైన చరిత్ర ఉంది. బీజింగ్‌తో మనకు స్పష్టమైన ఒప్పందాలు ఉన్నప్పటికీ, కోవిడ్ కాలంలో ఈ ఒప్పందాలను ఉల్లంఘిస్తూ చైనా పెద్ద సంఖ్యలో బలగాలను ఎల్ఏసీ కి తరలించడాన్ని మనం చూశాం. దీని వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉంది. జరిగింది కూడా. తద్వారా ఇరు దేశాలకు చెందిన అనేక మంది సైనికులు మరణించారు. దీంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి’ అని పేర్కొన్నారు.కాగా ఈ నెల ప్రారంభంలో జైశంకర్ మాట్లాడుతూ.. చైనాతో సరిహద్దు చర్చల్లో భారత్ పురోగతి సాధించిందని, ఆ దేశ బలగాల ఉపసంహరణకు సంబంధించిన సమస్యలు దాదాపు 75 శాతం పరిష్కారం అయ్యాయని వెల్లడించారు. తూర్పు లడఖ్ సరిహద్దు వద్ద చైనా సైనికీకరణ పెరుగుతుండడం అతిపెద్ద సవాలుగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు.#WATCH | New York: During the Asia Society at the Asia Society Policy Institute, EAM Dr S Jaishankar says, "We have a difficult history with China... Despite the explicit agreements we had with China, we saw in the middle of covid that the Chinese moved large number of forces in… pic.twitter.com/vNyfWTZrJY— ANI (@ANI) September 24, 2024 ఈ విషయాన్ని తాజాగా ప్రస్తావిస్తూ.. చైనాతో సరిహద్దు విషయంలో 75 శాతం పరిష్కరించిందని తాను చెప్పింది కేవలం బలగాల ఉపసంహరణ మాత్రమేనని తెలిపారు.. అయితే పెట్రోలింగ్ సమస్యలు కొన్ని పరిష్కరించాల్సి ఉందని,. తదుపరి చర్చల్లో వీటిని ప్రస్తావించనున్నట్లు పేర్కొన్నారు.ఆసియా భవిష్యత్తుకు భారత్-చైనా సంబంధాలు కీలకమని భావిస్తున్నట్లు జైశంకర్ వెల్లడించారు. ఇది కేవలం ఖండంలోనే కాకుండా యావత్ ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుందని అన్నారు. రెండు దేశాల సమాంతర పెరుగుదల నేటి ప్రపంచ రాజకీయాల్లో చాలా పెద్ద సమస్యగా ఉందని పేర్కొన్నారు. ఆసియా, ప్రపంచాన్ని బహుళ ధృవంగా మార్చడానికి భారతదేశం- చైనా మధ్య సంబంధాలే కీలకమని నొక్కి చెప్పారు. -
బాధ్యతలు స్వీకరించిన పలువురు కేంద్ర మంత్రులు
ఢిల్లీ: కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరింది. ప్రధాని మోదీ సహా పలువురు ఎంపీలు కేంద్ర మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ప్రమాణం చేసిన మంత్రులకు నిన్న (సోమవారం) మంత్రిత్వ శాఖలు కేటాయించబడ్డాయి.Priority areas for Jaishankar in Modi 3.0 government: Border stability with China, cross-border terror solution with PakistanRead @ANI Story | https://t.co/bSVWKuPFfA#Jaishankar #MEA #India #China #Pakistan pic.twitter.com/kmHQatgmbf— ANI Digital (@ani_digital) June 11, 2024 దీంతో మంగళవారం పలువురు కేంద్ర మంత్రులు తమ మంత్రిత్వ శాఖ బాధ్యతులు స్వీకరించారు. విదేశాంగ శాఖ మంత్రిగా ఎస్. జయశంకర్ బాధ్యతలు స్వీకరించారు. విద్యుత్ శాఖ మంత్రిగా మనోహర్ లాల్ ఖట్టర్ బాధ్యతలు స్వీకరించించారు.#WATCH | Delhi: Suresh Gopi takes charge as Minister of State (MoS) in the Ministry of Tourism. pic.twitter.com/qaolUiCV3Y— ANI (@ANI) June 11, 2024 అదేవిధంగా పెట్రోలియం శాఖ మంత్రిగా హర్దీప్ సింగ్ పూరి, పెట్రోల్ శాఖ సహాయ మంత్రిగా సురేష్ గోపి, అటవీ పర్యావరణ శాఖ సహాయ మంత్రి భూపేంద్ర యాదవ్ మంత్రులు బాధ్యతలు స్వీకరించారు.#WATCH | Delhi: Manohar Lal Khattar takes charge as the Minister of Power. pic.twitter.com/HmaLfC9BUv— ANI (@ANI) June 11, 2024సమాచార, ప్రసార మంత్రిగా అశ్విని వైష్ణవ్ బాధ్యతలు స్వీకరించారు. #WATCH | Delhi: Ashwini Vaishnaw takes charge as Information and Broadcasting (I&B) Minister pic.twitter.com/gf4QMPvuo6— ANI (@ANI) June 11, 2024 కేంద్ర హోం మంత్రిగా అమిత్ షా బాధ్యతలు స్వీకరించారు. అమిత్ షాకు స్వాగతం పలికిన సహాయ మంత్రులు బండి సంజయ్, నిత్యానంద రాయి. కేంద్ర మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన శివరాజ్ సింగ్ చౌహన్, కిరణ్ రిజీజు, జ్యోతిరాధిత్యసిందియా, జేపీ నడ్డా. -
సచిన్, గవాస్కర్ కాదు.. అతడే నా ఫేవరెట్: కేంద్ర మంత్రి జైశంకర్
కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి డాక్డర్ ఎస్ జైశంకర్ టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లిపై ప్రశంసల వర్షం కురిపించాడు. క్రికెట్‌ను అమితంగా ఇష్టపడే జైశంకర్‌ను అత్యుత్తమ భారత బ్యాటర్ ఎవరని ప్రశ్నించగా.. విరాట్ కోహ్లికి తన ఓటు వేశాడు. ఈ విషయంలో జైశంకర్‌కు సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్, విరాట్ కోహ్లి రూపంలో మూడు ఆప్షన్లు ఇవ్వగా.. విరాట్పైపు మొగ్గు చూపాడు. ఫిట్నెస్ మరియు వైఖరి కారణంగా కోహ్లిను ఇష్టపడతానని జైశంకర్ చెప్పుకొచ్చాడు. ఈ కారణాలు మినహాయించి సచిన్, గవాస్కర్లను పక్కకు పెట్టడానికి వేరే కారణాలు లేవని తెలిపాడు. సుశాంత్ సిన్హా యూట్యూబ్ ఛానెల్లో మాట్లడుతూ జైశంకర్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.ఇదిలా ఉంటే, విరాట్ కోహ్లి 35 ఏళ్ల వయసులోనూ అద్భుతమైన ఫామ్‌లో ఉండి ఇరగదీస్తున్నాడు. కోహ్లి ఈ వయసులోనూ భీకర ఫామ్‌లో ఉండటానికి అతని ఫిట్‌నెస్సే కారణమని అంతా అంటుంటారు. ఆట పట్ల అతనికున్న అంకితభావం, దృక్పదం అతన్ని లేటు వయసులోనూ టాప్ క్రికెటర్‌గా నిలబెడుతుంది. చాలా మంది యువ క్రికెటర్లు సైతం ఫిట్నెస్ విషయంలో, యాటిట్యూడ్ విషయంలో విరాట్‌ను ఆదర్శంగా తీసుకుంటారు. Question:- Virat Kohli or Sachin Tendulkar or Sunil Gavaskar? (Sushant Sinha YT).External affairs Minister Dr Jaishankar:- "I have biased towards Virat Kohli because of his fitness, attitude. That's why I will pick Virat".pic.twitter.com/Y7ossf99CQ— Tanuj Singh (@ImTanujSingh) May 29, 2024పెద్దపెద్ద సెలబ్రిటీలు సైతం విరాట్ ఫిట్‌నెస్‌కు ముగ్దులవుతుంటారు. ప్రపంచ క్రికెట్లో దృవతారగా వెలగడానికి విరాట్ ఫిట్‌నెస్సే కారణమనడం అతిశయోక్తి కాదు. మైదానంలో అతను ప్రదర్శించే దూకుడు, చిన్న చిన్న విషయాలకు సైతం స్పందించే విభిన్నమైన తత్వం విరాట్‌ను ప్రత్యేకంగా నిలబెడుతుంది. మంత్రులే కాక దేశాధినేతలు సైతం విరాట్‌ను అభిమానించడానికి అతని ఫిట్నెస్, ఆట పట్ల అతనికున్న అంకితభావమే కారణం.ఇదిలా ఉంటే, విరాట్ ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2024 సీజన్లో భీకర ఫామ్‌లో ఉన్నాడు. ఈ టోర్నీలో విరాట్ 15 మ్యాచ్‌ల్లో 61.75 సగటున సెంచరీ, 5 అర్ధసెంచరీ సాయంతో 714 పరుగులు చేసి లీడింగ్ రన్ స్కోరర్‌గా ఆరెంజ్ క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు. విరాట్.. జూన్ 1 నుంచి ప్రారంభంకాబోయే టీ20 వరల్డ్‌కప్‌లో ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే టీమిండియా రెండోసారి టైటిల్ గెలవడం ఖాయం. -
కొందరి బలహీనత వల్లే పీఓకే చేజారింది.. నెహ్రూపై విదేశాంగ మంత్రి
పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే) భారత్‌లో అంతర్భాగమేనని విదేశాంగ మంత్రి జైశంకర్ పేర్కొన్నారు. కొంతమంది బలహీనత వల్లే పీఓకేపై భారత్ నియంత్రణ కోల్పోయిందని ఆరోపించారు. ఒకరు చేసిన పొరపాటే దీనికి కారణమని చెప్పారు. భారత తొలి ప్రధాని జవహార్‌లాల్ నెహ్రూ, కాంగ్రెస్ పార్టీని పరోక్షంగా ఉద్ధేశిస్తూ జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలోని నాసిక్‌లో ‘విశ్వబంధు భారత్’ పేరుతో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి ప్రసంగిస్తూ పీఓకేపై జై శంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు.పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను భారత్ విలీనం చేసుకునే విషయమై లక్ష్మణ రేఖ వంటివి ఉన్నాయంటే తాను నమ్మబోనని చెప్పారు.లక్ష్మణ రేఖ వంటిది ఏదీ లేదని పేర్కొన్నారు. భారత్‌లో పీఓకే అంతర్భాగమని తాను భావిస్తున్నట్లు తెలిపారు. కొందరి బలహీనత వల్లే పీఓకే తాత్కాలికంగా మన నుంచి చేజారిందని, దానిపై పట్టు కోల్పోవడానికి వారి పొరపాటే కారణం అని నెహ్రూపై పరోక్షంగా ఆరోపణలు చేశారు. విశ్వ వేదికపై మన స్థానాన్ని బలంగా ఉంచుకోవాలని భావిస్తున్నానని, స్వీయ విశ్వాసాన్ని ఏనాడూ వీడొద్దన్నారు.చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్, పాక్‌తో బీజింగ సహకారంపై జై శంకర్ విమర్శలు గుప్పించారు. ‘నేను చైనా రాయబారిగా ఉన్నాను, చైనా గత చర్యల గురించి మనందరికీ తెలుసు. ఈ భూమిని పాకిస్తాన్ లేదా చైనా తమదని చెప్పుకోలేదని మేము వారికి పదేపదే చెప్పాము. సార్వభౌమాధికారం ఉన్నవారు ఎవరైనా ఉన్నారంటే, అది భారతదేశం. మీరు ఆక్రమిస్తున్నారు, మీరు అక్కడ నిర్మిస్తున్నారు, కానీ చట్టపరమైన హక్కు మాదే.’నని పేర్కొన్నారు.చైనా పాకిస్తాన్ మధ్య 1963 సరిహద్దు ఒప్పందాన్ని కూడా జైశంకర్ ఎత్తి చూపారు. అక్కడ పాకిస్తాన్ దాదాపు 5,000 కి.మీ భూభాగాన్ని చైనాకు అప్పగించిందని అన్నారు. ‘1963లో, పాకిస్తాన్- చైనా తమ స్నేహాన్ని ముందుకు తీసుకెళ్లడానికి అంగీకరించాయి. చైనాను దగ్గరగా ఉంచడానికి, పాకిస్తాన్ ఆక్రమిత భూభాగంలో దాదాపు 5,000 కి.మీలను డ్రాగన్‌కు అప్పగించింది. ఈ ప్రాంతం భారతదేశానికి చెందింది’ ఆయన తెలిపారు. -
నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్‌కు సంబంధంలేదన్న జయశంకర్
ఢిల్లీ: ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో ముగ్గురు భారతీయుల అరెస్ట్‌పై భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జయశంకర్ స్పందించారు. త్వరలో ఎన్నికలు జరగనున్న కెనడాలోని అంతర్గత రాజకీయాల కారణంగా తలెత్తుతున్నవేనని, ఇందులో భారత్‌కు ఎలాంటి సంబంధం లేదన్నారు.కాగా, హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో నిందితులు కరణ్‌ప్రీత్ సింగ్ (28), కమల్‌ప్రీత్ సింగ్ (22), కరణ్ బ్రార్ (22)లను కెనడా పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరి అరెస్ట్‌పై జయశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఖలిస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు సంబంధించి జరుగుతున్న పరిణామాలు త్వరలో ఎన్నికలు జరగనున్న కెనడాలోని అంతర్గత రాజకీయాల కారణంగా తలెత్తుతున్నవేనని పేర్కొన్నారు. ఆ విషయాల్లో భారత్‌కు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తరచూ భారత్‌ను విమర్శిస్తుండడంపై అడిగిన ప్రశ్నకు ఆయన ఈ విధంగా సమాధానమిచ్చారు.మరోవైపు.. కెనడాలో అరెస్టైన ముగ్గురు నిందితుల గురించి సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. నిందితులు ముగ్గురికి పాకిస్థాన్ ఐఎస్ఐతో సంబంధాలున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు జాతీయ మీడియా కథనాలు ఇచ్చింది. ఈ సందర్భంగా కొంతమంది గ్యాంగ్స్టర్లు కెనడాలో ఉంటూ భారత్‌లో తమ నేర కార్యకలాపాలను సాగిస్తున్నారు. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) నిందితులుగా పేర్కొన్న చాలా మంది ఆ దేశంలో స్థిరపడ్డారు. భారత వ్యతిరేక, ఖలిస్థానీ అనుకూల కార్యకలాపాలు సాగించేందుకు వారికి పాక్ ఐఎస్ఐ నుంచి నిరంతరం నిధులు అందుతున్నాయి. దీని గురించి మేం చాలా సార్లు అనేక ఆధారాలు ఇచ్చినా.. కెనడా ప్రభుత్వం గానీ, పోలీసుల నుంచి ఎలాంటి మద్దతు లభించలేదు. ఇప్పుడు తాజా కేసులో ఎలాంటి ఆధారాలు లేకుండానే భారత ప్రభుత్వంపై కెనడా నిందలు మోపుతోంది. అరెస్టయిన ఆ ముగ్గురు డ్రగ్స్ దందా చేస్తున్నారని, వారికి ఐఎస్ఐతో సంబంధాలున్నాయని పేర్కొంది. -
విదేశీ మీడియాపై విదేశాంగ మంత్రి జై శంకర్ ఫైర్
విదేశీ మీడియాపై భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ విమర్శలు గుప్పించారు. సరైన సమాచారం లేకుండా భారత దేశంపై విదేశీ మీడియా విషం చిమ్ముతోందని మండిపడ్డారు. భారత్‌లోని ఎన్నికలకు సంబంధించి పూర్తి సమాచారం లేని పాశ్చాత్య మీడియా విమర్శలతో రాజకీయం చేస్తోందని ధ్వజమెత్తారు. మంగళారం హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న జైశంకర్ పలు అంశాలుపై మాట్లాడారు. ‘విదేశీ మీడియా భారత ప్రజాస్వామాన్ని హేళన చేస్తోంది. వారికి మన దేశానికి సంబంధించి సరైన సమాచారం లేదు. ఎందుకుంటే వారు కూడా మన దేశ ఎన్నికల్లో రాజకీయలు, జోక్యం చేసుకోవాలని యోచిస్తున్నారు. విదేశీ మీడియాలో పలు కథనాలు చదివారు. భారత్‌లో ప్రస్తుతం అత్యధిక వేడిగా ఉంది. ఈ సమయంలో భారత్ ఎందుకు ఎన్నికలు నిర్వహిస్తోంది ?అని రాస్తున్నారు. అయినా పాశ్చాత్య దేశాల్లో ఓటింగ్ శాతం కంటే భారత్‌లో ఓటింగ్ శాతం ఎక్కువ...మన దేశంలోని రాజకీయాలను ప్రపంచ వ్యాప్తంగా చర్చిస్తున్నారు. అదేవిధంగా ప్రపంచ రాజకియాలు.. ప్రస్తుతం భారత్‌లోకి చొరబడాలని భావిస్తున్నాయి. విదేశీ మీడియా మన ఎన్నికల వ్యవస్థలో భాగమని భావిస్తోంది. కానీ పాశ్చాత్య మీడియా ఆలోచనలకు చెక్ పెట్లాల్సిన సమయం వచ్చింది. విదేశీ మీడియా కథనాలకు తిప్పికొట్టాలి. మన ఎన్నికల వ్యవస్థ, ఎన్నికల సంఘంపై విదేశీ మీడియా విమర్శలు చేస్తోంది’ అని జైశంకర్ అన్నారు. -
ఇరాన్ నుంచి స్వదేశానికి చేరుకున్న మహిళా క్యాడెట్
న్యూఢిల్లీ: ఇరాన్ అధీనంలో ఉన్న సరుకు రవాణా నౌక ఎంఎస్సీ ఏరీస్‌లోని 17 మంది భారతీయ సిబ్బందిలోని ఏకైక మహిళా క్యాడెట్ సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నారు. కేరళలోని త్రిసూర్‌కు చెందిన ఆన్ టెస్సా జోసెఫ్‌ను ఇరాన్ ప్రభుత్వం విడుదల చేయడంతో గురువారం మధ్యాహ్నం విమానంలో కొచ్చిన్‌కు చేరుకున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది. మిగతా 16 మంది భారతీయ సిబ్బందిని సురక్షితంగా విడుదల చేయించేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నామని స్పష్టం చేసింది. వారంతా ఆరోగ్యంగానే ఉన్నారని, భారత్‌లోని కుటుంబసభ్యులతో ఫోన్లో సంభాషిస్తున్నట్లు కూడా వివరించింది. విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ నాలుగు రోజుల క్రితం ఇరాన్ విదేశాంగ మంత్రి అమిర్ అబొల్లాహియన్‌తో మాట్లాడిన విషయాన్ని గుర్తు చేసింది. ఇజ్రాయెల్‌తో సంబంధాలున్నాయనే అనుమానంతో ఇరాన్ ప్రత్యేక బలగాలు ఈ నెల 13న హొర్ముజ్ జలసంధిలో ఉన్న ఎంఎస్సీ ఏరీస్ నౌకను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. -
ఇరాన్‌కు జైశంకర్ ఫోన్.. భారత సిబ్బందిని కలవడానికి అనుమతి
ఇజ్రాయెల్‌తో ఉద్రిక్తతల వేళ భారత్‌కు వచ్చే ఓ నౌకను ఇరాన్ స్వాధీనం చేసుకోవడం తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. అందులోని భారతీయ సిబ్బందికి టెహ్రాన్ కాస్త ఊరటనిచ్చింది. మన దేశ అధికారులు వారిని కలిసేందుకు అనుమతినిచ్చింది. ఈ విషయాన్ని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ సోమవారం వెల్లడించింది. గత శనివారం హర్మూజ్ జలసంధి సమీపంలో ఇజ్రాయెలీ కుబేరుడికి చెందిన వాణిజ్య నౌక ఎంఎస్సీ ఏరిస్‌ను ఇరాన్‌కు చెందిన ఐఆర్జీసీ దళం హెలికాప్టర్లతో వెంబడించి అధీనంలోకి తీసుకొంది. నౌకలో మొత్తం 25 మంది సిబ్బంది ఉండగా.. వారిలో 17 మంది భారతీయులే. ఈ క్రమంలోనే వారిని రక్షించేందుకు మన విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఆదివారం ఇరాన్ విదేశాంగశాఖ మంత్రి హొస్సేన్ అమీర్ అబ్దుల్లాహియాన్‌తో మాట్లాడారు. నౌకలోని భారతీయులను విడుదల చేయాలని కోరారు. పశ్చిమాసియాలో ఘర్షణలను నివారించాలని, దౌత్య మార్గాల్లో పరిష్కారం కనుగొనాలని ఆయన సూచించారు చదవండి: ఇజ్రాయెల్ నౌకపై దాడి.. ఆధీనంలోకి తీసుకున్న ఇరాన్ నేవీ -
భారత్ Vs చైనా: అరుణాచల్‌పై మళ్లీ కవ్వింపులు..
బీజింగ్: డ్రాగన్ కంట్రీ చైనా మరోసారి భారత్‌తో కవ్వింపు చర్యలకు దిగింది. ఎన్నికల వేళ భారత సరిహద్దు రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్ విషయంలో మరో దుందుడుకు చర్యకు దిగింది. తాజాగా అరుణాచల్‌లో కొన్ని ప్రాంతాలకు అధికారికంగా పేర్లు పెట్టింది.కాగా, చైనా వాస్తవాధీన రేఖ వెంబడి సరిహద్దు వివాదం కొనసాగుతున్న వేళ చైనా మరోసారి కవ్వింపు చర్యలకు దిగింది. భారత్‌లో అంతర్భాగమైన అరుణాచల్ ప్రదేశ్ తమదేనని ఇటీవలే చైనా వితండవాదం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో చైనా మరో అడుగు వేసి మరోసారి అక్కడి ప్రాంతాలకు అధికారికంగా పేర్లు పెట్టింది. ఈ మేరకు చైనా పౌర వ్యవహారాల శాఖ ఇటీవల ఈ కొత్త పేర్లను విడుదల చేశారు.అరుణాచల్‌లోని మొత్తం 30 ప్రాంతాలకు చైనా తాజాగా కొత్త పేర్లను పెట్టినట్లు తెలుస్తోంది. వీటిల్లో 11 నివాస ప్రాంతాలు, 12 పర్వతాలు, నాలుగు నదులు, ఒక సరస్సు, ఒక పర్వత మార్గం, కొంత భూభాగం ఉన్నాయని సమాచారం. ఈ నేపథ్యంలో చైనా చర్యలను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది. అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమేనని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ స్పందిస్తూ.. ఈరోజు నేను మీ ఇంటి పేరు మర్చినట్లయితే అది నాది అవుతుందా?. అరుణాచల్ భారత్‌లో ఒక రాష్ట్రం. అరుణాచల్ ఎల్లప్పుడూ భారత్ భూభాగమే. పేర్లు మార్చడం వల్ల ప్రభావం ఏమీ ఉండదు. వాస్తవాధీన రేఖ వద్ద మా సైనం మోహరించి ఉంది అని కామెంట్స్ చేశారు.#WATCH | Surat, Gujarat: On China's claim regarding Arunachal Pradesh, EAM Dr S Jaishankar says, "If today I change the name of your house, will it become mine? Arunachal Pradesh was, is and will always be a state of India. Changing names does not have an effect...Our army is… pic.twitter.com/EaN66BfNFj— ANI (@ANI) April 1, 2024 ఇదిలా ఉండగా.. భారత భూభాగంలోని ప్రదేశాల పేర్లను మార్చేందుకు చైనా ప్రయత్నించడం ఇదే మొదటిసారి కాదు. చైనా 2017లో అరుణాచల్ ప్రదేశ్‌లోని ఆరు ప్రదేశాలకు, 2021లో 15 స్థలాలకు, 2023లో 11 ప్రాంతాలకు కొత్త పేర్లను చైనా ప్రకటించింది. ఇవన్నీ తమ దేశంలోని ప్రాంతాలేనని చెప్పుకొచ్చింది. -
భారత్ Vs చైనా: అరుణాచల్‌పై మళ్లీ కవ్వింపులు..
బీజింగ్: డ్రాగన్ కంట్రీ చైనా మరోసారి భారత్‌తో కవ్వింపు చర్యలకు దిగింది. ఎన్నికల వేళ భారత సరిహద్దు రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్ విషయంలో మరో దుందుడుకు చర్యకు దిగింది. తాజాగా అరుణాచల్‌లో కొన్ని ప్రాంతాలకు అధికారికంగా పేర్లు పెట్టింది. కాగా, చైనా వాస్తవాధీన రేఖ వెంబడి సరిహద్దు వివాదం కొనసాగుతున్న వేళ చైనా మరోసారి కవ్వింపు చర్యలకు దిగింది. భారత్‌లో అంతర్భాగమైన అరుణాచల్ ప్రదేశ్ తమదేనని ఇటీవలే చైనా వితండవాదం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో చైనా మరో అడుగు వేసి మరోసారి అక్కడి ప్రాంతాలకు అధికారికంగా పేర్లు పెట్టింది. ఈ మేరకు చైనా పౌర వ్యవహారాల శాఖ ఇటీవల ఈ కొత్త పేర్లను విడుదల చేశారు. అరుణాచల్‌లోని మొత్తం 30 ప్రాంతాలకు చైనా తాజాగా కొత్త పేర్లను పెట్టినట్లు తెలుస్తోంది. వీటిల్లో 11 నివాస ప్రాంతాలు, 12 పర్వతాలు, నాలుగు నదులు, ఒక సరస్సు, ఒక పర్వత మార్గం, కొంత భూభాగం ఉన్నాయని సమాచారం. ఈ నేపథ్యంలో చైనా చర్యలను భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది. అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమేనని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ స్పందిస్తూ.. ఈరోజు నేను మీ ఇంటి పేరు మర్చినట్లయితే అది నాది అవుతుందా?. అరుణాచల్ భారత్‌లో ఒక రాష్ట్రం. అరుణాచల్ ఎల్లప్పుడూ భారత్ భూభాగమే. పేర్లు మార్చడం వల్ల ప్రభావం ఏమీ ఉండదు. వాస్తవాధీన రేఖ వద్ద మా సైనం మోహరించి ఉంది అని కామెంట్స్ చేశారు. #WATCH | Surat, Gujarat: On China's claim regarding Arunachal Pradesh, EAM Dr S Jaishankar says, "If today I change the name of your house, will it become mine? Arunachal Pradesh was, is and will always be a state of India. Changing names does not have an effect...Our army is… pic.twitter.com/EaN66BfNFj — ANI (@ANI) April 1, 2024 ఇదిలా ఉండగా.. భారత భూభాగంలోని ప్రదేశాల పేర్లను మార్చేందుకు చైనా ప్రయత్నించడం ఇదే మొదటిసారి కాదు. చైనా 2017లో అరుణాచల్ ప్రదేశ్‌లోని ఆరు ప్రదేశాలకు, 2021లో 15 స్థలాలకు, 2023లో 11 ప్రాంతాలకు కొత్త పేర్లను చైనా ప్రకటించింది. ఇవన్నీ తమ దేశంలోని ప్రాంతాలేనని చెప్పుకొచ్చింది. -
‘భారత్ ప్రయోజనాలను రష్యా ఎప్పుడూ దెబ్బతీయదు’
న్యూఢిల్లీ: భారత్-రష్యా మధ్య సంబంధాలు చాలా స్థిరంగా, స్నేహపూర్వకంగా ఉంటాయని భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ వెల్లడించారు. భారత ప్రయోజనాలను రష్యా ఎప్పుడూ దెబ్బతీయదని స్పష్టం చేశారు. జర్మనీకి చెందిన వార్త పత్రికతో కేంద్రమంత్రి జైశంకర్ మాట్లాడారు. ఉక్రెయిన్‌లో రష్యా యుద్ధాన్ని ముగించాలని పశ్చిమ దేశాలు ఒత్తిడి చేస్తున్న వేళ ఇరు దేశాల మధ్య స్నేహ సంబంధాలను జైశంకర్ మరోసారి గుర్తు చేశారు. ‘పూర్వపు అనుభావాలతోనే ప్రతి ఒక్కరూ మంచి స్నేహ సంబంధాన్ని కొనసాగిస్తారు. నాకు తెలిసినవరకు భారత దేశానికి స్వాతంత్రం రాక ముందు నుంచి భారత్-రష్యా మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అదేవిధంగా భారత్-రష్యా ఇరు దేశాలు కూడా ప్రయోజనాలు దెబ్బతీసేలా వ్యవహరించలేదు. ఇరు దేశాల మధ్య స్థిరమైన, చాలా స్నేహిపూరిత సంబంధాలు ఉన్నాయి. ఈ అనుభావాల రీత్యా మాస్కోతో భారత్ స్నేహబంధం బలంగా ఉంది’ అని విదేశాంగ మంత్రి జై.శంకర్ పేర్కొన్నారు. రష్యా వద్ద భారత్ ముడి చమురు కొనుగోలు విషయంపై కేంద్రమంత్రి జైశంకర్ స్పందించారు. ‘రష్యా నుంచి ముడి చమురరు కొనగోలు చేయకుండా ప్రతి ఒక్కరూ.. ఇతర దేశాల మీద ఆధారపడితే.. ఇతర దేశాల్లో చమురుపై డిమాండ్ అధికమై ధరలు పెరిగేవి’అని తెలిపారు. ఉక్రెయిన్‌పై ఫిబ్రవరి, 2022 నుంచి రష్యా యుద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే అప్పటి నుంచి అమెరికా, యూరోపియన్ దేశాలు రష్యా ముడి చమురు కొనుగోళ్లపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. భారత్ మాత్రం రష్యా వద్ద చమురు కొనుగోళ్లు ఆపకపోవటం గమనార్హం. ఇక.. ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యా విషయంలో భారత్ జోక్యం చేసుకుంటే రష్యా యుద్ధాన్ని ఆపే అవకాశం ఉందని ప్రపంచవ్యాప్తంగా చర్చ జరిగిన విషయం తెలిసిందే. చదవండి: మహారాష్ట్ర: మరాఠా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం -
వారితో కలిసిపోతానంటూ.. కేంద్ర మంత్రి చమత్కారం!
దుబాయ్: ‘గుజరాతీయులతో చాలా ఆసక్తికరంగా ఉంటుంది. వారితో చక్కగా కలిసిపోతా’ అని కేంద్ర మంత్రి ఫన్నీగా సమాధానం ఇచ్చారు. కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్.జైశంకర్ చమత్కారంగా ఇచ్చిన సమాధానం అక్కడి ఉన్నవారిలో నవ్వులు పూయించింది. ఆయన శనివారం దుబాయ్‌లో భారతీయ విద్యార్థులు నిర్వహించిన ఓ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. #WATCH via ANI Multimedia | EAM Jaishankar's witty response to a student’s query ‘How he feels surrounded by Gujaratis’https://t.co/83kzBWgICR — ANI (@ANI) December 9, 2023 ఈ సందర్భంగా ఓ విద్యార్థి అడిగిన ప్రశ్నకు ఆయన చమత్కారంగా సమాధానం ఇచ్చారు. గుజరాతీయుల మధ్య మీరు ఉండటం ఎలా అనిస్తోంది? అని ఓ విద్యార్థి అడగ్గా.. ‘గుజరాతీయుల మధ్యలో ఉండటం చాలా అసక్తికరంగా ఉంటుంది. ఇండియాలో అన్ని ప్రాంతాల నుంచి నాకు స్నేహితులు ఉన్నారు. గుజరాత్‌లోని పలు చోట్ల మా బంధువులకు సంబంధించిన కుటుంబాలు కూడా ఉన్నాయి. రాజ్యసభ ఎన్నికల సందర్భంగా నేను అక్కడికి వెళ్లినప్పటి నుంచి దేశంలో మరే రాష్ట్రానికి వెళ్లనన్నిసార్లు నేను గురురాత్కు వెళ్లా. గుజరాతీయులతో నేను చక్కగా కలిసిపోతా’ అని అన్నారు. ఇక 5 జూలై 2019న గుజరాత్ నుంచి బీజేపీ తరఫున జైశంకర్.. రాజ్యసభ సభ్యునిగా పార్లమెంటుకు ఎన్నికైన విషయం తెలిసిందే. అనంతరం ఆయన మోదీ కేబినెట్లో కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిగా పదవి బాధ్యలు స్వీకరించారు. -
ఖతార్‌లో ఉరిశిక్ష పడిన వారి విడుదలకు ప్రయత్నాలు: జైశంకర్
ఖతార్‌లో ఉరిశిక్ష పడిన భారత నావికాదళ మాజీ అధికారులను విడిపించేందుకు భారత్ అన్ని ప్రయత్నాలు చేస్తుందని కేంద్ర విదేశాంగశాఖ మంత్రి ఎస్ జైశంకర్ వెల్లడించారు. ఈ మేరకు సోమవారం జైశంకర్ బాధిత కుటుంబాలను కలిసి పరామర్శించారు. ఈ కష్టకాలంలో బాధిత కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చినట్లు చెప్పారు. ఈ విషయాలను ఆయన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ‘ఖతార్‌లో నిర్బంధంలో ఉన్న ఎనిమిది మంది భారతీయుల కుటుంబాలను ఈ ఉదయం కలిశాను. ఈ కేసుకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని వారికి తెలియజేశా. బాధిత కుటుంబ సభ్యుల ఆందోళన, బాధలను తెలుసుకున్నాం. ఉరిశిక్ష పడిన ఎనిమిది మంది అధికారుల విడుదలకు ప్రభుత్వం ప్రయత్నాలు కొనసాగిస్తుందని భరోసా ఇచ్చాం. ఆ విషయంలో వారి కుటుంబాలతో సమన్వయం చేసుకుంటాం’ అని ఎక్స్ (ట్విటర్) వేదికగా జైశంకర్ పేర్కొన్నారు. Met this morning with the families of the 8 Indians detained in Qatar. Stressed that Government attaches the highest importance to the case. Fully share the concerns and pain of the families. Underlined that Government will continue to make all efforts to secure their release.… — Dr. S. Jaishankar (@DrSJaishankar) October 30, 2023 కాగా గూఢచర్యం కేసులో భారత నావికాదళానికి చెందిన ఎనిమది మంది మాజీ అధికారులకు మరణశిక్ష విధిస్తూ ఇటీవల ఖతార్ కోర్టు సంచలన తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఖతార్ సాయుధ దళాలకు శిక్షణ, సంబంధిత సేవలను అందించే ప్రైవేటు భద్రతా సంస్థ దహ్రా గ్లోబల్ టెక్నాలజీస్ అండ్ కన్సల్టెన్సీ సర్వీసెస్‌లో పనిచేస్తున్న భారత నావికాదళ మాజీ అధికారులు కెప్టెన్ నవతేజ్ సింగ్ గిల్, కెప్టెన్ బీరేంద్ర కుమార్ వర్మ, కెప్టెన్ సౌరభ్, కమాండర్ అమిత్ నాగ్‌పాల్, కమాండర్ తివారీ, కమాండర్ సుగుణాకర్ పాకాల, కమాండర్ సంజీవ్ గుప్తా, సెయిలర్ రాగేశ్‌లపై ఇజ్రాయెల్ కోసం గూఢచర్యానికి పాల్పడ్డారన్న ఆరోపణలు వచ్చాయి. వీరంతా ఇజ్రాయెల్ తరపున ఓ సబ్‌మెరైన్ ప్రోగ్రాం కోసం గూఢచర్యానికి పాల్పడ్డారని వీరిపై అభియోగాలపై సదరు అధికారులను ఖతార్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ 2022 ఆగస్టు 30న అదుపులోకి తీసుకుంది. దీనిపై ఇటీవల కేంద్ర విదేశాంగ శాఖ స్పందించింది. ఖతార్ కోర్టు తీర్పుతో దిగ్భ్రాంతికి గురయ్యాయమని తెలిపింది. ఈ సమస్యను ఖతార్ అధికారులతో తేల్చుకుంటామని తెలిపింది. బాధిత కుటుంబ సభ్యులు, న్యాయ బృందంతో సమన్వయం చేసుకుంటున్నామని, దీనిపై న్యాయ పోరాటం చేస్తామని వెల్లడించింది. -
భారత్-కెనడా వివాదం: అమెరికాలో విదేశాంగ మంత్రుల రహస్య భేటీ!
భారత్ కెనడా మధ్య దౌత్యపరమైన వివాదాలు కొనసాగుతున్న నేపథ్యంలో భారత విదేశాంగశాఖ మంత్రి ఎస్ జైశంకర్, కెనడా విదేశాంగమంత్రి మెలానీ అమెరికాలో రహస్యంగా భేటీ అయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు బ్రిటన్ వార్తా పత్రిక ఫినాన్షియల్ టైమ్స్ కథనం ప్రచురించింది. భారత్‌తో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను పరిష్కరించేందుకు, న్యూఢిల్లీతో దౌత్యపరమైన సంబంధాలను పునురద్ధరించేందుకు కెనడా ప్రభుత్వం ప్రయత్నిన్నట్లు పేర్కొంది. అయితే ఈ భేటీపై అటు కెనడా కానీ, ఇటు భారత్ కానీ ఏ విధమైన అధికారిక ప్రకటన చేయలేదు. కెనడా దౌత్యవేత్తలు దేశం విడిచి వెళ్లాలంటూ భారత్ గడువు విధించిన నేపథ్యంలో ఇరు దేశాల విదేశాంగ మంత్రులు సమావేశమవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక ఖలిస్తానీ సానూభూతిపరుడు హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యలో భారత ఏజెన్సీల ప్రమేయం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలతో ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే. కెనడా ఆరోపలను భారత్ తీవ్రంగా ఖండించింది. అనంతరం రెండు దేశాల దౌత్యపరమైన సంబంధాల్లో అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇరు దేశాలు దౌత్యవేత్తలను బహిష్కరించాయి. కెనడాకు వీసా సేవలను భారత్ నిలిపి వేసింది. చదవండి: పఠాన్‌కోట్ దాడి సూత్రదారి, ఉగ్రవాది లతీఫ్ పాకిస్థాన్‌లో హతం -
అమెరికా, భారత్ బంధాలకు హద్దుల్లేవ్
వాషింగ్టన్: అమెరికా, భారత్ మధ్య ద్వైపాక్షిక బంధాలకు హద్దుల్లేవని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ అన్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు అత్యున్నత స్థాయికి చేరుకు న్నాయని, ఇరు దేశాలు పరస్పర అవసరాలు తీర్చుకుంటూ, సౌకర్యవంతమైన, అనుకూలమైన భాగస్వామ్యులుగా మెలగుతున్నాయని పేర్కొన్నారు. చంద్రయాన్ మాదిరిగా ఇరు దేశాల మధ్య బంధాలు చంద్రుడిని తాకాయని, అంతకుమించి హద్దుల్లేకుండా సాగిపోతున్నాయని అభివర్ణించారు. అమెరికాలో పర్యటిస్తున్న జైశంకర్ శనివారం ప్రవాస భారతీయులతో ఇండియా హౌస్‌లో సమావేశమయ్యారు. ఇక్కడ నిర్వహించిన సెలబ్రేటింగ్ కలర్స్ ఆఫ్ ఫ్రెండ్షిఫ్ కార్యక్రమానికి అమెరికాలో వివిధ రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో ప్రవాస భారతీయులు తరలివచ్చారు. ప్రవాస భారతీయులనుద్దేశించి జై శంకర్ మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య సంబంధాల్ని మరో కొత్త స్థాయికి తీసుకువెళతామని చెప్పారు. ప్రపంచంలో ఎన్నో మార్పులు వచ్చినా ఇరు దేశాల మధ్య సంబంధాలు పటిష్టంగా సాగుతున్నాయని, ఇక భవిష్యత్‌లో సరికొత్త రంగాల్లో అమెరికాతో కలిసి పని చేస్తామని వెల్లడించారు. భారత్‌లో నిర్వహించిన జీ–20 సదస్సుకి అమెరికా సహకారం అందించడం వల్లే విజయ వంతమైందని అన్నారు. ‘‘దేశాలు ఒకరితో ఒకరు వ్యాపారాలు చేస్తాయి. రాజకీ యాలు చేస్తాయి. మిలటరీ బంధాలు కలిగి ఉంటాయి. విన్యాసాలు నిర్వహిస్తాయి. సాంస్కృతిక బదలాయింపులు ఉంటాయి. అయి నప్పటికీ రెండు దేశాలు లోతైన మానవీయ సంబంధాలు కలిగి ఉండాలి. అప్పుడే ఆ బంధం సంపూర్ణమవుతుంది. ప్రస్తుతం భారత్, అమెరికా మధ్య అలాంటి సంబంధాలే ఉండాలి’’ అని జైశంకర్ వివరించారు. -
ఉగ్రవాదాన్ని కెనడా ప్రోత్సహిస్తోంది
వాషింగ్టన్: ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యపై నెలకొన్న విభేదాలను భారత్, కెనడా ప్రభుత్వం పరస్పరం చర్చించుకుంటే పరిష్కరించుకోవచ్చునని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ అన్నారు. నిజ్జర్ హత్య కంటే ఉగ్రవాదాన్ని కెనడా ప్రభుత్వం ప్రోత్సహించడం అత్యంత తీవ్రమైన అంశంగా చూడాలని అన్నారు. ఖలిస్తానీ ఉగ్రవాదానికి, హింసాత్మక కార్యక్రమాలకు ట్రూడో ప్రభుత్వం అనుమతులిస్తోందని వెంటనే వాటిని నివారించాల్సిన అవసరం ఉందన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న జై శంకర్ వాషింగ్టన్లో శుక్రవారం భారతీయ జర్నలిస్టులతో మాట్లాడారు. నిజ్జర్ హత్య వెనుక భారతీయ ఏజెంట్లు ఉన్నారంటూ కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణల్ని భారత్ గట్టిగా తిప్పి కొట్టిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి కచ్చితమైన ఆధారాలుంటే చూపించాలన్నారు. వాటిని పరిశీలించడానికి భారత్ సిద్ధంగా ఉందని జైశంకర్ చెప్పారు. ‘‘కెనడా ప్రభుత్వం నుంచి భారత్ చాలా కాలంగా ఎన్నో సమస్యల్ని ఎదుర్కొంటోంది. ఉగ్రవాదం, హింసాత్మక కార్యకలాపాలపై వారి ఉదాసీన వైఖరే ఇందుకు కారణం. భారత్‌లో నేరాలు చేసిన ఎందరో కెనడాలో తలదాచుకుంటున్నారు. వారిని అప్పగించాలని పలుమార్లు విజ్ఞప్తులు చేసినా కెనడా ప్రభుత్వం స్పందించడం లేదు. నిజ్జర్ హత్యపై ఆధారాలు ఇవ్వకుండా అభాండాలు వేస్తోంది. మేము నాలుగ్గోడల మధ్య లేము. ఏదైనా పరిశీలిస్తాం’’ అని జై శంకర్ మండిపడ్డారు. నిజ్జర్ హత్య కంటే కెనడా ప్రభుత్వం ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడమే అతి పెద్ద సమస్యని దానినే మొట్టమొదట పరిష్కరించుకోవాలని అన్నారు. -
భారత్ కెనడా వివాదం.. జైశంకర్ మరోసారి ఘాటు వ్యాఖ్యలు
ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్య విషయంలో భారత్ కెనడాల మధ్య రగులుతున్న దౌత్య వివాదం నేపథ్యంలో కేంద్ర విదేశాంగశాఖమంత్రి జైశంకర్ ఘాటుగా స్పందించారు. కెనడాలో హింస, తీవ్రవాదం గణనీయంగా పెరిగిపోయిందని మండిపడ్డారు. కెనడా తీవ్రవాద శక్తులు, వేర్పాటువాదులకు ఆశ్రయం ఇవ్వడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయాలను సాధారణమైనవిగా చూడరాదని అన్నారు. ఈ సందర్భంగా భారత్-కెనడా వివాదంపై జై శంకర్ మరోసారి తన వైఖరిని స్పష్టం చేశారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన శుక్రవారం ఓ సమావేశంలో మాట్లాడుతూ.. భావప్రకటనా స్వేచ్ఛ గురించి ఇతరుల నుంచి నేర్చుకోవాల్సిన అవసరం భారత్‌కు లేదని తెలిపారు. ‘మాది ప్రజాస్వామ్య దేశం, భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ఏంటో మేము ఇతర దేశాల నుంచి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. వాక్ స్వాతంత్ర్యం హింసకు దారితీయకూడదని మేము చెబుతున్నాం. అది స్వేచ్ఛను దుర్వినియోగం చేయడమే అవుతుంది. రక్షించడం కాదు అని జైశంకర్ పేర్కొన్నారు. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యతో భారత ప్రభుత్వం ప్రమేయం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల నెలకొన్న తరుణంలో కేంద్రమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. కెనాడా ఆరోపణలపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. దీనిని రెండు దేశాలు కలిసి పరిష్కరించుకోవాల్సిన అసవరం ఉందన్నారు. ఆరోపణలకు సంబంధించి ఏదైనా సమాచారం మాతో పంచుకునేందుకు కెనడా సిద్ధంగా ఉంటే, మేము కూడా దానిని పరిగణలోకి తీసుకుని పరిష్కరించుకునేందుకు సిద్ధంగానే ఉన్నామన్నారు. అయితే భారత్‌కు వ్యతిరేకంగా హింస, చట్టవ్యతిరేక కార్యకలాపాల్లో భాగమైన కొందరు వ్యక్తులు, సంస్థలు కెనడాలో ఆశ్రయం పొందుతున్నారని, ఈ విషయంలో తమ అభర్ధనలకు కెనడా స్పందించలేదని అన్నారు. చదవండి: Trump Vs Biden: ఏడాది ముందే అగ్రరాజ్యంలో ఎన్నికల అగ్గి.. తన విధానాల ప్రకారం భారత్ ఇలాంటి చర్యలకు పాల్పడదని జైశంకర్ పేర్కొన్నారు. ట్రూడో చేసిన ఆరోపణలకు సంబంధించి తమకు ఇంతవరకు కెనడా నుంచి ఎలాంటి ఆధారాలు అందలేదన్న ఆయన.. ఒకవేళ నిజ్జర్ హత్యకు సంబంధించి తగిన సమాచారాన్ని అందిస్తే, భారత్ తప్పకుండా చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. కెనడాలో పరిస్థితుల కారణంగా భారత దౌత్యవేత్తలు ఎంబసీకి వెళ్లేందుకు కూడా వెనకాడుతున్నారని మంత్రి తెలిపారు. వారు బహిరంగంగా బెదిరింపులకు గురవుతుండటంతో కెనడా పౌరులకు భారత వీసాలు నిలిపివేయాల్సి వచ్చిందని వెల్లడించారు. శాన్ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్‌పై దాడి, కెనడాలోని ఖలిస్తానీ బెదిరింపు పోస్టర్లపై ఓ విలేకరి ప్రశ్నించగా.. ‘ మీరు నా స్థానంలో ఉంటే ఏం చేస్తారని ప్రశ్నించారు. ఒకవేళ మీ రాయబార కార్యలయాలు, మీ దౌత్యవేత్తలు, మీ దేశ ప్రజలకు బెదిరింపులు ఎదురైతే మీరు ఎలా స్పందిస్తారని అడిగారు. మేము మీ దేశంపై విమర్శలు చేసాం, మీ కాన్సులేట్లపై దాడులకు పాల్పడ్డం. పోస్టర్లు పెట్టాం. దీనిని మీరు సాధారణమైనవిగా భావిస్తారా? ఇదే వేరే దేశానికి జరిగితే మీరు ఎలా స్పందిస్తారు. కెనడాలో జరుగుతున్నది జనరల్‌గా చూడవద్దు. అక్కడ ఏం జరగుతుందో బయట ప్రపంచానికి తెలియడం చాలా ముఖ్యం’ అని పేర్కొన్నారు. ‘ఉగ్రవాదం, తీవ్రవాదం, హింస మొదలైన విషయాల్లో కొన్నేళ్లుగా మాకు కెనడా, కెనడా ప్రభుత్వంతో సమస్యలు ఉన్నాయి. భారత్, కెనడాల మధ్య కొనసాగుతున్న దౌత్యపరమైన వివాదంపై అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్, జాతీయ భద్రతా సలహాదారు జేక్ సుల్లివన్‌లతో చర్చించాం’ అని తెలిపారు. కాగా అమెరికా పర్యటనలో ఉన్న జైశంకర్, ఆదేశ విదేశాంగమంత్రి ఆంటోనీ బ్లింకెన్‌తోనూ భేటీ అయ్యారు. భారత్- అమెరికా మధ్య జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో విదేశాంగ ఇదరుదేశాల విదేశాంగ మంత్రులు విస్తృతంగా చర్చించారు. చదవండి: సన్నిహిత సంబంధాలకే మొగ్గు: ట్రూడో