
కేంద్ర మంత్రి జై శంకర్ (ఇన్‌సెట్‌లో) తల్లి సులోచనా సుబ్రమణ్యం
న్యూఢిల్లీ : భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జై శంకర్ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన తల్లి సులోచనా సుబ్రమణ్యం కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె శనివారం మరణించారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి జై శంకర్ తన ట్విటర్ ఖాతా ద్వారా వెల్లడించారు. ‘‘మా అమ్మ సులోచనా సుబ్రమణ్యం ఈ రోజు (శనివారం) కన్నుమూశారని తెలియజేయటానికి ఎంతగానో చింతిస్తున్నా. అమ్మ శ్రేయోభిలాషులు, స్నేహితులు ఆమెను వారి ఆలోచనల్లో ఉంచుకోవాలని కోరుకుంటున్నా. ఆమె అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో మాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి మా కృతజ్ఞతలు’’ అని పేర్కొన్నారు. కాగా, పలువురు ప్రముఖులు ట్విటర్ వేదికగా జై శంకర్‌కు తమ సానుభూతిని తెలియజేస్తున్నారు.
చదవండి : ‘ఎంపికైనా ఉద్యోగాలు ఇవ్వడం లేదు’
Comments
Please login to add a commentAdd a comment