మదర్స్‌ ప్రైడ్‌ : తల్లిని తలుచుకొని నీతా అంబానీ భావోద్వేగం | Nita Ambani Shares An Emotional Message From Her Mom At Harvard | Sakshi
Sakshi News home page

మదర్స్‌ ప్రైడ్‌ : తల్లిని తలుచుకొని నీతా అంబానీ భావోద్వేగం

Published Tue, Feb 18 2025 5:47 PM | Last Updated on Tue, Feb 18 2025 6:47 PM

Nita Ambani Shares An Emotional Message From Her Mom At Harvard

రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్‌పర్సన్ నీతా అంబానీ ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ ఇండియా కాన్ఫరెన్స్ 2025లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె తన తల్లి పూర్ణిమ దలాల్‌ను గుర్తు  చేసుకుని భావోద్వాగానికి లోనయ్యారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్   ఎక్స్‌ ఖాతాలో దీనికి సంబంధించిన వీడియో  నెట్టింట సందడి చేస్తోంది. 'మదర్స్ ప్రైడ్' అని క్యాప్షన్‌తో షేర్‌  చేసిన  ఈ పోస్ట్‌లో నీతా అంబానీ ప్రేక్షకులను ఉద్దేశించి మాట్లాడుతున్న 50 సెకన్ల వీడియో కూడా ఉంది.

బోస్టన్‌లో జరిగిన సమావేశంలో నీతా అంబానీ మాట్లాడుతూ.. తన ప్రసంగానికి ముందు తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయంలో ప్రసంగించే అవకాశం తనకు లభించడం పట్ల తన 90 ఏళ్ల తల్లి  ఎంత గర్వ పడిందో, ఎంతగా చలించిపోయిందో వివరించారు.  చిన్నతనంలో హార్వర్డ్‌లో చదవాలని నీతా అంబానీకా చాలా కోరికగా ఉండేదట. కానీ ఆర్థిక పరిమితుల కారణంగా వెళ్లలేకపోయింది. కానీ ఇప్పుడు అదే హార్వర్డ్ వేదికపై ఆమె ప్రసంగించే అవకాశం దక్కడంతో నీతా తల్లి ఎంతో సంబరపడిపోయింది. ఇదే విషయాన్ని తన  కోడళ్లు  శ్లోకా మెహతా,  రాధిక మర్చంట్‌లను ఫోన్‌ చేసి మరీ   ఈ విషయాన్ని చెప్పి  ఎంతో సంతోషడిపోయింది, చాలా భావోద్వేగానికి గురైంది అంటూ నీతా అంబానీ చెప్పారు. తనను ఆహ్వానించి తల్లిని సంతోషపెట్టినందుకు హార్వర్డ్ కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు నీతా. 

 అలాగే నీతా అంబానీ  రాపిడ్ ఫైర్‌ అనే మరో విభాగంలో నీతా అంబానీ చాలాచక్కగా సమాధానాలిచ్చారు. ముఖ్యంగా  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆమె భర్త  రిలయన్స్‌ అధినేత ముఖేష్ అంబానీల గురించి అడిగిన ప్రశ్నకు  సమాధానం హాజరైన వారిని ఆకట్టుకుంది, ప్రేక్షకుల నుండి హర్షధ్వానాలు వచ్చాయి. ప్రధానమంత్రి మోదీ జీ దేశానికి  గొప్పవారైతే, తన  భర్త ముఖేష్ నా ఇంటికి మంచివారు అంటూ సమాధానమిచ్చారు. ఘ

ఇదీ చదవండి: ఉన్నపాటుగా ప్రాణాలు తీస్తున్న గుండెపోటు : ఎలా గుర్తించాలి?


 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement