గుండెల్లో పెట్టుకుని పెంచుకున్న కుమార్తెను మెట్టింటికి పంపడం అంత సులభం కాదు-నీతా అంబానీ
అమ్మాయి అంటే లక్ష్మీదేవి, ఆడపిల్లలు ఇంటిని స్వర్గంగా మారుస్తారు-నీతా
బిలియనీర్ ముఖేష్ అంబానీ, నీతా దంపతుల చిన్న కుమారుడు అనంత్ అంబానీ , రాధికా మర్చంట్ వివాహవేడుకలు ఘనంగా ముగిసాయి. ప్రతీ వేడుకను ఘనంగా నిర్వహించడం మాత్రమే కాదు, దేశ విదేశాలనుంచి వచ్చిన అతిథులెవ్వరికీ ఏలోటూ లేకుండా చాలా శ్రద్ధ వహించి, శభాష్ అనిపించుకున్నారు నీతా అంబానీ. పెళ్లిలో అత్యంత కీలకమైందీ, ప్రతీ గుండెను ఆర్ద్రం చేసే సన్నివేశంలో కూడా నీతా తన పెద్దరికాన్ని చాటుకున్నారు. రాధిక కన్యాదానం సమయంలో నీతా ఉద్వేగ ప్రసంగం నెట్టింట వైరల్‌గా మారింది.
Nita Ambani explains the broader significance of Kanyadaan as a union where two families come together, one gaining a son and the other a daughter. Speaking just before the Kanyadaan ceremony during Anant and Radhika's wedding, Mrs. Ambani underscores the importance of daughters… pic.twitter.com/URjchATLTf
— Filmfare (@filmfare) July 16, 2024
కొత్తకోడలు రాధిక మర్చంట్‌ను తన కోడలిగా ఆనందంతో కుటుంబంలోకి స్వాగతించడమే కాకుండా, రాధిక తల్లిదండ్రులు వీరేన్ మర్చంట్ , శైలా మర్చంట్‌లకు ఆమె భరోసా ఇచ్చిన తీరు విశేషంగా నిలిచింది. ‘‘కూతుర్ని ఇవ్వడం అంత తేలిక కాదు. తమ గుండెల్లో దాచుకుని పెంచుకున్న కూతుర్ని మెట్టింటికి పంపడం, ఆ భారాన్ని భరించడం కష్టం. నేనూ ఒక కూతురిని, ఒక కూతురికి తల్లిని , అత్తగారిని. రాధికను మా కూతురిలా చూసుకుంటాం. ఆడపిల్లలే పెద్ద వరం. మన ఆడపిల్లలు మన ఇంటిని స్వర్గంగా మారుస్తారు. మీరు మీ కుమార్తెను మాకు ఇవ్వడం కాదు, మరో కొడుకును, కొత్త కుటుంబాన్ని పొందారంటూ వారికి ధైర్యం చెప్పారు. అలాగే మీకు అనంత్ ఏంతో, మాకు రాధిక కూడా అంతే’’ అంటూ రాధిక పేరెంట్స్‌ను ఊరడించారు.
ఈ సందర్భంగా హిందూ వివాహ ఆచారాల్లో కన్యాదానం అంటే ఏమిటో, అమ్మాయిని లక్ష్మితో సమానంగా భావిస్తారంటూ కుమార్తె ప్రాముఖ్యత ఏంటో ప్రపంచ అతిథుల ముందు నీతా అంబానీ వివరించారు. దీంతో నూతన వధువు రాధిక, ఆమె తల్లితండ్రులతోపాటు అక్కడున్న వారంతా భావోద్వేగానికి లోనయ్యారు.
నీతా అంబానీ వాగ్దానం
‘‘ముఖేష్, నేను మా కుమార్తెగా, అనంత్ సహచరిగా, ఇషా, ఆనంద్,, శ్లోక, ఆకాష్ మాదిరిగానే రాధికను కూడా గుండెల్లో పెట్టుకుని ప్రేమిస్తాం, రక్షిస్తామని వాగ్దానం చేస్తున్నాం. పృథ్వీ, ఆదియా, కృష్ణ, వేదాలకు మంచి అత్త, పిన్ని దొరికింది. నా ప్రియమైన రాధికను హృదయపూర్వకంగా మా ఇంట్లో అతి పిన్న వయస్కురాలిగా శ్రీమతి రాధిక అనంత్ అంబానీగా స్వాగతిస్తున్నాం’’ అంటూ చోటీ బహూను అందరి కరతాళ ధ్వనుల మధ్య అంబానీ కుటుంబంలోకి ఆమెను ఆహ్వానించారు. జామ్ నగర్‌లో అనంత్ అంబానీ-రాధికకు ఘనంగా ఆహ్వానం పలుకుతున్న వీడియో నెట్టింట్ సందడి చేస్తోంది.
కాగా జూలై 12న అనంత్ అంబానీ తన చిరకాల ప్రేయసి రాధికా మర్చంట్‌తో కలిసి వివాహ బంధంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో 3 రోజుల పాటు వివాహ వేడుకలన్నీ అట్టహాసంగా జరిగాయి. అనంతరం అనంత్, రాధిక దంపతులకు శుభప్రదమైన ఆశీర్వాద కార్యక్రమం మంగళ్ ఉత్సవ్ లేదా గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించారు ఈ గ్రాండ్ వెడ్డింగ్‌కు హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ సెలబ్రిటీలు, దేశ విదేశాలకు చెందిన క్రీడా, రాజకీయ, వ్యాపార దిగ్గజాలు హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment