
రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక-ఛైర్‌పర్సన్ నీతా అంబానీ ఇటీవల ప్రతిష్టాత్మక హార్వర్డ్ ఇండియా కాన్ఫరెన్స్ 2025లో కీలకోపన్యాసం చేశారు. హార్వర్డ్ విశ్వ విద్యాలయంలో ఆమె ప్రసగించడం పలువురి ప్రశంసలందుకుంది. ఈ సందర్బంగా తన వ్యక్తిగత అనుభవాలను పంచుకున్నారు నీతా ముఖ్యంగా తాను చిన్నపుడు హార్వర్డ్ యూనివర్శిటీలో చదువు కోవాలని భావించడం, కానీ ఆర్థిక పరిస్థితుల రీత్యా ఆ కోరిక నెరవేరకపోవడం, ఇపుడు అక్కడి కీలకోపన్యాసం చేయడంతో తన తల్లి ఎంతో సంబర పడిపోయిన వైనాన్ని షేర్ చేశారు. తాజాగా తన చిన్నకోడలు రాధిక అంబానీపై ప్రశంసలు కురిపించడం విశేషంగా నిలిచింది.
నీతా అంబానీ మాట్లాడుతూ తన చిన్న కొడుకు అనంత్ అంబానీ గురించి చెప్పుకొచ్చారు. అనంత్ ఆధ్యాత్మికంగా ఎలా ఉంటాడు, ఊబకాయంతో ఫైట్ చేస్తున్న తీరు ,రాధికతో ప్రేమను గుర్తు చేసుకున్నారు. అనారోగ్యంతో పోరాడుతున్న సమయంలో, అతనికి రాధిక లాంటి భార్య దొరకడం సంతోషం అన్నట్టు నీతా మాట్లాడారు. అనంత్ మతపరంగా, ఆధ్యాత్మికంగా చాలా దృఢంగా ఉంటాడు. జీవితాంతం ఊబకాయంతో పోరాడుతూ ఉన్నాడు. అయినప్పటికీ చాలా సానుకూలంగా ఉంటాడు. అలాగే తన జీవిత భాగస్వామి రాధికను కలవడం ద్వారా మరింత ఉత్సాహంగా మారాడు. వాళ్లిద్దరినీ అలా జంటగా చూడముచ్చటగా, అద్భుతంగా మ్యాజిక్‌లా ఉంటారంటూ చిన్న కోడల్ని కొనియాడారు.
At the Harvard India Conference, Mrs. Nita Ambani speaks from the heart about her youngest son Anant - his journey through challenges, his positivity and spirituality, and finding his soulmate in Radhika! pic.twitter.com/yQNeMMFyZJ
— Reliance Industries Limited (@RIL_Updates) February 18, 2025
కాగా గత ఏడాది జూలై 12న అనంత్, రాధిక మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. అంబానీ నివాసం, యాంటిలియా, ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో వీరి వివాహం ఆరు రోజుల పాటు ఘనంగా జరిగింది. రాధిక మర్చంట్, అనంత్ చిన్నప్పటి నుంచి స్నేహితులు. అనంత్ రోడ్ ఐలాండ్‌లోని బ్రౌన్ విశ్వవిద్యాలయంలో చదువుకోగా రాధిక న్యూయార్క్‌లో చదువుకుంది. 2018 నుంచి డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ముఖ్యంగా ఒకరినొకరు కళ్ళలోకి చూసుకుంటున్న ఒక ఫోటో వైరల్ కావడంతో వీరి ప్రేమ వ్యవహారం బైటపడింది. ఆ తరువాత అనంత్ సోదరి ఇషా అంబానీ నిశ్చితార్థ వేడుకలో, నీతా అంబానీ, ముఖేష్ అంబానీ పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ, శ్లోకా మెహతా వివాహ వేడుకలో కూడా రాధిక కనిపించారు.
అయితే రాధిక తనకు దొరకడం అంటే 100 శాతం అదృష్టవంతుడిని అంటూ అనంత్ అంబానీ గతంలో తన ప్రేమను చాటుకున్నాడు. ఇప్పటికీ రాధికను కొత్తగా కనిసినట్టు అనిపిస్తుంది రాధికను చూసినప్పుడు తన హృదయంలో అగ్నిపర్వతాలు, భూకంపాలు, సునామీలొస్తాయంటూ చాలా భావోద్వేగంతో అనంత్ చెప్పిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment