అనంత్‌-రాధికా అంబానీ అదిరిపోయే దుబాయ్‌ విల్లా, ఫోటోలు వైరల్‌ | Ambani And Radhika Merchant Dubai Villa Worth Rs 640 Cr, Private Beach | Sakshi
Sakshi News home page

అనంత్‌-రాధికా అంబానీ అదిరిపోయే దుబాయ్‌ విల్లా, ఫోటోలు వైరల్‌

Published Tue, Nov 19 2024 3:20 PM | Last Updated on Tue, Nov 19 2024 4:32 PM

Ambani And Radhika Merchant Dubai Villa Worth Rs 640 Cr, Private Beach

రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ, నీతా అంబానీ  తమ చిన్న కొడుకు అనంత్ అంబానీకి అద్భుతమైన పెళ్లి కానుక ఇచ్చారు. అత్యంత వైభవంగా అనంత్‌ అంబానీ, రాధిక మర్చంట్‌ వివాహాన్ని ఇటలీలో జరిపించిన అంబానీ దంపతులు అలాగే కనీవినీ ఎరుగని రీతిలో రెండు  ప్రీ-వెడ్డింగ్  బాష్‌లు నిర్వహించారు.  ఈ సందర్భంగా  ఇట‌లీలోని ఓ క్రూజ్ షిప్‌లో భారీ పార్టీని ఏర్పాటు చేసారు. ఇందంతా ఒక ఎత్తయితే అంబానీలు త‌మ చిన్న కోడ‌లు రాధికా మ‌ర్చెంట్‌కు దుబాయ్‌లో 640 కోట్ల విలువైన బంగ్లాను కానుక‌గా ఇచ్చారు. ఈ లగ్జరీ  బంగ్లాకు సంబంధించిన ఫోటోలు ఇపుడు నెట్టింట సందడి చేస్తున్నాయి.

దుబాయ్‌లోని ఫేమ‌స్ పామ్ జుమైరాలో ఈ విలాసవంతమైన విల్లా ఉంది. దుబాయ్‌లో అత్యంత ఖ‌రీదైన విల్లాలో ఇదొకటి. దాదాపు 3000 చ‌ద‌ర‌పు అడుగుల్లో ఈ విల్లాను నిర్మించారు. ఈ విల్లా మొత్తంలో 10 బెడ్‌రూంలు, 70 మీట‌ర్ల ప్రైవేట్ బీచ్‌ కూడా ఉంది. సొగసైన లివింగ్ రూమ్‌లు, బెడ్‌రూమ్‌లు  విలాసవంతమైన బాత్‌రూమ్‌ల ఇలా ప్రతీది  చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉండేలా జాగ్రత్తపడ్డారట. 

ఇటాలియన్ మార్బుల్, అద్భుతమైన ఆర్ట్‌వర్క్‌తో అలంకరించిన 10 ఖరీదైన బెడ్‌రూమ్‌లు, ఆకట్టుకునే ఇంటీరియర్స్‌తో విల్లా ఒక అద్భుత కళాఖండంగా ఉంటుందని సమాచారం. ఇండోర్, అవుట్‌డోర్ పూల్స్ ఉన్నాయి. పాంపరింగ్ సెషన్‌ల కోసం ప్రైవేట్ స్పా, ప్రైవేట్ సెలూన్ కూడా ఉన్నాయి. పెద్ద కోడ‌లు శ్లోకా మెహ‌తాకి 450 కోట్ల ఖ‌రీదైన బంగ్లాతో పాటు రూ. 200 కోట్ల ఖ‌రీదైన నెక్లెస్ ఇచ్చారు. ఈ ఏడాది జులై 12న రాధిక, అనంత్‌ అంబానీ వివాహ వేడుక  చాలా ‍గ్రాండ్‌గా నిర్వహించిన సంగతి తెలిసిందే.

👉 ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

 

ఇదీ చదవండి: పేరు మార్చుకున్న అంబానీ కోడలు : ఇకపై అధికారికంగా...!



 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement