![Maha Kumbh Mela Radhika Dons Rs 1 Lakh, Anant Ambani Stuns In Red Look](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/ambanifamily%3Dmahakumbh.jpg.webp?itok=uyP-wC0J)
మహాకుంభ మేళాలో అంబానీ ఫ్యామిలీ పుణ్య స్నానాలు
అనంత్ అంబానీ, రాధిక జంట ప్రత్యేక ఆకర్షణ
లక్ష రూపాయల విలువే చేసే డ్రెస్‌లో రాధికా అంబానీ
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కుటుంబంతో కలిసి ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్నమహాకుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించారు. గంగా, యమునా, సరస్వతి నదుల పవిత్ర సంగమమైన త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేయడానికి ప్రతిరోజూ లక్షలాది మంది భక్తులు తరలి వస్తున్నారు. ఈ భక్తజన సంద్రంలో అంబానీ కుటుంబంకూడా చేరింది. ముఖేష్ అంబానీ,కోకిలాబెన్ అంబానీ, ఆకాశ్ అంబానీ, అతని భార్య శ్లోకా మెహతాతో పాటు, అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ,చిన్న కోడలు రాధిక మర్చంట్ (ఫిబ్రవరి 11న) త్రివేణి సంగమంలో పవిత్ర ఆచారాలలో పాల్గొని పవిత్ర స్నానం చేశారు. (మున్నార్ : థ్రిల్లింగ్ డబుల్ డెక్కర్ బస్, గుండె గుభిల్లే! వైరల్ వీడియో)
మహా కుంభ్‌లో, రాధిక తన లుక్‌తో ఆకట్టుకుంది. నేవీ బ్లూ సిల్క్ లగ్జరీ కుర్తాలో హుందాగా కనిపించింది. గోల్డ్ జరీ ఎంబ్రాయిడరీతో జయంతి రెడ్డి రూపొందించిన ఈ దుస్తుల విలువ ఇపుడు హాట్ టాపిక్‌గా నిలిచింది. V-నెక్‌లైన్ ,మోచేయి వరకు పొడవున్న స్లీవ్‌లు నెక్‌లైన్ బోర్డర్‌లను జరీ ఎంబ్రాయిడరీతో తీర్చి దిద్దారు. ఈ కుర్తాకు కాంట్రాస్టింగ్ పుదీనా గ్రీన్ ధోతీ ప్యాంటు, మ్యాచింగ్ దుపట్టాతో జత చేసింది. దీని ధర లక్ష రూపాయలని వివిధ నివేదికల ద్వారా తెలుస్తోంది. అలాగే జ్యయుల్లరీ తక్కువగా ఉంచినప్పటికీ మోడ్రన్‌గా ఉండటం విశేషం. సింపుల్ పోనీటైల్‌తో డైమండ్ స్టడ్ చెవిపోగులు, హారాన్ని ధరించి ఆధ్యాత్మిక లుక్‌లో అలరించింది. (Valentines Day : లవ్ బర్డ్స్‌కోసం ది బెస్ట్ డెస్టినేషన్ ఇదే!)
![](https://www.sakshi.com/s3fs-public/inline-images/ambanifamily%3Dmahakumbh-1.jpg)
ఇక రాధికకు జతగా అనంత్ అంబానీ అద్భుతమైన ఎరుపు రంగు దుస్తుల్లో కనిపించాడు. వెండి మోటిఫ్‌లు , చక్కటి,చిక్కటి బంగారు ఎంబ్రాయిడరీ చేసిన మెరూన్ వెయిస్ట్‌కోట్, షైనింగ్ రెడ్ ఎరుపు కుర్తాను ధరించాడు. అలాగే బంగారు గొలుసు, నుదుటిన తిలకంతో తన సాంప్రదాయ రూపాన్ని పూర్తి చేశాడు.
కాగా ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమంలోమహా కుంభమేళా 2025 ఉత్సాహంగా సాగుతోంది. సూర్యుని చుట్టూ బృహస్పతి చుట్టే కక్ష్య పూర్తైన సూచనగా జరుపుకునే ముఖ్యమైన తీర్థయాత్ర పండుగ ఇది. 12-కుంభమేళా చక్రం ముగింపును ఇది సూచిస్తుంది. దీనిని అధికారికంగా 45 రోజుల పాటు జరిగే మహా కుంభమేళాగా పిలుస్తారు. ఈ కార్యక్రమం జనవరి 13న మొదలై, ఫిబ్రవరి 26 వరకు సాగనుంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సమావేశంగా గుర్తింపు పొందింది.
Comments
Please login to add a commentAdd a comment