ట్రెండింగ్‌లో నిలిచిన కొత్త​ పెళ్లి కూతురు.. ఇంకొందరు.. | List Of Top 10 Trending Personalities On Google In 2024 In India With Their Details | Sakshi
Sakshi News home page

ట్రెండింగ్‌లో నిలిచిన కొత్త​ పెళ్లి కూతురు.. ఇంకొందరు..

Published Wed, Dec 11 2024 3:11 PM | Last Updated on Wed, Dec 11 2024 4:02 PM

top trending personalities on Google in 2024 in india

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ ముఖేశ్‌అంబానీ చిన్న కోడలు రాధిక మర్చెంట్‌ 2024 ఏడాదికిగాను గూగుల్‌ సెర్చ్‌లో ట్రెండింగ్‌లో నిలిచారు. ముఖేశ్అంబానీ-నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ వివాహం జులైలో రాధిక మర్చెంట్‌తో జరిగిన విషయం తెలిసిందే. వీరి వివాహానికి అంతర్జాతీయ ప్రముఖులు, సెలబ్రిటీలు, సినీతారలు హాజరై సందడి చేశారు. దాంతో అంబానీ కోడలు గురించి చాలామంది గూగుల్‌లో సెర్చ్‌ చేసినట్లు తెలిసింది.

2024లో రాధిక మర్చెంట్‌తోపాటు మరికొందరు ట్రెండింగ్‌లో నిలిచారు.

1. వినేష్ ఫొగాట్‌: భారతదేశపు రెజ్లింగ్ స్టార్

రెజ్లర్ వినేష్ ఫొగాట్‌ 2024లో అత్యధికంగా గూగుల్‌లో సెర్చ్‌ చేసిన భారతీయ వ్యక్తుల జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. పారిస్‌ ఒలింపిక్‌లో మహిళల 50 కేజీల రెజ్లింగ్‌ పోటీలో 100 గ్రాముల అధిక బరువుండి దానికి అర్హత సాధించలేకపోయారు.

2. నితీష్ కుమార్: బిహార్ రాజకీయ వ్యూహకర్త

బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో విపరీతమైన ప్రజాదరణ పొందారు. తన రాజకీయ ఎత్తుగడలు, పొత్తులపై దేశవ్యాప్తంగా చర్చ జరిగింది.

3. చిరాగ్ పాశ్వాన్: రాజకీయ నాయకుడు

దివంగత కేంద్ర మంత్రి రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ కుమారుడు చిరాగ్‌ పాశ్వాన్‌ నటనకు స్వస్తి చెప్పి రాజకీయాల్లోకి ప్రవేశించారు. మోడీ 3.0 కేబినెట్‌లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

4. హార్దిక్ పాండ్యా: క్రికెటర్‌

క్రికెట్‌లో ఆల్ రౌండర్‌గా పేరున్న హార్దిక్ పాండ్యా మోడల్ నటాసా స్టాంకోవిక్‌తో విడాకులు తీసుకున్నారు. దాదాపు నాలుగేళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలికారు.

5. పవన్ కళ్యాణ్: రాజకీయ నాయకుడు

ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ 2024 జూన్‌లో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు.

6. శశాంక్ సింగ్: కొత్త క్రికెట్ స్టార్

శశాంక్ సింగ్ ఐపీఎల్‌ క్రికెట్‌లో తన అద్భుతమైన ఆటతో అందరి దృష్టిని ఆకర్షించారు.

7. పూనమ్ పాండే: మోడల్‌, నటి

గర్భాశయ క్యాన్సర్‌తో పూనమ్ పాండే మృతి చెందినట్లు ఆమె అనుచరులు తెలిపారు. తర్వాత అది ఫేక్‌ అని, తాను బతికే ఉన్నానని చెప్పింది.

8. రాధిక మర్చెంట్‌: అంబానీ కోడలు

జులైలో అనంత్ అంబానీతో గ్రాండ్ వెడ్డింగ్ నేపథ్యంలో రాధికా మర్చంట్ పేరు వైరల్‌గా మారింది.

9. అభిషేక్ శర్మ: క్రికెటర్‌

క్రికెటర్ అభిషేక్ శర్మ ఐపీఎల్‌లో అసాధారణ ప్రదర్శనతో అభిమానులను ఆకట్టుకున్నారు.

10. లక్ష్య సేన్: బ్యాడ్మింటన్ క్రీడాకారుడు

2024 పారిస్ ఒలింపిక్స్‌లో లక్ష్య సేన్ అద్భుతమైన ‍ప్రతిభ కనబరిచారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement