Anant-Radhika Wedding:ఆకాశ పందిరి.. తారలు తలంబ్రాలు | Anant Ambani-Radhika Merchant Wedding special | Sakshi
Sakshi News home page

Anant Ambani and Radhika Merchant wedding: ఆకాశ పందిరి.. తారలు తలంబ్రాలు

Published Sat, Jul 13 2024 6:27 AM | Last Updated on Sat, Jul 13 2024 10:14 AM

Anant Ambani-Radhika Merchant Wedding special

కుబేరులు వియ్యంకులైతే ఒక కల్యాణం ఎంత ఘనంగా జరగాలో అంత ఘనంగా జరుగుతుంది. దేవతల వంటి అతిథులు, పుష్పక విమానాలు, పారిజాతాలు, శతభక్ష్య పరమాణ్ణాలు, సువర్ణ తోరణాలు, వెండి ద్వారాలు, స్త్రీల మెడల్లో పచ్చలు, కెంపులు, వజ్రవైఢూర్యాలు, కళ్లు చెదిరే పట్టుపీతాంబరాలు...

ముఖేష్‌ అంబానీ– నీతా అంబానీ తమ కుమారుడు అనంత్‌ అంబానీ వివాహాన్ని విరెన్‌ మర్చంట్‌–శైలా మర్చంట్‌ల కుమార్తె రాధికా మర్చంట్‌తో జూలై 12 రాత్రి జరప నిశ్చయించడంతో ముంబైలోని జియో వరల్డ్‌ కన్వెన్షన్‌ అందుకు భారీ వేదికైంది. దేశ, విదేశాల అతిథులను విమానాలు మోసుకొచ్చాయి.  శనివారం ‘శుభ్‌ ఆశీర్వాద్‌’ పేరుతో వేడుక, ఆదివారం రోజు ‘మంగళ్‌ ఉత్సవ్‌’ పేరున భారీ రిసెప్షన్‌ జరుగనున్నాయి.

తరలి వచ్చిన అతిథులు
ఒకవైపు తేలికపాటి చినుకులు పడుతూ ఉంటే అనంత్‌–రాధికల పెళ్లి కోసం అంబానీ గృహధామం ఎంటిలియాతో పాటు వివాహవేదిక జియో వరల్డ్‌ కన్వెçన్షన్‌లో అతిథుల తాకిడి మొదలైంది. ‘దుల్హేరాజా’ అనంత్‌ బారాత్‌ను సర్వాంగ సుందరంగా తయారు చేసిన కారులో కొనసాగింది. సాయంత్రం నుంచే అతిథుల రాక మొదలైంది. 

బ్రిటన్‌ మాజీ ప్రధాని టోని బ్లెయర్‌ మొదలు అమెరికా మీడియా పర్సనాలిటీ కిమ్‌ కర్దాషియన్‌ వరకు హాలీవుడ్‌ నటుడు జాన్‌ సీనా నుంచి తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ వరకూ ఎందరో అరుదెంచారు. బాలీవుడ్‌ నుంచి షారూక్‌ ఖాన్, సల్మాన్‌ ఖాన్, రణబీర్‌ కపూర్, ఆలియా భట్, ప్రియాంకా చో్ప్రా– నిక్‌ జోన్స్, అనిల్‌ కపూర్, జాకీ ష్రాఫ్‌ తదితరులు హాజరయ్యారు. క్రికెటర్లలో మహేంద్ర సింగ్‌ ధోని, నాటి మేటి ఆటగాడు శ్రీకాంత్, బుమ్రా, కేఎల్‌ రాహుల్, సూర్యకుమార్‌ యాదవ్‌ హాజరయ్యారు. 



దక్షిణాది తారాతోరణం
అనంత్‌– రాధికల వివాహంలో దక్షిణాది తారలు తళుకులీనారు, మహేష్‌బాబు తన భార్య నమ్రత, కుమార్తె సితారతో హాజరవగా, రామ్‌చరణ్‌–ఉపాసన జోడీగా వచ్చారు. వెంకటేష్, రాణ స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచారు. సంగీత దిగ్గజం ఏ.ఆర్‌. రెహమాన్‌ సతీసమేతంగా హాజరయ్యారు. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కుటుంబ సమేతంగా వచ్చారు. నయనతార–విగ్నేష్‌ శివన్, సూర్య–జ్యోతిక వేడుకకు తళుకులు అద్దారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement