ఒక రాత్రికి రూ.1 లక్ష.. పెరిగిన హోటల్స్‌ ధరలు - కారణం ఇదే! | Five Star Hotel Rooms Rates Soar Nearly To Rs 1 Lakh In A Night In Mumbai, Know Reason Inside | Sakshi
Sakshi News home page

ఒక రాత్రికి రూ.1 లక్ష.. పెరిగిన హోటల్స్‌ ధరలు - కారణం ఇదే!

Published Mon, Jul 8 2024 1:25 PM | Last Updated on Mon, Jul 8 2024 1:51 PM

Five Star Hotel Rooms Rates Nearly Rs 1 Lakh A night in Mumbai

అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ల పెళ్లి ఈ నెల 12న (జులై) ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో జరగనుంది. వీరి వివాహానికి ముందే ముంబైలోని హోటల్స్ గదుల రేట్లు భారీగా పెరిగాయి. ఇప్పటికే మొత్తం రూమ్స్ బుక్ అయిపోయినట్లు కూడా కొన్ని ప్రముఖ ఫైవ్ స్టార్ హోటల్స్ పేర్కొన్నారు.

సాధారణ రోజులలో ముంబైలోని కొన్ని ఫైవ్ స్టార్ హోటల్స్‌లోని గదుల ఛార్జ్ ఒక రాత్రికి రూ.13000 ఉంటుంది. అంబానీ ఇంట పెళ్లి వేడుకల సందర్భంగా ఈ ధరలను సుమారు రూ.1 లక్షకు పెంచారు. దీన్ని బట్టి చూస్తే అంబానీ పెళ్లి వేడుకలను హోటల్స్ ఎలా క్యాష్ చేసుకుంటున్నాయో అర్థం చేసుకోవచ్చు.

హోటల్స్ ధరలు పెంచడం ఇదే మొదటిసారి కాదు
సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రముఖ హోటల్స్.. గదుల చార్జెస్ భారీగా పెంచడం ఇదే మొదటిసారి కాదు. గతంలో బెంగళూరులో ఏరో షో జరిగినప్పుడు కూడా అక్కడున్న హోటల్స్ గదుల రేట్లకు భారీగా పెంచాయి. ఇది మాత్రమే కాకుండా ఆటో ఎక్స్‌పో సమయంలో ఢిల్లీ, గురుగ్రావ్ ప్రాంతాల్లోని హోటల్స్ కూడా భారీ చార్జీలను వసూల్ చేశాయి.

పెళ్ళికి హాజరుకానున్న ప్రముఖులు
ఇప్పటికే అనంత్, రాధికల వివాహ వేడుకలు ప్రారంభమైపోయాయి. ఇటీవలే సంగీత్ ఫంక్షన్ కూడా జరిగింది. ఈ వేడుకలకు సెలబ్రిటీలు, క్రికెటర్లు, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. కాగా వీరి వివాహం త్వరలోనే జరుగుతుంది. ఈ వేడుకలకు కూడా దిగ్గజ పారిశ్రామికవేత్తలు, సినీ తారలు మొదలైనవారు పాల్గొనే అవకాశం ఉందని సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement