Hotels
-
మన్యం అతిథి గృహాలు హౌస్‌పుల్
సాక్షి, పాడేరు: అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లాలోని పర్యాటక ప్రాంతాలు సంవత్సరాంత వేడుకల జోష్‌ను పులుముకున్నాయి. డిసెంబర్ 31తో పాటు ఆంగ్ల సంవత్సరాది జనవరి 1 వేడుకలను సంతోషంగా చేసుకునేందుకు పర్యాటకులు మన్యంలోని పర్యాటక ప్రాంతాలను ఎంచుకున్నారు. జిల్లాలోని అనంతగిరి, అరకులోయ, పాడేరు, వంజంగి, చింతపల్లి, లంబసింగి, మోతుగూడెం, మారేడుమిల్లి, రంపచోడవరం ప్రాంతాల్లోని అతిథి గృహాలను పర్యాటకులు, వివిధ వర్గాల ప్రజలంతా మూడు నెలల ముందుగానే ఆన్లైన్లో బుకింగ్ చేసుకున్నారు. అతిథి గృహాలన్నీ హౌస్పుల్పర్యాటక శాఖకు చెందిన అన్ని అతిథి గృహాలు, రిసార్ట్లు ఆన్లైన్లోనే హౌస్‌పుల్ అయ్యాయి. అనంతగిరిలోని టైడా జంగిల్ బెల్స్‌లో 24, అనంతగిరి హరితలో 28, అరకులోయ మయూరిలో 85, హరితలో 58, లంబసింగిలో 15 గదులు రెండు రోజుల పాటు బుక్ అయ్యాయి. టూరిజం శాఖకు చెందిన అన్ని రిసార్ట్‌లలో రెస్టారెంట్ల సౌకర్యం ఉండడంతో ఈ గదులకు అధిక డిమాండ్ ఉంది.ప్రైవేట్ హోటళ్లు, రిసార్ట్లకూ ఆదరణఅనంతగిరి, అరకులోయ, వంజంగి, కొత్తపల్లి, లంబసింగి టూరిజం కారిడార్‌గా పర్యాటకుల ఆదరణ మూడేళ్లలో అధికమైంది. దీంతో పర్యాటకుల సంఖ్యకు తగ్గట్టుగానే హోటళ్లు, రిసార్ట్‌ల నిర్మాణాలు భారీగానే జరగ్గా.. వాటికీ ఆదరణ పెరిగింది. టెంట్ సౌకర్యాలు కూడా పెద్దఎత్తున అందుబాటులోకి వచ్చాయి. అనంతగిరి మండలంలో 200, అరకులోయలో 1,200, పాడేరు 100, వంజంగి 100, లంబసింగిలో 200 వరకు అతిథి గృహాలు ఉన్నాయి. అంతే స్థాయిలో టెంట్లను కూడా వేస్తున్నారు. సంవత్సరాంత వేడుకలతో అతిథి గృహాలు, రిసార్ట్లు, టెంట్ ప్రాంతాలని్నంటినీ నిర్వాహకులు ముస్తాబు చేశారు. పర్యాటకులను ఆకర్షించే విధంగా విద్యుత్ దీపాల అలంకరణలో కళకళలాడుతున్నాయి.గోదారి తీరంలోనూ..కోనసీమ జిల్లాలోని ఓ ప్రైవేట్ రిసార్ట్స్సాక్షి, అమలాపురం: మెట్రోపాలిటన్ నగరాల నుంచి సంక్రాంతికి మాత్రమే గోదావరి జిల్లాలకు వచ్చే ఐటీ ఉద్యోగులు, వ్యాపారస్తులు, ప్రజలు ఈసారి ముందుగానే గోదావరి తీరంలో.. ప్రకృతి ఒడిలో.. ప్రశాంత వాతావరణంలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకునేందుకు తరలివస్తున్నారు. వీరందరి రాకతో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ రిసార్టులు నిండిపోయాయి. స్థానిక రిసార్టుల్లోని రూములన్నీ డిసెంబర్ 31 నుంచి జనవరి 2వ తేదీ వరకు రెండు నెలల క్రితమే బుకింగ్ అయ్యాయి. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని దిండి రిసార్ట్స్‌తో పాటు ప్రైవేటు సంస్థలకు చెందిన సరోవర్ పోర్టికో, సముద్రా రిసార్ట్లు, కాకినాడ జిల్లా గోవలంక వద్ద ఉన్న యానాం రిసార్టు, గోదావరి నదిని, సముద్ర తీరాన్ని ఆనుకుని ఉన్న ఫామ్‌హౌస్‌లు, గెస్ట్‌హౌస్‌లు పూర్తిగా నిండిపోయాయి. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం తదితర ప్రధాన ప్రాంతాలతో పాటు పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి, సిద్ధాంతం తదితర ప్రాంతాల్లోని రిసార్ట్లు, ప్రధాన హోటళ్లు పర్యాటకులతో సందడిగా మారాయి.న్యూ ఇయర్ ఇక్కడేపర్యాటక ప్రాంతం అరకులోయ, వంజంగి హిల్స్ ప్రాంతాల్లో న్యూ ఇయర్ వేడుకల కోసం ముందుగానే చేరుకున్నాం. గతంలోనే అరకులోయలో ప్రైవేట్ అతిథి గృహాన్ని బుక్ చేసుకున్నాం. కుటుంబ సభ్యులతో వచ్చాం. రెండు రోజులు ఇక్కడే ఉంటాం. ఇక్కడ పర్యాటక ప్రాంతాలు ఎంతో అబ్బురపరుస్తున్నాయి. – అర్ణబ్, పర్యాటకుడు, కోల్‌కతా -
తిరుమలలో బ్రాండెడ్ హోటళ్లు
తిరుమల: తిరుమలలో భక్తులకు నాణ్యమైన ఆహారాన్ని తక్కువ ధరకు అందించేలా పేరొందిన బ్రాండెడ్ హోటళ్లు ఏర్పాటు చేసే విధానాన్ని తీసుకొస్తామని టీటీడీ ఈవో శ్యామలరావు చెప్పారు. బ్రాండెడ్ హోటళ్లు వాటి పేరు, ప్రఖ్యాతుల కోసం భక్తులకు నాణ్యమైన ఆహారాన్ని అందిస్తాయని భావిస్తున్నామని చెప్పారు. మంగళవారం టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన అన్నమయ్య భవనంలో టీటీడీ పాలకమండలి సమావేశం జరిగింది. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను టీటీడీ ఈవో మీడియాకు వివరించారు.తిరుమలలోని బిగ్, జనతా క్యాంటీన్ల నిర్వహణ, మరింత నాణ్యంగా ఆహార పదార్థాలు తయారు చేసేందుకు దేశంలోని ప్రముఖ సంస్థలకు క్యాంటీన్ల నిర్వహణ లైసెన్సుల జారీలో నూతన విధానం అమలుకు పాలకమండలి ఆమోదం తెలిపిందన్నారు. లడ్డూల స్కాంపై విచారణ చెన్నైలోని టీటీడీ సమాచారం కేంద్రం నుంచి శ్రీవారి ప్రసాదాలు బ్లాక్ మార్కెట్‌కు తరలిపోవడంపై విచారణ చేపట్టామని ఈవో చెప్పారు. సోమవారం ‘సాక్షి’లో ‘శ్రీవారి లడ్డూల గుటకాయ స్వాహా!’ శీర్షికన ప్రచురితమైన కథనంపై విచారణ చేపట్టామన్నారు. విచారణ అనంతరం లడ్డూలు పక్కదారి పట్టించిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, బోర్డు సభ్యులు, జేఈవోలు గౌతమి, వీరబ్రహ్మం, సీవీఏస్వో శ్రీధర్ పాల్గొన్నారు. పాలకమండలి ప్రధాన నిర్ణయాలివీ » టీటీడీ ఆలయాలు, ఆస్తుల గ్లోబల్ ఎక్స్టెన్షన్ కోసం అవసరమైన సూచనల కోసం నిపుణులతో కమిటీ ఏర్పాటుకు ఆమోదం. ఈ కమిటీ ఇచ్చే నివేదిక ప్రకారం తదుపరి చర్యలు. » దేశంలోని ప్రముఖ ప్రాంతాల్లో శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయాలు నిర్మించేలా కమిటీ ఏర్పాటుకు ఆమోదం. » స్విమ్స్ ఆస్పత్రిలో రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలందించేందుకు జాతీయ హోదా కోసం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి. » కాలినడకన వచ్చే భక్తులకు మెరుగైన వైద్య సౌకర్యం అందించేందుకు సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది, అత్యాధునిక వైద్య పరికరాల ఏర్పాటుకు ఆమోదం. » భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఫీడ్ బ్యాక్ మేనేజ్మెంట్ సిస్టం ఏర్పాటు చేయాలని నిర్ణయం. ఈ మేరకు ఏపీ డిజిటల్ కారొరేషన్ సహకారంతో భక్తుల నుంచి సలహాలు తీసుకోవాలని నిర్ణయం. » మరింత నాణ్యంగా అన్నప్రసాదాలు అందించేందుకు కాంట్రాక్ట్ ప్రాతిపదికన శ్రీలక్ష్మీ శ్రీనివాస మేన్‌పవర్ కార్పొరేషన్ ద్వారా వివిధ విభాగాల్లో 258 మంది సిబ్బందిని తీసుకునేందుకు ఆమోదం. » కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో తిరుపతిలో నిర్వహిస్తున్న సంప్రదాయ పాఠశాలకు ఎస్వీ విద్యాదాన ట్రస్టు నుంచి రూ.2 కోట్లు ఆర్థిక సాయం చేసేందుకు ఆమోదం. » భక్తుల ఆరోగ్యం దృష్ట్యా ఆహార పదార్థాలను తనిఖీ చేసేందుకు ఫుడ్ సేఫ్టీ విభాగం ఏర్పాటుతో పాటు అందుకు అనుగుణంగా సీనియర్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టును శ్రీలక్ష్మీ శ్రీనివాస మేన్‌పవర్ కార్పొరేషన్ ద్వారా భర్తీ చేసేందుకు ఆమోదం. » ఒంటిమిట్ట కోదండ రామాలయంలో విమాన గోపురానికి రూ.43లక్షలతో బంగారు కలశం ఏర్పాటు చేయాలని నిర్ణయం. » ముంబైలో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ నిర్మాణానికి సిడ్కో కేటాయించిన 3.60 ఎకరాల స్థలానికి నిర్ణయించిన రూ.20 కోట్లకు పైగా ఉన్న లీజు ధరను తగ్గించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి.అరగంటలో ‘వైకుంఠ ఏకాదశి’ టికెట్లు ఖాళీతిరుమల: తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి టీటీడీ ఆన్లైన్లో టికెట్లు విడుదల చేసిన అరగంటకే ఖాళీ అయిపోయాయి. జనవరి 10న వైకుంఠ ఏకాదశి రోజు నుంచి 19వ తేదీ వరకు తిరుమల ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులను టీటీడీ అనుమతిస్తుంది. ఇందుకోసం ఆ పది రోజులకు 1.40 లక్షల రూ.300 టికెట్లను మంగళవారం ఉదయం 11 గంటలకు ఆన్లైన్లో విడుదల చేసింది. అయితే కేవలం 30 నిమిషాల్లోనే టికెట్లన్నీ అయిపోయాయి. వీటి కోసం 14 లక్షలు మంది ఆన్లైన్లో పోటీపడ్డారు. -
రారండోయ్ వేడుక చూద్దాం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా మూడు రోజులు పాటు ట్యాంక్‌బండ్ ఎన్టీఆర్ మార్గ్‌లో నిర్వహిస్తున్న ప్రజాపాలన విజయోత్సవాలు సోమవారంతో ముగియనున్నాయి. ముగింపు వేడుకల సందర్భంగా సచివాలయంలో సాయంత్రం 5 గంటలకు కొత్తగా ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. ఐమ్యాక్స్ సమీపంలోని హెచ్ఎండీఏ గ్రౌండ్లో లక్ష మంది స్వయం సహాయక సంఘాల మహిళలతో భారీ బహిరంగ సభ జరగనుంది. సాయంత్రం 7.30 గంటలకు ఎనీ్టఆర్ మార్గ్‌లో డ్రోన్ ప్రదర్శన, హుస్సేన్ సాగర్‌లో పెద్దఎత్తున బాణసంచా ప్రదర్శన, అనంతరం హెచ్ఎండీఏ మైదానంలో తమన్ నేతృత్వంలో సంగీత కచేరీ, సాంస్కృతిక ప్రదర్శన ఉంటుంది. ట్యాంక్‌బండ్, ఎనీ్టఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్డులో ఫుడ్‌స్టాళ్లతో పాటు హస్తకళల, సాంస్కతిక, పలు ప్రభుత్వ విభాగాలకు చెందిన స్టాళ్లను ఏర్పాటు చేశారు. బహు పసందుగా ఫుడ్ స్టాళ్లు ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా నెక్లెస్ రోడ్లో ఏర్పాటు చేసిన ఫుడ్ స్టాళ్లలోని పలు పసందైన వంటకాలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. నగరంలో ప్రసిద్ధి చెందిన పలు బ్రాండెడ్ హోటల్స్ ఫుడ్ స్టాళ్లను ఏర్పాటు చేశాయి. హైదరాబాదీ బిర్యానీ, మొఘలాయి, తెలంగాణ, ఆంధ్ర వంటకాలతో పాటు బేకరీ ఐటమ్స్ చాట్, ఐస్‌క్రీం.. ఇలా వందకు పైగా ఫుడ్‌స్టాళ్లు అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు తెలంగాణ వంటకాలు పాలమూరు గ్రిల్, తెలంగాణ విందు, అంకాపూర్ నాటుకోడి చికెన్, పుడ్ జాయింట్స్‌ను అందుబాటులోకి తెచ్చారు. ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా నగరమంతా విద్యుత్ దీపాలంకరణతో జిగేమంటోంది. డా.బీఆర్ అంబేడ్కర్ సచివాలయం, పరిసర ప్రాంతాలు విద్యుత్ దీపాలతో తళుక్కుమంటున్నాయి. -
లవ్ హోటళ్లు.. పోటెత్తుతున్న ప్రేమ జంటలు
అణుబాంబుల వినాశనం నుంచి తేరుకుని జపాన్ సాధించిన ప్రగతి అన్ని దేశాలకూ స్ఫూర్తిదాయకమే. అక్కడి గమ్మత్తైన సంగతులను కెమెరాలో బంధించేందుకు బయల్దేరిన ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ ఫొటోగ్రాఫర్ ఫ్రాంకోయిస్ ప్రోస్ట్ను లవ్ హోటళ్ల సంస్కృతి బాగా ఆకర్షించింది. ప్రైవసీ కోసం ప్రేమ పక్షులు కాస్త ‘ఏకాంతంగా’ సమయం గడిపే ఈ హోటళ్లు జపాన్‌లో సూపర్‌హిట్‌గా మారాయి. వింత ఆకృతుల్లో అలరించే వీటి విశేషాలను రకరకాల యాంగిళ్లలో కెమెరాలో బంధించాడు.పడవలు, కోటలు, అంతరిక్ష వస్తువులు హోటల్ జాయ్, హోటల్ ప్యాషన్, హోటల్ బేబీ కిస్... ఇలా ఆకర్షణీయ పేర్లతో లవ్, కిస్ సింబళ్లతో ఈ హోటళ్లు ఆకట్టుకునేలా ఉంటాయి. విభిన్న ఆకృతుల్లో ఉండటం వీటిలోని మరో విశేషం. ఒక హోటల్ భారీ పడవలా, మరోటి పేద్ద కోటలాగా దర్శనమిస్తాయి. ఇంకోటి తిమింగలంలా, మరోటి గ్రహాంతరవాసుల ఎగిరే పళ్లెం (యూఎఫ్ఓ)లా నిర్మించారు. సాధారణ భవంతుల మధ్య చూడగానే కనిపెట్టేలా వీటిని కట్టారు. ఇలాంటి 200కు పైగా లవ్ హోటళ్లను ప్రోస్ట్ ఫొటోలు తీశారు. వ్యభిచారాన్ని నిషేధిస్తూ జపాన్‌లో 1958లో చట్టం తెచ్చాక ఈ లవ్ హోటళ్ల సంస్కృతి పెరగడం విశేషం. వీటిల్లో వ్యభిచారం జరుగుతోందని కొందరు విమర్శిస్తుండగా మరికొందరు దాన్ని గట్టిగా ఖండిస్తుండటం విశేషం.ఇరుకు ఇళ్లు, ఉమ్మడి కుటుంబాలు ఉమ్మడి కుటుంబాల్లో కొత్త జంటలకు ఊపిరాడదు. చిలిపి చేష్టలు తదితరాలు కష్టం. పేద, దిగువ మధ్యతరగతి కుటుంబాలు నివసించే ఇళ్లు, గదులు మరీ ఇరుకు, ఇలాంటి కొత్త, పేద జంటల ‘అవసరాలు’ తీర్చే ప్రత్యామ్నాయ వేదికలుగా లవ్ హోటళ్లు బాగా ఉపయోగపడుతున్నాయని జపాన్‌లో చాలామంది భావిస్తున్నారు. కొత్త జంటలు, ప్రేమ పక్షుల ప్రైవసీకే గాక నైట్‌క్లబ్ వంటి పలు వసతులకు ఇవి నెలవులు. జలాంతర్గామిలా, పెద్ద నౌకలా చూపు తిప్పుకోలేనంతటి ముదురు రంగు పెయింటింగుల్లో, రాత్రిళ్లు ధగధగల విద్యుత్ వెలుగుల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.ఫుల్ ప్రైవసీ ఈ లవ్ హోటళ్లలో సిబ్బంది చాలా తక్కువగా ఉంటారు. ఉన్నా సరిగా కనపడరు. తెరలు, మసకమసక గాజు తలుపుల వెనుక నుంచే సేవలందిస్తారు. చార్జీలను ఆన్లైన్లోనే చెల్లించవచ్చు. కారు పార్కింగ్ ప్రాంతం కూడా కాస్త చీకటిగానే ఉంటుంది గనుక ప్రైవసీకి లోటే ఉండదు. 1970ల నుంచీ బాగా పాపులరైన మెగురో ఎంపరర్ లవ్ హోటల్‌ను యూరప్ కోట ఆకృతిలో నిర్మించారు. దాని బాటలో జపాన్ అంతటా చాలా నగరాల్లో లవ్ హోటళ్లు కోట డిజైన్లలో పుట్టుకొచ్చాయి. హోన్సు, షికోకు దీవులు మొదలుకుని టోక్యోదాకా అంతటా అలరిస్తూ వచ్చాయి. ఒకయామాలోని హోటల్ అలాదిన్ను గ్రాండ్ అరేబియన్ ప్యాలెస్‌లా భారీ గుమ్మటాలతో కట్టారు.ఏటా 50 కోట్ల మంది జపాన్వ్యాప్తంగా 20,000 లవ్ హోటళ్లుంటాయని అంచనా. 1980ల్లో వచి్చన కఠిన చట్టాల తర్వాత వీటి సంఖ్య తగ్గింది. అయినా ఇప్పటికీ వీటికి విపరీతమైన జనాదరణ ఉంది. 1990ల నుంచి అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం ఈ హోటళ్లను ప్రేమ జంటలు ఏటా 50 కోట్లసార్లు సందర్శిస్తున్నారు! ఆ లెక్కన జపాన్‌లో సగం శృంగారం ఈ హోటళ్లలోనే జరుగుతోందని ప్రముఖ న్యాయ శాస్త్రవేత్త మార్క్ డి.వెస్ట్ విశ్లేíÙంచారు. 2005లో రాసిన ‘లా ఇన్ ఎవ్రీడే జపాన్’ పుస్తకంలో ఇలాంటి బోలెడు విషయాలను వెల్లడించారాయన.– సాక్షి, నేషనల్ డెస్క్ -
పొయ్యిపై సల.. సల..ఆరోగ్యాలు విల విల!
పుట్టపర్తికి చెందిన 30 ఏళ్ల మహిళ తిన్న ఆహారం జీర్ణం కాలేదని ఆస్పత్రిలో చేరింది. కడుపు నొప్పితో పాటు ఆకలి మందగించినట్లు డాక్టర్లకు తెలిపింది. పలు వైద్య పరీక్షల అనంతరం కల్తీ ఆహారం తినడం కారణంగానే ఆరోగ్య సమస్య తలెత్తినట్లు వైద్యులు నిర్ధారించారు. కల్తీ నూనె, మసాలా పదార్థాలు తినడం తగ్గించాలని డాక్టర్లు సూచించారని ఆమె తెలిపింది.పెనుకొండలో ఓ చిన్నారి పుట్టినరోజు సందర్భంగా ఐదు కుటుంబాలు విందులో పాల్గొనేందుకు హోటల్‌కు వెళ్లాయి. వాళ్లందరూ రకరకాల వంటకాలు తిన్నారు. చివరగా ఇంటికి చేరే సమయంలో దారిలో కనిపించిన స్ట్రీట్ ఫుడ్ కూడా రుచి చూశారు. ఎక్కడ తేడా కొట్టిందో తెలీదు. కానీ ఇద్దరు చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. ఆస్పత్రికి తీసుకెళ్లగా ఫుడ్ పాయిజనింగ్‌గా తేల్చారు. సాక్షి, పుట్టపర్తి : నిత్యావసర సరుకుల ధరలతో పాటు వంటనూనె ధరలు విపరీతంగా పెరిగాయి. కానీ వాడకం మాత్రం తగ్గడంలేదు. మరోవైపు హోటళ్లలో తిండి ధరలు ఉన్నఫలంగా పెంచడం కుదరదు. దీంతో చాలా మంది కల్తీనూనె వాడటం మొదలుపెట్టారు. దీనికితోడు పొయ్యిపై నూనెను పదే పదే మరిగించేస్తున్నారు. ఫలితంగా తాజా నూనె అయినప్పటికీ మరిగించడంతో రుచి మారుతోంది. ఆ నూనెలో తయారు చేసిన పదార్థాలను తింటున్న ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. ఇలాంటి ఘటనలు పట్టణ ప్రాంతాల్లో తరచూ వెలుగు చూస్తున్నాయి. రోడ్డు పక్కన తయారు చేసే ఆహార పదార్థాలు దుమ్ము, ధూళి రేణువులు చేరి అనారోగ్యానికి గురి చేస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. పట్టణాల్లోనే అధికం.. పల్లెలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లోనే హోటళ్లు అధికం. అందులో రోడ్ల పక్కన చిన్న చిన్న హోటళ్లు, తోపుడు బండ్లు ప్రతి వంద మీటర్లకు ఒకటి కనిపిస్తాయి. ఇతర ప్రాంతాల నుంచి పలు పనులపై వచ్చే వాళ్లు గత్యంతరం లేక ఇక్కడే తినాల్సి వస్తోంది. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, ప్రధాన కూడళ్లలోని హోటళ్లలో ఎక్కువ మంది ఆహార పదార్థాలను తింటుంటారు. అయితే నూనెను పదే పదే మరిగించడంతో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఉదయం నుంచి రాత్రి దాకా.. మద్యం దుకాణాల సమీపంలోని చికెన్ కబాబ్ సెంటర్లలో ఎక్కువసార్లు మరిగించిన నూనెలో చేసిన పదార్థాలను తినడం కారణంగా మందుబాబులు అనారోగ్యం బారిన పడుతున్నారు. మద్యం కంటే కల్తీ నూనె పదార్థాలు ఎక్కువగా ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తున్నాయనే విషయం మత్తులో గమనించలేకపోతున్నారు. మటన్, చికెన్, కోడిగుడ్ల వంటకాల్లో ఎక్కువగా కల్తీ జరుగుతున్నట్లు తెలిసింది. ప్రైవేటు మద్యం దుకాణాలు రావడంతో ఒక్కో దుకాణం వద్ద పదుల కొద్దీ చికెన్ కబాబ్ సెంటర్లు వెలిశాయి. ఒకసారి పొయ్యి పెట్టిన నూనె సాయంత్రం వరకూ కాగుతూనే ఉంటోంది. ఫలితంగా ఆ ఆహారాన్ని తీసుకునే వారు ఫుడ్ పాయిజన్‌తో పాటు వివిధ రకాల అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. అటకెక్కిన తనిఖీలు.. పదే పదే మరిగించిన నూనెలో వంటకాలు చేయడం.. ఆ పదార్థాలు తిన్న వారు అనారోగ్యం బారిన పడటం.. సైకిల్ చక్రంలా స్పష్టంగా కనిపిస్తోంది. అయినా ఫుడ్‌సేఫ్టీ అధికారులు తనిఖీలు లేకపోవడంతోనే ఇదంతా జరుగుతోందన్న విమర్శలున్నాయి. ఫిర్యాదులు వస్తే కానీ తనిఖీలు చేయరని అంటున్నారు. మరి కొన్ని చోట్ల ఆర్నెల్లకు ఒకసారి కూడా తనిఖీలు చేయడం లేదని రికార్డులు చెబుతున్నాయి. పండుగ సమయంలో మాత్రమే అడపాదడపా తనిఖీలు చేసి చేతులు దులుపుకొంటున్నారు. నూనె డబ్బాల్లో ఎంతమేరకు కల్తీ ఉందనే విషయం ఎవరూ బయటపెట్టడంలేదు. కబేళాలకు తరలించే పశువుల ఎముకల పిండి కూడా నూనెలో కలిపేస్తున్నారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. కల్తీ అని తేలితే కఠిన చర్యలు మా సిబ్బంది ఆధ్వర్యంలో నిత్యం తనిఖీలు జరుగుతున్నాయి. అయితే ఎక్కడ కల్తీ జరుగుతోందో పక్కా సమాచారం ఇస్తే.. తనిఖీ ముమ్మరం చేస్తాం. శ్యాంపిళ్లు తీసి ల్యాబ్‌కు పంపిస్తాం. కల్తీ చేసినట్లు నిర్ధారణ అయితే చర్యలు తప్పవు. ఇప్పటికే చాలా చోట్ల తనిఖీలు చేశాం. కల్తీ చేస్తున్న వారిపై చర్యలు తీసుకున్నాం. ప్రజలు బయట ఫుడ్ తినడం తగ్గిస్తే ఆరోగ్యం బాగుంటుంది. – రామచంద్ర, ఫుడ్ ఇన్స్పెక్టర్, పుట్టపర్తి ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలి ఆహారం విషయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలి. మంచి ఆహారంతోనే ఆరోగ్యం బాగుంటుంది. బయట ఎక్కడ పడితే అక్కడ హోటళ్లలో తింటే అనారోగ్యం బారిన పడటం ఖాయం. మసాలా, నూనె వంటలు తినడం తగ్గించాలి. నూనె వంటకాలతో కొవ్వు శాతం పెరగడంతో పాటు కల్తీ నూనె వంటకాలు తింటే వివిధ రోగాలు సోకే ప్రమాదం ఉంది. – డాక్టర్ మంజువాణి, డీఎంహెచ్ఓరోగాలు ఇలా.. ఒకసారి వాడిన వంటనూనెను మళ్లీ మళ్లీ వినియోగించడం వల్ల ఆరోగ్యానికి చేటు కలిగిస్తుంది. మోతాదుకు మించి మరిగిన నూనెలో టోటల్ పోలార్ కౌంట్ (టీపీసీ) 25 శాతానికి మించి శరీరానికి హానికరంగా మారుతుంది. అలాంటి నూనెతో ఆహార పదార్థాలు వండితే శరీరంలో అధికంగా ఫ్రీరాడికల్స్ పెరిగిపోతాయి. నూనె రంగు మారిపోతుంది. అడుగున నల్లటి పదార్థం తయారవుతుంది. ఆమ్లం అధికమవుతుంది. కొన్ని నూనెలలో నిల్వ ద్వారా విష పదార్థాలు కూడా ఏర్పడతాయి. స్థూలకాయం, గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్‌తో సహా చాలా వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయని వైద్యులు చెబుతున్నారు. -
HYD: హోటళ్లలో తనిఖీలు.. విస్తుపోయే నిజాలు వెలుగులోకి
సాక్షి,హైదరాబాద్: హబ్సిగూడ, నాచారంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆదివారం(నవంబర్ 10) ఉదయం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో విస్తుపోయే వాస్తవాలు బయటపడ్డాయి. హబ్సిగూడలోని సీసీఎంబీ క్యాంటీన్‌కు ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ లేదని అధికారులు గుర్తించారు.కిచెన్‌లో బొద్దింకలు, ఎలుకలు ఉన్నట్లు గుర్తించామని ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలిపారు.ఎక్స్పైర్ అయిన పాడైన ఫుడ్ ఇంగ్రీడియెంట్స్‌తో వంట చేస్తున్నట్లు గుర్తించారు.దీంతో పాటు అపరిశుభ్రంగా ఉన్న నాచారంలోని మను కిచెన్ రెస్టారెంట్, శ్రీ సుప్రభాత హోటల్ కిచెన్లలోనూ తనిఖీలు చేశారు.కుళ్ళిపోయిన టమాటో, పొటాటోలను వంటకాల్లో ఉపయోగిస్తున్నారని తేలింది.వీటికి తోడు కాలం చెల్లిన పన్నీర్, మష్రూమ్‌లతో వంటల చేస్తున్నట్లు గుర్తించారు.ఇదీ చదవండి: HYD: హోటల్లో భారీ పేలుడు.. పక్కనున్న బస్తీలో ఎగిరిపడ్డ రాళ్లు -
హోటల్స్‌ను అర్ధరాత్రి వరకు అనుమతించండి
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా హోటళ్లు, రెస్టారెంట్లు అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు తెరిచి ఉంచేందుకు సహకరించాలని కోరుతూ ఏపీ హోటల్ అసోసియేషన్ ప్రతినిధి బృందం రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావును కలిసి వినతిపత్రం అందజేసింది. ఏపీ హోటల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఆర్.వి.స్వామి, కార్యదర్శి ఎం.నాగరాజు, కోశాధికారి ఇ.వి.పూర్ణచంద్, విజయవాడ హోటల్ అసోసియేషన్ అధ్యక్షులు రమణ, కార్యదర్శి రాఘవ డీజీపీ ప్రధాన కార్యాలయంలో ఆయనతో సమావేశమయ్యారు. 2018 అక్టోబరు 15వ తేదీన విడుదల చేసిన జీవో 25 ప్రతిని డీజీపీకి అందజేశారు.దీనికి కొనసాగింపుగా 2022 జూన్ 13వ తేదీన ఇచ్చిన మెమో ఉత్తర్వుల కాపీని కూడా జోడించారు. పొరుగున ఉన్న తెలంగాణలో అర్ధరాత్రి వరకు హోటళ్లు, రెస్టారెంట్లు తెరిచి ఉంచేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం అనుమతించిన విషయాన్ని వివరించారు. ఇప్పటికే ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లామని, ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. దీనికి సంబంధించి పోలీసు అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేయాలని డీజీపీ ద్వారకా తిరుమలరావును కోరామని, ఆయన కూడా సానుకూలంగా స్పందించారని హోటల్ అసోసియేషన్ ప్రతినిధులు పేర్కొన్నారు. -
తిరుపతి హోటళ్లకు మరోసారి బాంబు బెదిరింపులు
సాక్షి, తిరుపతి: నగరంలోని హోటళ్లకు మరోసారి బాంబు బెదిరింపులు రావడంతో కలకలం రేగింది. తిరుపతి పోలీసులకు బెదిరింపు కాల్స్ సవాల్‌గా మారగా, మూడు హోటల్స్‌లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఐఎస్ఐ పేరుతో బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. తనిఖీల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లేకపోవడంతో పోలీసులు వెనుదిరిగారు.తిరుపతి, తిరుమల అత్యంత సేఫ్‌గా ఉన్నాయని ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారు. తిరుపతి వాసులు, భక్తులు ఎలాంటి ఆందోళన చెందవద్దని ఎస్పీ సుబ్బారాయుడు అన్నారు. కాగా, తిరుపతిలోని ప్రధాన హోటళ్లకు బాంబు బెదిరింపులు కొనసాగుతున్నాయి. మరోపక్క బాంబు బెదిరింపులకు సంబంధించి ఫేక్ మెయిల్స్‌పై ప్రత్యేక దృష్టి పెట్టిన సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.మరోవైపు ఇటీవల దేశవ్యాప్తంగా విమానాలకు ఇటీవల బాంబు బెదిరింపు కాల్స్, మెయిళ్లు పెరిగిపోయిన విషయం తెలిసిందే. వీటిపై విమానయాన శాఖ సీరియస్‌గా తీసుకుంది. విమానాలకు బెదిరింపు మెయిళ్లు పంపిస్తే బ్లాక్ లిస్టులో పెడతామని హెచ్చరించింది. -
తిరుపతిలో బాంబు బెదిరింపుల టెన్షన్
-
బాంబు బెదిరింపులతో హడల్
సాక్షి, అమరావతి: బాంబు బెదిరింపులతో యావత్ దేశం హడలిపోతోంది. విమానాలు, హోటళ్లు, విద్యాసంస్థలు.. ఇలా ప్రతిచోటా బాంబులు పెట్టినట్టు ఈమెయిల్, సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా బెదిరింపుల వరద ముంచెత్తుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. బెదిరింపు రాగానే పోలీసు బృందాలు, బాంబు స్క్వాడ్ రంగంలోకి దిగి తనిఖీలు చేయడం.. బాంబు లేదని నిర్ధారించడం ప్రహసనంగా మారింది. ప్రధానంగా దక్షిణ భారతంలోని రాష్ట్రాలను లక్ష్యంగా చేసుకుని అత్యధికంగా ఈ ఉత్తుత్తి బాంబు బెదిరింపులు వస్తుండటం గమనార్హం. ‘నాన్నా.. పులి కథ’లా మారకూడదన్న ఉద్దేశంతో భద్రతా బలగాలు అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. రెండు వారాల్లో 400 బెదిరింపులువిమానాల్లో బాంబులు పెట్టినట్టు బెదిరింపు ఈమెయిల్స్ వస్తుండటంతో పౌర విమానయాన శాఖ బెంబేలెత్తుతోంది. రెండు వారాల్లో ఏకంగా 400 బెదిరింపులు రావడం గమనార్హం. శనివారం ఒక్కరోజే 33 బెదిరింపులు రావడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. నవంబర్ 1 నుంచి 19 వరకు ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించవద్దని అంతర్జాతీయ ప్రయాణికులను ఖలీస్థానీ ఉగ్రవాది గుర్పత్వంత్ సింగ్ పన్నూ ఇటీవల బెదిరించడం కూడా ఈ ఆందోళనను రెట్టింపు చేస్తోంది. ఢిల్లీ, చెన్నై, బెంగళూరు తదితర విమానాశ్రయాలకు బెదిరింపు ఈమెయిల్స్ వచ్చాయి. ఈమెయిల్స్తోపాటు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కూడా బెదిరింపులకు పాల్పడుతున్నారు. దాంతో టేకాఫ్ తీసుకున్న విమానాలను అత్యవసరంగా ల్యాండింగ్ చేయిస్తూ విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. దక్షిణ భారతమే ప్రధాన లక్ష్యంగా..బాంబు బెదిరింపులకు పాల్పడుతున్న ఆగంతకులు ప్రధానంగా దక్షిణ భారత రాష్ట్రాలను లక్ష్యంగా చేసుకున్నారు. తమిళనాడులోని చెన్నైకు బెదిరింపులు వచ్చాయి. అక్కడి విమానాశ్రయం నుంచి బయలుదేరే విమానాల్లోనూ, ఆ నగరంలోని హోటళ్లలోనూ బాంబులు పెట్టినట్టు బెదిరించారు. బెంగళూరు, హైదరాబాద్ కూడా ఈ బెదిరింపుల బెడద బారిన పడ్డాయి. ఆ రెండు నగరాల్లో విమానాలతోపాటు విద్యాసంస్థల్లో బాంబులు పెట్టినట్టు సోషల్ మీడియా వేదికల ద్వారా బెంబేలెత్తించారు. బెదిరింపుల బెడద ఆంధ్రప్రదేశ్‌నూ తాకింది. శ్రీవారి దివ్యక్షేత్రం తిరుపతిని లక్ష్యంగా చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.వారం రోజుల్లో తిరుపతిలోని 17 హోటళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. తిరుపతి ఇస్కాన్ ఆలయంలోనూ బాంబు పెట్టినట్టు బెదిరించడం గమనార్హం. కాగా.. విజయవాడలోని ఓ స్టార్ హోటల్‌కు కూడా బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. ఒకర్ని అరెస్ట్ చేసిన పోలీసులు బెంగళూరు, విజయవాడలోని హోటళ్లలో బాంబులు పెట్టినట్టు బెదిరింపు ఈమెయిల్స్ పంపిన ఓ ఆగంతకుడిని పోలీసులు గుర్తించారు. అస్సాం నుంచి ఆ మెయిల్ వచ్చినట్టు గుర్తించి ఏపీ, కర్ణాటక ఎస్ఐబీ విభాగం అధికారులు ఆ రాష్ట్రంలో సోదాలు నిర్వహించారు. ఈమెయిల్ పంపిన ఆగంతకుడిని గుర్తించి అరెస్ట్ చేసి బెంగళూరు న్యాయస్థానంలో హాజరుపరిచారు. అతను మతిస్థిమితంలేని వ్యక్తి అని పోలీసులు చెబుతున్నారు. విమానాశ్రయాల్లో ‘బీటీసీ’ల మోహరింపుబాంబు బెదిరింపుల నేపథ్యంలో జాతీయ దర్యాప్తు విభాగం(ఎన్ఐఏ) కార్యాచరణను వేగవంతం చేసింది. దేశంలోని అన్ని ప్రధాన విమానాశ్రయాల్లోనూ థ్రెట్ అసిస్టెంట్ కమిటీ(బీటీసీ)లను మోహరించింది. బెదిరింపు ఈమెయిల్స్, సోషల్ మీడియా పోస్టులను ఈ విభాగం పరిశీలించి దర్యాప్తు ముమ్మరం చేస్తోంది. ఎక్కడి నుంచి మెయిల్స్ వస్తున్నాయో గుర్తించడం, ఎవరు చేస్తున్నారన్నది దర్యాప్తు చేయడం, తదనుగుణంగా కార్యాచరణ చేపట్టేందుకు భద్రతా దళాలకు సహకరించడంలో బీటీసీ బృందాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి.మరో విమానానికి బాంబు బెదిరింపువిశాఖ నుంచి ముంబై బయలుదేరిన విమానాన్ని వెనక్కి రప్పించిన అధికారులుతనిఖీల అనంతరం బాంబు లేదని నిర్ధారణసాక్షి, విశాఖపట్నం: వరుస బాంబుబెదిరింపులు విమానయాన సంస్థలతోపాటు ప్రయాణికులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. రెండు రోజులుగా వివిధ విమాన సర్వీసులకు బాంబు బెదిరింపులు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ బెదిరింపు కాల్ సోమవారం విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయంలో అలజడి సృష్టించింది. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వచ్చిన ఇండిగో విమానంలో బాంబు ఉందని గుర్తుతెలియని వ్యక్తి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు ఫోన్ చేసి హెచ్చరించాడు. దీంతో అక్కడి అధికారులు విశాఖ విమానాశ్రయ అధికారులకు సమాచారం ఇచ్చారు.అప్పటికే విశాఖ చేరుకుని.. ముంబై బయలుదేరిన ఆ విమానాన్ని అత్యవసరంగా వెనక్కి రప్పించారు. విమానం ల్యాండ్ అయ్యేసరికే బాంబ్ స్క్వాడ్‌ను సిద్ధం చేశారు. ప్రయాణికులను దింపి విమానాన్ని పూర్తిగా తనిఖీ చేసి.. బాంబు లేదని నిర్ధారించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం విశాఖ నుంచి సుమారు 2 గంటలు ఆలస్యంగా సాయంత్రం 5.32 గంటలకు విమానం ముంబైకి బయలుదేరి వెళ్లిందని ఎయిర్‌పోర్టు డైరెక్టర్ రాజారెడ్డి తెలిపారు. -
తిరుపతి: హోటళ్లకు ఆగని బాంబు బెదిరింపులు
సాక్షి,తిరుపతి: పుణ్యక్షేత్రం తిరుపతిలోని ప్రధాన హోటళ్లకు ఉత్తుత్తి బాంబు బెదిరింపులు కొనసాగుతున్నాయి. మరోపక్క బాంబు బెదిరింపులకు సంబంధించి ఫేక్ మెయిల్స్‌పై ప్రత్యేక దృష్టి పెట్టిన సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.ప్రాక్సీ సర్వర్‌ను ఉపయోగించి ఫేక్‌మెయిల్స్ పంపిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.ఫేక్మెయిల్స్పై ఎన్ఐఏ ప్రత్యేక దృష్టి పెట్టింది. తిరుపతిలోని ఏడు హోటల్స్‌తో పాటు రెండు ఆలయాలకు జాఫర్‌సాదిక్ పేరుతో బాంబు బెదిరింపు ఫేక్‌మెయిల్స్ వచ్చినట్లు ప్రాథమికంగా తేల్చారు. మరోవైపు ఇటీవల దేశవ్యాప్తంగా విమానాలకు ఇటీవల బాంబు బెదిరింపు కాల్స్,మెయిళ్లు పెరిగిపోయిన విషయం తెలిసిందే. వీటిపై విమానయాన శాఖ సీరియస్‌గా తీసుకుంది. విమానాలకు బెదిరింపు మెయిళ్లు పంపిస్తే బ్లాక్ లిస్టులో పెడతామని హెచ్చరించింది.ఇదీ చదవండి: హత్యకు యత్నం.. పీఎస్‌కు వెళితే అక్కడా దాడి -
తిరుపతిలో హోటల్సు కు బాంబు బెదిరింపు..
-
తిరుపతిలో హోటళ్లకు బాంబు బెదిరింపు కాల్స్
-
తిరుపతి హోటళ్లకు మరోసారి బాంబు బెదిరింపులు
తిరుపతి, సాక్షి: తిరుపతిలోని హోటళ్లకు మరోసారి వచ్చిన బాంబు బెదిరింపులు తీవ్ర కలకలం రేపాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు హోటళ్లలో తనిఖీలు చేపట్టారు. డాగ్ స్వ్కాడ్‌తో తనిఖీలు చేస్తున్నారు. ఐఎస్ఐ ఉగ్రవాదుల పేరుతో బెదిరింపు మెయిల్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలో రాజ్‌పార్క్, పాయ్ వైస్రాయి హోటళ్లకు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. అయితే.. నాలుగు రోజుల క్రితం తిరుపతిలోని 4 హోటళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. అప్రమత్తమైన పోలీసులు తనిఖీలు చేపట్టి.. వాటిని ఫేక్ మెయిల్స్‌గా నిర్ధారించారు. ఫేక్ బాంబు మెయిల్స్‌పై నిన్న(శుక్రవారం) తిరుపతి పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు.చదవండి: పట్టణాల్లో 83 లక్షల టన్నుల చెత్త -
ఐటీసీ లాభం ఫ్లాట్
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ డైవర్సిఫైడ్ దిగ్గజం ఐటీసీ లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) రెండో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. జూలై–సెపె్టంబర్(క్యూ2)లో కన్సాలిడేటెడ్ నికర లాభం స్వల్పంగా 2 శాతం పెరిగి రూ. 5,054 కోట్లను అధిగమించింది. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 4,965 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మరింత అధికంగా 16 శాతం ఎగసి రూ. 22,282 కోట్లను తాకింది. గత క్యూ2లో రూ. 19,270 కోట్ల టర్నోవర్ సాధించింది. హోటళ్ల బిజినెస్ ఏకీకృతం ప్రస్తుతం హోటళ్ల బిజినెస్‌ను ప్రత్యేక కంపెనీగా విడదీసే ప్రణాళికల్లో ఉన్న ఐటీసీ బోర్డు తాజాగా ప్రత్యర్థి సంస్థలలో గల వాటాలను ఏకీకృతం చేసే ప్రతిపాదనకు గ్రీన్‌సిగ్నల్ ఇచి్చంది. సొంత అనుబంధ సంస్థ రస్సెల్ క్రెడిట్(ఆర్సీఎల్) ద్వారా ఆతిథ్య రంగ దిగ్గజాలు ఒబెరాయ్, లీలా హోటళ్లలోగల వాటాలను కొనుగోలు చేయనుంది. ఈఐహెచ్(ఒబెరాయ్) లిమిటెడ్‌లో 1.52 కోట్ల ఈక్విటీ షేర్లను, హెచ్ఎల్వీ(లీలా)లో 34.6 లక్షల షేర్లను బుక్ విలువ ఆధారంగా కొనుగోలు చేయనుంది. దీంతో ఈఐహెచ్‌లో ఐటీసీకి 16.13 శాతం, హెచ్ఎల్వీలో 8.11 శాతం చొప్పున వాటా లభించనుంది. ప్రస్తుతం ఈఐహెచ్‌లో ఐటీసీకి 13.69 శాతం, ఆర్సీఎల్కు 2.44 శాతం చొప్పున వాటా ఉంది. ఇక హెచ్ఎల్వీలో ఐటీసీకి 7.58 శాతం వాటా ఉంది. ఫలితాల నేపథ్యంలో ఐటీసీ షేరు బీఎస్ఈలో 2 శాతం క్షీణించి రూ. 472 వద్ద ముగిసింది. -
హోటళ్లు, ఆసుపత్రుల్లో భారీ లావాదేవీలపై ఐటీ నిఘా!
హోటళ్లు, లగ్జరీ బ్రాండ్ విక్రయాలు, ఆసుపత్రులు, ఐవీఎఫ్ క్లినిక్‌లు వంటి చోట్ల జరుగుతున్న భారీ నగదు లావాదేవీలపై నిఘా పెట్టాలని దేశంలోని ప్రత్యక్ష పన్నుల నిర్వహణకు సంబంధించిన అత్యున్నత సంస్థ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) ఆదాయపు పన్ను శాఖను కోరింది.అదే విధంగా గత ఆర్థిక సంవత్సరం నుంచి భారీగా పెరుగుతున్న పన్ను బకాయిలను రికవరీ చేయడానికి సమష్టి ప్రయత్నాలు చేపట్టాలని ఐటీ శాఖను సీబీడీటీ కోరింది. ఈ మేరకు సీబీడీటీ ఇటీవల సెంట్రల్ యాక్షన్ ప్లాన్ (CAP) 2024-25 అనే వార్షిక కార్యాచరణ ప్రణాళిక పత్రాన్ని విడుదల చేసింది.రూ.2 లక్షలకు పైబడిన నగదు లావాదేవీలను ఆర్థిక లావాదేవీల స్టేట్మెంట్ రూపంలో ఆర్థిక సంస్థలు రిపోర్ట్ చేయాల్సి ఉన్నా అది జరగడం లేదని సీనియర్ అధికారులు వార్తా సంస్థ పీటీఐకి తెలిపారు. ఆ రిపోర్ట్‌లను పరిశీలిస్తున్నప్పుడు ఈ నిబంధనల అతిక్రమణ విస్తృతంగా ఉన్నట్లు గుర్తించామని సీబీడీటీ ఐటీ శాఖకు తెలిపింది.అలాగే సెక్షన్ 139A ప్రకారం నిర్దిష్ట లావాదేవీలలో పాన్ కార్డు నంబర్ అందించడం లేదా తీసుకోవడం తప్పనిసరి అయినప్పటికీ దీన్ని నిర్ధారించే వ్యవస్థ లేదని సీబీడీటీ పేర్కొంది. ఏదైనా అధిక మొత్తంలో వ్యయాన్ని పన్ను చెల్లింపుదారు సమాచారంతో ధ్రవీకరించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది.హోటళ్లు, బాంక్వెట్ హాళ్లు, లగ్జరీ బ్రాండ్ రిటైలర్లు, ఐవీఎఫ్ క్లినిక్‌లు, ఆసుపత్రులు, డిజైనర్ బట్టల దుకాణాలు, ఎన్ఆర్ఐ కోటా మెడికల్ కాలేజీ సీట్ల వంటి చోట్ల నిబంధనలు పాటించకుండా పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలు జరుగుతున్నాయని గుర్తించిన సీబీడీటీ.. అక్కడ ఎలాంటి అంతరాయం కలిగించకుండా నిఘా పెట్టాలని ఆదాయపు పన్ను శాఖకు సూచించింది. -
హోటల్స్ లో వేడివేడిగా టేస్టీ టేస్టీ పాయిజన్..
-
దురాశ తెచ్చిన దుఃఖం
అత్యాశే మనిషికి పెను శాపంగా మారుతోంది. వయనాడ్ విలయమే ఇందుకు తాజా ఉదాహరణ. అసలే కేరళకు పశ్చిమాన అరేబియా సముద్రం. ఆపై తూర్పున విస్తారమైన పశ్చిమ కనుమలు. దాంతో పుష్కలమైన వానలకు ఆ రాష్ట్రం పెట్టింది పేరు. ఏకంగా 310 సెంటీమీటర్ల వార్షిక సగటు వర్షపాతం నమోదవుతుంది. ఇందులో మూడొంతుల వానలు జూన్–సెప్టెంబర్ మధ్య వర్షాకాలంలోనే కురుస్తాయి. కేరళలో పశ్చిమ కనుమల అందాలు కన్ను తిప్పుకోనివ్వవు. వాటిని ఆస్వాదించేందుకు పర్యాటకుల రాక కొన్నేళ్లుగా ఊహాతీతంగా పెరుగుతోంది. దాంతో ఎకో టూరిజం పేరిట హోటళ్లు, రిసార్టుల నిర్మాణం అడ్డూ అదుపూ లేకుండాపోయింది. అందుకోసం అడవులను విచ్చలవిడిగా నరికేస్తున్నారు. కొండ ప్రాంతాలను కూడా ఎక్కడ పడితే అక్కడ అడ్డగోలుగా తవ్వేయడం నిత్యకృత్యంగా మారింది. వీటిని కట్టడి చేసి సమతుల్యత పాటించాల్సింది పోయి రాష్ట్ర ప్రభుత్వమూ వీటిని వీలైనంతగా ప్రోత్సహిస్తూ వస్తోంది. పర్యావరణపరంగా అత్యంత సున్నిత ప్రాంతమైన పశ్చిమ కనుమలు ఈ విపరిణామాలను తట్టుకోలేకపోతున్నాయి. ఫలితమే విపరీతమైన వాతావరణ మార్పులు. అవి కేరళలో కొన్నేళ్లుగా పరిపాటిగా మారాయి. 2017, 2018, 2019ల్లో వరుసగా తుఫాన్లు, వరదలు రాష్ట్రాన్ని ముంచెత్తాయి. అతి భారీ వర్షాలు ఇకపై మరింత పెరుగుతాయని ఈ ట్రెండ్ చెబుతోంది. విపరీత వాతావరణ పరిస్థితులు... వయనాడ్ విధ్వంసానికి మనిషి దురాశే ప్రధాన కారణమని లండన్ ఇంపీరియల్ కాలేజ్ రీసెర్చ్ అసోసియేట్ మరియం జకారియా అన్నారు. ‘‘వయనాడ్, ఇడుక్కి జిల్లాల్లో కొండ ప్రాంతాలపై నిర్మాణాలు విపరీతంగా పెరిగిపోవడమే పెను సమస్యగా పరిణమించింది. దాంతో ఒకప్పుడు చల్లగా ఉండే వయనాడ్ ప్రాంతం ఇప్పుడు వేడిగా, పొడిగా మారిపోయింది. వేసవిలో తీవ్రమైన ఎండలు, వర్షాకాలంలో మితిమీరిన వానలు పరిపాటిగా మారాయి. దాంతో కొండచరియలు విరిగిపడే ముప్పు నానాటికీ పెరుగుతోంది. బాగా ఎండిన నేలల్లో వాననీరు తక్కువగా ఇంకుతుంది. కొండల పైభాగంలో రాతి శిఖరాలను ఆవరించి ఉండే మట్టి పొరలు వదులుగా ఉంటాయి. భారీ వర్షాలకు తడిసి, వరద ఉధృతికి కొట్టుకుపోతాయి. తాజా విలయమే ఇందుకు ఉదాహరణ’’ అని వివరించారు. ‘‘వాయు, సముద్ర ఉష్ణోగ్రతల్లో పెరుగుదల ఈ విపరీత వాతావరణ పరిస్థితులకు దోహదపడుతోంది. గ్లోబల్ వారి్మంగ్, వాతావరణ మార్పుల వంటివి తీవ్రతను మరింతగా పెంచుతున్నాయి. ఫలితంగా ఉన్నట్టుండి కుంభవృష్టి కురిసి భారీ ఆస్తి, ప్రాణ నష్టానికి దారితీస్తుంది’’ అని జకారియా వివరించారు.అటకెక్కిన కమిటీ సిఫార్సులు... అత్యంత సున్నితమైన భౌగోళిక పరిస్థితులు కేరళ ప్రత్యేకత. కొంత ప్రాంతాలు ఎక్కువ కావడంతో దాదాపుగా సగం రాష్ట్రం 20 డిగ్రీల ఏటవాలు కోణంలో ఉంటుంది. పెలుసుబారిన మట్టితో కూడిన కొండల పై ప్రాంతాలు భారీ వర్షాలకు విరిగిపడటం పరిపాటి...→ గత ఏడేళ్లలో దేశవ్యాప్తంగా అత్యంత ఎక్కువ సంఖ్యలో కొండచరియలు విరిగిపడ్డ ఘటనలు నమోదైంది కేరళలోనే! దేశమంతటా 3,782 ఘటనలు జరిగితే వీటిలో కేరళ వాటాయే 2,239!→ 2021లో కొట్టాయం, ఇడుక్కి జిల్లాల్లో భారీ వరదలు, కొండచరియలు విరిగిపడ్డ ఘటనల్లో భారీగా ప్రాణనష్టం జరిగింది. → పశ్చిమ కనుమల్లో 61 శాతాన్ని పర్యావరణపరంగా అతి సున్నిత ప్రాంతంగా ప్రకటించి పరిరక్షించాలని మాధవ్ గాడ్గిల్ కమిటీ 13 ఏళ్ల క్రితమే కేంద్రానికి సిఫార్సు చేసింది. → కేరళలో కొంత ప్రాంతాలన్నింటినీ ఈ జాబితాలో చేర్చి ఎలాంటి అభివృద్ధి, నిర్మాణ పనులూ జరగకుండా చూడాలని పేర్కొంది. → గనుల తవ్వకాలు, ఇసుక తవ్వకాలు, జల–పవన విద్యుత్కేంద్రాలు, కాలుష్యకారక పరిశ్రమల నిర్మాణం తదితరాలను పూర్తిగా నిషేధించాలని సూచించింది. → కానీ ప్రజల జీవనోపాధికి, రాష్ట్రాభివృద్ధికి ఈ సిఫార్సులు గొడ్డలిపెట్టంటూ కమిటీ నివేదికను కేరళ ప్రభుత్వం పట్టించుకోలేదు. → వయనాడ్‌లో గత 50 ఏళ్లలోనే పచ్చదనం ఏకంగా 60 శాతానికి పైగా హరించుకుపోయిందని 2022లో జరిగిన అధ్యయనం తేల్చింది. → అదే సమయంలో జిల్లావ్యాప్తంగా తేయాకు తోటల సాగు ఏకంగా 1,800 శాతం పెరిగిపోయిందని వివరించింది. → కొండ ప్రాంతాల్లో నేల పై పొరల్ని గట్టిగా పట్టి ఉంచే చెట్లు తదితరాలు లేకపోవడం కొద్దిపాటి వర్షాలకే మట్టిపెళ్లలు విరిగిపడటం పరిపాటిగా మారింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
క్రేజీ.. థీమ్స్.. వంట నుంచి వడ్డన దాకా..
ఆహారం వడ్డించడానికి ఇత్తడి పళ్లెం, నీళ్లు తాగడానికి రాగి, గాజు గ్లాసు, బిర్యానీ వండేందుకు మట్టి కుండలు, ఆహారం వడ్డించేందుకు ఇత్తడి గరిటెలు, స్పూన్లు.. ఇదంతా ఎప్పుడో పూర్వకాలం రోజులు అనుకుంటే పొరపాటు పడినట్లే.. హైదరాబాద్ నగరంలో తాజాగా హోటల్ యాజమాన్యాలు అవలంబిస్తున్న ట్రెండ్ ఇది. వివిధ రకాల థీమ్‌లతో ఏర్పాటు చేస్తున్న హోటల్స్‌లో రుచికరమైన ఆహారంతో పాటు, ఆహ్లాదకరమైన వాతావరణంలో యువతను ఆకట్టుకునేందుకు సెల్ఫీ పాయింట్లు, స్టార్ హీరోల ఫొటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ఫ్యాన్స్ సైతం ఖుషీ అవుతున్నారు. అదే సమయంలో కొత్తకొత్త పేర్లతో రెసిపీలను సిద్ధం చేస్తున్నారు. దీంతో ఆహార ప్రియులు లొట్టలేసుకుని తింటున్నారు. టీవల కాలంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు పలు హోటళ్లపై దాడులు చేపట్టి, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. దీంతో కొందరు చేసిన చిన్న పొరపాట్లకు మొత్తం హోటల్ వ్యాపార రంగంపై ప్రభావం కనిపిస్తోంది. ఫలితంగా రొటీన్‌గా నడిచే హోటళ్లు ఆదరణ కోల్పోతున్నాయి. దీంతో ఈ ప్రభావం నుంచి బయటపడేందుకు ఎవరికి వారు ప్రత్యేకంగా బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవడం, దాన్ని ప్రమోట్ చేసుకోవడానికి కొత్తకొత్త ప్రయోగాలు చేస్తున్నారు. రొటీన్‌కు భిన్నంగా, కాస్త ధర ఎక్కువైనా మనకంటూ ఒక ల్యాండ్ మార్క్ ఏర్పాటు చేసుకోవాలని హోటల్ నిర్వాహకులు, యాజమాన్యాలు భావిస్తున్నాయి. ఆర్థికంగా వీటి నిర్వహణ భారమైనప్పటికీ పోటీ మార్కెట్లో తప్పదంటున్నారు. అదే సమయంలో ఆహారప్రియుల నుంచి ఊహించిన దానికంటే మంచి స్పందన వస్తుందని సంతోషపడుతున్నారు. పార్టీలకు ప్రత్యేకంగా ఏర్పాట్లువివాహాది శుభకార్యాలకు ఫంక్షన్ హాళ్లు ఉన్నాయి. చిన్న కుటుంబం పుట్టినరోజు పార్టీ చేసుకుందామంటే ఫంక్షన్ హాల్‌కు వెళ్లే పరిస్థితి ఉండదు. ఇటువంటి వారి కోసం హోటళ్లలో 20 నుంచి 30 సీటింగ్‌తో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. కాంప్లిమెంటరీగా కేకులు సైతం ఉచితంగా అందిస్తామంటున్నారు.బిర్యానీలకు స్థానిక పేర్లు..హైదరాబాద్ అంటేనే దమ్ బిర్యానీకి ఫేమస్. అయితే ఇటీవల కొత్తగా ఏర్పాటు చేసిన ఓ హోటల్లో వంటకాలకు స్థానిక పేర్లను పెడుతూ ఆకట్టుకుంటున్నారు. పాలకొల్లు ఫ్రై పీస్ బిర్యానీ, మొగల్తూరు మటన్ బిర్యానీ, రాజమండ్రి రొయ్యల బిర్యానీ, గుంటూరు మిర్చి కోడి బిర్యానీ, ఓజీ బిర్యానీ, నెల్లూరు చేపల పులుసు అంటూ కొత్తకొత్త పేర్లు మెనూలో కనిపిస్తున్నా యి. దీంతో పాటే దక్షిణ భారత దేశం రెసిపీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆహారం తయారీ విధానాన్ని యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్‌స్టా, రీల్స్‌లో పోస్ట్ చేస్తున్నారు.మట్టి పాత్రలో..ప్రస్తుత రోజుల్లో మట్టి పాత్రల్లో వంట చేయడం గ్రామీణ ప్రాంతాల్లో సైతం కనుమరుగైందనే చెప్పాలి. స్టీల్, అల్యూమినియం పాత్రలు మన్నిక ఎక్కువగా వస్తాయని, అంతా అటువైపు మొగ్గుచూపుతున్నారు. అయితే నగరంలోని హోటల్స్‌లో మాత్రం ప్రధానంగా కుండ బిర్యానీకి మంచి ఆదరణ లభిస్తోంది. అందుకే కొన్ని హోటళ్లలో నేరుగా కుండలోనే బిర్యానీ వండి, వడ్డిస్తున్నారు. పార్సిల్ తీసుకునే వారికి నేరుగా కుండతోనే డెలివరీ ఇస్తున్నారు. దీన్ని ఆహార ప్రియులు ఆస్వాదిస్తున్నారు. ఆదరణ బాగుంది...ఒక థీమ్ ఎంపిక చేసుకున్నాం. మార్కెట్లో ప్రత్యేకంగా ఉండాలనుకున్నాం. ఖర్చుకు ఎక్కడా వెనుకాడలేదు. సాధారణంగా భోజనం తినే ప్లేట్లు రూ.200నుంచి 500లో లభిస్తాయి. అయినా ఇత్తడి ప్లేట్లు పెడుతున్నాం. ఒక్కో ప్లేటు ధర రూ.3500 వరకూ ఉంది. అలాగే యూత్ ఎక్కడికి వెళ్లినా సెల్ఫీ మస్ట్ అన్నట్లు ఉన్నారు. దీనికోసం కొంత ప్లేస్ కేటాయించాం. వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా అప్డేట్ అవుతున్నాం. ఫుడ్ క్వాలిటీలో ఎక్కడా రాజీపడటంలేదు. అందుకే అందరి ఆదరణ పొందగలుగుతున్నాం. – ప్రసాద్, అశోక్, అద్భుతాహారం నిర్వాహకులు, రాయదుర్గం -
సందీప్ కిషన్ మంచి మనసు.. వారి కోసం నెలకు రూ. 4 లక్షలు
టాలీవుడ్ యంగ్ హీరోలలో సందీప్ కిషన్ చాలా ప్రత్యేకమనే చెప్పవచ్చు.. సినిమాలతో పాటు హోటల్ రంగంలోనూ రాణిస్తున్నాడు. ప్రతిరోజూ పేదలకు ఆహారం అందిస్తూ తన మంచి మనసు చాటుకుంటున్నాడు. సినిమా రంగంలో అపజయాలు ఎదురైనా తన పంతాను మార్చుకుంటూ మళ్లీ విజయం సాధిస్తాడు. తమిళ్లో కూడా ఆయనకు అభిమానులు ఉన్నారు. అక్కడ ఆయనకంటూ ప్రత్యేకమైన మమార్కెట్ను క్రియేట్ చేసుకున్నాడు. ఈ క్రమంలో కోలీవుడ్ హీరో ధనుష్‌తో కెప్టెన్ మిల్లర్, రాయన్ సినిమాల్లో లీడ్ రోల్స్ చేశాడు.చాలా మంది సినీ సెలబ్రిటీలు తమకు తోచిన విధంగా సాయం చేస్తూనే ఉంటారు. ఈ క్రమంలో కొన్ని వారు చెప్పే వరకు అభిమానులకు కూడా తెలియదు. వారు చేస్తున్న మంచి పనిని గోప్యంగానే ఉంచుతారు. తాజాగా హీరో సందీప్ కిషన్ రాయన్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మీడియా ముందుకు వచ్చారు. ఆ సమయంలో తను నిర్వహిస్తున్న రెస్టారెంట్ల నుంచి ప్రతిరోజు 350 మందికి ఉచితంగా ఆహారం అందిస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ఆశ్రమాలతో పాటు రోడ్ సైడ్ ఉండే పేదలకు రెస్టారెంట్ ద్వారా ఆహారం పంచుతున్నట్లు తెలిపారు. దీంతో నెలకు రూ. 4 లక్షలకు పైగా ఖర్చు అవుతుందని సందీప్ తెలిపారు.భవిష్యత్‌లో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో తక్కువ ధరకే క్యాంటీన్స్ పెట్టాలనే ఆలోచన ఉన్నట్లు సందీప్ కిషన్ తెలిపాడు. ప్రస్తుతం ఈ అంశం గురించి తన టీమ్ పరిశీలిస్తుందని చెప్పారు. దీంతో ఆయన అభిమానులు సంతోషిస్తున్నారు. నెటిజన్లు కూడా సందీప్‌ను ప్రశంసిస్తున్నారు. -
ఆహార కల్తీపై తెలంగాణ సర్కార్ కన్నెర్ర
-
ఒక రాత్రికి రూ.1 లక్ష.. పెరిగిన హోటల్స్ ధరలు - కారణం ఇదే!
అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ల పెళ్లి ఈ నెల 12న (జులై) ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో జరగనుంది. వీరి వివాహానికి ముందే ముంబైలోని హోటల్స్ గదుల రేట్లు భారీగా పెరిగాయి. ఇప్పటికే మొత్తం రూమ్స్ బుక్ అయిపోయినట్లు కూడా కొన్ని ప్రముఖ ఫైవ్ స్టార్ హోటల్స్ పేర్కొన్నారు.సాధారణ రోజులలో ముంబైలోని కొన్ని ఫైవ్ స్టార్ హోటల్స్‌లోని గదుల ఛార్జ్ ఒక రాత్రికి రూ.13000 ఉంటుంది. అంబానీ ఇంట పెళ్లి వేడుకల సందర్భంగా ఈ ధరలను సుమారు రూ.1 లక్షకు పెంచారు. దీన్ని బట్టి చూస్తే అంబానీ పెళ్లి వేడుకలను హోటల్స్ ఎలా క్యాష్ చేసుకుంటున్నాయో అర్థం చేసుకోవచ్చు.హోటల్స్ ధరలు పెంచడం ఇదే మొదటిసారి కాదుసీజన్ను దృష్టిలో పెట్టుకుని ప్రముఖ హోటల్స్.. గదుల చార్జెస్ భారీగా పెంచడం ఇదే మొదటిసారి కాదు. గతంలో బెంగళూరులో ఏరో షో జరిగినప్పుడు కూడా అక్కడున్న హోటల్స్ గదుల రేట్లకు భారీగా పెంచాయి. ఇది మాత్రమే కాకుండా ఆటో ఎక్స్పో సమయంలో ఢిల్లీ, గురుగ్రావ్ ప్రాంతాల్లోని హోటల్స్ కూడా భారీ చార్జీలను వసూల్ చేశాయి.పెళ్ళికి హాజరుకానున్న ప్రముఖులుఇప్పటికే అనంత్, రాధికల వివాహ వేడుకలు ప్రారంభమైపోయాయి. ఇటీవలే సంగీత్ ఫంక్షన్ కూడా జరిగింది. ఈ వేడుకలకు సెలబ్రిటీలు, క్రికెటర్లు, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. కాగా వీరి వివాహం త్వరలోనే జరుగుతుంది. ఈ వేడుకలకు కూడా దిగ్గజ పారిశ్రామికవేత్తలు, సినీ తారలు మొదలైనవారు పాల్గొనే అవకాశం ఉందని సమాచారం. -
ఇక రంగు పడకుండా చికెన్ పకోడా
బనశంకరి: హోటళ్లు, వీధుల్లో విక్రయించే శాకాహార, మాంసాహార వంటకాలు బాగా కనిపించాలని వ్యాపారులు ఎరుపు, ఊదా వంటి కృత్రిమ రంగులను ఉపయోగిస్తుంటారు. ఆ రంగుల వల్ల ప్రజలకు అనారోగ్యం కలుగుతోందని ఆరోపణలు రావడంతో కృత్రిమ రంగుల వాడకాన్ని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నుంచి నిషేధించింది. ఆహార తనిఖీ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా 39 చికెన్ పకోడా, కబాబ్ శాంపిల్స్‌ను సేకరించి ల్యాబోరేటరీలో పరీక్షలు నిర్వహించారు. ఇందులో 8 కబాబ్ల్లో హానికారకమైన కృత్రిమ రంగులను వాడినట్లు తేలింది. దీంతో కృత్రిమ రంగుల వాడకాన్ని సర్కారు నిషేధించింది. ఉల్లంఘనకు పాల్పడితే 7 ఏళ్ల జైలుశిక్ష , రూ.10 లక్షల జరిమానా విధించే అవకాశముందని ఆహార సురక్షత నాణ్యత ప్రమాణాల శాఖ కమిషనర్ తెలిపారు. -
ఆహారాన్ని కల్తీ చేస్తే కఠినచర్యలు
సాక్షి, హైదరాబాద్: ఆహారాన్ని కల్తీ చేస్తే కఠినంగా వ్యవ హరిస్తామని మంత్రి దామోదర రాజనర్సింహ హెచ్చరించారు. ఇటీవల ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడుల్లో అనేక హోటళ్లలో నాసిరకం, కల్తీ, చెడిపోయిన ఆహారం బయటపడటంతో దానిపై మంత్రి ఆరా తీశారు. మంగళవారం సచివాలయంలో అధి కారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ, హైదరాబాద్ బిర్యానీకి అంతర్జాతీయ గుర్తింపు ఉందని, దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి వ్యాపారవేత్త ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఫుడ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచుతున్నామని, హోటల్ యాజమానులు సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు.ప్రతి 6 నెలలకు వర్క్‌షాపు నిర్వహణ, అవగాహన సద స్సు నిర్వహిస్తామని, ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. హోటల్స్ యజమానులు చేసిన పలు విజ్ఞప్తులపై సానుకూలంగా స్పందించారు. సమావేశంలో రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆర్ వీ కర్ణన్, డైరెక్టర్ ఫుడ్ సేఫ్టీ డాక్టర్ శివలీల, తెలంగాణ స్టేట్ హోటల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వెంకట్‌రెడ్డి, ఇండియన్ రెస్టారెంట్స్ అసోసియేష న్ ప్రెసిడెంట్ సందీప్ తదితరులు పాల్గొన్నారు. -
సౌదీ అతిధి గృహాల అందాలకు...పర్యాటకుల ఫిదా
పర్యాటకుల స్వర్గధామంగా వర్ధిల్లుతున్న సౌదీలో పర్యాటకుల అభిరుచికి తగ్గట్టుగా అద్భుతమైన హోటల్స్ అందుబాటులోకి వచ్చాయి. ఒక ప్రైవేట్ ద్వీపంలో ప్రశాంతంగా నివసించాలనుకున్నా, మారుమూల ఎడారిలో విడిది కోరుకున్నా, సందడికి కేంద్రమైన చోట విలాసవంతమైన బస కోరుకున్నా...పర్యాటకుల కోసం వైవిధ్యభరిత నివాస సౌకర్యాలను అందిస్తోంది. సౌదీపై పర్యాటకుల ఆసక్తిని రెట్టింపు చేసే వాటిలో అతిధి గృహాలు కూడా ఉన్నాయి. కొన్ని అనూహ్యమైన అద్భుతమైన నేపథ్యాలతో సెట్ చేయబడిన అతిధి గృహాలు.. అటు ప్రకృతి సౌందర్యాన్ని ఇటు సంప్రదాయం ఆధునికతను మిళితం చేస్తూ హోటల్ అనే పదానికి కొత్త నిర్వచనాలను అందిస్తున్నాయి. అలాంటి వాటిలో కొన్నింటి విశేషాలు...సిక్స్ సెన్సెస్ సదరన్ డ్యూన్స్ఎడారి మైదానాలు హిజాజ్ పర్వతాలు వంటి మంత్రముగ్దులను చేసే నేపధ్యంతో ఉంటుంది సిక్స్ సెన్సెస్ సదరన్ డ్యూన్స్ ఇది ఒక ది రెడ్ సీ రిసార్ట్, ఇది నబాటేయన్ నిర్మాణ వారసత్వం తో ఎడారి పరిసరాలకు వన్నె తెస్తుంది. ఎడారి పువ్వుతో ప్రేరణ పొందిన ఈ హోటల్ బసను, ఫంక్షన్లను ఒకే కప్పు క్రింద నిర్వహిస్తుంది. అతిథులు చుట్టుపక్కల ఉన్న కొండ దిబ్బల వీక్షణలను ఆస్వాదించడానికి అనుకూలంగా విల్లాలు నిర్మించారు. ఈ ప్రదేశంలో అతిథులు ఆనందించడానికి రెండు సిగ్నేచర్ రెస్టారెంట్లు, అవుట్డోర్ పూల్, ఫిట్నెస్ సెంటర్, ప్రపంచ స్థాయి సిక్స్ సెన్సెస్ స్పా ఉన్నాయి. కాండే నాస్ట్ ట్రావెలర్ ప్రచురించిన ప్రపంచంలోని ఉత్తమ హోటల్ల జాబితాలో ’2024 హాట్ లిస్ట్’లో ఇదీ ఒకటి.డెసర్ట్ రాక్ రిసార్ట్అచ్చంగా లోయలూ పర్వతాల మధ్య ఉన్న డెసర్ట్ రాక్ రిసార్ట్ హోటల్ ఒక నిర్మాణ కళాఖండం దాని అద్భుతమైన సహజ ప్రకృతిని సంరక్షిస్తూ పర్వతప్రాంతంలో పూర్తిగా కలగలిసి సిపోయింది. అతిథులు రాతితో చెక్కిన గదులలో సరికొత్త అనుభూతిని ఆస్వాదిస్తారు. నుజుమా, ఎ రిట్జ్ కార్ల్టన్ రిజర్వ్ ది రెడ్ సీఅద్భుతమైన సహజ సౌందర్యం స్వదేశీ డిజైన్‌తో సహజమైన హోటల్ ఇది. ప్రపంచవ్యాప్తంగా కేవలం ఐదు రిట్జ్–కార్ల్టన్ రిజర్వ్‌ల ప్రత్యేక శ్రేణిలో ఇది కూడా ఒకటి. చేరింది. ఈ హోటల్ రెడ్ సీ బ్లూ హోల్ ద్వీపాల సమూహంలో భాగమైన ప్రైవేట్ ద్వీపాల సహజమైన సెట్లో నెలకొల్పారు. పూర్తిగా ప్రకృతి సౌందర్యంతో మమేకమై పర్యావరణ హితంగా రూపొందించిన ఈ రిసార్ట్‌లో వన్ టూ ఫోర్ బెడ్ రూమ్ పడక గదులు 63 తో పాటు బీచ్ విల్లాలు ఉంటాయి. విలాసవంతమైన స్పా, స్విమ్మింగ్ పూల్స్, రెస్టారెంట్ల శ్రేణి...మరెన్నో ఉంటాయి.బాబ్ సంహాన్, దిరియాఈ ఏడాదే ప్రారంభమైన బాబ్ సంహాన్...యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా నిలిచిన దిరియాలో ప్రారంభించిన మొట్టమొదటి హోటల్‌గా ఘనత దక్కించుకుంది. సిగ్నేచర్ నజ్దీ నిర్మాణ శైలితో సమకాలీన లగ్జరీని మిళితం చేసిన ఈ హోటల్ 106 గదుల్లో ప్రతి ఒక్కటి ప్రత్యేక వాతావరణాన్ని అందిస్తుంది, అతిథులను ప్రాంతపు సంస్కృతి చరిత్రలో మమేకం చేస్తుంది. నార్త్ దిరియాలోని సుందరమైన వాడి హనీఫా,అట్–తురైఫ్ రెండింటికి దగ్గరగా ఉన్నందున, అతిథులు హోటల్ సౌకర్యాలతో పాటు సమీపంలోని ఆకర్షణలను ఆస్వాదించే అవకాశాన్ని పొందుతారు.దార్ తంతోరా, అల్ ఉలాదార్ తంతోరా అనేది ది హౌస్ హోటల్ నుంచి ఒక ఉన్నత స్థాయి పర్యావరణ వసతి గృహం, ఇది కూడా ఇటీవలే ప్రారంభించారు. చారిత్రాత్మక అల్ ఉలా ఓల్డ్ టౌన్లో ఉన్న ఈ హోటల్... వారసత్వపు వైభవం, సమకాలీన డిజైన్స్ ల మేలు కలయిక, ఇది అతిథులను 12వ శతాబ్దానికి తిరిగి తీసుకువెళ్లడానికి వినూత్నంగా రూపుదిద్దారు, అదే సమయంలో వారికి ఆధునిక ఆతిథ్యం కూడా అందిస్తుంది. హోటల్లో 30 అతిథి గదులు చారిత్రాత్మక మట్టి–ఇటుక భవనాల తరహాలో ఆధునిక ఇంజనీరింగ్ సాంకేతికతలతో కొలువుదీరాయి. -
ఆహార ప్రియులకు అలర్ట్.. హోటళ్లు, రెస్టారెంట్లలో బయటపడ్డ లోపాలు
సాక్షి, ఖమ్మం: ఆహార ప్రియులకు, బిర్యానీ లవర్స్‌కు అలెర్ట్. వారం మొత్తం కష్టపడి వీకెండ్లో ఫ్యామిలితో రెస్టారెంట్లకు,హోటళ్ళకు వెళ్ళి తింటున్నారా.. ఐతే కొంచెం జాగర్తండోయ్.. కొందరికి చికెన్ బిర్యానీ అంటే ఇష్టం. మరికొందరికి చికెన్ కబాబ్స్ అంటే మరీ లొట్టలేసుకుంటూ లాగించేస్తుంటారు. కానీ అవే ఆహార పదార్ధాలు వారాల కొద్దీ నిల్వ ఉంచి మీకు పెడుతున్నారంటే నమ్ముతారా.. ఇది ముమ్మాటికీ నమ్మలేని నిజమే అని చెప్పాలి. కావాలంటే ఒక్కసారి ఖమ్మం జిల్లాకు వెళ్ళి చూసొద్దాం రండి. రెస్టారెంటుకు వెళ్ళి డిమ్ లైటింగ్‌లో కూర్చుని వేడి వేడి బిర్యాని, దానికి తగ్గట్టుగా చికెన్ లాలిపప్స్.. చికెన్ 65, చికెన్ కబాబ్స్ తింటుంటే ఉంటుంది. చెబుతుంటేనే నోరూరిపోతుంది కదా. చికెన్, మటన్, ప్రాన్స్, ఇలా ఎన్నోరకాల వంటలు రెస్టారెంట్లలో,హోటళ్ళలో దొరుకుతాయి. కానీ తస్మాత్ జాగ్రత్త.. అదే ఆహారం విషంగా మారితే మీ పరిస్థితి ఏంటి?. ఇంటికి ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ వచ్చినా మనం ఏం చేస్తుంటా అలా రెస్టారెంటుకు వెళ్ళి బిర్యానీ తినాలి అనుకుంటాం అలాంటప్పుడు ఎక్కువగా ఫేమస్ రెస్టారెంట్లవైపే మొగ్గు చూపుతుంటాం. ఎందుకంటే పది రూపాయలు ఎక్కువైన సరే ఫుడ్ రుచితో పాటు శుభ్రత, నాణ్యతా ప్రమాణాలు కూడా పాటిస్తారని.. అందులో తింటే ఆరోగ్యానికి పెద్దగా ప్రమాదం ఉండదన్న గట్టి నమ్మకంఅయితే ఆ గట్టి నమ్మకం కాస్త ఇప్పుడు గుడ్డి నమ్మకమని ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడుల్లో తేలిపోయింది. రుచికి, శుభ్రతకు పెట్టింది పేరు అంటూ ఊదరగొట్టే పెద్ద పెద్ద పేరు మోసిన హోటళ్లు, రెస్టారెంట్ల బండారాలు బయటపడుతున్నాయి. కుళ్లిపోయిన మాంసం, ఎక్స్పైరీ డేట్ దాటిన ప్రొడక్ట్స్, కల్తీ మసాలాలు, ఏమాత్రం నాణ్యత లేని పదార్థాలను వాడటమే కాక.. అపరిశుభ్ర వాతావరణంలో ఆహారాన్ని సిద్ధం చేస్తున్నట్టు సోదాల్లో అధికారులు గుర్తించారు. ఫుడ్ సేఫ్టీ రూల్స్ కూడా సరిగా పాటించడం లేదని అధికారులు వెల్లడించారు. అయితే ఇలాంటి పరిస్థితులు ఒకటో రెండో రెస్టారెంట్లలో కాదండోయ్. నగరంలో ఫేమస్ అయిన చాలా రెస్టారెంట్లలో ఇదే సీన్ కనిపించటం ఆందోళనకరం.ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని రెస్టారెంట్లు, హోటళ్లలో ఫుడ్‌సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పేరున్న రెస్టారెంట్లు, హోటళ్లలో ఫ్రీజర్‌లో దాచిన చికెన్ కబాబ్స్, ప్లాస్టిక్ బకెట్లలో మ్యారినేట్ చేసిన చికెన్, బ్యాచ్ నంబర్ లేని మసాలా ప్యాకెట్లు, మ్యానిఫ్యాక్చరింగ్ గడువు లేని పసుపు, ఎక్స్పైరీ డేట్ దాటిన సరుకులు, రూల్స్ అతిక్రమించి పామాయిల్ వినియోగం...ఇలా పలు లోపాలను, మోసాలను గుర్తించారు. ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల ఫుడ్‌సేఫ్టీ కంట్రోల్ ఆఫీసర్ జ్యోతిర్మయి టాస్క్‌ఫోర్స్ టీమ్‌తో కలిసి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లలో తనిఖీలు నిర్వహించారు.హోటల్లో తనిఖీల సందర్భంగా సిబ్బంది ఎవరికీ హెల్త్ ఫిట్నెస్ సర్టిఫికెట్లు లేవని తెలుసుకున్నారు .నాణ్యత లేని ఆహార పదార్థాలు సీజ్ చేశారు. శాంపిల్స్‌ను పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపించారు. ఓ హోటల్లో ఫ్రీజర్‌లో నిల్వ చేసిన 12 కిలోల చికెన్ కబాబ్స్‌ను గుర్తించిన అధికారులు, వాటిని రూల్స్ ప్రకారం మున్సిపల్ సిబ్బందికి అప్పగించాల్సి ఉండగా.. అక్కడే డ్రైనేజీలో పారబోయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.నిర్వాహకులు చపాతి, పరోటా పిండిని కలిపి ప్లాస్టిక్ కవర్లలో పెట్టి ఫ్రిజ్‌లో నిల్వ ఉంచారు. చికెన్ ధమ్ బిర్యానీ కోసం మ్యారినేట్ చేసిన చికెన్‌ను ప్లాస్టిక్ బకెట్లో నిల్వ చేశారు. దీంతో మ్యారినేట్ చేసిన చికెన్‌ను కూడా బయటపడేయించారు. కిచెన్ అపరిశుభ్రంగా ఉంచడంపై అధికారులు ఫైర్ అయ్యారు. స్టోరూమ్స్ ఎక్స్పైరీ అయిన జీలకర్ర, బ్రాండెడ్ కాని జీడిపప్పు, గోధుమ పిండిని గుర్తించి సీజ్ చేశారు. ఫుడ్‌సేఫ్టీ నిబంధనలను పాటించకపోతే పర్మిషన్ రద్దు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఆహార వస్తువులపై లేబుల్స్, బ్యాచ్ నంబర్లోకపోతే ఫైన్‌తో పాటు, జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో 300 హోటళ్లు, 28 రెస్టారెంట్లు ఉండగా ఏడు నెలల్లో అధికారులు తనిఖీలు చేసి 14 కేసులు మాత్రమే నమోదు చేశారు. హైదరాబాద్ స్థాయిలో ఒత్తిళ్లు వస్తే తప్పా తనిఖీలు చేయరన్న విమర్శలున్నాయి. ఫిర్యాదులు వచ్చినప్పుడు తప్పించి రెగ్యులర్‌గా సోదాలు చేయరనే ఆరోపణలున్నాయి. మామూళ్ల వ్యవహారం కారణంగా చూసి చూడనట్టు వదిలేస్తారనే విమర్శలున్నాయి.ఇప్పటికైనా ఆహార భధ్రత అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం నెలకో రెండు నెలలకో తనిఖీలు చేయడం కాకుండా నిత్యం రెస్టారెంట్లు హోటళ్ళపై నిఘా ఉంచాలని, ప్రజల ప్రాణాలకు హాని కలింగించే ఆహార పధార్దాలు ఇలాంటి రెస్టారెంట్లు,హోటళ్ళు వినియోగించకుండా తగు చర్యలు తీసుకోవాలని ఫుడ్ లవర్స్ కోరుతున్నారు. -
Magazine Story: తిన్నారో.. చచ్చారే! హైదరాబాద్ వాసులకు బంపర్ ఆఫర్
-
వామ్మో..హోటళ్లలో ఫుడ్డా!
బంజారాహిల్స్: ఆర్భాటంగా... తళుకు బెళుకుల ఇంటీరియర్‌తో ఆకట్టుకునే ఫర్నీచర్‌తో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో ఏర్పాటవుతున్న హోటళ్లు, రెస్టారెంట్లు, పబ్‌లలో నాణ్యతా లోపాలు, అపరిశుభ్రత, గడువుతీరిన ఆహార పదార్థాలు వెలుగు చూస్తుండటంతో ఆహార ప్రియులు షాక్ అవుతున్నారు. గడిచిన నాలుగు వారాల నుంచి ఫుడ్ సేప్టీ టాస్‌్కఫోర్స్ టీమ్ సభ్యులు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, అమీర్‌పేట, పంజగుట్ట, సోమాజిగూడ, లక్డీకాపూల్, ఖైరతాబాద్ ప్రాంతాల్లోని హోటళ్లు, రెస్టారెంట్లు, పబ్‌లలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఈ తనిఖీల్లో ముఖ్యంగా కిచెన్లలో పరిశుభ్రత పూర్తిగా లోపించడంతో అధికారులు పేర్కొంటున్నారు. 👉 జూబ్లీహిల్స్‌లోని 16 పబ్‌లలో అధికారులు తనిఖీలు చేయగా దాదాపు అన్నింట్లోనూ నిల్వ చేసిన ఆహార పదార్థాలు గడువుతీరిన తరువాత కూడా వంటల్లో వినియోగిస్తున్నట్లు నిర్థారించారు. 👉ఇక హోటళ్లలోని కిచెన్లలో అపరిశుభ్రత, దుర్గంధం, దుర్వాసనలు, ఈగలు, దోమలు, ఎలుకలు, పందికొక్కులు, బొద్దింకలు స్వైరవిహారం చేయడమే కాకుండా వంటలకు వినియోగిస్తున్న సామగ్రిపై వాలుతున్నట్లు కూడా గుర్తించారు. 👉 వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ పదార్థాలను ఒకే ఫ్రిడ్జ్‌లో ఒకే రాక్‌లో పెడుతుండడాన్ని కూడా అధికారులు గుర్తించారు. చాలా హోటళ్లలో కొన్ని ఆహార పదార్థాలు బూజు పట్టి కనిపించినట్లు అధికారులు తెలిపారు. దాదాపు హోటళ్లు, రెస్టారెంట్లలోని కిచెన్లన్నీ బూజు పట్టిన కూరగాయలతో కనిపించాయి. 👉 చాలా ఫిర్యాదుల అనంతరం ఇటీవల కాలంలో ఫుడ్‌సేప్టీ అధికారులు ఆయా హోటళ్లపై తనిఖీలు చేస్తూ నాణ్యతపై ఆరా తీస్తుండగా చాలా హోటళ్లలో ఆహార పదార్థాలపై క్రిమికీటకాలు వాలుతున్నట్లుగా నిర్థారణ అయ్యింది. చెత్తా చెదారం, వ్యర్థాలు వేసే డస్బిన్లపై మూతలు కూడా ఏర్పాటుచేయడం లేదని, దీంతో ఈగలు, దోమలు, బొద్దింకలు స్వైరవిహారం చేస్తున్నట్లుగా అధికారులు తెలిపారు. 👉 ఇందులో కొన్ని జాతీయ స్థాయిలో పేరెన్నికగన్న చైన్ హోటళ్లు ఉన్నాయని, అలాగే అంతర్జాతీయ స్థాయి చైన్ హోటళ్లు కూడా ఈ దుర్గంధం లోపించిన జాబితాలో ఉన్నట్లు తెలిపారు. 👉 జీహెచ్ఎంసీ గత పదేళ్లుగా హోటళ్లలో నాణ్యతా ప్రమాణాలపై ఎలాంటి తనిఖీలు చేయకపోగా హోటళ్ల యాజమాన్యాలు ఇచ్చింది పుచ్చుకుంటూ అందినకాడికి దండుకుని అటువైపు తొంగి చూడలేదు. 👉 జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ సర్కిల్–17, జూబ్లీహిల్స్ సర్కిల్–18 పరిధి కిందికి వచ్చే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, వెంకటేశ్వరకాలనీ, సోమాజిగూడ, ఖైరతాబాద్, అమీర్‌పేట, లక్డీకాపూల్ ప్రాంతాల్లో సుమారు 35కి పైగా పబ్‌లు, 98 రెస్టారెంట్లు, 179 హోటళ్లు ఉన్నాయి. ఈ సర్కిళ్ల పరిధిలోని ఫుడ్ సూపర్వైజర్లు ఏనాడూ తనిఖీలు చేయకపోగా పరిశుభ్రతను పట్టించుకోలేదు. దీంతో కొత్తగా ఫుడ్‌సేప్టీ కమిషనర్‌ను ఏర్పాటుచేసి టాస్‌్కఫోర్స్ బృందాన్ని నియమించడంతో ఈ హోటళ్లు, పబ్‌లలో అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. 👉 కేఎఫ్‌సీ లాంటి ఇంటర్నేషనల్ చైన్ హోటళ్లలో కూడా ఈ అధికారులు దాడులు చేసి ఆహార పదార్థాల నాణ్యతపై నోటీసులు జారీ చేశారు.ఉల్లంఘించిన హోటళ్ల జాబితా..క్రీమ్ స్టోన్, నేచురల్స్ ఐస్‌క్రీమ్, కరాచి బేకరీ, కేఎఫ్‌సీ, రోస్ట్రీ కాఫీ హౌస్, రాయలసీమ రుచులు, షాగౌస్, కామత్ హోటల్, 36 డౌన్ టౌన్ పబ్, మకావ్ కిచెన్ అండ్ బార్ పబ్, ఎయిర్ లైవ్, టాకో బెల్, ఆహా దక్షిణ్, కిజిలింగ్ జో, ఖాన్‌సాబ్, హోటల్ సుఖ్‌సాగర్, జంబో కింగ్ బర్గర్స్, రత్నదీప్ రిటైల్ స్టోర్, సోమాజిగూడ కృతుంగ రెస్టారెంట్, సోమాజిగూడ రెస్ట్ ఓ బార్. -
ఉడుపి హోటల్స్ ఎందుకంత ప్రసిద్ధి చెందాయో తెలుసా..!
నిజానికి ఉడిపి కాదు, ఉడుపి అని వ్రాయాలి. ఉడుపి అంటే అర్థం నక్షత్రాలకు అధిపతి అయిన చంద్రుని భూమి అని అర్థం. ఇక ఉడుపి వంట లేక భోజనం- దీని మూలం ఉడుపిలో ఉన్న కృష్ణ దేవాలయంలో, అష్ట మఠాలలో ఉంది. ఉడుపి శ్రీ మధ్వాచార్యులు జన్మించిన ఊరు. ఇది ద్వైత సాంప్రదాయ ముఖ్య కేంద్రం. అన్నదాన సేవలో భాగంగా ఉడిపిలోని శ్రీకృష్ణ దేవాలయంలో శిక్షణ పొందిన వంటవారు ఉడిపి హోటళ్లను తెరవడానికి దేశంలోని వివిధ ప్రాంతాలకు తరలివెళ్లారు. మరీ ఉడుపి భోజనానికే ఎందుకంటే పేరుగాంచిందంటే..కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొన్న సైన్యానికి..ఇంట్లో మనం నలుగురికి లేదా ఐదుగురికి వంట చేయగలం.అంతకంటే ఎక్కువ మందికి చేయటం కొంచెము కష్టమైన పని.మరి 50 లక్షల మందికి వంట చేయడం అంటే మామూలు విషయం కాదు. మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధ సమయంలో50 లక్షల మంది పాల్గొన్నారు. వారికి వంట వండినవారు ఎవరంటే..? మహాభారత యుద్ధంలో కౌరవుల పక్షాన కొందరు పాండవుల పక్షాన కొందరు ఇలా అందరూ కలిసి దాదాపు 50లక్షలకు పైగా కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొన్నారు. కానీ ఇంత జరుగుతున్నా ఇద్దరు రాజులు పాల్గొన లేదు.అందులో ఒకరు విదర్భ రాజైన రుక్మి. రెండవది బలరాముడు. ఆ ఇద్దరు తప్ప అన్ని రాజ్యాలు పాల్గొన్నాయి. దక్షిణ భారతంలోని ఉడిపి రాజ్యం కురుక్షేత్ర యుద్ధానికి వచ్చింది. ఉడిపిరాజైన నరేషుడు సైన్యాన్ని తీసుకొని యుద్ధ ప్రాంతానికి వెళ్లినప్పుడు కౌరవులు తమ వైపు నిలబడాలని మరో వైపు పాండవులు తమవైపు నిలబడాలని కోరుతారు. అప్పుడు ఉడిపి రాజు తన తెలివితో ఎటూ వెళ్ళకుండా సలహా కోసం శ్రీకృష్ణ దగ్గరికి వెళ్తాడు. అందరూ యుద్ధం గురించే ఆలోచిస్తున్నారు మరి ఇన్ని లక్షల మందికి భోజనాలు గురించి ఏమైనా ఆలోచించారా?ఎవరు వండి పెడతారు? అని శ్రీకృష్ణుడిని అడుగుతాడు. మీరన్నది నిజమే మరి మీ దగ్గర ఏదైనా ఆలోచన ఉందా అని నరేషుడుని శ్రీకృష్ణుడు అడుగుతాడు. అప్పుడు నరేషుడు ఇప్పుడు జరుగుతున్న ఈ మహాయుద్ధం అన్నదమ్ముల మధ్య నడుస్తున్నది, నాకు ఈ యుద్ధంలో పాల్గొనడం ఇష్టం లేదు. అందువల్ల నేను,నా సైన్యం ఇరువర్గాల యుద్ధంలో పాల్గొనము. వారందరికి భోజనం చేసి పెడతాము అని ఉడిపిరాజు చెపుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు రాజా మీ ఆలోచన చాలా అద్భుతమైనది. 50 లక్షల మందికి భోజనం వండటం అంటే మామూలు మాటలు కాదు. ఇది మీ వల్లే సాధ్యమవుతుందంటూ..అందరికీ భోజనాలు తయారుచేయమని చెబుతాడు శ్రీకృష్ణుడు.నిజానికి 50 లక్షల మందికి భోజనాలు వండాలంటే భీముడు, అతని సైన్యానికి మాత్రమే వీలవుతుంది కానీ ఈ సమయంలో పోరాడటం భీముడికి ముఖ్యం. అందువల్ల భీముని యుద్ధక్షేత్రం వదిలి రాలేడు. అందువల్ల నువ్వొక్కడివే ఇంతమంది సైన్యానికి వంట చేయగల సమర్ధుడు అని వంట వండమని కోరతాడు శ్రీ కృష్ణుడు. నరేషుడు తన సైన్యంతో కలిసి అక్కడ ఉన్న సైన్యాలకు భోజనం తయారు చేస్తాడు నరేషుడు.ఎలా వండేవాడంటే.. సాయంత్రం వరకు తాను వండిన భోజనం ఒక్క మెతుకు కూడా మిగలకుండా, వృధాకాకుండా వండేవాడు. రోజులు గడుస్తున్న కొద్దీ సైన్యం కూడా తగ్గిపోయ్యేది. అయినా సరే వంట మాత్రం అందరికీ సరిపోయేలా వండేవాడు నరేశుడు. ఇది చూసి అందరూ ఆశ్చర్యపోయోవారు. ఇది ఎలా సాధ్యం?అంత మంది చనిపోతున్నా చివరికి మిగిలిన వారికి మాత్రమే సరిపోయేలా ఎలా వంట చేస్తున్నారు?..అది కూడా ఒక్క మెతుకు కూడా మిగలకుండా ఎలా వండుతున్నారు? అని అందరూ ఆశ్చర్యానికి గురయ్యేవారు. అసలు నరేషునికి ఎలా తెలుస్తుంది? ఈ రోజు ఇంతమంది మాత్రమే చనిపోతారని, మిగిలిన వారికి మాత్రమే భోజనం వండాలి అని?..ఇలా18 రోజులు గడిచిపోయాయి. పాండవులు గెలిచారు. పట్టాభిషేకం జరుగుతుంది. అప్పుడు ధర్మరాజు ఉడిపి నరేషుడుని అడుగుతాడు.. మమ్మల్ని అందరూ తక్కువ సైన్యం ఉన్నా గెలిచామని పొగుడుతున్నారు. కానీ నేను మాత్రం నిన్ను మెచ్చుకోకుండా ఉండలేక పోతున్నాను అని అంటాడు. ఎందుకంటే 50 లక్షల మందికి సైన్యమునకు వంట చేయడం అంటే మాటలు కాదు అది కూడా ఒక్క మెతుకు కూడా మిగలకుండా వృధాకాకుండా వండడం అంటే మాటలు కాదు. ఇది మహా అద్భుతం ఇలా ఎలా చేశావు? అని అంటాడు.అప్పుడు నరేషుడు నవ్వుతూ మీరు గెలిచారు కదా దాని గొప్పతనం అంతా ఎవరికి ఇస్తారు అని అడిగాడు?. అప్పుడు యుధిష్టరుడు శ్రీకృష్ణుడే దీనికి మూలమని చెబుతాడు. అప్పుడు నరేషుడు మీరు గెలవడానికే కాదు, నేను ఇంతమందికి సరిపడా వంట వండడానికి కూడా శ్రీకృష్ణుడే కారణం. కాబట్టి ఈ గొప్పతనమంతా శ్రీకృష్ణునికే చెందుతుంది అని చెప్తాడు. ఇది విని సభలో ఉన్నవారంతా ఆశ్చర్యానికి గురి అవుతారు. ఇది ఎలా సాధ్యం? శ్రీకృష్ణుడు ఎలా కారణం అని నరేషుడుని అడుగుతాడు యుధిష్టరుడు. అప్పుడు నరేషుడు అసలు రహస్యాన్ని అందరి ముందు ఇలా చెప్తాడు... శ్రీకృష్ణుడు ప్రతి రోజు రాత్రి పెసరకాయలు తినేవాడు. నేను లెక్క పెట్టి పెట్టే వాడిని. శ్రీకృష్ణుడు తిన్న తర్వాత మళ్లీ పెసరకాయలను లెక్కపెట్టే వాడిని.. శ్రీ కృష్ణుడు ఎన్ని కాయలు అయితే తింటాడో దానికి వెయ్యిరెట్లు సైన్యం చనిపోయేవారు.. ఆంటే శ్రీకృష్ణుడు 50 పెసరకాయలు తింటే దానికి వెయ్యి రెట్లు అంటే 50 వేల మంది సైనికులు మరుసటి రోజు యుద్ధంలో చనిపోయేవారు. దీనిని బట్టి నేను మిగతా వారికి భోజనం వండే వాడిని అని చెప్పాడు. ఈ కారణం వల్ల ఏ రోజు కూడా భోజనం వృధా కాకుండా వండే వాడిని అని చెప్పాడు. ఇది విని ఆ సభలోని వారందరూ కృష్ణలీలకు ముగ్ధులు అవుతారు. ఈ కథ మహాభారత కథలలో ఒక అరుదైన కథ. కర్ణాటకలోని ఉడిపి జిల్లాలోని కృష్ణ మందిరంలో ఈ కథ ఇప్పటికీ వినిపిస్తూ ఉంటారు. ఇదంతా 13వ శతాబ్దంలో కర్ణాటకలోని చిన్న తీర పట్టణమైన ఉడుపిలో ప్రారంభమైంది. ఇక్కడ, ఒక ప్రసిద్ధ శ్రీ కృష్ణ దేవాలయంలో భక్తులకు ఉచిత భోజనం లేదా అన్నదానం చేసే పద్ధతిని ప్రారంభించింది. మెనూలో ఆహారం ఎప్పుడు వడ్డించాలనే సమయాలు రెండూ నిర్ణయించబడ్డాయి. ఈ దేవాలయాలలో శిక్షణ పొందిన వంటవారు చివరికి బెంగళూరు, చెన్నై, ముంబై వంటి దేశంలోని ఇతర ప్రాంతాలకు వెళ్లి ఈ ప్రాంతాల్లో ఉడుపి హోటళ్లను ఏర్పాటు చేసినట్లు చరిత్ర గ్రంథాలు చెబుతున్నాయి. ఇక్కడ భోజనానికి విశేష స్థానం ఉంది. సాత్విక పద్ధతిలో చెయ్యాలి. శాకాహారం భోజనం మాత్రమే చెయ్యాలి. ఉల్లిపాయలు, వెల్లుల్లి కూడా ఉపయోగం చేయకూడదు. కృష్ణ మఠంకు చాలా చాలా మంది భక్తులు వస్తారు. వాళ్ళు అందరికి ప్రసాదం రూపంలో భోజనం ప్రతి దినం ఇస్తారు. అంత మందికి భోజనం ఇవ్వాలి, అందుకే చాలా మంది వంటచేసే బ్రాహ్మణులు ఉండేవారు. ఉడుపిలో చాలమంది బ్రాహ్మణులకు వంట చేసే విషయంలో ప్రావీణ్యత దొరికింది. హోటల్ ఉద్యమం ప్రారంభించడానికి ఈ పాకశాస్త్ర జ్ఞానాన్ని ఉపయోగించారు. 1942లో ఉడిపి నుండి ముంబైకి వలస వచ్చిన ఒక యువకుడు మొదటి ఉడిపి శ్రీకృష్ణ హోటల్ని స్థాపించాడు. 1950వ దశకంలో, ఇద్దరు సోదరులు మావల్లి టిఫిన్ రూమ్ (ఎంటీఆర్), ఉడిపి తరహాలో మరొక హోటల్ని ఏర్పాటు చేశారు. 80 సంవత్సరాల వ్యాపారం తర్వాత, ఎంటీఆర్ ఇప్పుడు ఒక పెద్ద నమ్మకమైన సంస్థగా పరిగణించబడుతుంది.ఇదంతా గత వైభోగం కాని నేడు.. దేశ వ్యాప్తంగా ఉడుపి హోటల్స్ విలుప్త అంచున ఉన్నాయి...మన ఆహార సంస్కృతి తీవ్ర ప్రమాదంలో ఉంది, అమెరికన్ ఎమ్ఎన్సీలు ఫుడ్ జెయింట్స్‌ను స్వాధీనం చేసుకోవడం ఉడిపి రెస్టారెంట్లను తొలగిస్తోంది. దీని పర్యవసానంగా చాలా ఉడుపి ఫుడ్ జాయింట్లు వేగంగా మూసుకుపోతున్నాయి. పదేళ్ళ క్రితం వరకు దేశంలో ఏ మూలకు వెళ్ళినా కుగ్రామంలో కుడా ఉడుపి హోటల్ ఉండి తీరాల్సిందే. ఉడుపి హోటల్ పేరు ఎత్తితే చాలు ఆ రవ్వ దోశలు, మసాలా దోశలు, వడ సంబారు, ఘుమఘ్జుమ లాడే కొబ్బరి చట్నీలు..... కానీ నేడు వాటి స్థానంలో నూడుల్స్ సెంటర్లు, పాణి పూరీలు, అమెరికన్ ఎమ్ఎన్సీలు పుణ్యమా..! అని దేశీయ చాట్ సెంటర్లు కుడా కనుమరుగైపోయాయి మన పిల్లలు జంక్ ప్లాస్టిక్ ఫుడ్స్‌కు అలవాటు పడి చిన్నతనం నుంచే తీవ్ర ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. ఈ జంక్ ఫుడ్స్‌తో స్థూలకాయం, కిడ్నీ, ఊపిరితిత్తుల వ్యాధులు విపరీతంగా పెరుగుతున్నాయి.అమెరికన్ ఫుడ్ దిగ్గజా లక్ష్యం మన చిన్నారులు, యువతే. ముఖ్యంగా పిల్లల మనస్సును మరల్చగలగడమే వారి థ్యేయం. ఎందుకంటే..?మధ్య వయస్కులు, వృద్ధులు ఈ జంక్ ఫాస్ట్ ఫుడ్‌ను ఎన్నటికీ అంగీకరించరని వారికి బాగా తెలుసు. ఈలోగా చిన్నారులు యుక్తవయస్సు వచ్చే నాటికి ఈ జంక్ ఫుడ్స్‌కు బాగా బానిస అయ్యిపోతారు. నిజానికి ఇది మన ఆరోగ్యానికి మాత్రమే కాదు, అందులో ఉపయోగించే పదార్థాలు మన రూపు రేఖల్ని అందవిహీనంగా మార్చేసి మనకి ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తాయి. (చదవండి: పెళ్లి రోజున ఇలాంటి గిఫ్ట్‌లు కూడా ఇస్తారా!..ఊహకే రాని బహుమతి!) -
కిచెన్‌కు టాటా.. హోటళ్ల బాట..
సాక్షి, హైదరాబాద్: ఇటీవలికాలంలో కుటుంబాల ఆదాయం పెరుగుతోంది. జీవన శైలి మారుతోంది. భా ర్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తున్న పరిస్థితి ఉంది. దీ నితో మన దేశంలోని కుటుంబాలు ఇళ్లలో వంట గదికి టాటా చెప్తున్నారని.. హోటళ్ల బాట పడుతు న్నారని తాజాగా ఓ సర్వేలో తేలింది. ఇంట్లో వంట చేసుకోవడానికి బద్ధకంతోపాటు వివిధ వెరైటీల ఆహారం తినాలన్న కోరిక దీనికి కారణమని వెల్లడైంది. ప్రాసెస్డ్ ఆ హారం వినియోగం భారీగా పెరిగినట్టు తేలింది. వీధివీధినా వెలసిన రెస్టారెంట్లు, హోటళ్లు, విస్తృతంగా అందుబాటులోకి ఫుడ్ డెలివరీ యాప్‌లు, నిమిషాల్లో సరుకులు తెచ్చిచ్చే గ్రోసరీ యాప్‌లు.. దీనికి మరింత ఊతమిస్తున్నట్టు వెల్లడైంది. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్, ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ (ఎంఓఎస్పీఐ), ఐసీఐసీఐ సెక్యూరి టీస్ చేసిన అధ్యయనంలో ఈ వివరాలు వెల్లడయ్యా యి. ఆ నివేదికల్లోని గణాంకాలను పరిశీలిస్తే.. ♦ అంతకుముందటి పదేళ్లతో పోల్చితే 2022–23 ఆర్థిక సంవత్సరంలో పట్టణ ప్రాంతాల్లోని అధిక ఆదాయ వర్గాల వారు ప్యాకేజ్డ్ ఫుడ్, డైనింగ్ ఔట్, పుడ్ డెలివరీ సరీ్వసెస్ కోసమే తమ ఫుడ్ బడ్జెట్లో 50శాతానికిపైగా ఖర్చు చేశారు. గతంలో ఇది 41.2 శాతమే. ♦ మధ్యతరగతి కుటుంబాలు తమ ఆహార బడ్జెట్లో ప్రాసెస్డ్ ఫుడ్, పానీయాలపై చేస్తున్న ఖర్చు 16శాతం నుంచి 25 శాతానికి (గత పదేళ్లలో) పెరిగింది. ♦ అధికాదాయ కుటుంబాలకు సంబంధించి చూస్తే.. ‘స్టేపుల్ ఫుడ్ (ముడి ఆహార పదార్థాల)’పై వ్యయం తగ్గుతోందని.. క్రమంగా వారి ఇళ్లలో వంట గదులకు పనిలేకుండా పోతోందని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ రిపోర్ట్ పేర్కొంది. ♦ 2022–23లో అధికాదాయ కుటుంబాల తలసరి ఫుడ్ డెలివరీ వ్యయం ఏకంగా రూ.971గా ఉంది. అదే మధ్యతరగతి, తక్కువ ఆదాయ వర్గాల్లో తలసరి ఫుడ్ డెలివరీ ఖర్చు రూ.60గా ఉంది. ♦ గత పదేళ్లతో పోల్చితే ఇంట్లో వంట చేసుకోవడం తగ్గింది. హోటళ్లు, రెస్టారెంట్లకు వెళ్లడం, డెలివరీ యాప్‌ల ద్వారా తెప్పించుకోవడం బాగా పెరిగింది. ఇది రాబోయే రోజుల్లో మరింతగా పెరుగుతుందని నివేదిక అంచనా వేసింది. ♦ గత పదేళ్లలో పోల్చితే ప్రస్తుతం పట్టణ ప్రాంతాల్లో ప్రాసెస్డ్ ఫుడ్ వినియోగించే అధికాదాయ కస్టమర్లు రెండింతలు పెరిగారు. అదే మధ్య తరగతి కస్టమర్లు మూడింతలు పెరిగారు. ♦ అధికాదాయ వర్గాల వారు.. చక్కెర శాతం తక్కువగా ఉన్న ఆహార పదార్థాలు, సేంద్రియ ఆహారం, పానీయాల వంటి వాటి వినియోగం పెంచారు. మిగతా వర్గాల వారూ వాటివైపు ఆకర్షితులవుతున్నారు. ♦ డ్రైఫ్రూట్స్‌పై చేస్తున్న కుటుంబ వ్యయం పట్టణ ప్రాంతాల్లో 1.3శాతంగా, గ్రామీణ ప్రాంతాల్లో 1.2శాతంగా ఉంది. ♦ పట్టణ ప్రాంత కుటుంబాల ఆదాయం పెరిగినా.. ప్రాసెస్డ్ ఫుడ్, పానీయాలపై ఖర్చు తగ్గి.. ధాన్యాలు (సెరీల్స్), కోడిగుడ్లు, చేప, మాంసం, వంటనూనె వంటి వాటి వినియోగం గతంలోని స్ధాయిలోనే ఉండిపోయింది. -
స్పోర్ట్స్ హాస్పిటాలిటీ వ్యాపారంలోకి ఓయో
న్యూఢిల్లీ: ఆతిథ్య రంగ టెక్ సంస్థ ఓయో తాజాగా స్పోర్ట్స్ హాస్పిటాలిటీ వ్యాపారంలోకి అడుగుపెట్టింది. భారీ స్థాయి క్రీడల పోటీల నిర్వహణకు సంబంధించి ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, పుణె సహా 12 కీలక నగరాల్లో 100 హోటల్స్‌ను షార్ట్‌లిస్ట్ చేసింది. వివిధ స్పోర్ట్స్ ఈవెంట్లలో పాల్గొనే క్రీడాకారులు, అధికారులకు వసతి సదుపాయం కలి్పంచేందుకు ఇవి ఉపయోగపడగలవని సంస్థ తెలిపింది. స్పోర్ట్స్ టీమ్‌లు, పెద్ద బృందాల అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక ప్యాకేజీలు, గ్రూప్ బుకింగ్ ఆప్షన్స్ ఇస్తామని ఓయో వివరించింది. అలాగే క్రీడాకారులు, ఈవెంట్లను వీక్షించేందుకు వచ్చే వారి ఆహార, రవాణా అవసరాలను తీర్చే థర్డ్–పార్టీ ఏజెన్సీల సేవలను కూడా అందుబాటులో ఉంచుతామని పేర్కొంది. -
అయోధ్య రామ భక్తులకు శుభవార్త
దేశంలోని రామభక్తుల కల నెరవేరింది. అయోధ్యలో రామాలయం నిర్మితమయ్యింది. లక్షలాది భక్తులు రాములోరిని చూసేందుకు తరలివస్తున్నారు. అయితే వారు అక్కడ సరైన వసతి సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఇకపై ఇటువంటి సమస్యలకు ఫుల్స్టాప్ పడనుంది. అయోధ్య ధామ్‌లో భక్తుల కోసం 158 కొత్త హోటళ్లను నిర్మించేందుకు సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ హోటళ్లను వీలైనంత త్వరగా నిర్మించనున్నారని సమాచారం. ఈ ఏడాది ఎనిమిది వేల గదులు భక్తులకు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతానికి పర్యాటకులకు 175 హోటళ్లు, అతిథి గృహాలు, డేరా సిటీలలో 30 వేల మంది భక్తులకు బస చేసేందుకు ఏర్పాట్లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే రిజిస్టర్ అయిన 158 కొత్త హోటళ్ల నిర్మాణం పూర్తయ్యాక అయోధ్య ధామ్‌లోని హోటళ్లు, అతిథి గృహాల సంఖ్య 333కి పెరగనుంది. ఇది కూడా చదవండి: తొలిరోజు విరాళాలు రూ.3.17 కోట్లు! యూపీ పర్యాటక మంత్రిత్వ శాఖ అయోధ్యలో నిర్మిస్తున్న హోటళ్లను కాంస్య (ఒక నక్షత్రం), వెండి (రెండు నక్షత్రాలు), బంగారం (త్రీ స్టార్), డైమండ్ (నాలుగు నక్షత్రాలు), ప్లాటినం (ఫైవ్ స్టార్)గా వర్గీకరించే సదుపాయాన్ని కూడా కల్పించింది. కొత్త టూరిజం పాలసీ ప్రకారం నూతనంగా నిర్మితమవుతున్న ఈ హోటళ్లకు ఇంటి పన్ను, నీటి పన్ను, ఇతర పన్నుల్లో 50 శాతం వరకు రాయితీని ప్రభుత్వం అందిస్తోంది. జనరల్ కేటగిరీకి 25 శాతం, మహిళలు, షెడ్యూల్డ్ కులాలకు 30 శాతం సబ్సిడీ కల్పిస్తోంది. ఈ ఏడాది చివరి నాటికి ఈ హోటళ్ల నిర్మాణం పూర్తికానున్నదని యూపీ పర్యాటక శాఖ మంత్రి జైవీర్ తెలిపారు. -
సమోసా, కచోరీ ఏం పాపం చేశాయ్..! ఇదీ లెటెస్ట్ ట్రెండ్ వైరల్ స్టోరీ
ఇప్పుడంటే బఫేలు, కేటరింగ్లు వచ్చాయి గానీ, గతంలో విందు భోజనాల్లో కొసరి కొసరి వడ్డించడం అలవాటు. ఏమండీ... ఇది రుచి చూశారా.. మీ కోసమే స్పెషల్‌గా చేయించా... అసలు ఈ పనస పొట్టు బిర్యానీ తిని చూడండి.. హా.. ములక్కాడ, జీడిపప్పు అబ్బ.. ఒక్కసారి రుచి చూడండి... ఇంకో పూర్ణ బూరె వేసుకోండి.. వేడి వేడిగా నెయ్యి వేసుకొని తిన్నారంటే బ్రహ్మాండం కదా..! అన్నట్టు చివర్లో తాంబూలం మర్చిపోకండి సుమా! ఇదీ పెళ్లిళ్లు, పేరంటాల్లో అతిథులకు లభించే మర్యాద. కానీ ప్రస్తుత బిజీ లోకంలో ఆ అప్యాయతలు మర్యాదలు అన్నీ మారిపోయాయి. ట్రెండ్ మారింది. చుట్టాలు, బంధువుల ప్లేస్‌లోకి చిన్న చిన్న రెస్టారెంట్లు వచ్చి చేరాయి. దీన్ని అందిపుచ్చుకున్న చిన్న చిన్న రెస్టారెంట్లు, హోటల్స్ వ్యాపారంలో ట్రెండ్ మార్చేశాయి. ప్రస్తుత బిజీ లోకంలో ఆనాటి అప్యాయతలు మర్యాదలు అన్నీ మారిపోయాయి. ట్రెండ్ మారింది. దీన్నే చిన్నా, పెద్దా రెస్టారెంట్లు, హోటల్స్ క్యాష్ చేసుకుంటున్నాయి. చుట్టాలు, బంధువుల ప్లేస్‌లోకి చిన్న చిన్న రెస్టారెంట్లు వచ్చి చేరాయి. రా రామ్మని ఊరించేలా కస్టమర్లను వినూత్నంగా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పటిదాకా సరికొత్త రుచులు, వివిధ ప్రాంతాల వంటకాలను అందించిన హోటళ్లు భోజన ప్రియుల్ని, కొత్తగా తిందామనుకుని వచ్చే వారిని ఆకర్షించేందుకు చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. హంగులు, ఆర్భాటాలతో మెప్పించడమే కాకుండా చుట్టాల్లా ఆదరిస్తున్నాయి. ( శివారులో వినూత్న హోటళ్లు) ఇక ఆ తరువాత కస్టమర్లను ఆకట్టుకునేలా తమ హోటళ్ల పేర్లను పెట్టుకోవడంలో మరో అడుగు ముందుకేశాయి. తినేసి పో.., ఉలవచారు, కోడికూర-చిట్టిగారె,రాజుగారి పులావ్ లాంటి పేర్లతో తమ హోటళ్ళకు రప్పించుకుంటున్నాయి. (ఆకలైతుందా.. తినేసిపో! అంతేరా! దా–తిను! ) సమోసాను, కచోరీని మర్చిపోతే ఎలా? ఎప్పటికపుడు తమ సృజనాత్మకతకు పదును పెడుతూ కొంత పుంతలు తొక్కుతున్నాయి. ఈక్రమంలోనే ఇపుడు నయా ట్రెండ్ వెలుగులోకి వచ్చింది. అయ్యా , మా హోటల్‌కు వచ్చినందుకు ధన్యవాదాలు. ఈ సారి మాత్రం ఇవి మర్చిపోవద్దు అంటూ గుర్తు చేయడం విశేషంగా నిలిచింది. రెస్టారెంట్ బిల్లుపై సమోస, కచోరీ తినడం మర్చిపోకండి.. వాటిలో ఫిల్లింగ్ ఉంటుంది. కడుపు నిండుతుంది అన్నట్టు ఒక మెసేజ్ ఉండటం లేటెస్ట్ ట్రెండ్. దీనికి సంబంధించిన రిసీట్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో ఔరా అంటున్నారు భోజన ప్రియులు. (హంగూ, ఆర్బాటంలేదు, గుర్రమెక్కలేదు.. మూడు ముళ్లు వేయలేదు.. సింపుల్‌గా సెలబ్రిటీ పెళ్లి) -
ఎకో హోటల్స్‌లో ఈజీ ట్రిప్ ప్లానర్స్
న్యూఢిల్లీ: ఆన్లైన్ ట్రావెల్ సర్వీసులందించే ఈజీ ట్రిప్ ప్లానర్స్ తాజాగా ఎకో హోటల్స్ అండ్ రిసార్ట్స్‌లో 13.39 శాతం వాటాను కొనుగోలు చేసింది. షేర్ల మార్పిడి ద్వారా వాటాను సొంతం చేసుకోనుంది. ఇందుకు 1: 1 నిష్పత్తిలో షేర్లను జారీ చేయనుంది. ఈజ్‌మైట్రిప్ బ్రాండ్‌తో సేవలందించే కంపెనీ ప్రతీ ఒక ఎకో హోటల్స్ షేరుకి ఒక ఈజీ ట్రిప్ షేరుని కేటాయించనుంది. ఆపై ప్రిఫరెన్షియల్ పద్ధతిలో రూ. 10 ముఖ విలువగల 40 లక్షల ఎకో హోటల్స్ ఈక్విటీ షేర్లను సొంతం చేసుకోనుంది. ఎన్ఎస్ఈలో ఈజ్‌మైట్రిప్ షేరు 0.8 శాతం బలపడి రూ. 39 వద్ద ముగిసింది. -
OYO Travelopedia: వరంగల్, గుంటూరులో ఎక్కువ హోటల్ బుకింగ్‌లు
న్యూఢిల్లీ: దేశంలో ఎక్కువ మంది హైదరాబాద్‌కు ప్రయాణాలు కడుతున్నారు. ఈ ఏడాది ఎక్కువగా హోటళ్లు బుక్ చేసుకున్నది హైదరాబాద్‌లోనే అని ఓయో ట్రెవెలో పీడియా 2023 నివేదిక ప్రకటించింది. హైదరాబాద్ తర్వాత బుకింగ్‌లలో బెంగళూరు రెండో స్థానంలో నిలిచింది. ఢిల్లీ, కోల్‌కతా తర్వాతి రెండు స్థానాల్లో ఉన్నాయి. గోరఖ్‌పూర్, ధిగ, వరంగల్, గుంటూరులకు సైతం ఎక్కువ బుకింగ్‌లు నమోదయ్యాయి. ఇక ఎక్కువ మంది సందర్శించిన (హోటళ్లు బుక్ చేసుకున్న) రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఆ తర్వాతి స్థానంలో మహారాష్ట్ర ఉంది. ఈ ఏడాది సెపె్టంబర్ 30 నుంచి అక్టోబర్ 2 మధ్య వారాంతపు హోటళ్ల బుకింగ్‌లు ఎక్కువ నమోదయ్యాయి. విహార పర్యటనలకు జైపూర్ ప్రధాన కేంద్రంగా ఉంది. 2023లో ఎక్కువ మంది విహారం కోసం ఈ పట్టణాన్ని సందర్శించారు. గోవా, మైసూరు, పుదుచ్చేరి తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఎక్కువ హోటళ్లు బుక్ చేసుకున్న ఆధ్యాతి్మక, భక్తి కేంద్రంగా ఒడిశాలోని పూరి పట్టణం నిలిచింది. ఈ విషయంలో అమృత్సర్, వారణాసి, హరిద్వార్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఆధ్యాతి్మకంగా పెద్దగా తెలియని దియోగఢ్, పళని, గోవర్ధన్‌కు సైతం బుకింగ్‌లు 2022తో పోలిస్తే ఈ ఏడాది గణనీయంగా పెరిగాయి. రాష్ట్రాల పరంగా ఎక్కువ బుకింగ్‌లలో యూపీ మొదటి స్థానంలో ఉంటే, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వరుసగా తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఎప్పటికీ గుర్తుండి పోతుంది.. ‘‘ప్రయాణాలకు సంబంధించి 2023 ప్రత్యేకంగా నిలిచిపోతుంది. కరోనా కారణంగా ఏర్పడిన సవాళ్ల తర్వాత పరిశ్రమ తిరిగి సాధారణ స్థితికి చేరుకుంది. దేశీయంగా కొత్త ప్రాంతాలను చూసి రావాలన్న ధోరణి కొనసాగుతూనే ఉంది. అంతర్జాతీయంగా ప్రయాణాల వృద్ధిలో విహార యాత్రలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. భారత్‌లో వ్యాపార ప్రయాణాలు సైతం వృద్ధికి చెప్పుకోతగ్గ మద్దతునిస్తున్నాయి’’అని ఓయో గ్లోబల్ చీఫ్ సర్వీస్ ఆఫీసర్ శ్రీరంగ్ గాడ్బోలే వివరించారు. ఈ ఏడాది ఎక్కువ హోటల్ బుకింగ్‌లు చేసుకున్న రోజు సెపె్టంబర్ 30 కాగా, మాసాల వారీగా చూస్తే మేలో ఎక్కువ బుకింగ్‌లు నమోదైనట్టు ఓయో ట్రావెలోపీడియా నివేదిక తెలిపింది. ఇక అమెరికాలో ఎక్కువ మంది ప్రయాణించిన రాష్ట్రాల్లో టెక్సాస్, ఒరెగాన్, లూసియానా, ఓక్లహామా, ఫ్లోరిడా, హూస్టన్ టాప్‌లో ఉన్నాయి. యూకేలో లండన్, ప్లైమౌత్, మిడిల్స్‌బ్రో, షెఫీల్డ్, ఈస్ట్‌బోర్న్, యూరప్‌లో శాల్జ్‌బర్గ్, ఆ్రస్టియాలో టైరోల్‌ను ఎక్కువ మంది సందర్శించారు. -
శివారులో వినూత్న హోటళ్లు
కర్నూలు: ఉమ్మడి జిల్లాలో ఒకప్పుడు ఎలాంటి పని మీద కర్నూలుకు వచ్చి టిఫిన్ తినాలనుకున్నా, మధ్యాహ్నం ఆకలి తీర్చుకోవాలన్నా.. రాత్రికి నాలుగు మెతుకులు గొంతు దిగాలన్నా ముందుగా గుర్తుకొచ్చే పేర్లు అజంతా, గోపి, హిందుస్తాన్, రమా దర్శన్, గీతా లంచ్హోం, అమరావతి.. తరహా పదుల సంఖ్యలో హోటళ్లు మాత్రమే. అప్పటి జనాభాకు అనుగుణంగా ఈ హోటళ్లు ఎంతో రుచికరమైన అల్పాహారంతో పాటు షడ్రుచులను అందించి ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్నాయి. ఇందులో కొన్ని హోటళ్లు మారిన కాలంతో పాటు భోజన ప్రియుల అభిరుచులకు అనుగుణంగా మార్పులు చేసుకొని ఇప్పటికీ ఉనికి చాటుకుంటున్నాయి. అయితే నగరం వేగంగా విస్తరించడంతో పాటు నాలుక భిన్న ఆహారాన్ని కోరుకోవడంతో అందుకు అనుగుణంగా హోటళ్లు వెలుస్తూ వచ్చాయి. ఇప్పుడు నగరంలోనే కాదు శివారు ప్రాంతాల్లోనూ భారీ రెస్టారెంట్లు స్వాగతం పలుకుతున్నాయి. జాతీయ రహదారుల్లో దారి పొడవునా ఆకలి తీర్చే ఘుమఘుమలు వాహనాలు ముందుకు కదలనివ్వవంటే అతిశయోక్తి కాదు. ఒక్క పూటైనా కలిసి మెలసి భోజనం నగర వాతావరణానికి అలవాటుపడిన చాలా కుటుంబాలు, భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగులు కావడంతో ఇటీవల కాలంలో ఇంట్లో వంట చేసుకోవడం చాలా వరకు తగ్గిపోయింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉరుకులు పరుగుల జీవితం నుంచి కాస్త ఊరట పొందేందుకు, ఇంటిల్లిపాదీ కలసి భోజనం చేసేందుకు అనువుగా హోటళ్లు ఏర్పాటయ్యాయి. ఇక ఇటీవల నగరంలోని గుత్తి పెట్రోల్ బంకు సమీపంలో బ్రిడ్జి కింద రూపుదిద్దుకున్న ఖానా ఖజానా ఎంతో ఆహ్లాదకర వాతావరణంలో ఆకలి తీరుస్తోంది. సాయంత్రం వేళ వెలుగుజిలుగులు మధ్య ఇక్కడి అల్పాహార.. వెజ్, నాన్ వెజ్ ఆహారం తియ్యని అనుభూతి మిగులుస్తోంది. అదేవిధంగా ఇంకాస్త ప్రయాణం చేసి ఊరి బయటకు వెళ్లాలనుకునే వారికి, సమయం వెచ్చించాలనుకుంటే అందుకు అనువైన హోటళ్లు కూడా రారమ్మని ఆహ్వానిస్తుండటం విశేషం. సరికొత్త రుచులు ఒకప్పుడు హోటళ్లకు వెళితే ఇడ్డీ, వడ, దోశ.. మధ్యాహ్నమైతే అరిటాకులో వడ్డించే భోజనం.. రాత్రికి వీటితో పాటు చపాతి, పరోటా అదనం. మాంసాహార ప్రియులకు బిర్యానీ ఉండనే ఉంటుంది. ఇప్పుడు వీటితో పాటు సరికొత్త రుచులు భోజన ప్రియులను హోటళ్ల వైపునకు కాళ్లు కదిపేలా చేస్తున్నాయి. రకరకాల బిర్యానీలతో పాటు హైదరాబాద్, బెంగళూరు, ముంబయి, చెన్నై తదితర మహానగరాల్లో లభించే అన్నిరకాల వంటకాలు దాదాపుగా ఇక్కడ లభ్యమవుతున్నాయి. కేఎఫ్‌సీ, బార్బీక్యూ, ఇంకా ఎన్నో ఇప్పుడు నగరంలోనే అడుగడుగునా కనిపిస్తున్నాయి. ఇప్పటికీ పాతబస్టాండ్ ప్రాంతంలో నెయ్యి దోశ నోరూరిస్తుంది. రకరకాల వంటకాలు దాదాపుగా ప్రతి హోటల్లో వెజ్, నాన్ వెజ్ భోజనాలు లభిస్తున్నా.. ఒక్కొక్కరు ఒక్కో ప్రత్యేకతను సొంతం చేసుకుంటున్నారు. ఒకచోట కుండ బిర్యానీ, మరోచోట చిట్టి ముత్యాల బిర్యానీ, మరోచోట రాగిముద్ద తలకాయ కూర.. ఇంకోచోట నెల్లూరు చేపల పుసులు.. ఇక మటన్ కడ్డీలు నోరూరిస్తుంటాయి. ఇటీవల కాలంలో మండీ భోజనం నగరవాసులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఒక భారీ ప్లేట్లో ఇంటిల్లిపాదీ భోజనం చేసే సదుపాయం ఉండటం సరికొత్త అనుభూతిని పంచుతోంది. అదేవిధంగా బకెట్ బిర్యానీ ప్యాకింగ్‌లోనూ వినూత్న పంథాకు అద్దం పడుతోంది. ఒకరు.. ఇద్దరు.. నలుగురు.. ఆరుగురు.. పది మంది వరకు తినేలా ఈ బకెట్ బిర్యానీలను సిద్ధం చేస్తున్నారు. ఆరోగ్యానికి అనువుగా.. పంటల సాగులో రసాయన ఎరువుల వాడకం విచ్చలవిడిగా పెరిగిపోవడంతో వ్యాధుల తీవ్రత కూడా అదేస్థాయిలో ఉంటోంది. చిన్న వయస్సులోనే బీసీ, షుగర్, క్యాన్సర్ మహమ్మారి ఉక్కిరిబిక్కిరి చేస్తుండటంతో ఆ రోగాల నుంచి బయటపడేందుకు జేబుకు చిల్లు పెట్టుకోక తప్పనిపరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తమ ఆహార అలవాట్లలో మార్పు చేసుకుంటున్నారు. తద్వారా కొద్ది వరకైనా అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చనే భావన కనిపిస్తోంది. ఇందుకు అనుగుణంగా నగరంలో పలుచోట్ల మిల్లెట్ హోటళ్లు కూడా ఏర్పాటయ్యాయి. చిరుధాన్యాలతో తయారు చేసిన ఇడ్లీ, దోశ, పూరీలు ఆరోగ్యాన్ని పంచుతున్నాయి. ఇదే సమయంలో రాగి సంకటితో పాటు జొన్నరెట్టె కూడా కడుపును చల్లబరుస్తూ బలాన్ని చేకూరుస్తుండటం విశేషం. శివారులో వినూత్న హోటళ్లు జాతీయ రహదారుల వెంట వెలసిన హోటళ్లు భోజన ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ప్రయాణికులతో పాటు నగరవాసులు సైతం ఈ హోటళ్లకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇందుకు అనుగుణంగానే ఆయా హోటళ్లలో బిగ్ స్క్రీన్లు ఏర్పాటు చేసి సినిమాలు, పాటలను ప్రదర్శిస్తున్నారు. ఇక క్రికెట్ మ్యాచ్‌లు ఉంటే.. ఆ రోజుల్లో సందడే సందడి. ముందుగానే టేబుళ్లు బుక్ చేసుకొని మరీ ఈ రెస్టారెంట్లకు క్యూకడుతున్నారు. ఒక హోటల్ ఎదుట ఏర్పాటు చేసిన ఏనుగు అటుఇటూ కదులుతూ, పిల్లలకు సరికొత్త అనుభూతిని మిగులుస్తున్నాయి. అసలైన ఏనుగునే ఇలా నిల్చోబెట్టారా అనే భావన కలిగించే రీతిలో నిర్వాహకులు ఈ సెట్టింగ్‌ను ఏర్పాటు చేశారు. ఓ యజమాని ఇంకాస్త ముందుకెళ్లి ఏకంగా విమానాన్నే హోటల్‌గా మారుస్తున్న తీరు చూస్తే ఈ రంగం ఏస్థాయిలో విస్తరిస్తుందో అర్థమవుతోంది. కేరళ ఆపం: నగర శివారులోని ఓ చిన్న దుకాణంలో ఏర్పాటు చేసిన హోటల్ ఇటీవల కాలంలో తమ ప్రత్యేకతను చాటుకుంటోంది. కేరళవాసులకే పరిమితమైన ఆపం ఇప్పుడు ఇక్కడ లభిస్తుంది. డిగ్రీ పూర్తి చేసిన ఇద్దరు అన్నదమ్ములు ఈ హోటల్ నిర్వహిస్తున్నారు. స్వయంగా వీరిద్దరే ఆపం తయారు చేస్తూ చెట్నీతో పాటు నాన్ వెజ్తోనూ అందిస్తున్నారు. కొత్త వంటకాలకు ఎప్పుడూ ఆదరణ లభిస్తుందనేందుకు వీరి వినూత్న ఆలోచనే నిదర్శనం. కోకోనట్ జ్యూస్: ఇప్పటి వరకు టెంకాయ నీళ్లను మాత్రమే తాగిన వాళ్లకు.. ఈ దుకాణానికి వస్తే సరికొత్త రుచి లభిస్తుంది. బయట ఒక టెంకాయ కొనుగోలు చేయాలంటే రూ.50 తీసుకుంటున్నారు. ఇదే ధరతో ఇక్కడ కోకోనట్ జ్యూస్ లభిస్తుంది. ఇందులో టెంకాయ నీళ్లకు తోడు అందులోని కొబ్బరి, గ్లూకోస్, కాస్త చక్కెరను మిక్సీలో వేసి జ్యూస్‌ను సిద్ధం చేస్తున్నారు. దీనికి అదనంగా ఫ్లేవర్ కోరుకునే వాళ్లకు మరో రూ.10 అదనంగా తీసుకొని సీజన్‌కు అనుగుణంగా లభించే పండ్లతో కూడిన కోకోనట్ జ్యూస్‌తో ఆకట్టుకుంటున్నారు. చిట్టిముత్యాల బిర్యానీ ఎంతో రుచి వ్యాపార రీత్యా వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుంది. అలా కర్నూలుకు వచ్చిన ప్రతీసారి నగర శివారులోని రెస్టారెంట్లో చిట్టిముత్యాల బిర్యానీ తినడం అలవాటుగా మారింది. శివారు ప్రాంతం కావడంతో ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. వాహనాల పార్కింగ్‌కు అనువుగా ఉండటంతో వీలైనంత వరకు ఇలాంటి హోటళ్లకే వెళ్తుంటా. – వెంకటేశ్వర్లు, నెల్లూరు జిల్లా -
హోటళ్లలో బుల్లిష్ ధోరణి.. పెరిగిన అంతర్జాతీయ ప్రయాణాలు
ముంబై: దేశ ఆర్థిక పురోగతి, భవిష్యత్ అవకాశాల పట్ల దేశీ హోటల్ యజమాన్యాల్లో ఎంతో ఆశావాదం నెలకొన్నట్టు బుకింగ్ డాట్ కామ్ సంస్థ వెల్లడించింది. గడిచిన ఆరు నెలల్లో హోటళ్లలో బుకింగ్ రేటు పెరిగినట్టు తెలిపింది. రూమ్ ధరలు పెరిగినట్టు 49 శాతం మంది చెప్పగా.. గత ఆరు నెలల కాలంలో తమ హోటళ్లో గదుల భర్తీ రేటు పెరిగినట్టు 55 శాతం మంది హౌసింగ్ డాట్ కామ్ సర్వేలో తెలిపారు. అంతర్జాతీయ ప్రయాణికుల్లో పెరుగుదల ఇందుకు అనుకూలించినట్టు బుకింగ్ డాట్ కామ్ తన సర్వే నివేదికలో పేర్కొంది. ఈ ఏడాది జూలై 17 నుంచి ఆగస్ట్ 25 మధ్య టెలిఫోన్ ఇంటర్వ్యూల ద్వారా ఈ సర్వే జరిగింది. దేశ ఆతిథ్య పరిశ్రమకు చెందిన 250 మంది ఎగ్జిక్యూటివ్‌లు, మేనేజర్లు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. అంతర్జాతీయ ప్రయాణికులు వృద్ధికి ఊతమిస్తున్నారు. అంతర్జాతీయ ప్రయాణికులను ఆకర్షించడం 2024లో వ్యాపార వృద్ధి అవకాశాలకు కీలకమని 88శాతం మంది భావిస్తున్నారు. తమ వ్యాపార వృద్ధికి కుటుంబాలను ఆకర్షించడం (78 శాతం మంది), మరింత మంది దేశీ ప్రయాణికులను రాబట్టడం (72 శాతం మంది), ఆధ్యాత్మిక పర్యాటకం ఇతర అవకాశాలుగా 64 శాతం మంది చెప్పారు. లాభాల వృద్ధికి ఆహారం పానీయాలు కీలకమని 39 శాతం మంది పేర్కొన్నారు. తమ హోటల్ మెనూలో వెగాన్, వెజిటేరియన్ ఆహారాన్ని చేర్చడం ముఖ్యమని 41 శాతం మంది పేర్కొన్నారు. సవాళ్లు.. నిర్వహణ వ్యయాలు పెరిగిపోవడం దేశ హోటల్ యాజమాన్యాలు ఎదుర్కొంటున్న సవాళ్లలో ప్రధానంగా ఉంది. ఇంధన వ్యయాలు, పన్నులు రెండు ప్రధాన సవాళ్లు అని 74 శాతం మంది, 73 శాతం మంది చొప్పున చెప్పారు. ఆ తర్వాత సిబ్బంది వేతనాలు, ఆర్థిక అనిశ్చితి, పెట్టుబడుల వ్యయాలను ఇతర సవాళ్లుగా పేర్కొన్నారు. ఇంధనాన్ని ఆదా చేయడం ప్రాముఖ్యమని 46 శాతం మంది తెలిపారు. వ్యర్థాలను తగ్గించుకోవాలని 45 శాతం మంది, నీటిని ఆదా చేసుకోవాలని 26 శాతం మంది అభిప్రాయపడ్డారు. -
మ్యాచ్ అహ్మదాబాద్‌లో.. ‘రెట్టించిన ఉత్సాహం’ ఢిల్లీలో..
ఈరోజు (ఆదివారం) గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య క్రికెట్ ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ నేపధ్యంలో ఢిల్లీ-ఎన్సీఆర్లోని పలు పబ్‌లు, రెస్టారెంట్లలో క్రీడాప్రియులు మ్యాచ్‌ను మరింత ఉత్సాహంతో తిలకించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భారీ టీవీ స్క్రీన్లను ఏర్పాటు చేయడం మొదలుకొని ప్రత్యేక పానీయాలు అందించడం వరకు అన్నింటినీ అందుబాటులో ఉంచారు. ప్రపంచ కప్ ఫైనల్‌ను క్యాష్ చేసుకునేందుకు ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లోని పలు పబ్‌లు, రెస్టారెంట్లు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. సెమీ ఫైనల్స్‌లో న్యూజిలాండ్‌ను ఓడించి ఫైనల్‌కు చేరిన టీమ్ఇండియా టోర్నీలో ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించడం విశేషం. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ సందర్భంగా ‘ఎస్ మినిస్టర్ - పబ్ అండ్ కిచెన్’ ప్రతినిధి మీడియాతో మాట్లాడుతూ ఇది బిగ్ మ్యాచ్ కావడంతో ‘కవర్ ఛార్జీ’గా మూడు వేల రూపాయలు వసూలు చేస్తున్నాం. సాధారణ రోజుల్లో, మేము దీనిని వసూలు చేయం. ఫైనల్ మ్యాచ్ అయినందున ఇంత రేటును వసూలు చేస్తున్నాం. దీనిని ఆహారానికి అదనంగా చెల్లించాల్సి ఉంటుంది’ అని అన్నారు. కాగా బ్లూ జెర్సీ ధరించి వచ్చే వారి కోసం ‘బీర్ కేఫ్’లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బీర్ కేఫ్ వ్యవస్థాపకుడు రాహుల్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ ‘టీమ్ ఇండియా ఫైనల్‌కు చేరడంతో ఆదివారం దేశవ్యాప్తంగా ఉన్న మా అవుట్లెట్లలో అభిమానులను స్వాగతించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. పెద్ద స్క్రీన్లపై మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం చేస్తాం. టీమ్ ఇండియా జెర్సీ ధరించి వచ్చిన వారికి ప్రత్యేక ఆఫర్లు అందిస్తున్నాం’ అని అన్నారు. హర్యానాలోని సైబర్ సిటీ ఆఫ్ గురుగ్రామ్‌లోని ‘సోయి 7 పబ్’, ‘బ్రూవరీ’లలో క్రీడాభిమానులు ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌ను తిలకించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ‘సోయి 7 పబ్’కి చెందిన లలిత్ అహ్లావత్ మాట్లాడుతూ ‘మ్యాచ్‌లను ప్రసారం చేయడానికి మూడు పెద్ద స్క్రీన్లు ఏర్పాటు చేశాం. సైబర్ సిటీలో అతిపెద్ద వేదిక ఏర్పాటు చేశాం. భారత జట్టుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం’ అని అన్నారు. ఇది కూడా చదవండి: మ్యాచ్ తిలకించేందుకు అహ్మదాబాద్‌కు అనుష్క శర్మ -
Top 10 Most Expensive Hotels In India: భారత్‌లో ఖరీదైన హోటల్స్ - చూస్తే కళ్ళు బైర్లు కమ్ముతాయి! (ఫొటోలు)
-
ప్రీమియం హోటళ్లలో జోరుగా బుకింగ్‌లు
న్యూఢిల్లీ: ప్రీమియం హోటళ్లలో బుకింగ్‌లకు మంచి డిమాండ్ కనిపిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2023–24) అక్యుపెన్సీ రేషియో (భర్తీ రేటు) దశాబ్దం గరిష్ట స్థాయి అయిన 70–72 శాతానికి చేరుకుంటుందని, సగటు రూమ్ రేటు రూ.6,000–6,200 మధ్య ఉండొచ్చని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఆక్యుపెన్సీ రేటు 68–70 శాతం మధ్య ఉంది. ద్రవ్యోల్బణం అధిక స్థాయిలో ఉన్నప్పటికీ, వినియోగ సెంటిమెంట్ స్థిరంగా మెరుగుపడుతున్నట్టు తెలిపింది. కార్పొరేట్ల స్థిరమైన పనితీరు, దేశీ ప్రయాణికుల రద్దీ కరోనా ముందు నాటి స్థాయిని అధిగమించడం రవాణా, హోటల్ పరిశ్రమలకు డిమాండ్‌ను తీసుకొస్తున్నట్టు వివరించింది. ఈ మేరకు ఇక్రా ఓ నివేదికను విడుదల చేసింది. భారత హోటల్ పరిశ్రమ ఆదాయం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 13–15 శాతం వృద్ధిని చూస్తుందని అంచనా వేసింది. ఒక రూమ్ నుంచి వచ్చే సగటు ఆదాయం ఇప్పటికీ 2007–08 నాటి గరిష్ట స్థాయితో పోలిస్తే 20–25 శాతం తక్కువగా ఉంటుందని పేర్కొంది. ఢిల్లీ, ముంబైలో ఎక్కువ డిమాండ్ ఢిల్లీ, ముంబై పట్టికలో ఎగువ భాగాన ఉన్నాయని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇక్కడి హోటళ్లలో ఆక్యుపెన్సీ రేషియో 75 శాతంగా ఉటుందని ఇక్రా వైస్ ప్రెసిడెంట్ వినుత ఎస్ తెలిపారు. ఇతర అన్ని పట్టణాల్లోనూ డిమాండ్ ఆరోగ్యకరంగా ఉంటుందని, బెంగళూరు, పుణెలో మాత్రం బలహీనంగా ఉండొచ్చన్నారు. ముఖ్యంగా జీ20 సమావేశాలు ఉండడం, ఆర్థిక వ్యవస్థ మెరుగుపడడంతో వ్యాపార సమావేశాల ఫలితంగా పట్టణాల్లో హోటళ్లకు డిమాండ్ ఉంటుందని ఇక్రా పేర్కొంది. అలాగే విహార యాత్రలు, సదస్సులు, ఎగ్జిబిషన్లు, వ్యాపార ప్రయాణాలు, విదేశీ ప్రయాణికుల రాక డిమాండ్‌కు సానుకూలిస్తాయని వివరించింది. మధ్యస్థాయి హోటళ్లలోనూ భర్తీ రేటు పుంజుకుంటున్నట్టు తెలిపింది. వీటిల్లోనూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మెరుగైన రేటు నమోదు కావచ్చని అంచనా వేసింది. డిమాండ్ పుంజుకోవడంతో గత 12–15 నెలల్లో వాయిదా పడిన ప్రాజెక్టులను ప్రారంభించడం, కొత్త ప్రాజెక్టుల ప్రారంభం ఉండొచ్చని పేర్కొంది. ప్రీమియం విభాగంలో కొత్త హోటళ్ల ప్రారంభం ఎంపిక చేసిన మార్కెట్లలోనే ఉండొచ్చని తెలిపింది. కొత్తగా రానున్న హోటళ్లలో ఎక్కువగా బెంగళూరు, ముంబై మార్కెట్ల నుంచే ఉంటాయని వెల్లడించింది. ‘‘కొత్త హోటల్ వసతుల సరఫరా ఏటా 3.5–4 శాతం కాంపౌండెడ్ వృద్ధి రేటు ప్రకారం ఉండొచ్చు. ప్రీమియం విభాగంలో దేశవ్యాప్తంగా 15,000–16,000 రూమ్‌ల లభ్యత పెరుగుతుంది’’అని ఇక్రా వివరించింది. -
ప్రీమియం రిసార్ట్స్ విభాగంలోకి ఓయో.. కొత్త బ్రాండ్ ఆవిష్కరణ
న్యూఢిల్లీ: హాస్పిటాలిటీ టెక్నాలజీ సంస్థ ఓయో తాజాగా ప్రీమియం రిసార్టులు, హోటల్స్ విభాగంలోకి ప్రవేశించింది. పాలెట్ పేరిట కొత్త బ్రాండ్‌ను ఆవిష్కరించింది. ప్రస్తుతానికి హైదరాబాద్‌తో పాటు ముంబై, చెన్నై తదితర నగరాల్లో 10 రిసార్టులతో ఈ బ్రాండును ప్రారంభించినట్లు సంస్థ చీఫ్ మర్చంట్ ఆఫీసర్ అనుజ్ తేజ్‌పాల్ తెలిపారు. రెండో త్రైమాసికంలో దీని కింద మరో 40 రిసార్టులను చేర్చుకోనున్నట్లు వివరించారు. ప్రస్తుతం పర్యాటకులు మరింత విలాసవంతమైన పర్యటనల వైపు మొగ్గు చూపుతున్న నేపథ్యంలో పాలెట్ బ్రాండుకు మంచి ఆదరణ లభించగలదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఓయోలో ప్రస్తుతం టౌన్హౌస్ ఓక్, ఓయో టౌన్హౌస్, కలెక్షన్ ఓ, క్యాపిటల్ ఓ పేరిట పలు బ్రాండ్స్ ఉన్నాయి. 2023 ఆఖరు నాటికి తమ ప్రీమియం పోర్ట్‌ఫోలియోలోకి మొత్తం 1,800 ప్రాపర్టీలను చేర్చుకోవాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. -
ODI World Cup 2023: ఆ పట్టణాల్లో హోటళ్లకు డిమాండ్
న్యూఢిల్లీ: వన్డే ప్రపంచకప్‌కు ఆతిథ్యమిచ్చే పట్టణాల్లో హోటల్ సేవలకు డిమాండ్ గణనీయంగా పెరిగింది. దీంతో ఆన్లైన్ ట్రావెల్, హోటల్ బుకింగ్ సేవలు అందించే సంస్థలు డిమాండ్‌ను చేరుకునే వ్యూహాలపై దృష్టి సారించాయి. హోటల్ బుకింగ్ సేవల సంస్థ ఓయో ఈ పట్టణాల్లో 500 హోటళ్లను అదనంగా తన నెట్వర్క్ కిందకు తీసుకురానున్నట్టు ప్రకటించింది. ఈ పట్టణాల్లో మ్యాచ్‌లను చూసేందుకు వచ్చే వీక్షకుల నుంచి హోటల్ బుకింగ్‌కు డిమాండ్ ఉంటుందన్న అంచనాలతో, వచ్చే మూడు నెలల్లో కొత్త హోటళ్లను చేర్చుకోనున్నట్టు తెలిపింది. కొత్త హోటళ్లు స్టేడియంలకు దగ్గర్లో ఉండేలా చూస్తామని, దాంతో క్రికెట్ అభిమానులు స్టేడియంలు చేరుకోవడానికి అనుకూలంగా ఉంటుందని ఓయో అధికార ప్రతినిధి ప్రకటించారు. సుదూర ప్రాంతాల నుంచి తమ అభిమాన జట్ల ఆటను చూసేందుకు వచ్చే వారికి సౌకర్యవంతమైన, అందుబాటు ధరలకు ఆతిథ్యం అందించడమే తమ లక్ష్యమని చెప్పారు. ఈ ఏడాది అక్టోబర్ 5 నుంచి వన్డే ప్రపంచకప్ పోటీలు మొదలు కానున్నాయి. దీనికి మూడు నెలల ముందుగానే ఆతిథ్య పట్టణాల్లో హోటళ్ల టారిఫ్‌లు (రూమ్ చార్జీలు) అధిక డిమాండ్ కారణంగా పెరిగినట్టు ఓయో తెలిపింది. నవంబర్ 19తో వన్డే ప్రపంచకప్ ఛాంపియన్íÙప్ ముగుస్తుంది. హైదరాబాద్, అహ్మ దాబాద్, ఢిల్లీ, ధర్మశాల, చెన్నై, లక్నో, బెంగళూరు, ముంబై, కోల్‌కతా, పుణెలో మ్యాచ్‌లు జరగనున్నా యి ఫైనల్ మ్యాచ్‌కు అహ్మదాబాద్ వేదిక కానుంది. మేక్ మైట్రిప్ ఆఫర్.. ఆన్లైన్ ట్రావెల్ సేవలు అందించే మేక్ మై ట్రిప్ కూడా ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆతిథ్య పట్టణ వాసులు తమ ప్రాపరీ్టలను తన ప్లాట్‌ఫామ్‌పై నమోదు చేసుకోవాలని కోరింది. అహ్మదాబాద్, ధర్మశాల, కీలక మెట్రోల్లో గృహ ఆతిథ్యాలకు డిమాండ్ పెరిగినట్టు ఈ సంస్థ ప్రకటించింది. ‘‘దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన పట్టణాల్లో అక్టోబర్, నవంబర్ నెలల్లో గృహ ఆతిథ్యానికి డిమాండ్ గణనీయంగా పెరగడాన్ని గుర్తించా. క్రికెట్ అభిమానులు ఇంతకుముందు లేనంతగా గృహ ఆతిథ్యానికి ప్రాధాన్యం ఇస్తుండడం మంచి సంకేతం’’అని మేక్‌మై ట్రిప్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ పరీక్షిత్ చౌదరి తెలిపారు. క్రికెట్ స్టేడియం నుంచి వసతి ఎంత దూరంలో ఉందో చూపించే సదుపాయాన్ని తన ప్లాట్‌ఫామ్‌పై అభివృద్ధి చేసినట్టు చెప్పారు. అభిమానులకు అనుకూలమైన వసతిని బుక్ చేసుకోవడానికి వీలుంటుందన్నారు. క్రికెట్ మ్యాచ్‌లు జరిగే పట్టణాల్లో అందుబాటు ధరలకే గృహవసతి అందుబాటులో ఉన్నట్టు తెలిపారు. -
రూ.25 లక్షల ప్యాకేజీ.. సాఫ్ట్వేర్ ఉద్యోగం.. అయినా పెళ్లికి ఇది సరిపోదు..
పెళ్లి సంబంధం కుదరడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. అమ్మాయికి అబ్బాయి నచ్చాలి. సంపాదన ఏడాది ప్యాకేజీ ఎంత అన్నదీ కీలకంగా చూస్తున్నారు. ‘ప్యాకేజీ’ నచ్చితేనే అమ్మాయితో పాటు కుటుంబ సభ్యులు ఓకే చేస్తున్నారు. లేకుంటే మరో ఆప్షన్ కోసం ఎదురు చూస్తున్నారు. అంతేకాదు పెళ్లి చూపులు కూడా సరికొత్త రూపు దాలుస్తున్నాయి. వధువు ఇంట జరగాల్సిన పెళ్లి చూపులకు హోటళ్లు.. ఇతర ప్రదేశాలు వేదికగా సాగుతున్నాయి. సాక్షి ప్రతినిధి, అనంతపురం: అనంతపురం నగరానికి చెందిన దీప్తి డల్లాస్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తోంది. ఇదే జిల్లాకు చెందిన అబ్బాయి రాకేష్ కాలిఫోర్నియాలో ఉంటున్నాడు. అక్కడే వీరిద్దరి పెళ్లిచూపులు అయ్యాయి. వచ్చే నెల ఇండియాలో పెళ్లి జరగబోతోంది. ►గుంతకల్లుకుచెందిన సురేష్‌కు నాలుగైదు సంబంధాలు వచ్చినా.. కుదరలేదు. కారణమేంటంటే.. అతనికి ముగ్గురు అక్కచెల్లెళ్లు, ఒక తమ్ముడు ఉన్నారు. ఆడపిల్లలకు పెళ్లిళ్లయినా పెద్ద కుటుంబం కదా ఇంతమందికి పెట్టుపోతలు కష్టమని అమ్మాయి తరఫు వారు వెనక్కు తగ్గుతున్నారు. ►ఆస్తులు, అంతస్తులు.. ముందు పది తరాలు, వెనుక పది తరాలు.. బలమూ బలగమూ ఇవి ఉంటే చాలు గతంలో అమ్మాయికి ఎలాంటి ఢోకా లేదని పెళ్లి కుదుర్చుకునే వారు. రానురాను కాలం మారింది. ఆస్తులేమోగానీ బలమూ బలగానికి చోటు లేదు. ఇప్పుడంతా ‘ప్యాకేజీ’లే. నెలజీతం ఎవరూ అడగడం లేదు. వార్షిక ప్యాకేజీ (యాన్యువల్ ప్యాకేజీ)ని బట్టి పెళ్లిళ్లు కుదిరిపోతున్నాయి. ప్యాకేజీ లేకపోతే వందెకరాల భూస్వామి కొడుక్కు కూడా పిల్లనిస్తామని వచ్చేవారు లేరు. అదే హైదరాబాద్.. బెంగళూరుల్లో పనిచేస్తున్న సాఫ్ట్వేర్ అబ్బాయిలు, అమ్మాయిలకు అయితే డిమాండ్ బాగుంది. అమ్మాయిల ప్యాకేజీల పైనా ఆరా.. అబ్బాయికి ఏడాదికి రూ.25 లక్షలు ప్యాకేజీ అయినంత మాత్రాన పదో తరగతి చదివిన అమ్మాయిని ఒప్పుకునే పరిస్థితి లేదు. ఉద్యోగం చేస్తున్న అమ్మాయిలకు, అదీ మంచి ప్యాకేజీతో వేతనం ఉన్న వారికి త్వరగా పెళ్లిళ్లు కుదురుతున్నాయి. ఉద్యోగం చేస్తున్న అమ్మాయిల విషయంలో కట్న కానుకలు రెండో ప్రాధాన్యత అంశంగా మారింది. కానుకల విషయంలో వెసులుబాటూ కలుగుతోంది. డాక్యుమెంట్లు చూపించండి ఆస్తులు, డబ్బే ఇప్పుడు పెళ్లిళ్లను కుదురుస్తున్నట్టుంది. ఆస్తులున్నట్టు చెబితే డాక్యుమెంట్లు అడుగుతున్న వారూ లేకపోలేదు. ఉమ్మడి ఆస్తులకు లెక్కచెప్పండి.. నీ వాటా ఎంత వస్తుంది, ఎప్పుడు పంచుకుంటున్నారు..మార్కెట్ వ్యాల్యూ ఎంత ఉంటుంది. ఇలాంటివన్నీ అడుగుతున్న పరిస్థితి. కొన్నిసార్లు ఇలాంటి ప్రశ్నలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. విదేశాల్లోనే వివాహ బంధాలు అమెరికా, కెనడాల్లో స్థిరపడిన అబ్బాయిలు, అమ్మాయిలు.. సమీప బంధువులు, మిత్రుల సహకారంతో అక్కడే పెళ్లిచూపులు పూర్తి చేస్తున్నారు. ఇక్కడి తల్లిదండ్రులు ఆస్తులు, ఇళ్లు, డబ్బు వగైరాలు ఆరా తీసి ఓకే చేస్తున్నారు. ఇలా అయితే ప్రత్యేకంగా హెచ్1 వీసాలు, డిపెండెంట్ వీసాలు అక్కర్లేదని అక్కడికక్కడే సంబంధం వెతుక్కుంటున్నారు. ఆడపడుచులు..అన్నదమ్ములు ఉంటే.. ఉమ్మడి కుటుంబమంటే పెళ్లి చూపులకు కూడా మొగ్గుచూపని పరిస్థితి నెలకొంది. చివరకు అబ్బాయి తరఫున ఆడపడుచులు ఎక్కువ మంది ఉన్నా ఇలాంటి వాటికి అమ్మాయి తరఫు వాళ్లు మక్కువ చూపడం లేదు. ‘ఇంతమందికి మా అమ్మాయి సేవలు చేయలేదు’ అని ముఖాన్నే చెప్పేస్తున్నారు. పెళ్లవగానే అబ్బాయి వేరు కాపురం పెడితేనే వస్తామనే అమ్మాయిలూ లేకపోలేదు. హోటళ్లలోనే పెళ్లిచూపులు కొన్ని సామాజిక వర్గాల్లో పెళ్లి చూపులు ఇంటివద్ద చేయడం లేదు. ఎక్కువ సంబంధాలు వచ్చి వెనక్కు వెళుతున్నాయన్న వంక చూపిస్తారని..హోటళ్లలోనే పెళ్లి చూపులు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇరువురూ మాట అనుకోవడం.. హోటల్‌కు రావడం కాఫీ తాగుతూ అబ్బాయి.. అమ్మాయి మాట్లాడుకోవడం. ఇదీ పెళ్లిచూపుల తంతు. ఎలాంటి హంగూ ఆర్భాటాలూ లేకుండా కాఫీతోనే పెళ్లిచూపులు ముగుస్తున్నాయి. ‘ప్యాకేజీ’కే ప్రాధాన్యం రెండు దశాబ్దాల కిందటితో పోలిస్తే ఇప్పుడు వధూవరులంతా ఏడాది వేతనాని (యాన్యువల్ సాలరీ ప్యాకేజీ)కే ప్రాధాన్యమిస్తున్నారు. ఈడు జోడు, జాతకాలు, ఇతరత్రాలు అన్నీ గొప్ప సంపాదన ముందు తక్కువే అని వధూవరులు భావిస్తున్నారు. కొంతమంది పిల్లలు మంచి కెరియర్ ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు – బత్తలపల్లి సత్య రంగారావు, వధూవరుల పరిచయ వేదిక పిల్లల అభిప్రాయాలదే చెల్లుబాటు మేము పాతికేళ్లుగా వివాహాలు చేయిస్తున్నాం. ముందు రోజుల్లో తల్లిదండ్రులు తెచ్చిన సంబంధాన్ని ఆలోచించకుండా ఒప్పుకునేవారు. ఇప్పుడు పిల్లల అభిప్రాయానికే తల్లిదండ్రులు ప్రాముఖ్యతను ఇస్తున్నారు. వివాహాది సంప్రదాయాలు కూడా పూర్తిగా మారిపోయాయి. అతి స్వేచ్ఛ వల్ల కూడా చాలా వివాహ బాంధవ్యాలలో ప్రతిబంధకాలు ఎదురవుతున్నాయి. –గరుడాద్రి సురేష్ శర్మ, పురోహితులు -
నూనె మళ్లీ మళ్లీ మరిగించొద్దు.. చెడు కొలెస్ట్రాల్‌తో గుండెకు ముప్పు.. ఇంకా..
సాక్షి, అమరావతి: వంద లీటర్ల నూనెను వినియోగించి వంట చేస్తే 25 లీటర్లు మిగులుతుంది. సాధారణంగా మిగిలిన నూనెను మళ్లీ మళ్లీ మరిగించి వంటకు వాడుతుంటారు. ఇలా చేయడం ఆరోగ్యానికి ఎంతో హానికరం. ఈ అంశంపై హోటళ్లు, రెస్టారెంట్ల యజమానులకు అవగాహన కల్పిస్తూ.. వాడిన వంట నూనెను బయోడీజిల్ తయారీ సంస్థలకు విక్రయించేలా రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ విభాగం చర్యలు తీసుకుంటోంది. ఇలా గత ఏడాదిలో 1,00,257 లీటర్ల వాడిన వంట నూనెను బయో డీజిల్ తయారీ ఏజెన్సీలకు సరఫరా అయ్యేలా చేశారు. రోజుకు 50 లీటర్లకు మించి వంట నూనెను వినియోగించే హోటళ్లు, రెస్టారెంట్లు, తినుబండారాల తయారీ సంస్థలు జాతీయ ఆహార భద్రత ప్రమాణాల ప్రాధికార సంస్థ(ఎఫ్ఎస్ఎస్ఏఐ)లో రిజిస్టరై ఉన్నాయి. ఇలా రిజిస్టరైన సంస్థలన్నీ ఒకసారి వాడిన నూనెను బయోడీజిల్ తయారీ సంస్థలకు విక్రయించాలని గతంలోనే ఉత్తర్వులు జారీ చేశారు. టీపీసీ 25 శాతానికి మించితే ఆరోగ్యం హుష్ మార్కెట్లో నూనెలు ఎక్కువగా వాడే ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, ఇతర ఆహార పదార్థాలకు అధిక డిమాండ్ ఉంటోంది. సాధారణంగా కంపెనీ నుంచి తయారై వచ్చిన నూనెలో టోటల్ పోలార్ కౌంట్ (టీపీసీ) 5 నుంచి 7 శాతం ఉంటుంది. ఆయిల్‌ను మరిగించే కొద్దీ టీపీసీ పెరుగుతూ ఉంటుంది. టీపీసీ మోతాదు 25 శాతానికి మించితే ఆరోగ్యానికి చాలా హానికరం. టీపీసీ మోతాదు పెరిగేకొద్దీ శరీరంలో ఫ్రీ రాడికల్స్ పెరుగుతాయి. దీనివల్ల రక్తనాళాలు గట్టిపడటం, అల్జీమర్స్, కాలేయ సంబంధ వ్యాధులు, హైపర్‌టెన్షన్ తదితర అనారోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తోంది. ఇలా వాడటం వల్ల స్థూలకాయం, గుండె జబ్బులు, మధుమేహం వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఏజెన్సీలే సేకరిస్తాయి రీయూజ్డ్ కుకింగ్ ఆయిల్ (రూకో) విభాగంలో బయోడీజిల్‌ను తయారు చేసే అనుమతులు ఉన్న ఏజెన్సీలు గుంటూరు, విశాఖ, కాకినాడ నగరాల్లో ఐదు ఉన్నాయి. ఈ ఏజెన్సీలు రాష్ట్రవ్యాప్తంగా పలు నగరాలు, పట్టణాల్లో వాడిన వంట నూనెను సేకరిస్తున్నాయి. ఏజెన్సీల నిర్వాహకులే హోటళ్లు, రెస్టారెంట్ల వద్ద ఖాళీ డబ్బాలను అందుబాటులో ఉంచుతారు. ఆ డబ్బాల్లోకి వాడిన నూనెను నింపి సమాచారం ఇస్తే తీసుకునివెళతారు. మార్కెట్లో నూనె ధరలకు అనుగుణంగా సేకరించే వాడిన నూనెకు ఏజెన్సీలు డబ్బు చెల్లిస్తాయి. ప్రస్తుతం లీటర్‌కు రూ.40 నుంచి రూ.50 వరకూ చెల్లిస్తున్నారు. రెండోసారి వాడితే చెడు కొలెస్ట్రాల్ తప్పదు నూనెను ఒకసారి ఉపయోగిస్తే అందులోని పోషకాలు మొత్తం మనం వాడుకున్నట్టే. తిరిగి ఆ నూనెను వేడి చేస్తే అది చెడు కొలెస్ట్రాల్‌గా మారుతుంది. చెడు కొలెస్ట్రాల్ గుండె ఆరోగ్యానికి హాని చేస్తుంది. నూనెల్ని రెండోసారి వాడితే గుండె జబ్బులే కాకుండా ఉదరకోశ, అన్నవాహిక క్యాన్సర్లు వచ్చే ప్రమాదం కూడా ఉంది. ఒకసారి వాడిన నూనెను తిరిగి ఉపయోగిస్తే.. ఆహారం విషతుల్యమవుతుంది. దీనిని భుజిస్తే కడుపులో మంట, కడుపులో నొప్పి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. -
ఆకలైతుందా.. తినేసిపో! అంతేరా! దా–తిను!
రెస్టారెంట్ల వ్యాపారంలోకి దిగుతున్నవారు.. భోజన ప్రియుల్ని, ఇంట్లో వంటకు విరామం ఇచ్చి వెరైటీగా హోటల్లో తిందామనుకుని వచ్చే వారిని ఆకర్షించేందుకు చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. హంగులు, ఆర్భాటాలతో మెప్పించేవారు కొందరైతే, వినూత్నమైన ఆలోచనలతో థీమ్ బేస్డ్ రెస్టారెంటుల ఏర్పాటు వైపు మరికొందరు మొగ్గుచూపుతున్నారు. ఇంకొందరు మాత్రం..తమ రెస్టారెంట్లు, టేక్ అవేలు, కర్రీ, బిరియానీ పాయింట్లకు..ప్రత్యేక ప్రాంతం, వంటకం, రుచి, అంకెలు, అక్షరాలు ఆధారంగా పేర్లు పెట్టేస్తున్నారు. మనం రోజువారీ ఉపయోగించే కొన్ని పదాలు, వాక్యాలు కూడా రెస్టారెంట్ల పేర్లుగా మారిపోతున్నాయి. వీటిల్లో కొన్ని సరదాగా ధ్వనించే, నవ్వు పుట్టించే పేర్లు కూడా ఉంటుండటం గమనార్హం. గ్రేటర్ హైదరాబాద్‌లో ఈ తరహా ట్రెండ్ ఇటీవల బాగా పెరిగిపోయింది. – సాక్షి, సిటీడెస్క్ ఉడిపి, విలాస్, మిలటరీ స్థానంలో.. ► గతంలో చాలా హోటళ్లకు అన్నపూర్ణ, అజంతా లాంటి సాధారణ పేర్ల తర్వాత ఉడిపి అనో, విలాస్ అనో, మిలటరీ హోటల్ అనో ఉండేది. దేవుళ్లు, కుటుంబసభ్యులు, పిల్ల లు, పెద్దల పేర్లు, ఇంటిపేర్లు కలిసొచ్చేలా పెట్టేవారు. ఇప్పుడ లాంటి పేర్లకు చాలావరకు కాలం చెల్లింది. కొత్త, వింతైన, సరదా పేర్లదే హవా. గ్రేటర్ హైదరాబాద్‌లో అలాంటి పేర్ల మీద ఓ లుక్కేద్దామా.. అన్ని రుచులూ ఇక్కడే.. ఉప్పు కారం (కొండాపూర్), పెప్పర్ అండ్ సాల్ట్ (షేక్‌పేట్), సిల్వర్ సాల్ట్ (బంరాహిల్స్), సాల్ట్ అండ్ పెప్పర్ (లక్డీకాపూల్), టామరిండ్ ట్రీ (చింతచెట్టు (సికింద్రాబాద్), టామరిండ్ (మణికొండ), రాయలసీమ రుచులు (చాలాచోట్ల ఉంది), తెలు గింటి రుచులు (కూకట్పల్లి), రాజుగారి రుచులు (కొత్తగూడ), గోదావరి రు చులు (జూబ్లీహిల్స్), నెల్లూరు రుచులు (మోతీనగర్), రాయలవారి రుచులు (యూసుఫ్‌గూడ), కోనసీమ వంటిల్లు (కూకట్పల్లి), కృష్ణపట్నం (బంజారాహిల్స్), సింప్లీ సౌత్ (జూబ్లీహిల్స్), సింప్లీ తెలంగాణ (కొత్తపేట్), మా పల్లె వంటకాలు (గచ్చిబౌలి). వంటకాలనూ వదలకుండా.. కోడికూర–చిట్టిగారె (జూబ్లీహిల్స్, కొండాపూర్), దిబ్బరొట్టి (మణికొండ), రాజుగారి పులావ్, పొట్లం పులావ్ (శ్రీనగర్ కాలనీ), పకోడా పాపారావు (కేపీహెచ్‌బీ ఫేజ్–1), ఉలవచారు (జూబ్లీహిల్స్), ముద్దపప్పు ఆవకాయ అండ్ మోర్ (గచ్చిబౌలి), నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు (కేపీహెచ్‌బీ, మణికొండ), పంచెకట్టు దోశ (ప్రగతినగర్), పులిహోరాస్ (మణికొండ), బిరియానీ వాలా, బిర్యానీ హౌస్ (బంజారాహిల్స్), కిచిడీ ఎక్స్‌ప్రెస్ (మాదాపూర్). ఆహా.. ఏమి పేర్లు.. ► వివాహ భోజనంబు (సికింద్రాబాద్, బంజారాహిల్స్), వియ్యాలవారి విందు (కొత్త పేట్), అద్భుత: (దిల్సుఖ్నగర్), తినే సిపో (కొంపల్లి), తిన్నంత భోజనం (ఉప్ప ల్, సికింద్రాబాద్), దా–తిను (హఫీజ్‌పేట), పొట్ట నింపు (గుండ్ల పోచంపల్లి), కడుపు నిండా (ఉప్పల్), భలే బంతి భోజనం (మియాపూర్), రా బావా తిని చూడు (కూకట్పల్లి), సెకండ్ వైఫ్, పందెం కోడి (వెంగళరావునగర్), అంతేరా (జూబ్లీహిల్స్), ఆకలైతుందా?.. పంచభక్ష్య (కూకట్పల్లి), మాయా బజార్ (కార్ఖానా), పందెం కోడి (వెంగళరావునగర్), విలేజ్ వంటకాలు, ఆహా (షేక్‌పేట), పాకశాల (కూకట్పల్లి), విస్తరాకు, అరిటాకు భోజనం (అమీర్‌పేట), లలితమ్మగారి భోజనం (బంజారాహిల్స్), బాబాయ్ భోజనం (నేరేడ్మెట్), తాళింపు (అమీర్‌పేట), గోంగూర (బంజారాహిల్స్), ఘుమఘుమలు (మాదాపూర్). ప్రాంతీయతకు ప్రతిరూపం..‘అంతేరా’ రెస్టారెంట్ ప్రారంభించాలనుకున్నప్పుడు ప్రాంతీయత ప్రతిబింబించేలా పేరు పెట్టాలనుకున్నాం. ఏదో ఒక ప్రాంతానికి పరిమితం కాకుండా ’ఆంధ్రా తెలంగాణ రాయలసీమ’ సమ్మేళనంతో ఆ పేర్ల లోని మొదటి అక్షరాలతో ‘అంతేరా’పేరును ఎంచుకున్నాం. ఈ మూడు ప్రాంతాల రుచులను అందిస్తున్నాం. – నిర్వాహకులు,అంతేరా రెస్టారెంట్ థీమ్‌తో ఫామ్‌లోకి.. ► కొందరు నిర్వాహకులు థీమ్/కాన్సెప్ట్ బేస్డ్ రెస్టారెంట్లు ఏర్పాటు చేస్తూ భోజనప్రియుల్ని ఆకర్షిస్తున్నారు. రైలు, గుహలు, అడవులు, పల్లె వాతావరణం, జైళ్లు, బీచ్ ఆధారంగా చేసుకుని రెస్టారెంట్లు వెలుస్తుండటం గమనార్హం. గుహను తలపించేలా ఏర్పాటు చేసిన గుఫా ఓహ్రీస్ (బషీర్‌బాగ్), అడవి వాతావరణాన్ని తలపించేలా ఏర్పా టు చేసిన మారేడుమిల్లి (గచ్చి బౌలి), జైలును గుర్తుకు తెచ్చే జైల్ మండి (చాలాచోట్ల ఉంది).. ఖైదీ కిచెన్ (బంజారాహిల్స్), రైల్లో ఉన్నట్టుగా ఉండే జర్నీ 1853 (బంజారాహిల్స్) ఈ కోవలోనివే. ఇక బొమ్మ రైలు మీద భోజనం రావడం (ప్లాట్‌ఫామ్ 65), రోబో ఆహారం సర్వ్ చేయడం (రోబో కిచెన్, జూబ్లీహిల్స్) లాంటి ప్రత్యేకతలతో కూడిన రెస్టారెంట్లు కూడా నగరంలో వెలిసి కస్టమర్లను అలరిస్తున్నాయి. వియ్యాలవారి విందు. బహు పసందు మా హోటల్లో అన్నీ ప్రత్యేక వంటకాలే. తెలుగు రుచులు మా సొంతం. వెరైటీగా ఉంటుందని వియ్యాలవారి విందు పేరు పెట్టాం. అందరూ వియ్యాల వారిని ఏ లోటు లేకుండా ఎలా చూసుకుంటారో అదే తరహాలో ఆతిథ్యం ఇస్తున్నాం. – సీహెచ్ఆర్వీ నర్సింహారెడ్డి, వియ్యాల వారి విందు నిర్వాహకుడు బావలకు ఇచ్చే మర్యాదే ఇస్తాం ఇంటికి వచ్చిన బావకి ఏ విధంగా మర్యాద చేస్తారో అదే విధంగా మా హోటల్‌కు వచ్చినవారికి ఇస్తాం. ఈ ఆలోచనతోనే ‘రా బావా.. తిని చూడు’అని మా హోటల్‌కి పేరు పెట్టాం. – రామకృష్ణారెడ్డి, ‘రా బావ తిని చూడు’యజమాని అక్షరాలు, నంబర్లు.. ► మండీ 36 (జూబ్లీహిల్స్), 1980 మిలటరీ హోటల్ (మణికొండ, సైనిక్‌పురి),అంగారా 5 (బంజారాహిల్స్), శ్యాల 95ఏ (మాదా పూర్), వై2కే (పంజగుట్ట), ఎన్ గ్రాండ్ (కార్ఖానా), ఎం గ్రాండ్ (వనస్థలిపురం), బీ ప్లేస్ (అయ్యప్ప సొసైటీ), డీ కార్పెంటర్ (మాసబ్‌ట్యాంక్), ఏ2జెడ్ (జీడిమెట్ల). కడుపారా ’తిన్నంత భోజనం’.. ‘తిన్నంత భోజనం’లో ఆత్మీయత, అనుబంధం కనిపిస్తుంది. మా వద్దకు వచ్చే కస్టమర్ మాకు బంధువుతో సమానం. చుట్టాల ఇంటికి వెళితే కడుపు నిండా అన్నం పెట్టి తమ ప్రేమను చాటుకుంటారు. మా రెస్టారెంట్‌కు వచ్చినా అంతే. – గాంధీ మిర్యాల, తిన్నంత భోజనం వ్యవస్థాపకులు -
ప్రీమియం హోటళ్లకు డిమాండ్
ముంబై: ప్రీమియం హోటళ్లకు డిమాండ్ సానుకూలంగా ఉన్నట్టు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదా యం 80 శాతం పెరుగుతుందని క్రిసిల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెలిపింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2023–24) 15–20 శాతం మేర ఆదాయం పెరగొచ్చని అంచనా వేసింది. విహార, కార్పొరేట్, సమావేశాలు, సదస్సులు, ఎగ్జిబిషన్లు, అంతర్జాతీయ ప్రయాణాలతో హోటళ్ల బుకింగ్‌లు అధికంగా ఉన్నాయని, ప్రమీఇయం హోటళ్లకు దశాబ్దంలోనే గరిష్ట అక్యుపెన్సీకి చేరుకున్నట్టు ఈ నివేదిక వెల్లడించింది. అధిక డిమాండ్, రూమ్ రేట్లు పెరగడం, ఉద్యోగుల క్రమబద్ధీకరణ ఇవన్నీ కలసి, ప్రస్తుత, వచ్చే ఆర్థిక సంవత్సరాల్లో ఆదాయ వృద్ధిని నడిపిస్తాయని తెలిపింది. సగటు రూమ్ ధరలు కరోనా ముందు నాటి స్థాయికి చేరాయని, ఆపరేటింగ్ మార్జిన్లు రికార్డు స్థాయికి చేరుకున్నాయని, రూమ్‌ల వారీ ఉద్యోగుల రేషియో తగ్గ డం ఇందుకు మద్దతుగా నిలుస్తోందని వివరించింది. రూమ్ ధరల పెరుగుదల ‘‘ప్రీమియం హోటళ్లలో సగటు రూమ్ ధరలు (ఏపీఆర్) 2021–22లో 13 శాతం పెరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 19–21 శాతం మేర పెరిగి దశాబ్ద గరిష్ట స్థాయి అయిన రూ.7,500– 10,000కు చేరాయి. అక్యుపెన్సీ (రూముల భర్తీ) 2021–22లో 50 శాతంగా ఉంటే, అది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దశాబ్ద గరిష్టమైన 67–72 శాతానికి ఎగిసింది’’అని క్రిసిల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ పుషన్ శర్మ తెలిపారు. అయితే, ప్రీమియం హోటళ్లకు డిమాండ్ పెరిగినప్పటికీ, విదేశీ పర్యాటకుల రాక కరోనా ముందు నాటి స్థాయికి ఇంకా చేరుకోలేదని ఈ నివేదిక పేర్కొంది. పర్యాటక శాఖ గణాంకాల ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల్లో 54 లక్షల మంది విదేశీ పర్యాటకులు భారత్‌ను సందర్శించడం గమనార్హం. కరోనా ముందున్న సంఖ్యతో పోలిస్తే ఇది 70 శాతమే. బడ్జెట్ హోటళ్లు.. బడ్జెట్ హోటళ్లలో సగటు రూమ్ ధరలు (ఏఆర్ఆర్) కరోనా ముందున్న నాటి కంటే 20 శాతం పెరిగినట్టు క్రిసిల్ నివేదిక తెలిపింది. ప్రీమియం హోటళ్ల వ్యాప్తంగా వృద్ధి రేటు ఒకే మాదిరిగా లేదని, విహార పర్యటనలకు సంబంధించి అక్యుపెన్సీ 70–75 శాతంగా ఉందని, అలా కాకుండా వ్యాపార పర్యటనల అక్యుపెన్సీ 65–70గా ఉన్నట్టు తెలిపింది. 2020–22 మధ్య హోటళ్లలో రూమ్ వారీ ఉద్యోగుల రేషియో 20–30 శాతానికి తగ్గినట్టు, డిమాండ్ పెరిగినప్పటికీ వ్యయాల సర్దుబాటును హోటళ్లు కొనసాగిస్తున్నట్టు పేర్కొంది. -
ఫుడ్ పాయిజన్‌తో నర్సు మృతి.. 429 హోటళ్లపై రైడ్..
తిరువనంతపురం: కేరళలో హోటళ్లపై ఆహార భద్రత శాఖ కొరడా ఝులిపించింది. రాష్ట్రవ్యాప్తంగా 429 హోటళ్లపై రైడ్లు నిర్వహించింది. నిబంధనలు పాటించని 43 హోటళ్లను మూసివేసింది. కొట్టాయంలో ఓ ఈవెంట్‌కు హాజరైన నర్సు అక్కడ ఆహారం తిని అస్వస్థతకు గురై చనిపోయింది. ఫుడ్ పాయిజన్ కారణంగానే ఆమె మరణించి ఉంటుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ఆహార భద్రత శాఖ అప్రమత్తమై హోటళ్లపై మంగళవారం దాడులు చేసింది. మూసివేసిన 43లో 21 హోటళ్లకు లెసెన్సులు లేవని అధికారులు తెలిపారు. మిగతా 22 హోటళ్లు పరిశుభ్రత పాటించడం లేదని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని హోటళ్లలో తనిఖీలు నిర్వహిస్తామని చెప్పారు. డిసెంబర్ 29న ఓ ఈవెంట్‌కు హాజరైన 100 మంది అస్వస్థకు గురయ్యారు. వివిధ ఆస్పత్రుల్లో చేరి చికిత్స తీసుకున్నారు. దీనిపై అధికారులు ఆరా తీయగా.. ఓ హోటల్ నుంచి వచ్చిన ఆహారం తిని వీరికి ఫుడ్ పాయిజన్ అయినట్లు గుర్తించారు. దీంతో రాష్ట్రంలోని హోటళ్లపై రైడ్లు చేయాలని ఆరోగ్యమంత్రి వీణా జార్జ్ అధికారులను ఆదేశించారు. చదవండి: అంజలి కారు కింద పడితే చూసి పారిపోయావ్.. నువ్వేం ఫ్రెండ్‌వి? -
రెస్టారెంట్లో బిర్యానీ తింటున్నారా?.. అయితే మీకో చేదు వార్త
కర్నూలు: జిల్లాలోని పలు రెస్టారెంట్లు, హోటళ్లలో పాచిపోయిన ఆహార పదార్థాలను వేడి చేసి వడ్డిస్తున్నట్లు తేలింది. బార్ అండ్ రెస్టారెంట్లు, హోటళ్లలో ఆహార పదార్థాల నాణ్యతపై ఫిర్యాదుల నేపథ్యంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ డాక్టర్ శంకబ్రత బాగ్చి ఆదేశాల మేరకు.. ఆ విభాగం కర్నూలు ప్రాంతీయ అధికారి తిరుమలేశ్వరరెడ్డి నేతృత్వంలో శనివారం కర్నూలు జిల్లాలోని పలు రెస్టారెంట్లు, బార్లు, హోటళ్లలో అధికారులు నిర్వహించిన తనిఖీల్లో పలు అక్రమాలు వెలుగుచూశాయి. కుళ్లిన కూరగాయలు వినియోగించడం, పాచిపోయిన ఆహారాన్ని వేడి చేసి వడ్డిస్తున్నట్లు గుర్తించారు. వంటశాలలు అపరిశుభ్రంగా ఉన్నాయి. మాంసాహార పదార్థాలు రోజుల తరబడి ఫ్రిజ్‌లో ఉంచి అవసరమైనప్పుడు తీసి ఉడికించడం, లేదంటే వేడి చేసి మసాలాలు, రంగులు కలిపి రుచికరంగా తయారు చేసి అందిస్తున్నట్లు గుర్తించి పలు హోటళ్లు, రెస్టారెంట్లకు జరిమానాలు విధించారు. విజిలెన్స్ అధికారులతో పాటు ఫుడ్ సేఫ్టీ, తూనికలు కొలతలు, శానిటరీ సిబ్బంది తనిఖీల్లో పాల్గొన్నారు. డీఎస్పీ సుధాకర్‌రెడ్డి, సీఐలు నాగరాజు యాదవ్, కేశవరెడ్డి, ఏఏఓ షణ్ముఖ గణేష్, ఏజీ సిద్ధయ్య, ఎఫ్ఎస్ఓ శేఖర్‌రెడ్డి, రాముడు, తూనికలు కొలతల శాఖ అధికారి కుమార్, అనిల్ తదితరులు బృందాలుగా ఏర్పడి కర్నూలుతో పాటు కోడుమూరు, ఎమ్మిగనూరు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. కర్నూలులోని ల్యాటిట్యూడ్ రెస్టారెంట్లో ముందు రోజు వండిన ఆహార పదార్థాలు ఫ్రిజ్‌లో పెట్టి అవసరమైనప్పుడు వేడి చేసి వినియోగదారులకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. అలాగే రెడ్ ఫుడ్ కలర్ వాడినట్లు గుర్తించి రూ.5 వేలు జరిమానా విధించారు. అలాగే కర్నూలులోని మసాలా బౌల్ హోటల్, నాగార్జున పార్క్ లేన్ బేకర్స్‌లో వంటశాల అపరిశుభ్రంగా ఉండడంతో రూ.5 వేలు చొప్పున జరిమానా విధించారు. బావార్చీ మల్టీ రెస్టారెంట్లో ముందు రోజు వండిన ఆహార పదార్థాలు ఫ్రిజ్‌లో ఉంచి వేడిచేసి వినియోగిస్తున్నందుకు రూ.10 వేలు, అనిల్ బార్ అండ్ రెస్టారెంట్లో సరైన శుభ్రత లేని కారణంగా రూ.5 వేలు అపరాధ రుసుం విధించారు. అలాగే కోడుమూరు రెడ్డీస్ హోటల్లో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు వాడుతున్నట్లు గుర్తించి 6ఏ కేసు నమోదు చేశారు. అలాగే కోడుమూరులోని శివ హోటల్లో వాటర్ బాటిళ్లు ఎంఆర్పీ కంటే రూ.5 అధికంగా విక్రయిస్తున్నట్లు గుర్తించి తూనికలు కొలతల శాఖ అధికారులు రూ.2 వేలు ఫైన్ వేశారు. ఎమ్మిగనూరులోని అమృత బార్ అండ్ రెస్టారెంట్, గ్రాండ్ మహల్ హోటళ్లలో వంటశాలలు అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించి రూ.10 వేలు, రూ.2 వేలు అపరాధ రుసుం విధించారు. చదవండి: చదివింది ఏడో తరగతి.. వామ్మో ఈమె మామూలు లేడీ కాదు.. షిఫ్ట్ కారులో వచ్చి.. -
Hyderabad: సిటీలో కొత్త ట్రెండ్.. ‘వర్కేషన్’ అంటే ఏంటో తెలుసా?
సాక్షి, హైదరాబాద్: నగరంలోని కొండాపూర్‌లో నివసించే కార్పొరేట్ ఉద్యోగి వర్థన్.. గత ఏడాదిగా గోవా, మధురై, కేరళలలో ప్రకృతి అందాలను సతీసమేతంగా ఆస్వాదిస్తున్నారు. కనీసం 15 నుంచి 20 రోజుల వ్యవధి ఉండే ట్రిప్ పూర్తయిన తర్వాత నగరానికి రావడం ఓ వారం పదిరోజులు గడపడం ఆ వెంటనే మరో టూర్.. దీనిని బట్టి ఆయనను మనం వర్క్‌కి బంక్ కొట్టే వెకేషన్ లవర్‌గా భావిస్తాం. కానీ ఆయన ఆస్వాదిస్తోంది వర్కేషన్. పిక్నిక్లోనూ పనిచేసే విధానం. ట్రావెల్ కంపెనీ బుకింగ్ డాట్ కామ్ సర్వే ప్రకారం గత ఏడాదిలోనే 68 శాతం మంది భారతీయ ప్రయాణికులు రాబోయే సంవత్సరానికి తమ వర్కేషన్స్‌ను బుక్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో పర్వత ప్రకృతి దృశ్యాలు బ్యాక్‌డ్రాప్‌గా వర్క్స్టేషన్ల పోస్ట్‌లు..బీచ్‌లకు ఆనుకుని ఉన్న గది ఇన్‌స్టా రీల్స్‌తో సోషల్ మీడియా పని–ప్రకృతి ప్రేమికుల వేదికగా మారింది. వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి వర్కేషన్ దాకా కోవిడ్ దెబ్బకు కార్పొరేట్ ఉద్యోగుల పనితీరు ఆన్లైన్ వర్క్, వర్క్ ఫ్రమ్ హోమ్, హైబ్రిడ్/రిమోట్ వర్కింగ్ సిస్టమ్...ఇలా రూపాంతరం చెందుతూ ఇప్పుడు వర్కేషన్‌గా ఊపందుకుంది. ‘ఇంటి నుంచి కాకుండా ఇష్టమైన టూర్లో ఉంటూ వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తూనే అసైన్డ్ ప్రాజెక్టులను పూర్తి చేయడమనే వర్కింగ్ ట్రెండ్‌నే వర్కేషన్’గా పేర్కొంటున్నారు. ఈ వర్కేషన్ ప్రియుల్ని డిజిటల్ నోమాడ్స్‌గా పిలుస్తున్నారు. టీసీఎస్, ఇన్ఫోసిస్, అన్ అకాడమీ తదితర కార్పొరేట్ సంస్థలు ‘నిరవధిక వర్క్ ఫ్రమ్ హోమ్’ ప్రకటన తర్వాత ఈ ట్రెండ్ బాగా ఊపందుకుంది. వర్క్‌తో పాటే విందు, వినోదం ‘మా రిసార్ట్స్‌లో 80 శాతం వరకూ వర్కేషన్కు అనువుగా మార్చాం. బెస్ట్ వైఫై నెట్ వర్క్, ఫుడ్ ప్రీ ఆర్డర్స్ పెద్దలు పని టైమ్‌లో పిల్లల కోసం హ్యాపీ హబ్స్ ఎంటర్టైన్మెంట్ జోన్స్ ఏర్పాటు చేశాం’ అంటూ క్లబ్ మహీంద్రా రిసార్ట్స్ ప్రతినిధి చెప్పారు. కరావొకే లాంటి సరదా సంగీతాల ఈవెంట్స్‌తో పాటు సర్ఫింగ్, కయాకింగ్, స్టాండప్ పాడ్లింగ్, స్కీయింగ్, స్పిన్నింగ్, స్కేటింగ్ వంటివి వర్క్‌తో పాటు ఎంజాయ్ చేస్తున్నారు. రిషికేశ్, ధర్మశాల, కేరళ, కూర్గ్, గోవా తదితర ప్రాంతాలు నగర వర్కేషన్ ప్రియుల ఎంపిక జాబితాలో టాప్‌లో ఉన్నాయని ట్రావెల్ ఆపరేటర్ మీర్ చెప్పారు. నగరానికి చెందిన ఓ కంపెనీలో స్ట్రాటజీ హెడ్ గా పనిచేస్తున్న సూర్య తేజ గత రెండేళ్లుగా వారణాసి నుంచి గోవా..మధురై వరకు 65,000 కి.మీ ప్రయాణించాడు, మరి అత్యవసర పరిస్థితుల్లో ఎలా? అంటే సమాధానంగా సూర్య ఏమంటారంటే ‘గత 2021 అక్టోబర్‌లో నేను కేరళలోని, అరూకుట్టిలోని ఓ రిసార్ట్స్‌లో కయాకింగ్ యాక్టివిటీలో బిజీగా ఉంటూనే ఆన్లైన్ మీటింగ్‌కు హాజరయ్యా. కయాకింగ్ లాంటి యాక్టివిటీస్‌కి వెళ్లినప్పుడు నా వెంట వాటర్‌ప్రూఫ్ బ్యాగ్ తప్పనిసరిగా ఉంటుంది’ అంటూ చెప్పడం పనితో పిక్నిక్ని కలిపిన వైనానికి అద్దం పడుతుంది. ఇటీవల బాగా పాపులరయిన వాటిలో డే కేషన్స్, వర్కేషన్స్. వీటికి అనుగుణంగా మేం మా ట్రావెల్ ప్యాకేజ్‌లను డిజైన్ చేస్తున్నాం. అడ్వంచర్ యాక్టివిటీస్, నేచర్ వాక్స్, ఇగ్లూ స్టేయింగ్, హార్స్ రైడింగ్, చెట్ల మీద విందు, ఎటివి బైక్స్, పెయింట్ బాల్... ఫ్యామిలీతో సహా వచ్చేవారికి అనుగుణంగా తీర్చిదిద్దాం. మా సభ్యుల్లో దక్షిణాది నుంచి 30 శాతం ఉంటే అందులో హైదరాబాద్ వాటా పెద్దదే. –ప్రతినిధి, క్లబ్ మహేంద్రా హాలిడేస్– రిసార్ట్స్ -
ఎస్పైర్ హాస్పిటాలిటీ విస్తరణ
ముంబై: ఆతిథ్య రంగ కంపెనీ ఎస్పైర్ హాస్పిటాలిటీ గ్రూప్ విస్తరణ బాట పట్టింది. ఇందుకు అనుగుణంగా రానున్న నాలుగేళ్లలో రూ. 550 కోట్లవరకూ ఇన్వెస్ట్ చేయనున్నట్లు తెలియజేసింది. విస్తరణకుతోడు బిజినెస్‌ల ఆధునీకరణను సైతం చేపట్టనున్నట్లు పేర్కొంది. ఈ బాటలో 2023కల్లా 20 హోటళ్లు, 700కుపైగా గదులను జత కలుపుకోవాలని ప్రణాళికలు వేసినట్లు గ్రూప్ సీవోవో అఖిల్ అరోరా వెల్లడించారు. అన్ని బ్రాండ్లనూ కలుపుకుని ప్రస్తుతం 318 గదులను కలిగి ఉన్నట్లు తెలియజేశారు. తాజా పెట్టుబడులను ప్రస్తుత హోటళ్ల ఆధునీకరణ, లీజింగ్ తదితరాలకు సైతం వినియోగించనున్నట్లు వివరించారు. ఉత్తరాఖండ్‌లోని జిమ్‌కార్బెట్, భిమ్టాల్తోపాటు, పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో హోటళ్లను నిర్వహిస్తోంది. ఉదయ్‌పూర్‌లో తొలిసారి జానా లగ్జరీ ఎస్కేప్స్ పేరుతో హోటల్‌ను ఏర్పాటు చేసింది. -
మీరు తింటున్న చికెన్ బిర్యానీలో ఏముందో తెలుసా?.. భయంకర వాస్తవాలు
సాక్షిప్రతినిధి, కర్నూలు: మనం తింటున్న బిర్యానీలో మెటానియల్ ఎల్టో, టార్ట్రాజిన్ అనే రసాయనాలు కలుపుతున్నారు. దీంతో పాటు టేస్టింగ్‌సాల్ట్ (చైనాఉప్పు) తప్పనిసరి. వీటి వినియోగంతో బిర్యానీలో మంచి రుచి, రంగు వస్తోంది. కానీ వరుసగా 40 రోజులు తింటే కీళ్లనొప్పులు, జీర్ణ సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. ►రెస్టారెంట్లకు వెళ్లినా, డిన్నర్లకు వెళ్లినా ఐస్‌క్రీం తినడం తప్పనిసరి. చివరకు ఫ్యామిలీ ప్యాక్‌లను ఇళ్లలో ఫ్రిజ్‌లలో ఉంచి తింటున్నారు. వీటిలో కొవ్వుశాతం మరీ తక్కువగా ఉన్న పాలను వినియోగించడంతో పాటు టార్ట్రాజిన్, రంగులు కలుపుతారు. ఐస్‌క్రీం గడ్డకట్టేందుకు రసాయనాలు వినియోగిస్తారు. పిల్లలకు ఎంతో ప్రేమతో వీటిని తినిపిస్తుంటాం. ఇవి ప్రాణాంతక వ్యాధులను తెచ్చిపెట్టే అవకాశం ఉంది. ►దీర్ఘకాలం బేకరీలలో సిల్వర్ పూతతో ఉండే స్వీట్లు తింటే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. సిల్వర్ పూతలో సీసం ఎక్కువగా ఉంటుంది. స్వీట్లలో వాడే సన్‌సెటన్, కాట్రాజ్, బ్రిలియంట్ ఎల్లో, టార్ఫిజిన్ కూడా హానికరమే. ►ఆపిల్ ఎక్కువ కాలం నాణ్యంగా ఉండేందుకు కంటికి కనిపించని మైనపుపూత పూస్తారు. అలాగే పురుగుమందులు పిచికారీ చేస్తారు. శుభ్రం చేయకుండా తింటే వీటితో కూడా ఆరోగ్య సమస్యలు రావడం ఖాయం ►రోడ్డు సైడ్ తయారు చేసే పానీపూరి, గోబీతో పాటు అన్ని రకాల వంటల్లో టేస్టింగ్‌సాల్ట్, ఇతర రసాయనాలు కలుపుతున్నారు. రుచికోసం, మంచి రంగు కోసం, ఎక్కువ కాలం నిల్వ కోసం ఇలాంటి వాటిని వాడుతున్నారు. ఈ ఆహార పదార్థాలు తిన్న వారు ప్రమాదకర జబ్బుల బారిన పడుతున్నారు. ►ఆహార పదార్థాల అమ్మకం, వినియోగం జాతీయ ఆహార భద్రతా ప్రమాణాలకు విరుద్ధంగా జరుగుతోంది. ఆహార భద్రతా వ్యవస్థ వైఫల్యంతో కల్తీలకు అడ్డుపడటం లేదు. ఉమ్మడి జిల్లాలో 2018–19లో ఫుడ్‌సేప్టీ’(ఆహార భద్రత) అధికారులు 374 శాంపిల్స్ సేకరించి, 54 నాణ్యతలేనివిగా తేల్చారు. అలాగే 36 శాంపిల్స్ ఆరోగ్యానికి తీవ్ర హానికరమైనవిగా తేల్చి కేసులు నమోదు చేశారు. 2020–21లో 175 శాంపిల్స్ సేకరిస్తే ఐదు నాణ్యత లేనివని, ఎనిమిది నకిలీవని, ఒకటి హానికరమని తేల్చారు. 2021–22లో 313 శాంపిల్స్ తీస్తే ఇందులో ఐదు నాణ్యత లేనివి, రెండు ప్రమాదకరమైనవి, నాలుగు నకిలీవి ఉన్నట్లు నిర్ధారించారు. ఉమ్మడి జిల్లాలో చిన్నా పెద్దా హోటళ్లు, రెస్టారెంట్లు, డాబాలు, చాట్, నుడుల్స్ షాపులు అన్ని కలుపుకుని ఆరు వేలకు పైగా ఉన్నాయి. కర్నూలు నగరంలోనే 1500 దాకా ఉన్నాయి. వీటి ద్వారా ప్రతి సంవత్సరం కోట్లాది రూపాయల వ్యాపారం జరుగుతోంది. ఆహారానికి సంబంధించిన అన్ని వ్యాపారాలకు ఆహార పరిరక్షణ, నాణ్యత ప్రమాణాల సంస్థ లైసెన్స్ మంజూరు చేయాలి. ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం నడుస్తున్న చిన్న, మధ్యతరగతి హోటళ్లలో 20 శాతానికి మించి అనుమతులు లేవు. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఫుడ్‌సేప్టీ అధికారుల సంఖ్య తక్కువగా ఉంది. దీంతో తనిఖీలు, కేసుల నమోదుకు ఇబ్బందిగా మారింది. కేసులు నమోదు చేస్తే చార్జ్‌షీటు నుంచి కోర్టు కేసుల వరకూ తిరిగేందుకు కూడా సిబ్బంది లేరు. దీంతో కేసుల నమోదుకు ఈ శాఖ కూడా ఆసక్తి చూపడటం లేదు. నిబంధనల మేరకు ఏడాదికి నిర్వహించాల్సిన మేరకు శాంపిల్స్ తీసి మ.మ. అనిపిస్తున్నారు. రోజుల తరబడి నిల్వ.. ఫుడ్‌సేప్టీ అధికారులు పలు మండీల్లోని పండ్లు ల్యాబ్‌కు పంపారు. ఇందులో 13 శాంపిల్స్ ప్రమాదరకంగా తేల్చారు. ఇందులో ఆపిల్, ద్రాక్ష, దానిమ్మ, సపోటతో పాటు పలు రకాల పండ్లు ఉన్నాయి. పండ్లు మాగేందుకు వాడే రసాయనాలతో క్యాన్సర్ వచ్చే ప్రమాదముంది. అలాగే కొన్ని హోటళ్లు, రెస్టారెంట్లలో చికెన్, మటన్, రొయ్యలు, చేపలతో పాటు పలు రకాల పదార్థాలు రోజుల తరబడి నిల్వ ఉంటాయి. వాటికి కలర్‌కోటింగ్ ఇచ్చి రుచి కోసం రసాయనాలు కలిపి విక్రయిస్తున్నారు. బేకరీల్లో స్వీట్లు, కేక్‌లకు వాడే రంగులు, వాటిపై వాడే వెండిపూత అనారోగ్యానికి గురిచేస్తున్నాయి. కొన్ని స్వీట్లు నోట్లో పెట్టుకోగానే వాసన వస్తుంది. కొన్ని రసాయనాలను ప్రభుత్వం నిషేధించినా రెండు జిల్లాలోని అన్ని పట్టణ ప్రాంతాల్లో అందుబాటులో ఉన్నాయి. గాలి, వెలుతురు ఉన్న రెస్టారెంట్లు, హోటళ్లకు మాత్రమే అనుమతి ఇవ్వాలి. కానీ చాలాచోట్ల, ముఖ్యంగా డాబాల్లో, బార్లలో చీకట్లో ఆహారాన్ని వడ్డిస్తున్నారు. దీంతో ఆహారం ఎలా ఉందో, అందులో ఏ రంగు కలిపారో తెలియని పరిస్థితి. పురుగుమందుల కోటాలో టేస్టింగ్ సాల్ట్ దిగుమతి టేస్టింగ్‌సాల్ట్ చైనా నుంచి ఫరి్టలైజర్స్ పేరుమీద దిగుమతి అవుతోంది. ఆహార విషెస్ సూచికలో ఇది లేదు. చైనాలో ఇది వంటల్లో వాడితే ఉరిశిక్ష విధించేలా అక్కడి శిక్షలు ఉన్నాయి. దీన్ని తరచుగా తింటే బీపీ, షుగర్ చిన్నవయస్సులోనే వచ్చే ప్రమాదముంది. తరచూ వాడితే మన నాలుక కొన్ని రుచులను గుర్తించే గుణాన్ని కోల్పోతుంది. పాస్ట్‌ఫుడ్, రెస్టారెంట్లలో టేస్టింగ్‌సాల్ట్ లేకుండా ఏ వంటకం తయారవడం లేదు. ఆరోగ్యానికి హాని ఇలా.. ♦మెటానియల్ ఎల్లో వాడకం నిషేధం. కానీ వినియోగిస్తున్నారు. ఇది ఆరోగ్యంపై వెంటనే దు్రష్పభావం చూపించదు. నెమ్మదిగా క్యాన్సర్‌కు కారకమవుతుంది. చిన్నారుల్లో నిద్రలేమి, నరాల సంబంధిత వ్యాధులు వస్తాయి. ♦వంటకాల్లో రంగుకోసం వాడే నిషేధిత టార్ట్రాజిన్ చాలా ప్రమాదకరం. దీనితో థైరాయిడ్ సమస్యలు వస్తాయి. దీర్ఘకాలంలో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. దద్దుర్లు, తామర వచ్చే సూచనలు ఉన్నాయి. ♦స్వీట్లు, బిస్కెట్లలో ఆరెంజ్ రంగు కోసం వాడే సన్‌సెటన్, పసుపు రంగు కోసం వాడే కాట్రాజ్, గ్రీన్ కలర్ కోసం వాడే బ్రిలియంట్ బ్లూ, టారా్టజిన్లు ప్రమాదకరం. ♦చాక్లెట్లలో వాడే రోడ్మన్–బి కూడా ప్రాణాంతకమే. ♦ఆహార కల్తీ వల్లనే 53 శాతం మందికి క్యాన్సర్ వస్తున్నట్లు పలు సంస్థల సర్వేల్లో తేలింది. విదేశాల్లో చర్యలు ఇలా... ♦కెనడా, ఐర్లాండ్, స్వీడన్ వంటి దేశాల్లో ఆహార భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రపంచ ఆరోగ్యసంస్థ కూడా ఆ దేశాలను అత్యుత్తమ ఆహార నాణ్యత కలిగిన దేశాలుగా పేర్కొన్నాయి. ♦కెనడాలో విక్రయించే అన్ని ఆహారపదార్థాలను తప్పనిసరిగా తనిఖీ చేయాల్సిందే. వ్యవసాయం, ఇతర ఆహారపదార్థాల కోసం అక్కడ ప్రత్యేకశాఖలు, విభాగాలున్నాయి. ♦వ్యవసాయ ఉత్పత్తులపై నిఘాకు, పునఃశుద్ధికి ‘వ్యవసాయ ఆహార కెనడా’ అనే సంస్థతో అక్కడి ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఇది కెనడియన్ ఫుడ్ ఇన్స్పెక్షన్ ఏజెన్సీ(సీఎఫ్ఐఏ) ఆ«దీనంలో పనిచేస్తోంది. ఈ సంస్థ పౌరుడికి చేరే ప్రతి ఆహారపదార్థాన్ని తప్పకుండా పరిశీలించిన తర్వాతనే మార్కెట్లోకి విడుదల చేసేందుకు అనుమతి ఇస్తుంది. కోడిగుడ్లను సైతం పునఃశుద్ధి ప్రక్రియ చేయకుండా అనుమతి ఇవ్వదు. రుచికోసం రసాయనాలను ఏమాత్రం అనుమతించవద్దు. సహజ రుచుల్లోనే వండివడ్డించాలనేది అక్కడి నియమం. ఇలాంటి నిబంధనలను ఇక్కడ కూడా కఠినంగా అమలు చేస్తేనే కల్తీని అరికట్టవచ్చు. చదవండి: బాలయ్య ఏందయ్యా ఇది.. పాపం పిల్లలు మాడిపోయారు? -
బడా సంస్థతో టైఅప్.. కొత్త వ్యాపారంలోకి మహేశ్ బాబు?
ట్రెండ్‌కి అనుగుణంగా మారాలనే మాట వినే ఉంటాం. దీన్నే మన టాలీవుడ్ సినీతారలు పాటిస్తున్నారు. ఎందుకంటే కేవలం సినిమాల్లో నటనపై మాత్రమే దృష్టి పెట్టకుండా ఇతర వ్యాపారాలలోనూ అడుగుపెడుతున్నారు. ఇప్పటికే ఈ ట్రెండ్‌ని పలువురు సీనీ సెలబ్రిటీలు ఫాలో అవుతున్నారు కూడా. ఈ జాబితాలో సూపర్ స్టార్ మహేశ్‌బాబు కూడా ఉన్నారనే విషయం విదితమే. ప్రిన్స్ ఇప్పటికే ఏఎంబీ సినిమాస్ పేరుతో మల్టీప్లెక్స్ బిజినెస్‌లో ఉన్నారు. కొన్నిసార్లు కథలు నచ్చితే ఆయన నిర్మాతగా మారి సినిమాలు కూడా నిర్మిస్తున్నారు. తాజాగా మరో సరికొత్త వ్యాపారంలోకి మహేశ్ అడుగుపెడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్‌లోని ప్రముఖ రెస్టారెంట్లలో ఒకటైన మినర్వా గ్రూప్‌తో కలిసి భారీ స్థాయిలో రెస్టారెంట్‌ను మొదలుపెట్టాలని మహేశ్ అనుకుంటున్నారట. ఈ రెస్టారెంట్‌ను బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లో ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది. ప్రస్తుతం ఈ బిజినెస్‌మేన్ త్రివిక్రమ్‌తో సినిమా చేయాల్సి ఉంది. ఆగస్టు నెలలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇందులో పూజా హెగ్డే నటిస్తోంది. దీని తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేయాల్సి ఉంది. చదవండి: Jagapathi Babu: పొలిటికల్ ఎంట్రీపై స్పందించిన జగపతిబాబు -
ప్రజల ఆరోగ్యంతో చెలగాటం.. పాచిపోయిన బిర్యానీ, అన్నంలో ఈగలు
సాక్షి, వికారాబాద్: పది రోజులుగా కురుస్తున్న వర్షాలతో పల్లెలు, పట్టణాల్లో సీజనల్ వ్యాధుల భయం కనిపిస్తోంది. ఈ సమయంలో కల్తీ ఆహారం తీసుకున్నా, నాణ్యతా ప్రమాణాలు పాటించని చిరుతిండ్లు తిన్నా రోగాల బారిన పడక తప్పదు. జిల్లాలో అనేక హోటళ్లు, పాస్ట్ ఫుడ్ సెంటర్లు, దాబాలు వెలిశాయి. పలు చోట్ల నాసిరకం, కల్తీ పదార్థాలు, సరుకులతో వంటలు చేస్తున్నారు. దీంతో జనం అనారోగ్యం పాలవుతున్నారు. హోటళ్లు, దాబాలు, పాస్ట్‌ఫుడ్ సెంటర్లకు.. కిరాణా షాపుల యజమానులు నాణ్యత లేని పదార్థాలను విచ్చలవిడిగా విక్రయిస్తున్నారనే ఆరోపణలున్నాయి. సదరు దుకాణాలపై దాడులు చేసి తనిఖీలు నిర్వహించాల్సిన అధికారులు పెద్దగా పట్టించుకోవడం లేదు. జిల్లాలో పూర్తి స్థాయి ఫుడ్ ఇన్స్పెక్టర్ లేకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. సంబంధిత కార్యాలయంలోనూ సరిపడా సిబ్బంది లేక సమా ధానం చెప్పే వారు కరువయ్యారు. జిల్లాలో ఇన్చార్జ్ ఫుడ్ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు చేపట్టిన అధికారి చుట్టపు చూపుగా వచ్చి వెళ్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో హోటళ్లు, దాబాలు, టిఫిన్ బండ్ల నిర్వాహకులు ఆడిందే ఆట పాట అనేలా వ్యాపారం సాగిస్తున్నారు. అనుమతులు లేకుండానే జిల్లాలోని వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ పట్టణాలతో పాటు మండల కేంద్రాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా హోటళ్లు, పాస్ట్‌ఫుడ్ సెంటర్లు వెలుస్తున్నాయి. వీటిలో తయారు చేసే భోజన సామగ్రి, నూనె నాణ్యత విషయాలు ఎవరికీ తెలియట్లేదు. తక్కువ ధరకు లభించే నాసిరకం సరుకులతో వంటకాలు చేస్తున్నారనే ప్రచారం ఉంది. చాలా హోటళ్లకు కనీసం మున్సిపల్, గ్రామ పంచాయతీల అనుమతి కూడా లేకపోవడం గమనార్హం. ఈ విషయంపై మున్సిపల్ అధికారులు, గ్రామ పంచాయతీ సెక్రటరీలు పెద్దగా పంటించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఇదే అదనుగా వ్యాపారులు కల్తీ వస్తువులతో హోటళ్లు నడిపిస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. పాచిపోయిన బిర్యానీ వికారాబాద్‌లోని పలు బిర్యానీ సెంటర్లలో పాచి పోయిన బిర్యానీ విక్రయిస్తున్నారే ఆరోపణలున్నాయి. రెండు మూడు రోజుల పాటు చికెన్‌ను ఫ్రిజ్‌లో పెట్టి బిర్యానీ చేసి అమ్ముతున్నారు. ఎన్టీఆర్ చౌరస్తాలోని ఓ బిర్యానీ సెంటర్లో తీసుకున్న అన్నంలో ఇటీవల పురుగులు వచ్చాయి. ఈ విషయంపై ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక బాధితులు కొద్దిసేపు నిర్వాహకులతో గొడవపడి వెళ్లిపోయారు. న్యూ గంజ్‌లోని మరో బిర్యానీ సెంటర్లో వారం రోజుల క్రితం అన్నంలో ఈగలు దర్శనమిచ్చాయి. ఇదేమిటని అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడమే కాకుండా, ఇదే బిర్యానీని మిగతా వారికి వడ్డించడం గమనార్హం. మరో హోటల్ నుంచి తీసుకువెళ్లిన ఇడ్లీ సాంబారులో బొద్దింక వచ్చిందని బాధితులు తెలిపారు. ఇలా ప్రతీ హోటల్లో నాసిరకం ఆహారం అమ్ముతున్నారనే ప్రచారం సాగుతోంది. ఎప్పుడూ తాళమే.. స్థానిక మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఫుడ్ సేఫ్టీ జిల్లా కార్యాలయం ఉంది. ఎప్పుడు చూసినా ఇది తాళం వేసే కనిపిస్తోంది. జిల్లా ఏర్పడ్డ తర్వాత గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్, ఫుడ్ సేఫ్టీ అధికారి పోస్టులు కేటాయించారు. జూనియర్ అసిస్టెంట్, అటెండర్ ఉండాలి. కానీ ఈ కుర్చీలన్నీ ఖాళీగా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్కు వికారాబాద్ ఇన్చార్జ్ బాధ్యతలు ఇచ్చారు. ఏడాది కావస్తున్నా ఇప్పటి వరకు జిల్లాలో ఒక్కచోట కూడా తనిఖీలు చేసిన దాఖలాలు లేవు. హోటళ్లు, బేకరీలు, పాస్ట్‌ఫుడ్ సెంటర్లు, ఇతర ఆహార పదార్థాల షాపులను తనిఖీ చేయాల్సి ఉన్నా అధికారుల జాడ లేకపోవడంతో వ్యాపారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. మార్కెట్లో నాణ్యత లేని సరుకులు, ఇతర ఆహార పదార్థాలు జోరుగా విక్రయిస్తుండటంతో వాటిని కొనుగోలు చేస్తున్న ప్రజలు అనారోగ్యం పాలై ఆస్పత్రుల్లో చేరుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి జిల్లాలో తనిఖీలు చేపట్టాలని కోరుతున్నారు. -
ఇష్టంగానా? కష్టంగానా?
ఒకరికి ఖేదం... వేరొకరికి మోదం అంటే ఇదేనేమో! హోటళ్ళు, రెస్టారెంట్లలో తప్పనిసరి సర్వీస్ ఛార్జ్‌పై నిషేధంతో హోటల్ యజమానులు విచారిస్తుంటే, వినియోగదారులు సంతోషిస్తున్నారు. కేంద్ర వినియోగదారుల హక్కుల పరిరక్షణ ప్రాధికార సంస్థ (సీసీపీఏ) సోమవారం జారీ చేసిన మార్గదర్శకాలతో దేశవ్యాప్తంగా ఆతిథ్యరంగంలో ఇదే పరిస్థితి. సేవా రుసుము (సామాన్య భాషలో టిప్స్) చెల్లించడం స్వచ్ఛందమే తప్ప తప్పనిసరి కాదనీ, ఎవరైనా నిర్బంధంగా వసూలు చేస్తుంటే 1915 నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చనీ సీసీపీఏ తేల్చేసింది. ఆతిథ్యరంగ ప్రతినిధులు మాత్రం శ్రామికులకు ఉపకరించే సర్వీస్ ఛార్జ్‌లో చట్టవిరుద్ధమేమీ లేదనీ, దీనిపైన కూడా పన్ను చెల్లిస్తున్నం దున ప్రభుత్వానికి ఆదాయం వస్తోందనీ వాదిస్తున్నారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, తగ్గుతున్న వృద్ధి, కొనుగోలుశక్తి లాంటి సమస్యలుండగా సర్కారు ‘టిప్స్’ అంశంపై దృష్టి పెట్టడం విచిత్రమే. ఇష్టపడి స్వచ్ఛందంగా ‘టిప్స్’ ఇవ్వడం వేరు. తప్పనిసరి అంటూ ముక్కుపిండి వసూలు చేయడం వేరు. ఈ వాదనే ఇప్పుడు హోటళ్ళలో విధిస్తున్న సేవా రుసుమును చర్చనీయాంశం చేసింది. వినియోగదారులు తాము అందుకున్న సేవలకు సంతృప్తి చెంది, ఇష్టంతో ఇవ్వాల్సిన సేవా రుసుమును చాలాచోట్ల బిల్లులో తప్పనిసరి భాగం చేశారు. అయిదేళ్ళ క్రితం దేశమంతటా అమలైన ‘వస్తు, సేవల పన్ను’ దీనికి అదనం. హోటల్లో తిండికి అయిన ఖర్చు మీద 5 నుంచి 15 శాతం దాకా సేవా రుసుమును హోటల్ వారే వేసి, ఆ రెంటినీ కలిపిన మొత్తం మీద ‘వస్తు, సేవల పన్ను’ (జీఎస్టీ) వసూలు చేయడం సరికాదన్నది కొంతకాలంగా వస్తున్న ఫిర్యాదు. తినడానికి అయిన బిల్లు మీద ఎలాగూ సర్కారీ ‘వస్తు, సేవల పన్ను’ వసూలు చేస్తున్నప్పుడు, మళ్ళీ విడిగా హోటల్ వారి ‘సేవా రుసుము’ ఏమిటి? దీని వల్ల ఒకటి రుసుము, మరొకటి పన్ను అంటూ ఒకే సేవకు రెండుసార్లు చెల్లిస్తున్నట్లు అవుతోందనేది ఫిర్యాదీల వాదన. ఆ వాదన తార్కికమే. కానీ, సేవలందించే శ్రామికుడిని మానవీయ కోణంలో చూస్తే సరైనదేనా? హోటళ్ళు అంటున్నదీ అదే! సర్వీస్ ఛార్జ్‌కు చట్టబద్ధత ఏమీ లేకున్నా, బేరర్ శ్రమను గుర్తించి, మానవతా దృక్పథంతో స్వచ్ఛందంగా టిప్ ఇవ్వడం నైతికంగా ధర్మమే. అలాగని కొన్నిసార్లు సేవలు అసంతృప్తికరంగా ఉన్నప్పటికీ, బిల్లులో భాగంగా 10 శాతం తప్పనిసరి ‘సర్వీస్ ఛార్జ్’ను చెల్లించాల్సి వస్తున్న అనుభవాలూ లేకపోలేదు. దీనిపై ఫిర్యాదుల మేరకు కొన్నేళ్ళుగా వినియోగదారుల మంత్రిత్వ శాఖకూ, దేశంలోని 5 లక్షల పైచిలుకు రెస్టారెంట్ల పక్షాన నిలిచే ‘నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా’ (ఎన్నార్ఏఐ)కీ మధ్య చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే, జీఎస్టీ విధింపు కన్నా ముందే 2017 ఏప్రిల్‌లోనే హోటళ్ళలో సర్వీస్ ఛార్జ్ వసూలుపై మంత్రిత్వ విభాగం మార్గదర్శకాలిచ్చింది. రెస్టారెంట్‌కు వచ్చినంత మాత్రాన సర్వీస్ ఛార్జ్‌కి కస్టమర్ అంగీకరించినట్టు కాదని పేర్కొంది. ఛార్జ్ కట్టే పక్షంలోనే ఆర్డర్ చేయాలంటూ, కస్టమర్ ప్రవేశంపై షరతులు పెట్టడం చట్టప్రకారం ‘అనుచిత వాణిజ్య పద్ధతి’ అవుతుందన్నది. మెనూ కార్డులో పేర్కొన్న రేట్లు, ప్రభుత్వం విధించే పన్నులు మినహా మరే సర్వీస్ ఛార్జ్ చెల్లించాల్సిన అవసరం లేదని తేల్చింది. తద్విరుద్ధమైన అనుచిత విధానాలపై కస్టమర్లు న్యాయవేదికలను ఆశ్రయించవచ్చని తెలిపింది. ‘అనుచిత వాణిజ్య పద్ధతి’ లాంటి పెద్ద పెద్ద మాటలు ఈ ‘టిప్స్’కు వర్తిస్తాయా, లేదా అన్నది పక్కనబెడితే, సర్వీస్ ఛార్జ్‌ను ఆపేయాలంటూ ఇలా 2017 నుంచి 2019 మధ్య కేంద్రం పలు మార్గదర్శకాలు ఇచ్చిందన్నది నిజం. అయినా హోటళ్ళ బిల్లులో తప్పనిసరి సర్వీస్‌ఛార్జ్ పద్ధతి కొనసాగుతూ వచ్చింది. దాని ఫలితమే ఫిర్యాదులు, ప్రభుత్వ తాజా నిర్ణయం. నెల రోజుల క్రితం జూన్ 2న కూడా కేంద్ర వినియోగదారుల వ్యవహారాల విభాగం దీనిపై హోటళ్ళ సంఘం వారితో సమావేశం జరిపింది. చివరకు సోమవారం నాటి సీసీపీఏ మార్గనిర్దేశనంతో ఇకపై హోటళ్ళు తప్పనిసరి సేవా రుసుము వసూలు చేయడం పూర్తి నిషిద్ధం. సీసీపీఏ చట్టబద్ధ సంస్థ. ‘వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం– 2019’ కింద హక్కులు అమలయ్యేలా చూసేందుకూ, ఉల్లంఘించినవారిని శిక్షించేందుకూ రెండేళ్ళ క్రితమే 2020 జూలైలో ఏర్పాటైందనేది గమనార్హం. గతంతో పోలిస్తే 2021–22లో ఆతిథ్యరంగంలో ఆదాయం పడిపోయింది. ఇప్పుడు శ్రామికు లకు ప్రోత్సాహకంగా దక్కే టిప్స్ కూడా రద్దు అంటే కష్టమని హోటల్ యజమానుల అభిప్రాయం. ప్రభుత్వ లావాదేవీలకు ‘ప్రాసెసింగ్ ఫీ’ అనీ, రైలు, సినిమా టికెట్ల బుకింగ్‌కు ‘కన్వీనియన్స్ ఫీ’ అనీ, ఫుడ్ డెలివరీకి ‘రెస్టారెంట్ ఛార్జెస్’ అనీ రకరకాల పేర్లతో అనేక రంగాలు సేవా రుసుము వసూలు చేస్తూనే ఉన్నాయి. వాటిని అనుమతిస్తూ, ఆతిథ్యరంగంపై ఈ దాడి ఏమిటన్నది వారి వాదన. అలాగే, టిప్స్ రద్దుతో శ్రామికులకు కలిగే నష్టం భర్తీకి జీతాలు పెంచడం, దానికై హోటల్ రేట్లు పెంచడం అనివార్యం కావచ్చు. అయితే, కోవిడ్ అనంతరం ఆహార, ఇంధన ద్రవ్యోల్బణంతో సతమతమవుతూ ఇప్పటికే రేట్లు పెంచి, ఇరుకునపడ్డ హోటళ్ళు మరోసారి ఆ పని చేయగలవా? అయినా, అందుకున్న సేవల పట్ల సంతృప్తిని బట్టి, ఆర్థిక స్థోమతను బట్టి కస్టమర్లు ఇవ్వాల్సినదాన్ని కొన్ని హోటళ్ళు తప్పనిసరి అనబట్టే తలనొప్పి. యూరప్, యూకేల పద్ధతిలో మన దగ్గరా కస్టమర్ల ఇష్టానికే టిప్స్ చెల్లింపును వదిలేయాలి. అయినా, హోటల్లో టిప్ లాంటివాటి కన్నా కోవిడ్ పడగ నీడలోని ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించే పని మీద మన పాలకులు పరిశ్రమిస్తే దేశానికి మంచిదేమో! -
హోటల్స్, రెస్టారెంట్లలో ఆ బలవంతపు వసూళ్లకు చెక్
న్యూఢిల్లీ: హోటల్స్, రెస్టారెంట్లకు వెళ్లే కస్టమర్లకు.. ఇక నుంచి ‘సర్వీస్ ఛార్జీ’ బాదుడు నుంచి ఊరట లభించింది. వినియోగదారుల విషయంలో ఇష్టానుసారం వ్యవహరించకుండా ఉండేందుకు సెంట్రల్ కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) సరికొత్త మార్గదర్శకాలను సోమవారం జారీ చేసింది. హోటల్స్, రెస్టారెంట్లలో సర్వీస్ ఛార్జీల పేరిట కస్టమర్ల నుంచి బలవంతపు వసూలు చేయడానికి వీల్లేదని స్పష్టం చేస్తూ.. తక్షణమే ఈ ఆదేశాలు అమలులోకి వస్తాయని ప్రకటించింది. బిల్లులకు ఆటోమేటిక్‌గా కానీ, మ్యానువల్‌గా కానీ సర్వీస్ ఛార్జీలను జత చేయొద్దని సీసీపీఏ తన గైడ్‌లైన్స్‌లో పేర్కొంది. సర్వీస్ ఛార్జీలను ఏ రూపేనా కూడా వసూలు చేయడానికి వీల్లేదు. కస్టమర్ల నుంచి బలవంతంగా వసూలు చేయరాదు. అది కేవలం స్వచ్ఛంద చెల్లింపు, ఆప్షనల్ మాత్రమే. ఈ విషయాన్ని కస్టమర్‌కు సైతం తెలియజేయాలని మార్గదర్శకాల్లో కన్జూమర్ ఎఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ మినిస్ట్రీ స్పష్టం చేసింది. ఫుడ్ బిల్లు, జీఎస్టీతో పాటు సర్వీస్ ఛార్జ్ అనేది బిల్లులో ఇకపై కనిపించడానికి వీల్లేదు. ఒకవేళ ఏదైనా హోటల్, రెస్టారెంట్ గనుక సర్వీస్‌ఛార్జ్ వసూలు చేస్తే గనుక.. నిబంధనలను ఉల్లంఘించినట్లేనని తాజా మార్గదర్శకాలు స్పష్టం చేశాయి. ఈ విషయమై ప్రశ్నించే.. నిలదీసే హక్కు కస్టమర్లకు ఉంటుందని తెలిపింది. ఫిర్యాదు చేయాలనుకుంటే.. నేషనల్ కన్జూమర్ హెల్ప్‌లైన్ నెంబర్ 1915కు కాల్ చేయాలని తెలిపింది. లేదంటే ఎన్సీహెచ్ మొబైల్ యాప్‌లోనూ ఫిర్యాదు చేయవచ్చని స్పష్టం చేసింది. సీపీపీఏకు ఈ-మెయిల్ ccpa@nic.in ద్వారా కూడా ఫిర్యాదు ఇవ్వొచ్చని తెలిపింది. అంతేకాదు అన్‌ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టిస్ కింద కన్జూమర్ కమిషన్లోనూ ఫిర్యాదు చేయొచ్చని స్పష్టం చేసింది. ఒకవేళ వేగవంతమైన చర్యల కోసం.. ఈ-దాఖిల్ పోర్టల్ద్వారా ఫిర్యాదు చేయాలని తెలిపింది. ఇవేం కుదరకుంటే.. నేరుగా జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు అందిస్తే.. సీసీపీఏ సమన్వయం ద్వారా దర్యాప్తు జరుగుతుందని స్పష్టం చేసింది. చదవండి: కప్పు ఛాయ్ రూ. 70 వసూలు!.. రైల్వే వివరణ -
20 రకాల కూరలతో సుష్టుగా తినొచ్చు.. ధర తక్కువే! ఎక్కడో తెలుసా?
కూసుమంచి (ఖమ్మం జిల్లా): భోజనం చేసేందుకు ఏదైనా హోటల్‌కు వెళ్తే ఓ నాలుగు కూరలు, ఒక చట్నీ, సాంబారు, పెరుగుతో సరిపెడతారు. దీంతో కడుపు నిండినట్టు అనిపించనప్పటికీ సర్దుకుపోతాం. ఒకవేళ ఎక్కువగా తీనాలంటే మరింత ఖర్చు చేయాల్సి వస్తుంది. అంత ఖర్చు పెట్టలేని వారు అసంతృప్తితోనే బయటకు వస్తుంటారు. కానీ కూసుమంచిలోని నాగన్న, శివ హోటళ్లలో మాత్రం 20కి పైగా రకాల కూరలను వడ్డిస్తూ భోజన ప్రియులను సంతృప్తి పరుస్తున్నారు. సామాన్యులు వెచ్చించగల బడ్జెట్లోనే పసందైన భోజనం అందిస్తూ ఆకలి తీరుస్తున్నారు. ఇలాంటి హోటళ్లు ఎక్కడా లేవంటూ పలువురు మెచ్చుకుంటున్నారు. (చదవండి: భక్తుల వద్ద హోంగార్డు చేతివాటం, క్రిమినల్ చర్యలకు ఈవో ఆదేశం) నాగన్నతో మొదలు.. కూసుమంచిలోని నాగన్న (రామకృష్ణ ) హోటల్లో గత కొన్నేళ్లుగా వివిధ కూరలతో భోజనాలు వడ్డిస్తున్నారు. దీంతో ఈ హోటల్ ప్రత్యేకతను సంతరించుకుంది. కూసుమంచిలో ఖమ్మం– సూర్యాపేట రాష్ట్రీయ రహదారి పక్కన ఉండటంతో ఇక్కడ 24 కూరల భోజనం గురించి తెలుసుకుని అనేక మంది ప్రయాణికులు ఆగి మరీ భోజనాలు చేస్తుంటారు. పలువురు సినీ, రాజకీయ రంగాలకు చెందిన వారు కూడా ఈ హోటల్లో భోజనం చేసి అభినందించారు. ఈ హోటల్ యజమాని బెల్లంకొండ నాగన్న గత 20 ఏళ్లకు పైగా సేవలు అందిస్తూ గుర్తింపు పొందారు. శివ హోటల్‌కు క్రేజ్.. కూసుమంచిలోని సూర్యాపేట రోడ్డులో ఏర్పాటు చేసిన శివ హోటల్ సైతం నాగన్న హోటల్ మాదిరిగా 24 కూరలను అందిస్తూ క్రేజ్‌ను సొంతం చేసుకుంటుంది. ఈ హోటల్లో కూరలతో పాటు చికెన్ కర్రీని అదనంగా వడ్డించడం ప్రత్యేకత. కాలానుగుణంగా అందుబాటులో ఉన్న అన్ని రకాల కూరగాయలు, ఆకు కూరలను యజమాని శివ సొంతంగా కొన్నింటిని పండిస్తూ, మరికొన్ని కొనుగోలు చేస్తూ 20 కూరలకు తగ్గకుండా భోజనాలు అందిస్తున్నారు. వెజిటేరియన్ కాకుండా నాన్‌వెజ్‌లో భాగంగా బిర్యానీ, చికెన్, చేప కూరలను ప్రత్యేకంగా అందిస్తున్నారు. అనతికాలంలోనే ఈ హోటల్ కూడా ఆదరణ పొందింది. మండల ప్రజలతో పాటు ఖమ్మం తదితర ప్రాంతాలకు చెందిన వారు ప్రత్యేకంగా కూసుమంచికి వచ్చి భోజనాలు చేస్తుండటం విశేషంగా చెప్పుకోవచ్చు. (చదవండి: ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. ముఖం చాటేశాడు..) వడ్డించే కూరలు... కూసుమంచిలోని నాగన్న, శివ హోటళ్లలో వివిధ రకాల కూరలు వడ్డిస్తున్నారు. వాటిలో పప్పు, దోసకాయ, దొండకాయ, గోరుచిక్కుడు, చిక్కుడు కాయ, సొరకాయ, పొట్లకాయ, వంకాయ, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, బీట్రూట్, బంగాళదుంప, చామగడ్డ, క్యారట్, కాకరకాయ, టమాట, బీర, సొరకాయ, బెండకాయ, పాలకూర, బచ్చలికూర, చుక్క కూర, గోంగూర, మామిడికాయ పచ్చడి, నిమ్మకాయ పచ్చడితో పాటు సాంబారు, పెరుగు వడ్డిస్తారు. కాగా కూరలు సీజన్‌ను బట్టి కొంచెం మారుతుంటాయి. అయినప్పటికీ 20 కూరలకు తగ్గకుండా వడ్డిస్తుండటం ప్రత్యేకత. సామాన్యులకు సైతం అందుబాటులో ఉండేలా భోజనం రూ.100 మాత్రమే తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఎక్కడా చూడలేదు.. మాది వరంగల్ జిల్లా కేసముద్రం. మేం కూసుమంచికి పనిమీద వచ్చాం. ఇక్కడ 20 కూరల భోజన హోటల్ బోర్డు చూసి వచ్చి తిన్నాం. ఇన్ని కూరలు వడ్డించే హోటల్ ఎక్కడా చూడలేదు. చాలా ఆశ్చర్యం వేస్తుంది. కూరలు కూడా చాలా బాగున్నాయి. – లక్ష్మి, కేసముద్రం, వరంగల్ జిల్లా తృప్తి మిగులుతుంది.. మా హోటల్లో రోజూ 20కి తగ్గకుండా కూరలు తయారు చేస్తాం. కస్టమర్ల తృప్తి మేరకు భోజనాలు వడ్డిస్తున్నాం. భోజన ప్రియుల అభిరుచి మేరకు నాన్‌వెజ్ ఐటమ్స్ కూడా ప్రత్యేకంగా తయారు చేస్తున్నాం. మంచి భోజనం అందిస్తున్నామనే తృప్తి మిగులుతుంది. – భూక్యా శివ, శివ హోటల్ యజమాని -
ఇస్మార్ట్ హోటల్..ఇవేమన్నా "మార్చురీ" గదులా?,సెటైర్లు పడ్డా ఎలా సక్సెస్ అయ్యిందంటే
పని మీద ఊరుకానీ ఊరు వెళ్తే.. ఉండటానికి చోటు ఒక సమస్యగా ఉంటుంది. తక్కువ ఖర్చుతో లాడ్జిల్లో ఉందామంటే కంఫర్ట్‌గా ఉండకపోవచ్చు. పోనీ మంచి సౌకర్యాలున్న హోటల్లో దిగాలంటే.. అది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఈ సమస్యను తీర్చేందుకు నెలకొల్పిన కాన్సెప్ట్ ‘క్యాప్సుల్ హోటల్’. జపాన్‌లో చాలా ఏళ్ల క్రితమే మొదలైన ఈ ట్రెండ్.. వయా సింగపూర్, ఇండియా మీదుగా యూరప్‌ని చేరింది. ఇప్పుడు బ్యూటీసిటీ మిలాన్‌లో క్యాప్సుల్ హోటల్స్‌దే హవా నడుస్తోంది. ఇంతకీ ఈ ఇస్మార్ట్ హోటల్ రూపురేఖలు ఎలా ఉంటాయి? ఎందుకు వాటికి అంత ప్రయారిటీ ఇస్తున్నారు..? (చదవండి: జపాన్ తరహా పాడ్ రూమ్స్ ఇప్పుడు భారత్‌లో..!) క్యాప్సుల్ హోటల్స్.. సింపుల్‌గా చెప్పాలంటే చిన్నసైజులో ఉండే బెడ్రూమ్స్తో కూడిన కాంప్లెక్స్‌లివి. ఒక చిన్న ఛాంబర్లో మినిమమ్ ఫెసిలిటీస్‌తో వీటిని ఏర్పాటు చేస్తారు. హోటల్స్‌తో పోలిస్తే రేటు చాలా తక్కువ. రాత్రిళ్లు పడుకోవడానికి సౌకర్యవంతంగా ఉంటాయి. పైగా ప్రైవసీకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అందుకే పనుల మీద వేరే ఊర్లకు వెళ్లేవాళ్లు, టూరిస్టులు వీటికి ప్రాధాన్యం ఇస్తున్నారు. వెస్ట్రన్ వరల్డ్‌లో వీటినే ‘పాడ్ హోటల్స్’ అంటారు. సాధారణంగా ఈ తరహా హోటల్స్ ఎయిర్పోర్ట్ దగ్గర్లో కనిపిస్తుంటాయి. అక్కడ వాటిని ‘స్లీప్‌బాక్స్’ పేరుతో పిలుస్తారు. అయితే ఈ మధ్యకాలంలో టూరిస్టుల తాకిడి ఎక్కువగా ఉండే ప్రధాన నగరాల్లోనూ క్యాప్సుల్ హోటల్స్ బిజినెస్ పెరుగుతోంది. కమర్షియల్‌గా మార్చేశారు జపాన్ ఉమెడ జిల్లా ఒసాకాలో తొలి క్యాప్సుల్ హోటల్ని 1979లో ఏర్పాటు చేశారు. జపనీస్ ఫేమస్ ఆర్టిటెక్ట్ కీషో కురోకావా ఆ హోటల్ని డిజైన్ చేయడం విశేషం. ఆ తర్వాత టోక్యోలో మరో మూడు బ్రాంచ్‌లు ఏర్పాటయ్యాయి. నిజానికి వీటిని ఏర్పాటు చేయడం వెనుక ఒక మంచి ఉద్దేశం ఉంది. చిన్న చిన్న పనులు చేసుకుంటూ రోడ్‌సైడ్ జీవితాల్ని గడిపేవాళ్ల కోసం వీటిని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా చలికాలంలో రాత్రిళ్లు ఉండేందుకు తక్కువ ఖర్చుతో వాళ్లకు క్యాప్సుల్ హోటల్స్‌ని అందుబాటులోకి తీసుకొచ్చారు. కానీ, రాను రాను ఇదొక బిజినెస్‌గా మారింది. మూడేళ్లలోనే జపాన్ మొత్తం మీద నలభైకి పైగా క్యాప్సుల్ హోటల్స్ వెలిశాయి. అక్కడి నుంచి ప్రపంచం మొత్తం విస్తరించాయి. సకల సౌకర్యాలు క్యాప్సుల్ హోటల్ ఛాంబర్లు చూడటానికి స్లీపర్ కోచ్ బస్సుల్లా ఉంటాయి. ఒక ఛాంబర్‌కి మరో ఛాంబర్ ఆనుకుని ఉంటుంది. ప్లాస్టిక్ టబ్ లాంటి నిర్మాణానికి అద్దాల సెటప్‌తో డోర్, దానికొక కర్టెన్ ఉంటుంది. లోపలికి పాకుతూ వెళ్లాల్సి ఉంటుంది. లోపల చిన్న బెడ్, లైట్, పవర్ ప్లగ్, వై–ఫై ఫెసిలిటీ ఉంటాయి. కొన్నిసార్లు టీవీ, ల్యాప్‌ట్యాప్‌ని ఇస్తారు. న్యూస్ పేపర్, రీడింగ్ మెటీరియల్స్ అందిస్తారు. జస్ట్ పడుకోవడానికి, రెస్ట్ తీసుకోవడానికి మాత్రమే సరిపోతాయివి. క్యాప్సుల్ హోటల్స్ ఆడ, మగకి విడివిడిగా ఉండొచ్చు. లేదంటే కపుల్ స్పెషల్‌గా ఉంటాయి. ఛాంబర్ కాంప్లెక్స్ బయట సామాన్లు భద్రపరుచుకోవడానికి ఒక లాకర్ ఉంటుంది. క్యాప్సుల్‌లో తినడానికి, సిగరెట్ తాగడానికి వీల్లేదు. అయితే బాత్రూమ్లు మాత్రం బయట కామన్‌గా ఉంటాయి. కొన్నింటిలో రెస్టారెంట్, షవర్స్, స్నాక్ బార్స్, పూల్స్.. ఎంటర్టైన్మెంట్ ఫెసిలిటీస్ సెపరేట్‌గా ఉంటాయి. కాకపోతే వాటికి కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అయితే క్లాస్ట్రోఫోబియా(ఇరుకుప్రదేశాలంటే భయం) ఉన్నవాళ్లు క్యాప్సుల్ హోటల్‌కి దూరంగా ఉండటమే బెటర్. మైనస్లున్నాయ్ ఒకరకంగా చెప్పాలంటే ఇది తొమ్మిది గంటల హోటల్. అంటే రాత్రి పూట పడుకోవడానికి, పగటిపూట విశ్రాంతి తీసుకోవడానికి మాత్రమే పనికొచ్చేలా సెట్ చేశారు. టైం అయిపోగానే ఖాళీ చేయాల్సిందే(చెక్ అవుట్). మళ్లీ కంటిన్యూ కావాలంటే మళ్లీ రిజిస్ట్రర్‌లో రికార్డు చేసుకోవాలి. అంతేకాదు పాడ్ హోటల్ కావడంతో ఛాంబర్లో రీసౌండ్ మాత్రం బాగా వస్తది. దీంతో మిగతా ఛాంబర్లకు ఆ సౌండ్ వినిపిస్తుంది. ఏదైనా ప్రమాదాలు జరిగినా త్వరగా రియాక్ట్ కావడానికి ఛాన్స్ కూడా ఉండదు. మరోవైపు వీటిని ఏర్పాటు చేసిన ఉద్దేశాన్ని మరిచిపోయి.. కమర్షియల్ పర్పస్‌గా మార్చేశారనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. పైగా ఛాంబర్స్‌ని మరీ కుదించి ‘మార్చురీ’ టైప్‌లో డిజైన్స్ చేస్తున్నారని జపాన్ ఆర్టిటెక్ అసోషియేషన్ ఒక వాదనను వినిపించింది. ఇవన్నీ పక్కనపెడితే.. కంఫర్ట్ కోసం వెతుక్కునే వాళ్లకు అన్నివిధాల చీప్ అండ్ బెస్ట్ ఈ క్యాప్సుల్ హోటల్స్. మన దగ్గర కూడా.. జపాన్ నుంచి మొదలైన ఈ హోటల్ ట్రెండ్.. చైనా, ఇండోనేసియా, ఇండియా, హాంకాంగ్, బెల్జియం, పోలాండ్స్కి విస్తరించాయి. యూరోప్‌లో అక్కడక్కడ ఎయిర్పోర్ట్ దగ్గరల్లో క్యాప్సూల్స్ హోటల్స్ కనిపిస్తాయి. మన దేశంలోనూ క్యాప్సుల్ హోటల్ని ‘అర్బన్ పాడ్’ పేరుతో ముంబైలోని అంధేరీ ఏరియాలో ఏర్పాటు చేశారు. ఒక హోటల్లో ఉండే బెనిఫిట్సే ఇందులోనూ అందుతాయి. పైగా రేటు కూడా రీజనబుల్. దీంతో ఈ ఐడియా వర్కవుట్ అయ్యింది. ముఖ్యంగా టూరిస్టుల్ని బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈ స్పందనతో దేశంలో మరిన్ని చోట్ల క్యాప్సుల్ హోటల్స్‌ని విస్తరించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. -
నయా ట్రెండ్: నోరూరిస్తున్న బిర్యానీ.. తింటే వదల‘మండీ’
సాక్షి, పహాడీషరీఫ్: నగర వాసులను నోరూరిస్తోంది మండీ బిర్యానీ. ఇన్నాళ్లు హైదరాబాద్ బిర్యానీ రుచిని ఆస్వాదించిన ప్రజలు ఇప్పుడు అరబ్ వంటకమైన మండీ బిర్యానీపై మనసు పారేసుకుంటున్నారు. ముఖ్యంగా యువత ఈ బిర్యానీని ఆరగించేందుకు ఆసక్తి చూపుతున్నారు. జల్పల్లి, ఎర్రకుంట, షాయిన్‌నగర్, పహాడీషరీఫ్ ప్రధాన రహదారికి ఇరువైపులా ఈ మండీ హోటల్స్(మతామ్) పెద్ద ఎత్తున వెలుస్తున్నాయి. అరబిక్ భాషలో మండీ అంటే బిర్యానీ అని, మతామ్ అంటే హోటల్ అని అర్థం. ధరలు సాధారణ బిర్యానీలకు కాస్త అటూ ఇటు గానే ఉంటున్నాయి. ఒక్క ప్లేట్లో నలుగురు సంపూర్ణంగా తినవచ్చు. చదవండి: మూలుగుబొక్క బిర్యానీ..నగరంలో ఇప్పుడిదే ట్రెండ్ ! పౌష్టిక విలువలు పుష్కలం మండీ బిర్యానీ పూర్తిగా పోషక విలువలు కలిగిన ఆహారం. సాధారణ బిర్యానీలో ఉండే మసాల కారణంగా తరచూ ఆరగించే వారికి కొవ్వు పెరిగి వ్యాధుల బారిన పడుతుండడం సహజం. ఇదే విషయమై వైద్యులు కూడా హెచ్చరిస్తుంటారు.ఈ మండీ బిర్యానీ పూర్తి భిన్నం. ఇందులో ఎలాంటి మసాల వస్తువులు లేకపోవడంతో పాటు బాదం, పిస్తా, చిరంజీ, కిస్మిస్ తదితర డ్రై ఫ్రూట్స్‌ను కూడా వేస్తారు. ఎండుకారం అసలు వేయరు. తక్కువ మోతాదులో పచ్చి మిరపకాయల మిశ్రమం, తక్కువ ఉప్పు వేస్తారు. మండీలో కలుపుకొని తినేందుకు ఇచ్చే వెల్లుల్లి మిశ్రమం కూడా కొవ్వును తగ్గిస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. చదవండి: బయట బిర్యానీ తింటున్నారా.. తస్మాత్ జాగ్రత్త! ఒకే పాత్రలో తినడమే ప్రత్యేకత సాధారణంగా హోటల్‌కు వెళ్లి ఎవరి ప్లేట్లో వారు అన్నం తినడం సహజం. కాని ఐదారుగురు వ్యక్తులు ఒకే ప్లేట్లో భోజనం చేయడం ఈ మండీ ప్రత్యేకత. ఇలా ఏ హోటల్లో చూసినా ఇదే కనిపిస్తుంది. నలుగురైదుగురు స్నేహితులు గ్రూప్‌గా వచ్చి సంయుక్తంగానే ఒకే ప్లేట్లో ఆరగిస్తూ తమ స్నేహబంధాన్ని చాటుకుంటారు. నగరంలోని కళాశాలల విద్యార్థులు ఐదారుగురు కలిసి వచ్చి తినడం సాధారణంగా కనిపిస్తోంది. ఈ హోటళ్లన్నీ అరబ్ స్టైల్‌ను అనుసరిస్తున్నాయి. ఏ మతామ్లోకి వెళ్లినా ఐదారుగురు కలిసి భోజనం చేసేలా చిన్న చిన్న గదులను నిర్మించి వాటిని పరదాలతో అందంగా ముస్తాబు చేసి ఉంచారు. మండీ తయారు చేసే విధానం.. మాంసం ఉడికించిన నీటిలోనే బియ్యాన్ని ఉడికించడం ఈ మండీ ప్రత్యేకత. మొదటగా మటన్/చికెన్ ముక్కలను పెద్ద పరిమాణంలో కట్ చేస్తారు. అనంతరం మాంసం ముక్కలకు తక్కువ మోతాదులో పచ్చి మిరపకాల మిశ్రమం, ఉప్పు, జైతూన్ ఆకు, పాలు, ధనియాలు, దాల్చన చెక్క, జాఫ్రాన్, జాపత్రి మిశ్రమాలను కలిపి గంట పాటు ఉంచుతారు. అనంతరం నీటిలో వేసి ఉడికిస్తారు. ఇలా ఉడికిన అనంతరం మాంసం బయటికి తీసి ఆ నీటిలోనే బియ్యం వేసి ఉడికిస్తారు. ఇలా బియ్యం ఉడికి మండీగా మారిన అనంతరం దానిలో ఖాజు, బాదం, పిస్తా, చిరంజీ, కిస్మిస్, ఖర్జూరను కలుపుతారు. ఉడికిన మాంసం ముక్కలను మంటపై కొద్దిగా కాలుస్తారు. అనంతరం ప్లేట్లో మండీ వేసి దానిపై ఈ మాంసం ముక్కలు, పచ్చి మిరపకాయలు, వెల్లుల్లి మిశ్రమాన్ని ఉంచి వినియోగదారులకు ఇస్తారు. ఆహారాన్ని బొగ్గుల పొయ్యిపైనే తయారు చేస్తున్నారు. బిర్యానీ తయారు చేసేందుకు అరబ్ దేశానికి చెందిన వంట మాస్టర్లనే వినియోగిస్తున్నారు. ప్రధాన రోహదారుల్లో వెలుస్తున్న హోటళ్లు ఎర్రకుంట ప్రధాన రహదారికిరువైపులా వెలిసిన మతామ్లతో ఆ రహదారిని ప్రస్తుతం మండీ రోడ్డుగా పిలుస్తున్నారు. ఎర్రకుంట బారా మల్గీస్ నుంచి మొదలుకొని షాహిన్‌నగర్ హైవే హోటల్ వరకు దాదాపు 30 మండీ మతామ్‌లు వెలిశాయటే ఎంత డిమాండ్ ఉందో తెలుసుకోవచ్చు. -
టీకా వేసుకున్న వాళ్లకే అనుమతి
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులు వేసుకున్న వారికే భవిష్యత్‌లో హోటళ్లు, మాల్స్‌లోకి అనుమతి ఇచ్చే అవకాశం ఉంటుందని ప్రజారోగ్య విభాగం డైరెక్టర్ శ్రీనివాసరావు అన్నారు. శనివారం ఆయన కోఠిలోని కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఇప్పటివరకు రెండు డెల్టా ప్లస్ కేసులు నమోదయ్యాయని, ఇరువురూ కోలుకున్నారని, వారి కాంటాక్ట్‌లను కూడా టెస్ట్ చేస్తే నెగటివ్ వచ్చిందన్నారు. డెల్టా రకం ప్రమాదకరమని, ఇంటాబయటా ప్రజలు మాస్కు తప్పకుండా ధరించాలని సూచించారు. థర్డ్‌వేవ్ వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అన్ని ఆస్పత్రుల్లో ఆక్సిజన్, సిబ్బందిని అందుబాటులో ఉంచామన్నారు. పిల్లల కోసం జిల్లా ఆస్పత్రుల్లో సౌకర్యాలు ఏర్పాటు చేశామని, వందకు పైగా బెడ్లు ఉన్న అన్నీ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆగస్ట్ నెలాఖరు నాటికి ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లు పెట్టుకోవాలని ఆదేశించారు. డెల్టా రకం భారత్ సహా 135 దేశాల్లో తీవ్రత చూపుతోందన్నారు. దేశంలోని 50% కేసులు కేరళ నుంచే వచ్చాయని, డెల్టా వైరస్ శరీరంపై ఎక్కువ కాలం తీవ్ర ప్రభావాన్ని చూపడంతో పాటు ఇన్ఫెక్షన్ కలిగించే సామర్థ్యాన్ని శాస్త్రవేత్తలు గుర్తించినట్లు వివరించారు. సేకండ్ వేవ్ ఇంకా పూర్తిగా తగ్గలేదని.. ఖమ్మం, నల్లగొండ, కరీంనగర్ వంటి చోట్ల కేసులు అధికంగానే ఉన్నాయని చెప్పారు. కూసుమంచి గ్రామంలో ఒకేసారి భారీగా కేసులు నమోదైన ఘటనలు చూశామని, పాజిటివ్ వచ్చిన వారు ఐసోలేషన్‌లో ఉండకుండా బయట తిరుగుతున్నారన్నారు. మంచిర్యాల, పెద్దపల్లి, జీహెచ్ఎంసీ, ఖమ్మం వంటి చోట్ల అత్యధికంగా కేసులు చూస్తున్నామని, దాదాపు 9 జిల్లాల్లో కేసులు ఎక్కువగానే ఉన్నాయన్నారు. విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల ఆరోగ్యానికి సంబంధించిన పరీక్షలు నిరంతరం కొనసాగిస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో 2.2 కోట్ల మంది టీకాలకు అర్హులని, వీరిలో 1.12 కోట్ల మందికి ఇప్పటి వరకు సింగల్ డోస్ ఇచ్చామని, 33.79 లక్షల మందికి రెండు డోస్‌లు పూర్తి చేశామన్నారు. ఈ నెలలో ఇప్పటివరకు 30.04 లక్షల డోసులు పంపిణీ చేశామని, కేటాయించిన దానికన్నా 9.5 లక్షల డోసులు అదనంగా రాష్ట్రానికి వచ్చాయన్నారు. కోవిషీల్డ్ 22.32 లక్షల మందికి రెండో డోస్ ఇవ్వాల్సి ఉంటే అందులో 12 లక్షల మందికి అందించినట్లు చెప్పారు. కోవాక్సిన్ 3 లక్షల మందికి పైగా రెండో డోస్ ఇవ్వాల్సి ఉందన్నారు. రానున్న రెండు వారాల్లో రెండో డోసుకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు చెప్పారు. -
ఇప్పటికే 6 వేల హోటళ్లు మూత.. మళ్లీ అప్పులు చేసి!
సాక్షి, బెంగళూరు/బనశంకరి: దేశ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి సుడిగుండంలో చిక్కుకొని హోటళ్ల రంగం విలవిలలాడుతోంది. లక్షలాది మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పించే ఈరంగం పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయింది. నష్టాలు భరించే శక్తిలేక 10 నుంచి 15 శాతం వరకు యజమానులు తమ హోటళ్లను విధిలేని పరిస్థితుల్లో విక్రయానికి పెట్టారు. ఉద్యోగాల వేటలో విసిగిపోయిన ఎంతో మంది చిన్నపాటి హోటల్స్ ఏర్పాటు చేసుకొని జీవనం సాగిస్తున్నారు. మరికొందరికి ఉపాధి కల్పిస్తున్నారు. హోటళ్ల యజమానుల సంఘం సమాచారం ప్రకారం రాష్ట్రంలో 70వేల హోటల్స్, రెస్టారెంట్లు ఉండగా ఒక్క బెంగళూరు నగరంలో 25 వేల హోటళ్లు, రెస్టారెంట్లు రిజిస్ట్రేషన్ అయ్యాయి. కరోనా నిబంధనలు, లాక్డౌన్ వెరసి ఏడాదిన్నర కాలంగా హోటళ్ల యజమానులు ఆర్థికంగా దెబ్బతిన్నారు కరోనాతో లాక్డౌన్ వల్ల నెలల పాటు హోటల్స్ మూతపడ్డాయి. ఒక రూపాయి కూడా ఆదాయం లేకపోగా లక్షలాది రూపాయల అద్దె, వంటపనివారు, సహాయకులకు వేతనాలు చెల్లించలేని స్థితిలో యజమానులు ఉన్నారు. దీంతో చాలా మంది హోటల్స్‌ను విక్రయానికి ఉంచారు. వీరిలో ఒకటికంటే ఎక్కువ హోటళ్లు కలిగిన కొందరు యజమానులే అధికం. మొత్తం పదివేల వరకు హోటళ్లు విక్రయానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. కాగా హోటల్స్‌ను కొనేవారు లేక వాటిని లీజుకు ఇవ్వాలనే యోచనలో కొందరు యజమానులు ఉన్నారు. బెంగళూరులో 10 శాతం హోటళ్లకు నష్టాలు తమిళనాడులో 30 శాతం హోటళ్లను యజమానులు విక్రయానికి పెట్టడం గమనించామని, కర్ణాటకలో 10 శాతం హోటల్స్‌ను అమ్మకానికి పెట్టినట్లు సమాచారం ఉందని బెంగళూరునగర హోటల్ యజమానుల సంఘం కార్యదర్శి పీసీ.రావ్ ప్రకారం తెలిపారు. సుమారు 6 వేల హోటళ్లను ఇప్పటికే మూసివేశారన్నారు. అన్‌లాక్ నేపథ్యంలో కొందరు యజమానులు ఇటీవల మళ్లీ అప్పులు చేసి హోటళ్లు తెరిచారన్నారు. -
నెయ్యి తయారీ కేంద్రాలపై దాడులు
సాక్షి, అమరావతి బ్యూరో: కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సాగుతున్న ఆహార పదార్థాల కల్తీ వ్యాపారంపై సోమవారం ‘సాక్షి’ దినపత్రికలో ‘ఆహారం.. హాహాకారం’ శీర్షికన ప్రచురితమైన కథనంపై ప్రభుత్వం స్పందించింది. రాష్ట్ర ఆహార భద్రత విభాగం కమిషనర్ ఆదేశాల మేరకు విజయవాడ నగరంలో నెయ్యి తయారీ కేంద్రాలు, హోటళ్లపై ఆహార భద్రత, విజిలెన్స్, రెవెన్యూ అధికారులు మంగళవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. విజయవాడ నగర శివారులోని అజిత్‌సింగ్ నగర్, ఇందిరానాయక్ నగర్, పాత రాజరాజేశ్వరి పేట, కొత్త రాజరాజేశ్వరి పేట ప్రాంతాల్లోని నెయ్యి తయారీ కేంద్రాలను, బీసెంట్ రోడ్డులోని పలు హోటళ్లను అధికారులు తనిఖీ చేశారు. కలెక్టర్ ఇంతియాజ్ నేతృత్వంలో జాయింట్ కలెక్టర్ కె.మాధవీలత ఆదేశాల మేరకు రెవెన్యూ, విజిలెన్స్, ఆహార భద్రత విభాగం అధికారులు నాలుగు బృందాలుగా ఏర్పడి సోదాలు జరిపారు. నెయ్యి తయారీ కేంద్రాలు, హోటళ్లలో ఆహార పదార్థాల్లో ఉపయోగించే ముడి సరకు నమూనాలను సేకరించారు. సేకరించిన 14 నమూనాలను పరీక్షల కోసం హైదరాబాద్ పంపుతున్నామని, ల్యాబ్ నుంచి వచ్చే నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని ఆహార భద్రతాధికారి పూర్ణచంద్రరావు తెలిపారు. ఈ దాడుల్లో రూ.5.45 లక్షల విలువైన పామాయిల్, రూ.3.81 లక్షల విలువైన నెయ్యి, రూ.27,000 వేలు విలువైన వేరుశనగ నూనెను సీజ్ చేశామన్నారు. రాత్రి వరకూ కొనసాగిన తనిఖీలు మంగళవారం ఉదయం ప్రారంభించిన తనిఖీలు రాత్రి వరకూ కొనసాగాయి. విజయవాడ పటమట డివిజన్లోని సాయినగర్‌లో ఉన్న పారడైజ్ ఫుడ్ కోర్టును ఆహార భద్రతాధికారి టి.శేఖర్‌రెడ్డి నేతృత్వంలో విజిలెన్స్ ఇన్స్పెక్టర్ ఎం.శేఖర్, తహసీల్దార్ డీవీఎస్ ఎల్లారావు తనిఖీ చేశారు. నాణ్యత సరిగా లేవన్న అనుమానంతో కారం పొడిని, మటన్ దమ్ బిర్యానీ నమూనాలను సేకరించారు. రెండో బృందానికి ఆహార భద్రతాధికారి ఎన్.రమేష్‌బాబు నేతృత్వం వహించారు. ఈ బృందం గవర్నర్‌పేటలోని ఆంజనేయ ఫ్యామిలీ రెస్టారెంట్‌ను తనిఖీ చేసింది. రూ.4,225 విలువ చేసే నాణ్యత లేని 65 కిలోల వేరుశనగ గుండ్లను సీజ్ చేశారు. కిచెన్ రూం పరిశుభ్రంగా లేదని, రిఫ్రిజిరేటర్ కూడా సరిగా లేదని, తక్షణమే వాటిని సరిచేసుకోవాలంటూ హోటల్ యజమానికి నోటీసులు ఇచ్చారు. ఇదే బృందం కొత్త రాజరాజేశ్వరి పేటలోని శ్రీలక్ష్మి దివ్య బాబు డెయిరీని తనిఖీ చేసింది. అక్కడ తయారు చేస్తున్న ఆవు నెయ్యి, గేదె నెయ్యిలను పరిశీలించింది. 193.4 కిలోల ఆవు నెయ్యి, 700.4 కిలోల గేదె నెయ్యిని సీజ్ చేసి వాటి నమూనాలను ల్యాబ్‌కు పంపించారు. ఆహార భద్రతా అధికారి గోపాలకృష్ణ ఆధ్వర్యంలోని మూడో బృందం అజిత్‌సింగ్ నగర్‌లోని ఇందిరానాయక్ నగర్లో శ్రీకృష్ణా వెగాన్ ఘీ పేరుతో నిర్వహిస్తున్న నెయ్యి తయారీ కేంద్రాన్ని తనిఖీ చేసింది. అక్కడ ఇతర బ్రాండ్లను పోలిన ప్యాకింగ్ లేబుల్స్‌ను వినియోగిస్తుండటంతో 2,500 నెయ్యి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. అక్కడే 70 కిలోల నకిలీ పామాయిల్‌ను అధికారులు గుర్తించి నమూనాను సేకరించారు. అనంతరం గవర్నర్‌పేటలోని బర్కత్ హోటల్‌ను తనిఖీ చేశారు. అక్కడ చికెన్ దమ్ బిర్యానీ, చికెన్ వింగ్స్‌లో అధికంగా కలర్ వాడినట్టు గుర్తించారు. వాటిన నమూనాలను సేకరించారు. ఆహార భద్రతాధికారి పి.శ్రీకాంత్ నేతృత్వంలోని నాలుగో బృందం అజిత్‌సింగ్ నగర్‌లోని వెంకటేశ్వర జనరల్ ట్రేడర్స్‌ను తనిఖీ చేసింది. ఇందులో నాణ్యతపై అనుమానం రావడంతో విజయ ప్రీమియం డబుల్ ఫిల్టర్డ్ గ్రౌండ్నట్ ఆయిల్ నమూనాను సేకరించి.. 9 ఆయిల్ టిన్నులను సీజ్ చేశారు. 58 టిన్నుల్లో నిల్వ ఉంచిన 3,600 కిలోల పామాయిల్‌ను సీజ్ చేశారు. అనంతరం వన్‌టౌన్‌లోని ఇస్లాంపేటలోని మిలాప్స్ పంజాబీ హోటల్‌ను తనిఖీ చేశారు. అక్కడ నాణ్యత సరిగా లేవన్న కారణంతో బిర్యానీ, పెరుగు నమూనాలను సేకరించారు. -
‘రుచి’ చూపిస్తున్న ఎన్నికలు
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ దెబ్బతో ఆర్నెళ్లుగా విలవిల్లాడిన రెస్టారెంట్లు, హోటళ్లు ప్రస్తుతం కస్టమర్లతో కళకళ్లాడుతున్నాయి. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎన్నికల పుణ్యమాని రాష్ట్రం నలమూలల నుంచి ప్రధాన పార్టీల నేతలు, కార్యకర్తలంతా వచ్చి ఇక్కడే తిష్టవేయడంతో హోటళ్లు కిటకిటలాడుతున్నాయి. ప్రస్తుతం నగరంలో 80 శాతం హోటళ్లు తెరుచుకోగా, మునుపటిగా భోజనం ఆరంగించేందుకు వస్తున్న కస్టమర్లు 75 శాతానికి చేరుకున్నారు. ఇక కార్యకర్తల కోసం పార్టీలు బల్క్‌గా ఇస్తున్న ఫుడ్ ఆర్డర్ల సంఖ్య పెరగ్గా, మరోపక్క హోమ్ డెలివరీలు పెరుగుతున్నాయని ఈ–కామర్స్ సంస్థలు చెబుతున్నాయి. (జీహెచ్ఎంసీ ఎన్నికలు: రచ్చ రంబోలా) హోటళ్లకు ఎన్నికల జోష్ రాష్ట్రంలో లాక్డౌన్ సమయంలో హోటళ్లు, రెస్టారెంట్లకు భారీ దెబ్బ తగిలింది. పూర్తిగా మూసివేయాల్సి రావడంతో అద్దెలు కట్టలేక, సిబ్బందికి జీతాలివ్వలేక యజమానులు నష్టపోయారు. తిరిగి జూన్ రెండో వారంలో వీటిని తెరిచేందుకు కేంద్రం అనుమతిచ్చింది. సామాజిక దూరం పాటించేలా, ‘కోవిడ్’ జాగ్రత్తలు పాటిస్తూ రెస్టారెంట్లలో మార్పుచేర్పులు చేసినా కరోనా కేసుల నేపథ్యంలో వినియోగదారులు పెద్దగా అటు వెళ్లలేదు. దీనికి తోడు చాలా రెస్టారెంట్లలో నిష్ణాతులైన వంటగాళ్లు సొంతూళ్లకు వెళ్లిపోయారు. వారిని తిరిగి రప్పించడం యజమానులకు కష్టమైంది. కొన్ని రెస్టారెంట్లను లాభాలను పక్కనపెట్టి నడిపించినా, వినియోగదారులు రాక, అద్దెలు కట్టలేక వాటిని మూసుకున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ పరిధిలో కరోనా కేసులు తగ్గడంతో హోటళ్లు, రెస్టారెంట్లకు వస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ‘ఆగస్టు వరకు 79 శాతం రెస్టారెంట్లు మూతబడ్డాయి. అనంతరం 21 శాతం మేరకు తెరుచుకున్నా, అవి హోమ్ డెలివరీలకే ప్రాధాన్యమిచ్చాయి. ఇందులోనూ 17% తక్కువ సామర్థ్యంతో నడిచాయి. అక్టోబర్, నవంబర్లలో పరిస్థితి మెరుగైంది. మూతపడిన రెస్టారెంట్లలోని 52% తిరిగి తెరుచుకున్నాయి’ అని ఇటీవలి సర్వేలు వెల్లడించాయి. తాజాగా గ్రేటర్ ఎన్నికలు రావడంతో తెరుచుకున్న హోటళ్లకు కస్టమర్ల రాక రెట్టింపైంది. పెరిగిన బిర్యానీ ఆర్డర్లు నగరంలోని 150 డివిజన్లలో ప్రచారం చేసేందుకు హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల నుంచి అన్ని ప్రధాన పార్టీల నేతలు వచ్చి ఇక్కడే మకాం వేశారు. పొరుగు జిల్లాల నుంచి ఆయా పార్టీలకు చెందిన కనీసం 5 వేల మంది చోటామోటా నాయకులు మందిమార్బలంతో హోటళ్లలో దిగారు. వీరందరికీ ఆయా పార్టీలు డివిజన్ల వారీగా హోటళ్లలో వసతి కల్పించడంతో అవన్నీ కళకళ్లాడుతున్నాయి. గ్రేటర్ ఎన్నికలతో కస్టమర్ల తాకిడి పెరిగిందని, సీటింగ్ సామర్థ్యం సైతం 50 నుంచి 75 శాతానికి పెరిగిందని గచ్చిబౌలిలోని హోటల్ యజమాని ఒకరు తెలిపారు. వారం రోజులుగా బల్క్‌గా రోజుకు రెండు నుంచి మూడు ఆర్డర్లు ఉంటున్నాయని కూకట్‌పల్లికి చెందిన మరో రెస్టారెంట్ యజమాని తెలిపారు. (‘మూసీ’ చుట్టూ అందరి ప్రదక్షిణం) ఇక ఆగస్టు, సెప్టెంబర్లలో వివిధ వెరైటీల వంటకాల మెనూని కుదించి, డిమాండ్ ఉన్న వాటినే కస్టమర్లకు అందించగా, ప్రస్తుతం డిమాండ్ పెరగడంతో అన్ని వెరైటీలను అందిస్టున్నట్లు ఆయన వెల్లడించారు. ఇక గత 15 రోజులుగా గ్రేటర్ పరిధిలో హోమ్ డెలివరీలు పెరిగాయని జొమాటో తన సర్వేలో వెల్లడించింది. ముఖ్యంగా చికెన్, మటన్ బిర్యానీ ఆర్డర్లు పెరిగాయని, ఒకే ఆర్డర్‌పై ఎక్కువ మందికి సరిపోయే భోజనం ఆర్డర్లు ఇస్తున్న వారి సంఖ్య సైతం పెరిగిందని డెలివరీ బాయ్‌లు చెబుతున్నారు. -
అన్‌లాక్ 3.0 : హోటళ్లు, మార్కెట్లకు అనుమతి
సాక్షి, న్యూఢిల్లీ : అన్‌లాక్ 3.0లో భాగంగా దేశ రాజధాని ఢిల్లీలో హోటళ్లు, మార్కెట్ల పునరుద్ధరణకు అనుమతించారు. లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ అధ్యక్షతన బుధవారం జరిగిన ఢిల్లీ విపత్తు నిర్వహణ సంస్థ (డీడీఎంఏ) భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రయోగాత్మకంగా కోవిడ్-19 నిబంధనలతో వారాంతపు సంతలను అనుమతిస్తామని డీడీఎంఏ పేర్కొంది. జిమ్‌లను తెరిచేందుకు మాత్రం అనుమతించలేదు. దేశ రాజధానిలో కరోనా వైరస్ నెమ్మదించిన క్రమంలో హోటళ్లు, జిమ్‌లు, వారాంతపు సంతలను అనుమతించాలని ఢిల్లీ ప్రభుత్వం లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) అనిల్ బైజల్‌కు ప్రతిపాదనలు పంపింది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన అన్‌లాక్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఢిల్లీలో హోటళ్లు, మార్కెట్లను అనుమతిస్తూ నిర్ణయం తీసుకునే హక్కు తమకుందని ఆప్ ప్రభుత్వం లెఫ్టినెంట్ గవర్నర్‌కు పంపిన ప్రతిపాదనలో పేర్కొంది. ఢిల్లీలో కరోనా వైరస్ కేసుల సంఖ్య తగ్గడంతో నగర ప్రజలను వారి జీవనోపాధికి దూరంగా ఉంచరాదని రాష్ట్ర ప్రభుత్వం ఎల్జీని కోరింది. చదవండి : మెట్రో ఉద్యోగుల జీతభత్యాల్లో కోత -
ఆతిథ్యం తీరు మారింది
సాక్షి,హైదరాబాద్ : గ్రేటర్లో హోటల్ క్వారంటైన్‌కు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. కోవిడ్ లక్షణాలతో బాధపడుతున్న పలువురు రోగులు ఇంట్లో అందరితో కలసి ఉండకుండా హోటల్ గదిలో సెల్ఫ్ ఐసోలేషన్ అయ్యేందుకు ప్రాధాన్యతనిస్తున్నారు. ఈ ట్రెండ్ క్రమంగా పెరుగుతుండటంతో నగరంలో ప్రస్తుతం పలు త్రీస్టార్, ఫైవ్‌స్టార్ హోటళ్లు క్వారంటైన్ కేంద్రాలుగా మారడం విశేషం. ప్రస్తుతానికి గ్రేటర్ పరిధిలో సుమారు 50 హోటళ్లలో ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చినట్లు సమాచారం. ఆయా హోటళ్ల యాజమాన్యాలు పలు ఆస్పత్రులతో ఒప్పందం కుదుర్చుకోవడంతో అత్యవసర వైద్య సేవలందించేందుకు నేరుగా వారిని ఆస్పత్రులకు తరలించే ఏర్పాట్లు చేయడం విశేషం. హోటల్ క్వారంటైన్ ఇలా.. సికింద్రాబాద్,బేగంపేట్,కొండాపూర్,గచ్చిబౌలి,హైటెక్‌సిటీ,సోమాజిగూడా,నాంపల్లి,మాదాపూర్,లింగంపల్లి,సోమాజిగూడ,కోకాపేట్ తదితర ప్రాంతాల్లోని సుమారు 50 హోటళ్లలో కోవిడ్ రోగులకు ప్రత్యేకంగా గదులను ఏర్పాటుచేసి ఆస్పత్రిలో ఉండేరీతిలో వసతులు కల్పిస్తున్నారు. ఆయా హోటల్ గదుల్లో సుమారు మూడువేల మంది వరకు కోవిడ్ రోగులు బసచేసినట్లు సమాచారం. నిత్యం ఒక్కో రూమ్‌కు రూ.7 నుంచి రూ.10 వేల వరకు ఆయా హోటళ్ల యాజమాన్యాలు అద్దె వసూలు చేస్తున్నాయి. ఇక ఆరోగ్య పరిస్థితి విషమించిన వారిని నేరుగా ఆస్పత్రిలో చేర్పించి వారికి బెడ్ ఏర్పాటు చేసేందుకు సైతం ఆయా హోటళ్ల యాజమాన్యాలు నగరంలోని ప్రధాన ఆస్పత్రులతో ఒప్పందం కుదుర్చుకోవడం విశేషం. ప్రస్తుతం నగరంలో సుమారు మూడువేల మంది కోవిడ్ లక్షణాలతో బాధపడుతున్నవారు ఆయా హోటళ్లలో మకాం వేసినట్లు హోటల్‌రంగ నిపుణులు చెబుతున్నారు. హోటళ్లలో కల్పిస్తున్న సదుపాయాలివీ.. కోవిడ్ రోగులు, కరోనా లక్షణాలతో బాధపడుతున్నవారికి బస చేసేందుకు పలు ఆఫర్లు ప్రకటిస్తున్న పలు హోటళ్లు అందుకు తగినట్లుగా పలు వసతులు కల్పిస్తున్నాయి. నిత్యం డాక్టర్‌తో చెకప్ సదుపాయం. ► ఆన్లైన్లో అవసరమైన సమయంలో నర్సుల ద్వారా సలహాలు,సూచనలు అందజేయడం ► ఫిజియోథెరపిస్ట్, డైటీషియన్ల సలహాలు,సూచనలు అందించడం. ► ఫింగర్ పల్స్ ఆక్సీమీటర్,స్పైరోమీటర్,డిజిటల్ థర్మామీటర్ ద్వారా వైద్యసేవలు. ► గది వద్దకే అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో లంచ్, డిన్నర్ అందజేయడం. ► బీసేఫ్ యాప్ ద్వారా రోగుల పరిస్థితిని ఎప్పటికప్పుడు తనిఖీచేసి వారి పరిస్థితిని అంచనా వేయడం. ► అత్యవసర సమయంలో తమ హోటల్లో బసచేసిన రోగిని ఆస్పత్రికి తరలించి కచ్చితంగా బెడ్సదుపాయం కల్పించడం. -
వర్క్ ఫ్రం హోటల్..!
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ విసిరిన పంజాకు గ్రేటర్లో కార్యకలా పాలు సాగిస్తున్న పలు ఐటీ, బీపీఓ కంపెనీలు లక్షలాది మంది ఉద్యోగులకు ఇంటి నుంచి పని చేసేందుకు (వర్క్ ఫ్రం హోం )అవకాశమిచ్చాయి. ఇప్పుడు మరో ట్రెండు నడుస్తోంది. సీనియర్ ఉద్యోగులు నగరంలో పలు త్రీస్టార్..ఫైవ్‌స్టార్ హోటళ్లలో నుంచి పని చేస్తున్నారు. కీలక ఉద్యో గులు, ఆయా కార్పొరేట్ కంపెనీల సీఈఓలు, బిజి నెస్ హెడ్ల కోసం వర్క్ ఫ్రం హోటల్ కాన్సెప్ట్‌తో పలు హోటళ్లు ముందుకు వచ్చాయి. దీంతో నగరం లో అతిథ్య రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. కరోనా కారణంగా దేశ, విదేశీ అతిథుల రాకపోకలు నగరానికి దాదాపుగా నిలిచిపోయాయి. ఆయా హోటళ్లలో గదుల బుకింగ్‌లు సైతం రద్దయ్యాయి. ఈ నేపథ్యంలో కొత్త తరహా ఆలోచనలతో నగరం లోని పలు త్రీస్టార్, ఫైవ్‌స్టార్ హోటళ్లు వర్క్ ఫ్రం హోటల్ కాన్సెప్ట్‌తో కార్పొరేట్లను ఆకర్షిస్తున్నాయి. హైఫై, వైఫై సదుపాయాలు.. కార్పొరేట్ల అవసరాలకు తగినట్లుగా... ముఖ్యమైన వీడియో కాన్ఫరెన్స్‌లు, బోర్డు మీటింగ్‌లు, నూతన ప్రాజెక్ట్‌ల సదస్సులు, సమావేశాల నిర్వహణకు వీలుగా ఆయా హోటళ్ల యాజమాన్యాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇక వీరి అవసరాలకు అనుగుణంగా వైఫై, ప్రింటర్, వీడియో కాన్ఫరెన్స్ సదుపాయాల తోపాటు రుచి.. శుచితో పాటు హాట్‌హాట్‌గా హైజి నిక్ బాక్స్‌మీల్స్, స్నాక్స్, బేవరేజెస్‌ను అందిస్తు న్నాయి. ఆయా హోటళ్లలో పనిచేసే ఉద్యోగులు, అతిథుల మధ్య విధిగా భౌతిక దూరం ఉండేలా చూడటం, శానిటైజేషన్ ప్రక్రియను నిర్వహిస్తు న్నారు. మరోవైపు లోనికి వచ్చే ముందే థర్మల్ స్క్రీనింగ్ చేయడం, అన్ని చోట్లా.. ఎల్లవేళలా శానిటైజర్లను అందుబాటులో ఉండేలా చూడడం, అసౌకర్యం కలిగించకుండా ఆతిథ్యం అందించేం దుకు సిబ్బంది సదా అందుబాటులో ఉండడం వంటి సదుపాయాల కారణంగా పలు కంపెనీలు ఈ నయా కాన్సెప్ట్‌కు విపరీతంగా ఆకర్షితులవుతుం డటం విశేషం. ఇందు కోసం రోజులు, గంటలు.. నెలల చొప్పున రూ. లక్ష నుంచి 25 లక్షల వరకు వేర్వేరు ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. నగరంలో పలు హోటళ్లలో ఇదే ట్రెండ్.. ప్రధాన నగరంలోని సోమాజిగూడ, బంజారా హిల్స్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, బేగంపేట్, సికింద్రాబాద్ , మాదాపూర్ సహా శివార్లలోని శంషాబాద్ నోవాటెల్, గచ్చిబౌలి ప్రాంతాల్లో ఉన్న త్రీస్టార్, ఫైవ్‌స్టార్ హోటళ్లలో పలు కార్పొరేట్ సంస్థల సీఈఓలు, బిజినెస్ హెడ్లు తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. ఇప్పటికే తమ హోటల్లో గత నెలరోజులుగా సుమారు 50 బుకింగ్‌లు జరిగినట్లు సోమాజిగూడాలోని పార్క్ హోటల్ జీఎం అనిరుధ్ ‘సాక్షి’కి తెలిపారు. కరోనా కష్టకాలంలో హోటల్ల వ్యాపారం మందగించిన నేపథ్యంలో బిజినెస్ పెంచేందుకు ఇలాంటి వినూత్న ఆలోచనలు, సరికొత్త ప్యాకేజీలతో కార్పొరేట్లను ఆకర్షిస్తున్నట్లు నోవాటెల్ హోటల్ జీఎం మనీష్ పేర్కొన్నారు. ఐటీ, బీపీఓ కంపెనీలతోపాటు ఫైనాన్స్, ఇన్సూరెన్స్, నాన్‌బ్యాంకింగ్ ఆర్థిక సంస్థలు, నిర్మాణ రంగం, రియల్టీ తదితర రంగాలకు చెందిన బడా సంస్థలు సైతం తమ కార్యలయాల్లో కాకుండా ఇలా త్రీస్టార్, ఫైవ్‌స్టార్ హోటళ్లలో ముఖ్యమైన సదస్సులు, సమావేశాలు నిర్వహించుకుంటున్నాయి. కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ, పరిశుభ్రతకు పెద్దపీట వేస్తుండటం మూలంగా పలు సంస్థల కీలక ఉద్యోగులు కూడా వర్క్ ఫ్రం హోటల్‌కు ముందుకువస్తున్నారు. -
కరోనా కల్లోలంలో హైదరాబాద్ బిర్యానీ!
సాక్షి, హైదరాబాద్: వన్‌బై టూ ఇరానీ చాయ్.. ఉస్మానియా బిస్కెట్లు.. వేడివేడి సమోసా.. అంతేనా ఘుమఘుమలాడే బిర్యానీ.. హైదరాబాద్ అస్తిత్వానికి ప్రతీకలు. కానీ కరోనా సృష్టించిన కల్లోలంలో ఆ అస్తిత్వం ప్రశ్నార్థకంగా మారింది. లాక్డౌన్ కాలంలో రెండు నెలలకు పైగా మూసి ఉన్న హోటళ్లు, రెస్టారెంట్లు తిరిగి తెరుచుకున్నాయి. కానీ కరోనా మహమ్మారి భయానికి నగరవాసులు హోటళ్లకు వచ్చేందుకు వెనుకంజ వేస్తున్నారు. దీంతో కేవలం టేక్ ఎవేలకు మాత్రమే గిరాకీకనిపిస్తోంది. సాధారణంగా వీకెండ్ వచ్చిందంటే హోటళ్లు కిక్కిరిసిపోతాయి. స్నేహితులు, కుటుంబసభ్యులతో వచ్చిన వాళ్లు సీట్ల కోసం గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తుంది. హైదరాబాద్ బిర్యానీకి ఉండే డిమాండ్ గురించిప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి ఒంటిగంట వరకు హోటళ్లు సందడిగా కనిపిస్తాయి. కానీ కరోనా కారణంగా ఇప్పుడు నగరంలోని అన్ని హోటళ్లు, రెస్టారెంట్లు వెలవెలబోతున్నాయి. టేక్ ఎవేసేవలను ప్రారంభించినా 25 శాతం కూడా డిమాండ్ కనిపించడం లేదని చెబుతున్నారు. అన్ని ఏర్పాట్లు చేసినా.. వీకెండ్ ఒక ఆటవిడుపు. క్షణం తీరిక లేని నగరజీవితంలో ఒక నూతనోత్సాహం. సాఫ్ట్వేర్ నిపుణుల నుంచి సాధారణ వేతన జీవుల వరకు శని, ఆదివారాల కోసం ఎదురుచూస్తారు. ఆ రెండు రోజుల్లోనే స్నేహితులు, బంధువులు,కుటుంబసభ్యులతో కలిసి గడిపేందుకు అవకాశం లభిస్తుంది. ఓ సినిమా చూసి వారితో కలిసి హోటళ్లలో భోజనం చేసి ఇంటికి వెళ్తారు. దీంతో నగరంలోని ప్యారడైజ్, అల్ఫా, బావార్చి, బçహార్కేఫ్ షాగౌస్, మదీనా, నయాగరావంటి గొప్ప పేరున్న హోటళ్లు, మినర్వా, తాజ్‌మహల్ వంటి రెస్టారెంట్లు శని, ఆదివారాల్లో సందడిగా కనిపిస్తాయి. కానీ ఇప్పుడు ఈ హోటళ్లలోటేక్ ఎవేలకు మాత్రమే కొంత మేరకు డిమాండ్ కనిపిస్తోంది. కూర్చొనిభోజనం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసినా పెద్దగా ఆసక్తి చూపడం లేదు.‘టేక్ ఎవే సర్వీసులకు జనం బాగానే వస్తున్నారని ప్యారడైజ్ హోటల్సీనియర్ మేనేజర్ లక్ష్మణ్ అన్నారు. అప్పుడలా.. ఇప్పు‘డీలా’.. హిమాయత్‌నగర్: నగరంలోని అతి ప్రాచీనమైన హోటల్స్‌లో గుర్తొచ్చేది హిమాయత్‌నగర్‌లోని ‘మినర్వా కాఫీ షాప్’. ఇక్కడి హోటల్లో ఇడ్లీ, దోశ, టీ, కాఫీ చాలా ఫేమస్. ఓ ప్లేట్ ఇడ్లీ తిని, టీ లేదా కాఫీ తాగితే ఆ రోజు వచ్చే మజానే వేరంటారు ఫుడ్డీస్. ఐదు రోజుల క్రితం తిరిగి ప్రారంభం కావడంతో ఇప్పుడిప్పుడే ఫుడ్డీస్ కాస్త తినేందుకు ఆశ చూపిస్తున్నారు. అయితే గతంలో ఉన్న విధంగా లేదు. లాక్‌డౌన్‌కు ముందుకు ఉదయం 7గంటల నుంచి రాత్రి 10గంటల మధ్య సుమారు 600 ప్లేట్స్ ఇడ్లీలు(ప్లేటుకి రెండు) అంటే 1200ఇడ్లీలు అమ్ముడయ్యేవి. దోశలు 400–500 వరకు తినేవారు. టీ, కాఫీ సుమారు 600–700మంది తాగేవారు. ఐదు రోజులుగా 60–70 ప్లేట్ల ఇడ్లీలు సేల్ అవుతున్నాయి. దోశలు 15–30 వరకు టేస్ట్ చేస్తున్నారు. ఇక టీ, కాఫీలను 20–30మంది మాత్రమే తాగుతుండటం గమనార్హం. ప్యారడైజ్.. మొదలైన డైన్.. లాక్డౌన్ ప్రకటించిన దగ్గర నుంచి దాదాపు 80 రోజుల పాటు మూసివేసిన ప్యారడైజ్ హోటల్‌కు మళ్లీ కళ మొదలైంది. అయితే లాక్డౌన్లో సడలింపులు ఇచ్చిన దగ్గర నుంచి 20 రోజులుగా టేక్ఎవే సేవలు కొనసాగిస్తుండగా, శుక్రవారం నుంచి హోటల్లోనే కూర్చొని భోజనం చేసేందుకు వీలుకల్పించారు. సాధారణ రోజుల్లో కంటే ప్రస్తుతం 25 శాతం భోజన ప్రియులు మాత్రమే బిర్యానీ తిన్నట్లు మేనేజ్మెంట్ పేర్కొంది. కరోనా నేపథ్యంలో పూర్తిస్థాయి జాగ్రత్తలు తీసుకుంటున్నాం.. టేబుల్‌కు ఇద్దరికి మాత్రమే అవకాశం కల్పిస్తున్నాం.. టేబుల్‌కు మరో టేబుల్‌కు మధ్య భౌతిక దూరం ఉండేలా చర్యలు తీసుకున్నాం.. హోటల్లో సర్వ్ చేసే సిబ్బందిమాస్క్లు, చేతి గ్లౌజ్‌లు తప్పనిసరిగా ధరించేలా చర్యలు తీసుకున్నట్లు యాజమాన్యం తెలిపింది. హోటల్‌కు వచ్చేవారు కూడా మాస్క్ ధరించి రావాలి. వారికి శానిటైజేషన్‌ను అందుబాటులో ఉంచాం. థర్మల్ స్క్రీనింగ్ తర్వాతే లోపలికి అనుమతిస్తున్నాం అని వివరించారు. పనిచేస్తున్నట్లే లేదు 25 ఏళ్లుగా ఈ హోటల్లో పని చేస్తున్నాను. ఉదయం 5గంటల నుంచి నా డ్యూటీ అయ్యేలోపు(మధ్యాహ్నం) సుమారు 600–700వాయిల ఇడ్లీలు వేస్తాను. తర్వాత వచ్చే అతను కూడా ఇంచుమించు ఇలాగే వేస్తాడు. ఇక దోశలు రోజు మొత్తం 400–500 వేస్తాం. ఇప్పుడు ఇడ్లీలు రోజూ 60–70 వేస్తున్నాం. దోశలు 20–30 వేస్తున్నా. – రాజు, ఇడ్లీ, దోశ మాస్టర్, మినర్వా కాఫీ షాప్, హిమాయత్‌నగర్. టేక్ అవే సేవలకు ఓకే.. ఈ నెల 8వ తేదీ నుంచే షాగ్‌హౌస్ హోటల్ సేవలను అందుబాటులోకి తెచ్చాం. నలుగురు కూర్చునే టేబుల్‌ను ఇద్దరికి పరిమితం చేశాం. హోటల్‌ను ప్రతిరోజు పూర్తిగా శానిటైజ్ చేస్తున్నాం. సిబ్బంది కూడా పరిమితంగా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అయినా 50 శాతం మంది మాత్రం టేక్ ఎవేల ద్వారా పార్సిళ్లను తీసుకెళ్తున్నారు. 25 శాతం మాత్రం కూర్చుని తినేందుకు ముందుకు వస్తున్నారు. ఇక జొమాటో, స్విగ్గీల నుంచి పెద్దగా ఆర్డర్లు రావడం లేదు. – రబ్బానీ, షాగౌస్ హోటల్ యజమాని టేస్ట్ ఒకేలా ఉంది నేను ఐదారు సంవత్సరాల నుంచి ఇక్కడి మినర్వాకు వారంలో రెండు లేదా మూడు పర్యాయాలు వస్తుంటా. మొదటిసారి వచ్చినప్పుడు టేస్ట్ ఎంత రుచిగా ఉందో.. ఇప్పుడు కూడా అలాగే ఉంది. లాక్డౌన్ తర్వాత వంటకాల్లో మార్పు ఉంటుందేమో అనుకున్నాను. కానీ.. అలా లేదు ఇక్కడ. – శ్రావణ్, హిమాయత్‌నగర్, డైలీ కస్టమర్. డిమాండ్ బాగా తగ్గింది కోవిడ్ నిబంధనల మేరకు ప్రతి వినియోగదారుడికి థర్మల్ స్క్రీనింగ్ చేస్తున్నాం. మాస్కులు ఉన్నవాళ్లనే అనుమతిస్తున్నాం. వినియోగదారుల పేర్లు, ఫోన్ నంబర్లు కూడా నమోదు చేస్తున్నాం. సీట్ల మధ్య పార్టిషన్ ఏర్పాటు చేశాం. అన్ని చోట్ల శానిటైజర్లు అందుబాటులో ఉంచాం. అయినా వినియోగదారులు పెద్దగా ముందుకు రావడం లేదు. 160 నుంచి 170 వరకు ఉదయం అల్పాహారం పార్సిళ్లు వెళ్తున్నాయి. ఇంచుమించు మధ్యాహ్నం లంచ్ కూడా అదేవిధంగా ఉంది. – ప్రవీణ్, తాజ్‌మహల్ రెస్టారెంట్ యజమాని, సికింద్రాబాద్ -
హోటల్స్, కస్టమర్లకు పేటీఎం గుడ్‌న్యూస్
ముంబై: కరోనా వైరస్ విలయతాండవంతో అన్ని రంగాలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. వీటిలో హోటల్ పరిశ్రమ తీవ్ర నష్టాలను చవిచూసింది. ఈ నేపథ్యంలో డిజిటల్ పేమెంట్స్ సంస్థ పేటీఎం హోటల్ వ్యాపారులకు, కస్టమర్లకు ఉపయోగపడే నిర్ణయం తీసుకుంది. పేటీఎమ్ సంస్థ ‘స్కాన్ టు ఆర్డర్’ పేరిట సరికొత్త ఆవిష్కరణ చేసింది. లక్షలాది మంది భారతీయులకు సురక్షిత ఆహారాన్ని అందించడంలో ఈ ఆవిష్కరణ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపింది. అయితే స్టార్ హోటల్స్, రెస్టారెంట్స్, కేఫ్.. ఎక్కడికి వెళ్లినా కస్టమర్లు పేటీఎం క్యూఆర్ కోడ్‌ను వినియోగించవచ్చని పేటీఎం తెలిపింది. ఇది వరకు వినియోగదారుడు భోజనానికి ఆర్డర్ చేసే ముందు మెను పేపర్‌ను టచ్ చేసే వారు.. ప్రస్తుతం క్యూఆర్ స్కాన్‌తో తనకు ఇష్టమైన ఆహారాన్ని ఆస్వాధించవచ్చని తెలిపింది. పేటీఎం సంస్థ లేబల్ ఉత్పత్తిని(పేరు, లోగో, బ్రాండ్) రెస్టారెంట్లు, ఆహార సంస్థలకు క్యూఆర్ కోడ్ ద్వారా అందిస్తోంది. (చదవండి: పేటీఎం అప్డేట్.. డబ్బులు హాంఫట్!) ఆహార రంగంలో విప్లవాత్మక సంస్కరణలకు తమ ఆవిష్కరణ ఎంతో ఉపయోగపడుతుందని.. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతో ఈ అంశంపై చర్చలు జరుపుతున్నట్లు ప్రకటించింది. అయితే పేటీఎం వాలెట్, పేటీఎం యూపీఐ, నెట్‌బ్యాంకింగ్, తదితర కార్డులు ఉన్న ప్రతి వినియోగదారుడు స్కాన్ టు ఆర్డర్ కోడ్‌ను ఇన్స్టాల్ చేసుకోవచ్చని సంస్థ తెలిపింది. పేటీఎం యాప్ ద్వారా క్యూఆర్ కోడిని స్కాన్ చేసి ఆర్డర్‌కు వర్తించే నిబంధనలు.. 1)మొదటగా పేటీఎమ్ యాప్ ద్వారా రెస్టారెంట్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మెను చెక్ చేయాలి 2)వినియోగదారులకు ఇష్టమైన ఆహారాన్ని ఆర్డర్ చేయుటకు యాప్‌లో యాడ్ ఐకాన్ ఆఫ్షన్ సెలక్ట్ చేయాలి 3)ఆఫ్షన్ సెలక్ట్ చేసాక గో టు కార్ట్ ఆఫ్షన్ ను సెలక్ట్ చేయాలి 4)చివరగా ట్రాన్సాక్షన్ పూర్తి చేయుటకు ప్రొసీడ్ టు పేటీఎం ఆఫ్షన్ సెలక్ట్ చేయాలి. ఈ నియమాలతో మీరు ఎంచుకున్న ఆహారానికి సంబంధించిన ఆర్డర్‌ను పొందవచ్చు. -
అప్రమత్తంగా ‘ఆతిథ్యం’
సాక్షి, అమరావతి: లాక్డౌన్ మినహాయింపుల్లో భాగంగా ఆతిథ్య రంగానికి చెందిన వ్యాపార సంస్థలు పాటించాల్సిన విధి విధానాలను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. హోటళ్లు, రెస్టారెంట్లు, హోమ్‌స్టేలు, ఇతర వసతులను నిర్వహించే సంస్థలు తాజా మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. హోటళ్లు ఏం చేయాలంటే.. ► ప్రవేశ ద్వారాల వద్ద హ్యాండ్ శానిటైజర్లు ఉంచాలి. థర్మల్ స్క్రీనింగ్ తప్పనిసరిగా చేయాలి. ► మాస్కులు ధరించాలి. ఉమ్మి వేయడం నిషిద్ధం. సిబ్బంది, అతిథులు మొబైల్ ఫోన్లలో ‘ఆరోగ్య సేతు’ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ► అతిథుల పూర్తి వివరాలను నమోదు చేయాలి. అంతర్జాతీయ అతిథుల కోసం ఏ అండ్ డీ రిజిస్టర్ నిర్వహించాలి. ► వీలైనంత వరకు డిజిటలైజేషన్ ప్రక్రియను పాటించాలి. అతిథుల బ్యాగేజీని డిస్ఇన్ఫెక్షన్ చేసిన తరువాతే గదుల్లోకి అనుతించాలి. ► చెక్ ఔట్ చేసిన వెంటనే ఆ గదులను శుభ్రం చేయాలి. లినెన్, టవళ్లు మార్చాలి. ► సిబ్బందిని బ్యాచ్‌లుగా విభజించి విడతల వారీగా విధులు కేటాయించాలి. సిబ్బందికి మాస్కులు, గ్లౌజులు, లాంగ్ గౌన్లు, కళ్లద్దాలు, ఫేస్ షీల్డ్ మొదలైనవి సమకూర్చాలి. ► డోర్ నాబులు, స్విచ్చులు, హ్యాండిళ్లు, కుళాయిలు మొదలైనవి తరచూ శానిటైజ్ చేయాలి. ► మేనేజ్మెంట్ ఉన్నత స్థాయిలో ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌ను ఏర్పాటు చేయాలి. ► అతిథులు, సిబ్బందికి కరోనా వ్యాప్తి నివారణ చర్యలు చేపట్టాల్సిన బాధ్యత ఈ ర్యాపిడ్ రెస్సాన్స్ టీమ్‌లదే. విశాఖ మద్దిలపాలెంలోని ఓ షాపింగ్‌మాల్‌లో కస్టమర్ల సందడి అతిథులు పాటించాల్సినవి ► గది లోపల బట్టలు ఉతక్కూడదు. బాల్కనీలో నిలబడి పక్క గది బాల్కనీలో ఉన్న అతిథులతో సంభాషించకూడదు. గదుల్లోకి సందర్శకులకు అనుమతి లేదు. ► ఉపయోగించాక అన్ని డిస్పోజబుల్ ప్లేట్లు, గ్లాసులు, కప్పులు, బాటిళ్లను గార్బేజ్ బ్యాగ్‌లో వేయాలి. రెస్టారెంట్లు ఇవి పాటించాలి ► భౌతిక దూరం పాటించేలా మార్కింగ్‌లు వేయాలి. వీలైనంత వరకు టేక్ అవే లేదా పార్సిళ్లను ప్రోత్సహించాలి. 4 టేబుళ్లను దూరం దూరంగా ఏర్పాటు చేయాలి. సిబ్బందికి ప్రతిరోజూ థర్మల్ స్క్రీనింగ్ చేయాలి. 4 సిబ్బంది అంతా మాస్కులు, గ్లౌజులు, ఫేస్ షీల్డ్ ధరించాలి. ఏసీల కోసం నిర్దేశించిన మార్గదర్శకాలను పాటించాలి. ► రెస్టారెంట్లకు వచ్చే అతిథులను థర్మల్ స్క్రీనింగ్ తర్వాతే లోనికి అనుమతించాలి. ► డిస్పోజబుల్ ప్లేట్లు, కప్పులు, గ్లాసులు, నాప్కిన్లు వాడాలి. బఫేట్ సేవలకు అనుమతి లేదు. 4 కిచెన్, అన్ని వంట వస్తువులు, ఫర్నిచర్ తరచూ డిస్ఇన్ఫెక్షన్ చేయాలి. 4 మాంసాహార పదార్థాలను శానిటైజ్ చేసేందుకు 100 పీపీఎం క్లోరిన్, శాఖాహార పదార్థాలను శానిటైజ్ చేసేందుకు 50 పీపీఎం క్లోరిన్‌ను వాడాలి. 4 హోం డెలివరీల కోసం ఉపయోగించే వాహనాలను తరచూ డిస్ఇన్ఫెక్షన్ చేయాలి. డ్రైవర్, ఇతర సిబ్బంది మాస్కులు, గ్లౌజులు ధరించాలి. -
రేపటి నుంచి తెరుచుకోనున్న పర్యాటక హోటల్స్
-
అన్‌లాక్ ఇలా..
సాక్షి, హైదరాబాద్ : సాధారణంగా ఏదైనా రెస్టారెంట్‌కు కుటుం బంతో కలసి వెళ్లినప్పుడు మనం ఏం చేస్తాం? మెనూ కార్డు తీసుకొని ఆర్డర్ ఇచ్చేందుకు ఇంటిల్లిపాదీ దాన్ని తరచితరచి చూస్తాం. ఆపై మనం పక్కనపెట్టిన కార్డును పక్క టేబుల్‌పై ఉన్న కస్టమర్లకు వెయిటర్లు ఇవ్వడమూ చూస్తుంటాం. కానీ కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇకపై మెనూ కార్డు చేతులు మారే పరిస్థితికి తెరపడనుంది. ప్లాస్టిక్ మెనూ కార్డు స్థానంలో డిస్పోజబుల్ (ఒకసారి వినియోగించి పారేసే) మెనూ కార్డు దర్శనమివ్వనుంది. వీలైతే కాంటాక్ట్‌లెస్ ఆర్డర్ల విధానం అమల్లోకి రానుంది. హోటళ్లు, రెస్టారెంట్లలోని ఏసీల్లో ఉష్ణోగ్రత కేవలం 24–30 డిగ్రీల సెల్సియస్‌కే పరిమితం కానుంది. హోటళ్లు, షాపింగ్ మాళ్లను సందర్శించే వినియోగదారుల కోసం ఈ మేరకు కొత్త నిబంధనలు ఎదురుచూస్తున్నాయి. దేశంలో కరోనా లాక్డౌన్ కారణంగా దాదాపు 80 రోజు లుగా మూతపడిన వాణిజ్య కార్యాలయాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాళ్లను ఈ నెల 8 నుంచి తిరిగి తెరిచేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం తాజాగా సడలింపుల మార్గదర్శకాలను ప్రకటించింది. షాపింగ్ మాళ్లు, వాణిజ్య కార్యాలయాలు, హోటళ్లు, రెస్టారెంట్లకు కేటగిరీలవారీగా నిబంధనలు విధించింది. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించింది. సుదీర్ఘ విరామం తర్వాత తెరుస్తున్నందున ముందుగా శానిటైజేషన్ చేశాకే ఉద్యోగులు, సిబ్బందిని లోనికి అనుమతించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది. కరోనా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే... కరోనా వ్యాప్తిని నిలువరించడంలో కీలకమైన భౌతికదూరం పాటించడంతోపాటు ప్రతి వ్యక్తి మాస్కు తప్పనిసరిగా ధరించాలని, ఏవైనా వస్తువులు తాకినప్పుడు లేదా పనికి ముందు, తర్వాత తప్పకుండా చేతులను శానిటైజర్/హ్యాండ్‌వాష్/సబ్బుతో కనీసం 20 సెకన్లపాటు శుభ్రపర్చుకోవాలని కేంద్రం సూచించింది. ప్రతి వాణిజ్య కార్యాలయం, హోటల్, రెస్టారెంట్, షాపింగ్ మాల్లో యాజమాన్యం, సిబ్బంది తప్పనిసరిగా మాస్కు ధరించి భౌతికదూరం పాటించాలని, వినియోగదారులను తాకకుండా జాగ్రత్త పడాలని పేర్కొంది. విధులకు వచ్చే ఉద్యోగులు, సిబ్బందితోపాటు వినియోగదారులకు థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించాలని, జ్వరం, దగ్గు తదితర లక్షణాలతో వచ్చే వారి గురించి వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బందికి లేదా 104 టోల్‌ఫ్రీ నంబర్‌కు సమాచారం ఇవ్వాలని సూచించింది. కేటగిరీలవారీగా కేంద్రం మార్గదర్శకాలు ఇవీ... హోటళ్లు, అనుబంధ యూనిట్లు... ► గర్భిణులు, పదేళ్లలోపు పిల్లలు, 65 ఏళ్లు పైబడిన వారిని అనుమతించొద్దు. ►పనిచేసే సిబ్బంది తప్పకుండా మాస్కులు ధరించడంతోపాటు చేతికి గ్లౌజులు తొడుక్కోవాలి. ►కస్టమర్లు క్యూలలో నిల్చొనేటప్పుడు తప్పకుండా 6 అడుగుల భౌతికదూరం ఉండేలా ఏర్పాట్లు చేయాలి. ►రిసెప్షన్ వద్ద శానిటైజర్లు, వాష్ ఏరియాల్లో తప్పకుండా హ్యాండ్‌వాష్‌లు ఏర్పాటు చేయాలి. ► హోటల్‌కు వచ్చే అతిథుల వివరాలను పూర్తిగా నమోదు చేసుకోవాలి. అందుకు ప్రత్యేకంగా రిజిస్టర్ ఏర్పాటు చేయాలి. కార్యాలయాల్లో... ► ఎక్కువ మంది సిబ్బంది ఉండే కార్యాలయాలు సిబ్బందిని ఒకేసారి కాకుండా విడతలుగా లేదా వర్క్ ఫ్రం హోంకు అవకాశం ఇవ్వాలి. ► ప్రతి ఉద్యోగికి థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించడంతోపాటు మాస్కు వేసుకునేలా చేడాలి. ► లిఫ్ట్‌ల వాడకాన్ని పూర్తిగా తగ్గించాలి. కార్యాలయం ప్రవేశంలోనే శానిటైజర్లు ఏర్పాటు చేసి వాటితో శుభ్రం చేసుకునేలా అవగాహన కల్పించాలి. ► శరీర ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నవారిని, జలుబు, దగ్గు తదితర లక్షణాలున్నవారికి ప్రవేశం అనుమతించవద్దు. ► మీటింగ్‌లను వీలైనంత తగ్గించుకొని ఆన్లైన్ పద్ధతిలో ఆదేశాలు జారీ చేసేలా చర్యలు తీసుకోవాలి. ► వాలెట్ పార్కింగ్ సిబ్బంది పూర్తి జాగ్రత్తతో ఉండేలా ప్రత్యేక చొరవ తీసుకోవాలి. రెస్టారెంట్లలో... ► కస్టమర్ల్ల సీటింగ్ స్పేస్ విశాలంగా ఉండేలా, వ్యక్తుల మధ్య ఫిజికల్ డిస్టెన్స్ పాటించేలా ఏర్పాట్లు చేయాలి. ► 50% సీటింగ్ సామర్థ్యానికి మించి వినియోగదారులను అనుమతించకూడదు. ► వృద్ధులు, చిన్నపిల్లల్ని అనుమతించవద్దు. ► డిస్పోజబుల్ మెనూలను వాడాలి. ఒకరు వాడిన మెనూను మరొకరు వాడకుండా చూడాలి. ► బట్ట న్యాప్కిన్లకు బదులు వినియోగదారులకు కాగితపు న్యాప్కిన్లు ఇవ్వాలి. ► కాంటాక్ట్‌లెస్ అర్డర్లతోపాటు డిజిటల్ చెల్లింపుల విధానాన్ని ప్రోత్సహించాలి. ► ప్రధానంగా పార్శిల్ కౌంటర్లను ఏర్పాటు చేయాలి. టేక్ అవేను ప్రోత్సహించేలా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలి. ► డోర్ డెలివరీ చేసే సిబ్బందికి తరచూ థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు చేయడంతోపాటు శానిటైజర్ వినియోగాన్ని విస్తృతంగా వాడేలా చూడాలి. ► సెంట్రలైజ్డ్ ఏసీ వాడకాన్ని తగ్గించి బయటిగాలి వచ్చేలా ఏర్పాట్లు చేసుకోవాలి. ► కస్టమర్లు వచ్చి వెళ్లిన వెంటనే శానిటైజేషన్ చేయాలి. షాపింగ్ మాల్స్‌లో... ► లోనికి వచ్చే ఉద్యోగులు మొదలు కస్టమర్లకు ప్రవేశద్వారం వద్ద థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించి శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకునే ఏర్పాట్లు చేయాలి. ► షాపింగ్‌మాల్ సామర్థ్యంలో సగం మందికే ప్రవేశం కల్పించాలి. ► ప్రతి కస్టమర్ ఎడం పాటించేలా చూసేందుకు ప్రత్యేకంగా సిబ్బందిని నియమించాలి. ► ఉద్యోగులు, సిబ్బంది చేతికి గ్లౌజులు వేసుకున్నాకే కస్టమర్లకు వస్తువులు అందించాలి. ► పిల్లల ఆట ప్రాంగణాలను తెరవకూడదు. ► లిఫ్ట్ వినియోగాన్ని తగ్గించి ఎస్కలేటర్లను ప్రోత్సహించాలి. కస్టమర్ల తాకిడిని బట్టి వీలైనప్పుడల్లా షాపింగ్ మాల్‌ను సోడియం హైపోక్లోరైడ్ లాంటి ద్రావణంతో శానిటైజ్ చేయాలి. -
సకల జాగ్రత్తలతోనే పునఃప్రారంభించాలి
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కంటైన్మెంట్ జోన్ల వెలుపల రెస్టారెంట్లు, హోటళ్లు, షాపింగ్ మాల్స్, ఆధ్యాత్మిక స్థలాలు, ప్రార్థనా స్థలాలను ఈ నెల 8 నుంచి తెరుచుకునేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ నిబంధనలను సడలించిన నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ ప్రామాణిక నియమావళి (ఎస్ఓపీ)ని గురువారం విడుదల చేసింది. ఈ మార్గదర్శకాల్లో ఏముందంటే.. ఎలాంటి అనారోగ్య లక్షణాలు లేనివారిని మాత్రమే హోటళ్లలో నియమించుకోవాలి. వినియోగదారుల విషయంలోనూ ఇలాంటి జాగ్రత్తలే పాటించాలి. ఇక సామాజిక దూరం తప్పనిసరి. వాహనాల పార్కింగ్ ప్రాంతాల్లో హోటళ్లలో రద్దీ పెరగకుండా నియంత్రించాలి. హోటళ్లలో పనిచేస్తున్న వారిలో వృద్ధులు, గర్భిణులు ఉంటే వారు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. వినియోగదారులతో డైరెక్టు కాంటాక్టు ఉండే విధులకు వారిని దూరంగా ఉంచాలి. ప్రజలు, సిబ్బంది రావడానికి, తిరిగి వెళ్లడానికి.. అలాగే సరుకుల రవాణాకు వేర్వేరు దారులు ఉండాలి. సాధ్యమైనంత వరకు పార్సిళ్ల రూపంలోనే.. రెస్టారెంట్లు, హోటళ్లలో ఆహారం ఆర్డర్ ఇవ్వడానికి, నగదు చెల్లింపులకు డిజిటల్ వేదికలను ఉపయోగించేలా ప్రోత్సహించాలి. ఇందుకు ఈ–వ్యాలెట్లు ఉపయోగించడం మేలు. హోటళ్లకు వచ్చిన అతిథుల ఆరోగ్యం, ప్రయాణ చరిత్ర వంటి వివరాలను రికార్డుల్లో భద్రపర్చాలి. వారి నుంచి గుర్తింపు పత్రాలు, సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ తీసుకోవాలి. అతిథుల లగేజీని రసాయనాలతో క్రిమిరహితం(శానిటైజ్) చేయాలి. అతిథులు, హోటల్ సిబ్బంది నేరుగా మాట్లాడుకోవడం మంచిది కాదు. ఇందుకు ఇంటర్‌కామ్/మొబైల్ ఫోన్లు ఉపయోగించుకోవచ్చు. గేమింగ్ జోన్లు, చిన్న పిల్లల ఆటస్థలాలను కచ్చితంగా మూసివేయాలి. హోటళ్లలో ఒకసారి వాడి పారేసే మెనూ కార్డులు, న్యాప్కిన్లు ఉపయోగించాలి. రెస్టారెంట్లలోనే ఆహారం తినే అవకాశాన్ని నిరుత్సాహపరుస్తూ సాధ్యమైనంత వరకు పార్సిళ్ల రూపంలో ఇచ్చేందుకు ప్రయత్నించాలి. ఫుడ్ డెలివరీ సిబ్బంది ఆహార ప్యాకెట్లను కస్టమర్ల ఇంటి డోర్ల దగ్గర వదిలేయాలి. నేరుగా వారి చేతికే అందజేయడం తగదు. హోం డెలివరీకి వెళ్లే సిబ్బందికి తప్పనిసరిగా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలి. మాస్కులు ధరిస్తేనే అనుమతి షాపింగ్ మాళ్లలోనూ కరోనా నియంత్రణ చర్యలను వంద శాతం పాటించాలి. రెస్టారెంట్లు, హోటళ్లకు విధించిన మార్గదర్శకాలే షాపింగ్ మాళ్లకు కూడా వర్తిస్తాయి. మాస్కులు ధరించినవారినే లోపలికి అనుమతించాలి. మాల్ లోపల ఉన్నంతసేపూ మాస్కు ధరించేలా చూడాలి. సందర్శకులంతా సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలి. షాపింగ్ మాల్ లోపల సందర్శకులు చేత్తో తాకేందుకు అవకాశం ఉనఅన్ని ప్రాంతాలు, వస్తువులను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయాలి. లోపల ఉమ్మివేయడం నేరం. కంటైన్మెంట్ జోన్ల బయట ఉన్న ఆధ్యాత్మిక స్థలాలు, ప్రార్థనా స్థలాలను తెరిచే విషయంలోనూ ఇవే నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. రికార్డు చేసిన పాటలు, ఆధ్యాత్మిక గీతాలు, బృంద గానాలకు ఇలాంటి చోట అనుమతి లేదు. ప్రసాదాలు పంచడం, జనంపై పవిత్ర జలాలు చల్లడం వంటివి చేయకూడదు. ఒకవేళ అన్నదానం చేస్తే అక్కడ భౌతిక దూరం పాటించాలి. మార్కింగ్ చేయాల్సిందే హోటళ్ల ముఖద్వారాల వద్ద హ్యాండ్ శానిటైజర్లు అందుబాటులో ఉంచాలి. అలాగే వినియోగదారులకు, సిబ్బందికి స్క్రీనింగ్ పరీక్షలు చేసిన తర్వాతే లోపలికి అనుమతించాలి. ఒక్కొక్కరికి మధ్య కనీసం 6 మీటర్ల సామాజిక దూరం ఉండేలా చూసేందుకు అవసరమైతే అదనపు సిబ్బందిని హోటళ్ల యాజమాన్యాలు నియమించుకోవాలి. వినియోగదారులు సామాజిక దూరం పాటించడం కోసం హోటల్ లోపల, బయట మార్కింగ్ చేయాలి. ఇక ఏసీలు 24–30 డిగ్రీల సెల్సియస్ మధ్య నడిచేలా చూడాలి. -
హోటల్స్ రంగ షేర్లకు డిమాండ్
కరోనా వ్యాధి నేపథ్యంలో దాదాపు 3నెలల మూసివేత తర్వాత జూన్ 8 నుంచి పునఃప్రారంభం అవుతుండంతో హోటల్ కంపెనీ షేర్లుకు సోమవారం భారీగా డిమాండ్ నెలకొంది. నేటి ఉదయం ట్రేడింగ్ సెషన్లో ఈ రంగానికి చెందిన షేర్లు దాదాపు 19 శాతం వరకు లాభపడ్డాయి. కరోనా కట్టడికి విధించిన లాక్డౌన్ ఎత్తివేతలో భాగంగా ఈ జూన్ 8నుంచి హోటల్స్, రెస్టారెంట్లు, ఇతర ఆతిథ్య సేవలు, షాపింగ్ మాళ్లు ప్రారంభానికి కేంద్రం ఆమోదం తెలపడంతో హోటల్స్ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. ఫలితంగా ఈ రంగానికి చెందిన ఇండియన్ హోటల్స్, ఈఐహెచ్, తాజ్ జీవీకే అండ్ రెస్టారెంట్స్, ఈఐహెచ్ అసోసియేటెడ్, షాపర్స్టాప్ షేర్లు 10శాతం నుంచి 19శాతం ర్యాలీ చేశాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో హోటల్స్‌కు డిమాండ్ లేకపోవడంతో గడిచిన 3నెలల్లో హోటల్స్ స్టాక్స్‌లు 40-50శాతం నష్టాన్ని చవిచూశాయి. ఇదే సమయంలో బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లు 13శాతం క్షీణించాయి. రాబోయే 3 ఏళ్లల్లో వార్షిక ప్రాతిపదికన రూమ్ రెవెన్యూ ఆదాయం 6-8శాతం పెరుగుతుందని హోటల్స్ పరిశ్రమ అంచనా వేస్తుంది. -
ఆహారానికి సిటీ బెస్ట్.. ఫుడ్ సేఫ్టీ మిస్
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ బిర్యానీ అంటే ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి. ఎక్కడి వారైనా లొట్టలేసుకుంటూ తింటారు. అంతేకాదు హైదరాబాద్‌లోని ఆహార పరిశ్రమపై ఆధారపడి లక్ష కుటుంబాలు బతుకుతున్నాయి. మూడు లక్షల మందికి పైగా ఈరంగంలో పనిచేస్తున్నారు. ప్రతిరోజూ 700 టన్నుల చికెన్, 291 టన్నుల మాంసం వినియోగమవుతోంది. ప్రత్యేక సందర్భాల్లో ఇంతకు రెండు మూడు రెట్లు వినియోగిస్తారు. ఫుట్‌పాత్ మీది బండ్ల నుంచిసెవెన్స్టార్ హోటళ్ల వరకున్నాయి. బిర్యానీతోపాటు ఇరానీ చాయ్, హలీంలతోనూ ఈ నగరం ఎంతో ప్రత్యేకతను సాధించుకుంది. వీటితో సహ వివిధ అంశాల ప్రాతిపదికగా యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్‌వర్క్‌కు అర్హత పొందింది. గ్యాస్రోనమీ(ఆహార సంబంధ) విభాగంలో నగరం ఇందుకు ఎంపికైంది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఘనత వహించిన మహానగరంలో ఆహారం రుచికరమే కానీ.. ఫుడ్‌సేఫ్టీ మాత్రం కరువైంది. తనిఖీలు నిల్ నిబంధనల మేరకు హోటళ్లతో సహ ఆహార పరిశ్రమల్లో నిర్ణీత వ్యవధుల్లో తనిఖీలు జరగాల్సి ఉండగా జరగడం లేవు. ప్రతినెలా శాంపిళ్లను తీసి పరీక్షలు చేయించాల్సి ఉండగా, అది జరుగుతుందో లేదో తెలియదు. నిర్ణీత వ్యవధిలో ల్యాబ్‌కు పంపేందుకు సరిపడా యంత్రాంగం కూడా లేదు. ఎక్కడ పడితే అక్కడ దొరికే ఆహారంతోపాటు స్టార్ హోటళ్లలోనూ శుచిశుభ్రతకు పూచీ లేదు. దాదాపు ఏడాదిన్నర క్రితం జీహెచ్ఎంసీ హోటళ్ల తనిఖీల స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. శుభ్రత కనిపించని వంటగదులు, కుళ్లిన మాంసాన్నే వినియోగించడం, తినడానికి యోగ్యం కాని ఆహారాన్ని వడ్డించడం వంటివి గుర్తించారు. జరిమానాలు విధించారు. ఇకపై సహించబోమని హెచ్చరించారు. ఆ తర్వాత కూలబడ్డారు. కారణం జీహెచ్ఎంసీలో ఉండాల్సినంతమంది ఫుడ్ ఇన్స్పెక్టర్లు లేరు. నగరంలో రిజిస్టరైన రెస్టారెంట్లు 2200 కాగా, టిఫిన్ బండ్ల నుంచి పెద్ద హోటళ్ల వరకు దాదాపు 80 వేలు ఉంటాయని అంచనా. యంత్రాంగం లేదు.. ♦ జీహెచ్ఎంసీలోని 30 సర్కిళ్లలో 30 మంది ఫుడ్ ఇన్స్పెక్టర్లు, ఆరు జోన్లకు ఆరుగురు డిజిగ్నేటెడ్ ఆఫీసర్లు, జీహెచ్ఎంసీ మొత్తానికి ఒక అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ ఉండాలి. కానీ ప్రస్తుతం ముగ్గురు గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్లు, అసిస్టెండ్ ఫుడ్ కంట్రోలర్ మాత్రం ఉన్నారు. గ్రేటర్ నగరంలోని అన్ని హోటళ్లతో పాటు తినుబండారాల దుకాణాల తనిఖీలు తదితరమైన బాధ్యతలు వీరివే. ఇక కోర్టు కేసులూ తదితరమైనవి సరేసరి. ♦ 2011లో ఫుడ్‌సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ వచ్చినప్పటికీ,నగరంలో ఇది అమలవుతున్న దాఖలాల్లేవు. దీని మేరకు ప్రతి తినుబండారాల దుకాణం వివరాలతో కూడిన ఆన్లైన్ జాబితా ఉండాలి. నిర్ణీత వ్యవధుల్లో తనిఖీలు.. తగినన్ని కల్తీపరీక్షల కేంద్రాలు.. కల్తీని బట్టి కఠినచర్యలు ఉండాలి. జీహెచ్ఎంసీలో ఏఎంఓహెచ్లున్నా వారు ఫుడ్‌సేఫ్టీ గురించి పట్టించుకోవడం లేరు. అప్పుడు హడావుడి.. తర్వాత కూలబడి.. 2017 ఏప్రిల్‌లో దాదాపు నెల రోజుల పాటు హోటళ్లలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. దాదాపు 400 హోటళ్లు తనిఖీలు చేసి 200కు పైగా హోటళ్లకు దాదాపు రూ. 17 లక్షల జరిమానాలు విధించారు. ఆతర్వాత మరచిపోయారు. 2015లో 413 శాంపిళ్లు సేకరించి 42 కేసులు, 2016లో 461 శాంపిళ్లు సేకరించి 63కేసులు నమోదు చేశారు. ఆ తర్వాత ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియదు. ♦ హోటళ్ల తనిఖీలకు ప్రత్యేక యాప్‌ను తెస్తున్నామన్నారు. హోటళ్లలో ఏవి లోపిస్తే ఎంత జరిమానా విధించాలో అందులో ఉంటుందని, విస్తృతంగా తనిఖీలు చేసి ప్రజారోగ్యానికి భరోసాగా ఉంటామన్నారు. అనంతరం ఏంచేశారో అధికారులకే తెలియాలి. ఉక్కుపాదం కాదు.. ఉత్తిమాటలు.. హోటళ్లలో కల్తీపై ఉక్కుపాదం మోపుతామని అధికారులు అప్పట్లో ప్రకటించారు. జీహెచ్ఎంసీ, పోలీసు విభాగాలు సంయుక్తంగా తనిఖీలు చేపట్టాలని భావించారు. ప్రజలకు ఆరోగ్యభద్రత కల్పించేందుకు హోటళ్ల నిర్వహణ సక్రమంగా లేకుంటే పెనాల్టీలునిర్ణయించారు. రిపోర్టుల కోసం .. బేగంపేట మానససరోవర్ హోటల్లోని ఆహారం వల్లే రెండేళ్ల బాలుడు తీవ్ర వాంతులతో మృతి చెందాడనే ఆరోపణలు వెల్లువెత్తడం తెలిసిందే. హోటల్లోని ఆహారం శాంపిల్స్‌ను పరీక్షల కోసం పంపిన అధికారులు రిపోర్టుల కోసం వేచి చూస్తున్నారు. మరోమారు తనిఖీల హడావుడి చేస్తున్నారు. పెనాల్టీలు ఇలా... దేనికి ఎంత (రూ.లు) ♦ కిచెన్ శుభ్రంగా లేకుంటే: 500 ♦ సిబ్బంది దుస్తులు శుభ్రంగా లేకుంటే,చేతులకు గ్లవ్స్ లేకుంటే: 500 ♦ అపరిశుభ్ర, పగిలిన పాత్రలు వినియోగిస్తే : 500 ♦ కిచెన్‌లో వెంటిలేషన్,లైటింగ్ లేకుంటే: 500 ♦ వెజ్,నాన్‌వెజ్ పదార్థాలు కలిపి నిల్వచేస్తే: 500 ♦ తాగునీరు లేకుంటే: 1000 ♦ టాయ్లెట్లు లేకుంటే 2000 ♦ డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకుంటే : 2000 ♦ ఫైర్‌సేఫ్టీ ఏర్పాట్లు,ఎగ్జిట్ లేకుంటే :10000 ♦ ట్రేడ్‌లైసెన్స్ ప్రదర్శింకుంటే: 520 ♦ వీటితోపాటు ఇంకా పలు అంశాలకు నిర్ణీత జరిమానాలను నిర్ణయించారు. యాప్‌ద్వారా ఆయా ఉల్టంఘనలకు ఆటోమేటిక్‌గా జరిమానాలు పడతాయన్నారు. అధికారుల విచక్షణతో జరిమానాల్లో వ్యత్యాసాలుండవన్నారు. కానీ.. ఏం చేస్తున్నారోవారికే తెలియాలి. ♦ కొన్ని హోటళ్లతో నెలనెలా మామూళ్లకు లాలూచీ పడుతున్నారన్న ఆరోపణలున్నాయి. అధికారుల తీరు చూసి దిగువ ఉద్యోగులు సైతం ఆయా హోటళ్లనుంచి పార్సిళ్లు తెప్పించుకుంటారనే ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో అలాంటి హోటళ్లపై చర్యలు తీసుకోలేకపోతున్నారు. ♦ ఏటా కల్తీ ఆహారంతో అనారోగ్యం బారిన పడుతున్నవారు దాదాపు: 40,000 ♦ టీఎస్పీఎస్సీ త్వరలో భర్తీ చేయనున్న ఫుడ్‌సేఫ్టీ ఆఫీసర్ల పోస్టులు :26 -
హైవే పక్కన హోటళ్లలో ఫాస్టాగ్ విక్రయం
సాక్షి, హైదరాబాద్: టోల్‌ప్లాజాల వద్ద సంక్రాంతి సమయంలో అయోమయం నెలకొనే పరిస్థితి ఉండటంతో ఎన్హెచ్ఏఐ అధికారులు అప్రమత్తమయ్యారు. సంక్రాంతి రద్దీ మొదలయ్యే నాటికి వీలైనన్ని ఫాస్టాగ్‌లు విక్రయించాలని నిర్ణయిం చారు. ఇప్పటికే టోల్‌ప్లాజాల వద్ద పెద్ద సంఖ్యలో కౌంటర్లు తెరిచి ఫాస్టాగ్‌లను విక్రయిస్తున్నారు. జాతీయ రహదారిపై ముఖ్యమైన హోటళ్లలో ఫాస్టాగ్ విక్రయ కౌంటర్లు తెరిచారు. విజయవాడ రహదారిలో రద్దీ ఎక్కువగా ఉంటున్నందున ఆ రోడ్డులోని 6 హోటళ్లలో విక్రయాలు ప్రారంభించారు. బుధవారం నుంచి వాటి అమ్మకాలు మొదలయ్యాయి. ఎన్హెచ్ఏఐ ప్రాంతీయ అధికారి కృష్ణప్రసాద్ ఈ హోటళ్లలోని కౌంటర్లను పరిశీలించి, హోటళ్లకు వచ్చే వాహనదారులతో మాట్లాడి ఫాస్టాగ్స్ కొనుగోలు చేసేలా చైతన్యపరచాలన్నారు. ఇక్కడ ఫాస్టాగ్ విక్రయాలు ఆశాజనకంగా ఉంటే మరిన్ని హోటళ్లలో వాటిని ప్రారం భించాలని నిర్ణయించారు. ఫాస్టాగ్ లేకుంటే సం క్రాంతి ప్రయాణం ఇబ్బందిగా ఉంటుందని, దా న్ని నివారించేందుకు వెంటనే ట్యాగ్ తీసుకోవాలని ప్రచారం చేస్తున్నారు. జాతీయ రహదారుల వెంట ఆ మేరకు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం లేన్లు ఇలా.. ప్రస్తుతం జాతీయ రహదారులపై టోల్ ప్లాజాల వద్ద 25 శాతం లేన్లు హైబ్రీడ్ వేలుగా ఉన్నాయి. వాటిల్లో ఫాస్టాగ్ ఉన్న వాహనాలతోపాటు లేని వాటిని కూడా అనుమతిస్తున్నారు. 75 శాతం లేన్లు పూర్తిగా ఫాస్టాగ్ ఉన్నవాటికే కేటాయిం చారు. జనవరి 14 తర్వాత క్యాష్ లేన్‌ను ఒకటి మాత్రమే(ఒక్కోవైపు ఒకటి) ఉండనుంది. మరో పక్షం రోజులపాటు ప్రస్తుత విధానాన్ని కొనసాగించాలని ఎన్హెచ్ఏఐపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ విషయంలో కేంద్ర ఉపరితల రవాణాశాఖ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. గడువు పెంచకుంటే సంక్రాంతి రద్దీ సమయంలో ఒక్క కౌంటర్ మాత్రమే క్యాష్ చెల్లించే వాహనాలకు అందుబాటులో ఉండనుంది. గడువు పెంచితే మరికొన్ని రోజులు ఇబ్బందులు దూరమైనట్టే. రాష్ట్రంలో ఫాస్టాగ్స్ ఉన్న వాహనాల సంఖ్య 81 వేలకు చేరుకుంది. గత నాలుగైదు రోజులుగా వాటి విక్రయాలు పెరిగాయి. -
కుళ్లిన మాంసం.. పాడైన ఆహారం
సాక్షి, మంచిర్యాల : జిల్లాకేంద్రమైన మంచిర్యాలకు నిత్యం వేలాదిమంది వివిధ ప్రాంతాల నుంచి వస్తుంటారు. వారి అవసరాలకు తగినట్లు అనేక దుకాణ సముదాయాలు, హోటళ్లు, సినిమాహాళ్లు ఇక్కడ ఉన్నాయి. పెద్ద సంఖ్యలో బిర్యానీహౌస్‌లు, బార్ అండ్ రెస్టారెంట్లు ఏర్పాటయ్యాయి. రకరకాల రుచులతో వండి పెడుతున్నారు. అందుకు తగినట్టే డబ్బులూ వసూలు చేస్తున్నారు. కానీ.. వేడివేడిగా అందించే ఆహారపదార్థాల వెనుక కుళ్లిపోయిన మాంసం.. ఇతర ఆహార పదార్థాలు పెడుతున్నారు. ఈ విషయం గురువారం మంచిర్యాల మున్సిపాలిటీ శానిటరీ సిబ్బంది చేపట్టిన తనిఖీల్లో వెలుగుచూసింది. దుర్వాసన, కుళ్లిన ఆహార పదార్థాలు, పాడైన కూరలు, అపరిశుభ్రంగా నిల్వఉంచిన ఆహార పదార్థాలను ప్రజలకు పెడుతున్నట్లు గుర్తించారు. పాడైన చికెన్ లెగ్‌పీస్‌లను స్వాధీనం చేసుకున్నారు. ముందుగా ఇందు బార్అండ్ రెస్టారెంట్‌కు వెళ్లిన అధికారులకు అపరిశుభ్రత, పాడైన చికెన్‌లెగ్ పీసులు కనిపించాయి. దీంతో ఆ యజమానికి అధికారులు రూ.5 వేల జరిమానా విధించారు. అక్కడినుంచి అభిజిత్ బార్ అండ్ రెస్టారెంట్‌కు వెళ్లగా.. అక్కడా అపరిశుభ్రతతోపాటు, ప్లాస్టిక్ కవర్లు లభించాయి. ఆ యజమానికి రూ.2వేల జరిమానా విధించారు. డబ్బు పెట్టి రోగాలను తింటూ... జిల్లాలోని బార్ అండ్ రెస్టారెంట్లలో కూర్చుని మద్యం సేవించి, రుచిగా ఉండే ఆహార పదార్థాలను ప్రజలు తింటుంటారు. మద్యంతాగాక ఎలాంటి ఆహారం పెట్టినా ఫర్వాలేదనుకున్నారో..? ముచ్చట్లలో పడి చూసుకోరు..? అనుకున్నారో ఏమోగానీ.. జిల్లా కేంద్రంలోని రెండు బార్ అండ్ రెస్టారెంట్ల యజమానులు పాడైన చికెన్ లెగ్‌పీస్‌లు, చికెన్ కర్రీ పెట్టడం చర్చనీయాంశంగా మారింది. వండిన మాంసం మిగిలితే ఫ్రిజ్‌లో నిల్వ ఉంచి మరుసటి రోజు వేడిచేసి ఇస్తున్నట్లు తెలుస్తోంది. మద్యంతాగేవారు వేడిగా తెచ్చిన మాంసంతోపాటు, ఇతర ఆహార పదార్థాల రుచిని గుర్తించలేకపోతున్నారు. మత్తులో అవే ఆహార పదార్థాలు తింటూ.. అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు. ఫ్రిజ్‌లను శుభ్రం చేయక పోవడం, మాంసంతోపాటు, శాఖాహారం కూడా ఫ్రిజ్‌లో మూతపెట్టకుండా ఉంచుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అధికారుల తనిఖీలు లేకపోవడంతోనే నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. జరిమానాలతోనే సరి....! జిల్లాలో రెగ్యులర్ ఫుడ్ ఇన్స్పెక్టర్ లేడు. ఆహార పదార్థాల అమ్మకాలు, కల్తీ వ్యాపారంపై కనీసం ఒక్క కేసు నమోదు కాలేదు. గతంలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు జిల్లాకేంద్రంలో తనిఖీలు చేసి జరిమానా విధించారు. అప్పుడు పది హోటళ్లు, బార్ అండ్ రెస్టారెంట్లలో తనిఖీలు చేసి రూ.5వేల చొప్పున ఒక్కో హోటల్‌కు జరిమానా విధించారు. కుళ్లిన ఆహారపదార్థాలను నిల్వ ఉంచితే టాస్క్‌ఫోర్స్ పోలీసులు, మున్సిపల్ శానిటరీ సిబ్బంది కేవలం జరిమానాకే పరిమితం అవడంతోనే నిర్వాహకులు తనిఖీలకు భయపడడం లేదు. ఆహారం పాడైందా..? లేదా..? అనే విషయమై శాంపిల్స్ తీసుకుని ల్యాబ్‌కు పంపించే అధికారం కేవలం ఫుడ్ ఇన్స్పెక్టర్కు మాత్రమే ఉంది. కానీ.. ఫుడ్ ఇన్స్పెక్టర్కు కనీసం కార్యాలయం కూడా లేదు. మున్సిపల్ కార్యాలయంలోనే ఓ మూలన టేబుల్ కేటాయించారు. ఎక్కడ కల్తీ జరిగినా కనీసం ఆ కల్తీ జరిగిందో లేదోనన్న విషయంపై ఇక్కడ పరిశీలించేందుకు ల్యాబ్ సౌకర్యం కూడా లేదు. శాంపిల్స్ సేకరించి హైదరాబాద్ ల్యాబ్‌కు పంపిస్తున్నారు. అక్కడి నుంచి రిపోర్టు వచ్చేందుకు.. ఆ రిపోర్టుపై చర్యలు తీసుకునేందుకు ఫుడ్ ఇన్స్పెక్టర్కు ఉన్న అదనపు బాధ్యతలు అడ్డువస్తున్నాయి. దీంతోనే కుళ్లిన, నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను అమ్మే యజమానులపై చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోకుండా, కేవలం జరిమానాలను విధించి సరిపెడుతున్నారు. -
ఆన్లైన్ ఆర్డర్లకు భారీ డిస్కౌంట్లు ఎలా సాధ్యం?
మారుతున్న కాలానికి అనుగుణంగా మెచ్చిన హోటల్లో నచ్చిన ఫుడ్ ఐటెమ్స్ ఆన్లైన్లో ఆర్డర్లు తీసుకుని డోర్ డెలివరీ ఇస్తున్న సంస్థలు అందుబాటులోకి వచ్చాయి. ఇటు ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలతో పాటు హోటళ్ల యజమానులు కూడా భారీ డిస్కౌంట్ల ఆఫర్లు ఇస్తున్నాయి. అయితే డిస్కౌంట్లతో ఆన్లైన్ ఆర్డర్ల ఫుడ్ నాణ్యతకు హోటళ్ల యజమానులు తిలోదకాలు ఇస్తున్నారు. ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చిన ఆహారంలో నాణ్యత లోపం ఉందంటూ ఇటీవల కాలంలో సంబంధిత అధికారులకు ఫిర్యాదులు అందుతున్నాయి. సాక్షి, నెల్లూరు: ఉదయం నుంచి రాత్రి వరకు టిఫిన్స్ నుంచి భోజనాలు వరకు, బిర్యానీల నుంచి బర్గర్ల వరకు ఆన్లైన్లో ఆర్డర్లు ఇచ్చి తెప్పించుకుంటున్నారు. చేతిలో సెల్‌ఫోన్.. అందులో యాప్స్ ఉంటే చాలు ఇంట్లో కూర్చొని తమకు కావాల్సిన ఆహార పదార్థాలు డోర్ డెలివరీ ఇవ్వాలంటూ ఆన్లైన్లో ఫుడ్ డెలివరీ సంస్థలకు ఆర్డర్లు ఇస్తున్నారు. భోజన ప్రియులను ఆకట్టుకునేందుకు ఆన్లైన్ ఫుడ్ డోర్ డెలివరీ సంస్థలు, హోటళ్ల యజమానులు ఇస్తున్న డిస్కౌంట్ల వెనుక చాలా మతలబులు ఉన్నాయి. ఆన్లైన్ వినియోగదారుల విషయంలో జిల్లాలో ప్రధాన నగరం, పట్టణాల్లోని రెస్టారెంట్లు, హోటళ్ల యజమానులు జిమిక్కులకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చిన ఆహార నాణ్యత ఒకరకంగా, రెస్టారెంట్‌కు వచ్చే వినియోగదారులకు అందించే నాణ్యత మరో రకంగా ఉంటుంది. ఇటీవల కాలంలో నెల్లూరు నగరంలోని పలు హోటళ్లలో నాణ్యత ప్రమాణాలను పరిశీలించిన అధికారులు రెండు.. మూడు రోజుల పాటు నిల్వ ఉంచిన మాంసం, ఆహార పదార్థాలను గుర్తించి, తీవ్ర స్థాయిలో యజమానులకు హెచ్చరికలు జారీ చేస్తున్న విషయం తెలిసిందే. ఆన్లైన్, డిస్కౌంట్ ఫుడ్ ఆర్డర్లకు ఇలాంటి నిల్వ ఆహారాలను అందిస్తున్నట్లు తెలుస్తోంది. తగు జాగ్రత్తలు పాటిస్తే మేలు రెస్టారెంట్లకు, హోటళ్లకు వెళ్లిన సమయంలో, ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థల్లో నచ్చిన ఆహారాన్ని ఎంపిక చేసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించడం మంచిది. ప్రముఖ రెస్టారెంట్లు, ఎప్పుడూ జనసందోహం ఉండే హోటళ్లను ఎంపిక చేసుకోవడం ఉత్తమం. ఎందుకంటే ఆహారం నిల్వ ఉండేందుకు అక్కడ అవకాశం ఉండదు. ముఖ్యంగా నాన్ వెజ్ ఆహారం ఆర్డర్ చేస్తున్న సమయంలో ఇలాంటి జాగ్రత్తలు పాటించాలి. కొన్ని హోటళ్లలో డిమాండ్ తగ్గిన సమయంలో మాంసం, తరిగిన కూరగాయలు తదితరాలను నిల్వ చేసేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇలా మిగిలిపోయిన వాటితో వండిన ఆహారం త్వరగా పాడయ్యే ఆస్కారం ఉంది. భారీ డిస్కౌంట్లు ఎలా సాధ్యం ఆన్లైన్లో ఇస్తున్న ఆర్డర్లకు భారీ డిస్కౌంట్లు ఇస్తున్నారు. నగరంలో ఓ హోటల్లో ఐటెమ్ విలువ రూ.250 ఉంటుంది. అదే హోటల్ నుంచి ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చిన ఐటెమ్‌ను రూ.150లకే డెలివరీ ఇస్తున్నారు. ఇదెలా సాధ్యమని పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉదాహరణకు.. పాలక్ పనీర్ అసలు ధర రూ.200. ఆన్లైన్లో రూ.135కే అందిస్తున్నారు. చికెన్ బిర్యానీ రూ.250. ప్రత్యేక ఆఫర్ కింద రూ.159కే అందిస్తున్నారు. ఈ ఆఫర్ రెండు రోజుల మాత్రమే. నాటు కోడి బిర్యానీ అసలు ధర రూ.300 ఈ రోజు ప్రత్యేక ఆఫర్‌గా రూ.180లకే అందిస్తున్నాం అంటూ 15 శాతం, 20 శాతం, 30 శాతం, 50 శాతం డిస్కౌంట్లతో రకరకాల ఆఫర్లతో ఫుడ్ డెలివరీ సంస్థలు ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. దీనికి ఆకర్షితులై ధర తక్కువని ఆర్డర్ చేస్తే అందులో నాణ్యత ఉండడం లేదని ఇటీవల కాలంలో పలువురు వినియోగదారులు సంబంధిత అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలతో పాటు రెస్టారెంట్లలో సంబంధిత శాఖాధికారులు దాడులు చేసి చర్యలు తీసుకుంటున్నారు. ఆన్లైన్ ఆర్డర్లకు ప్రత్యేక ఆహారమా? రెస్టారెంట్లో వండిన ఆహారానికి, ఆన్లైన్ ద్వారా పొందిన ఆహారానికి చాలా తేడా ఉంటుందని ఫిర్యాదుల ద్వారా అధికారులకు వచ్చిన సమాచారం. ఆన్లైన్ ఆర్డర్‌కు వేరే ఆహారం ఇవ్వాలంటూ హోటళ్ల యజమానులు సిబ్బందిని ఆదేశిస్తున్నట్లు సమాచారం. ఎక్కడో వండిన వంటకాలను రెస్టారెంట్‌కు తీసుకొచ్చి ఆన్లైన్ వినియోగదారులకు అందజేస్తున్నట్లు కూడా అధికారుల దృష్టికి వచ్చింది. ఇలా వండి పెట్టేందుకు చిన్న హోటళ్ల యాజమాన్యాలతో ఒప్పందం కుదుర్చుకుంటున్నట్లు సమాచారం. నాణ్యత పాటించకుండా వండిన ఆహారం వినియోగదారులకు చేరే సరికి పూర్తిగా పాడయిపోతున్న సందర్భాలున్నాయి. తాజా నాణ్యమైన ఆహారాన్నే అందించాలి తాజాగా, నాణ్యమైన ఆహారాన్నే వినియోగదారులకు అందించాలి. రంగులు కలపడం, ఒక్కసారి వాడడానికి సిద్ధం చేసిన వాటిని తిరిగి వాడకూడదు. ఎప్పటికప్పుడు కాకుండా రిఫ్రిజిరేటర్లో పెట్టి వాడితే చర్యలు తప్పవు. చికెన్, మటన్, కూరగాయలు తాజాగా ఉన్నవే వండి వడ్డించాలి. రంగులు కల్పడం ద్వారా కేన్సర్ కారకాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. హోటళ్లు, రెస్టారెంట్లు, తోపుడు బండ్ల యజమానులు ఎవరైనా సరే నాణ్యతకు తిలోదకాలు ఇస్తే శాఖాపరమైన చర్యలు తప్పవు. ఆహారానికి సంబంధించి ఏవైనా అనుమానం కలిగినా, నాణ్యత ప్రమాణాలు లేకపోయినా 9989990859కు సమాచారం అందిస్తే వెంటనే చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ వెంకటరమణ, ఆరోగ్య అధికారి, నగరపాలక సంస్థ, నెల్లూరు -
ఫుడ్ యాప్స్.. డిస్కౌంటు పోరు!
వంద రూపాయలు ఖరీదు చేసే టిఫిన్.. యాభైకే, ఒకటి తీసుకుంటే ఒకటి ఫ్రీ అంటూ సగానికి సగం డిస్కౌంట్లు ఆఫర్ చేసే ఫుడ్ అగ్రిగేటర్ యాప్స్‌కి ప్రస్తుతం పెద్ద చిక్కొచ్చి పడింది. ఇలాంటి భారీ డిస్కౌంట్లు మేం ఇవ్వలేమంటూ యాప్స్ నుంచి హోటల్స్ ఒక్కొక్కటిగా తప్పుకుంటున్నాయి. ముందుగా బెట్టు చేసినా .. ఆ తర్వాత సమస్య సామరస్యంగా పరిష్కరించుకుందాం అంటూ అగ్రిగేటర్స్ ముందుకొచ్చినప్పటికీ.. హోటళ్ల యాజమాన్యాలు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. దీంతో.. అగ్రిగేటర్స్, హోటళ్ల మధ్య డిస్కౌంటు పోరు మరింతగా ముదురుతోంది. బడా రెస్టారెంట్లు, చోటా మోటా హోటళ్ల మధ్య పోరు కింద మారుతోంది. జొమాటో వంటి ఫుడ్ యాప్స్.. ప్రత్యేక మెంబర్షిప్ తీసుకున్న యూజర్లకు అందిస్తున్న డైన్–ఇన్ ఆఫర్లు ఈ వివాదానికి దారితీశాయి. వాస్తవానికి ఈ ఆఫర్ల ఉద్దేశం మెరుగైన రేటింగ్ హోటళ్లలో భోంచేసేలా కస్టమర్లను ఆకర్షించడమే అయినా.. ఆయా హోటళ్లు ఇవే తమకు గుదిబండగా మారుతున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీంతో లాగ్అవుట్ ఉద్యమం లేవనెత్తాయి. ఫుడ్ యాప్స్ నుంచి తప్పుకుంటున్నాయి. ఆకర్షణీయ ఆఫర్లు .. అగ్రిగేటర్ యాప్స్.. యూజర్లను ఆకర్షించేందుకు రకరకాల ఆఫర్స్ ఇస్తున్నాయి. ఉదాహరణకు జొమాటో సంగతి తీసుకుంటే ఈ సంస్థ గోల్డ్ పేరిట ప్రత్యేక మెంబర్షిప్ ప్రోగ్రాం నిర్వహిస్తోంది. ఇందులో సభ్యత్వం తీసుకున్న యూజర్లు.. ఇందులో లిస్టయిన హోటళ్లలో ఒకటి తీసుకుంటే మరొకటి ఉచితం తరహాలో మెనూలో ఏ వంటకాన్నైనా, ఎంత పరిమాణమైనా, ఏ హోటల్లోనైనా, ఎన్నిసార్లయినా తినొచ్చని ఆఫర్ ఇచ్చింది. ఈ గోల్డ్ ప్రోగ్రాంలో చేరాలంటే ఆయా రెస్టారెంట్లకు మంచి రేటింగు ఉండాలి. ఫుడ్ డెలివరీ సర్వీసు బాగుండాలి వంటి ప్రమాణాలు ఉన్నాయి. కాబట్టి అన్ని హోటళ్లు కాకుండా కొన్ని హోటళ్లకే ఈ గోల్డ్‌లో సభ్యత్వం లభిస్తోంది. రెస్టారెంట్ల వాదనేంటంటే.. కస్టమర్లను హోటళ్ల వైపు ఆకర్షించేందుకు ప్రవేశపెట్టిన ఈ ఆఫర్ ఉద్దేశం మంచిదే అయినప్పటికీ.. ఇందులో భారీ డిస్కౌంట్లు ఇవ్వాల్సి వస్తుండటం తమను దెబ్బతీస్తోందని రెస్టారెంట్లు వాదిస్తున్నాయి. తాము అత్యంత తక్కువగా 10 శాతం మార్జిన్లతో హోటళ్లు నిర్వహిస్తుంటామని ఏకంగా 50 శాతం డిస్కౌంటు ఇవ్వాల్సి వస్తుండటంతో తమ వ్యాపారాలపై చాలా ప్రతికూల ప్రభావం పడుతోందని ది నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ (ఎన్ఆర్ఏఐ) మాజీ ప్రెసిడెంట్ రియాజ్ అమ్లానీ పేర్కొన్నారు. పైపెచ్చు అగ్రిగేటర్స్ యాప్‌లో తాము లిస్ట్ చేసుకోవాలంటే భారీగా చెల్లించుకోవాల్సి వస్తోందని, దానితో పాటు కమీషన్లూ ఇచ్చుకోవాల్సి ఉంటోందని చెప్పారు. సందర్భాన్ని బట్టి కొన్ని సార్లు రెస్టారెంట్లు ఏకంగా రూ. 75,000 దాకా సైన్–అప్ ఫీజు చెల్లించుకోవాల్సి వస్తోందని వివరించారు. ఇక కొన్నింటికి మాత్రమే ఎక్స్‌క్లూజివ్ సభ్యత్వం అన్న యాప్స్.. ఆ తర్వాత కుప్పలు తెప్పులుగా మెంబర్షిప్స్ ఇచ్చేస్తుండటంతో పోటీ మరింత పెరిగిపోతోందని హోటల్స్ ఆక్షేపిస్తున్నాయి. ఈ పరిణామాల కారణంగా జొమాటో, నియర్‌బై, మ్యాజిక్‌పిన్, ఈజీడైనర్ వంటి యాప్స్ పాటించే భారీ డిస్కౌంటు విధానాలను వ్యతిరేకిస్తూ.. వాటి నుంచి నిష్క్రమించేందుకు ఆగస్టు 15 సుమారు 300 రెస్టారెంట్లు లాగ్అవుట్ ఉద్యమాన్ని మొదలెట్టాయి. ఇప్పటిదాకా దాదాపు 2,500 పైగా రెస్టారెంట్లు ఇలా యాప్స్ నుంచి లాగవుట్ అయినట్లు అంచనా. ఎన్‌ఆర్‌ఏఐలో దాదాపు 6,000 పైచిలుకు రెస్టారెంట్లకు సభ్యత్వం ఉంది. దిద్దుబాటు ప్రయత్నాల్లో అగ్రిగేటర్స్.. రెస్టారెంట్లు హఠాత్తుగా కీలక ప్రోగ్రాం నుంచి తప్పుకుంటుండటంతో ఫుడ్ యాప్స్ హడావుడిగా సమస్యల పరిష్కారం కోసం రంగంలోకి దిగాయి. గోల్డ్ ఆఫర్లో మార్పులు, చేర్పులు చేస్తామంటూ జొమాటో ప్రతిపాదించింది. ‘కొందరు యూజర్లు ఒక హోటల్లో 1+1 స్టార్టరు తీసుకుని, మరో చోట 1+1 మెయిన్ కోర్స్ తిని, మరో చోట 2+2 డ్రింక్స్ తీసుకోవడం వంటివి చేస్తున్నారు. ఇలాంటి వాటి వల్ల డిస్కౌంటింగ్ భారం భారీగా పెరుగుతోంది. ఇకపై అలా జరగకుండా యూజర్లు గోల్డ్ ఆఫర్‌ను రోజులో ఒక్కసారి, ఒక్క హోటల్లో మాత్రమే వినియోగించుకునేలా సవరిస్తాం‘ అంటూ జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ ప్రతిపాదించారు. అలాగే, గోల్డ్ మెంబర్షిప్ ఉన్న హోటళ్లకు ఉచిత ప్రకటనలు మొదలైన వాటి రూపంలో ప్రత్యేక ప్రయోజనాలూ కల్పిస్తామన్నారు. లాగ్అవుట్ ఉద్యమంలో భాగంగా తమ యాప్ నుంచి తప్పుకున్న రెస్టారెంట్లకు మళ్లీ ఉచితంగా సభ్యత్వం కూడా ఇస్తామని చెప్పారు. ఇందుకు సెప్టెంబర్ 15 దాకా గడువివ్వాలంటూ కోరారు. వెనక్కి తగ్గని రెస్టారెంట్లు అయితే, ఈ ప్రతిపాదనలను రెస్టారెంట్లు కొట్టిపారేశాయి. గతంలో నోటీసు ఇవ్వకుండా తప్పుకున్నందుకు పెనాల్టీలు అంటూ బెదిరించిన అగ్రిగేటర్లు ప్రస్తుతం ఉచితంగా సభ్యత్వం అంటూ ఊరించినా ఉపయోగం లేదని పేర్కొన్నాయి. దీంతో... లాగ్అవుట్ పరిష్కార ప్రయత్నాలను విరమించుకుంటున్నట్లు గోయల్ గురువారం ప్రకటించారు. అదే సందర్భంలో లాగ్అవుట్ ఉద్యమానికి మూలకారకుడైన ఎన్ఆర్ఏఐ ప్రెసిడెంట్ రాహుల్ సింగ్‌పై కూడా వ్యాఖ్యలు చేశారు. డిస్కౌంట్లను వ్యతిరేకిస్తూ ఉద్యమం లేవనెత్తిన రాహుల్ సింగ్ స్వయంగా తాను నిర్వహించే ది బీర్ కెఫే అవుట్‌లెట్స్‌లో మాత్రం డిస్కౌంట్లు ఇస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. ఇదంతా చూస్తుంటే అగ్రిగేటర్స్‌ను దెబ్బతీసి, లబ్ధి పొందేందుకు కొందరు బడా రెస్టారెంటు ఓనర్లు ఎన్ఆర్ఏఐని వాడుకుంటున్నట్లుగా కనిపిస్తోందంటూ విమర్శలు గుప్పించారు. అయితే, ఏ వ్యాపారానికైనా విశ్వాసవంతమైన కస్టమర్లు అవసరమన్నది తమకూ తెలుసని రాహుల్ సింగ్ ఘాటుగా స్పందించారు. ఎవరికి పడితే వారికి కాకుండా తమ టాప్ 500 కస్టమర్స్‌కే ఇలాంటి ఆఫర్లు ఇస్తున్నామని, జొమాటో పిల్ల దశలో ఉన్నప్పుడే తమ యాప్‌నకు 3.5 లక్షల డౌన్లోడ్లు ఉన్నాయన్నారు. ‘ఓనర్లలాగా బ్రోకర్లకు అధికారాలు ఉండవు‘ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏదైతేనేం.. ఇప్పటికైతే ఈ విమర్శలు, ప్రతి విమర్శలకు ఇప్పుడప్పుడే ఫుల్స్టాప్ పడేట్లు కనిపించడం లేదు. -
స్వాతంత్య్రం తరవాత కూడా
స్వాతంత్య్రానికి పూర్వం ఇవి చాలా ఫేమస్... దేశవ్యాప్తంగా కొన్ని ప్రదేశాలలో రకరకాల వంటకాలను ఆ తరంవారు ఆ రోజుల్లో కొత్తగా పరిచయం చేశారు. అవి నేటికీ అందరినీ ఆకర్షిస్తూనే ఉన్నాయి. ఓల్డ్ ఈజ్ గోల్డ్... గతం ఎన్నటికీ ఔట్‌డేటెడ్ కాదు. వంద సంవత్సరాల నాటి వంటకాలను నేటికీ ఆస్వాదిస్తున్నారు. నాటి నుంచి నేటి వరకు వాటికి ఉన్న క్రేజు కొద్దిగా కూడా తగ్గలేదు.భోజన ప్రియులను ఎన్నడూ నిరాశ పరచలేదు ఈ క్విజీన్లు. ఈ తరం వారిని కూడాఅటు లాగుతున్నాయి. అటువంటి వాటిలో కొన్నింటిని ఈ సందర్భంగా గుర్తు చేసుకుందాం... 1 టుండే కబాబీ – లక్నో 1905లో లక్నోలో హాజీ మురాద్ అలీ ‘టుండే కబాబీ’ని ప్రారంభించారు. ఇక్కడ రుచికరమైన మాంసాహార కబాబ్, కుర్మా, బిర్యానీలు లభ్యమవుతాయి. లక్నో నవాబు దగ్గర పనిచేసిన వంటవాడు ఈ క్విజీన్‌లో వంట చేసేవాడు. లక్నోలోని అతి పురాతన ఇరుకుసందుల్లో ఉంది ఈ క్విజీన్. ఇప్పటికీ పాత పద్ధతిలోనే మాంసాహార వంటకాలను తయారుచేస్తున్నారు. ఆ పురాతన వంటకాలను నేటికీ ఆస్వాదిస్తున్నారు. 2 ఇండియన్ కాఫీ హౌస్ – కలకత్తా ప్రెసిడెన్సీ కాలేజీ విద్యార్థులంతా ఇండియన్ కాఫీ హౌస్‌కి వచ్చి, ఎన్నోరకాలుగా చర్చించుకునేవారు. కాలేజ్ స్ట్రీట్‌లో ఉన్న ఈ ఇండియన్ కాఫీహౌస్‌కి రవీంద్రనాథ్ ఠాగూర్, అమర్త్యసేన్, మన్నాడే, సత్యజిత్‌రే, రవిశంకర్ వంటివారు తరచుగా వెళ్తుండేవారట. మటన్ కట్లెట్, చికెన్ కబిరాజీలు నేటికీ తక్కువ ధరకు అక్కడ దొరుకుతున్నాయి. 3 బ్రిటానియా అండ్ కో – ముంబై 1923లో ముంబై ఫోర్ట్ ఏరియాలో బ్రిటిషు ఆఫీసర్లు మొట్టమొదటి బ్రిటానియా కంపెనీ ప్రారంభించారు. ఒక సంప్రదాయ పార్సీ ఫేర్ జరిగినప్పుడు బ్రిటానియా బిస్కెట్లు అక్కడి వారి ఆకలి తీర్చాయి. ఇప్పటికీ వారి ఘనతను ప్రతిబింబిస్తూ, నాటి ఫర్నిచర్‌ను అలాగే ఉంచి, కొన్ని కొత్త వస్తువులను జత చేశారు. మటన్, చికెన్ బెర్రీ పులావ్ వీరి ప్రత్యేకత. 4 మావల్లి టిఫిన్ రూమ్ – బెంగళూరు మావల్లి టిఫిన్ రూమ్ అనే కంటే ఎంటిఆర్ అంటేనే అందరికీ పరిచితం. 1924లో యజ్ఞనారాయణ మయ్యా ఎంటిఆర్ను ప్రారంభించారు. 1975 – 76 ప్రాంతంలో దేశంలో ఎమర్జెన్సీ విధించిన సమయంలో ఎంటిఆర్ వారు అతి తక్కువ ధరలకు భోజనం సరఫరా చేయడంతో ఎంటిఆర్కి చాలా నష్టాలు వచ్చాయి. దానితో ఇన్స్టంట్ సరుకుల వ్యాపారం ప్రారంభించారు. రెడీ టు ఈట్ స్నాక్స్, చట్నీలు, రసం పొడులు అమ్మడం ప్రారంభించారు. వెండి వస్తువులను ఉపయోగించడం వీరి ప్రత్యేకత. 5 కరీమ్స్ – న్యూఢిల్లీ 1913లో హాజీ కరీముద్దీన్ ‘కరీమ్’ను ఢిల్లీలో చాందినీచౌక్ నడిబొడ్డున ప్రారంభించారు. ఇక్కడ లభించే రుచికరమైన వంటకాలకుగాను అనేక అవార్డులు అందుకున్నారు కరీముద్దీన్. నోరూరించే మాంసాహార వంటకాలు ఇక్కడ ప్రత్యేకం. చుట్టూ అందమైన జామా మసీదుతో అందరినీ ఆ ప్రదేశం ఆకట్టుకుంటుంది. మొఘలుల కాలం నాటి నుంచి ఉన్న వంటకాలను కరీమ్ తయారుచేసి ఫుడ్ లవర్స్‌కి రుచి చూపించారు. మటన్ నిహారీ, చికెన్ జహంగీరీ వంటకాల పేరు చెప్పగానే నోరూరనివారు ఉండరు. 6 జోషీ బుద్ధాకాకా మాహిమ్ హల్వావాలా – ముంబై ముంబై మాహిమ్‌లో ఇదొక చిన్న హల్వా షాపు. ఈ షాపును సుమారు 200 సంవత్సరాల క్రితం... గిరిధర్ మావ్జీ ఒక ప్రత్యేకమైన హల్వా తయారుచేసి అమ్మడం ప్రారంభించాడు. అతి తక్కువ కాలంలోనే ఈ హల్వా ముంబై నగరమంతా వ్యాపించి, అందరి ఆదరణకు నోచుకుంది. దేశం నలుమూలల నుంచి ఎంతోమంది మిఠాయి ప్రేమికులు ఇక్కడకు వచ్చి, మాహిమ్ హల్వా కొని తింటుంటారు. ఇతర సంప్రదాయహల్వాలకు విరుద్ధంగా, ముంబై హల్వా విలక్షణంగా ఉంటుంది. గోధుమపిండి, పంచదార, నెయ్యి ఈ మూడింటినీ కలిపి, కర్రతో రోల్ చేసి, షీట్లుగా తయారుచేసి, చల్లారబెట్టి, చతురస్రాలుగా కట్ చేసి అమ్ముతారు. 7 రాయర్స్ మెస్ – చెన్నై చెన్నై మైలాపూర్‌లోని ఒక మారుమూల ప్రదేశంలో రాయర్స్ మెస్‌ను 1940లో శ్రీనివాసరావు ప్రారంభించారు. ఆయనను అందరూ ప్రేమగా ‘రాయర్’ అని పిలుచుకుంటారు. 80 సంవత్సరాలుగా రుచికరమైన ఆహారం అందిస్తున్నారు. ఇక్కడ ఇడ్లీలు, కరకరలాడే వడలు (గట్టి చట్నీతో), ఘుమఘుమలాడే వేడి వేడి కాఫీ దొరుకుతాయి. ఎంతోమంది భోజనప్రియులు ఇక్కడకు వచ్చి కొన్నిగంటలు గడిపి వెళ్తుంటారు. పరిశుభ్రతను పాటిస్తారు. రుచిలో ఏ రోజూ లోటు రాదు. అందుకే దూరమని కూడా ఆలోచించకుండా ఫుడ్ లవర్స్ ఇక్కడకు వస్తుంటారు. 8 షేక్ బ్రదర్స్ బేకరీ – పూణె 1800 సంవత్సరంలో షేక్ గులామ్ ఇబ్రహీం ‘షేక్ బ్రదర్స్ బేకరీ’ని స్థాపించారు. గౌహతిలో అందరినీ ఆకట్టుకోవడమే కాకుండా, అక్కడకు వెళ్లి తినడం నిత్యకృత్యంగా మారింది. స్థానికులు మాత్రమే కాకుండా బ్రిటిషు అధికారులు కూడా ఇక్కడ తినేవారు. జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీలకు ఈ బేకరీ ఉత్పత్తులంటే మమకారం. నెహ్రూ గౌహతి వచ్చినప్పుడల్లా ఆయన టేబుల్ మీద చీజ్ సిప్పర్స్ని తప్పనిసరిగా అందించేవారు. 9 మిత్ర సమాజ్ – ఉడిపి సుమారు వంద సంవత్సరాల క్రితం సంప్రదాయ ఉడిపి రెస్టారెంటును స్థాపించారు. అక్కడ రుచికరమైన దోసె, బులెట్ ఇడ్లీ, గోలీ బాజే (మంగళూరు బజ్జీ) ప్రత్యేకంగా లభిస్తాయి. ఆలయ సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. ఇక్కడి వంటకాల్లో ఉల్లి, వెల్లుల్లి నిషేధం. ఇక్కడకు కొత్తగా వచ్చేవారు తప్పనిసరిగా రుచి చూడవలసినవి... మంగళూరు బన్, మసాలా దోసె, దక్షిణ్ కన్నడ స్టైల్ ఖాస్తా కచోరీ, బాదం పాలు. 10 కేసర్ దా ధాబా – అమృత్సర్ పాకిస్థాన్ షేఖ్‌పురాలో 1916లో లాలా కేసర్ మాల్ తన భార్యతో కలిసి ధాబాను ప్రారంభించారు. 1947 లో భారత్ నుంచి పాక్ వేరుపడిన తరవాత ఇది అమృత్‌సర్‌కి మారడంతో, అమృత్‌సర్‌కి ఇదొక ప్రత్యేక గుర్తింపుగా నిలిచింది. ఇక్కడకు లాలా లజపతిరాయ్, జవహర్లాల్ నెహ్రూ తరచుగా వస్తుండేవారట. ఈ ధాబాలో లభించే మృదువైన వెల్వెట్లాంటి దాల్ మఖ్నీ రుచి చూడవలసిందే. సన్నని మంట మీద ఒకరోజు రాత్రంతా ఉడికిస్తారు, ప్లేటులో అందించడానికి ముందు క్రీమ్‌తో అలంకరిస్తారు. ఇక్కడ ప్రత్యేకంగా తయారయ్యే క్రీమీ పాలక్ పనీర్, స్టఫ్డ్ పరాఠా, ఫిర్నీలను తప్పనిసరిగా రుచి చూసి తీరవలసిందే. -
గూగుల్ మ్యాప్స్‌లో డైనింగ్ ఆఫర్లు
న్యూఢిల్లీ: భారతీయ యూజర్స్ కోసం గూగుల్ మ్యాప్స్ తాజాగా మరో మూడు ఫీచర్స్ ప్రవేశపెట్టింది. 11 నగరాల్లోని స్థానిక హోటళ్లలో డీల్స్‌ను తెలుసుకునేందుకు ఉపయోగపడే ఆఫర్ ఫీచర్ వీటిలో ఉంది. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, పుణె మొదలైనవి ఈ జాబితాలో ఉన్నాయి. ఈజీడైనర్ సంస్థతో కలిసి ’ఆఫర్’ ఫీచర్ అందిస్తున్నట్లు గూగుల్ వెల్లడించింది. దీనితో 4,000 పైచిలుకు రెస్టారెంట్స్‌లో ఆఫర్స్ గురించి తెలుసుకోవచ్చు. ఎక్స్ప్లోర్ ట్యాబ్‌లో ఆఫర్స్ షార్ట్‌కట్‌ను క్లిక్ చేయడం ద్వారా ఈ ఫీచర్‌ను ఉపయోగించుకోవచ్చు. దీని కింద గురువారం మొదలు 15 రోజుల దాకా 1,500 పైచిలుకు రెస్టారెంట్లలో ఈజీడైనర్ ప్రత్యేక ప్రైమ్ ఆఫర్స్‌ను, కనీసం 25 శాతం డిస్కౌంట్‌ను కచ్చితంగా పొందవచ్చని గూగుల్ వివరించింది. ఇక దేశీ యూజర్స్ అభిరుచులకు అనుగుణంగా ఎక్స్ప్లోర్ ట్యాబ్‌ను తీర్చిదిద్దామని, ఇందులో కొత్తగా రెస్టారెంట్లు, పెట్రోల్ బంకులు, ఏటీఎంలు మొదలైన ఏడు విభాగాల షార్ట్‌కట్స్ చేర్చామని పేర్కొంది. అలాగే కొత్తగా ప్రవేశపెట్టిన ’ఫర్ యూ’ ట్యాబ్ ద్వారా కొత్త రెస్టారెంట్లు, వార్తల్లో ఉన్న ప్రదేశాలు, యూజర్ల అభిరుచులకు అనుగుణంగా అందించే సిఫార్సులను పొందవచ్చని గూగుల్ పేర్కొంది. -
నాయకులు @ బెజవాడ
సాక్షి, అమరావతి బ్యూరో : కౌంటింగ్‌కు కేవలం మూడు రోజులు మాత్రమే గడువుంది. పోలింగ్‌కు కౌంటింగ్‌కు 43 రోజుల సుధీర్ఘ విరామం రావడంతో అందరి దృష్టి ఫలితాలపై పడింది. గతంలో ఎన్నడూ లేనంత ఆసక్తిని ఈ ఎన్నికలు రేకెత్తిస్తున్నాయి. రాష్ట్రంలోనూ అలాగే కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది.? ఏ పార్టీ ప్రతిపక్షానికే పరిమితమవుతుంది అనే కుతూహలం అందరిలోనూ ఏర్పడింది. విజయవాడలో మకాం.. మే 23న కౌంటింగ్ 8 గంటలకే ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రంలో కూర్చునే ఏజెంట్లు ఉదయం 5 గంటలకే అక్కడికి చేరుకోవాల్సి ఉంది. దీంతో ఆయా రాజకీయ పార్టీలు ఏజెంట్లను ఇతర పార్టీ నాయకులు అపహరించకుండా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. మూడురోజుల ముందు నుంచి వారికి సకల సదుపాయాలు కల్పిస్తున్నారు. జిల్లాకు సంబంధించి మచిలీపట్నం పార్లమెంట్‌కి సంబంధించి కృష్ణా యూనివర్సిటీలో, విజయవాడ పార్లమెంట్‌కు పెనమలూరులోని ధనేకుల ఇంజినీరింగ్ కళాశాలలో కౌంటింగ్ నిర్వహించనున్నారు. లాడ్జీలు, హోటళ్లలో గదులు నిల్.. నాయకులు వారి అనుచరులు, పార్టీ కార్యకర్తలు కౌంటింగ్ రోజు విజయవాడలో ఉండేట్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. రాష్ట్రంలోని రెండు ప్రధాన పార్టీలైన వైఎస్సార్ సీపీ, టీడీపీ కార్యాలయాలు ఇక్కడే ఉండడంతో ఇప్పటికే కొంతమంది ద్వితీయ శ్రేణి నాయకులు విజయవాడకు చేరుకున్నారు. నగరంలోని లాడ్జీలు, హోటళ్లు, పలు గెస్ట్ హౌస్‌లు ముందస్తు బుకింగ్ చేసుకున్నారు. ఎన్నికల ఫలితాలకు శుభకార్యాలు తోడవడంతో లాడ్జీల యజమానులు పండుగ చేసుకుంటున్నారు. పనిలో పనిగా డిమాండ్ భారీగా ఉండడంతో అద్దెలు కూడా పెంచేస్తున్నారు. పెద్ద పెద్ద స్క్రీన్లు ఏర్పాటు జిల్లా వ్యాప్తంగా ప్రధాన పట్టణాల్లో హోటళ్లు, లాడ్జీలు, గెస్ట్ హౌస్‌లలోని కాన్ఫరెన్స్ హాళ్లలో పెద్ద పెద్ద ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు. స్నేహితులంతా ఒక చోట చేరి ఫలితాలు వీక్షించేందుకు అనువుగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అలాగే పందెం రాయుళ్లు కూడా ఫలితాల వీక్షణపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. ఉద్యోగులు, నిరుద్యోగులు, యువకులు, రైతులు, వ్యాపారస్తులు ఇలా అన్ని వర్గాల వారు ఫలితాలపై ఆసక్తి కనబరుస్తున్నారు. పండుగ చేసుకునేందుకు.. కౌంటింగ్ పూర్తయ్యి మధ్యాహ్నం రెండు గంటల సమయానికి రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో స్పష్టంగా తెలియనుంది. అలాగే కేంద్రంలో ఏ పార్టీ అధికారం హస్తగతం చేసుకుంటుందో వెల్లడికానుంది. ఈ నేపథ్యంలో ఆయా పార్టీలు గెలుపు సంబరాలకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసుకుంటున్నాయి.